01. గుడ్లగూబ లక్ష్మి వాహనం.
పూర్వం శ్రీ మహావిష్ణువు భక్తుడైన కౌశికుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ విష్ణు భక్తుడు తన సంగీతంతో శ్రీమహావిష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. ఇలా అతడు మరణించిన తరువాత వైకుంఠానికి చేరుకోగా అప్పడు శ్రీమహావిష్ణవు ఆ భక్తుడిని స్వాగతించి గౌరవార్థం ఒక సంగీత సభని ఏర్పాటుచేస్తాడు.
అయితే త్రిలోక సంచారైనా నారదుడు ఈ సభకి వెళ్లడం అనుకోగా అతడికి ఈ సభలోకి రావడానికి అనుమతి లభించలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన నారదుడు లక్ష్మీదేవి మందిరం నుండి వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుడిని అడ్డుకోగా ఆగ్రహానికి గురైన నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు.
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నారదుడితో, నారద కపట భక్తితో ఎన్ని తీర్దాలు సేవించనప్పటికీ అది వ్యర్థం, భక్తిశ్రద్ధలతో నన్ను కొలిచినవారికి నేను ఎప్పుడు వెన్నంటి ఉంటాను, సంగీతంతో కూడా నన్ను చేరవచ్చు అని తెలియచెప్పడానికే నేను అతడిని సత్కరించాను. నీ శాపానికి మేము బాధపడటంలేదు, దాని కారణంగా మంచే జరుగుతుందని చెప్పడంతో, నారదుడు చాలా బాధపడుతూ, దేవా నన్ను క్షమించు అసలు జ్ఞానము లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ శ్రీమహావిష్ణువు పాదాల పైన పడి వేడుకున్నాడు.
ఇక శ్రీమహావిష్ణువు నారద చింతించకు నీకు నిజంగా సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉంటె ఇక్కడ ఉత్తరాన మానససరోవరం అవతల ఒక పర్వత శిఖరం ఉంది. అక్కడవున్న ఉలూకపతి దగ్గర నేర్చుకోమని చెప్పగా నారదుడు శ్రీమహావిష్ణువు నమస్కరించి ఆ పర్వత శిఖరానికి బయలుదేరుతాడు
ఇక నారదుడు తన మనసులో నాకు తెలియని ఆ సంగీత విద్వంసుడు ఎవరు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకోగానే గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీత విద్యాబ్యాసం చేస్తున్నారు. అక్కడే నారదుడు వారికీ గురువైన గానబంధుని చూసాడు. నారదుడు అతడికి నమస్కారం చేసి, కౌశికుడు తన సంగీతం తో శ్రీమహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు అలాంటి సంగీత విద్యని నాకు నేర్పిచండని అడిగాడు. అప్పుడు గానబంధువుకి నారదుని మనసులో ఏమున్నదో అర్థమైంది. దీంతో అసలు తాను ఎవరనేది వివరించడం మొదలుపెట్టాడు.
పూర్వం భువనేషుడు అనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను అన్ని విషయాల్లో బాగా చూసుకునే ఆ రాజు ఒక సంగీతంలో మాత్రం రాజ్యంలో ఒక షరతు పెట్టాడు. తన రాజ్యంలో సంగీతాన్ని నిషేధించాడు. ఎవరైనా రాజ్యంలో గానం చేస్తే వెంటనే వారికీ మరణ శిక్షని అమలుచేయండి అంటూ మంత్రులకి ఆదేశాలను కూడా ఇచ్చాడు.
ఒక రోజు హరిమిత్రుడు అనే వ్యక్తి రాజు అజ్ఞాని మరచిపోయి దేవుడిని తన భక్తిగీతాలతో స్తుతించాడు. అతడి గానానికి అక్కడి ప్రజలు కూడా అన్ని మరచిపోయారు. అప్పుడు వెంటనే భటులు వచ్చి హరిమిత్రుడిని బంధీ చేసి రాజు దగ్గరికి తీసుకువెళ్లగా రాజు బాగా అలోచించి పడిన వాడు బ్రాహ్మణుడు కనుక మరణ శిక్ష విదిస్తే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని భావించి మరణశిక్షకు సమానమైన రాజ్య బహిష్కారణ చేస్తాడు.
ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ రాజు మరణించి మరు జన్మలో గుడ్లగూబ లాగా జన్మించాడు. దాంతో ఆహారం రాత్రి సమయాలలో మాత్రమే తీసుకోవాలి కానీ ఆ గుడ్లగూబకు ఆహారం సరిగా లభించలేదు. ఇలా ఒక నాలుగు రోజులు వరుసగా ఆహారం లభించకపోవడంతో అది మరణానికి దగ్గరైంది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి దానికి ఎదురుగా నిలబడి ఉండగా, అప్పుడు ఆ గుడ్లగూబ ఎందుకు యమధర్మరాజా నన్ను ఇలా బాధపెడుతున్నావు, నేను రాజ్యంలో అందరిని బాగా చూస్కున్నాను కదా అని అడుగగా, యమధర్మరాజు, రాజా నీవు రాజ్యాన్ని సరిగానే పరిపాలించవు కానీ భగవంతుడిని వేద మంత్రాలతోనే స్తుతించాలని అనుకోవడం నీ ముర్కత్వం అవుతుంది.
నీవు విష్ణు భక్తులకు తెచ్చిన ఆ కీడు నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది అని చెప్పడంతో, అతడు యమా నేను చేసిన ఈ తప్పు నుండి బయటపడే మరాగాన్ని చెప్పాడని అనగా, నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు, ఒకేవేళ శిక్షాకాలం దగ్గాలంటె ఈ గుహ దగ్గరలోనే నీ గత జన్మ శరీరం ఉంది ఆ శరీరంలోని మాంసాన్ని రోజుకు కొంత చీల్చి తిను అది పురాతయ్యే లోపు నీకు శుభం కలుగుతుందని చెబుతాడు.
ఇలాంటి పరిస్థితి వచ్చిన ఆ పాపిని నేనే నారద, ఇలా నేను నా శరీరాన్ని రోజు తింటూ ఉంటె ఒక రోజు ఒక బ్రాహ్మణుడు నా శవం దగ్గరికి వచ్చి చూసాడు, అతడు ఎవరో కాదు నేను రాజ్యబహిష్కారణ చేసిన హరిమిత్రుడు. అతడు నన్ను గుర్తుపట్టి న దగ్గరికి వచ్చి ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతుండగా, వెంటనే అతని పాదాలపైనా పడి జరిగినదానికి నన్ను క్షమించు నేను భువనేశ రాజుని అంటూ పచ్చత్తపపడి తనకి యముడికి మధ్య జరిగినది అంత వివరించాడు.
అప్పుడు హరిమిత్రుడు నీవు నాపైన చూపించిన ఆ మూర్కత్వన్ని ఆ రోజే మరచిపోయాను, నీవు అనుభవించిన బాధలు ఇక చాలు, ఈ రోజు నుండి నీకు బాధ అనేది లేకుండా గొప్ప సంగీత విద్వాంసుడవై అందరికి సంగీతాన్ని బోధిస్తావంటూ పలికెను. ఇలా నేను సంగీత విద్వాంసుడను అయ్యాను అంటూ గానబంధు నారదుడితో వివరించాడు.
ఇక ఇలా చెప్పడంతో నారదుడు అతడి శిష్యుడిగా మారిపోయాడు.
సంగీతం అనేది ఒక కళ, దానికోసం జీవితాన్ని అర్పించాలి, ప్రతిక్షణం కష్టపడి సాధన చేస్తే దీనిని సాధించవచ్చు అని వివరించగా నారదుడు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు సాధన చేసి 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం సాధించాడు.
దీంతో సంతోషించిన నారదుడు గురు దక్షిణ ఏంకావాలో అని అడుగగా, శిష్యుడిగా కోరుకోమంటాను కనుక అడుగుతున్నాను, లోకం ఉన్నంతవరకు, సంగీత కళతో పాటుగా నేను కూడా అందరికి గుర్తుండేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నారదుడు నవ్వుతు గురవయ్య ఇది చాలా చిన్న కోరికనే, మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి మీకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు కి గరుత్మంతుడి వలె, శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనం అవుదు గాక అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈవిధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైనదని పురాణం చెబుతుంది.
02. వ్యక్తిలోని బహుముఖాలు
ఒకాయన తన శిష్యుల్ని వెంటబెట్టుకుని మమ్మల్ని చూడటానికి వచ్చాడు. వాళ్లలో అన్ని రకాల వాళ్లూ ఉన్నారు - డబున్నవాళ్లూ; బీదవాళ్లూ, ఒక ఉన్నత ప్రభుత్వోద్యోగీ, ఒక వితంతువూ, మత దురభిమాని ఒకడూ, చిరునవ్వుతో ఉన్న ఒక యువకుడూ. వాళ్లంతా సరదాగా, సంతోషంగా ఉన్నారు. ఆ తెల్లటి ఇంటి మీద నీడలు నాట్యం చేస్తున్నాయి. దట్టంగా ఉన్న ఆకుల మధ్య చిలకలు కీచుగా అరుస్తున్నాయి. ఒక లారీ పెద్ద చప్పుడు చేస్తూ వెళ్ళింది. ఆ వచ్చిన వాళ్లలో యువకుడు, గురువుకి, బోధకుడికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఎంతో తీవ్రంగా ఉద్ఘాటిస్తున్నాడు. తక్కిన వాళ్లు అతనితో ఏకీభవిస్తున్నారు. అతడు స్పష్టంగా, నిష్పక్షపాతంగా వాదిస్తూంటే ఆనందంతో చిరునవ్వు నవ్వుతున్నారు. ఆకాశం ఎంతో నీలంగా ఉంది. మెడదగ్గర తెల్లగా ఉన్న ఒక డేగ మాపైన చుట్టూ తిరుగుతోంది. రెక్కలు కొంచమైనా విదల్చకుండా. ఆ రోజు ఎంతో చక్కగా ఉంది. మనం ఒకరినొకరు ఎలా నాశనం చేసుకుంటాం - శిష్యుడు గురువునీ, గురువు శిష్యుణ్ణీ! అనుగుణంగా ఎలా వర్తిస్తూ ఉంటాం, విడిపోయి మరోలా ఎలా రూపొందుతూ ఉంటాం! ఒక పక్షి పొడుగాటి పురుగుని తడిమట్టి లోంచి లాగుతోంది.
మనలో ఉన్నవి ఎన్నో; ఒకటి కాదు. ఆ ఉన్నవన్నీ పోతేగాని ఒకటి అవదు. అవన్నీ ఒకటితో ఒకటి పోట్లాడుకుంటూ రోజూ రాత్రీ, పగలూ గొడవ చేస్తూ ఉంటాయి. ఈ పోరాటమే జీవితంలోని బాధ. ఒకదాన్ని నాశనం చేస్తాం. దాని స్థానంలో మరొకటి బయలు దేరుతుంది. ఈ రకంగా అనంతంగా సాగుతూ ఉన్నట్లుండేదే మన జీవితం. వాటిల్లో ఒకదానికి తక్కిన వాటి కన్న ఆధిక్యాన్నిస్తాం. కాని, ఆ ఒకటి త్వరలోనే అనేకం అవుతుంది. అనేకమైన వాటి గొంతు ఒక్కటిగా వినిపిస్తుంది. ఆ ఒక్క గొంతూ అధికారాన్ని చెలాయిస్తుంది. అయినా, ఆ గొంతు వాగుతూనే ఉంటుంది. మనలో అనేక కంఠాలు, అన్నిటిలోకీ నిశ్శబ్దంగా ఉన్న ఒక కంఠాన్ని వినాలని ప్రయత్నిస్తాం. ఆ ఒక్క కంఠాన్నీ వినటానికి తక్కినవన్నీ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, ఆ ఒక్కదానిలో అనేకం ఉన్నట్లే. కాని, అనేకం ఎన్నటికీ ఆ ఒక్కదాన్ని కనుక్కోలేవు.
ఇప్పుడు మన సమస్య ఆ ఒక్క గొంతునీ ఎలా వినాలా అని కాదు; మొత్తం వాటి కూర్పుని, అనేకమైనవన్నీ కలిసి మనం ఎలా రూపొందామో అర్థం చేసుకోవటమే మన సమస్య. బహుముఖాల్లో ఒకటి అన్నిటినీ అర్థం చేసుకోలేదు. ఒక రూపం తక్కిన రూపాల్ని అధీనంలో ఉంచుకుని వాటికి శిక్షణ నిచ్చి, వాటిని తన పద్ధతిలో రూపొందించటానికి ప్రయత్నించినా, దాని ప్రయత్నాలన్నీ స్వార్ధపరమైనవి, సంకుచితమైనవి గానే ఉంటాయి. మొత్తాన్ని దానిలోని ఒక భాగం ద్వారా అర్థం చేసుకోవటం సాధ్యంకాదు. అందువల్లనే మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. మొత్తమంతా మనకెప్పుడూ కనిపించదు. ఆ మొత్తమంతా ఎలా ఉందో మనకు తెలియదు, ఎందుచేతనంటే, మనం ఎప్పుడూ ఒక భాగంతోనే వ్యవహరిస్తూ, తీరిక లేకుండా ఉంటాం. కాని, ఒక భాగం తన్నుతాను అనేకంగా విభజించుకుంటుంది. మొత్తమంతా తెలుసుకోవటానికీ, అనేకమైన వాటి మధ్య జరిగే సంఘర్షణని తెలుసుకోవటానికీ, కోరికని అర్ధం చేసుకోవాలి. కోరికది ఒకే చర్య - అది రకరకాలుగా ఒకదానికొకటి వ్యతిరేకంగా కోరుతూ కృషి చేస్తున్నప్పటికీ, అవన్నీ కోరిక నుంచి పుట్టినవే. కోరికని ఉన్నతమైనదిగా చూడటంగాని అణచి వెయ్యటం గాని చెయ్యకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది అనేది లేకుండా అర్థం చేసుకునే రూపం ఒకటి ఉన్నట్లయితే అది కూడా కోరిక రూపమే. అనుభవం పొందేది లేకుండా అర్ధం అయినట్లయితే, అనేకం నుంచీ ఒక్కటినుంచీ కూడ స్వేచ్ఛ లభిస్తుంది.
అన్ని చర్యలూ - అనుగుణమైనవీ, నిరసించేవీ, విశ్లేషించేవీ, అంగీకరించేవీ. అన్నీ అనుభవం పొందే వాడిని. అంతే, అనుభోక్తను మరింత శక్తిమంతంగా చేస్తాయి. అనుభోక్త మొత్తమంతటినీ ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. కూడబెట్టుకున్నదంతా కలిసినది అనుభోక్త. గతం నీడలో ఏదీ అర్థం కాదు. గతం మీద ఆధారపడటం వల్ల ఏదైనా మార్గం స్ఫురించవచ్చు. కాని, ఏదో మార్గాన్ని అవలంబించటం అర్థం చేసుకోవటం కాదు. అర్థం అయేది మనస్సుకి చెందినది కాదు. ఆలోచనతో కూడినది కాదు. ఆలోచనకు నిశ్శబ్దంగా ఉండే శిక్షణ నిచ్చి మనస్సుతో ప్రమేయం లేని దానిని పట్టుకోజూచినట్లయితే, అప్పుడు అనుభవంలోకి వచ్చేది గతం యొక్క ప్రతిరూపం మాత్రమే; ఈ ప్రక్రియ అంతా తెలుసుకోవటంలోనే అనుభోక్తతో ప్రమేయం లేని నిశ్శబ్దం ఉంటుంది. ఇటువంటి నిశ్శబ్దంలోనే అవగాహన కలుగుతుంది.
--(())--
03. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు
Good night.... Frnds.....అది బెంగళూరుకు వెళ్తున్న రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ళమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను ఆనాల్సిన నాలుగు మాటలూ అని మరికాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ.
ఆ మాటలకు బిక్క మొహం వేసుకుందా పిల్ల.
ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిగారి భార్య) ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో "అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు
నేనిస్తాను" అన్నారు.
"వద్దండి. ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టిక్కెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు" అని టీసీ గట్టిగా అంటున్నాడు.
అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టిక్కెట్ తీసిచ్చారు.
ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసి ఆడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావని. ఎవరూ ఏమిటి అనే వివరాలు అడిగారు.
ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది.
ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంత కాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సవతితల్లి నానా మాటలు అనడం, కొట్టడం చేస్తోంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలెక్కింది. లక్ష్యం లేని దారీ తెన్నూ తెలియని జీవన ప్రయాణం ఆమెది.
సుధామూర్తి ఆమె చెప్పిందంతా విన్నాది.
బెంగుళూరూ స్టేషన్లో రైలు ఆగింది.
ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమెకోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయికోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చునుంది. ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల.
సుధామూర్తి దగ్గరకెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు.
దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్ళించింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి.
ఆ తర్వాత ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.
ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నాడు. అమ్మాయికి చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది. కంపెనీ వాళ్ళే ఆ పిల్లను అమెరికా పంపించారు. ఈ కాలమంతా గిర్రున తిరిగింది.
అమెరికాలో ఉన్న కన్నడం వాళ్ళు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసారు. అంతేకాదు ఆఖరిరోజు సుధామూర్తి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్ కి వెళ్ళారు. అయితే కౌంటర్లోని వారు "వద్దండి. మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టాశారండి" అన్నారు.
"ఎవరా అమ్మాయి? చెప్పగలరా? " అని సుధామూర్తి అడగ్గా ఓ రెండు మూడు అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు.
"మీరెందుకమ్మా నా ఖర్చుకి pay చేశారు" అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర్నించి ఇప్పుడు బిల్లు పే చెయ్యడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానేనని అంది.
"మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది....మీ బిల్లు నేను pay చెయ్యడం చాలా చిన్నది. నావల్ల అయిందిదే" అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు దణ్ణం పెడుతుంది.
ఆ పిల్లను చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆమెను గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ అప్రమేయంగా కన్నీళ్ళు కారాయి..
అందుకే సహాయం చెయ్యాలి.. ఒక వేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా ఖర్మ అనుభవిస్తారు.. నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది.
--(())--
04. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
హృదయపూర్వక అభినందనలు🌷*రేపు లేక మరుసటి రోజు నాటికి, దేశంలోని వ్యాపారులు తమ లాభాలను, నష్టాన్ని వదిలి దేశం మరియు సైన్యంతో నిలబడి కనిపిస్తారు.నిన్న, నోయిడా వ్యాపారులు మాల్ కోసం 150 మిలియన్ల చైనా ఆర్డర్‌ను రద్దు చేశారు.ఈ సాయంత్రం వరకు, ఎన్‌సిఆర్ నుండి కేవలం 1500 కోట్లకు మాత్రమే! చైనా యొక్క ఆగ్రహం కనిపిస్తే, మొత్తం దేశం నుండి సుమారు 2 బిలియన్ డాలర్ల ఆర్డర్ రద్దు చేయబడింది.అందుకే ఈ రోజు చైనా ప్రభుత్వ సంస్థ జిన్హువా విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిలో అతను రాష్ట్రపతి నుండి Delhiలో రెయిన్ వంటి పదాలను ఉపయోగించాడు.ప్రస్తుతం ఇది 2 బిలియన్ల వద్ద ఉంది. 62 బిలియన్ డాలర్లు మూసివేయబడిన రోజున ఏమి జరుగుతుంది.ఎన్‌ఎస్‌జి, మసూద్ అజర్‌లను పదేపదే వీటో చేసిన చైనాను మన దేశంలోని వ్యాపారులు ఎటువంటి అధికారిక పిలుపు లేకుండా మోకాళ్లపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు మేము చైనీస్ వస్తువులను కొనడం మానేస్తే, అప్పుడు వ్యాపారులు అమ్మరు. ఏదేమైనా, నేటి నుండి చైనీస్ వస్తువులను బహిష్కరించిన వ్యాపారులు నిజంగా గౌరవానికి అర్హులు.దేశ ప్రయోజనాల కోసం ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడు, ఒక అర్ధవంతమైన ఫలితం ఉత్పత్తి అవుతుంది, ఇది ప్రపంచం దేశ శక్తిని గ్రహించేలా చేస్తుంది. ఫలితంగా సార్వభౌమ భారతదేశం ఏర్పడుతుంది. నిజమైన దేశ ప్రేమికులు తప్పక చదివి ఇతర సమూహాలకు పంపించాలి.రేపు భారతదేశం చైనా చేత స్వాధీనం చేసుకుంటే, దానికి మనమే బాధ్యత వహిస్తాము. భారతదేశంలో వ్యాపారం చేయడం ద్వారా బ్రిటిష్ వారు కూడా మనలను బానిసలుగా చేశారు. అప్పుడు మేము నిరక్షరాస్యులం. కాని ఈ రోజు మనం తెలివిగా ఉన్నాము.*దేశీయంగా దత్తత తీసుకోండి, దేశాన్ని రక్షించండి.* అంటూ అందరు భారతీయులూ 90 రోజుల వరకు విదేశీ వస్తువులు ఏవీ కొనకండి. అప్పడు ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండవ గొప్ప దేశంగా మారవచ్చు. 90 రోజులలో 1 డాలరుతో మారకం విలువ 2 రూపాయలకు సమానం అవుతుంది. మనము చాలా జోకులను పంపుతుంటాము. దయచేసి ఈ సందేశాన్ని అందరికీ చేరేటట్టు పంపండి. ఉద్యమంలో భాగస్వాములవ్వండి. గత సంవత్సరం దీపావళికి, 1 వ ప్రచారం కింద, ప్రజలు చైనా లైట్లను కొనుగోలు చేయలేదు, అప్పుడు చైనా యొక్క 20% వస్తువులు నాశనమయ్యాయి. చైనా కోపంగా ఉంది.*కాబట్టి, ఈ నిర్ణయం తప్పక తేడా చేస్తుంది**మన దేశం చాలా పెద్దది. ప్రయత్నించి చూడండి.* నేను కనీసం 50 మంది స్నేహితులను ఈ సందేశాన్ని పంపుతాను.JAI HIND
--(())--
05. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధ
పదమూడో శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని, కవి ఒక పిల్లల ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్ష పదం.
మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారి కన్ను ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి
ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వారు మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసారు, వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటులోకి రావడం.
అలా మోక్ష పదం కాస్తా వైకుంటపాళిగా రూపాంతరం చెందింది.
పాత కొత్త ఆటలో వొంద చతురస్రములు ఉంటాయి, తేడా వొచ్చి మన మునీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో
12వ చతురస్రరం అంటే 'నమ్మకం' అని, 51వ చతురస్రరం అంటే 'విశ్వసనీయత' అని
, 57 వ చతురస్రరం వొచ్చి 'దాతృత్వాన్ని' సూచిస్తుంది, అలాగే 76వ చతురస్రరం 'జ్ఞానాన్ని' సూచిస్తుంది, 78వ
చతురస్రరం 'మునివృత్తి'ని సూచిస్తుంది. ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది . ఆ గడిలో పాచిక పడితే నిచ్చేనె ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.
అలాగే 41వ గడి 'అవిధేయతకు' ప్రతీకగా ,44వ చతురస్రరం లో పడితే 'అహంకారం' అని, 49వ గళ్లోకి పడితే 'అశ్లీలత' అని, 52వ గడిలోకి ప్రవేశిస్తే 'దొంగతనం' అని, 58వ గడిలో 'అబద్దలాడుట' అని , 62వ
చతురస్రరం లోకి ప్రవేశిస్తే 'తాగుబోతు' అని, 69వ గదిలోకి అడుగు పెడితే 'అప్పులుపాలు' అని,
73వ గడిలోకి ప్రవేశిస్తే 'హంతకుడు/హత్యలు' అని 84వ
చతురస్రరం లోకి వెళితే 'కోపిష్టి' అని, 92వ చతురస్రరం 'దురాశను' 95వ గడి 'గర్వాన్ని' సూచిస్తాయి. చివరగా 99వ గడి 'కామాన్ని'
సూచిస్తాయి. ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందకు జారిపోతారు.
ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని ముని చెప్పకనే తెలుస్తుంది పిల్లలకు. చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి చేరుకుంటారు.
మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం.
100వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే "మోక్షం"
ప్రతి నిచ్చెన పై భాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత లేకపోతే వివిధ స్వర్గాలో , కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలోకం ఇలా ఉంటాయి
ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు.
అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్రవేసుకొని ఏ విధమైన సందేశం లేకుండా చేశారు తెల్ల తోలు కప్పుకున్న నల్లటి మనసు ఉన్న బ్రిటీషేర్స్. మన దౌర్భాగ్యం ఆ అటని మనం ఇష్టంగా ఆడడం చిన్నప్పుడు.
--(())--
06. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక సమాచారం కధలు
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
వాళ్ళిద్దరికీ పెళ్ళయి అరవై ఏళ్ళయింది. పెళ్లి రోజు ని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు. తలంటుకున్నారు. పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్ద మందారం తురుముకుందామె. "
ఈ మధ్యనే" అయిదారేళ్ళక్రితం కొన్న అత్తరుని రాసుకున్నాడతను. కధ లోకి వస్తే.. మందారం తురుముకున్న ఆమె, అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు. దేమునికి దండం పెట్టుకున్నారు. మరో పద్ధెనిమిది పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడతను. అప్పటి కి అతనికి నూరేళ్ళు వస్తాయి. ఆమె మరో ఇరవైరెండు పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. అప్పటి కి ఆమెకి నూరేళ్ళు వస్తాయి. దానాదీనా ఇద్దరూ నిండునూరేళ్ళు బతకాలని కోరుకున్నారు. దేమునికి కొట్టిన కొబ్బరికాయ ని ప్రసాదముగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది. అయ్యయ్యో అనుకుని ఆందోళన తో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసాడతను.
బతికినంతకాలం బతకదు. ఉన్న నాలుగు రోజులూ హాయిగా బతకనీయండి. ఇంటికి తీసుకుపొమ్మని డాక్టర్ అంటే .. ఇంటికి తీసుకువచ్చాడు. వీలయిన మేరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్ళ లోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు.
గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే.. పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచపెట్టలేదు. అన్నీ అతనితో పంచుకునే బతికింది.
ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అది ట్రంకు పెట్టె. అటక మీద వుంది.
దాని విషయం అడగకండి! అందులో ఏమున్నదీ చూడకండి అని ఆమె ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు, అందులో ఏమున్నదీ చూడనూ లేదు. చూడాలని చాలా సార్లు అనుకున్నా ఆ కోరిక ని అణచుకున్నాడు.
ఇక ఇప్పుడు తప్పదు. చూడాల్సిందే.. అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి.. అందామె.
అటక మీద నుంచి ఆ పెట్టెని దించి జాగ్రత్తగా తెరిచి చూసాడు. ఏమున్నాయి అందులో?
రెండు ఊలు స్వెట్టర్ లు వున్నాయి. అంతేనా? ఓ మూడులక్షల రూపాయలు కూడా వున్నాయి. పెద్ద మొత్తమే!
ఈ స్వెట్టర్ లు ఏంటి? అని అడిగాడు. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగిందామె. పెళ్ళయి మీతో పాటుగా నేనిక్కడికి బయలుదేరి వస్తునపుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది? ఆత్రపడ్డాడతను.
భర్త తో ఎన్నడూ పోట్లాడకు. ఒకవేళ అతని మాటలకీ, చేష్టలు కీ పోట్లాడాలన్నంత కోపం వస్తే, ఎంచక్కా స్వెట్టర్ లు అల్లుతూ కూర్చో..
కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్లూ చేసాను అన్నదామె. ఆ మాటలకి అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. చేతిలోని రెండు స్వెట్టర్ లనూ ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు.
అరవైసంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండే సార్లన్నమాట! చాలు!
ఐయామ్ గ్రేట్ అనుకున్నాడతను.
మరి ఈ మూడులక్షలు? ఇంత డబ్బు ఎక్కడది? అని అడిగాడు.
అదీ.. అదీ.. ఈ అరవైఏళ్ళలో నేను స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామె. అతను కళ్ళు తేలేసాడు..
--(()) - -
07. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక సమాచారం
*జీడీపీ అంటే ఏమిటి?*
*(GDP- Gross Domestic Product)*
మనం టీవీ లలో న్యూస్ పేపర్ లలో *GDP జీడీపీ వృద్ధిరేటు పెరిగింది, తగ్గింది* అని తరుచుగా వింటూ ఉంటాం.
ఐతే ఈ *GDP అంటే ఏమిటి* అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి అసలు GDP అంటే ఏమిటి?
అది ఎలా లెక్కిస్తారు?
ఎందుకు అది అంత ముఖ్యమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
*GDP అంటే Gross Domestic Product. తెలుగులో స్థూల దేశీయోత్పత్తి* అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడీపీ అవుతుంది.
ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి. అది ఒక రోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 విలువ చేసే చాకొలేట్, 50 విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ 80రూపాయలు అవుతుంది. అదే విధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడీపీ అవుతుంది.
అయితే అన్ని ప్రోడక్ట్ ఈ GDP లోకి చేరవు. ఉదాహారానికి జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన GDP లో చేరదు. జపాన్ దేశపు GDPలో కలుస్తుంది.
అలాగే ఈ జీడీపీ లో మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహారానికి కారులో వాడే టైర్, సీట్ వంటివి ఉన్నాయి అనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేము. కానీ వాటితో కారును తయారుచేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైర్ , సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడీపీ లో ఈ అంతిమ వస్తువుల విలువను మాత్రమే లెక్కిస్తారు.
మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం దానిని మనం నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది.
మరి మన GDP పడిపోయింది అని వింటూ ఉంటాం దాని అర్ధం ఏమిటంటే మన దేశంలో తయారైన వస్తువులను మన దేశంలో ఎక్కువుగా అమ్ముడవడం లేదు. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులను కొనడంలేదు కాబట్టి మన దేశంలోని కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చెయ్యవు. ఉత్పత్తి లేకపోతె కంపెనీ కి లాభాలు ఉండవు. దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది.
మళ్ళీ మన దేశ GDP పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం ఎక్కువగా కొనాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువులను తయారుచేస్తాయి. దాని వాళ్ళ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.
ఈ జీడీపీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవ్యస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్దతిలో ఒక దేశం యొక్క జీడీపీ అనేది పెరుగుతూ ఉంటె ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్ధం.🍅
--(())--
No comments:
Post a Comment