సమ్మోహన పద్యాలు
ఏమి చెప్ప బ్రతుకిది ... బ్రతకు బాధ్యత ఏది
ఏది అన్నను కూడు కొరకు నే ఈశ్వరా
కాల మెప్పడు మారు ... మార్పు ఏదని పోరు
పోరు తో కొడుకుల చూపులుగా ఈశ్వరా .... ...... 1
చేసిన పుణ్య మేది ... మేది పాపము ఏది
ఏది ఆన్నను కాలము ఎప్పుడు ఈశ్వరా
అవ్వ చేపిన కబురు ... కబురు కదిలెను చిగురు
చిగురు మనసు ఏదా బతుకుటే ఈశ్వరా .... ...... 2
నమ్మ లేని జీవని ... జీవ ధర్మ మేదని
ఏది తెల్పిన కథల తప్పుయే ఈశ్వరా
ఇది మాయ కాదుగా ... కాదు కను చూపుగా
చూపు మార్చని జలక్రీడ బాల ఈశ్వరా .... ...... 3
భయము లేని మనసది .. మనసు జలమున పరిధి
పరిధి లన్నియు లేని ఆటలే ఈశ్వరా
కరముల చెలిమి సూడు ... సూడు సహనపు జోడు
జోడు గా జలము ప్రేమ ఇదియు ఈశ్వరా .... .... 4
చిన్న నాటి ఆటలు ... ఆట చినుకు చినుకులు
చినుకు ముత్యమై సంబరం ఇది ఈశ్వరా
కపటము లేని నవ్వు ... నవ్వు కదిలే పువ్వు
పువ్వు చక్కదనాల బాలుడే ఈశ్వరా .... .... 5
****
తెలుగు భాషను బతికించండి - తెలుగు వారి భాధలు (1)
బాధలకు పరిమితము - పరిమితపు జీవనము
జీవన సమరంలో బాధల్ని తప్పదు గ
ఆశలతో జీవము - జీవముకు ఆశయము
ఆశయము కొరకు నిత్య భాదలు తప్పఁవు గ
వయసు ఉత్సాహము - ఉత్సాహమ్ము ఫలము
ఫలము పొందాలన్న బాధలే తప్పవు గ
జోరు ఉన్న సమయము - సమయపు సందర్భము
సంధర్బ మాటల తో బాధలు తప్పవు గ
జీవమ్ము మారినా - మారిన హృదయానా
హృదయ స్వార్ధ పోకడ భాదలు తప్పవు గ
సమర్ధత చూపినా - చూపిన హృదయానా
హృదయ అనుమాన సాక్షి భాదలు తప్పవు గ
ఆనందపు అంచులే - అంచుల ఆత్రుతలే -
ఆత్రుత తో మతి మరుపు భాదలు తప్పవు గ
పడి పడి నవ్వుతున్న - నవ్వుతు బతుకుతున్న
బతుకు బండికి ఏడుపు భాదలు తప్పవు గ
కాలము తడబడితే - తడబడు బతుకైతే
బతుకు ముగిసిపోయే భాదలే తప్పవు గ
కావ్యము తడబడినా - తడబడు కవికైనా
కవి ఆలోచనలా గె భాదలు తప్పవు గ
--(())--
సమ్మోహనాలు -- తప్పదు గ
రచాయట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
బాధలకు పరిమితము ... పరిమితపు జోవనము
జీవన సమరంలో బాధల్ని తప్పదు గ
ఆశలతో జీవము ... జీవముకు ఆశయము
ఆశయము కొరకు నిత్య భాదలు తప్పఁవు గ
వయసు ఉత్సాహము ... ఉత్సాహమ్ము ఫలము
ఫలము పొందాలన్న బాధలే తప్పవు గ
జోరు ఉన్న సమయము ... సమయపు సందర్భము
సంధర్బ మాటల తో బాధలు తప్పవు గ
జీవమ్ము మారినా ... మారిన హృదయానా
హృదయ స్వార్ధ పోకడ భాదలు తప్పవు గ
సమర్ధత చూపినా ... చూపిన హృదయానా
హృదయ అనుమాన సాక్షి భాదలు తప్పవు గ
ఆనందపు అంచులే ... అంచుల ఆత్రుతలే
ఆత్రుత తో మతిమరుపు భాదలు తప్పవు గ
పడి పడి నవ్వుతున్న ... నవ్వుతు బతుకుతున్న
బతుకు బండికి ఏడుపు భాదలు తప్పవు గ
కాలము తడబడితే ... తడబడు బతుకైతే
బతుకు ముగిసిపోయే భాదలే తప్పవు గ
కావ్యము తడబడినా ... తడబడు కవికైనా
కవి ఆలోచనలా గె భాదలు తప్పవు గ
--(())--
సమ్మోహనాలు ... మోము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కలల పంటయే మోము
మోము చేర్చు మోహము
మోహము తో మనిషికి అవసరము మోహనా
ప్రేమ మ్ము బతికించు
బతుకు కె సహకరించు
సహకారము ఉన్న పెరుగు ప్రేమ మోహనా
పెరిగె వయసుకు తోడు ... తోడు నీడ గ ఈడు
ఈడు జీవితం సఖ్యత చెందు మోహనా
స్త్రీల మోము అందము ... అందము శృంగారము
శృంగార కళ స్త్రీల ఆయుధము మోహనా
స్త్రీలు అభిరుచి తోను ... అభిరుచి మనసు తోను
మనసు తో హృద్యమందించును మోహనా
పిలుపుల కులుకు మోము ... మోము వెన్నెల మయము
వెన్నెల మయము తో బంగారమ్ము మోహనా
కలవాలి కోర్కతో ... కోర్కయు ప్రేమతో
ప్రేమతో కలసిమెలసి కబురే మోహనా
తడవాలి తృప్తిగా ... తృప్తిగా కలలుగా
కలలను పండించు కోవటమే మోహనా
చిరుగాలి వేడితో ... వేడిగ ఆకలితో
ఆకలి తీర్చు కోనెటి మార్గము మోహనా
తరుణంలొ దప్పికే ... దప్పిక తీర్చుటకే
తీర్చుట సహజము కాలముబట్టి మోహనా
సమ్మోహనాలు ... ప్రేమ
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చెలిమిలో నిజాయతి ... నిజయాతి లొ ఫలశృతి
ఫలశృతి విశ్వాసాన్ని పొందుటె మోహనా
చెడ్డ వానికి మంచి ... మంచి మాటతొ పెంచి
పెంచిన ఫలంగా చెడ్డ తొలగు మోహనా
వినయం తో గౌరవము ... గౌరవము బతుకు తనము
బతుకు ఫలంగా గొప్పతనమే మోహనా
పట్టుదల విత్తనము ... విత్తన శక్తి ఫలము
శక్తి ఫలము విజయముగా మారును మోహనా .
కరుణతో బంధమును ... బంధమే బలముగను
బలము ఫలము సమన్వ యాన్నిచ్చు మోహనా
నిరహంకార కరుణ ... కరుణ నిత్య రక్షణ
రక్షణ యే సుహృద్భావాన్నిచ్చు మోహనా
నిష్కపట బతుకుయే ... బతుకు నిర్మలముయే
నిర్మలము ఆత్మీయతను పంచు మోహనా
ఓర్పు నీకు ఉంటే ... వుంటే నీవెంటే
నీవెంట ఫలంగా అభివృద్ధి మోహనా
విశ్వాసం తోడుగ ... తోడుగా విజయముగ
విజయ ఫలమే అద్భుతాలులే మోహనా
ప్రేమతో బతికించు ... బతుకుతూ ప్రేమించు
ప్రేమలో మాధుర్యాన్ని పొందు మోహనా
--(())--
సమ్మోహనాలు ... భూమి ప్రకంపనం
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సూరీడు ఎర్రగా ... ఎర్రగా జ్వాలగా
జ్వాలల నుంచి ఎగసి పడి భూమి కంపనం
నెలవంక మెల్లఁగా ... మెల్లగా వేడిగా
వేడి సెగతో చల్ల గా భూమి కంపనం
వెన్నెల మటుమాయము ... మాయ ప్రజానీకము
ప్రజా నీకమ్ము నలిగే భూమి కంపనం
ఉల్కలు రాలినట్లు ... రాలె పిడుగన్నట్లు
పిడుగు శబ్ధములా పెద్ద భూప్ర కంపనం
ఉత్తేజ వాహినిగ ... వాహిని ఉప్పొంగగ
ఉప్పొంగుతూ కుప్పకూలే గృహ కంపనం
హా రామ లక్ష్మణా ... లక్ష్మణ హా సీతా
సీతా అరుపుల నాదమె భూప్ర కంపనం
ఊపిరి తీర్చలేక ... తీర్చి బతక లేక
బతుకునె బండలపాలు భూమి కంపనం
శిలల మధ్య శవమై ... శవమై న జీవమై
జీవము ప్రేత లయ్యే భూమి కంపనం
సహాయము పెరిగేను ... పెరిగే భద్రతయును
భద్రత మధ్య కొందరు బాతికె కంపనం
ఒక్కరి కొకరు లేరు ... లేరు బతికిన వారు
వారు వీరు లేని స్మశానమ్ కంపనం
--(())--
సమ్మోహనాలు ... శ్రేష్ఠమే
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
201 పూజించు దైవాన్ని ... దైవం నమ్మ కాన్ని
నమ్మకం పై బతుకులు సర్వం శ్రేష్ఠమే
292 . పుత్రుడు సంతోషమె ... సంతోషము స్థిరమె
స్థిరంగా తల్లితండ్రుల్ని కొలుచు శ్రేష్ఠమే
203 అప్పల్నీ చేయకే ... చేశాక మరవకే
మరవక తీరు స్తేనె సర్వం శ్రేష్ఠమే
204 . నటులు గొప్పవారే ... గొప్ప కుచెసె వారే
వారే మంచిపనులను చేస్తే శ్రేష్ఠమే
205 . పత్రికలొ వార్తలే ... వార్తలు ప్రజలకే
ప్రజలకే ఉపయోగపడి తేనే శ్రేష్ఠమే
206 . కలాన్నీ పట్టాలి ... పట్టాక కుళ్ళునే
కుళ్ళు తీసే కవనం సర్వం శ్రేష్ఠమే ·
207 . భావము తెల్పుతాను ... తెల్పెద ప్రేమంతను
ప్రేమపంచు హృదయము సర్వమూ శ్రేష్ఠమే
208 . నిత్య నామ జపములు ... జపము శాంతి పలుకులు
శాంతి పంచు మనసుకు సర్వమూ శ్రేష్ఠమే
209 . నీడనిచ్చు చెట్టుయె ... చెట్టు గా హృదయముయె
హృదయము ఇచ్చి పుచ్చుకొనుటయే శ్రేష్ఠమే
230 . మకిలి పట్టిన మనసు ... మనసు తీర్చిన వయసు
వయసు ఒడుదుడుకులు తొ సర్వమూ శ్రేష్ఠమే
--(())--
సమ్మోహనాలు ... దైవాన్ని
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
221 . కొలిచే హృదయంలో ... హృదయమంత ప్రేమలో
ప్రేమ మందిరంలో చూడాలి దైవాన్ని
222 . ప్రాణం చెలగాటం ... చెలగాటం వ్యసనం
వ్యసనము మంచి మార్పె చూడాలి దైవాన్ని
223 . పువ్వుల్లా పిల్లలు ... పిల్లల్లో నవ్వులు
నవ్వుల్లో ఎప్పుడూ చూడాలి ధైవాన్ని
224 . భరోసా కల్పిస్తు ... కల్పిస్తు హర్షిస్తు
హర్షిస్తు జీవిలో చూడాలి దైవాన్ని
225 . అమాయకు ల్నాదుకో ... ఆదుకో తీర్చుకో
తీర్చు కొనెటి బుణానుబందలో దైవాన్ని
226 . అసూయ పడ కెప్పుడు ... ఎప్పు డొద్దు తప్పుడు
తప్పు చేసే వాడ్ని మార్చి చూడు దైవాన్ని
227 . దిక్కులేని జనులకు ... జనుల నోదార్చుటకు
నోదార్చి వారిలో చూడాలి దైవాన్ని
228 . వెన్ను దన్ను గుండీ ... ఉండి ఆదు కోండీ
ఆదు కొని మనుషుల్లొ చూడాలి దైవాన్ని
229 , పుట్టొచ్చు పుత్రుడుగ ... పుత్రుడై ఆదుకొనగ
ఆదుకొ తల్లితండ్రుల్లొ చూడు దైవాన్ని
230 . ఉద్యోగ ధర్మాన్ని ... ధర్మ కర్తవ్యాన్ని
కర్తవ్యంతొ ఉద్యోగంలో దైవాన్ని
-- (())--
సమ్మోహనాలు ... శిశువు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
231 . జ్ఞానమ నే నిప్పులు ... నిప్పె సూర్య వెలుగులు
వెలుగే హృదయ తలపుల్లొ పుట్టె ధైర్యమ్ము
232 . నిప్పుకు కట్టె ఉండు ... ఉండు కర్మకు ఉండు
ఉండు జ్ఞానమనే స్త్రీ సహనపు ధైర్యమే
233 . కట్టె నిప్పె దాహము ... దాహమనే దేహము
దేహము ఆకలి నే తీర్చేది ధైర్యమే
234 . ఆనంద దేహమే ... దేహమే జ్ఞానమే
జ్ఞాన ఆనందాను భూతిగా ధైర్యమే
235 . కోరికలు వెంటాడు ... వెంటాడు మన్మధుడు
మన్మధుడు ఇంద్రియ ప్రవృత్తులు ధైర్యమే
236 . జీవనము తప్పదూ ... తప్పదు స్త్రీ పొందూ
పొందు జ్ఞానాగ్నిలో భస్మమగు ధైర్యమే
237 . కాలక్రమ మంతయు ... మంతయు దాహమ్ముయు
దాహముతో స్త్రీ పురుష సంగమ ధైర్యమే
238 . శిశువు జన్మ ఉదయం ... ఉదయం తో హృదయం
హ్రదయం పంచి పోషణ ధర్మం ధైర్యమే
239 . కలియుగ శిశువు బతుకు ... బతుకు కొత్త ఆశకు
ఆశ అనే ఆధునిక సంపద ధైర్యమే
240 . చేసేటి దానమ్ము ... దానమ్ము ధర్మమ్ము
ధర్మమ్ము సుతులుగా అండగా ధైర్యమే
--(())--
నా మాటలను నమ్మడానికి సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉజ్జ్వల దశ ప్రాప్తిస్తుంది. నాపై నీకు చిన్నప్పుడు ఎట్టి విశ్వాసం ఉండేదో అటువంటి అఖండ విశ్వాసం మీపై మీకు ఉండి తీరాలి.అనంతశక్తి భాండాగారం ధైర్యము ఉన్నప్పుడే అన్ని మంచి జరుగును. దాన ధర్మములు
పుణ్యము సుతల మార్గము మంచిగా ఉండును. జీవన వాహికలో అంతమఘడియలో తోడునీడగా ఉండగలరు. అటువంటి ధార్యమే సంసారం సుఖం ఆదేశిశువు జననం
--(())--
సమోహనాలు ... జ్ఞానము. :(1 )
రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
251 . సమయము సంకల్పము
సంకల్ప సమ్మతము
సమ్మతము దృశ్యా దృశ్యములే ఈశ్వరా
252 . మేను చిత్త వృత్తులు
వృత్తి ప్రవృతి కళలు
కళలు జీవిగా యోగసాధనే ఈశ్వరా
253 . తన్ను తాను దర్శన
దర్శన యోగస్థితిన
స్థితి గతి మతి మారు లోకంలో ఈశ్వరా
254 . దృష్టి ఇతర పోలిక ... పోలిక అర్ధ మునక
మునక ప్రభావమున లోనైతి ఈశ్వరా
255 . శ్రమకు యే విశ్రాంతి ... విశ్రాంతి ప్రభవతి
ప్రభవతి సహాయసహకారమే ఈశ్వరా
256 . ఊహా జనిత నిద్ర ... నిద్ర శాంతిగ ముద్ర
ముద్ర పరిపక్వ జీవ సాధన ఈశ్వరా
257 . సత్యా సత్య ములే ... సత్య స్మృతి విధులే
విధి జీవన చరితముల కలలే ఈశ్వరా
258 . ప్రత్యక్ష ప్రమాణము ... ప్రమాణ మే తర్కము
తర్కము పరంపరానుగతమే ఈశ్వరా
259 . సత్యము అసత్యమే ... అసత్య ప్రయాణమే
ప్రయాణము భ్రమల విపర్యమే ఈశ్వరా
260 . వస్తువుకు శబ్దముయె ... శబ్దముకు రూపముయె
రూపము మనసు వికల్పలేగా ఈశ్వరా
--(())--
సమ్మోహనాలు .... జ్ఞానం (2 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
261 . తామస ప్రవృత్తిలొ ... ప్రవృత్తి యే నిద్ర లొ
నిద్ర లో సగం జీవితమేను ఈశ్వరా
262 . మనసుపై ముద్రలై ... ముద్రలు వాసనలై
వాసనల విషయవాం ఛితలులే ఈశ్వరా
263 . వృత్తులను నివృత్తియు ... నివృత్తి ప్రవృత్తియు
ప్రవృత్తిగ అభ్యాస వైరాగ్య ఈశ్వరా
264 . ప్రయత్నము స్థితిగా ... స్థితి యే సాధ్యంగా
సాధ్యంగా భక్తి ప్రమత్తుల ఈశ్వరా
265 . చేసేపని నాణ్యత ... నాణ్యత పరిపూర్ణత
పరిపూర్ణత ఇఛ్ఛ వై రాగ్యమ్ము ఈశ్వరా
266 . త్రిగుణాలతో మనిషి ... మనిషి చేయాలి కృషి
కృషి సాధకునికి జ్ఞానము కలుగు ఈశ్వరా
267 . తర్కవితర్క మహిషి ... మహిషి చతురత మనిషి
మనిషి ఆశాపాశములతోనె ఈశ్వరా
.
268 . నిశిత విమర్శ వల్ల ... విమర్శ ప్రేమ వల్ల
ప్రేమ పరిపక్వత తో చిక్కేను ఈశ్వరా
269 . పరిశీలన వేగము ... వేగముగ పోషణము
పోషణ కర్తవ్యభావము లే ఈశ్వరా
270 . బ్రహ్మానందము తో ... ఆనందా కలి తో
ఆకలి అనే ఆయుధపు బతుకు ఈశ్వరా
--(())--
సమ్మోహనాలు ... జ్ఞానము.3 :
రచయిత : మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ
271 . జీవిలో మనస్సుయు ... మనసులో ఉషస్సుయు
ఉషస్సు బ్రహ్మా నందం కొరకు ఈశ్వరా
272 . జీవిలో వయస్సుయు ... వయసులొ తేజస్సు యు
తేజస్సు ఇంద్రియ ఉద్ధరణ ఈశ్వరా
273 . జీవిలో ఆశిస్సు ... ఆశిస్సుయె తమస్సు
తమస్సు సుఖదు:ఖాల మధ్యన ఈశ్వరా
274 . పృథ్వికి హృదయమ్ముయు ... హృదయమ్ము స్థిరమ్ముయు
స్థిరముగా సకలప్రాణరక్ష ఈశ్వరా
275 . సరస్సులొ పద్మాలు ... పద్మాలు ఉషస్సులు
ఉషస్సుతో అందాలుచూపును ఈశ్వరా
276 . సరస్సులో కలువలు ... కలువలకు వెన్నెలలు
వెన్నెల లో కల్వలు అందాలు ఈశ్వరా
277 . చీకటిలొ హృదయమ్ము ... హృదయా లింగన మ్ము
ఆలింగనాలతో మతి గతి యె ఈశ్వరా
278 . లేచిన పొద్దు నుండి ... పొద్దు గూకు పనండి
పనిలొ వళ్ళు గుల్ల అవిశ్రాంతి ఈశ్వరా
279 . ఎఱుకతో ప్రయత్నము ... ప్రయత్నము మృదుత్వము
మృదుత్వము లో మునిగి పోవుటయు ఈశ్వరా
280 . చిత్తవృత్తుల వదులు ... వదులుము బ్రాంతి పనులు
బ్రాంతి తో బతుకుట దుర్లభములె ఈశ్వరా .
--(())--
సమ్మోహనాలు ... జ్ఞానము (4 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
280 . క్షణ క్షణము మారు ... మారు సంపద తీరు
తీరు నిరీక్షణంలో సిరిలు ఈశ్వరా
281 . పత్ర పత్రము గాలి ... గాలి చూపెను హోళి
హోళి పరీక్షలలో మార్పులు ఈశ్వరా
282 . భగ భగలు తోవేడి ... వేడి వెతుకును జోడి
జోడి అవరోహణ అగ్ని ఎగసె ఈశ్వరా
283 . తహతహలు మనసుసిరి ... మనసు చల్ల బడు దారి
దారి మంచులా కరిగి పోయే ఈశ్వరా
284 . ఉహకు ఊపిరే సిరి ... సిరి చిలికె మాధురి
మాధురి పిలుపు మత్తును పెంచే ఈశ్వరా
285 . భాషకు మాటల సిరి ... సిరి మమత ఈశ్వరి
ఈశ్వరి హృదయ తత్వపు పలుకు ఈశ్వరా
286 . భార్యయు భర్తకు సిరి ... సిరి భర్త భార్య గురి
గురి ఒకరికి కొకర్తె ఒకటవును ఈశ్వరా
287 . భాగ్యము పేదల సిరి ... సిరుల ఆశలు మారి
మారి ధనిక పేదల భావాలు ఈశ్వరా
288 . ఆలోచన ఒంటరి ... ఒంటరి గా పెడసరి
పెడసరి ఆచరణ విపరీతం ఈశ్వరా
289 . విజ్ఞానము ఒంటరి ... ఒంటరి తో గడసిరి
గడసిరి అజ్ఞానము పెరుగేను ఈశ్వరా
290 ఆరాటము ఒంటరి ... ఒంటరిగా మగసిరి
మగసిరి ఆవేశము పెరిగేను ఈశ్వరా
--(())--
ప్రాంజలి ప్రభ
సమ్మోహనాలు ... జ్ఞానము (5 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
291 . మదిర నీకేలరా
నీ మధువునేనురా
మధువు నేనిత్తు నన్నొదలకుము మన్మధా
292 . వ్యధ నీకేలరా
నీ వనిత నేనురా
వనితనై మానసమ్మిత్తు రా మన్మధా
293 . తక్కువ చేయనురా
చేయను తప్పులురా
తప్పులు ఒప్పులుగా వలపుంది మన్మధా
294 . తాపము చూడుమురా
చూడుము అందమురా
అందమంత విరిసినపువ్వు రా మన్మధా
295 . తమకం విడువు మురా
విడువు బేషజమురా
బేషజపు పట్టు విడిచి చూడూ మన్మధా
296 . భాధలు ఎందుకురా
ఎందుకు శోధన రా
శోధన తో నన్ను చూడకురా మన్మధా
297 . భాద్యత నాదియురా
నాదియు భారమురా
భారము తో సమస్తము తెలియును మన్మధా
298 ఆకలి అణకురా.
అణకు ఓర్పుచూపరా
ఓర్పు తో అంద రాకలి మారు మన్మధా
299 .అసలు నీకేనురా
నీకేను మనసురా
మనసులొ మాయామర్మాలు తో మన్మధా
౩౦౦.దాహ మాపు కోరా
మాపు దేహమ్ము రా
దేహమ్ము భద్రత ఆరోగ్యం
--(())--
సమ్మోహనాలు..... తన్మయత్వం
రచయిత. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
141 . చూపు తన్మయత్వము
తన్మయ శృంగారము
శృంగార విన్యాసములు తృప్తి మోహనా
142 . స్త్రీ మఖ వీక్షణమ్ము
వీక్షణ సౌందర్యమ్ము
సౌందర్యో పాసన పురుషులకె మోహనా
143 . అపరంజి శిల్పమ్ము
శిల్పమై మోహనమ్ము
మోహనమ్ము గా మనసు దోచెనే మోహనా
144 . అంగాంగ సౌందర్య
సౌందర్య ఔదార్య
ఔదార్య ఆకర్షణయె ఒళ్లు మోహనా
145 . మేలిముసుగు కదలిక
కదలి కతొ అభిసారిక
అభిసారిక అందాలు మోహమే మోహనా
146 . బిగువున వక్షోజాలు
వక్షోజాల థలుకులు
థలుక్ థలుక్ అంటూ కదలిక లే మోహనా
147 . తీగ నడుము కదలిక
కదలి మది పంచునిక
ఇక పని సలుపుట గా హృదయమ్ము మోహనా
148 . .నుదుట బొట్టు చూడుము
చూడు పెదవి మురిపము
మురిపెమేదో తెలిపు చన్నదీ మోహనా
149 . మాయా ముఖ మోహిని గ
మోహిని కైపు కళ్లు గ
కళ్ల చూపులు మత్తులో ఉంచు మోహనా
150 .స్త్రీ హృదయము పొందుట
పొందు చేయు ముచ్చట
మచ్చట తో మనసు తెలపదు లే మోహనా
*(())*
సమ్మోహనాలు ... కరోనా
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
151 . ఎవరో వస్తారని
వచ్చియు చేస్తారని
చేసే రోగము కాదిది అదే కరోనా
152 . ఏమి రోగము ఏమి
ఏమి తెలియని చావు
చావును తెల్పును వైద్యుడు గా కరోనా
153 . మృత్యువా ఇక రాకు
రాకుమా ఇటు రాకు
రాకు ఇక మా వైపు దయచేసి కరోనా
154 .బంధ మాన పాయే
పాయె ఆగమె ఆయే
ఆయె బతుకులు కడగండ్ల పాలు కరోనా
155 .ఊరు వాడా ఒకటి
ఒకటి ధైర్యమె పేరిగె
పెరిగేను మొండి ధైర్యపు బతుకు కరోనా
156 .చదువులన్ని చెదిరెను
చెదిరె గోల పెరిగెను
పెరిగే చింతలు వెతలు దుఃఖమే కరోనా
157 .గొంతు లెండి పోయెను
పోయి కడుపు మాడెను
మాడి ప్రాణమె గంగలో కలిసె కరోనా
158 .కళ్ళ నీళ్లు కారే
కారే రక్తము మారే
మారె కొందరి బతుకులను మార్చె కరోనా
159 .ముసలోళ్ళ మూలుగులు
మూలుగుల్లో మరణాలు
మరణ మృదంగాలు మోగినాయి కరోనా
160 మాస్కు ధరించి ఉండు
ఆరడుగు లెడముండు
దూరముండి జాగర్తే రాదూ కరోనా
--(())--
మన భారత ప్రధాన మంత్రి ఈ రోజు " మన్ కి బాత్ " అక్టోబర్ 20 వ తేదీ జాతికి ఇచ్చిన సందేశము ( సంక్షిప్తంగా )
-------------------------------------------
అతి త్వరలోనే భారతదేశంలో వ్యాక్సిన్ వస్తుంది.అంత వరకు వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు.
దేశంలో పండగల సీజన్ మొదలైంది.ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
గడచిన ఏడెనిమిది నెలలుగా ఒక యజ్ఞంలా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడాము. అది దేశం నుంచి పూర్తిగా పోయే వరకు ఈ పోరాటం కొనసాగాలి.
కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా వీధుల్లో తిరుగుతున్నట్లు వీడియోలు, ఫోటోలలో కనిపిస్తోంది.అలా చేయడం మీకు, మీసాటి వారికి కూడా ప్రమాదకరమన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ప్రపంచంలోని చాలా దేశాలలో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తోంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలి.
కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకూ నిర్లక్ష్యం వద్దు.
దేశంలో లాక్‌డౌన్ మాత్రమే తీసివేయబడింది.కరోనా వైరస్ ఇంకా ఉంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
--(())--
సమ్మోహనాలు ... వయసు
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
161) లొలక మాయ వయసు
వయసు వేగ ము మనసు
మనసే మనిషిని బతికించు లే ఈశ్వరా
162 . నల్లని కురుల మోజు
మోజు చూపెను రోజు
రోజూ ఉడికించు వయసు పొంగు ఈశ్వరా
163 కురులలొ జాజిమాల .
మాల సౌరభ మేళ
మేళ మలుపుల తోనె జీవితం ఈశ్వరా
164 సొగసైన కనుదోయి
కనుదోయి చిరుహాయి
. చిరుహాయి సుఖశాంతు లివ్వాలి మోహనా
165 . వలపుల సొగసు రాణి
రాణి మా గృహ వాణి
గృహవాణిగ వాక్కును తెల్పేది ఈశ్వరా
166 వయసు మీరి పలుకకు
పలుకుతు మీద పడకు
పడకు యవ్వన ముకొంతవరకే ఈశ్వరా
167 కుందనాల బొమ్మా
బొమ్మలొ కులుకమ్మా .
కులుకు తో అంగాగ దర్శనం ఈశ్వరా
168 . ఇంద్ర నీల కాంతులు
కాంతి మాయ పిలుపులు
పిలుపుల మైమరుపుల తలపులు ఈశ్వరా
169 మల్లె పువ్వులు సిగలొ
సిగ పట్టులే యదలొ
యద పొంగులు చూపి వయ్యారం ఈశ్వరా
170 ప్రాయంలో స్వే శ్చా
స్వేశ్చ కాదు ఇశ్చా
ఇశ్చతో సర్వము గ్రహించును ఈశ్వరా
--(())--
సమ్మోహనాలు ... అల్లి బిల్లి ఆట
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
171 . అల్లి బిల్లి ఆడుట
ఆడుట పాట పాడుట
పాటలతో ఆటలతో కలసి సందడీ
172 . చిరు నవ్వుల గోల
గోల పిల్లల హేల
హేల పిల్లల నవ్వుల తోనే సందడీ
173 . చిన్న పెద్ద మాటలు
మాటలతొ కోపాలు
కోపాలు పట్టింపు మాటల్తొ సందడీ
174 . ఇక పకలు చాలింక
చాలు లే పదింక
పద పద అంటూ ఒకరికొకరూ సందడీ
175 . కదము తొక్కె సరదా
సరదా తొ ఆపదా
ఆపద తో భయము కమ్మి పరుగు సందడీ
176 .స్వేశ్చగా తిరుగుము
తిరుగుచు ఆడుకొనుము
ఆడుకొనుచు ఆర్భాటాలతోను సందడీ
177 . కష్టమని అన వద్దు
వద్దు అనకే హద్దు
హద్దు ఉంటేనే ఇష్టములతో సందడీ
178 .పువ్వు లాంటి వయసే
వయసు నవ్వు వరుసే
వరుసల నవ్వులతో ఇష్టమే సందడీ
179 నీవు పారే నదివి
నదిగ కదిలె మనసుని
మనసు లో ఉరే ఊటకు తెలుసు సందడీ
180 ప్రతి మనిషికి మాట .
మాటలు తోను ఆట
ఆట పాట మాట వేట లతో సందడీ
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
సమ్మోహనాలు ... మమతాను రాగమే
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
181. జీవితం సుమధురము
సుమధుర మకరందము
మకరంద మాధుర్య మమతాను రాగమే
182. చిరునవ్వు లతొ జోల
జోలతొ కోపలీల
కోపము మందహాస మమతాను రాగమే
183. త్యాగాల బాధ్యతలు
బాధ్యత తో భాధలు
బాధల తొ దయ కరుణ మమతాను రాగమే
184. స్వధర్మం సాధన
సాధన యే శోధన
శోధన నిరంతరం మమతాను రాగమే
185. స్వభావం లక్ష్యమె
లక్ష్య మేకాగ్రతమె
ఏకాగ్రత లతోను మమతాను రాగమే
186. యదార్ధపు జీవనము
జీవ పరిష్కారము
పరిష్కార తండ్రిగ మమతాను రాగమే
187. అవరోధం తొలగే
తొలగె భావ మడిగే
భావ అభ్యాసము తొ మమతాను రాగమే
188. సత్య పలుకు నిత్యము
నిత్య బతుకు సత్యము
సత్య అ సత్యము లో మమతాను రాగమే
189. ప్రతి స్థా యిలొ శక్తి
శక్తి తొ కళ ఆసక్తి
ఆసక్తి ఉండుటే మమతాను రాగమే
190. జీవితం నిరీక్షణ
నిరీక్షణతొ వీక్షణ
విక్షణ లె ప్రేమతొ మమతాను రాగమే
--(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సమ్మోహనాలు ... వనిత
191 . పోరి పోరి గెలిచిన
గెలిచియు సేవ తపన
తపన కాదిది సుమధురం వనిత జీవితం
192 . నవ్వుల కళ్ళ చూపు
చూపు లతోను మలుపు
మలుపు మోహపు మౌనపు తృణం వనిత జేవితం
193 . ఆనంద మంతటా
అంత హాస్య వేటా
వేట కాదు వయసు తలపు వనిత జీవితం
194 . అనుభవించు వయసును
వయసు పలుకు శోభను
శోభ అంతయు చరితమే వనిత జీవితం
195 . హృదయ ముంటే చాలు
చాలు తృప్తియు చాలు
చాలు సమయో పాసనగ వనిత జీవితం
196 . అభినందనల తృప్తి
తృప్తి తృణము వ్యాప్తి
వ్యాప్తి మనసు మేలి ముసుగు వనిత జీవితం
197 . కోరి కోరి పొందిన
పొందిన హృదయమ్మున
హృదయం సమరం తప్పదు వనిత జీవితం
198 . కొదవ లేని హర్షము
హర్షము తోడు వర్షము
వర్షము లో తడిసి ముగ్ధ వనిత జీవితం
199 . చెప్పని పరవశముతొ
పరవశం తలపులతొ
తలపుల కేరింతలు ముగ్ధ వనిత జీవితం
200 . వెర్రి మొర్రి చేష్టలు
చేష్టలతొ వేషాలు
వేష మోసాల కులుకుల వనిత జీవితం
--(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సమ్మోహనాలు ... శిల్పి
100 . శిల్పిగా నేనోయి
నేనే కర్త నోయి
కర్తగా క్రియను జరిపు మనిషినే ఈశ్వరా
101 . చెడునే తొలిగిస్తా
తీసి మంచి చేస్తా
మంచి శిల్పిగా చెక్కటమే విధిగా ఈశ్వరా
102 . నా తెలివి నాదోయి
నా కష్టం నాదోయి
నాప్రాణం తొ దైవ రూపమే ఈశ్వరా
103 . సుత్తి సాన మాయుధం
ఆయుధం జీవనం
జీవనం శిల్పగా బతకటం ఈశ్వరా
104 . సజీవ రూపాన్నీ
రూపం దైవాన్నీ
దైవాన్ని ప్రార్ధించె శిల్పినే ఈశ్వరా
1౦5 శిలపెచ్చు తొలగించి
తొలగించి ఓర్పుంచి
ఓర్పుతో అందమైన రూపం ఈశ్వరా
106 నేను బ్రహ్మనుకాను
కాను రూప కర్తను
కర్తగా దైవదృష్టి యే మనసు ఈశ్వరా
107 . ప్రాణమె నా ధ్యేయము
ధ్యేయము నా లక్ష్యము
లక్ష్యము శిలను మార్చు శిల్పిగా ఈశ్వరా
108 . తల్లితండ్రుల సేవ
సేవతో శిల్పిగా
శిల్పిగా వంశాన్ని రక్షగా ఈశ్వరా
109 పురజనులు కొలిచే
కొలిచే దైవాన్ని
దైవాన్ని కొలిచే రూపకర్త ఈశ్వరా
110. నన్ను గమనించు వారు
వారు లెకయే నన్ను
నేను చెక్కుకుంటున్నాను చూడు ఈశ్వరా
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
సమ్మోహనాల .. దుర్గమ్మ
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
111 . మా అమ్మ దుర్గమ్మ
దుర్గమ్మ కాపాడమ్మ
కాపాడి మాకు కొలిచే శక్తి ఇవ్వమ్మ
112 . నవరాత్రుల పూజలు
పూజల సంబరాలు
సంబరంలొ భక్తి భావశక్తి ఇవ్వమ్మ
113 . అవ తారాల అమ్మ
అమ్మ మము చూడమ్మ
చూచి తప్పు దిద్దియు శక్తినే ఇవ్వమ్మ
114 . దుర్గమ్మే సర్వము
సర్వమ్ము కొలి చాము
కొలిచాము అమ్మగా శక్తినే ఇవ్వమ్మ
115 . స్వర్ణ కవచ దుర్గ గ
దుర్గే తొలి రూపముగ
రూపమ్ము తో సర్వులకు శక్తి నివ్వమ్మ
116 . శ్రీ దుర్గా మంత్రము
మంత్ర సర్వ శ్రేష్ఠము
శ్రేష్టమె జపించె మనసుకు శక్తి ఇవ్వమ్మ
117 . కలికాలం మహిమను
మహిమ కాదు బాధను
బాధను భరించే శక్తి మాకు ఇవ్వమ్మ
118 .ఒక వైపున వర్షము
వర్షము తో హర్షము
హర్షము తోనూ జీవ శక్తిని ఇవ్వమ్మ
119 వర్షంతో బతుకులు
బతుకులొ అగమ్యాలు
అగమ్యాన్ని గమ్య శక్తినే ఇవ్వమ్మ
120 .బతుకు బండి చూడుము
చూచియు ఆదు కొనుము
ఆదుకొను లక్ష్యం నీదే కదా దుర్గమ్మ
.
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
సమ్మోహనాల .... స్నేహమే
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
121 . నేస్తమా గుర్తుంద
గుర్తెందు కూ లేద
లేదని అనుకోకు అక్కరకే స్నేహమే
122 . ఇద్దరి తో స్నేహము
స్నేహం గా ప్రేమము
ప్రేమమ్ము చుట్టూ తిరిగేది స్నేహమే
123 . అంతటా అద్భుతం
అద్భుతమ్మె కాలం
కాలంకు వావివరుసలు లేవు స్నేహమే
124 .దయగలిగిన హస్తం
హస్తం గ జీవితం
జీవితం సక్రమం మూలంగ స్నేహమే
125 . ఉషోదయం తొ మొదలు
మొదలే సరాగములు
రాగములో అనురాగాలతో స్నేహమే
126 . అస్తమయం తొ నిద్ర
నిద్రలొ సుఖపు ముద్ర
ముద్రతో రెప్పపాటు కదలిక స్నేహమే
127 . మేలిముసుగు స్త్రీకి
స్త్రీకి అలం కారనికి
అలంకారము జీవితంలొ ముడె స్నేహమే
128 . దయార్ద్ర హృదయమ్ము లె
హృదయము సంసారము లె
సంసారం నడిపించె నావయు స్నేహమే
129 పుడమి తల్లి తరువులకు
తరువులు మానవులకు
మానవులు ఇచ్చి పుచ్చు కొనునది స్నేహమే
130 . గూగుల్ అంతర్జాల
అంతర్జాల ముఖముల
ముఖపంకజమునకు నాకూనూ స్నేహమే
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
సమ్మోహనాలు .. ఉయ్యాల
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
131 .ఉయ్యాలలో యువతి
యువతి కాదు తపతి
తపతి కోరు చల్లని యతి ని కోరు ఈశ్వరా
132 . సోయ గాల అందము
అందము యే మధురము
మధురపు మత్తును కోరు పడచులు ఈశ్వరా
133 జడలో వయ్యారము
. వయ్యారంతొ నడుము
నడుము కదలికలు మత్తుపెంచు ఈశ్వరా
134 .యవ్వనవతుల ఆట
ఆట భావపు మాట
మాటల చిలక పలుకులతొ హేళ ఈశ్వరా
135 . ఇంక ఊపు అపుము
ఆపుములె లోలకము
లోలకము కళ్ళు తిరుగుతాయట ఈశ్వరా
136,.జడకుచ్చులు నేలకు
నేల తగులు గజ్జకు
గజ్జ ఘల్లు ఘల్లు మనె ఊయల ఈశ్వరా
137. అమ్మ లక్కలు కలసి
కలసి పెదవులు విరిసి
విరిసి సంతసమ్ముగా ఆడెను ఈశ్వరా
138. అట్ల తద్దిన వేట
వేట ఊయల ఆట
ఆట తో పడచుల కోలాటలు ఈశ్వరా
139 లాలి పాటల జోల
జోల తో ఉయ్యాల .
ఉయ్యాల ఊపుతో హాయిగా ఈశ్వరా
140 .పిల్లలు నిద్ర పుచ్చు
నిద్రలో కధలు విచ్చు
కథలతో ఊయలూగి నిద్రకు ఈశ్వరా
--(())--
సమ్మోహనాలు.... పెద్దమ్మ
17/10/2020
90. జగతికి నేత్ర వమ్మ
అమ్మా అనెెదనమ్మ
అమ్మా అమ్మలుగన్న అమ్మా పెద్దమ్మ
91. జన్మల బంధమ్ముగ
బంధం సహనమ్ముగ
సహనము మాకు నేర్పి తివి కళల పెద్దమ్మ
92. మితిమీరిన ఖర్చులు
ఖర్చుతొ పేదరికాలు
పేదరికము రూపు మాపమ్మ పెద్దమ్మ
93. మితిమీరిన పొదుపులు
పొదుపు కష్టాలు పాలు
కష్టం తొలగించి సుఖములిమ్ము పెద్దమ్మ
94. మితిమీరిన సంపద
సంపద తో ఆపద
ఆపదల నుండి యు కాపాడుము పెద్దమ్మ
95. క్రమ శిక్షణలు పెరిగె
బంధాలన్ని తరిగె
తరిగిన బంధాలన్నీ కలిపే పెద్దమ్మ
96. మితిమీరిన కోపము
కోపము తో రౌద్రము
రౌద్రము తో ఉన్నా కాపాడె పెద్దమ్మ
07. స్త్రీ ల లో హాస్యమ్ముయె
హాస్య మనుమానముయె
అనుమానాలి మాపి ఆదుకో పెద్దమ్మ
98. అమ్మ వై మన్నించు
మన్నించి కరుణించు
కరుణతొ తప్పుల్ని క్షమించె పెద్దమ్మ
99. సద్దుల బతకమ్మా
బతుకు బోనాలమ్మ
బోనాలు తెచ్చాం కోర్కలు తీర్చె పెద్దమ్మ
100. హద్దుల బతుకమ్మా
బతుకును చూడమ్మా
చూచి మనసును మార్చి కాపాడె పెద్దమ్మ
--(())--
సమ్మోహనాలు.... ముకుంద మాల
80.దేవకీ నందు డా
నంద నవనీతుడా
నీతు డై సర్వ ప్రజల మనసులో ఉన్న
ముకుందా
81. జయతు మేఘ శ్యామ
శ్యామా సార్వ భౌమ
సార్వ భౌముని గా దయచూపుము ముకుందా
82. శిరసు తో వందనం
వందనం తొ హృదయం
హృదయము, మనసు నీకు అర్పనమే ముకుందా
83. విన్నపమ్ము తెల్పెద
తెల్పెద నూ యదరొద
యద రొద అనకు ప్రేమ భావమ్ము ముకుందా
84. పుడమికి భారాన్నీ
భారపు వైనాన్నీ
వైనాన్ని గమనించి రక్షణగ ముకుందా
85. గ్రహించ వా కృష్ణా
కృష్ణా పలుకు కృష్ణా
కృష్ణా, అని పిలుపులు తెలియవా ముకుందా
86. శ్రీ కృష్ణ వల్లభా
వల్లభ దయప్రభా
ప్రభావతంభైన దయా పరా ముకుందా
భావ భవ భక్త ప్రియ
87. ప్రియ శక్తి నాగశయ
నాగశయనా జగన్నివాసవ ముకుందా
88. భవ బంధాల రక్ష
రక్ష చేయక శిక్ష
శిక్ష రక్కసులపై చూపేటి ముకుందా
***(())***
---(())--
సమ్మోహనాలు ... జాబిల్లి
జాబిల్లి దర్పనం
దర్పనం అద్భుతం
అద్భుతం పులకించి మురిసేటి మోహనా
చూ డతివ సోయగం
సోయగం అమోహం
అమోహం సోయగాల మురిపం మోహనా
నెరజాన అందాలు
అందాలు పందాలు
పందాల మురిపాల మెరుపులగు మోహనా
ఉఛ్వాస బిగపట్టి
బిగపట్టె బిగువుల్ని
బిగువలు జతగాడి కొరకు నే మోహనా
బాహువుల బంధముకు
బంధ మాలింగనము
అలింగన ఊహలు నిజమవ్వు మోహనా
కలలో వల్లభుండు
వల్లభుడు సుఖపరుడు
సుఖపరుడు కౌగిట్ల లో కరిగే మోహనా
మరుమల్లెలు పిలిచేను
పిలిచె అంద మిచ్చెను
అందమంత అతివ వల్లభునికె మోహనా
ఉల్లిపొర చీరలో
చీరలొ సిగ్గలలో
సిగ్గు అపరంజి పువ్వులయ్యెను మోహనా
యువతి ఆరాట ముయె
ఆరాట సుఖమ్ము యె
సుఖముయే ఆరోగ్యామృతము యె మోహనా
--(())--
సమ్మోహనాలు..రమ్యత
ఎంత చూసిన తనివి
తనివి తీరదు మనవి
మనవి చేసె ద మానస రమ్యత మోహనా
కాశ్మీరం నీది యు
నీదిగా మామది యు
మది యు దోచు మనోహర మానస మోహనా
చక్కని దే జవ్వ ని
జవ్వని యే యవ్వ ని
యవ్వ ని హావ భావ సమ్మతే మోహనా
నళిని వైన మురళీ
మురళి రవంబు రవళి
రవళి తో మనసు దోచే మగువ మోహనా
విరహ గీతం వద్దు లె
వద్దు తోడు ముద్దు లె
ముద్దు ఇచ్చి పుచ్చు కో వనిత కు మోహనా
దీపం మెత్తి చూసిన
చూసిన చిక్క వు గన
చిక్కి చిక్క గ మనసు దోచా వు మోహనా
--(())--
సమ్మోహనాలు.. మత్తు మందు
ఏమి బతుకు మనిషియు
మనిషి గా బానిసయు
బానిస అంటె మత్తు పానీయం ఈశ్వరా
తినుటక మెతుకు లేదు
లేదు దొరుకును మందు
మందు అప్పు ఇల్లు వళ్లు గుళ్ళ ఈశ్వరా
గుట గుట మందు త్రాగి
త్రాగి నోటి తొ వాగి
వాగి నిజములు తెలుపు నెందుకో ఈశ్వరా
పుస్తెలు తాకట్టు గ
తాకట్టు త్రాగ గ
త్రాగి ఇల్లాలిని బాదుట యే ఈశ్వరా
నిద్ర పట్టక త్రాగు
త్రాగి మదముతొ ఊగు
ఊగి ఊగి వాంతులు దేనికో ఈశ్వరా
స్త్రీ లు మదముతొ త్రాగి
త్రాగి తెలియక వాగి
వాగి వళ్ళు అమ్ము జాతి ఉంది ఈశ్వరా
చేసిన కష్టాన్నీ
కష్టపు విత్తాన్నీ
విత్తం అంత త్రాగి మత్తు నిద్ర ఈశ్వరా
ప్రభుత్వం త్రాగుడిని
త్రాగి త్రాగండని
త్రాగుటకు అనుమతి యె మనసుచెడు ఈశ్వరా
వద్దు వద్దన్నా ను
వద్దన్న త్రాగాను
త్రాగి రోగమ్ము తో ఏడుపులె ఈశ్వరా
--(())--
మోహనాల ... ఈశ్వరా .... 1
నీదు మనసు మోనము
మోనము సుకుమారము
సుకుమారము నీ ముఖ వదనమ్ము ఈశ్వరా
నర్తనము నాకొరకు
నాకొరకు నీ పలుకు
పలుకే ప్రాణము నాకు వినయము ఈశ్వరా
ముద్దు గుమ్మ పలుకులు
పలుకు లన్ని కులుకులు
కులుకులు మాధుర్యమ్ములు పంచు ఈశ్వరా
పూల కన్నుల విందు
విందు వెన్నెల పొందు
పొందు మనసుకు ఊరటయు చాలు ఈశ్వరా
--//--
మోహనాలు (స్త్రీల బాధలు ) .... 2
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
విధి విశాలం మమత
మమత మోనం యువత
యువత మాయయు కాలమంతాను బాధలే
తిధియు మార్పే మనసు
మనసు వేటే వయసు
వయసు వాటము కాట లా కద్లి బాధలే
గృహము యందే తలపు
తలపు మారే వలపు
వలపు దేహము యవ్వనం మంత బాధలే
నగవు చిందే చిలుక
చిలుక చెప్పే పలుక
పలుక ఊహను బట్టియే కొ0త బాధలే
సరస సంభా వణము
వణము నిత్యా లయము
లయము పేరుకు తగ్గదై కొంత బాధలే
సహజ సిద్దే అరుణ
అరుణ వల్లే కరుణ
కరుణ చూపుల మౌనమే కొన్ని బాధలే
ప్రియ విహారీ జయము
జయము తెచ్చే భయము
భయము తెచ్చెను ఆశలే అన్ని బాధలే
--(())--
మోహనాలు ... ఈశ్వరా ... 3
వర్షము చేతే హర్షము
హర్షము వల్లే మోక్షము
మోక్షము అందించు జీవితాన ఈశ్వరా
కాలము చే గాళము
గాళము యే వైనము
వైనము ఓర్పుయె దేహమంతా ఈశ్వరా
వేదము యే సాధన
సాధన యే శోధన
శోధన ఆశలు యే పెర్గేను ఈశ్వరా
మోహన మే మత్తుయు
మత్తులు యే ఆశయు
ఆశయు నేర్పు బుధ్ధి మార్చేను ఈశ్వరా
మనసున నే అలజడి
అలజడి తో కలబడి
కలబడి సాగుటయే సంతృప్తి ఈశ్వరా
వయసు న నే ఉరవడి
ఉరవడి చే తడబడి
తడబడిన చెప్పేటి సంతృప్తి ఈశ్వరా
పదములచే విలువలు
విలువలు చే చురకలు
చురకలు వల్ల మార్పు సంతృప్తి ఈశ్వరా
చిరు నగవే హృదయము
హృదయము యే పదిలము
పదిలము సౌఖ్య తీర్పు సంతృప్తి ఈశ్వరా
మనుషులు లో మహిమయు
మహిమలు లే కలలయు
కలలు లె కావ్యమ్ముగ సంతృప్తి ఈశ్వరా
//**//
మోహనాల ...చిరునవ్వు..... 4
చిరునవ్వు సొగసంత
సొగసంత వయసంత
వయసంత వెచ్చంగ సంతృప్తి ఈశ్వరా
చిరునవ్వు చెంతయును
చెంతయును వద్దనెను
వద్దనెను ఆకలిలె సంతృప్తి ఈశ్వరా
చిరునవ్వు మూడుతో
మూడుతో ఆటలే
ఆటలే మోహినితొ సంతృప్తి ఈశ్వరా
చిరునవ్వు తోనే నిల్చి ఉన్న
నిల్చి ఉన్న నాతో మోహమన్న
మోహమున్న దాహమ్ము తీర్చు కళలు సంతృప్తి ఈశ్వరా
--(())--
మోహనాలు ...బాలిక
బాలి కలలో తెలివి
తెలివి చూపుతు కవివి
కవిగ మనసును బట్టి సంతృప్తి ఈశ్వరా
అన్నింటా ముందుగ
ముందుగ నే పంచగ
పంచగా ఆదరణ సంతృప్తి ఈశ్వరా
చదువులు చెప్పిం చుట
సెప్పేది యే వినుట
వినుట స్త్రీల విద్య సంతృప్తి ఈశ్వరా
చెలిమి చే యాలిగా
చేయాలి మంచిగా
మంచిగా కలిసియే సంతృప్తి ఈశ్వరా
అన్నా చెల్లెళ్ళు గ
చెల్లెళ్ల న్నొకరిగ
ఒకరిగ కలియు ప్రేమ సంతృప్తి ఈశ్వరా
--(())_-
మోహనాలు ..వృద్ధులు
వృద్దులను రక్షించు
రక్షించు రక్షించు
రక్షించు బాధ్యత సంతృప్తి ఈశ్వరా
చెడు నీవు తగ్గించు
తగ్గించుట కుదించు
కదించే బద్రతయు సంతృప్తి ఈశ్వరా
గోవులను పోషించు
పోషించు రక్షించు
రక్షించే మనసుయె సంతృప్తి ఈశ్వరా
వృద్ధుల వల్లె వెలుగు
వెలుగు యెంతో కలుగు
కలుగునిక సుఖశాంతి సంతృప్తి ఈశ్వరా
వారినీ ప్రేమించు
ప్రేమించి బతికించు
బతికించి పోషించు సంతృప్తి ఈశ్వరా
--(())--
పొంద లేవు నీవును
నీవు పరిపూర్ణతను
పరిపూర్ణత శాంతియె మనస్సుకు ఈశ్వరా
నింగి కేగి నగాని
గాని నేల మరువని
మరువని ఆత్మ తిరుగు దేనికియు ఈశ్వరా
ధనము పంచిన గాని
గాని ఆశ వదలని
వదలనని జన ఆత్మ ఘోషలే ఈశ్వరా
సతులకూడి నగాని
గాని సుతుల ఆశని బడసినగాని
ఆశని తీర్చక యే ఘోషలే ఈశ్వరా
పాట నేర్చినగాని
గాని కవిత కూర్చని
కూర్చని జీవితములొ ఘోషలే ఈశ్వరా
నిన్ను తెలియక తిక్క
తిక్క తొ శాంతి పక్క
పక్క పట్టి ఆడు తున్న నేను ఈశ్వరా
--(())--