[నేటి పద్యాలు।। పరిమళాలు।।నవరత్నాలు
26/01, 08:58] మల్లాప్రగడ రామకృష్ణ:
ఒజ్జ, వెజ్జు, బొజ్జ, గుజ్జు - పదాలతో
ఒజ్జ బోధించు విద్యను ఓర్పు చూపి
వెజ్జు రోగము నకు మందు విద్య చూపి
బొజ్జ లోతిన్న తిండియు తోను చాపి
గుజ్జు మామిడి తాండ్రయు గుణము చూపి
సజ్జనులు కోరె గణనాయ కునిని నేడు ఈశ్వరా
దత్తపది : కూర, నార, కార, చార - యువశక్తిని గూర్చి
జయము చేకూర సహనమే జూపు యువత
భయము వినినా రణము తెచ్చె భాగ్య యువత
దయతొ కారపు పొడియేను దంచె యువత
హయము పైన సంచారము హాని యువత
యువతయే తల్లి తండ్రుల యూత మయ్యె ఈశ్వరా
దత్తపది।।।।।। కులము, మతము , ప్రాంతము , దేశము
కులము ఏదైన రక్తము యుండు ఎఱుపు
మతము ఏదైన సత్యమే మార్గ మెఱుపు
ప్రాంతమున నీరు వెళుతురు ప్రాంత మెఱుపు
దేశము న నీతి న్యాయము దైవ మెఱుపు
నిజము గణతంత్ర వెలుగులు దేశ మెఱుపు ఈశ్వరా
దత్తపది।।వారము, నరము,కరము ,తరము
రావణ వరముపొందియు శక్తి రాశి పెరిగె
వానరము వచ్చి తెలివితో వాద మోసగె
వినయ కరము ప్రాంజలి తోను విధిగ నొసగె
శంకర తరము దీక్ష గా సాక్షి ఒసగె
- నేటి సందేశ వాక్యం
ప్రజల అజరామర దేశ భక్తి?
నిల్పింది విశ్వంలో భారత కీర్తి
ప్రజలలొ నిజాయితీ దయ ప్రధమ భక్తి
ప్రకృతి తో ప్రతిభ గుణము ప్రధమ యుక్తి
ప్రగతి తెలిపింది విశ్వంలొ ప్రేమ శక్తి
స్నేహ భావ భారత దేశ సేతు కీర్తి
సర్వ రక్షగా అజరామరమ్ము గాను ఈశ్వరా
హారమును గాని హార కుహరము నీడ
దర్పణము కాని దర్పణం ధనము నీడ
గరము గాని గరముయె ఉంగరము నీడ
తరము గాని తరమునిరం తరము నీడ
ఉరము కదలికలు మనసు ఉరక నీడ ఈశ్వరా
కంద పద్యం
కమ్మని పిలుపుకు వచ్చిన
అమ్మను చూచి సంతోషమును తెలిపగన్
చెమ్మగిల్లాయి కళ్ళు యె
గుమ్మములో నున్న ముద్దు గుమ్మ ను గాంచెన్
దత్త పది।। చేప, కప్పు,పంది,కడి
నీటిలో చేప బ్రతుకు టే నేస్త మైన
కప్ప గుంతలు సంబరం కలలు తీర్చె
కోడి కూతకు పందియే కోరు కోరు
అంటు వీధిన తిరిగెను ఆశ పెంట
సందేశ వాక్యం
నేను మిణుగురు ను
సర్దకుపోయే గుణము వుంటే వెలుగు గా
సధ్భావ పద్యము
సమయ సంతృప్తి నిత్యమూ సహన మయ్యె
వినయ పూర్వకంగా పల్కు విధిగి అయ్యె
గ్రుడ్డి వాని బత్కు పగలు గ్రుడ్డి అయ్యె
చిన్న దీపము మిణుగురు వెల్గు అయ్యె
జీవ కారుణ్య బంధమే జాతి వెలుగు ఈశ్వరా
*****
ప్రాంజలి ప్రభ - 26-01-2022- పద్యాలు - నవరత్నాలు
ఆటవెలఁది /తేటగీత / పధ్యాలు
తేట జలము చాల తీపి ఉండ దగును
ప్రాణమమ్ము రక్ష-గాజలములు
మీట గలను వీణ మేటి మాట వలన
మానసమ్ము రక్ష - గావలయును
కాల మాయ మాకు కానరావ్ కళ్ళుయే ఈశ్వరా
తేట తెలుగు మాట తేజ రిల్లు కనుక
హృదయమ్ము రక్ష - గావలయును
ఆట వలన తృప్తి దేహ మంత కదులు
రక్త మంత వేడి - గామెరియును
రక్త సిక్తమైన రాజ్యమునందునే ఈశ్వరా
ప్రాణ తపన కొంత ప్రేమ యంత కదులు
ప్రేమ వళ్ళ జీవి - గాకదులును
మాట పలుకు మంచి భావ సొంత మగును
సత్య మంత తెల్సు - కోకలిగెను
ప్రాణ రక్ష గాను ప్రతిభ యే చూపెను ఈశ్వరా
చలిగిలి తలపు స్పష్టత చెలి పిలుపు లు
మల్లెలు కురిసి చల్లనివె సొగసిరులు
మెల్లగానుండు కౌగిలి మగసిరిలెలు
ఓలహరి కనులు తెరిచి ఓర్పు కళలు
నీ మనసు నాది వయసులో వలపు లేలు ఈశ్వరా
సందేశ వాక్యం
సుడిగాలి వీచింది, కడలి ఏడ్చింది
గంగపుత్రులు వేటకు వెల్లారని
సందర్భోచిత పద్యం
నిత్య వృత్తి యే కడలిలో నియమ గమన
పకృతి సుడిగాలి వీచింది పుడమి గమన
గంగ పుత్రుల వేట యే గాలి గమన
కష్ట జీవి ప్రయాణము కడలి గమన
గగన మాయ కడుపు కోత మానవులకు ఈశ్వరా
గెలుపు కోరుతంత్రము ఆశ గొప్ప మాయె
గెలిచి జనులమేలు మదిలో గొప్ప మాయె
పలుకు జగదంబ తత్వము పాటమాయె
హృదయ తత్వమే మనిషిలో హృద్య మాయె
నీరు మంట వాయువు భూమి నిలయు మాయె ఈశ్వరా
సీత చైతన్య గానము కృప కొరకుయె
స్త్రీ లు ఆనంద బాష్పాలు స్వీయమాయె
దర్శనతొఅంధత్వముపోవు దరయు మాయె
చూపులు నిలిపాము మనసు చూపు మాయ
శక్తితో ప్రణమిల్లి యే సేవ భక్తి శ్రీరామ
లేని వానికి ధైర్యము లాశ్య మగుటె
ఉన్న వాడికి ధనముయే ఊపిరగుటె
ఆమె వుందన్న ధీమాయె ఆత్ర మగుటె
ఆమె లేదని ధీమాయే ఆశ యగుటె
ఉన్న లేని బ్రతుకు మాయ ఊతమగుటె ఈశ్వరా
భయము గాని భయమువల్ల దాయు మనసు
కులము గాని కులము వల్ల కుచె మనసు
కుచము ఆశతో ప్రేమతో కులుకు మనసు
కుముద వదనమే దెలిపియు కురియు మనసు
కురుచ పెర్గియు సంతసం కళ్ళ మనసు ఈశ్వరా
--((())--
ప్రాంజలి ప్రభ - పద్యాలు పరిమళాలు - నవరత్నాలు
[24/01, 08:07] మల్లాప్రగడ రామకృష్ణ:
జ్ఞానశక్తుల ప్రేమల మానసమ్ము
జ్ఞాన ఓరిమి కూరిమి భావనమ్ము
జ్ఞాన పు వెలుగు కళలన్ని ప్రేరణమ్ము
జ్ఞాన చరితల మాన్యమై జీవితమ్ము
జ్ఞాన గీతిక జయజయ ధ్వనులు కమ్మె ఈశ్వరా
మనన శీల నిధుల ధ్యాస మనసు చోర
పలుకులోప్రతి పదము మాధవుని చోర
ధవళ పావన వెలుగైన ధరణి చోర
దివ్య పరిధి ఆనందము దివ్య చోర
జీవితకళలు వెలయుంచె జీవ చోర ఈశ్వరా
నిస్తాక్షరి...అ బి.షే కం
పద్య పాదాదిన వచ్చుట
అద్భుతంగా ను జీవితం అంతరాత్మ
భిన్న మైనది జీవితం భిక్షకాత్మ
షేక మవుటయే జీవితం ఏక మాత్మ
కందిరీగ ల జీవితం కమ్ము ఆత్మ
లింగభేధములేనట్టి లలిత ఆత్మ ఈశ్వరా
: ఎర్రనిది రక్త తర్పణం ఏదొ విధియె
ఎర్రజెండాప్రమాదాన్ని ఎదకు విధియె
ఎర్ర నికుసుమాలు పడతి యెదకు విధియె
ఎర్రజెండా తొ రాలు ఆపె దియు విధియె
ఎర్ర ఎర్రని చీరలో ఎదను చూపె ఈశ్వరా
వెలుతురు అనేది లేదులే వేగ జగతి
మనిషి లోన చీకటి లేదు మనసు జగతి
అంధత్వం దైవ మునలేదు ఆశ జగతి
దృష్టి యేలేదు మరిచినా ధర్మ జగతి
కళ్ళు ఉన్న అజ్నానము కళల జగతి ఈశ్వరా
నిత్య అరుణోదయంనయనకమలమ్మె
కనులు తెరిచెమనోహర కళ్ళ చెమ్మె
వర్ణ కిరణాల మాలలు వరుస కమ్మె
మనసు సంతృప్తి పరచడం మంత నమ్మె
గువ్వలన్ని కిలకిలలే గురువు వెలుగు ఈశ్వరా
మృత్యువు ను తర్మె గోవింద నామ మేను
విశ్వ జగతిన వెలుగులు నింపె మేను
అద్భుత అవకాశాల నే అమలు మేను
వేంకటేశ్వర నామము వేద మేను
సర్వ రక్షణ కవచమై సమయ మేను ఈశ్వరా
కృష్ణ సర్పము రాధనే కాటు వేసె
శ్యామ సుందర స్పర్శకే రాధ లేచె
రాధలోదర హాసము రమ్య పరిచె
అశ్రు ధారలు పాదాలు తాకె చెంతె
కృష్ణ విరహాన్ని భరించ లేక నుండె ఈశ్వరా
ఒదిగి పో నాలొ హృదయమై ఓర్పు తోడు
స్పందనలతోను కలసియే స్వల్ప తోడు
ఇరువురము ఏక మవ్వుటే యిలలొ తోడు
బంధ మనునదే జీవితం భ్రమల తోడు
శబ్దము ఒకటే కామ్యము స్థాన తోడు ఈశ్వరా
సహజ ప్రేమఓరవడియే సహన మార్గ
మానవ నవజ్యోతులయేను మార్గ ఘనత
వనితల సఫలతల ఘన భావ శుద్ధి
పలుకుల సిరి మూలములలో భావశుద్ధి
విరిహరి హరవిలాస విరచిత సృజన
ఏకతలు వెలసి మురిసి తరుణ సృజన
తరతమ మెరుగని తరులు వినయ సృజన
జగతి మోదముకుంద మగుటయె సృజన
*****
వేసే ప్రతి అడుగు ప్రగతి వైపు
గడిపే ప్రతి ఘడియ ప్రణతి వైపు
పలికే ప్రతి పలుకు ప్రతిభ వైపు
చేసే ప్రతి చెర్య ప్రముఖ వైపు
ఆలోచన అనే ఆయుధంతో సమస్య పరిష్కారం
బాధ్యతల బరువు మోతల్లో భద్రత శ్రేయస్కరం
ఎదగాలనే ఎదురు చూపుల్లో ప్రేమ ప్రోత్సాహం
ఊపిరి పిలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహం
..
అబ్బురమాయె చూడుడది యాకసమందున వర్షధారలన్
దబ్బున భూమిపైగురియ దల్చుచు నంతట జేరియుండగా
నిబ్బరమేల యంచచట నిష్ఠులవేగముతోడ నెట్టె యా....
మబ్బులచాటునుండి రవి మంటల జీవుల మాడ్చె మైత్రితో!!
ఆఖరి పాదము సమస్య...
3-దత్తపది:....
అంశము ముద్ర నాలుగు పాదాలలో స్వార్థ త్యాగంతో.....రామపట్టాభి షేక వర్ణనం..
రాముడు రాజ్యభారమున రాజిల తాము ద్రవించ చిత్తముల్
దామము ద్రవ్యరాశియును తత్పురవాసులు దెచ్చి రాయడన్
రామయటన్న నామమున రమ్య ప్రసారముద్రావుచున్ మహత్
క్షేమము ద్రచ్చ దేశమున జేర్చిరి పర్వపు శోభనచ్చటన్ !!
5-న్యస్తాక్షరి:
అంశము: శివస్తుతి...యతి స్థానం10అక్షరంగా నా.రా.య.ణ....
నమ్మకమేనులే నటన నాట్యము చేసెను నాగభూషణమ్
రమ్మని కోర్కలే మనసు రాగము పల్కెను పన్నగేశ్వరన్
యమ్మను గొల్చెదా యనుట యత్నము జేసెదఁ చంద్రశేఖరన్
నమ్ముచు నాదు మాటను గణంబుల బంధువుల గావనో శివా
త్యాగరాజు ఉత్సవాలు సందర్భము గా ప్రాంజలిప్రభ ఆరాధన పద్యాలు...22-01--2022
రచయిత. మల్లాప్రగడ రామకృష్ణ
రామా నె నిన్నె కోరితి నేను రాత్రియు పగలనూ దేనికో
రామా నె నమ్మి చేరితి నాకు రవ్వల వెలుగునూ పంచుమా
రామా నె కోరె సుఖము నీ పాద సేవలు నిత్యమూ ఉంచుమూ
రామా నె పల్కు రామమే నిత్య సత్యమై భక్తితో తెల్పెదా
అమ్మ సీతమ్మ చూడుము బ్రతుకు ఆశల వెంటయే కదెలెనే
అమ్మ సీతమ్మ తెలుపుము జీవ ఆరాట పోరాట కధలనే
అమ్మ సీతమ్మ వినవలె కష్ట ఆర్భాట నిజమనే బ్రతుకునే
అమ్మ సీతమ్మ పలుకుమా చేయు తప్పుల్ని నడకల్ని తెలుపుమా
శుక్రవారపుదినశుభమునిచ్చు లక్ష్మి యే లోకాన్కి వెల్గుగా
చక్రపాణితోడ శయనమ్ము గాను భక్తుల హృదయంలొ శక్తిగా
సక్రమమే శాంతి సౌభాగ్య మగును సంపద నిచ్చేటి యుక్తిగా
ప్రకృతి తో కలిసి విజయము నిచ్చి ప్రతిభను ప్రగతికి ముక్తిగా
కవిత లా సాగు జీవితం నిత్య కళల తో ఆశ్చర్య దినాలుగా
తెలివి గా సాగు నాటకం బ్రతుకు పువ్వులా పరిమళం ఆశగా
కలలు గా సాగు మానసం విలువ ముళ్ళు లా గుచ్చేను బ్రత్కులో
సమయాన్ని బట్టి భక్తినే నమ్మి సేవలు తియ్యని తేనెలాగ
3
ప్రాంజలి ప్రభ.. పద్య పరిమళాలు.. నవరత్నాలు.8
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ
ఎవరు ఏది అన్న విషయం యదను తాకు
గుండె గాజు లాంటిది గీత గుర్తు చేయ
బింబ ప్రతిబింబ మనునది బిక్కు బిక్కు
ఎప్పుడూ ఎవ రెవరైన ఏదొ చెప్పు
దత్తపది........ బీరువ, టేబులు, కుర్చి, బెంచీ
మనసు యేబీరు వగుటయే మహిమ లాగ
బ్రతుకు లోన వేటేయగు బ్రతక లేక
వాలు కుర్చీలో పడకయే వాట మగుట
బెంచి పై పడక యె హాయిగా బడయు నిద్ర
సందేశ వాక్యం
సంఘం పెట్టడం వ్యూహమే కావచ్చు
సంఘటితం అవ్వడం చైతన్యం !
సద్భావన పద్యం
సంఘటిత శక్తి అవసరం సమయ మగుట
నిత్య సంఘమే చేయూత నియమ మగుట
విశ్వ భావ చైతన్యం మె విజయ మగుట
ప్యూహమే జీవితానికి పువ్వు వగుట
మనిషి అవ్వడం పెట్టడం మనసు యగుట ఈశ్వరా
సందేశ వాక్యం
డబ్బుంటే జనం తలుస్తారు
లేకుంటే జనం మరచి పోతారు
సద్భావన పద్యం
తమను తాము గా చేరారు ధనము వున్న
ధనము లేదంటే మనుషులే దారి మరిచె
బ్రతుకు తెరువు యే విధముగ బడయు ధనము
జనులు ఆశకు చిక్కుట జాడ్య మగుట
పాట మనసులో ఆహ్లాద పరచు చుండు
దృశ్య మాలిక కళ్ళలో దరువు వేయు
ఊహ లన్నియు రెక్కలై ఊరు దాటు
ఇంద్రియములు మధురమౌను ఈప్సి తమ్ము
స్వప్న ములు నిద్ర రానీ క సరయుచుండు
మెరుపు ఆలోచనలు మారు మొహమెత్తి
వింతలు విశేషములు వుండు వివరముగును
తట్టి లేపును హృదయాన్ని తపన వల్ల
రాతలు విధాత వ్రాసిన రాత మారు
చెమట చుక్కలు జీవాలు చేరు వగును
అగ్ని సంద్రాన్ని తాకదు ఆవిరగును
అలజడులు అర్ధ మవ్వక ఆడు కొనును
చంద్రనిగని కలువ విచ్చె చపల బుధ్ధి
మాటలు విని కవిత విచ్చె మనసు బుద్ధి
సూర్యుని గని కమల విచ్చె సూర్య బుధ్ధి
మమత లుగని మగువ వచ్చె మహిమ బుధ్ధి
అంబరం పుడమిని తాక వలెనని యును
చినుకులతొ రాయ బారము చేయు చుండు
ప్రేమను తెలియ పరుచుచూనె పగలు రాత్రి
పిడుగలుగఁ వచ్చి వేడెక్కి పిదప జారు
--***----
ఈనాటి పద్యాలు - పరిమళాలు - నవరత్నాలు
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ , ప్రాంజలి ప్రభ
ఆకలి తొ పొట్ట అరుపులు ఆశ విలువ
ఒంటరి తనమే బంధమై ఓర్పు విలువ
జారి పొయ్యాక సమయము జూపు విలువ
చేతిలో ధనముయె లెక చెప్పు విలువ
మనిషి జీవితంలో జర్గు మాయ విలువ ఈశ్వరా
నీరు మరిగే ను కల్ముషం నీడ లాగ
కట్టె కాలేను ప్రకృతి గా కాల మేగ
పండు రాలును తీర్పుగా పయన మేగ
నీటి బుడగలాంటి మనిషి పెట్టెను సెగ
మాయ పొరలతో దేహము మనుగడయెగ ఈశ్వరా
నాయకుల వెంట పడుట యే నయన ఓర్పు
డేగ కాకిని ఎత్తుగా దౌడు నేర్పు
ప్రాణ వాయువు సరఫరా ప్రధమ తీర్పు
శక్తి యుక్తులే ప్రాణాలు సమయ కూర్పు
కాకులవలేను సమయము కాలమయెను ఈశ్వరా
ప్రకృతి పని చేయు వివరాలు పదును పెట్టె
ప్రకృతి కి వశమై ఓడుటే పగ లు పెట్టె
ప్రకృతిని గెలవాలి ఓర్పు పట్టు పట్టె
ప్రకృతియే సాధకుని ప్రీతి పలుకు బుట్టె
ప్రకృతి సత్యాను భూతియే ప్రేమ పెంచె ఈశ్వరా
రుచి మరిగిన మనసులో నె రూప ముండె
శుచి యెరిగినాక మనసు శుబ్ర ముండె
అదుపులోనే మనసు గాను ఆత్ర ముండె
మనసు కదిలించి విదిలించి మాయ గుండె
మదన తాపమే జీవిలో మనసు గుండె ఈశ్వరా
మానసిక మైన శక్తితో మాన ముండె
నైతిక విలువ యుక్తితో నటన గుండె
పార ధర్మం తొ రక్తి తో పాల గుండె
వ్యక్తి బాధ్యత తో బ్రత్కు వ్యాధి గుండె
భావనా వృద్ధి తో మాన వాభ్యు దయతొ ఈశ్వరా
న్యస్తాక్షరి......... తా ళ ప త్ర0
ఈ అక్షరాలు పాదాదిన రావాలి
ఆటవెలది
తాప బుద్ధి తోను తాపత్రయము చూపె
ళలన చూపు ఊపు లాస్య మగుట
పగలు రేయి అనక పబ్బము గడుచును
త్రంతు అంత బ్రతుకు తంత్రము ధర్మము
*****
సందేశ వాక్యం
ఎంత దూరమైనా వెళ్ళటం సాహసం
ఎంత దూరం వెళ్ళాలో నిర్ణయం వివేకం
దూరమేదైన ధైర్యము తూర్పు వైపు
నిత్య సాహస జీవనం నగ్న నీతి
నిర్ణయం వివేక మయితే నిన్ను నిలుపు
సాహసం వివేకం మన సాదు బుధ్ధి
++++
కడలి లోతును కనుగొన గలగ వచ్చు
అలల ఒరవడి అదునుగా ఆప వచ్చు
తొంగి చూడగలవు మరో తోడు వచ్చు
మగువ మనసు అర్ధము కాదు మమత నిచ్చు
బ్రతుకు పైతీపి మానియు బడయ వచ్చు ఈశ్వరా
0 Com
ప్రాంజలిప్రభ.. పద్యాలు.. పరిమళాలు... నవరత్నాలు.
" దీనార్తకల్పవృక్షాభం ,
ఆశ్రిత జనబాంధవమ్..
శ్రీభూదేవీప్రసేవ్యంతం ,
వేంకటేశం భజామ్యహమ్ !!!
"శ్రీకళ్యాణీం భువనజననీందైత్యహంత్రీంమృడానీం ,
శ్రీకౌమారీంబుధమునినుతాం రాజరాజేశ్వరీం , తామ్..
శ్రీకైలాసాధినిలయభవానీం దయాంభోధిపూర్ణాం ,
శ్రీకామేశీంపరమపదదాత్రీంభజామస్సదైవ !!!
--
జన్మకు పూర్వం సత్యంతో కూడిన ఎంపిక
జన్మకు తర్వాత అజ్ఞానంతో కూడిన ఎంపిక
ధ్యానము పూర్వం సత్యంతో కూడిన ఎంపిక
ప్రార్ధన తర్వాత అజ్ఞానం తో కూడిన ఎంపిక
జ్ఞానం అజ్ఞానం ఆశతో కూడిన ఎంపిక ఈశ్వరా
ధ్యాన పరిచయం ద్వారా 'జ్ఞాన' ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. ('దిగి' వచ్చిన మనం 'ఎదిగి' వెళ్ళాలి.)
ఆంజనేయుని కొలువు ము ఆది నుండి
ఆత్మ సాక్షిగా ప్రార్ధించు అంత మంచె
ధైర్య ము బలము పెర్గును ధరణి యందు
రామదూత ఆరాధించు రమ్య మగుటె
భక్తుల విజయం పరమాత్మ భాగ్య మగుటె
స్వాగతం సు స్వాగతము గా సభ్యు లగటె
స్వానుభవముతో ఉండిన సాధు వగుటె
కృష్ణ ప్రేమవిజయమగు కృపయె మనకు
అక్షర సమరం ఆయుధం అగ్ని వెలుగు
పుస్తకము సాధన సమయం పుడమి వెలుగు
నిత్య విజ్ణాన లక్ష్యంతొ నిజము వెలుగు
మన మనసు యేను గమనమ్ము మర్మ మెలుగు
పలుకులో విలువ గమనించి నీవు పలకడం నేర్చుకో
తప్పుల విలువ ఒప్పాక తెలిసి ధైర్యము పెంచుకో
ఆశకు విలువ అధికారి వెంట ఆత్రమే తెల్సుకో
మనిషిలో విలువ లోపాన్ని చూపె గుణము యే మానుకో
వచ్చిన విలువ అవకాశ మెంట మెరుపులా చూపకో
పధకాల విలువ తెలిసియే ముందు ప్ధధమమై చూసుకో
జనులలో విలువ లేదని అనకు జవసత్వ ప్రశ్న కో
ఆయుధ మేను భయమునే మార్చు ధైర్యము తెచ్చుకో
కర్తవ్య ముగను యుద్ధమే చేయి కార్యము నిల్పుకో
ఉందిరా మనసు జయముకే కాలమందునా మేలుకో
వద్దురా ఆశ ఉంచరా ఓర్పు ఒప్పుటే నేర్చుకో
గాంచరా కలను జీవితం విజయ కాంక్షయే తెల్సుకో
హృదయము తోను నిర్మలమేను హాయిగా కల్సుకో
0 Com
"ప్రాంజలి ప్రభ.. పద్యాలు.. పరిమళాలు..నవరత్నాలు (7)
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
శ్రీగౌరీమానసలసితధామం శివంసుందరేశం ,
శ్రీగాంభీర్యాకృతి పరమసేవ్యంమురార్యాత్మపూర్ణమ్..
శ్రీ గీర్వాణాంచితవరబుధపూజ్యంచిదానందరూపం ,
శ్రీ గౌరీశంసతతమనుభక్త్యా నమామస్సదైవ !!!
--
మనిషి ఆశకు బానిస మధురమేన
దొరికినవి పొంది ఇంకాస్త దోరగా ను
బాధ పడినను పట్టించ కోక యుండు
పెద్ద దురదృష్టమేనని ప్రేమ ఏది
సమస్యను పూరించండి....
సతి సతి గలియంగ పుత్ర సంతతి గలిగెన్
మాత్రాబద్దం
కలియుగ సుఖభందమేను శాంతికి తిరిగెన్
వినిమయ సహవాసమేను నీతిల కరిగెనన్
సతి సతి గలియంగ పుత్ర సంతతి గలిగెన్
చిటపట చినుకంత చేరి సంద్రము కలియున్
కుత్రిమము అనుభందమేను పుట్టుక పెరిగెన్
****
సందేశ్ వ్యాక్యం
అబద్దానికి అభిమానులు మెండు
నిజాయితికి శత్రువులు మెండు
సందర్భ పద్యం
బద్దక అబద్దాలతొ జీవి బడయు చుండు
మాన అభిమాన మంతయూ మాయ మెండు
నీతిలో నిజాయితి ఉన్న నిక్కు మెండు
శత్రువులు మెండు జయముకు శాప మిచ్చు
****
రాజ కీయ ప్రచారము రాజి పడును
ధనము చుట్టు కాంక్షల తో ను దరియు జేరు
వావి వరుసలు రాజీకి వాదనగుటె
కాలమును బట్టి నడిచేటి రాజ్య మేలు
దేశ హితము కోరియు రాజ్య చెలిమి ఈశ్వరా
నాటకాలనేవి మనసు నమ్మ పలుకు
మకిలి మాటలలో అర్ధ మవుట కులుకు
విప్ర జాతి కోరిన రద్దు విజయ మేల
నాటక మణిచింతిమణి నిజము తెల్పు
నటన మాత్రమే అదియేను నిజము ఏనె ఈశ్వరా
వీరు డెవరైన నిజమైన ప్రేమ పంచు
ధ్యాస ఒక్కటి సన్యాసి దారి నెంచు
బాధ్యతలు వున్న ధ్యానము బంధ మెంచు
నిన్ను నిన్ను గా నెంచియే నిజము పంచు
స్ఫూర్తి గా భగవంతుని సేవ చేసె ఈశ్వరా
తనివి తీరదు నీ రూపు తపన పెంచె
నాది అనిపించు నీస్పర్శ నటన పెంచె
అర్ధమేకాని మనబంధ మంత పెంచె
నన్ను వీడని జ్ణాపకం నన్ను పెంచె
సమయ మనసు ఆలోచనా స్పర్శ పెంచె కృష్ణా
సీస పద్యము
సూర్యబింబముగ నే .. శాస్రము గాబొట్టు
పొడుగాటి జడతోను.. పొట్టి వనిత
మల్లె పూలతొ కొప్పు .. మానసమ్మే తెల్పు
కనులకు కాటుక... కళ్ళు పిలుపు
ఉల్లి పొరల చీర ... ఊహలందనిదిగా
మెరుపు ల రైకతో... మనసు పిలుపు
ముక్కుకు ముక్కెర... ముద్దుగా బంధమై
చెంగు చెంగు మనుచూ .. చేతులూపె
మంగి వన్నెల ముద్దుగా మనసు పంచు
రెవిక కదలికలన్నియు రెపరెపలు గ
పవిట జార్చియు ఎగదోసి పకపకలుగ
పడుచు పిల్ల అందము ఎంత పట్టు అనకు
***""""*""
0
ప్రాంజలి ప్రభ.. పద్యాలు పరిమళాలు.. నవరత్నాలు..5
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ
జనులు సరిహద్దు వద్దనూ జాడ్య భాష
మురికి వాడల్లో బ్రతుకుల మూర్చ భాష
పగటి వేళ నగరము లో ప్రతిభ భాష
వార్త మానప్రకృతి లోన వాడు భాష
ఎండిపోయిన పొలములో ఏడ్పు భాష
మాడి పోయిన మనసులో మనిషి భాష
మధ్య మత్తులో వాగేటి మాయ భాష
ఆడ దానికి లొంగియే ఆట భాష
ఏమి టదిఏమి ఆకాశ ఎల్లలుగను
అద్భుతముగా ను కాంతి యు అంబరమ్ము
గిరులు వెల్లువై కిరణాల గుండ్రముగను
చిత్ర జ్యోతి మాలిక శోభ చిత్త మందు
పైరు పచ్చా పచ్చనిదిగా పైకి వెలుగు
నవ్వుల పసిపాపతొ ఇంట నటన వెలుగు
రైతు పరవశం కంకులే రవ్వ వెలుగు
కెవ్వు మని అర్చినా ఫలం కెవ్వు వెలుగు
రామచిలుక ప్రేమ మనసు రాత్రి పగలు ఈశ్వరా
తాపముయె తీర్చు సమయము తపన వెలుగు
ళిపియె వ్రాసెబ్రహ్మ మనకు లీల వెలుగు
బొట్టు గాజులు కాటుక బేల వెలుగు
ట్టుటులె చెంప చెంప లముద్దు తూర్పు వెలుగు
హాయి చిరు నవ్వు గలిగేను హాయి వెలుగు ఈశ్వరా
దేహ తృప్తి ని ఇచ్చినా దేవతనవు
మనసు లేదని అనుటయే మగని నిగ్గు
కుత్రిమ ప్రేమ ఎందుకు కుల్కు లందు
నీకు నైవేద్య మయినను నీకు తోడు
నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా నివాళులు,ప్రాంజలి ప్రభ
నటన ఏలేటి పురుషుడు నంద మూరి
నటన నయనాలు తిప్పుతూ నాట్య ప్రతిభ
మర్చి పోలేదు అభిమాన మానసమ్ము
కలియుగానకృష్ణుడుగాను కళలు చూపె
నాటక నవల జీవితం నన్ను మార్చు
నవల పఠనము సుఖదుఃఖ నయన తార
కదిలె కాగితం అనుభవం కళ్ళు తీర్పు
కొత్త మలుపు లు కష్టాలు కోలు కొనుట
ఆటవెలది
నోరు లేని జీవి నమ్మకం కల్పించు
కళ్ళు తెరవని పసి కూన విరుపు
ముక్కు పచ్చ లారె మునివర్య దీవెన
వయసుడిగిన వారు వచ్చుచూ మెరుపులు
0 Com
ప్రాంజలి ప్రభ ... పద్యాలు పరిమళాలు..నవరత్నాలు (4)
రచయిత..మల్లాప్రగడ రామకృష్ణ
అద్భుతముగా ను ఉండుటే ఆశ ప్రేమ
జీవితమనేది కళలతో జీవి ప్రేమ
తపనతోను సంకల్ప మే తోడు ప్రేమ
ఆత్మ విశ్వాస ము పరీక్ష ఆట ప్రేమ
స్థాయి ఏదైన ఎదుగు టే సహజ ప్రేమ ఈశ్వరా
పల్లె తల్లి అందమ్ముగా పుడమి తృప్తి
వరి మల్ల చందమ్ముగా వెలయు తృప్తి
స్వచ్ఛమైనట్టి చిరునవ్వె సరయు తృప్తి
పల్లెటూరిలో అరవింద ప్రగతి తృప్తి .
తృప్తి లోన అర్ధముయేను తెల్వ లేను ఈశ్వరా
పచ్చ కోకను చుట్టియే పుడమి తృప్తి
పుత్తడి మెరుపు అంచుతో పురము తృప్తి
పృథ్వి మాత మెరిసిపోయె ప్రతిభ తృప్తి
నిత్యమూ వసంతుడు కోరు నిజము తృప్తి
ఎవరి పని వారు చేయుటే ఎదకు తృప్తి ఈశ్వరా
కల్మషం లేని హృదయంతొ కామ్య తృప్తి
దారి పొడుగునా ధాన్యము ధనము తృప్తి
ఇంటి ఇల్లాలు శృంగార ఇష్ట తుప్తి
చెరువు లోజలకాలాట చలన తృప్తి ..
కల్సి బ్రతుకుట అనునది కాపురమ్ము ఈశ్వరా
దృశ్య కమనీయ రమణీయ దండు తృప్తి
కావ్య పఠనమై ఆనంద కరుణ తృప్తి
మనసు పరవశించి మహిమ మేను తృప్తి
పాట ఆటలతో తేలు పడచు తృప్తి
దృశ్య సంఘటనలు హాయి తలపు తెలుపు ఈశ్వరా
కుంచె తో చిత్రకారుడి కులుకు తృప్తి
ప్రకృతి నీడలో చిత్రాలు పలుకు తృప్తి
సుందర దరహాసము చూపు సుమతి తృప్తి
నేత్ర ములు కలయిక తృప్తి నిత్య తృప్తి
సుందరస్వప్న ములు చూపు శుక్ర నీటి ఈశ్వరా
పైరు పసిపాపలా నవ్వె ప్రగతి తృప్తి
తండ్రి పరవశం చెందేను తనయ తృప్తి
తల్లి మునివేళ్ళతో తాకి తనయ తృప్తి
బిడ్డల ను చూసి మురిసేటి బిడియ తృప్తి
తల్లి తండ్రులు బిడ్డలు తడిసె తృప్తి ఈశ్వరా
నాట్లు ఏపుగా పెరిగితే నాట్య తృప్తి
పంట కన్నీళ్లతో నుగా పెంచె తృప్తి
పరువు ఎరువుగా వాడియు పేరు తృప్తి
చెమట తో తడి కృషితోను చేను తృప్తి
నిత్యా కృషితోను అన్నము నీడ తృప్తి ఈశ్వరా
నిత్య సత్యమే జయము కు నీడ కాదుు
నిత్య ఫథ్యము ఆరోగ్య నీడ కాదు
దైవ నిర్ణయం సత్యమే ధరణి యందు
దైవమంటూ పథ్యము చేస్తె ధనము రాదు
తృప్తిలోనేఉంది సహజ తీపి చేదు ఈశ్వరా
___***___
0
ప్రాంజలి ప్రభ ... పద్యాలు పరిమళాలు..నవరత్నాలు (3)
రచయిత..మల్లాప్రగడ రామకృష్ణ
దత్తపది.......... బొంత, దుప్పటి, పరుపు, దిండు
కళలు బొంతలా నలిగేను కాన రాక
ఆవిరిని పీల్చె దుప్పటి కప్పు కొనియు
నిద్ర సుఖముగాను పరుపు నిజము ఏను
పరుపు దిండు యు పాన్పుపై పడకకు కళ
"శ్రీగౌరీమానసలసితధామం శివంసుందరేశం ,
శ్రీగాంభీర్యాకృతి పరమసేవ్యంమురార్యాత్మపూర్ణమ్..
శ్రీ గీర్వాణాంచితవరబుధపూజ్యంచిదానందరూపం ,
శ్రీ గౌరీశంసతతమనుభక్త్యా నమామస్సదైవ !!!
లోకంలో ఉండెది బ్రతుకు ఆటైన మాటైన పందెం
మైకంలో మాటల బ్రతుకు మంచైన చెడ్డైన చందం
శోకంలో ఏడ్పుల బ్రతుకు చూసైన చచ్చైన వాదం
తూకంలో తప్పుల బ్రతుకు ఆసైన వీలైన ఘంధం
ఆధారం UUU UII III UUI UUI UU
సందేశ వాక్యం
ఎవడికి కావాలయ్యా మీడియా లొల్లి ?
అంబానీ ఇల్లు ! సమంతా విడాకులు !!
సందర్భోచిత పద్యం
ధనము చుట్టుతిరిగె వార్త ధరణి యందు
అర్ధము యె లేని సంఘము మాటలందు
వ్యర్ధ సంభాషణలతోను విజయ మందు
జనుల ఇష్టము గమనించి జేయు వార్త
నేడు నాడును నాడును నేడు మనకు
రాడు అనటయూ వచ్ఛేను రిపుడు మనకు
వోడి గెలుచుటే జనలలో ఓటమగుటె
జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె
అలలు ఆగవూ స్నానము అలలు బట్టి
నిత్య జీవితంలో ప్రశ్న నిన్ను బట్టి
బ్రతుకు సుడిగుండ మనకుమా ప్రేమ బట్టి
దైవ పూజయే నిలకడ దైవ బట్టి
పంచపది కవనములు
తనువు పుండగా స్వర్గమై తీపి పంచె
తానొక పడక తృప్తిగా తాప ముంచె
మనసు పిండగా మారినా మేను పంచె
జీవి గా కష్ట సుఖములై చేదు ఉంచె
వేశ్య పంచు తృప్తియె నాడు వేళ సుఖము ఈశ్వరా
తాను గ ఎడారి మారినా తనువు పంచు
తనువుగ తడారి నీయక తృప్తి పరచు
బ్రతుకున బికారి గ గాక బిడియ పరచు
మాటలతొ కన్నె నేననే మాయ పడచు
నిత్య రాబందు బంధుత్వ నీడ బ్రతుకె ఈశ్వరా
విజయ మే మీకు ఊపిరి వినయ మందు
జనుల నాడి పట్టె కవిత జయము నందు
మనసు కాలాన్ని గమనించె మేలు మందు
ప్రకృతి ప్రేరణ గుణముతో ప్రతిభ యందు
కవిత వ్రాసె జీవనముగా కధలు వ్రాసె ఈశ్వరా
0 Com
ప్రాంజలి ప్రభ ... పద్యాలు పరిమళాలు..నవరత్నాలు (2)
రచయిత..మల్లాప్రగడ రామకృష్ణ
పండి రాలు కాయ ఈశ్వరాజ్ణ యగుటే
పుట్టి గిట్టు ఆట ఈశ్వ రాజ్ణ లయలే
మంచి చెడులె నటన ఈశ్వరాజ్ణ కళలులే
ఏమి చెప్ప వచ్చు నీశ్వరాజ్ణ మనసులో
కనుము పశువు ల పండగె కనుల ముందు
రక్త పానకం వడపప్పు రకమె విందు
మత్తు పూనకం మనుసులో మాయ విందు
ముక్క లేకుంటే ముద్ద దిగుటయె కద్దు
మేషము అరుపు దీన మై మేలు అనక
కనుము కన్నీటితో పిల్పు కలల మునక
కుత్తుక యె కానుక యగుటే కులము ఇచ్ఛ
హత్తు కొని ఏడ్పె హృదయము హాయి గొలుపు
అక్షరములు నేర్చి కవిగా అరుగు రచనె
శ్రద్ధ తోవ్యాకరణమేను శోభు గోనె
చదువు చక్కని పుస్తకం చురుకుగా నె
సృష్టి యేఘనం గావుండె సుఖము మెండు
చెప్పు మాటలు మంచి వగుటయె అరుదు
మార్గ దర్శకుడవుట యే మంచి మాట
దారి తప్పించు పలుకులే దప్పి కనకు
బాధనుకలిగించె పనులు భాగ్య మనకు
ప్రతిభ బీజమై తపనతో ప్రబల తోడు
ఎదగ దలచేను మోక్కగా యదలొ తోడు
పుడమి పురిటినెప్పులతోను పురుడు తోడు
పైకి యెదగాలి నిత్యమూ పైరు లాగ
తుమ్మెద మకరందముగ్రోల తుంటరి ది యె
పువ్వులో దూరె చీకటై పువ్వు ముడిచె
ఉదయ భానుడు రాగానె ఊరుకొనగ
వచ్చె గజరాజు పద్మాన్ని వేరు పరచె
ఆశ నిరాశ గా మారి తమ్మెద ప్రాణాలు సంకటం ్్
న్యప్తాక్షరి...సంకురాత్రి
సంబరమగుటే నిత్యమూ సత్య మగుట
కుశల ప్రశ్నలు వేసి యు కులుకు మలుపు
రాష్ట్ర విభజన విషయంలొ రాటు తేలె
త్రి గుణ లక్షణాలుగ నేత్రి త్రుభుజ తార
నీలాకాశం పందిరి లో దేవత దీవెనలె
తివాచీల తరువు లు సస్యశ్యామలమే లేలె
వింఝామరముగా గాలి వీణామృత మయ్యేలె
వింధ్య పర్వతం హిమసుగంధపన్నీరులేలె
సతత హరితారణ్యాలు సుస్వాగతం పలుకులె ఈశ్వరా
0 Com
నేటి పద్యాల పరిమళాలు .. నవరత్నాలు
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
సరస హృదయమే జీవిత సాము జయము
నిత్య ము సమాజ హితము గా నీకు జయము
నిత్య మేలుకొలుపు సంగమం నీకు జయము
ఉదయ వెలుగు గా కవి కలం ఉండు జయము
ప్రకృతి సోయగాల మనసే పరవశించు
ప్రగతిశీల కూటమి గాను ప్రభవ నెంచు
ప్రతిభ వలననే మనిషి యే ప్రతిమ గాంచు
ప్రణయ నాదమే ప్రధమమే ప్రశ్న వగచు
అందె గత్తివైనను నేను ఆశ పడను
హృదయము న చేర లేవులే హాయి గొలుపు
నీవు హృదయేశ్వరిగను నిన్ను తలవ
రాణి వై వెలుగులు పంచె రత్న మాయె
పీక పట్టుట తురుముట పీడ గానె
శోక మయముఖ మేలను శోకు గానె
ఆకలి యను వాని గుణము ఆట గానె
రోకలి తినుము అనగానె రోష మగనె
తెలుగు సాహితీ వనముయే తీపి నిచ్చు
వెలుగు కిరణమై మనసు కు వెల్గు నిచ్చు
తలపు లన్నియూ తెలిపియు త్రోవ నిచ్చు
తలుపు తెరిచి యే కవులకు తోడు నీడ
మసక చీకటిలో రాజి మనుగడ గనె
సుపరిపాలన అని చెప్పి సుఖము పలుకె
భూములతొ కొండ ఖనిజమై భూత దయయె
ఇసుక మింగేటి బ్రతుకులే ఇష్ట మగుటె
మల్లెలతొ గంధమే ఇక మనసు చేర
విరిసిన అధరాలు పిలుపై వినతి మేర
తలపుల సుగంధమే ఇక తలుపు తెరచె
భాగ్య అనుబంధం మ్మేను భవ్వ మగుచు
తనకు దక్కిన దానితో తృప్తి పరచు
వ్యక్తి గాసంతసమ్మేను వ్యక్త పరచు
నిజము మరచి ఆశ కలలే నిన్ను మార్చు
సంపదలొ సంతతియె సర్వ సహజ తృప్తి
ఓటు గర్వమే నిను కమ్మె ఓర్పు లేదు
జనల సొమ్ము విలాసమై జపము నీది
కడుపు కొట్టి కాటికి పంపె గుణము నీది
మీరు ఏనుగు లై జనం మీద దౌడు
0 Com
#సుబ్బారావూ-బ్యాంక్ ఎకౌంటూ!!
#ఉదయం ఆరున్నరకే కాలింగ్ బెల్ మోగింది! "థూ... థూ..." అని ఛాతీ మీద ఊసుకున్నాడు సుబ్బారావ్! చలికి రగ్గు కప్పుకుని హాయిగా పడుకున్న అతనికి ఆదివారం పూట ఆ కాలింగ్ బెల్ ఉలికిపాటునే కాదు కోపాన్ని కూడా రప్పించింది.
'ఎవడ్రా పొద్దున్నే?' అని అడగాలనుకుని మంచం మీదనుండి గబగబా దిగే సరికి జారిపోయిన లుంగీని ఎగలాక్కుని కట్టుకుని తలుపు తెరిచాడు.
ఎదురుగా పళ్ళికిలిస్తూ పలకరించారు నలుగురు వ్యక్తులు "గుడ్ మాణింగ్ సార్!" అంటూ ముక్త కంఠంతో!
'గూండాల్లా వచ్చి గుడ్ మాణింగ్ ఏంటో' అనుకుంటూ తల ఊపుతూ ఏమిటన్నట్టుగా చూసాడు సుబ్బారావ్.
"మేం కాలనీలో ఉన్న బ్యాంక్ నుండి వచ్చామండీ!" అన్నాడు వాళ్ళలో కాస్త పెద్దగా ఉన్నాయన కళ్ళజోడును సవరించుకుంటూ.
"నాకు అప్పులేం లేవండి!" ముక్తసరిగా చెప్పి తలుపు వేసెయ్యబోయాడు సుబ్బారావ్.
"అబ్బే బాకీల వసూళ్ళ కోసం కాదు సార్, మేం బయల్దేరింది..."
అందుకున్నాడు అతని వెనకే ఉన్న ఓ నడివయసాయన.
"నాకు క్రెడిట్ కార్డు కూడా వద్దు!" అన్నాడు సుబ్బారావ్ అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే.
"అది కూడా కాదు సార్. మా బ్యాంక్ లో మీరొక్క ఎకౌంట్ ఓపెన్ చేస్తారని అడిగేందుకొచ్చాం." అన్నాడు మరో ఇరవయ్యేళ్ళ కుర్రాడు పక్క నుండి.
"ఎకౌంట్ ఓపెన్ చెయ్యమని అడిగే పద్ధతి ఇదా? ఆదివారం హాయిగా పడుకున్న వాళ్ళను ఎలా పడితే అలా లేపేసి అడుగుతారా?!" విసుక్కున్నాడు సుబ్బారావ్. అతని మనసులో ఇందాక జారిపోయిన లుంగీ జ్ఞాపకం ఇంకా మెదులుతూనే ఉంది!
"సారీ సార్! మా బ్యాంక్ వాళ్ళు దేశమంతా ఒకేసారి ప్రారంభించిన మహాత్తర ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ ఫ్లాట్స్ కి వచ్చాం. ఇవాళంతా మాకిదే పని." మొట్టమొదటిగా పలకరించినతను చెప్పాడు.
"గవర్నమెంట్ బ్యాంకే అంటున్నారు. మీకు జీతాల్లేవా? ఇలా రోడ్డు మీద పడి అడుగుతున్నారేంటి? కొంపదీసి మీ బ్యాంక్ నష్టాల్లో ఉందా?!" అనుమానంగా అడిగాడు సుబ్బారావ్.
వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే సరికి సుబ్బారావ్ కి అనుమానం పెరిగిపోయింది. నలుగురూ తెల్లబోయి చూసినా అంతలోనే ఆ పెద్దాయనే తేరుకుని చెప్పాడు, "అదేం లేదండి, మా బ్యాంక్ చాలా పెద్ద బ్యాంక్. ఎకౌంట్స్ పెంచుకుందామని ఇలా వస్తున్నాం అంతే! నేను ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ని."
"లేదండి నాకు మా శాలరీ ఎకౌంట్ వేరే ఉంది. ఎకౌంట్ అక్కర్లేదు." తలుపు వేసెయ్యబోయాడు.
"అలా అనకండి సార్. మా బ్యాంక్ లో సర్వీస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎకౌంట్ ఓపెన్ చేశాక మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీ శాలరీ అకౌంట్ కూడా మా దగ్గరికే మార్చేస్తారు. ఇంకా డిపాజిట్లు వేసుకోవచ్చు. లాకర్ తీసుకోవచ్చు... ఇంకా..." అంటూ పెద్ద చిట్టా విప్పాడు మరో కుర్రాడు.
వాళ్ళు అంత తేలిగ్గా వదిలేలా లేరని అర్ధమైంది సుబ్బారావ్ కి. సబ్బులు, ఫినాయిలు అమ్మే వాళ్ళు బ్రతిమాలినట్టుగా ఈ బ్యాంక్ వాళ్లకు ఈ గతి పట్టిందేమిటో అనుకుంటూ, "సరే ఎకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ ఇవ్వండి. నాకు వీలైన రోజు వచ్చి చేస్తాను." అని చెప్పాడు.
వాళ్ళందరి ముఖాలు విప్పారిపోయాయి. "థాంక్స్ సార్, ఇదిగోండి ఫార్మ్. మీరు ఇవ్వాళ చేస్తానన్నా చేసెయ్యొచ్చు. అవసరమైన పేపర్స్ రేపివ్వొచ్చు. మీ పేరు, వివరాలు చెప్పండి." తన దగ్గరున్న నోట్ బుక్ రెడీగా పెట్టుకుని అడిగాడు రెండో కుర్రాడు.
ముఖం చిట్లించి అడిగాడు సుబ్బారావ్, "ఎలానూ వస్తాను కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు?"
"ఎంత మందిని కలిసామో, ఎన్ని ఎకౌంట్స్ ఓపెన్ అవుతాయో సాయంత్రానికి మేం హెడ్డాఫీసుకు రిపోర్ట్ చెయ్యాలి సార్, చెప్పండి." బ్రతిమాలినట్టుగా అన్నాడు సుబ్బారావ్.
"చాలా థాంక్స్ సార్" అంటూ వెలిగిపోతున్న ముఖంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు మేనేజర్. అతని అనుచరులు అప్పటికే పక్క ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినట్టున్నారు, తలుపు మూయబోయిన సుబ్బారావ్ కి గయ్ మంటూ వినిపించింది పక్కింటావిడ పెద్ద నోరు, "బుద్దుందా... ఆదివారం పూట పనీపాటా లేని సన్నాసుల్లా బయల్దేరారు... వెళ్ళండి వెళ్ళండి... బ్యాంకట బ్యాంక్. సెలవు పూట అందరి పనులూ పాడు చేస్తూ!"
తర్వాతి రోజు తెల్లవారుతూనే సుబ్బారావ్ సెల్ మోగింది. "సార్ నేను ఫలానా బ్యాంక్ నుండి సతీష్ ని మాట్లాడుతున్నా. నిన్న ఆదివారం మీ బ్యాంక్ కి వచ్చాం. మా బ్యాంక్ లో ఎకౌంట్ తీసుకుంటానన్నారు కదా, ఎప్పుడొస్తున్నారు?"
'ఏమిటో వీళ్ళు అప్పుడే ఫోన్లో ఫాలో అప్ కూడా మొదలు పెట్టేసారు' అనుకుంటూ చెప్పాడు సుబ్బారావ్, "రేపో ఎల్లుండో వస్తాను. నాకూ కుదరాలి కదా?!"
ఆ ఫోన్ ముగించగానే మరో సారి మోగింది. ఎత్తగానే వినవచ్చిందిలా, "నమస్కారం సుబ్బారావ్ గారూ, నిన్న మీ ఇంటికొచ్చాం. మీరు ఎకౌంట్ ఒకటి ఇస్తానన్నారు కదా, అది గుర్తుచేద్దాం అని నేను మేనేజర్ని చేస్తున్నా."
"తప్పకుండా ఇస్తాను సార్, నాకు వీలు చూసుకుని వస్తాను." సుబ్బారావ్ చెప్పాడు.
ఆ కాల్ అయిన రెండు నిమిషాలకే మళ్ళీ మోగింది ఫోన్. "గుడ్ మాణింగ్ సర్, నేను ప్రదీప్ ను మాట్లాడుతున్నా. మీరు మా ఫలానా బ్యాంక్ కి ఎప్పుడొస్తున్నారు, ఎకౌంట్ తీసుకుంటానన్నారు కదా?!"
చిర్రెత్తుకొచ్చింది సుబ్బారావ్ కి. "ప్రదీప్ గారూ, ఎంతమంది చేస్తారు ఒకే మనిషికి మీ బ్యాంక్ వాళ్ళు?! ఇప్పటికి మూడో ఫోన్ మీ వాళ్ళనుండి!" విసురుగా చెప్పాడు సుబ్బారావ్.
"సారీ సార్! మీరు వచ్చినప్పుడు నా దగ్గరికే రండి ప్లీజ్" అంటూ ఫోన్ పెట్టేసాడు ప్రదీప్.
ఆ రోజు మధ్యాహ్నానికల్లా దాదాపు ముఫ్ఫై కాల్స్ ఆ బ్యాంక్ సిబ్బంది నుండే అందుకున్నాడు సుబ్బారావ్. చివరకు కోపంతో ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసాడు.
తర్వాతి రోజు ఉదయం నుండి మళ్ళీ మొదలైన ఫోన్ దాడికి తట్టుకోలేక ఆఫీస్ లో పర్మిషన్ అడిగి ఆ ఫలానా బ్యాంక్ కి వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆదివారం వచ్చిన కుర్రాళ్ళు ఇద్దరూ పలకరించారు. పేపర్స్ అన్నీ అతని చేతిలోంచి లాక్కున్నట్టుగా తీసుకుని, అన్నీ చూసి తలాడించి, "మీరు సాయంత్రం రండి సార్! మీ పాస్ బుక్, ఏటీయం కార్డ్ అన్నీ రెడీ చేసి ఉంచుతాను." అని చెప్పాడు ప్రదీప్.
సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ బ్యాంక్ కి వెళ్ళాడు సుబ్బారావ్.
అతన్ని చూసిన ప్రదీప్, "పాస్ బుక్ ప్రింటర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. రేపొస్తే ఏటియం కార్డ్ తో సహా కలిపి ఇచ్చేస్తాను సర్! ఏమీ అనుకోకండి" అన్నాడు ప్రదీప్.
రెండో రోజు వెళ్ళాడు సుబ్బారావ్. ఎకౌంట్ ఓపెన్ చేసినపుడు అతని దగ్గరికి వెళ్లలేదని కోపమో ఏమో, అతన్ని చూస్తూనే సతీష్ ముఖం తిప్పుకున్నాడు. 'అత్తాకోడళ్ళలా బ్యాంక్ లో ఈ గొడవలు, పోటీలు ఏంటో ' అనుకుంటూ సతీష్ దగ్గరగా వెళ్ళి అడిగాడు, "ప్రదీప్ లేడా?"
ముక్తసరిగా చెప్పాడు సతీష్, "లేడండీ, ఏదో పనుందని వెళ్ళిపోయాడు."
"పాస్ బుక్, ఏటీయం కార్డ్ సాయంత్రం ఇస్తానన్నాడు. తయారయ్యాయా?" సుబ్బారావ్ అడిగాడు.
"ఏమోనండి. అతనికే తెలుస్తుంది. రేపు ప్రదీప్ దగ్గరకు వచ్చి తీసుకోండి." అదే తీరుగా సమాధానం చెప్పాడు సతీష్.
మేనేజర్ ఏమైనా సాయం చేస్తాడేమో అన్నట్టుగా వెళ్తూ ఆయన క్యాబిన్లోకి చూసాడు సుబ్బారావ్. తెచ్చి పెట్టుకున్న నవ్వు ముఖంతో రుబ్బురోలు పొత్రం లా బుర్ర, పూనకంలో వేపమండల్లా చెయ్యి ఊపాడు తప్ప బైటకు మాత్రం రాలేదాయన.
చేసేదేం లేక ఆ తర్వాతి రోజు మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాడు సుబ్బారావ్. అతని అదృష్టం కొద్దీ ప్రదీప్ ఉన్నాడు. కార్డ్, పాస్ బుక్ అతనికిచ్చి చెప్పాడు ప్రదీప్, "కార్డ్ పక్కనే ఉన్న ఏటీయం లో మీరొక్కసారి పెట్టగానే మీకొచ్చిన కోడ్ మార్చుకోవచ్చు."
ఏటీయం లోకి వెళ్ళి రెండు నిమిషాల్లోనే తిరిగి వచ్చి చెప్పాడు సుబ్బారావ్, 'కార్డ్ ఇంకా ఆక్టివేట్ అవ్వలేదని వస్తోంది" ప్రదీప్ కి రసీదు చూపిస్తూ.
కంప్యూటర్లో ఏదో చూసి చెప్పాడు ప్రదీప్, "ఇంకా ప్రోసెస్ లో ఉన్నట్టుండి సార్, రేపు మళ్ళీ ఏటీయం లో పెట్టి చూడండి!"
ఆ తర్వాతి రెండు రోజులూ సుబ్బారావ్ ఏటీయం కి, అక్కణ్ణుంచి బ్యాంక్ లోపల ప్రదీప్ దగ్గరకు వెళ్ళడం, మొత్తానికి మూడో రోజునుండి కార్డ్ పని చెయ్యడం జరగడంతో చివరకు 'హమ్మయ్య' అని నిట్టూర్చాడు సుబ్బారావ్.
వారం తర్వాత సుబ్బారావ్ మళ్ళీ వచ్చాడు ప్రదీప్ దగ్గరకు, "కార్డ్ ఏటీయం మిషన్ లోపలకు వెళ్ళిపోయింది. వచ్చి తీసి ఇస్తారా?" అంటూ.
"కోడ్ అంటే పాస్ వర్డ్ టైప్ చేసేటప్పుడు మీరు తేడాగా చేసినా, ఆలస్యం చేసినా కార్డును మెషిన్ తీసేసుకుంటుంది." ప్రదీప్ చెప్పాడు.
"మిగతా బ్యాంకుల్లో అలా లేదు. అసలు కార్డ్ ఇలా పెట్టి అలా తీసేస్తే చాలు." సుబ్బారావ్ అన్నాడు.
"మా బ్యాంక్ లో ఇదే పద్ధతి" చాలా గొప్ప పద్ధతి అన్నట్టుగా సగర్వంగా అన్నాడు ప్రదీప్.
"సరే, కార్డ్ తీసి ఇస్తే వెళ్తాను." సుబ్బారావ్ విసుక్కున్నాడు.
"లేదు సర్. ఏటీయం వేరే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి డబ్బు పెట్టేటప్పుడు కార్డ్ తీసి ఇస్తారు. రేపు సాయంత్రం రండి." తాపీగా అన్నాడు ప్రదీప్.
"మీ బ్యాంక్ ఏటీయమ్మే కదా ఎవరో వచ్చి కార్డ్ తీసి ఇవ్వడం ఏంటి? మీకు తెరిచే వీలుండదా?!" సుబ్బారావ్ కోపంగా అడిగాడు.
"లేదండీ మా బ్యాంక్ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ కి ఇచ్చేసింది. మాకు సంబంధం ఏమీ ఉండదు." ఇంకా తాపీగా చెప్పాడు ప్రదీప్.
సుబ్బారావు కి ఒళ్ళు మండిపోయినా ఎలానో తమాయించుకుని వెళ్ళి తర్వాతి రోజు కార్డ్ తీసుకుని వెళ్ళాడు.
మరో పదిరోజులకల్లా పరుగులు పెడుతూ ప్రదీప్ దగ్గరకొచ్చాడు సుబ్బారావ్. "ప్రదీప్, ఎకౌంట్లో ఉన్న పదివేల రూపాయలూ ఏటీయం నుండి తీసుకుందామంటే ఎకౌంట్లో తగ్గిపోయాయి కానీ నాకు డబ్బు రాలేదు." కంగారుగా చెప్పాడు.
"ఫర్వాలేదు మళ్ళీ మీకొచ్చేస్తాయ్!" అభయమిచ్చాడు ప్రదీప్.
"వచ్చేస్తాయా... ఎప్పుడు ఎలా?" అయోమయంగా అడిగాడు సుబ్బారావ్.
"తిరిగి మీ ఎకౌంట్లోకి పడిపోతాయిలెండి." నమ్మకంగా చెప్పాడు ప్రదీప్.
"ఎప్పటికి?" ఆదుర్దాగా అన్నాడు సుబ్బారావ్.
"ఎప్పటికి అంటే ఏమీ చెప్పలేం. కాసేపాగి పడిపోవచ్చు. లేదా రేపో ఎల్లుండో." ప్రదీప్ జవాబుకి సుబ్బారావ్ మతి పోయింది.
"అన్ని రోజులు పడితే ఎలా? నాకిప్పుడు డబ్బులు కావాలి." సుబ్బారావ్ చెప్పాడు.
"మీ ఎకౌంట్లో డబ్బులు లేవుగా? ఎలా తీస్తారు?" తిరిగి ప్రశ్నించాడు ప్రదీప్.
"డబ్బులు నాకు ఏటీయం ఇవ్వలేదుగా?!" సుబ్బారావ్ ఎదురు ప్రశ్నించాడు.
"కానీ ఎకౌంట్లో తగ్గిపోయాయిగా?!"
"అది మీ తప్పేగా! ఎలానూ తర్వాత వచ్చేస్తాయి అంటున్నారు కదా. ఇక్కడ తీసుకునే ఏర్పాటు చెయ్యాలిగా?!" కోపంగా అడిగాడు సుబ్బారావ్.
"అలా వీలు కాదు సార్. ఎకౌంట్లో ఉంటేనే మీకు ఇక్కడ క్యాష్ ఇవ్వగలం" ప్రదీప్ తాపీగా చెప్తుంటే తారాస్థాయిని అందుకుంటుంది సుబ్బారావ్ కోపం. కానీ అవసరం తనది. దానికి తోడు పోయిన పదివేలు ఎలా వస్తాయో అని బెంగ కూడా పట్టుకుంది కొత్తగా. ఆ బెంగతోనే అడిగాడు నీరసంగా, "ఒకవేళ మూడు రోజుల తర్వాత కూడా రాకపోతే ఏం చెయ్యాలి?!"
"కంప్లయింట్ రాసివ్వాలి మీరు. అప్పుడు నేను మా హెడ్డాఫీస్ కి మెయిల్ పెడతాను." ప్రదీప్ జవాబిచ్చాడు.
"మరి ఆ మెయిలేదో ఇప్పుడు పెడితే నా డబ్బు నాకు వచ్చేస్తుంది కదా!" అర్ధింపుగా అడిగాడు సుబ్బారావ్.
"మూడు రోజులవకుండా మెయిల్ పెట్టడానికి మాకు పర్మిషన్ లేదు సార్!" నిర్మొహమాటంగా చెప్పాడు ప్రదీప్.
మేనేజర్ని కలిసాడు సుబ్బారావ్. ఆయన కూడా వీలుకాదని చెప్పడంతో నిరాశాగా వెళ్ళిపోయాడు. పైగా ఓ ఉచిత సలహా పారేశాడు, శాలరీ ఎకౌంట్ ఇక్కడకు మార్చేసుకుంటే అప్పుడు తన సహాయం చెయ్యగలిగే వాడినని.
ఆ తర్వాత పదిరోజులకు గానీ సుబ్బారావ్ డబ్బులు అతని ఎకౌంట్లోకి రాలేదు.
మరో నెల తర్వాత బ్యాంక్ కి వచ్చాడు సుబ్బారావ్. "ప్రదీప్, ఏటీయం లో జనరేటర్ లేదా? డబ్బు తీసుకుంటూ ఉండగా మధ్యలో ఏటీయం కరెంట్ పోయి ఆగిపోయింది." గాభరాగా అడిగాడు.
"లేదండీ, దానికి యూపీయస్ ప్రాబ్లం ఉంది. మేం కంప్లయింట్ ఇచ్చాం. త్వరలో పెడతామని చెప్తున్నారు."
'వీడి నిదానం తగలెట్టా' అనుకున్నాడు సుబ్బారావ్, ప్రదీప్ సమాధానం విని.
"మరి ఈలోగా కరెంట్ వస్తే?" సందేహంగా అడిగాడు సుబ్బారావ్.
"అందుకే మీరు ఏటీయం దగ్గరే ఉండండి. కరెంట్ వచ్చాక మీ డబ్బు వచ్చేస్తే వచ్చెయ్యొచ్చు. వేరే ఎవరైనా వస్తే మీకు ప్రాబ్లం కదా! అందుకని కరెంట్ వచ్చే వరకూ అక్కడే ఉండి ఇంకెవ్వరూ ఏటీయం ముట్టుకోకుండా చూసుకోండి!" సతీష్ హెచ్చరికకు ఏటీయం లోకి పరుగుపెట్టాడు సుబ్బారావ్.
ఆ రోజు ఆ ప్రాంతంలో నాలుగు గంటల పాటు కరెంట్ పోయింది. ఆఫీసుకు సెలవు పెట్టి కరెంట్ వచ్చే వరకూ ఏటీయంలో నిలబడి చెమటలు కార్చుకుంటూ కాపలా కాసాడు సుబ్బారావ్. కరెంట్ వచ్చింది కానీ ఏటీయం పని చెయ్యలేదు. మళ్ళీ ప్రదీప్ దగ్గరకు పరుగు పెట్టాడు.
"దానికి బ్యాక్ అప్ లేదు కదా. ఓ పావుగంట పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. మిమల్ని అక్కడే ఉండమన్నా కదా!" ప్రదీప్ దబాయింపుకి నిర్ఘాంతపోయి మళ్ళీ ఏటీయంలోకి పరుగు తీసాడు సుబ్బారావ్.
మరో అరగంటకు చచ్చీ చెడీ ఏటీయం స్టార్ట్ అవ్వగానే సుబ్బారావ్ డబ్బులు సుబ్బారావ్ కి వచ్చేసాయి. 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ ఏటీయం లోంచి బైటకు వచ్చి చెమటలు తుడుచుకున్నాడు సుబ్బారావ్.
తన స్కూటర్ దగ్గరకు వచ్చి కాసేపు దాని మీద కూర్చుని రిలాక్స్ అయ్యాడు సుబ్బారావ్. తళుక్కుమంటూ ఒక ఆలోచన రావడంతో బండిలో ఉన్న బ్యాంక్ పాస్ బుక్ బైటకు తీసాడు. లోపలకు వెళ్ళాడు. అక్కడ సీట్లలో ఎవ్వరూ లేరు.
"రెండు నుంచి లంచ్ అవర్ సార్! కాసేపు కూర్చోండి" లోపల నుండి వచ్చిన ఆఫీస్ బాయ్ చెప్పాడు. చాలాసేపు కూర్చున్నా ఎవరూ రాలేదు. అనుమానం వచ్చి బైటకు వెళ్లి బోర్డు చూసి వచ్చాడు. అరగంట సేపు లంచ్ అవర్. మూడు గంటలు కావొస్తుండగా తీరిగ్గా, విలాసంగా సీట్లలోకి వచ్చి కూర్చున్నారు సిబ్బంది. ప్రదీప్ దగ్గరకు వెళ్ళాడు. చెప్పమన్నట్టుగా చూసాడు ప్రదీప్.
"ఎకౌంట్ క్లోజ్ చేసేస్తాను." పాస్ బుక్ కూడా ఇస్తూ చెప్పాడు.
"మధాహ్నం ఎకౌంట్ క్లోజ్ అవ్వదు సార్, ఉదయాన్నే రావాలి." ప్రదీప్ చెప్పాడు.
"చూసావుగా ఉదయం నుండి ఎన్ని బాధలు పడుతున్నానో?!" సుబ్బారావు కోపంగా అన్నాడు.
"సరే, మేనేజర్ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చి ఆయన సంతకం దాని మీద పెట్టించుకుని రండి." దయతలిచాదు ప్రదీప్.
రిక్వెస్ట్ లెటర్ రాసి మేనేజర్ని కలిసాడు. "ఇంత మంచి ఎకౌంట్ వదులుకోవడం మాకు బాధగానే ఉంది" అంటూ బోలెడు విచారాన్ని పులుముకుంటూ పాస్ బుక్ నీ, ఏటీయం కార్డునూ ప్రదీప్ దగ్గరకు పంపించాడు మేనేజర్.
మరో అయిదు నిమిషాల్లో ప్రదీప్ లోపలకు వచ్చాడు. మేనేజర్ వైపు చూస్తూ "సుబ్బారావ్ గారి ఎకౌంట్లో కనీస మొత్తం లేకపోవడం వల్ల రెండు నెలలకు రెండు వందలు కట్టయిపోయాయి సార్. ఎకౌంట్లో వందే మిగిలింది. ఎకౌంట్ క్లోజింగ్ చార్జెస్ నూట యాభై తీసుకోవాలి. ఆయన ఎకౌంట్లో ఒక యాభై కడితే ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది." తాపీగా చెప్పాడు.
ఆ మాటలు విన్న సుబ్బారావ్ కోపంతో పిచ్చెక్కి పోయాడు. "అసలు నాకు ఎకౌంట్ కావాలని మీ దగ్గరకు నేనొచ్చానా? మీరే వచ్చి ఓపెన్ చెయ్యమని బ్రతిమాలారు. వచ్చాక ఎన్నిసార్లు పాస్ బుక్ కోసం, ఏటీయం కార్డు కోసం ఎన్నిసార్లు తిరిగాను? అసలు మీ దరిద్రపుగొట్టు సర్వీసుకు విసిగిపోయే నేను ఎకౌంట్ క్లోజ్ చేద్దామని నిర్ణయించుకున్నా. పైసా కట్టను. ఏంచేసుకుంటారో చేసుకోండి. నీ..." తన్నుకొస్తున్న బూతులను ఆపుకుంటూ విసురుగా కుర్చీని వెనక్కి జరిపి బ్యాంక్ బైటకు నడిచాడు సుబ్బారావ్.
ఇప్పుడు అతని మనసెంతో ప్రశాంతంగా ఉంది, ఎకౌంట్ క్లోజ్ చేసినందుకు కాదు, శాలరీ ఎకౌంట్ ఆ బ్యాంక్ కి మార్చుకోనందుకు!
***
పెట్టుపోతలు (చిన్న కధ )
నీ కోసం తేగలు ఇప్పుడే కాలిపించి తెచ్చాను.
సీజన్లో వచ్చే కండికాయలు,పెసరకాయలు,తాటిముంజలు
ఇంటికొచ్చిన పిల్లాడు ,చీపురు పుల్లకు గుచ్చిన" ఐస్ ఫ్రూట్" ఆత్రముగా చీకుతోంటే...
వాళ్ళ అమ్మ వాడిని కోప్పడుతుంటే-"పోనీలే అమ్మ ,పిల్లవాడు అడగలేదు..అటుగా ఐస్ ఫ్రూట్ బండివాడు వచ్చాడని నేనే కొనిచ్చానని"ఇంటి ఆయన చెబుతున్నారు
"ఇదిగోవాయ్ మినప గారెలు తిందాం .మా కోడలు అద్భుతంగా చేస్తుంది.
ఏమ్మా, లక్ష్మీ , మినపగారెలు చేస్తున్నావుగా...మావాడికి ఇష్టమట." అంటూ అత్తగారి కొర కొర చూపులు తప్పించుకుని బజార్లో కి వెళ్లే మామగారు.
ఇంటికి వచ్చిన ఆడవాళ్లకు గోరింటాకు,మల్లెపూలు,
వచ్చిన చుట్టాలు వెళ్ళేటప్పుడు చుట్టరికము బట్టి చీరో, జాకెట్టు ముక్కనో ,పండ్లు బొట్టు పెట్టి ఇచ్చే సంప్రదాయం.
తమ్ముడు వచ్చాడు, అన్నయ్య వచ్చాడు ,ఆడపడుచు కు ఇష్టం,ఇంటల్లుడు కి గౌరవం, ఇలాంటివి మనకు ఇష్టమున్న లేకున్నా ఎవరికి ఇవ్వవలిసిన మర్యాద వారికి ఇవ్వాలిసిందే..
వాళ్ళు వెళ్లిన తరువాత ఏమైనా వారి వెనుక ఉన్నవాళ్లు అనుకోవడమే సాధారణమే..
ప్రస్తుతం....
ఆ పిల్ల వాడు పెద్దవాడు అయ్యాడు. ఆ ఐస్ ఫ్రూట్ ఆరోగ్యం కాదు అని తెలుసుకున్నాడు. అంత కన్నా మంచివి ,ఖరీదు కలవి చాలా తిన్నాడు
ఆ పిల్లవాడి మనసులో గుర్తుండిపోయింది..
ఐస్ ఫ్రూట్ కొనిచ్చిన వారి ముఖం కాదు
ఐస్ ఫ్రూట్ రుచి కాదు..
వారి ఊరు కూడా గుర్తులేదు.
గుర్తుండిపోయింది మాత్రం
ఆ ఐస్ ఫ్రూట్ బండి వంక తను చూస్తుంటే...
ఆ ఇంటి పెద్దాయన తనకు కొని ఇచ్చి ఎంత ముచ్చట పడ్డాడు.. ఆయన ఆనందం గుర్తొచ్చింది..
అమ్మ కోప్పడబోతే ఎంత వెనుకేసుకు వచ్చాడు...
ఆ భావన తాలూకా ఇష్టం గుర్తుండిపోయింది.
తమ కోసం తెచ్చిన తేగలు, వాటి వెనుకున్న మమకారం గుర్తుంది.
తన ఇల్లు ఏర్పడ్డాక ఇంటికి వచ్చిన వారిని చాలా ఆదరముగా ,వారు ఆనందించేలా చూడడం మొదలుపెట్టాడు.
ఆ రోజు వారు తమని అంతలా ఆదరించింది చుట్టము అనే బంధం ఉండబట్టే అని తెలుసుకున్నాడు.
బంధం అంటే స్నేహము మాత్రమే కాదు..
బంధం అంటే మనకు ఇష్టమువున్న లేకపోయినా నిభాయించవలసినది.
మనం ఎవరినైనా ఆదరిస్తే....అది వారిని ఉద్ధరించినట్టు కాదు..
అలా చేయడం వలన మనం ఆనందం పొందుతున్నాము..
మనకు మనం సంతోషంగా వుండే ప్రయత్నం చేయడం.
రోజులు మారాయి-మనుషులు మారారు
ఖరీదులు పెరిగాయి-గొర్రె తోక జీతాలు
ఈ రోజుల్లో మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు-మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు?? ఆలాగా వున్నారు చుట్టూ జనాలు అంటున్నారా??
ఆగండాగండి....మార్పు మీతో ప్రారంభించండి..
అందరికీ అవసరము లేదు..
మీ దగ్గర వారి తో మొదలు పెట్టండి.
"అమృతం ఎలాగూ పెట్టలేము,పెట్టే పట్టెడు అన్నమైన ప్రేమతో పెట్టచ్చుగా "అని ఎక్కడో చదివాను...
మన పెట్టుపోతలు అంటే....ఈ రోజుల్లో మన టైం,మన మాట అంతే...
ఆది మాత్రం అడగకండి అని చెప్పకండే మరి....
--(())--