28...ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..
తప్పకుండా ఆలోచించాల్సిన
అంశాలు ...
ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...
కొంత హిస్టరీలో కి వెళ్దాం...
30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు.
డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..
అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..
దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి.
అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.
ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు.
కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు.
తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు.
మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు.
అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు.
మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు.
వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.
తర్వాత వాస్తవం లోకి వెళ్దాం ...
కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది.
కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు కొందరు.
దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?
ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి.
మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?
అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి.
ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది.
కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.
ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది.
అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.
మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?
వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?
దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...
ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...
ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు.
ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని రూల్ ఏమి పెట్టలేదు.
అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.
కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.
ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.
ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!
అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.
ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది.
కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..
ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు..
ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు.
వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.
ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..
ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి.
పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది.
ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.
1. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం
2. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా లేకపోవడం.
3. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి, సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం
4. ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.
5. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం..
ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.
ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా? రాదు...
ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...
అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?
అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది...
ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.
నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?
ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!
ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ...
ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..
ఎడారిలో పండించండి ...
మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు.
వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.
నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.
నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు.
వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు.
ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల గలవారై ఉంటారు.
ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.
మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు...
అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి..
ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి...
పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి..
ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..
పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..
★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.
మేము చేర్చుకుంటాం...
★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..
మేము రానిస్తాం...
★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..
మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..
★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.
మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..
★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.
మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.
★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.
ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.
మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.
★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.
మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...
★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.
ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..
మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...
★ మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...
మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...
అవన్నీ మీకు కూడా తెలుసు...
వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.
అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు..
లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...
మరి మిగతా వాళ్ల సంగతేంటి..?
మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.
ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది..
అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.
దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.
నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే
అంత మంచి చేసినవారు అవుతారు.
ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి.
((()))
ఈ భూమండలం మీద తానే మహా బలవంతుడనని, క్రూర మృగాలను జయించి ప్రకృతిని గెలిచానని..
మహా సాగరాలను ఈది, మహా పర్వతాలను అధిరోహించిన మహా మేధావినని విర్రవీగిన *మనిషి.. చివరకు కంటికి కనిపించని సూక్ష్మ జీవికి లొంగిపోయి దానికి దొరక్కుండా గూట్లోకి దూరి దాక్కున్న వైచిత్రికి* ఈ పరిస్థితి అద్దం పడుతోంది కదా..
అందుకే.. మహాబలాఢ్యుడిని అనుకున్న మనిషిని ఇప్పుడు ప్రకృతి పరికించి చూస్తోంది.. పరిహాసం చేస్తోంది.
_*ఆధిపత్యం ప్రదర్శించిన మనిషి తిరిగి తన మూలాల్లోకి.. గుహల్లోకి.. గృహాల్లోకి వెళ్లిపోవడంతో వన్య ప్రాణులు తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటున్నాయి.*_
★ థాయ్‌లాండ్ వీధుల్లోకి అడవి కోతులు ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతున్నాయి..
★ జపాన్ రోడ్ల మీద సికా జింకలు షికారు చేస్తున్నాయి..!
★ కాలిఫోర్నియా వీధుల్లో టర్కీ కోళ్లు సామూహికంగా విహరిస్తున్నాయి..
★ మన కోయంబత్తూరు రోడ్ల మీదకు అడవి జింకలు వచ్చి దర్జాగా తమ పూర్వ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నాయి..
★ కొజికోడ్ వీధుల్లో పట్టపగలే అడవిపిల్లులు రాజ్యమేలుతున్నాయి.
★ నోయిడా రాచవీధిలో నీల్గాయ్‌లు తిరుగుతున్నాయి..
★ బెంగళూరు బస్ స్టాండు ఇప్పుడు పావురాల ప్రపంచమైపోయింది..
★ తిరుమల ఘాట్‌రోడ్లు.. మాడవీధులు జింకలకు ఆవాసమయ్యాయి.
ఇక్కడా అక్కడా అనిలేదు..
★ *లండన్ నుంచి లాస్ ఎంజెల్స్ వరకు.. న్యూయార్క్ నుంచి న్యూ సౌత్ వేల్స్ వరకు.. టోక్యో నుంచి టోరోంటో వరకు..* ఎటు చూసినా.. మనిషి అహంభావానికి, స్వార్థానికి ప్రతీకలుగా నిలిచిన కాంక్రీట్ జంగిల్స్‌లో తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ.. తాము కోల్పోయిన వనాలను గుర్తుచేసుకుంటూ వన్య ప్రాణులు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.
అర్ధనగ్న, పూర్తి నగ్న దృశ్యాలతో చెలరేగి.. బీరు సీసాలు, వైన్ గ్లాసుల చప్పుళ్లతో, అర్థంలేని వీరంగాల రణగొణ ధ్వనులతో నిన్నటిదాకా మారుమోగిన సాగర తీరాలు, ప్రేమికుల దినోత్సవాలతో, ఫ్లైయింగ్ కిస్సులతో, హాట్ హగ్గులతో బిత్తరపోయిన ఐఫిల్ టవర్లు, ఉద్యమాలతో దద్దరిల్లిన తియనాన్మెన్ స్వ్కేర్‌లు, కార్నివాల్స్‌తో చిత్తయిపోయిన సాల్వడార్లు ఇప్పుడు నిర్మానుష్యమైపోయాయి. ఇప్పుడక్కడ అడవితల్లి ముద్దుబిడ్డలు.. కపట మెరుగని మూగజీవాలు ఆటలాడుకుంటున్నాయి!
ఓ మనిషీ.. భూమి, ఆకాశం, గాలి, నీరు.. అన్నీ.. ఈ జగత్తు మొత్తం నీ ఒక్కడి సొత్తే అన్నట్టు ఆక్రమించావు. అడవుల్లోని జంతువుల నుంచి.. ఆకాశమార్గాన సాగిపోయే స్వేచ్ఛా విహంగాల నుంచి మహా సాగరాల్లోని తిమింగలాల వరకు అన్నింటినీ జయించావు.. ఇష్టారాజ్యంగా వధించావు.. ప్రకృతిని దోచావు .
*ఇప్పుడు కంటికి కనిపించని అతి సూక్ష్మజీవికి భయపడి దుప్పటి తన్నేశావు.. ముక్కుకు ముసుగేశావు.. నిజంగానే* నీ మూలాల్లోకి వెళ్లిపోయి గుహల్లో దాక్కున్నావు.
నీ అసలు ముసుగు తొలగిందిలే.. *ప్రకృతి ముందు నువ్వు ఎప్పటికీ అంగుష్ఠమాత్రమేనని అర్థమైందిలే!!*
ఇప్పటికైనా మేలుకో...
ఈ సమస్త భూమండలం మీదా నీతోపాటే తమకూ సమాన హక్కులున్నాయని గుర్తుచేస్తున్నాయి ఈ వన్య ప్రాణులు.
తాము కేవలం ఆకలి తీరడానికి.. కడుపు నింపుకోడానికి మాత్రమే వేటాడతామని.. అదీ కేవలం ఆగర్భ శత్రువుతోనే తలపడతామని.. నీలా సర్వభక్షకులం కాదని కాకూడదని హెచ్చరిస్తున్నాయి ఈ మూగ జీవాలు.
*ఇప్పటికైనా మేలుకొని సంధికొస్తే సరి.. కాదూ, కూడదూ.. సూది మొన మోపినంత భూమి కూడా లేదు అనే అనేశావంటే.. ప్రకృతి చేసే కురుక్షేత్రంలో బలైపోతావు సుమా!!*అందుకే గత 30 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ రక్షణ లేని పశుపక్ష్యాదులు స్వేచ్ఛ కొరకు ఉద్యమిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. జ్తై శాఖాహార జగత్.
--(())--30...ఆత్మలు గురించి భగవంతుని వివరణ
లైటు వెలగటానికి, ఫ్యాన్ తిరగరటానికి, ఫ్రిజ్, టీవీ, హీటర్, రేడియో, ఏ.సి. అన్నింటికీ కారణం కరెంటే. ఆ కరెంటులో ఏ భేదములు లేవు. అదొక్కటే రకం. కరెంటుకు వెలిగే గుణం, తిరిగే గుణం, వేడినిచ్చే గుణం, చల్లదనాన్నిచ్చే గుణం ఇవేవీ లేవు. అది అన్నింటిలోనికి వెళ్ళినప్పుడు దాని శక్తి వల్ల అన్నీ వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తున్నాయి. అట్లాగే ఆత్మ అందరిలో భాసిస్తుంది. అదే జాగ్రదావస్ధలో జరిగే సమస్తాన్ని తెలుసుకుంటున్నది. స్వప్నావస్ధలోని సమస్తాన్ని తెలుసుకుంటున్నది. సుషుప్తిలో ఏమీ తెలియకపోవటాన్ని కూడా తెలుసుకుంటున్నది. శరీరాల్లో భేదమే గాని ఆత్మలో భేదంలేదు.
హిందూ ఆత్మ, ముసల్మాన్ ఆత్మ, క్రిస్టియన్ ఆత్మ, భారత ఆత్మ, ఆస్ట్రేలియా ఆత్మ , వైశ్య ఆత్మ, బ్రాహ్మణ ఆత్మ, శూద్ర ఆత్మ, పేద ఆత్మ, ధనికి ఆత్మ, తెలివిగల ఆత్మ, పిచ్చి ఆత్మ, అమాయక ఆత్మ, ముసలి ఆత్మ,కుర్ర ఆత్మ, మగ ఆత్మ, ఆడ ఆత్మ, కుక్క ఆత్మ, నక్క ఆత్మ అని..... వేరువేరుగా ఆత్మలు లేవు. ఉన్నది ఒక్కటే ఆత్మ. బయట ఉపాధులను బట్టి ఆత్మలు అనేకం అనుకొనేవాడు ఆధ్యాత్మిక రంగంలో పరమ మూర్ఖుడు. జాతి, వర్ణ, వర్గ, లింగ, భేదాలన్నీ ఆత్మకు చెందినవి కావు. అవి ఉపాధులకు చెందినవి; దేహాలకు చెందినవి. అలాగే పుణ్యం, పాపం కూడా ఉపాధులకు (మనస్సుకు) చెందినవే కనుక పుణ్యాత్మ, పాపాత్మ అంటూ లేవు. ఆత్మ అన్నింటికి కేవల సాక్షిగా ఉంటుంది. అంతే.
స్వచ్చమైన నీటికి రంగులేదు, రుచిలేదు, వాసనలేదు. స్వచ్చమైన వర్షపు నీరు భూమి మీదకు పడేటప్పుడు స్పటికంలాగా రంగు ఉండదు. రుచి ఉండదు. వాసన ఉండదు. కాని భూమి మీద పడటంతో అది భూసారంతో కలిసి రంగు రుచి ఏర్పడుతుంది. అందుకే వాన వెలిసిన తర్వాత చూస్తే ఆ నీరు ఒకచోట నల్లగాను, ఒకచోట ఎర్రగాను, ఒకచోట పచ్చగాను ఉంటుంది. అలాగే నీరు తీయగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉప్పగా ఉంటుంది. కొన్ని చోట్ల చవ్వగా ఉంటుంది. ఇదంతా భూమిలోని లవణాల యొక్క కలయిక చేతనే.
అలాగే ఆత్మ అంతటా - అందరిలో ఒక్కటే. దానికి ఏ గుణాలు లేవు, ఏ భేదాలు లేవు. అయితే దేహమనే ఉపాధితో తాదాత్మ్యం వల్ల దేహలక్షణాలు ఆత్మపై ఆరోపించబడుతున్నాయి. దేహం భారత దేశంలో పుట్టింది గనుక భారతీయుడని, బ్రాహ్మణకులంలో జన్మిస్తే బ్రాహ్మణుడని, వైశ్య కులంతో జన్మిస్తే వైశ్యుడనని, ఈ దేహం బాల్యంలో ఉంటే బాలుడని, వివాహం చేసుకొని ఉంటే గృహస్తుడని, గృహాన్ని వదలివెళితే వానప్రస్ధుడని, సర్వసంగ పరిత్యాగంచేస్తే సన్యాసియని - ఇలాగ వేరువేరు విధాలుగా పిలవబడుతున్నాడు. అంతేతప్ప ఆత్మకు జాతి భేదంగాని, లింగభేదంగాని, వయో భేదంగాని, కులభేదంగాని, ఆశ్రమభేదంగాని ఏవీ లేవు. ఆత్మజ్ఞానం లేకపోవటంవల్ల ఉపాధులకు పరిమితులమై ఉపాధి లక్షణాలను ఆత్మపై ఆరోపించుకుంటున్నాము. దు:ఖాలు పొందుతున్నాం. ఆత్మ యొక్క సచ్చిదానంద లక్షణం అనుభవరీత్యా బోధపడితే ఇక మనం ఏ భేదాలు లేని ఆత్మగా కేవలంగా ఉండిపోతాం.
--(())---
నీరెండలో తళుక్కున మెరిసిన ఆ నవ్వు, ఆమె ఎర్రరాయి ముక్కుపుడక అతణ్ణి ముగ్ధుణ్ణి చేశాయి. ‘ ఎలాగైనా ఈ అందం వేరు!’ అనుకున్నాడతను– బొంబాయిలో నీతా మెహతా గుర్తుకొచ్చి. జడలో కనకాంబరాలు, ఏ మాత్రం మాచింగ్ లేకుండా కట్టుకున్న ఆకుపచ్చ పరికిణీ, నీలం రంగు ఓణీ, ఎర్రరంగు జాకెట్టు వేసుకుని నూతి దగ్గర్నుంచి నీళ్లు తీసుకువస్తున్న అనూను అలాగే ఫోటో తీశాడు సుధాకర్. అలా అందంగా కనిపించిన ప్రతి మనిషినీ, దృశ్యాన్నీ ఫోటో తీస్తూ, 'తను ప్రతి ఏడూ చూసే ఈ ఊరిలో ఇన్ని అందాలున్నాయని కెమేరా పట్టుకుంటే కానీ అర్థం కాలేదే!' అనుకున్నాడు. పాలు తీసే పల్లెపడుచులు, రంగవల్లుల మధ్య బంతిపూల గొబ్బెమ్మలు, తాటాకులతో చేసిన దేముడి రథం అన్నీ అందంగానే కనిపించాయి సుధాకర్ కి!
విషయం విన్న సుధాకర్ మనస్సు ఎందుకో కలుక్కుమంది. ‘పాపం ఏమనుకుందో..? పిచ్చిపిల్ల! తన గొప్ప ఉందని తృప్తి పరచుకోడానికి ఊహించుకున్న ఊహాలన్నీ అమాయకంగా బయటికి చెప్పేసింది కాబోలు ‘ అనుకున్నాడు. “అసలా పిల్లకి ఎన్నెళ్లుంటాయి అనూ…? నాలుగడుగులు కూడా ఉండదు” అన్నాడు సుధాకర్. “నా వయసే బావా…పద్దెనిమిది సంవత్సరాలు” అంది అనూ.
ముదురు ఎరుపు రంగు పరికిణీ, కనకాంబరం రంగు ఓణీ, లూజుగా ఉన్న పట్టు జాకెట్టు…. వాళ్ళమ్మది కాబోలు! మెళ్ళో పిచ్చి నగలు, చేతికి నానా రంగుల గాజులు, ముఖానికి అరంగుళం ఎత్తున పౌడరు, కళ్ళు మూసుకుపోయేలా కాటుక. ఎర్రటి అమ్మవారి బొట్టు!” బావున్నానా అండీ?” అంటూ నవ్వేసరికి, సుధాకర్ కి కెమేరా కింద కొట్టి పారిపోవాలనిపించింది. “ఏం… మాట్లాడరేం?… బాగాలేనాండీ…ఫోటో తీయరా?” అంది జాలిగా, సుధాకర్ కి మధ్యాహ్నం ఏడుస్తున్న శ్యామల గుర్తుకొచ్చింది. సుధాకర్ అటూ ఇటూ చూశాడు. “నేనెవరికీ చెప్పను లెండి…ఒట్టు” ఆశగా అంటూన్న శ్యామల గొంతు వినగానే… ” ఛా..ఛా.. అదేంలేదు. అదిగో ఆ పిట్టగోడనానుకుని నించో..” అని తనకి తోచిన ఐడియా చెప్పి ఫోటో తీశాడు సుధాకర్. ఆ తర్వాత కెమేరాలో రీలు తిప్పుతున్న అతన్ని చూస్తూ…”ఏదండీ ఫొటో!” అంది ఆశగా.”ఇప్పుడే రాదు. మా ఊరు వెళ్ళేకా కడిగించి తరవాత పంపుతాలే. సరే.. నువ్వెళ్లు ఇంక..” అన్నాడు వెనక్కి తిరుగుతూ. అంతలో ” ఏమండీ…” అంది శ్యామల. అతను ఏమిటన్నట్టు వెనక్కి చూశాడు. ” అందర్నీ ఫొటో తీస్తారు…మీరు తీయించుకోరా? మీరు ఆ ఫోటోలో ఎంత అందంగా ఉంటారో తెలుసా!” ఆ మాటలకు అదిరిపోయాడు సుధాకర్. ఇంతవరకూ కెమేరా కొన్న తర్వాత ఫోటోలు తీయించుకునే వాళ్ళే కానీ, తన గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో “శ్యామలా!” అని ఆమె తల్లి పిలవడంతో ఒక్కసారిగా పరుగెత్తింది. ఆమె పట్టీల చప్పుడు వింటూకాసేపు అలాగే నిలబడి, మెల్లగా కిందకు వచ్చేశాడు సుధాకర్. ఆ తరువాత రెండు రోజులు పోయాకా అక్కయ్య వాళ్ళతోటీ, అనూ వాళ్ళతోటీ కలిసి వనభోజనాలూ వగైరా చేస్తూ సరదాగా గడిపేకా, మూడో రోజు బండెక్కి స్టేషనుకి వెడుతున్న సుధాకర్ కి, కరణంగారి వాకిట్లో తారాడుతున్న శ్యామల నీడ స్పష్టంగా కనిపించింది!
కొన్నాళ్ళు గడిచాయి. అది ఒక ఫోటో ఎగ్జిబిషన్!
-------------------------------------------------------
వైద్యులుగా కన్నా నాటక రంగంలో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. అదిగో….వారి కుమార్తె ఈ *లక్ష్మీ కామేశ్వరీ ‘జలంధర‘*.
నిజజీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలను కథలుగా మలచి, తారసపడే వ్యక్తులను పాత్రలుగా చేసి ఈమె కథలు రాశారు. శ్రీమతి జలంధర తన రచనలకి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె నవల ” పున్నాగ పూలు“ మంచి గుర్తింపు పొందింది. ఇక కథల విషయానికి వస్తే , ‘ అగ్నిపుష్పం‘ , ‘ఉత్తరవాహిని‘ , ‘గడ్డిపూలు‘, ‘ ఎర్ర మందారాలు‘, ‘దీప కళిక‘ , ‘ నర్తకి‘ , ‘ మిథ్యాబింబాలు‘, ‘ నల్ల బట్టలు‘ మొదలైన అనేక కథలు రాశారు.
35.... తృప్తి లేని జీవితం కథ.
No comments:
Post a Comment