1)అక్షయపాత్ర:
పాండవులు అరణ్యవాసమునకు వెళ్ళు
నపుడు వారితో పెక్కుమంది బ్రాహ్మణులు
కూడ వెళ్ళిరి.వారకి భోజనము సమకూర్చు
టకై ధర్మరాజు పురోహితుడగు ధౌమ్యుని సలహాపై సూర్యుని భక్తితో ప్రార్థించెను.
సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు అక్షయ
పాత్రనొసంగెను.అందు ఏ కొంచెమువండినా
అది అక్షయమగు చతుర్విధాహారములు
అనగా భక్ష్య,భోజ్య,చోష్య,లేహ్య పదార్థము
లగునని తెలిపెను.ద్రౌపది ఆపాత్ర మహిమ
చేతనే అరణ్యవాసకాలమున ఎల్లరకూ భోజ
నమును సమకూర్చగలిగెను.
అక్షయమనగా తఱుగనిది.తఱుగని స్థితి
గల ప్రదేశము లేక వస్తువును "అక్షయపాత్ర"
అందురు.
శిష్టాచారకుటుంబములలో గృహిణి.తాను ఆన్నము వండబోవు పాత్రలో "అక్షయం, అక్షయం" అంటూ ముందు బియ్యపుగింజ
లను వేసే ఆచారము నేటికిని కలదు.
నిత్యవ్యవహారభాషలో ఉదాహరణ:
"ఆంధ్ర కోస్తాతీరము వరిపంటకు అక్షయ
పాత్రయే"
సూక్తి---2
.
"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి"
*************************
మంత్రం:
ఇంద్రం మిత్రం అగ్నిం వరుణం ఆహుః
అథో దివ్యః ససుపర్ణో గరుత్మాన్
"ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి"
అగ్నిం యమం మాతరిశ్వానం ఆహుః ౹౹
భావము : పరబ్రహ్మమును ఇంద్రుడు, సూర్యుడు,వరుణుడు,అగ్ని,గరుత్మంతుడు,యముడు,వాయువు అని చెప్పుచున్నారు.
వివేకవంతులు పలు విధములుగ తెలియ
జేసీనను సత్యమొక్కటే , పరమాత్ముడు
ఒక్కడే.
ఇది ఋగ్వేదమంత్రము,ఎవరు ఏపేరుతో
పూజించినా, భగవానుడు ఒక్కడే అని
తెలుపుటకు ఈసూక్తిని ఉట్టంకిస్తారు.
శ్రీకృష్ణపరమాత్మ గీతోపదేశజ్ఞానయోగ మున ఇదే విషయమును వెల్లడించుట విశే
షము.
యే యథా మాం ప్రపద్యన్తే
తాంస్త ధైవ భజామ్యహమ్ ౹
మమ వర్త్మాను వర్తన్తే
మనుష్యాః పార్థ సర్వశః ౹౹
నన్ను ఆశ్రయించిన వారెల్లరకూ,వారాశ్ర
యించెడి పద్ధతి ప్రకారము ఫలములను
ప్రసాదింతును.ప్రతివాడు అన్ని విధముల
నా మార్గమునే అనుసరించును.
సనాతన భారతీయధర్మము "ఎవరు ఏ రూపమున ఏవిధముగా పూజించినను అది
పరమాత్మునికే చెందును" అని తెలియజే
స్తుంది.ఇది ఏ కుల,మతములకు చెందినది
కాదు.సకలప్రాణికోటి ఆచరించుటకు దేవాది దేవునిచే నియమితమైన శాశ్వతధర్మమిది
ఎవరు ఏ పేరుతో ఏ రూపమును పూజిం
చినా అది పరమాత్మునికే చెందునని అంత
రార్థము.
" దేవుడు ఒక్కడే" అను భావన భారతీయ
సనాతనధర్మవిశిష్టత.నేడు విశ్వవ్యాప్తమైన
అన్ని మతాల కంటె కొన్నివేల సంవత్సరాల
ముందే భారతీయసంస్కృతి,సనాతనధర్మా
చరణ ఏర్పడుట గమనార్హము.
******
2)అగస్త్యభ్రాత: అగస్త్యమహర్షి సోదరుడు
తల్లిగర్భమునదే జ్ఞానమును పొందిన గొప్ప
వాడు..అరణ్యవాసమున సీతారామలక్ష్శ
ణులు ఆయన ఆశ్రమమును దర్శించి,వారి
ఆశీస్సులను పొందిరి.కాని రామాయణమున
ఎక్కడా ఆయన పేరు కనిపించదు.కేవలము
అగస్త్యభ్రాతగ ఆయన ప్రసిద్ధుడు.
ప్రతిభావంతుడైయుండియు,స్వయముగ
గుర్తింపులేక గొప్పవారితో గల బంధుత్వము
లేక సంబంధముతో చలామణి అగు వానిని
"అగస్త్యభ్రాత" అంటారు.పాండురంగమహా
త్మ్యకావ్యములోని నిగమశర్మ అక్కపాత్ర
కూడ అలాంటిదే.డాక్టరుగారి భర్త,చైర్మన్
గారి సోదరుడు వంటి గుర్తింపులు ఇట్టివే.
నేడు పెక్కుమంది రాజకీయనాయకుల
బంధువులు అగస్త్యభ్రాతలే.
సూక్తి---3
"జగతః పితరౌ వందే పార్వతీపరమశ్వరౌ"
******************************
శ్లో : వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే ౹
" జగతః పితరౌ వందే
పార్వతీపరమేశ్వరౌ ౹౹ "
భావము : వాక్కు,అర్థములవలె కలసి
యున్న ఆదిదంపతులు పార్వతీపరమేశ్వ
రులకు నమస్కారము.వాక్కులు,అర్థముల
పరిజ్ఞానమును పొందుటకై వారిని ప్రార్థిస్తు న్నాను.
మహాకవి కాళిదాసు రచించిన రఘువంశ
కావ్యప్రారంభదేవతాస్తుతి యిది.వాక్కు,అర్థ ముల అవినాభావసంబంధమును మహాకవి
జగత్పితరులైన పార్వతీపరమేశ్వరుల అర్ధ
నారీశ్వరరూపంతో పోల్చుట ఎంతో మహో న్నతభావన.
శబ్దార్థాల పొందిక పార్వతీపరమేశ్వరుల
ఏకత్వం వలె రమణీయంగ,మహిమాన్విత
ముగ ఉండాలనే కాళిదాసు సందేశము రచ
యితలెల్లరకూ శిరోధార్యము.
ఎఱ్ఱనగారు "హరివంశ" ఉత్థరభాగసప్తమా శ్వాసమున ఉషానిరుద్ధుల పరస్పరానురాగ
మును వివరిస్తూ సందర్భోచితంగ ఊషాదేవి చూచిన ఆదిదంపతుల అర్ధనారీశ్వరస్వరూ పమును వర్ణించినతీరు చిరస్మరణీయము.
సీ౹౹కంఠకాళిమ తన కంఠంబునకు నూత్న
కస్తూరికాదీప్తి విస్తరింప
నౌదలఁ జందురు డమృత బిందులఁ దన
యలకలఁ జిన్ని పువ్వులను దొడుగ
నవతంస నిశ్వాస మల్లనఁ దనఁ యవ
తంసోత్పలమునకుత్కంపమొసగ
నంగద మణిదీప్తులలమి యొప్పగు తన
భుజముల కాంతికిఁ బ్రోది సేయ
తే౹౹గడక పరమేశ్వరుడు దన్ను కౌగలింప
నతని దోర్మధ్యసరసి నోలాడుచున్న
ఘనతర స్తనచక్రవాకముల నలరు
నంబనసురేంద్ర కూతురింపారఁ గనియె
కాళిదాసుమహాకవి వాగర్థములను ఉప మింపజేసిన శివపార్వతులర్థనారీశ్వరులు. వారి నిత్యసర్వాంగీణసంయోగశృంగారము
ఎఱ్ఱనగారి వర్ణనలో వాచ్యంగాలేదు,ధ్వనిస్తు
న్నది,ఎక్కడా అనౌచిత్యము లేదు.
కంఠాలు రెండూ కలసినవి.శివకంఠకాళిమ
శివాకంఠకస్తూరిని విస్తరిస్తున్నది.చంద్రరేఖ
ద్రవించే అమృతబిందువులు చిన్నిపువ్వు
లుగ అలంకారాలను గూర్చుతున్నాయి.
ఆవతంసనిశ్వాసము బహుశా సపత్నీభావ
ములో గంగ నిట్టూర్పుపార్శ్వ కర్ణోత్పలాన్ని
కంపింపజేస్తున్నదీ.శివుని భుజాంగదకాంతి
దేవి భుజకాంతిని ప్రోదిచేస్తున్నది.
ఇందలి రెండు, నాలుగు పాదాలలో భర్త అలంకారములే పార్వతి అలంకారములు.
శివుని భుజాంతరమన్న సరస్సులో ఘనతర
స్తనచక్రవాకములలో అంబ ఉన్నది.సరస్సు,
చక్రవాకముల నిత్యసహజసంబంధముపై
పార్వతీపరమేశ్వరుల శృంగారము ఆరోపి
తమగుట అత్యంత ఔచిత్యశోభితము.
అట్టి అర్ధనారీశ్వరస్వరూపముతో ఉపమా నము ఎంతటి ఔచిత్యవంతమో!.
విశ్వసాహిత్యములోని ఏ ఇతర భాష లోను ఇంతచక్కని సామ్యముగల ఉపమా నము మఱొకటి లేదేమో!అందుకే " ఉపమా కాళిదాసస్య" అని ప్రస్తుతి.
****†
అక్షతలు : శ్రేష్ఠమైన బియ్యము,పసుపు,
కుంకుమలను నేతితో కలిపి అక్షతలను
తయారు చేస్తారు..అక్షతలు ఆనగా క్షతము
కానివి,అంటే నాశనము లేనివి,శుభంకర
మైనవి.వివాహసమయములో వధూవరులు
ఒకరి తలపైనొకరు దోసిళ్ళతో పోసుకొనే
అక్షతలను తలంబ్రాలు అంటారు.అనగా
తలపై జల్లెడి ప్రాలు (బియ్యము) అని
అర్థము.అన్ని శుభకార్యాలలో పెద్దలు
చిన్నవారిపై అక్షతలను చల్లి దీవిస్తారు.
వాడుకలోనివి అక్షింతలుగ మారినవి.ఈ
"అక్షింతలు" పదము నిందార్థమున వాడ
బడుచున్నది.అద సరికాదు.
*****
పరమాత్మే జీవాత్మ
సూక్తి---4
ఏకః పరాత్శా బహుదేహవర్తీ
** ***
శ్లో : మృత్పిండ మేకం బహుభాండ రూపం
సువర్ణ మేకం బహు భూషణాని
గోక్షీర మేకం బహుధేను జాతం
ఏకః పరాత్మా బహుదేహ వర్తీ ౹౹
భావము: వివిధ పాత్రలుగా రూపొందునట్టి
మట్టి ఒక్కటే . పెక్కు ఆభరణలుగా భాసిల్లు
బంగారమొక్కటే.ఎన్నో వర్ణముల గోవుల నుండి తీయబడిన పాల రంగు ఓక్కటే.
అన్ని జీవుల దేహములలో భాసిల్లు "పరం
జ్యోతి" ఒక్కటే.
భారతీయసనాతనధర్మం పునర్జన్మసిద్ధాం
తమును ప్రతిపాదించినది.ఎందఱో చిన్నా
రులు తమ పూర్వజ్ఞానముతో తెలియజేసీన
గతజన్మవిశేషములు వాస్తవములుగ నిరూ
పించబడుట తెలిసినదేకదా! భగవద్గీతా సందేశము కూడ ఇదే.
" జాతస్యహి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ "
పుట్టినవానికి మృత్యువు తప్పదు,మర
ణించినవానికి పునర్జన్మ తప్పదు.అన్ని జీవు లలో వెలిగే పరంజ్యోతి ఒక్కటే కావున పున
ర్జన్మ వ్యక్తి పాప,పుణ్యకర్మలను బట్టి ఏ జీవి రూపమైనా కావచ్చును.ఇట్టి కథలెన్నో పురా
ణేతి హాసములలో కనుపించును.
సనాతన సంస్కృతి మానవునకు సత్ప్రవ ర్తన పునర్జన్మదృష్ట్యా ఎంత ముఖ్యమో తెలి యజేసినది.
అర్థా గృహే నివర్తంతే
శ్మశానే మిత్ర బాంధవాః~\°
"సుకృతం దుష్కృతం చైవ
గచ్ఛంత మను గచ్ఛతి"౹౹
వ్యక్తి మరణం తరువాత అతని సంపదలు ఇంటిలోనే ఉండిపోతాయి.బంధు,మిత్రులు శ్మశానము వరకు మాత్రమే వచ్చి. వెళ్తారు.
" మరణించిన వ్యక్తీ పాపపుణ్యములు
మాత్రమే జన్మాంతరమునకు వెంటనంటి
వస్తాయి."
ఈ విశ్వాసమే వేలాది సంవత్సరములు
మన సమాజధర్మవర్తనకు పునాది యైనది.
4) అగ్రతాంబూలము
**************
ఒక సభలో శుభకార్యసందర్భమున తాంబూలములను పంచునపుడు మొదటి
తాంబూలాన్ని అచటనున్న వారిలో ప్రముఖ
వ్యక్తికి గౌరవసూచకముగా సమర్పించే సంప్ర
దాయమున్నది.ఇట్టి తొలి తాంబూలమునకు
అగ్రతాంబూలమని పేరు.
ధర్మరాజు యొక్క రాజసూయయాగసభలో
ఆగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడు తగినవాడని
భీష్ముడు సూచించగా,శిశుపాలుడు అతనిని
యాదవుడంటూ అధిక్షేపించి నిందించుటచే,
శ్రీకృష్ణుడు అతనిని సంహరించాడు.
భాస్కరరామాయణకర్త "హుళక్కి"భాస్కరు
నకు రాజసభలో అన్నిశుభకార్యాలలో అగ్ర
తాంబూలము లభించేదట.తాంబూలానికి
"హళిక" పర్యాయపదము.అగ్రతాంబూల కారణంగ ఆయన పేరు"హళకి భాస్కరుడై" వ్యవహారభాషలో "హుళక్కి భాస్కరునిగ" మార్పుచెందినది.హుళక్కి అంటే శూన్యము.
సభలో అగ్రతాంబూలము పొందటము
మర్యాదకు,గౌరవమునకు,శుభానికి సంకే
తము.
5 ) ధ్యానమే ప్రధానము
******
సూక్తి--5 , "కోటిం త్యక్త్వా హరిం భజేత్"
**************
శ్లో : శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్ ౹౹
భావము : వంద పనులున్నా మానుకొని
వేళకు భోజనం చేయాలి.వేయి పనులున్నా
విడచి స్మానం చేయాలి.లక్షపనులున్నా పరి
త్యజించి దానం చేయాలి.కోటి పనులున్నా
యవదలిపెట్టి భగవంతుని ధ్యానించాలి.
"శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్" సకల
ధర్మాల సాధనకు శరీరారోగ్యమే మూలము. వేళకు భోజనము చేయుట దేహారోగ్యము
నకు అవసరము.
స్నానము శారీరక ఆరోగ్యమునకు,మాన
సిక శుచిత్వమునకు తోడ్పడును.కనుక
స్నానము భోజనముకంటె ముఖ్యము.
దాతృత్వము పుణ్యదాయకము.జీవుల
జన్మపరంపరలో దాతృత్వపుణ్యము వెంట
వచ్చి మేలును చేకూర్చును పూర్వకాలమున
కొందఱు నైష్టికులు అతిథి లేకుండ భోజనం
చేసెడివారు కారు.
పైనపేర్కొన్న అన్నింటి కన్నా భగవధ్యానం అతి ముఖ్యమైనది.భగవధ్యానమనకు దేవాలయప్రవేశము,విగ్రహపూజలే అవసరం
కాదు."జ్ఞానినాం సర్వతో హరిః, ,"ఎందెందు
వెదకి చూచిన అందందే కలడు చక్రీ" అను
ప్రహ్లాదుని భక్తిభావము గమనార్హము.
"ఆర్యధర్మగ్రంథము"లోని ఈ సూక్తి భగవ ద్భక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
5)అజగరోపవాసము
****************
అజగరమంటే కొండచిలువ.అది ఎప్పుడూ
ఉపవాసముండదు. ఏదైనా జంతువును
మ్రింగిన తరువాత,తన జీర్ణాశయములో ఆ జంతువు శరీరము పూర్తిగ జీర్ణమగు వరకు నింపాదిగా చుట్టుకొని కదలికలు లేకుండా చూచుటకు ఉపవాస దీక్షలో ఉండినటుల భ్రమింపజేస్తుంది.
"అజగరోపవాసము" అంటే మోసపుదీక్ష.
"బక ధ్యానము" కూడ ఇట్టి భావాన్విత
పదబంధమే.
6) అజాగళస్తనము :
మేక గొంతునుండి వ్రేలాడే చన్నుకు అజా
గళస్తనమనిపేరు.ఇది అలంకారప్రాయము,
నిరుపయోగము,వ్యర్థమైన ఈ మేకచన్నును
సృష్టించటం చేతనే బ్రహ్మదేవునికి భూలోక
మున పూజలు జరుగుట లేదని ఒక కవి వ్యంగ్యంగ అధిక్షేపించటం విశేషము.ఒక వస్తువు లేక విషయము నిరుపయోగము అనుటకు ఈ జాతీయమును వాడుతారు.
సూక్తి--7
*******
మాతృదేవోభవ
ॐॐॐॐॐॐॐॐॐॐ
శ్లోకము : మాతృ దేవోభవ
పితృ దేవోభన
ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ
.
భావము;"తల్లియే దైవముగా పూజింపుము"
తండ్రియే దైవముగ పూజింపుము.
గురువే దైవముగ పూజింపుము.
అతిథిని దైవముగ పూజింపుము
కృష్ణయజుర్వేద తైత్తరీయోపనిషత్ లోని మంత్రమది.ఇందలి నాలుగు చరణములును
నాల్గు ప్రసిద్ధసూక్తులే.
"జన్మనిచ్చిన తల్లి ప్రత్యక్షదైవము.తల్లిని
మించిన దైవము లేదు" అని తెలుపు వెరొక
సూక్తి ప్రసిద్ధము.
" న మాతుః పరదైవతమ్ "
శ్లో : నా౽ న్నోదక సమం దానం
న ద్వాదశ్యాః పరం వ్రతం
న గాయత్ర్యాః పరం మంత్రం
" న మాతుః పరదైవతమ్"
No comments:
Post a Comment