01-04-2023 నీతి కథ
తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.
రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది మరియు మృత్యువుకు సవాలు విసిరాడు
"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీత మాత యొక్క సమాచారం ప్రభు" శ్రీరాముడి"కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువు తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది.
మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. ఇది కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.
కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వుతున్నారు!
ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.
అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?
అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడి లో ప్రాణ త్యాగం చేసాదు.
జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.ఇంత తేడా ఎందుకు?
ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనుడుకు ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడి కి
02-04-2023
సూక్ష్మశరీరం 17 అంగాలతో కూడుకొని యున్నది. అవే పంచప్రాణాలు, మనోబుద్ధులు - దశేంద్రియాలు. 19 అని కూడా చెబుతారు. అక్కడ మనోబుద్ధులతో పాటు చిత్తం - అహంకారం చెప్పబడతాయి. ఈ సూక్ష్మశరీరాన్నే లింగశరీరం అంటారు. సూక్ష్మశరీరం కంటికి కనిపించేది కాదు. ఇది పంచీకరణం చెందని పంచమహాభూతాలనుండి ఏర్పడినది. అవే తన్మాత్రలు. అవి సూక్ష్మం గనుక కంటికి కనిపించవు. పంచీకరణం చెందితేనే స్ధూలమవుతాయి. కనుకనే సూక్ష్మభూతాల నుండి ఏర్పడిన సూక్ష్మశరీరం కంటికి కనిపించదు. స్ధూలభూతాల నుండి ఏర్పడిన స్ధూలశరీరం కంటికి కనిపిస్తుంది.
మానవుని యొక్క ప్రవర్తన అంతా ఈ సూక్ష్మశరీరం మీదనే ఆధారపడియుంటుంది. ఈ సూక్ష్మశరీరంలోనే వాసనల సముదాయం ఉండేది. ఆ వాసనలకు అనుగుణంగా స్ధూలశరీరం పనిచేస్తూ ఉంటుంది. జాగ్రదావస్ధలో స్ధూల, సూక్ష్మ శరీరాలు రెండూ చైతన్యవంతమై ఉంటాయి. సూక్ష్మ శరీరం ఇచ్చే ఆజ్ఞను స్ధూలశరీరం అమలు చేస్తూ ఉంటుంది. సూక్ష్మశరీరంలో కలిగిన కోరికలకు, ఆలోచనలకు, సంకల్పాలకు అనుగుణంగా స్ధూలశరీరం అటుఇటు తిరుగుతుంది, తింటుంది, పనిచేస్తుంది, పడుకుంటుంది, చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, పోట్లాడుతుంది..... అన్నీ చేస్తుంది. అదే స్వప్నావస్ధలో అయితే స్ధూలశరీరం ఎరుక ఉండదు. ఒక్క సూక్ష్మశరీరమే చైతన్యవంతమై ఉంటుంది. మనస్సులో అణగద్రొక్కబడ్డ ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు అక్కడ ఒక రూపాన్ని సంతరింపజేసుకొని సంతృప్తి చెందుతూ ఉంటాయి. మనస్సే ప్రపంచాన్ని సృష్టించుకొని, అందులో తనకు ఒక రూపాన్ని సృష్టించుకొని, సుఖదు:ఖాది అనుభవాలు పొందుతూ ఉంటుంది. ఆత్మచైతన్యం జాగ్రదావస్ధలో సూక్ష్మశరీరాన్ని ప్రకాశింపజేసి, తద్వారా స్ధూలశరీరం పనిచేసేటట్లు చేస్తుంది. అదే స్వప్నావస్ధలో కేవలం సూక్ష్మశరీరానికే పరిమితమై స్ధూలశరీరం కదలక మెదలక ఉన్నా అన్ని అనుభవాలు కలుగుతుంటాయి.
--(())--

03-04-2023
తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.
రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది మరియు మృత్యువుకు సవాలు విసిరాడు
"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీత మాత యొక్క సమాచారం ప్రభు" శ్రీరాముడి"కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువు తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది.
మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. ఇది కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.
కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వుతున్నారు!
ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.
అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?
అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడి లో ప్రాణ త్యాగం చేసాదు.
జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.ఇంత తేడా ఎందుకు?
ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనుడుకు ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడి కి అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.
దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.
జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!
ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు .
"నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు ."
"సత్యమేవ జయతే "
.....
05-04-2023 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
💐💐వాస్తు దోషాలను తొలగించే గోరింటాకు మొక్క?!💐💐💐
గోరింటాకు మొక్క వాస్తు దోషాలను తొలగిస్తుందట. గోరింటాకు మొక్క ఇంట్లో వుంటే.. శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గోరింటాకు మొక్క శ్రీ మహాలక్ష్మీదేవి అంశమని పండితులు అంటున్నారు. ఏ ఇంట గోరింటాకు మొక్క వుంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు వుండవు. కారణం గోరింటాకు మొక్కకు వున్న వాసన.
ఈ వాసన కొన్ని రకాల పురుగులను చంపేస్తుంది. గోరింటాకు మొక్కను ఇంట్లో వుంచడం ద్వారా క్షుద్ర శక్తులు కూడా నశిస్తాయని పండితుల వాక్కు. గోరింటాకు మొక్కను ఇంట్లో నాటి శుక్రవారం పూట సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా.. ఆ వాసనకు కంటికి తెలియని క్రిములు తొలగిపోతాయి
దుష్ట శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా గోరింటాకు గింజలతో సాంబ్రాణి ధూపం వేస్తే.. ఆ ఇంట మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
ముఖ్యంగా వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుంది. వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళల్లో వుండేవారు ఇంటి ముందు తులసి మొక్క, గోరింటాకు మొక్కను నాటడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి.
ఇంకా వాస్తు దోషాలను తొలగించుకునేందుకు గోరింటాకు మొక్కను తప్పకుండా నాటాలని.. అలా కుదరకపోతే.. పూల తొట్టెలోనైనా గోరింటాకు మొక్కను పెంచడం మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
కామెంట్స్
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ. దయచేసి సాంతం చదవగలరు ......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో." చిన్నకోడలు పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు. విషయమేంటి? " అని అడిగింది పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది కదా. అప్పట్లో మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము. మనకూ పిల్లలు, సంసారం ఉన్నాయి. మామగారినిఎన్ని రోజులని చూడగలం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంది చిన్నకోడలు. " ఏంటది అడిగింది పెద్దకోడలు.
మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో
చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హయిగా ఉండవచ్చు అనింది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు. మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని చూసుకోవలని వారి ఉద్దేశ్యం.
కానీ రోజూ భార్యల నస భరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు. " నాన్నా! ఈ పిల్లల గొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేక పోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్ని రోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి కొడుకులతో. షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి. ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."
" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం మాత్రమే ఈ ఇల్లు మీకు. పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే పెన్షన్ తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నాడు తండ్రి.
" అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమను కుంటారు? బయటికివెళ్ళి
అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి మేము ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.
నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళి పోయాడు. షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ...... కోడళ్ళకు.
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా
ఆశ్రమాలకు వెళ్లి పోతున్నారు. కానీ ఇలా తిరగబడితే తప్ప గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం, ఆస్తి పాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ శరణాలల్లో ఉంటున్నారు.
తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.
ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదములు ...
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
_*శ్రీ అగ్ని మహా పురాణం - 4 వ అధ్యాయం*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*వరాహాద్యవతార వర్ణనమ్*
*అగ్ని దేవడు పలికెను పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను. యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను
హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను. విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను. పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.
విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను. బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.
దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.
ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.
కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను. అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.
కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను. పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను. *ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.*
*🌸కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.🌸
No comments:
Post a Comment