సోర్స్ : తీర్థయాత్రలు & క్షేత్ర మహిమలు
ఒక సద్గురువుని దర్శిస్తే మీరు వట్టి చేతులతో బయటకు వెళ్లరు.
నాస్తికుడు - ఆస్తికుడు గా..
ఆస్తికుడు - జ్ఞానిగా... చోటనే
జ్ఞాని - గురువుగా...రూపాంతరం చెందుతారు.
⚡️✨⚡️✨⚡️✨
శిష్యుడు:- గురువుకు శుశ్రూషలు చేయడం ఎలా?
గురువు:- అది అసంభవం.
వైద్యుడే రోగికి శుశ్రూష చేయగలడే కానీ రోగి వైద్యునికి కాదు.
గురువు శిష్యుడికి చేసేదే నిజమైన శుశ్రూష.
⚡️✨⚡️✨⚡️✨
ఓంకార్:- త్రినేత్రుడు అంటే ఏమి?
సద్గురు:- ఓంకార్ చూసేది రెండు నేత్రాలతో., ఓంకార్ ను చూసేది మూడవ నేత్రంతో.
🕉🌞🌎🌙🌟🚩
🌹. శ్రీమద్భగవద్గీత - 430 / Bhagavad-Gita - 430 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 39 🌴
39. వాయుర్యమో(గ్నిర్వరుణ: శశాఙ్క:
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తే(స్తు సహస్రకృత్వ:
పునశ్చ భూయో(పి నమో నమస్తే ||
🌷. తాత్పర్యం :
వాయువును మరియు పరం నియామకుడును నీవే! అగ్ని, జలము, చంద్రుడవు నీవే! ఆదిజీవియైన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు వేయినమస్కారములు జేయుచు, మరల మరల వందనముల నర్పించుచున్నాను.
🌷. భాష్యము :
సర్వవ్యాపకమైనందున వాయువు దేవతలకు ముఖ్య ప్రాతినిధ్యము కనుక భగవానుడిచ్చట వాయువుగా సంబోధింపబడినాడు. విశ్వమునందలి ఆదిజీవియైన బ్రహ్మదేవునకు సైతము తండ్రియైనందున శ్రీకృష్ణుని అర్జునుడు ప్రపితామహునిగా సైతము సంబోధించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
Sources used: Master K.P. Kumar: On Healing / Hercules / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹
🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 4 🌻
7. దయానంద సరస్వతి చాలా వ్యాఖ్యానాలు వ్రాసారు. సాంగోపాంగంగా వేదం తెలిసిన అఖండ విద్యాసమేతుడాయన. ఆయనది అసామాన్యమయిన విద్య. అతడికి శిక్ష, కల్పము మొదలయినవన్నీ కూడా కరతలామలకము. ఆయనకు ఇరవై ఏళ్ళప్పుడే అన్నీ వచ్చేసాయి. ఆయన కారణజన్ముడు. అయితే ‘ఆర్యసమాజ’ స్థాపనలో విగ్రహారాధనను తిరస్కరించాడు. పురాణాలు చదవొద్దన్నాడు. రాతిబొమ్మలకు పూజలు చెయ్యవద్దన్నాడు.
8. దేవాలయాలకు వెళ్ళటం మానెయ్యండి అన్నాడు. అలా అయితే హిందూ మతం ఎలా మిగులుతుంది? అందరూ వేదం చదువుకుంటే అగ్నిహోత్రం మాత్రమే ఉంటుందా? ఆయ చెప్పినట్లే అందరూచేస్తారా? ఇలాంటి వాదంవల్లే ఆర్యసమాజం తెరమరుగైపోయింది. ఆర్యసంస్కృతి, ఆర్యమతంలో ఎన్ని వివాదాలు ఉన్నాయో, ఎన్ని అభిప్రాయ భేదాలున్నాయో లెఖ్ఖలేదు. ప్రపంచంలో ఏమతానికీ ఇవి లేవు. దీని నిజస్వరూపం తెలుసుకోవటం ఎవరికైనా కష్టమే, దుస్సాధ్యమే అయింది. అయితే మహర్షుల చరిత్ర తెలిస్తే కొన్ని భావాలు సరిగా అర్థం అవుతాయి. స్మృతులు,శ్రుతులు చదవటం కంటే మహర్షుల భావాలు తెలుసుకోవటమే మనకు శరణ్యం. స్మృతికర్తలు వాళ్ళే కదా! వారి మాటలవల్ల సందేహాలు తీరవచ్చు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 🌹 🌹 🌹 🌹
🌹. మనోశక్తి - Mind Power - 62 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 38 🌴
38. త్వమాదిదేవ: పురుష: పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||
🌷. తాత్పర్యం :
నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది.
🌷. భాష్యము :
సమస్తము శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియుండుటచే అతడు పరమాధారమై యున్నాడు.
“నిధానం” అనగా సమస్తము (చివరకు బ్రహ్మతేజస్సు సైతము) ఆ దేవదేవుడైన కృష్ణుని పైననే ఆధారపడియున్నదని భావము. ఈ జగమందు జరుగుచున్నదంతయు అతడు సంపూర్ణముగా నెరుగును.
ఇక జ్ఞానమునకు అవధియన్నది ఉన్నచో అతడే సర్వజ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడు మరియు తెలియదగినవాడు అతడే. సర్వవ్యాపియైనందున జ్ఞానధ్యేయమతడే.
ఆధాత్మిక జగత్తులో అతడే కారణము కనుక దివ్యుడైనవాడతడే. ఆలాగుననే ఆధాత్మికజగమునందు ప్రధానపురుషుడు ఆ శ్రీకృష్ణభగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹
🌻. శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌻
తరువాత మేము భాస్కరశాస్త్రిని రాజరాజేశ్వరీదేవి గురించి తెల్పమని ప్రార్థించాము.
"రాజరాజేశ్వరిదేవి మన మనస్సుకు, ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉంటుంది. ఆలోచించే మన మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారు తుంది. ఆ మేధాశక్తిని వివేకవంతం చేయడానికి ఈ దేవి సహాయం చేస్తుంది. సాధారణంగా శక్తి, వివేకం కలిసి ఉండవు.
కాని రాజరాజే శ్వరీదేవి శక్తితో కూడిన వివేకాన్ని, వివేకయు తమైన శక్తిని ప్రసాదిస్తుంది. రాజరాజేశ్వరీ శక్తిని పెంపొందించు కున్న సాధకులు తమ వివేకబలంతో విరోధి శక్తులను నిర్మూలించ గల్గుతారు.
ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే, అసురు లను, రాక్షసులను, పిశాచాలను కూడా తన బిడ్డలుగానే పరిగణి స్తుంది. ఆమె శక్తికి ఙ్ఞానమే కేంద్రం. అందువల్ల ఆమె అనుగ్రహం కలిగితే సత్యబోధ కలుగుతుంది.
నేను శ్రీపాదుల దయకు పాత్రుడనైనందున నాకు రాజరాజేశ్వరీ దీక్షలో సఫలత ప్రాప్తించింది," అని దేవి గురించి వివరించి శ్రీపాదులు ఎలా పీఠికాపురంనుండి సంచారానికి బయలు దేరారో తరువాత చెప్తానని, మేమిద్దరం అక్కడకు చేరే ముందే శ్రీపాదులు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చి తాను చేసిన పులిహోర కొద్దిగా స్వీకరించారని, శ్రీపాదులు సాక్షాత్తు మహాసరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళీ, రాజరాజేశ్వరీ స్వరూపులని చెప్పి ఆ ప్రసాదాన్ని మాకు కూడా ఇచ్చారు. తరువాత మేము ముగ్గురం ధ్యానస్థులం అయ్యాము.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
🌹 🌹 🌹 🌹 🌹
: 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 97 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - July 16.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూలై 16.
Be not in despair; the way is very difficult, like walking on the edge of a razor; yet despair not, arise, awake, and find the ideal, the goal.
మార్గం, పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో కూడుకొని ఉంది. అయినా నిస్పృహ చెందకండి. లేవండి, మేల్కొనండి. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.
🕉🌞🌎🌙🌟🚩
[17:05, 17/07/2020] +91 98494 71690: 🌹. కర్మల వల్ల ఎందుకు మోక్షం కలగదు? - మోక్షాన్ని ప్రసాదించని కర్మలనెందుకు చేయాలి? 🌹
📚. . ప్రసాద్ భరద్వాజ
శ్లో || అవిరోధి తయా కర్మ | నా విద్యాం వినివర్తయేత్ |
విద్యా విద్యాం నిహంత్యేవ | తెనస్తిమిర సంఘవత్ ||
భావం :- పరస్పర విరుద్ధమైనవి కాదు గనుక కర్మ అజ్ఞానాన్ని నశింపజేయలేదు. వెలుగు చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలదు.
వ్యాఖ్య :- మన యదార్ధ స్వరూపం ఆత్మ. ఆత్మ అంటే అపరిమితమైనది; శాశ్వత ఆనందప్రదమయినది; పూర్ణమైనది; నిత్యమైనది.
మరి మనం అలా అపరిమితమైన, శాశ్వత ఆనందప్రదమైన, పూర్ణమైన, నిత్యమైన ఆత్మగా ఉంటున్నామా? లేదు. మరి ఎలా ఉంటున్నాం? పరిమితమైన వ్యక్తిగా, అప్పుడప్పుడూ సుఖాలు పొందుతూ, అప్పుడప్పుడూ దు:ఖాలు పొందేవ్యక్తిగా, అపరిపూర్ణుడుగా, అనిత్యమైనవాడిగా ఉంటున్నాం.
అలా ఉంటున్నాం గనుకనే అపరిమితుడుగా, ఆనందస్వరూపుడుగా, పరిపూర్ణుడుగా, నిత్యుడుగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. ఆ కోరికలకు అనుగుణంగా-ఆ వాంఛను నెరవేర్చుకొనటానికే అనేక కర్మలు చేస్తున్నాం.
అయితే ఈ కర్మల వల్ల మనం కోరుకున్నది సాధించగలమా? మోక్షాన్ని పొందగలమా? ఆత్మ సామ్రాజ్యాన్ని చేరుకోగాలమా? అంటే-'చేరుకోలేం' అని క్రిందటి శ్లోకంలో అన్యాపదేశంగా చెప్పారు. ఎందుకు చేరుకోలేమో ఈ శ్లోకంలో ఉపమానసహితంగా తెలియజేస్తున్నారు.
మానవుడు కోరుకొనే ఆనందము అంతులేనిది, అపరిమితమైనది, నిత్యమైనది. మరి చేసే కర్మలేమో అంతంతో కూడినవి, పరిమితమైనవి, అనిత్యమైనవి. పరిమిత కర్మల ద్వారా అపరిమిత ఆనందము రాదు. అనిత్యమైన పనుల ద్వారా నిత్యమైన ఆనందము కలగదు.
అనంతమైన ఆనందం కావాలంటే అనంతమైన కర్మయే చెయ్యాలి. మరి మనం చేసే కర్మలన్నీ కాలంలోనే ప్రారంభమై కాలంలోనే అంతమవుతాయి గాని అనంతం కావటానికి వీలులేదు. కనుకనే కర్మలు మనిషిని అనంతునిగా శాశ్వతానంద స్వరూపునిగ ఎన్నటికీ మార్చలేవు. కర్మలవల్ల ఏం జరుగుతుంది?-
మనం చేసే కర్మల వల్ల మనకు కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాలను పొందటం వల్ల అవి మనలో కొన్ని వాసనలను మిగులుస్తాయి. ఆ వాసనలు మనలను మళ్ళీ అలాంటి కర్మలకు పురిగొల్పుతాయి. ఇలా కర్మలు విధిగా చేయవలసిన స్ధితి ఏర్పడుతుంది. మనం ఒక పుణ్యక్షేత్రానికి యాత్ర చేసి వచ్చాం.
అక్కడ ఎంతో ఆనందాన్ని పొందాం. ఆ అనుభూతి మనలో వాసనగా మారి అలాంటి ఆనందానుభూతిని మళ్ళీ పొందాలని ప్రేరేపిస్తుంది. అలాగే మనం పూజచేశాం లేదా శాస్త్రశ్రవణం చేస్తున్నాం. దీనివల్ల మనలో కొంత ఆనందం కలిగిందనుకోండి. ఆ ఆనందానుభూతి వాసనగా మారి మరల మరల మనసు ఆ పనికి పురికొల్పుతుంది. ఇవి సద్వాసనలు.
అలాగే కొన్ని దుర్వాసనలుంటాయి. పేకాటో, త్రాగుడో, జూదమో ఆడి ఆనందాన్ని పొందామనుకోండి అది మనలో వాసనగామారి, వ్యసనంగా మళ్ళీ మళ్ళీ ఆటకు మనస్సు ప్రేరేపిస్తుంది. కనుక దీనికి అంతులేదు. ఇలా కర్మలు మనను కర్మ సముద్రంలో ముంచివేస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ
(Aura Sheath and it's 7 layers)
✒️ భట్టాచార్య
మానవ శరీరం చుట్టూ ఉండే జీవ-విద్యుదయస్కాంత క్షేత్రమే "ఆరా"(aura). ఈ ఆరా లేదా కాంతి వలయం తల వద్ద హెచ్చుగా ఉండి, పాదాల వద్దకు వచ్చేసరికి పలుచగా ఉంటుంది. ఈ ఆరా , మనతో నిత్యమూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం నిరంతరం సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం 7 పొరలుగా ఉంటుందని....ఈ పొరలు ఒక దానికొకటి ఓత-ప్రోతాలులా అల్లుకొని ఉంటాయని , అధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ప్రతీ ఆరా పొర, మన సూక్ష్మ శరీరంలోగల ఏడు చక్రాలకు సంబంధం కలిగియుంటుంది.
మొదటి పొరను "ఎథిరిక్" లేదా లింగ శరీరం అంటారు. ఈ ఎథిరిక్ , మూలాధార చక్రంతో సంబంధం కలిగియుంటుంది. ఈ ఎథిరిక్, మన భౌతిక శరీరానికి అతి సమీపములో ఉన్న పొర. ఈ పొర స్థలంలో ఒక రకమైన భౌతిక ఆకృతిని కలిగి యుంటుంది. ఈ పొర దాదాపు 5 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఎథిరిక్ పొరలో "నాడులనే" ప్రాణ శక్తి వాహకాలుంటాయి. ఈ ఎథిరిక్ శరీరము, బహిరంగ(భౌతిక వాతావరణ,జీవన విధాన పరిస్థితులు) మరియూ అంతర్గత (భావాలు,ఆలోచనలు) పరిస్థితులను కలిగి ఉంటుంది.
ఈ ఆరిక్ షీత్ లో రెండవ పొర "emotional body" (భావాత్మక శరీరము). ఇది స్వాధిష్ఠాన చక్రముతో సంబంధం కలిగియుంటుంది. మనలో నిత్యం కలిగే భావాత్మక సంచలనాలకు ....ఈ ఆరిక్ షీత్ యొక్క రెండవ పొర ప్రతిబింబంగా ఉంటుంది. ఇది , మన శరీరం నుండి 7 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది.
ఈ పొర , ఎథిరిక్ మరియూ భౌతిక శరీరాలలోకి చొచ్చుకొనిపోయి ఉంటుంది. ఈ పొర మన మనస్సుకు, భౌతిక శరీరానికి మధ్య వారధిగా పని చేస్తుంది కూడా. మనలను అఖండ చైతన్యం వైపు నడిపించే, చోదకునిలా కూడా ఉంటుంది.
మూడవది. మానసిక శరీరం. అంటే మనస్సే. మనస్సు మరల అనేక సూక్ష్మావస్థలలో కలదు. అది తరువాత. ఈ మనోమయ శరీరం గూచ్చి చెప్పుకుందాం. ఈ మానసిక శరీరం, మన సూక్ష్మ శరీరంలో గల "మణిపూరక చక్రంతో" సంబంధం కలిగి ఉంటుంది. ఈ mental body, 7 నుండి 20 సెంటీ మీటర్ల వరకు....విస్తరించి ఉంటుంది. అయితే ఈ శరీరం, మన మానసిక ఆలోచనా క్షేత్ర తీవ్రతలను బట్టి, సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ మానసిక శరీరంలో, ఆలోచనా రూపాలు....మనకు కనిపిస్తాయి. మరియూ ఆ రూపాలు , భిన్న రంగులతో ఒక స్పందనను కలుగ జేస్తాయి.
ఇక 4వ శరీరము. యాష్ట్రల్ శరీరము (ashtral body).
ఈ "ఆష్ట్రల్ శరీరము , 4వ చక్రమైన "అనాహత చక్రంతో" సంబంధం కలిగి యుంటుంది. భౌతిక - అభౌతిక శరీరాల మధ్య వారధిలా పని చేస్తుంది. భావాత్మక శరీరం లాగానే, ఈ శరీరం కూడా భిన్న వర్ణాలతో కూడి యుంటుంది. ఈ నాల్గవ శరీరము...15 సెంటీ మీటర్ల నుండి 30 సెంటీ మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీర ఆరోగ్య స్థితిని బట్టి, ఆధ్యాత్మ ఆరోగ్య స్థితి బట్టి కూడా ఆధార పడియుంటుంది.
ఇక 5వ పొర. "Etheric template body". ఇది 5 వ చక్రమైన "విశుద్ధ చక్రానికి" అనుసంధానించి ఉంటుంది.
6 వ పొర " Celestial body" . ఇది నేరుగా "ఆజ్ఞాచక్రంతో " సంబంధం కలిగియుంటుంది. మూడవ నేత్రం ద్వారా లోపల బయట గల "భగవత్ కాంతి" ని ఈ శరీరం చూసే ప్రయత్నం చేస్తుంది. పరిధులు లేని,అవధులు లేని ప్రేమను...ఈ పొర ప్రతిబింబిస్తుంది. అది ఈ భౌతిక శరీరంపై పడుతుంది.
ఇక 7వది అయిన "Casual Body" . ఈ 7వ పొర , ఈ జన్మలో...ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంతో సంబంధం కలిగియుంటుంది. ఆరాలో గల ఈ ఏడవ పొరలో, గత జన్మల వివరాలుంటాయి. ఈ పొర మన అధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఏడు పొరల ఆరా ఎలా వ్యక్తీకరించబడి ఉన్నదో....వాటన్నిటినీ ఈ ఒక్క పొర ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి "ఆరా" చూసి మనం అతడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నాడా లేక పశువులా ప్రవర్తిస్తున్నాడా? అన్న విషయం చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా లేక జబ్బులతో బాధ పడుతున్నాడా....అన్న విషయం కూడా చెప్పవచ్చు. కాకపోతే , ఆరా చూసే వ్యక్తి "సిద్ధుడు" అయితేనే ఇది సాధ్యం. ఆ సిద్ధత్వం మరీ అంత కష్టం ఏమీ కాదు. కాకపోతే...సతత అభ్యాసం...కనీసం 12 సంవత్సరాలు (పుష్కర కాలం) కావాలి.
మన ప్రతి సంకల్పము, మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా, రూపు దిద్దుకొని ఉంటుంది. ఒక మనిషి చావు-బ్రతుకుల్లో ఉంటే, అతని ఆరా దాదాపు లుప్తంగా ఉంటుంది, మినుకు మినుకుగా.......
సందర్భాన్ని బట్టి ఇంకో విషయం కూడా చెప్పుకుందాం. శరీరానికి వెంటనే ప్రాణం పోదు. అతని ఆరా, ఆ మృత శరీరం దగ్గరే మెల్లగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ ఆరాని చూడగలిగే యోగి, అతని మరణ కారణాన్ని తెలుసుకోగలడు.
కొన్ని సార్లు ఈ "ఆరా" ఏడడుగుల ఎత్తు, నాలుగడుగుల వెడల్పు కలిగి (ఉన్నత వ్యక్తులకైతే), శిరస్సు వద్ద లావు గానూ, కాళ్ళ వద్దకు వచ్చేసరికి సన్నంగానూ ఉంటుంది.
మానవ శరీరం యొక్క "ఆరా క్షేత్రం", మనిషి యొక్క భౌతిక శరీరము చుట్టూ, అండాకారంగా, ఒక గుడ్డు ఆకారంలో....శక్తి రూపంలో చుట్టుకొని ఉంటుంది. దివ్య దృష్టితో ఈ ఆరాను చూస్తే, వివిధ ప్రదేశాలలో...వివిధ గుణాలతో భాసిల్లుతూ ఉంటుంది. ఈ ఆరా ఎంతవరకైతే...వ్యాపించి ఉంటుందో, ఆ వ్యాపనం యొక్క హద్దుల వరకు చూడవచ్చు.
సాధన ద్వారా, కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని....మనం పెంచుకోగలిగితే, మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న "ఆరా" స్పష్టంగా కనిపిస్తుంది.
మనం ఈ ఆరాను చూస్తే, ఆరా రంగులు, ఆరా యొక్క కాంతి క్షేత్రం, ఆరా యొక్క చీకటి క్షేత్రం, ఆరా ఆకారం, ఆరా సాంద్రత....ఇవన్నీ అవగాహనకు వస్తాయి. ఈ ఆరాను మనం వినవచ్చు కూడా. శబ్ద, సంగీత, తరచుదనం, స్పందన....వినవచ్చు. కాకపోతే నిధి ధ్యాసనము, సతత ధ్యానము, సతత మంత్రానుష్ఠానము ఉండాలి. ఇవి లేకుండా ఆరాను చూడాలంటే....కుదరదు. కొంతమందికి చాలా చిన్న వయస్సు నుండే, ప్రత్యేక సాధనలేవీ లేకుండా ఆరాను చూస్తూంటారు. వారు కారణ జన్ములు. వారి జన్మలు ధన్యం. ఆరా శక్తిని కూడా, మనం బయో-టెలిమెట్రీ ద్వారా గ్రహించవచ్చు.
ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగానూ, ఆత్మ విశ్వాస పూరితులు గానూ, శాంత చిత్తులు గానూ ఉంటారో....మీ ఆరా (శరీర కాంతి వలయం), పరిశుభ్రంగానూ,ఆరోగ్యంగానూ ఉంటుంది. ఒక ఆరోగ్య వంతమైన ఆరా "Cocoon of Energy" గా విస్తరించుకొని ఉంటుంది.
ఈ ధనాత్మక - రక్షణాత్మక శక్తి క్షేత్రం....అనేక రంగులతో, శక్తి వంతమైన స్పందనలతో.....పూర్తిగా అండాకారపు హద్దుతో ఉంటుంది. ఏ వ్యక్తి తీవ్ర తపములో ఉంటాడో, ఏ వ్యక్తి ధ్యానము నుండి సమాధి స్థాయికి వెళతాడో, ఏ వ్యక్తి మంత్రోచ్ఛారణ నుండి మహా భావ సమాధికి వెళతాడో, ఏ వ్యక్తి యొక్క కుండలినీ శక్తి పరిపూర్ణంగా వికాసమై ఉంటుందో, అట్టి యోగి "ఆరా" (aura)...అనగా శరీరాన్నావరించిన కాంతి వలయం పూర్తిగా వికసితమై ఉంటుంది. అలాంటి పూర్ణ యోగుల ఆరా "బంగారు వర్ణం" లో ఉంటుంది.
సశేషం
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 44 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 20
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 4 🌻
ప్రాచీనాగ్రాః కుశస్తస్య పృథివ్యాం యజతో యతః | ప్రాచీనబర్హిర్బగవాన్మహానాసీత్ ప్రజాపతిః. 21
యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.
సవర్ణా7ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వే ప్రచేతసో నామ ధనుద్వేదస్య పారగాః. 22
సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.
అపృథగ్ధర్మచరణాస్తే7తప్యన్త మహత్తపః | దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. 23
ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.
ప్రజాపతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గతాః | భూః ఖం వ్యాప్తం హి తరుబిస్తాంస్తరూనదహంశ్చ తే.
ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్ | ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజాపతీన్. 24
కోపం యచ్చత దాస్యన్తి కన్యాం వోమారిషాం వరామ్ | తపస్వినో మునేః కణ్డోః ప్రవ్లూెచాయం మయ్తెవ చ.
భవిష్యం జానతా సృష్టా భార్యా వో7స్తు కులఙ్కరీ | అస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్దయిష్యతి. 26
వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 2 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
మోహత్యాగము ఎవరైతే చేశారో, వారు మాత్రమే ఆత్మవిద్యను పొందగలుగుతారు. ఆత్మవిద్యను తెలుసుకుంటే మోహం పోతుందా? మోహం విడిచిన వాడికి ఆత్మవిద్య వస్తుందా?
చీకటి ఎప్పుడు పోయింది? వెలుతురూ ఎప్పుడు వచ్చింది? వెలుతురు వస్తే చీకటి పోయింది. చీకటి వస్తే వెలుతురు పోయింది. రెండింటిలో ఏది కరెక్టు? చీకటి తనంతట తానుగా పోదు. వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి .
కాబట్టి, మోహం తనంతట తానుగా విడువదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం చేతనే, మోహం నుంచి విడువడుతావు. కాబట్టి, అట్టి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్న శీలురై ఉండాలి. ఇది లక్ష్యము.
సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను గుర్తించవలెనన్న ఇంద్రియములను బాహ్యవృత్తులనుండి మరలించి, మనస్సును ఏకాగ్రము చేసి విచారణ ద్వారా, ధ్యానము ద్వారా ఆత్మను గుర్తించవలెను. సూక్ష్మము అంటే ఏమిటి? కనిపించనది సూక్ష్మము. కనబడేది అంతా స్థూలము, అంటే ఇంద్రియ గోచరమయ్యేది అంతా. కనబడేది అంతా అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియముల ద్వారా తెలియబడేది అంతా స్థూలమే!
కర్మేంద్రియములు అన్నీ కలిపి ఒకటే మూట. కర్మేంద్రియముల సంఘాతము ఒక మూట, జ్ఞానేంద్రియ సంఘాతము ఒక మూట. ఈ రెండూ కలిపితే ఇంద్రియ సమూహము. ఈ రెండింటి ద్వారా నీకు సంవేదనల రూపంలో తెలియబడుతున్నదంతా స్థూలమే.
మరి సూక్ష్మమనగా ఏమి? ఆహార ప్రాణ మనస్సుల యొక్క సమాహారమైన శక్తి ఏదైతే ఉందో అది సూక్ష్మము. ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి ఆత్మను గ్రహించాలి అంటే, సశక్తమైనటువంటి ఇంద్రియం బుద్ధి ఒక్కటే! మిగిలినవి ఏవీ సశక్తమైనవి కావు.
ఎవరిలో అయితే ఈ బుద్ధి వికాసం పూర్ణంగా వికసిస్తుందో, అది మాత్రమే తన బింబమైనటువంటి చైతన్యమునందు సంయమించడానికి అర్హమైనటువంటి ఇంద్రియము.
సత్వగుణ ప్రధానంగా ఉండేటటువంటి సూక్ష్మబుద్ధి ఎవరికైతే ఉందో, వారు మాత్రమే ఆత్మ విద్యను గ్రహించగలుగుతారు. ఎవరెవరికైతే ఇంద్రియోపలబ్దమైనటువంటి జగద్భావనలయందు ఆసక్తి ఉన్నదో, వారు స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉంటారు.
కాబట్టి, అటువంటి స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆత్మ విద్యను తెలుసుకోవడానికి వీలుకాదు. సూక్ష్మబుద్దే సాధ్యం కానటువంటివారికి, బుద్ధి గ్రాహ్యమతీంద్రియం - అనేటటువంటి స్థితి అసాధ్యం.
కాబట్టి మానవులు మొట్టమొదట ఏ స్థితికి ఎదగాలి? సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితికి ఎదగాలి.
స్థూలగతమైనటువంటి ఇంద్రియోపలబ్ధి చేత పొందేటటువంటి సుఖ దుఃఖ సమావిష్టమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి వాటి వెనుక ఆసక్తిని, భోగ్య భావనని నీవు జయించినప్పుడు మాత్రమే, బుద్ధి అంతర్ముఖమై సూక్ష్మస్థితిని పొందుతుందన్నమాట.
కాబట్టి, సాధన ప్రతి ఒక్కరూ ఏ దిశగా చేయాలి? బుద్ధి తన బింబమైనటువంటి చైతన్యము నందు సంయమింప చేసేటటువంటి జ్ఞానపద్ధతిని ఆశ్రయించాలి. అందరూ ధ్యానం ధ్యానం అని అంటూ ఉంటారు. ఏమిటి ధ్యానం అంటే? బుద్ధిని తన మూలమైనటువంటి చైతన్యమందు సంయమింప చేయడమే ధ్యానం అంటే!
🌹 🌹 🌹 🌹 🌹
: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
తెలిసిన బ్రహ్మోపదేశ మిదె
సులభ మనుచు నిదే చూచీగాక !!
పుట్టించినహరి పూరి మేపునా
గట్టిగా రక్షించుగా కతడు
కట్టడిజీవుడు కానక నోళ్ళు
తెట్టదెరువునకు తెఱచీ గాక !!
అంతరాత్మ తనునట్టే మఱచేనా
చింత లో బెరరేచీగాక
పంతపుజీవుడు భ్రమసి సందుసుడి
దొంతలు దొబ్బుచు దూరీగ !!
నొసల వ్రాసినవి నోమించుగా కత- డెసగిన శ్రీవేంకటేశ్వరుడు
విసుగక జీవుడు వీరిడిమాయల నసురసురయి తా నలసీగాక !!
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment