కథ గాని కథ( ఏడు )
విత్తనం మొక్కగా, చెట్టుగా, పువ్వుగా, పండుగా, వివిధ రూపాలను మళ్లీ విత్తనం గా మారటం, శృష్టికారకమైన చైతన్యం జగత్తునంత మోస్తూ దైవ సంకల్పo ప్రకారంగా సృష్టి ధర్మం వల్ల చీకటి వెలుగుల సమాజంలో, సుఖ దుఃఖాల జీవితం నలిగి వెలుగులుగా. అవగాహన మొదటి మెట్టుగా అర్థం చేసుకొని నడుచుకునే ఆకలి మెట్టవడం, విశ్రాంతి ధర్మబద్ధమైన నడకతో సాగిపోతూ, అప్రమత్తులై, నిరంతర ఎరుకతో, జీవన గమనమై, పరిశీలిస్తూ, అంతా పరిశోధనలాగా సాగుతూ, సంతృప్తిగా, ద్రవించే జ్ఞాన స్వరంగా, పరంగా, కళలు మార్చుకుంటూ, నిండుగా, పండుగల జీవిస్తూ సమస్త లోకానికి భారం కాకుండా, పంచభూతాలకు అడ్డం రాకుండా సాగించడమే మానవ జీవితం.
మరి దెబ్బలకు వచ్చిన రాయికి దొరుకు గౌరవం. ఆటుపోట్లు ధరించిన జీవికి కడవరకు పయనం. మనిషి దిగులు లేని సత్యాన్ని అనుకరించి, ధర్మాన్ని నిర్వహించి నిర్మలంబుగా, కాలయాపన చేస్తూ, మనసు కోరుకుంటూ, జీవన కళ ఉట్టిబడుతూ, బతుకు ఉత్సవాల్లో, అనుభవాలతో, జీవన గమనం సర్వస్వయోదాయకం.
తీగల నుండి తెగిన దోస పండ్లుగా,ఎండిన ఆకు రాలినట్లుగా, ఉప్పొంగుతున్న సముద్రం ఉప్పెనగ ఊరికి వెనక తగ్గినట్లుగా, కర్మ పరిపక్వత పొంది కర్మానుసారం అనుభవించి, అంతిమంగా శివోహంగా మారి "ఆత్మకు మరణం లేదు కనుక" మరో జీవనంగా మారటం జీవన ప్రక్రియ.
*****
కథ కాని కథ (06)
బ్రహ్మణ ముహూర్తం విలువ లేందే మనసుకు తృప్తి చేరదు, కాలంతో ఎదురీదాలంటే మన సంస్కృతి సంప్రదాయలు, వంశగౌరవాలు తప్పవు, అలాగే మంచి సంసారానికి అన్యోన్యత ముఖ్యం!
అభివృద్ధి అంతా విజ్ఞానంతోనే అంటే మనిషి అలవాట్లు తరతరాలుగా వస్తున్నాయి, ఎవరు ఎన్ని చూపిన మనసు బట్టే పోవుట నిజమైన విజ్ఞానం. అందుబాటులో ఉన్న అజ్ఞానం తొలగించ గల బుద్ధి ఉంటే చాలు, ప్రపంచ విజ్ఞానం అవసరమా...
తెల్లారి లేస్తే అన్నీ అబద్ధాలే చెప్పేవారున్నారు,
అలాంటప్పుడు ఎందుకు నీతుల ఉపయోగం ఏమిటనే వారున్నారు, కాని గత్యంతరం లేని స్థితిలో పలుకు మాయకు చిక్కుతారు కదా కాని సరిదిద్దుకొనే తెలివి, బుద్ధి మామవులకు ఉన్నాయికదా....
ఆర్ధికలోపాలు వ్యవస్థాగతం, అలాంటప్పుడు వ్యవస్థను మార్చ దళచినా అందరూ దొరకని దొంగలేగా తల్లి తండ్రి గురువు ఎంతచెప్పిన పిల్లల చేష్టలు మారవు యిదీ యంతే కదా...
భారతీయులకు గుళ్ళే ముఖ్యం అలాంటప్పుడు దేశమేమైతేనేమి అంటున్నావు? అసలు నీదర్మం నీవు నిర్వహిస్తున్నావా, గుడి యనేది హృదయం పదిలంగా ఉంటే జీవనం పదిలం.
ఆధ్యాత్మికమే,రాజకీయచైతన్యం పిడికెడు మెతుకులు చాలవా నీకు చెప్పి చేయించు కోలేని మూర్ఖ వాదన దేనికి.
భూమి దద్దరిల్లేలా - ఆకాశం అదిరిపోయేలా ఆర్భాటాలు వద్దు!ఆపదలో ఉన్నవాడ్ని - అవసరంలో ఉన్నవాడ్ని ఆదుకోవడం ముద్దు!
*****
కధకానికధ. (05)
మల్లెతోటలో గులాబికోసం వెతుకుతావెందుకు, తీరని ఆశకు కొత్తరెక్కలను తొడుగుతు ఎగరాలని పరిగెడతా వెందుకు దూరంజరుగుతున్న దరిచేరి ఫలములబుట్ట పరుగుల చూపులందుకు, తీపివ్యాధులకు చేదు మందులను మింగుతు ఒకవైపు, కక్కుర్తి యాటలు ఎందుకు, స్వచ్ఛత యనేది అందరికీ ఉంది, దాన్ని దక్కించుకొని సద్వినియోగం చేసుకోవాలి ఎవరాయినాసరే కాదా?.
పాటనుపాడే పశువులకాపరి సంతసాన్ని చూడు కల్మషము లేని తనము, విధిరాతంటూ వ్యథల సంద్రమే ఈదుతూ కర్తవ్యం, కాకరకాయ కాదు, ఏ సమయాన, ఏఋతువుకు తగ్గ అలవాట్లు ఉంటే చాలుగా మనలో.
కాకికోకిలగ పాడాలంటే కుదిరే పనియేనా నీకు, నాకు, పట్టువదలక మీకర్మంటూ పాడుతూ, నన్ను వేధిస్తూ, ఉండుట ఎవ్వరి కొరకు?
తప్పులు ఎంచే నీగుణమే నని ఒంటరి చేస్తుందే, మరి అట్లామాటాడుకు, ఆగని నోటికి తాళం వేయకె సాగుతు ఉండుట దేనికి. రమణి అలుకలను తీర్చగ సాగే ప్రియుని దెంత మురిపెంబూ కలువ మెచ్చని చందమామగా కదులుతు కాలక్షేపం చేద్దామా మనము.
సంతోషంతో పొంగే మనసుకె విజయంచేరువలే ఉందని తెలుసుగా, రగిలేగుండెకు శ్రీచందనమై తాకుతు మనసు కలవరం తగ్గించుకొనుట అందరి కర్తవ్యం కదా
బలే చెప్పారే.... మీరు
****
** కథకాని కథ(04)
సాహిత్యం అంటే సహనం నుండి వచ్చే, అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది కవి హృదయం అర్ధం చేసుకోవటం నుంచి వచ్చె, పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది ఇక నుంచ్చె?
వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా, ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా, మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా, భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా ఈ దుస్థితి నేటి పరిస్థితి మనిషి జన్మ అన్ని జన్మలలో ఉకృష్టమైనది, సమాజానికి మాయని మచ్చగా ఆర్థిక అవసరాలు దేనికి?
ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యంమనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వంసరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకంమనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం కాదా?
*_జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేవి మత్తు మందు లాంటివి! ఇవి అలవాటు అవ్వాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం తోడవ్వాలి. ఆ పుణ్యఫలంను నేటి సాధనకు సహాయంగా చేసుకుని మరింత సాధకులు కావడానికి ప్రయత్నం చేయాలి. వీటిని వదిలేసి కేవలం భోగ భాగ్యాలను అనుభవిస్తూ కూర్చుంటాం అంటే జన్మకు సార్థకత చేకూరదు!..*
--((*))
కథ కాని కథ(3)
*భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి...*
*సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...*
*పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...*
*దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం*
*****
మనిషికి మోక్షం - అర్థం -పరమార్ధం(కధకాని కథ. (02)
నువ్వెవరో తెలుసుకో ముందు, ఈ విశ్వం ఎంత పెద్దదైనా, నీ జ్ఞానం ముందు అది చాలా చిన్నదే.
పక్షులకు రెక్కలే సాధనాలు; నీకు నీ ఊహలే రెక్కలు. అవే నీ అమృత వాక్కుల ణే రెక్కలతో విశ్వాన్నే దాటేస్తావు; అదే నీకు వరం. నువ్వు బాధ్యత బంధము భారము కాకుండా వెతుకు; ప్రకృతి ప్రభావము తోడు నీడగా, నీ వెంటే ఉండు, అప్పుడే మోక్షం లభిస్తుంది.
స్నేహాన్ని, ధర్మాన్ని,సత్యాన్ని మార్గంగా ఎంచుకో; అప్పుడే భగవంతుడ్ని చేరుకోగలవ్. నిన్ను ద్వేషించేవాళ్ళ నిన్నేమీ చేయలేరు,నిన్ను ప్రేమించేవాళ్ళని దగ్గరకి తీసుకో; అప్పుడు నువ్వే ఒక వెలుగు. అంబర దీపంగా వెలిగి పోతావు
నువ్వే ఆకాశమైనప్పుడు, నిన్ను గాలి ఏం చేస్తుంది?
నువ్వే సముద్రమైనప్పుడు, నీరు నిన్ను ఏం చేస్తుంది?
నువ్వే స్వర్గమైనప్పుడు, దుఃఖం నిన్ను ఏం చేస్తుంది?
నువ్వే దేవుడవైనప్పుడు మృత్యువు మాత్రం ఏం చేస్తుంది?
ఎడారిలో ఉన్నప్పుడు నువ్వే ఒయాసిస్సువు;
అడవిలో ఉన్నప్పుడు నువ్వే మృగరాజువి; సమాజంలో ఉన్నప్పుడు నువ్వే ఒక సమూహానివి. నీ ఆలోచనలని బట్టే నీ జీవితం; నీ మానవత్వాన్ని బట్టే నీ వ్యక్తిత్వం.
మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా, అందరూ మౌనంగా ఉన్నప్పుడు నువ్వు గొంతెత్తి మాట్లాడు.
ఈ జీవితం నాటకం కాదు; ఇదొక పరీక్ష. ఇందులో నువ్వు గెలవాలి; దాని కోసం రోజూ నువ్వు సాధన చేయాలి.
గులాబీలు నిన్ను చూసి నవ్వు తుంటే నువ్వు దిగాలు ముఖం వేసుకుని కూర్చోకు. సాయంత్రానికి వాడిపోయే ఆ గులాబీలను చూసి సంతోషంగా ఉండడం నేర్చుకో.
నీ చుట్టూ ఉన్న చీకటికి భయ పడకు; నీలో ఉన్న చీకటికి భయపడు. నువ్వు వెలుగులో జీవించాలంటే నువ్వే వెలుగువి కావాలి.
మృత్యువు గురించి భయపడకు; దానితో ఆఖరి శ్వాస వరకు పోరాడు. అదే జీవిత చరదరంగం.
అదేమనిషికి మోక్షం అర్థం పరమార్ధం
*****
ప్రణాళిక! (కధకాని కథ. (01)
********
వివక్షలేని దానకర్ణులుగా, దయాదులుగా చూపు తో, ఆంక్షలు లేని ధాన్యము పండించే రీతిగా, దార (భార్య) దాపరికము లేకుండా కాపు' కస్తూ, జ్ఞానమణి గా ధార్మికుడుగా, దాతగా, దాశరధిగా, దామోదరుడుగా జీవితమై, అందరికి దారములా, దారులుగా, దావనలము కాని 'పని' గా,సంపదంతా దాత (బ్రహ్మ) దాతువులు ధార (నీరు) పంచభూతాల సహాయం 'సమాజపరం' గా, దేశాలకు కత్తిధార, దాగుడుమూతలు, దానవులు,' సరిహద్దులను దాటి పోవగా, దోపిడీ లేని ధారాపాతంగా, దారి తెన్ను, తెలిపే ఆనందం' పొందగా,'వ్యక్తిగత' వివక్ష, దాస్య ప్రవృత్తి, దాచుకొను, దోచుకొను, ఆస్తి పోగా, లంచాలు లేని, దాసీ పుత్రులు లేని, ఎలపట దాపట లేని, దాహము తీర్చు వ్యవస్థ' రాగ'పనిని' అందరూ, దాస్యమనక, ధర్మమని తలంచి గౌరవించాలి!
ప్రజాశ్రేయస్సే ప్రతి ఒక్కరి లక్ష్యమురాజకీయం' కాగా, ద్వేషం, ద్రోహం, అమిత దాహం, అహంభావం నశించి ప్రేమ' మిగలగా, చిటపటలు కాదు అందరిలో అన్నీ సమయాల్లో చిరునవ్వులతో ఏదీ నీది కాదనే'వేదాంతం' గా, పనులన్నీ మౌనంగా' జరగా,బానిసత్వంలేని బ్రతుకు' గా మాయ పోయి 'హాయి' గా మనిషి క్రమంగా 'దేవుడు గా
మానవత్వమే నీ 'ప్రణాళిక' గా కావాలి!
*******
No comments:
Post a Comment