Tuesday, 2 November 2021

ఈ వారం (7) కధలు (08-14)





 

08. చిత్తూరు నాగ‌య్య ఒక యోగి!

చిత్తూరు నాగ‌య్య ఒక మ‌హాయోగి, గొప్ప న‌టుడు. ఆకాశాన్ని, భూమిని రెండింటిని స‌మానంగా చూసిన‌వాడు.

రేణుకా ఫిల్మ్‌, ప్రొడ‌క్ష‌న్స్ అంటే అది ధ‌ర్మ‌స‌త్రం. ఆక‌లి వేళ‌కి ఎవ‌రైనా వ‌చ్చి భోజ‌నం చేయ‌వ‌చ్చు నిన్నెవ‌రూ ప్ర‌శ్నించ‌రు. దాని య‌జ‌మాని నాగ‌య్య ఠీవిగా వ‌స్తే క‌ష్టాల్లో ఉన్న‌వాళ్లు చుట్టూ చేరేవాళ్లు. జేబులో ఉన్న డ‌బ్బుని లెక్క పెట్టుకోకుండా బ‌య‌ట‌కి తీసి సాయం చేసేవారు. 1940లో బంగారు తులం రూ.36. నాగ‌య్య పారితోష‌కం రూ.ల‌క్ష‌.

డిసెంబ‌ర్ 30, 1973 నాగ‌య్య మ‌ర‌ణించాడు. నాగ‌య్య శ‌వాన్ని చూడ‌డానికి MGR వ‌చ్చారు. ప్రశాంతంగా శాశ్వ‌త నిద్ర‌లో ఉన్న నాగ‌య్య‌ని చూసి ఆయ‌న కంట‌త‌డి పెట్టారు. నాగ‌య్య మేన‌ల్లుడిని పిలిచి అడిగితే అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులు లేవ‌ని తెలిసింది. రూ.5 వేలు ఇచ్చి MGR నాగ‌య్య‌ని గౌర‌వించారు.

చిన్న‌త‌నంలో నాగ‌య్య అంటే భ‌యం నాకు. ఆయ‌న తెర‌మీద క‌నిపిస్తే గుండెపోటుతో పోయేవారు. పోతూపోతూ క‌థ‌ని ఏదో మ‌లుపు తిప్పేవారు. పెద్ద‌వాళ్ల‌ని గుర్తు ప‌ట్ట‌డానికి మ‌న‌కీ ఎంతోకొంత వ‌య‌స్సు రావాలి.

యోగి వేమ‌న చూసి నాగ‌య్యకి దండం పెట్టుకున్నా. ఒక స‌న్నివేశంలో ప‌రుస‌వేది విద్య ల‌భించింద‌నే సంతోషం, అన్న కూతురు చ‌నిపోయింద‌నే క‌న్నీరు, ఏక‌కాలంలో ఆయ‌న ప‌లికించిన భావాలు, నాగ‌య్య మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు.

భ‌క్త‌పోత‌న‌లో పోత‌న ఇలాగే ఉంటాడా అనిపిస్తుంది. శ్రీ‌నాథుడిగా గౌరీనాథ‌శాస్త్రి, పోత‌న‌గా నాగ‌య్య పోటాపోటీగా ఉంటారు.

చిత్తూరులో పుట్టిన నాగ‌య్య‌, టీటీడీ వారి సాయంతో చ‌దువుకున్నారు. త‌ర్వాత జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశారు. బీఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డి దృష్టిలో ప‌డిన త‌ర్వాత నాగ‌య్య వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

జీవితంలో జరిగిన అనేక సంఘ‌ట‌న‌లు ఆయ‌న్ని వైరాగ్యం వైపు నెట్టాయి. మొద‌టి భార్య చ‌నిపోయారు, బిడ్డ కూడా చ‌నిపోయింది. రెండో భార్య గ‌ర్భ‌వ‌తిగా ఉండి చ‌నిపోయారు. జీవితం ఒక గాలి బుడ‌గ లాంటిది, ఉన్నంత‌లో ప‌ది మందికి సాయం చేయాల‌ని అనుకున్నారు, చేశారు.

తిరువాన్కూరులో ఏనుగు మీద ఊరేగి, రాజుగారి సింహాస‌నం మీద కూర్చొని స‌న్మానం అందుకున్న నాగ‌య్య‌, చివ‌రి రోజుల్లో రూ.500కు కూడా వేషాలు వేశారు.

ఆయ‌న ప్ర‌తిభ గురించి తెలియ‌ని మూర్ఖులు ఉద‌యం 7 గంట‌ల‌కు గ‌డ్డాలు, మీసాలు అతికించి మేక‌ప్ వేసి, సాయంత్రం షాట్‌కి పిలిచేవాళ్లు. ఆ రోజుల్లో గ‌డ్డానికి వాడే గ‌మ్ చాలా హింస పెట్టేది. అదంతా చిరున‌వ్వుతో భ‌రించేవాడు.

తొలిరోజుల్లో హాస్య‌న‌టుడు ప‌ద్మ‌నాభం, నాగ‌య్య ఇంట్లోనే భోజ‌నం చేసి, అక్క‌డే ఉండేవాడు. వేషాలు లేని న‌టుల‌కి నాగ‌య్య ఇల్లు ఒక దేవాల‌యం. త‌ర్వాత రోజుల్లో పొట్టిప్లీడ‌ర్‌లో చిన్న వేషం వేసినందుకు ప‌ద్మ‌నాభం రూ.10 వేలు ఇస్తే, ఇది చాలా పెద్ద మొత్తం నాయ‌నా అన్నాడ‌ట‌.

ఈ డ‌బ్బులు వేషానికి కాదు, దిక్కులేని న‌న్ను ఒక‌ప్పుడు ఆద‌రించినందుకు అని ప‌ద్మ‌నాభం అంటే "అప్పుడు నా ఇంట్లో నీకే ఇబ్బంది క‌ల‌గ‌లేదు క‌దా" అని అడిగాడ‌ట‌. ద‌ట్ ఈజ్ నాగ‌య్య‌.

ప్ర‌పంచం దృష్టిలో నాగ‌య్య లౌక్యుడు కాక‌పోవ‌చ్చు. బ‌త‌క‌డం తెలియ‌క‌పోవ‌చ్చు. భోళా మ‌నిషి, ముందు చూపులేని వాడు. ఇలా ఎన్ని మాట్లాడినా నాగ‌య్య ప్ర‌పంచం వేరు. జీవితంలోని మ‌కిలిని, క‌ల్మ‌షాన్నిఅంటించుకోకుండా జీవించిన వాడు. ఆక‌లితో ఉన్న ప్ర‌తివాడికి అన్నం పెట్టిన వాడు.

అందుకే ఆ ముఖంలో అంత స్వ‌చ్ఛ‌త‌. ల‌వ‌కుశ చూస్తే వాల్మీకీ ఇలాగే ఉండేవాడా అనిపిస్తుంది. దుఖపు జీర‌తో "క‌ష్టాలు శాశ్వ‌తంగా ఉంటాయా త‌ల్లీ" అని సీత‌మ్మ‌తో అంటాడు.

ఏదీ శాశ్వ‌తం కాద‌ని తెలిసిన నాగ‌య్య ఒక మ‌హ‌ర్షి, మ‌హాన‌టుడు. చెన్నై పాన‌గ‌ల్ పార్క్‌లో, ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉన్న (హైద‌రాబాద్‌) నాగ‌య్య విగ్ర‌హాలు ఇప్పుడు ఒక చిన్న పూల‌మాల‌కైనా నోచుకుంటున్నాయో లేదో!


  - సేకరణ

-((9)--

09 సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే..🤷‍♂_

మహాభారతం లో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి...!

జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం.. వీటినే చూపెడతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన "నీతికథలు" ఎన్నో ఉన్నాయి..!!

అందులో ఒకటి ఇది...👇🏻

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే  రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.

ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.

అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !

ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ? అని చెప్పడంతో.. ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!

ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.

ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్ళారు.

కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు..

రాజా.. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు..

కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు..! ఈయన రాజ్యంలో బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు.. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు !

తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !! 😭😭

👉🏻 సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు !!!

👉🏻 మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.. ప్రజలు ఎప్పుడు మారుతారో..!


--(())--


10. *ఆంజనేయ స్వామి వారికి వానర రూపం రావడానికి కారణమైన శాపం*

గౌతమ మహర్షి, అహల్య దంపతులకు కలిగిన పుత్రులు వాలి, సుగ్రీవులు మర్కట రూపులుగా ఎందుకు ఉన్నారు? వీరి పుత్రిక అంజనా దేవి కుమారుడు ఆంజనేయ స్వామి మర్కట రూపుడు అవడానికి కారణమేమిటి? తెలుసుకుందాం. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్కరించిన తరువాత తను బ్రహ్మచర్యము వీడి తను ఇచ్చటనే ఉండి ఇంకనూ సంతానం పొందగోరి సంసార జీవితం గడిపారు. అహల్య గౌతమ మహర్షి దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కలిగారు. వీరి కుమారులు వాలీ, సుగ్రీవులు. వీరి కుమార్తెయే ఆంజనేయస్వామి వారి కన్నతల్లి అంజనాదేవి.

ఇంద్రుడు అహల్యను చూసిన తరువాత ఆమె అందచందాలకు ఆమెపై మోజుపడతాడు. అహల్య, ఇంద్రునికి దక్కకపోవడం చేత ఒకనాడు మహర్షి లేని సమయాన గౌతమ మహర్షి రూపములో వచ్చి అహల్యతో సంభోగించి ఇంద్రుడు తన కోరికను తీర్చుకున్నాడు. ఈ విషయము అంజనాదేవి కనిపెట్టినా మౌనముగా ఉండిపోయింది. 

ఒకనాడు గౌతమ మహర్షి తన ఇరువురు కుమారులను రెండు భుజములపై ఎక్కించుకుని కుమార్తెను చేత పట్టుకుని సరస్సు గట్టుపై నడుస్తున్న సమయాన చిరంజీవి అంజనా తన తండ్రి తనకు పుట్టిన నన్ను నడిపిస్తూ, పరులకు పుట్టిన వారిని భుజములపై మోయుచున్నాడని బాధపడుతుంది. ఇది మనోనేత్రమున గమనించిన మహర్షి అంజనా దేవి ద్వారా అసలు విషయం తెలుసుకుని తన కూతురు చెప్పిన విషయంలో నిజమెంతో పరీక్షించదలచి ఈ సరస్సులోని నీటిలో వీరిద్దరిని పడవేస్తాను. 

పరులకు పుట్టినవారైతే మర్కట రూపులుగా, తనకు పుట్టినవారైతే తమ స్వరూపులుగా ఈ నీటి నుండి తిరిగి వస్తారని చెప్పి పిల్లలిద్దరిని నీటిలో పడవేస్తాడు. పిల్లలిద్దరూ మర్కట రూపులై తిరిగి రావడం చూసి గౌతమ మహర్షి మిక్కిలి కోపిస్టులవుతారు. ఈ విషయం తెలిసిన అహల్య అచ్చటకు వచ్చినది. కోపిష్టుడైన మహర్షి పరపురుషుని స్పర్శ తెలియనంతగా బండరాతివై ఉన్నావా? నీవు రాతి బండవు కమ్మని అహల్యను శపించి పిల్లలను వదిలేసి మహర్షి కోపముతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.

అప్పుడు అహల్యాదేవి తన కుమార్తె అంజనాతో పరపురుషులు తన తండ్రి రూపముతో వచ్చినారని తెలిసి కూడా తనతో ఇంతకాలం చెప్పక తను శాపగ్రస్తురాలగుటకు, తన కుమారులు మర్కట రూపులు అగుటకు కారణమైతివి. కాబట్టి నీవు అంధురాలివికమ్ము. నీకు పుట్టబోయే కుమారుడు కూడా మర్కట రూపుడై పుట్టుగాక అని తన కుమార్తె అంజనాదేవిని శపించినది. తల్లి శాపముతో అంధురాలిగా మారిన అంజనాదేవి ఆ ప్రాంతం వదిలి కిష్కింద చేరి అచ్చట కేసరి అనునతడిని వివాహమాడినది. వారికి కలిగిన సంతానమే ఆంజనేయస్వామి. ఆనాడు అహల్య పెట్టిన శాపం వల్ల అంజనాదేవి కుమారుడైన  ఆంజనేయస్వామికి మర్కట రూపం వచ్చింది.


--(())--

11. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (౧౩) 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :
మన మనసు పనే మనలని బాధపెట్టడం. ఒక్కోసారి ఆ బాధ తీరిపోయినా మనసు
అంగీకరించదు. ఎందుకో తెలుసా అబద్దం మనసుకు వేగంగా చేరి నిజం నిదానంగా చేరుతుంది. 
తిరుగుతున్న రంగులరాట్నం ఒక్కసారిగా ఆగకుండా వేగం తగ్గుతూ మెల్లమెల్లగా ఎలా క్రమ క్రమంగా ఆగుతుందో
స్టేషన్ దగ్గరగా వచ్చినప్పుడు రైలు నెమ్మది నెమ్మదిగా ఎలావచ్చి ఆగుతుందో 
కోపంతో అరచిన వ్యక్తి ప్రేమకు నెమమ్ది నెమ్మదిగా ఎలా ఆగుతుందో 
అబద్దం వేగంగా ప్రజల్లోకి వెళుతుందో నిజం నిదానంగా బలపడి ఆరోగ్యం మారుస్తుంది  
అలాగే
మనసులోని బాధ  ఒక్కసారిగా పోదు, అదే సంతోషం అయితే మనసు త్వరగా మరచిపోతోంది.
ఓటమి మనస్సును కలచివేసినా, అనుభవానికి పునాదిగా మారి గెలుపుకు తార్కాణం  
నిత్యకృత్యంలో అనేక ఒడుదుడుకులు వస్తాయి అయినా భయము చెంత చేరక ధైర్యాన్ని ఆశ్రయించి బత్కుటలోనే నిజమైన జీవితం 
తృప్తి సంతృప్తి మధ్య చాలా తేడా ఉన్నది భార్య భర్తల మధ్య తేడాలు ఎన్ని ఉన్నా తృప్తి అనే మనస్సుతో ఏకం అయిన సంతృప్తి అనే బిడ్డలు పుడతారని పెద్దలు చెప్పిన వాక్కు. 
మీ జీవితంలో మరచిపోయిన చెడు సంఘటనలను మీ మిత్రులో లేక బంధువులో గుర్తు చేసే వరకు చాలాసార్లు ఆ చెడు మరచి మీరు హాయిగా నవ్వుతూనే ఉంటారు.
ఉదా:-
శవ జాగరణ దగ్గర బంధువులు కాసేపటికి ఆ మరణాన్ని మరిచిపోయి కబుర్లలో పడిపోతారు.
కానీ వేరే ఊరినుండి అక్కడికి కొత్తగా వచ్చిన బంధువు ఏడుపు అందు కోగానే అక్కడివారికి అమాంతంగా దు:ఖం పొంగుకు వస్తుంది 
సుఖదుఃఖాల మద్య నలిగి వెలిగేదే మనస్సు , క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం సుఖం, క్షణం దుఃఖం వీటన్నిటికీ మూలం మనిషిలో ఏకాగ్రత లేకపోవటం. అమృత ఘడియల్లో ఏదైనా సాధన చే యండి అదే మనశాంతికి మార్గం


12. ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - - యేకాగ్రత 
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

ప్రాణుల దేశంలో  కోటాను కోట్ల జీవ కణాలతో ఏర్పడింది. ప్రతి జీవకణానకి ఆత్మ, మనస్సులో మేధస్సు ఉంటాయి. అన్ని వ్యక్తి గత లక్షణం. బుధ్ధితో మనసు కలిసి సామూహిక  గా మారి ప్రాణుల సంకల్పశక్తి, ఊహాశక్తి కి అనుగుణంగా స్పందిస్తాయి. ఇవి ప్రేమ, ప్రకృతి, కాలానుగుణంగా  మారుతాయి. 

కొన్ని సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్నట్లైతే ఆ వ్యక్తి ఆ వ్యాధి నాయమవ్వాలని,అహం చేరకుండా ఓర్పుతో వైద్యుడు తెలిపినట్లు నమ్మకమనే ఏకాగ్రత  సంకల్పిస్తే అతను ఆ వ్యాధి నాయమైనట్లు,దేహం ఆరోగ్యంగా ఉన్నట్లు అతను ఊహాశక్తితో కలలు కంటే, తక్షణమే దేహంలోని జీవకణాల సామూహికం దానికి స్పందించి దేహంలో సరికొత్త జీవరసాయనాలు, విద్యుదయస్కాంత శక్తి విడుదలై ఆ వ్యాధి నయం చేయబడుతుంది.

ఊహాశక్తి, ఏకాగ్రత తో ఆశయాలు,భయాలు,సంకల్పాలు,ద్వారా విద్యుదయస్కాంత శక్తిని మెదడు సంగ్రహించి మనస్సు కి చేరవేస్తుంది.

 దేహం మరణించిన వెంటనే  మెదడు పంచభూతాలలో కలిసిపోతుంది. బత్కునీడలో వున్న వారి కొంత మనసు వికల్పమై కాలంతో ప్రేమ తగ్గిపోతుంది 

((()))

 13. ప్రహ్లాదుని పూర్వజన్మ చరిత్ర


పూర్వము సత్య యుగమున శివశర్మ అనే బ్రాహ్మణోత్తముడు,ధర్మాచారపరాయణుడు విజయనగరమున జీవిస్తుండేవాడు.అతని భార్య మహాపతివ్రత,సుగుణశీలి భర్తనే దైవముగా పూజిస్తుండేది.వారికి అయిదుగురు పుత్రులు ఉండెను.ఆ అయిదుగురు పుత్రులు కూడా భక్తి కలిగి తల్లితండ్రులను పూజిస్తూ , వారి ధర్మాన్ని ఆచరిస్తుండేవారు. శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకమునకు వెళ్ళిన తరువాత మిగిలిన ఐదవ పుత్రుడు, సోమశర్మను పిలచి, అతని చేతికి నాలుగవ కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశమును ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి, తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్ళెను. ఇలా దాదాపుగా పది సంవత్సరములు శివశర్మ తన భార్యతో కలసి అన్ని తీర్ధములు తిరిగి, తమ ఇంటికి చేరుకొనే సమయమునకు శివశర్మతపోబలంతో, అతనికి అతని భార్యకి కూడా కుష్టు రోగం వచ్చేలా చేసాడు. 

ఆ కుష్టు రోగంతో భాదపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లితండ్రులను చూసిన సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు. "ఓ తండ్రీ! తమరు నిత్యం అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. అటువంటి కలుశారహితులయిన మీకు ఇట్టి అవస్థ ఏ పాపమువలన కలిగినదో ? దయచేసి చెప్పండి" అని నీరు నిండిన కన్నులతో అడిగెను. సోమశర్మ మాటలు విన్న శివశర్మ "మీము పూర్వ జన్మములలో ఏదో పాపం చేసే ఉంటాం దాని నివృత్తికోరకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించ వలసి వచ్చినది. 

పూర్వం చేసిన కర్మములకు ఫలములు తప్పక అనుభవించవలసినదే కదా! నీవు మాగురించి మా పాపముల గురించి విచారించక, నీవు పితృభక్తి తత్పరుడవు కనుక ఈ శరీరములను వేడి నీటితో కడిగి రక్షించుము" అని బదులు ఇచ్చెను. సోమశర్మ తనతల్లితండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ, వారి పుండ్లను శుభ్రం చేస్తూ, వారికి విధిగా స్నానం చేయిస్తూ, మధురమయిన భోజనములను పెడుతూ తన నిత్య కృత్యములను చేస్తూ ఉన్నాడు. ఐతే శివశర్మ, అతని భార్య వారి శరీరములకు కలిగిన భాదల వలన తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయటంలేదని, అతనిని తిడుతూ, ఒక్కొక్కచో కొడుతూ ఉన్నారు. 

అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లితండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినా తరువాత, శివశర్మ ఇక తన ఐదవ పుత్రునికి విడుదల ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. తను తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు వెళ్లేముందు సోమశర్మకు ఇచ్చిన అమృత కలశమును దొంగిలించాడు. ఇక ఏమి తెలియనివానివలే సోమశర్మను పిలచి " పుత్రా సోమశర్మ! మీము ఇంతకు మునుపటి జన్మలలో చేసిన పాపములకు ఇప్పటివరకు మేము అనుభవించిన శారీరిక క్లేశం సరిపోతుంది కనుక మేము ఇక ఈ భాద నుండి విముక్తి పొంద దలచాం కనుక నేను నీకు ఇంతకుమునుపు ఇచ్చిన అమృతకలశమును తెచ్చి ఇవ్వుము. " అని అడిగెను తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వటానికి చూడగా, సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు. 

ఈ విషయం తన తండ్రికి తెలిసినచో భాదపడతాడని తలచి, తన తపఃశక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని మరొక అమృత కలశం సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చెను. తన పుత్రుని పితృభక్తి ని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతోకుడా తన నిజ రూపం పొందిరి. అప్పుడు శివశర్మ సోమశర్మతో "ఓ పుత్రా! నీ భక్తి కి మేము అత్యంత ప్రసన్నులం అయ్యాము. 

నీవు ఇంకొంతకాలం ఈ భూమి పై ఉండవలసి ఉన్నది కనుక నీవు నిత్యం ధర్మాచరణలో ఉండుము. నీకు ఉన్నత పదవులు సిద్దించగలవు" అని ఆశీర్వదించి వారు విష్ణులోకమునకు చేరుకున్నారు. సోమశర్మ తపస్సుచేసుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినది. సోమశర్మకు అంతిమ ఘడియలు సమీపించగానే అతనికి తనకు దగ్గరలో ఎవరివో రాక్షస గర్జనలు, కోలాహలములు వినిపించినవి. 

ఆ శబ్దములు వింటూ, రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు. తుదిశ్వాస విడచే సమయంలో ఎవరు ఏవిషయం గురించి ఆలోచిస్తారో మరు జన్మలో వారు అలా జన్మిస్తారు. కనుక సోమశర్మ రాక్షసయోనిలో జన్మించాడు. కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమయిన పుణ్యం కారణంగా అతనికి విష్ణు భక్తి ప్రాప్తించినది. అతనే విష్ణుభక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పుకునే "ప్రహ్లాదుడు". ఇది ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం.(post of slri నాని)

(((0)))
14 . దశోపనిపనిషత్తులు వాటి సారాంశం

 1) ఈశావాస్యోపనిషత్:--సర్వం ఆత్మగా దర్శించినప్పుడు ,సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు,శోకం మటుమాయమవు తుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.

2) కేనోపనిషత్:--ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది,చైతన్యం వ్యక్తం కాదు,అవ్యక్తం కాదు,రెండింటికి భిన్నమైనది, ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.

3) కఠోపనిషత్:--ఆత్మ తత్వాన్ని దర్శించినవారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరు.

4) ప్రశ్న ఉపనిషత్:--నామ ,రూప,క్రియలతో నిండిన ఈ సృష్టి స్వచ్ఛమైన పురుషతత్వం నుండి వచ్చింది.గంగా యమునా నదులన్నీ నామరూపాలతో ఉంటాయి.సముద్రంలో కలిసాక నామరూపాలను వదిలేస్తాయి.అలాగే పురుష చైతన్యంతో లీనమయ్యాక ఆ కలయిక ఆత్మగానే,మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది.

5) ముండకోపనిషత్:--నీవు చూసే ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే,అది పరిపూర్ణంగా నీ చైతన్యమే,ఎక్కడ చూచినా,ఏమి చూచినా,నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెప్తుంది.

6) మాండూక్య ఉపనిషత్:-- జాగృద్,స్వప్న,సుషుప్తావస్థ అనే 3 అవస్థలు మానవునికి ఉంటాయి,3 అవస్థలు లేవు,అంతా కలిసి తురియావస్థ లొనే ఉందని తెలుస్తుంది, చూసేవాడు,చూడబడేది,ఇలా రెండు లేవు,రెండూ ఒక్కటే అని చెప్తుంది.

తైత్తరేయ ఉపనిషత్:--మనలో ఉన్న పంచకోశాలు,ఒక్కొక్క పొరలాగా,విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు,అవన్నీ నా స్వరూపాలే అని చెప్తుంది.

8) ఐతరేయ ఉపనిషత్:--ఆత్మను అనేకత్వంగా కాక,ఏకత్వం గా చూడటం నేర్చుకోవాలి,దృష్టి ని ఏకత్వం వైపు మళ్లించాలి,జీవ జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది,ఇదే శాస్త్ర రహస్యం అంటుంది ఐతరేయం.

9) చాంధోగ్య ఉపనిషత్:-- అంతా ఏకత్వమే అని గ్రహించాక,నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని,ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనాని చెప్తుంది,తత్వమసి అని చెప్తుంది చాందోగ్యం.

10) బృహదారణ్యక ఉపనిషత్:--మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు,సాధన అంతరంలో చేయాలని అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం ఈ ఉపనిషత్ చెప్తుంది.

(((())))

No comments:

Post a Comment