Saturday, 11 July 2020



KRISHNA ART : Photo
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము  (14 )


రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

అనుభూతు లన్నియు తెలిపేటి బంధాన్ని 
పెనవేసె లక్షణ మంత కలిమి 
పెనుమాయ కమ్మిన అంతరా లమునందు 
మానవ సంభంద హృదయ బలిమి   
ఎన్నడూ కరగని ప్రేమను అందించి 
సుఖముల వెలుగులు కమ్మె చెలిమి 
నవ్వుల మాలను విసిరియు కళలను 
నెరవేర్చి వెతలను తీర్చు కృష్ణ   

ధరణిఁ ధేనువు పితుకంగ దలచితేని 
జనుల బోషింపు మధిప వత్సముల మాడ్కి 
జనులు పోషింప బడుచుండ జగతి కల్ప 
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు 

--(())-- 



108nirvanicbliss: “ krishnaart: “ RADHA KRISHNA ” ~Radha Krishna~ ”

ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము  (13 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

సీస పద్యము 

పలుకుల రాగము నీవైతె మనసుకు
శృతికల్సి ఉండెటి శక్తి నివ్వు  
వలపుల భావన వెయ్యెళ్ల వెన్నెల
మాకును  అందింప చేయు కృష్ణ
తలపుల ప్రేమను పంచియు పొందియు 
సౌఖ్యము కల్పించు బాల కృష్ణ 
తలుపులు నీకోసం తెరచియు ఉంచాను  
నాహృద యములోన ఉండు కృష్ణ    

తేటగీత 
బువ్వ తిన్నాక ఆకలి తీరు కృష్ణ 
నీళ్లు తాగాక దాహము తీరు కృష్ణ 
గాలి పీల్చాక ఆరోగ్య మేను కృష్ణ 
గూడు చేరాక శాంతితొ భక్తి  కృష్ణ 


--(())_-



ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము  (12 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

మధురమో చిరునవ్వు మలయాడు చున్నట్టి 
ముద్దులు జిలుకు నెమ్మొగము వాడు 
పింఛ భూషణములచే వెలయు కుంతలములు 
సింగారములు కల్గు రంగుకాడు 
వెడద కన్నులతోడ వేడ్క గొల్పెడివాడు 
మదన మోహనుడైన మన్మధుండు 
శబ్దాది విషయ విషామిషంబులు గోరు 
చున్న నా మనమున నున్నవాడు 

దివ్య తేజంబు కన్నులు తెరిచి నంత
గానబడుచుండు నాకు నిక్కంబు పెద్ద 
కాల మాజ్యోతిగాంచితి కరణ తోడ  
నన్ను రక్షింప శ్రీకృష్ణు సన్నుతింతు
--(())--
  


Image may contain: 1 person
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము  (11 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

వయ్యార వంపుల నడుమను తిప్పయు 
నడక తో నాజూకు కృష్ణ  కులుకు
పైయద మెరుపుల కదలిక మనసును 
అదుపు చేయడం కష్ట మయ్యె
సూరీడు ఎర్రగా మారియు చూడగా 
కృష్ణ  నుదుటి బొట్టు ఎర్ర వెలుగు 
ఏమని కోరేది నవ్వులు చూపేటి
కృష్ణుని ప్రేమల వలలొ పడితి 

తేటగీతి 
నేను వలలోన చిక్కితి ఏమి అడుగ
లేను నీచూపు నీరూపు హృదయ మంత
నిండి యుండియు శాంతిని పొందియున్న
అడగ కుండగ కోర్కలు తీర్చె కృష్ణ 

--(()) - -

Image may contain: 1 person
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము  (10 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

కంటిని చక్కని మేనుపై దండను 
వజ్రపు మెరుపులు నన్ను పిలిచె
కనకపు పాదాలు కాళ్ళకు గజ్జలు
కట్టినకంఠసరులేలు వెలుగు
మొనసి వడ్డాణ మొగపుల మొలనులు
ఉరముపై కౌస్తుభము మెరియు చుండె
ఘనభుజకీర్తులు కట్టాణి ముత్యాల
మాలలు ధరించు చిన్ని కృష్ణ 

తేటగీతి 
ముగ్ధ మోహన రూపము చెప్ప నెవరి
తరము లీలలు కొల్లలు ఏంత తెలిపి
నా మనసు నందు తన్మయ మాయ
కప్పి సమ్మోహ పరిచియు చిన్ని కృష్ణ

Фотографии на стене сообщества – 946 фотографий
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము  (9)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

శ్రీ అప్సర స్త్రీల చేతి పూవుల తోడ 
నిండార మునిగిన చెలువు కాడు  
స్తుతవేణునాద విసృతలహరీ సుఖం 
బుల జొక్కి సోలెడు   బుద్ధి మంతు  
స్రస్తమైపోవు చేలములబట్టుచు, గోపి 
కలు జుట్టుముట్టిన  కులుకులాడు     
మ్రొక్కెడివారికి మోక్షంబు నరచేత   
బట్టియిచ్చెడినట్టి బాలకుండు 

ఎల్ల దేవతాళి యుల్లంబుగొన్నట్టి 
బాలరూపమైన బ్రహ్మయోగి 
నాదు పలుకు లందు మోదంబు లొసగుచు  
నాట్యమాడుగాన బాలకుండు 
--(())--



No comments:

Post a Comment