Saturday, 11 July 2020

లలిత శృంగార పద్య సౌరభములు




" అమ్మ" మనోమయీ కళల మానస రక్షణ భద్ర " దీపికా "
నమ్మక మంతయూ సమము కూర్చియు వెల్గును పంచు "చంద్రికా"
ప్రేమను పంచియూ సహన మంతయు మాకును పంచు "శారదా"
నామన సంతయూ సహజ కావ్యము పూర్తికి తృప్తి "భారతీ"

వినయ విధేయతా సకల దేవత పుజాతా సకా 
లము నడిపేటి హృద్యమును కల్గియు తృప్తి జిత్తమున్
సుఖమును పంచియే తరుణ ధైర్యము పెంచు పోషణే
కరుణ మనస్సు అందరికి పంచిన తల్లి "వందనం "

వరకృప భృత్యులందు నిజవర్గమునం దనుకూలవృత్తి, కా
పురుషుల యందు  దైర్యము సుబుద్ధులయం దనురక్తి , తాల్మి స
ద్గురువులయందు, గౌరవము కోవిదులందు నయంబు కాలమే     
దరిజనులందు సౌర్యము, సమర్ధత ఇచ్చిన "తల్లి " వందనం

మమతలు మంద చేయునది సర్వుల రక్ష, మనస్సు ఏకమే 
సమయ సమత్వ సంతసము సాధన శోధన వల్ల సామ్యమే 
తమకము మౌన మార్గము చలత్వము కారణ శోభ కార్యమే 
విమల విశాల వర్ణణ లు దైవ మనస్సును బట్టి భాగ్యమే 

     


Krishna Peeping at Radha - Nirmal Painting on Wood. follow-@homes_comfort . . . . . . . #indianart #art #india #indianartist #artist #artwork #artistsoninstagram #handmade #painting #artsy #incredibleindia #instaart #instagram #design #instagood #sketch #love #drawing #indian #photography #history #homedecor #illustration #indianphotography #architecture #instaartist #mumbai #indianartists #delhi
లలిత శృంగార పద్య సౌరభములు - (2)
ఒక స్త్రీల హావభావాలు ఎవరికొరకు  ?

చ:: చెలువవు దేట లేనగవు చేతను భావముచేత సిగ్గుచే  
       నలువగులీల చేత సుగుణంబులచే గడగంటి చూపుచే 
       గలహముచేత విందులగు కందువ మాటలచే నసూయచే 
       బెలుచున నెంతవారి వలపింతురు కాంతల పెక్కుభంగులన్ 


చ :: ఘనుఁడ ! భవాని నందన ! సుకామ్య సుబుద్ధివరప్రదాయకా !
        ఘనమగునాది పూజల నుగైకొను ' దేవ ర ' వంద నమ్ములున్
        ఘనుఁడవుభక్తి వర్తనఁపుగౌరవముల్ గలఁగంగఁ జేయుటన్..
        ఘనుఁడ ! గజాస్య ! భక్తులకు కల్ప తరుండ ! దయాబ్ధి చంద్రమా !!!"

చ::  సహన మనో వికాస విమలాంబర "దేవ ర. వంద నమ్ములుల్ 
        సహన గుణాన్వితా సమర నాయక" దేవ ర" వంద నమ్ములుల్
        సహన భవాని నందన సుకామ్య "సు బుధ్ధి" వంద నమ్ములుల్
        సహన చరిత్ర శంకర సుధర్మ "సమర్ధ" వంద నమ్ములుల్


God images: Sundar tasvir
లలిత శృంగార పద్య సౌరభములు 

ఒక స్త్రీ భర్త పరాయదేశమునకు వెళ్ళినప్పుడు ఎలాఉంటుందో ?
(ప్రోషిత భర్త్రుక ... ముగ్ద )

చ :: ఎద సతి దీర్ఘ దు:ఖము వహించునె గాని, వచింప దేరికిన్
        మృదుల మృణాలశయ్య రచించునె  గాని పరుండ దందు గ 
        ద్గద గళ యోనె గాని, చెలి కన్నుల నింపదు నీరు సిగ్గుచే 
        ఒదవు వియోగతాప మేటులోర్చెనొ మన్మధుడే యెరంగునౌ      

లలిత శృంగార పద్య సౌరభములు   
న జ భా జ జ జ ర 
III IUI UII  IUI IUI UIU  

నేటి ఛందస్సు పద్యాలు 

చ:: నరములు జువ్వని లాగుచు నాట్యముచేయ టెందుకో 
        కరములు తిప్పుచు కుల్కలను గుప్పి మనోమయమ్ముగా 
        సరిగమపల్కుతో మనసు జొచ్చి విశాలవిస్తరై 
        విరహము చూపు యవ్వనము వింతగ వేద నెందు కో    

చ::  సుదతి పయోధరంబు లతిసుందరముల్ జఘనంబు రమ్య మా   
       వదనము హృద్యమంచు జలవర్తన మేటికి నీకు జిత్తమా ?
       కదలక వానిపై దలఁపు కల్గిన బున్నెము లాచరింపు; మిం 
       పొదవ లభించునే సుకృతియొగము లేక స్మిహితార్థముల్ 

చ :: కరములు నంటగా విసిరి ఖైశ్యముదాక విదల్చి, పయ్యెదన్ 
        పరిగొన గొట్టి పాదములపై బడ జూడక కౌగలింపగా 
        పరతురొ సాశ్రులై త్రిపురభామిను లేయది దోషికామి య 
        ట్లరిమరి సేయఆత్రినయ నాంబక వహ్ని దహించు పాపముల్      



No comments:

Post a Comment