ఆధ్యాత్మికం
--(())--
నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయా ౹
క్రతు కోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే ౹౹
తాత్పర్యం:-నిమిషం గానీ, అరనిమిషం గానీ 'ధ్యానం' చేస్తే వెయ్యి కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఎంతో విశిష్టమైనది.
సమత్వం అంటే ... బేధాలు తొలగడం కాదు; భేదాలకు వెనకున్న 'అభేదాన్ని' గుర్తించడం.
కల కనేవాడు - నిర్గుణుడు.
కలలోని వాడు - సగుణుడు.
శిష్యుడు:- దేవుడు ఎందుకు జగత్తును సృష్టించాడు?
గురువు:- ప్రశ్నయే తప్పు. దేవుడే జగత్తు.
శిష్యుడు:- నేను లేకపోవడం మోక్షమా? నేను మాత్రమే ఉండడం మోక్షమా?
గురువు:- రెండూను.
🕉🌞🌎🌙🌟🚩
[16:29, 24/05/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(536)
🕉🌞🌎🌙🌟🚩
"గురువు సహాయం ఎప్పుడెప్పుడు ఉంటుంది ?"
భగవాన్ శ్రీరమణమహర్షి : గురువు సహాయం ఎప్పుడూ ఉంటుంది. శరణాగతి అయితే అది కనబడుతుంది. సద్గురు నీలోనే ఉన్నాడు. ఉపదేశాలు శరణాగతి చెందని వారికి అవసరం. గురువుపై సంశయాలే కలగరాదు. అలా కలిగితే ఆ శరణాగతి బూటకమని తెలిసిపోతుంది. సద్గురు సదా నీ శిరస్సులోనే ఉన్నాడు. శరణాగతి పూర్తికావటానికి కొంత కాలం పడుతుంది. ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు గురువు అవసరమే. కానీ ఆధ్యాత్మిక సాధనలో మనం చేయవలసింది ఏమిటంటే ఇప్పటికే నేర్చుకున్నది తీసెయ్యటమే ! సాధకునికి ఆత్మసిద్ధి కాలేదే అనే భ్రాంతిని పోగొట్టేందుకు జ్ఞాని సాయం చేస్తాడు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
[16:29, 24/05/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: నిద్రలో కలిగే ఆనందానికీ, తురియ అవస్థలో కలిగే ఆనందానికీ భేదమేమిటి ?
జవాబు: ఆనందం ఒక్కటే, ఎన్నో రకాలు కాదు. ఉన్నదంతా ఒకే ఆనందం. అందులో మెలకువగా ఉన్నప్పటి ఆనందం, అన్ని జీవరాశులూ అనుభవించే ఆనందం, బ్రహ్మానందం ఉన్నాయి. అది ఆత్మ యొక్క ఆనందం. నిద్రలో తెలియకుండా అనుభవించే ఆనందాన్నే తురియ అవస్థలో ఎరుకతోనే అనుభవిస్తాం. ఉన్న భేదమంతా అదే. మెలకువగా ఉన్నప్పుడు అనుభవించే దాన్ని ఉపాధి ఆనందమంటారు. అది అసలైన ఆనందానికి ఒక మెట్టు క్రిందది.
ప్రశ్న: సమాధి యొక్క ప్రయోజనమేమిటి ? ఆ స్థితిలో ఆలోచనంటూ ఏమైనా ఉంటుందా ?
జవాబు: సత్యాన్ని ఎరుకపరచగలిగేది సమాధి ఒక్కటే. సత్యం పై భావాలు ఒక తెరని కప్పుతాయి - సమాధిలో తప్పా.. ఈ పరిస్థితిని గ్రహించలేం. సమాధిలో "అహం" యొక్క అనుభూతి తప్ప వేరే భావాలుండవు. ఆ అనుభవమే నిశ్చలంగా ఉండటమన్నమాట.
సమాధి ఎటువంటి అనుభూతి - నిశ్చలతా లేక ప్రశాంతతా ?
జవాబు: మానసిక అలజడి లేని ప్రశాంతమైన నిర్మలత్వమే సమాధి అంటే. ఇదే మోక్షానికి గట్టి పునాది. మానసిక అలజడి మిథ్య. దానిని ధ్వంసం చేయటానికి ప్రయత్నించు. సమాధిని అనుభవించు. అది ప్రశాంతమైన చైతన్యం. అదే అంతర్గతమైన నిర్మలత్వం.
🕉🌞🌎🌙🌟🚩
[16:30, 24/05/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(536)
🕉🌞🌎🌙🌟🚩
"గురువు సహాయం ఎప్పుడెప్పుడు ఉంటుంది ?"
భగవాన్ శ్రీరమణమహర్షి : గురువు సహాయం ఎప్పుడూ ఉంటుంది. శరణాగతి అయితే అది కనబడుతుంది. సద్గురు నీలోనే ఉన్నాడు. ఉపదేశాలు శరణాగతి చెందని వారికి అవసరం. గురువుపై సంశయాలే కలగరాదు. అలా కలిగితే ఆ శరణాగతి బూటకమని తెలిసిపోతుంది. సద్గురు సదా నీ శిరస్సులోనే ఉన్నాడు. శరణాగతి పూర్తికావటానికి కొంత కాలం పడుతుంది. ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు గురువు అవసరమే. కానీ ఆధ్యాత్మిక సాధనలో మనం చేయవలసింది ఏమిటంటే ఇప్పటికే నేర్చుకున్నది తీసెయ్యటమే ! సాధకునికి ఆత్మసిద్ధి కాలేదే అనే భ్రాంతిని పోగొట్టేందుకు జ్ఞాని సాయం చేస్తాడు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
[16:30, 24/05/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: నిద్రలో కలిగే ఆనందానికీ, తురియ అవస్థలో కలిగే ఆనందానికీ భేదమేమిటి ?
జవాబు: ఆనందం ఒక్కటే, ఎన్నో రకాలు కాదు. ఉన్నదంతా ఒకే ఆనందం. అందులో మెలకువగా ఉన్నప్పటి ఆనందం, అన్ని జీవరాశులూ అనుభవించే ఆనందం, బ్రహ్మానందం ఉన్నాయి. అది ఆత్మ యొక్క ఆనందం. నిద్రలో తెలియకుండా అనుభవించే ఆనందాన్నే తురియ అవస్థలో ఎరుకతోనే అనుభవిస్తాం. ఉన్న భేదమంతా అదే. మెలకువగా ఉన్నప్పుడు అనుభవించే దాన్ని ఉపాధి ఆనందమంటారు. అది అసలైన ఆనందానికి ఒక మెట్టు క్రిందది.
ప్రశ్న: సమాధి యొక్క ప్రయోజనమేమిటి ? ఆ స్థితిలో ఆలోచనంటూ ఏమైనా ఉంటుందా ?
జవాబు: సత్యాన్ని ఎరుకపరచగలిగేది సమాధి ఒక్కటే. సత్యం పై భావాలు ఒక తెరని కప్పుతాయి - సమాధిలో తప్పా.. ఈ పరిస్థితిని గ్రహించలేం. సమాధిలో "అహం" యొక్క అనుభూతి తప్ప వేరే భావాలుండవు. ఆ అనుభవమే నిశ్చలంగా ఉండటమన్నమాట.
సమాధి ఎటువంటి అనుభూతి - నిశ్చలతా లేక ప్రశాంతతా ?
జవాబు: మానసిక అలజడి లేని ప్రశాంతమైన నిర్మలత్వమే సమాధి అంటే. ఇదే మోక్షానికి గట్టి పునాది. మానసిక అలజడి మిథ్య. దానిని ధ్వంసం చేయటానికి ప్రయత్నించు. సమాధిని అనుభవించు. అది ప్రశాంతమైన చైతన్యం. అదే అంతర్గతమైన నిర్మలత్వం.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(535)
🕉🌞🌎🌙🌟🚩
"తర్కించుకోవటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి పొందే అవకాశం ఉంటుందా ?"
ఒక విషయం గురించి ఇరువురు తర్కించుకుంటున్నారంటే అది వారి అనుభవ రాహిత్యాన్ని తెలుపుతుంది. ఎందుకంటే పంచదార తిన్నవాడు అది తియ్యగా ఉన్నదని వాదించడు. పంచదార గురించి తెలుసుకోవాలన్న వారికి దాని తియ్యదనాన్ని, అది పొందే మార్గాన్ని చెప్తాడు. ఎదుటివాడు తిన్నప్పుడు వాడికే తెలుస్తుందనుకుంటాడు. విజయవాడలో ఉండి ముక్త్యాలకు మార్గం ఎటు అని అడిగితే చెప్పటం కష్టం. కొంతదూరం ప్రయాణించి జగ్గయ్యపేట వరకూ వచ్చి అడిగితే ముక్త్యాలకు దారి చెప్పటం సులభం అవుతుంది. ఇంట్లో భర్తగావున్న వ్యక్తి దుకాణంలో యజమనిగా వ్యవహరిస్తాడు. వారు ఇద్దరిగా ఒకరినొకరు చూసుకోవటం సాధ్యంకాదు. మనం అనుకుంటున్న ఆత్మదర్శనం కూడా అలాంటిదే. మన నిజస్థితి మనకి తెలియటమే ఆత్మదర్శనం కానీ క్రొత్తగా కనిపించేదికాదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
🌷💐🌺🌻🌹🌸🍀
నమ్మకం (ఒకరి శక్తి పట్ల ఉండే గౌరవం) అంటే "దేవుడు" ప్రతి మనిషి తన దేవుడే నిజమని నమ్మడం...
"విశ్వాసం" (ఒక సిద్ధాంతం పై స్వయంగా ప్రకటించే విధేయత) అంటే "మతం"
ప్రతి మతం తన సిద్ధాంతమే నిజమని విశ్వసిస్తుంది...
నమ్మకం & విశ్వాసం ఇవి రెండూ మనసు మాయ
(ఒక మతం వాళ్ళని ఒక దేవుడు సృష్టిస్తే మరి ఇతరులు ఎక్కడినుండి వచ్చారు???)
దేవుడు ఒకడే అనే వాస్తవాన్ని గ్రహించడమే "పరిణితి"
మతాలన్నింటిని సమదృష్టితో చూడటమే "సంతృప్తి".
ఈ "పరిణితి తో కూడిన సంతృప్తి" మన:శాంతికి మరోపేరు
"వాస్తవం'' అంటే నమ్మకం & విశ్వాసం లతో పనిలేకుండా ఏదైతే ఉందో (ఉనికి) అది.
ఆ ఉనికి యోగ ద్వారా నీలోనే నీకు అనుభవం లోనికి వస్తుంది...
🕉🌞🌎🌙🌟🚩
గో అంటే ఇంద్రియాలు.
గోపాలుడు అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు అని అర్థం.
గోవిందం అంటే ఇంద్రియాలకు, మరి ప్రకృతికి మూలమైన ఆత్మ పదార్థం అని అర్థం.
సం'దేహం':-
నేను ఈ 'దేహ పదార్థం మాత్రమే' అని భావన ఉన్నంత వరకు, ఎవరికైనా సందేహాలు తప్పవు.
దేనిని నీవు 'మాయ' అని అంటున్నావో, అది సాక్ష్యాత్తు 'బ్రహ్మమే' అని తెలుసుకునే వరకు నీ ఆధ్యాత్మిక సాధన పరిసమాప్తం కాదు.
ప్రశ్న:- ఆచార్యుడు అంటే ఎవరు?
సద్గురు:- 'యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ సః ఆచార్య' అన్నది శాస్త్రం.
అనేకానేక గురువుల నుండి, శాస్త్రాల నుండి ఆత్మ జ్ఞానాన్ని యాచించి పొంది & ఆచరించి.. అలా పొందిన దానిని (ఆత్మ జ్ఞానాన్ని) ఇతరులకు అందించే వారే ఆచార్యులు.
అగ్గిపెట్ట ఒకచోట అగ్గిపుల్ల ఒకచోట ఉంటే అగ్గి ఎలా పుడుతుంది?
సద్గురు ఒకచోట శిష్యుడు ఒకచోట ఉంటే 'ఆధ్యాత్మిక సత్యాలు' ఎలా వస్తాయి?
🕉🌞🌎🌙🌟🚩
: శ్రీరమణీయం-(533)
"మనసును నిరంతరం ధ్యానస్థితిలో నిలిపే మార్గం ఏమిటి ?"
మనశ్శాంతికి, మోక్షానికి ఎంతకాలం పడుతుందని గురువుతో నిబంధనలు పెట్టుకోవటం శరణాగతికాదు. శరణాగతిలో తనకంటూ ప్రత్యేక ఆలోచన ఉండదు. కనుక గురువును నిరంతరం తలుచుకోవడం ద్వారా దైవస్మరణమే తన నిత్యకృత్యం అవుతుంది. అదే మనసుకు నిరంతరం ధ్యానస్థితిని కలిగిస్తుంది. మనం ధ్యానించ దలుచుకున్న నామం, వస్తువు, లేదా విషయం ఏదైనా మన మనోబలాన్ని బట్టి సిద్ధిస్తుంది. ఒక విషయం మన మనసులో ఎంత బలంగా ఉంటుందో అదే మన మనోబలం అవుతుంది. వెనక కూర్చున్న అందమైన భార్యతో బండిపై సినిమాకి వెళ్తున్న వ్యక్తి అప్పటివరకు సంతోషంగా ఉంటాడు. ఇంతలోనే డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయిన విషయం గుర్తుకురాగానే సంతోషంకన్నా ఏక్షణంలో ఎవరు పట్టుకుంటారోనన్న భయం మొదలవుతుంది. మనోబలం అంటే మనసు యొక్క లావు-వెడల్పులు కావు. ఆ మనసుకు ఎక్కువసార్లు గుర్తుకు వచ్చే విషయమే మన మనోబలం. దైవం, గురువు విషయంలోనూ పొందే శరణాగతే భక్తుడికి, సాధకుడికీ నిజమైన మనోబలం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
ప్రశ్న: కేవల నిర్వికల్ప సమాధీ, సహజ నిర్వికల్ప సమాధీ అంటే ఏమిటి ?
జవాబు: మనస్సు ధ్వంసం కాకపోయినా ఆత్మలో నిమజ్జనమవటం కేవల నిర్వికల్ప సమాధి. ఆ స్థితిలో వ్యక్తికి ఇంకా వాసనలుంటాయి. అందువల్ల ముక్తిని పొందడు. వాసనలు నాశనమైన తరువాతనే ముక్తి సంభవం.
ప్రశ్న: సవికల్ప, నిర్వికల్ప సమాధుల తేడా ఏమిటో స్పష్టంగా తెలుయజేయండి ?
జవాబు: పరమోత్కృష్టమైన స్థితిని అంటిపెట్టుకుని ఉండటం సమాధి. ఈ స్థితి, ప్రయత్నం వల్లనే సాధ్యమైతే దానిని సవికల్ప సమాధి అంటారు. మానసిక అలజడులు లేకపోతే, నిర్వికల్ప సమాధి. ఏ ప్రయత్నమూ లేకుండా ఆదిమ స్థితిలో శాశ్వతంగా ఉండటం, సహజ సమాధి.
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (670)
భక్తిశ్రద్ధలు పరిశుద్ధమైన మనసుకు లభించే ఫలాలు !!
భక్తిశ్రద్ధలు పట్టుబట్టి నేరుగా ఏర్పరుచుకునేవి కావు. అవి పరిశుద్ధమైన మనసుకు లభించే ఫలాలు. అవి ఎవరికైతే లభిస్తాయో వారికి దైవానుగ్రహంతో గానీ.. గురుబోధతో గానీ.. స్వీయసామర్థ్యంతో గానీ.. పఠనం ద్వారా కానీ... జ్ఞానం కరతలామలకం అవుతుంది. జ్ఞానం వలన లాభం ఏమిటంటే... ప్రాపంచిక, పారమార్థిక బేధాలు పోతాయి. అట్టివాడు దుఃఖ విముక్తుడు, భయ విముక్తుడు, చింతా విముక్తుడై జీవన్ముక్తుడు అవుతాడు. విశ్వాత్మ, విశ్వకార్యం, విశ్వమనసు ఒక్కటేనన్న సత్యం తెలుసుకుంటాడు. మనసు పవిత్రతతో జ్ఞానాన్ని తెలుసుకునేందుకు చూపే సంసిద్ధత భక్తిశ్రద్ధలు. సుద్గురు అనుగ్రహంతో మనందరికీ అవి కలగాలని ప్రార్ధిస్తూ అష్టావక్రగీతను నేటితో సంపూర్ణం చేసుకుందాం !
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మ విహారాలు:-
ఒక బ్రహ్మజ్ఞాని సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు ఇవి. వీటిని 'బ్రహ్మ విహారాలు' అని పిలుస్తారు.
మైత్రి:- మన కన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారి పట్ల..
కరుణ:- మన కన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల..
ముదితము:- మన కన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారి పట్ల..
ఉపేక్ష:- మన కన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల..
🕉🌞🌎🌙🌟🚩
--(())--
[13:14, 30/07/2020] +91 92915 82862: సాధన :-- దానిని (ఆత్మజ్ఞానం) పొందడానికి కాదు,
దీనిని (దేహ భ్రాంతి) వదలడానికి.
దేహాత్మ భావనే - సాకరోపాసన.
దేహాత్మ భావం వదలడమే - నిరాకారోపాసన.
⚡️✨⚡️✨⚡️✨
రవిశాస్త్రి:- ఈ 'నేను' అనే భావనను అర్థం చేసుకోవడం ఎలా?
సద్గురు:- 'నేను' అనేది భావన కాదు; 'రవిశాస్త్రి' అనేది భావన.
⚡️✨⚡️✨⚡️✨
ఇంద్రజాలం అంటే ఏమిటి?
ఇంద్రియ జాలమే ఇంద్రజాలం. (మాయ) అది మూడు విధాల చూపెట్టి భ్రమ పెడుతుంది.
1. ఉన్నదానిని లేనట్లుగా చూపెడుతుంది.
2. లేనిదానిని ఉన్నట్లుగా చూపెడుతుంది.
3. ఉన్నదానిని మరో విధంగా ఉన్నట్లు చూపెడుతుంది.
🕉🌞🌎🌙🌟🚩
[13:14, 30/07/2020] +91 92915 82862: 🕉🌞🌍🌙⭐🚩
▪️▪️▪️▪️▪️
ఇసుక రేణువు లేకుండా🌊
తీరం లేదు...
💦💦💦💦💦
నీటిబిందువు లేకుండా🌊
సముద్రం లేదు....
🌴చెట్టు లేకుండా🌲🌳🎄
వనం లేదు....
అలాగే 🧘♀️నీవు లేకుండా⛳🦁
దైవం లేదు....
ఇసుక రేణువుతోనే తీరం మొదలౌతుంది.
నీటిబిందువుతోనే సముద్రం మొదలవుతుంది
చెట్టుతోనే వనం మొదలౌతుంది
"నీ"తోనే దైవం మొదలౌతుంది.
ఇసుక రేణువుతోనే తీరం మొదలైనా ,,
ఇసుకరేణువు తన ప్రత్యేకతను ( separativeness ) కోల్పోయి ,,తానూ,,,తీరం ఒక్కటే
అన్న ఎరుకనూ "ఏకత"నూ పొందుతుంది.
నీటి 💧బిందువుతోనే సముద్రం మొదలైనా ,,,
నీటి బిందువు తన ప్రత్యేకతను (separativeness) కోల్పోయి,,తానూ సముద్రం ఒక్కటే
అన్న ఎరుకనూ "ఏకత"నూ పొందుతుంది.
చెట్టుతోనే వనం మొదలైనా,,
చెట్టు తన ప్రత్యేకతను(separativeness) కోల్పోయి ,,
తానూ,వనం ఒక్కటే
అన్న ఎరుకనూ "ఏకత"నూ పొందుతుంది.
"మన "తోనే దైవం మొదలైనా ,,
మనం మన ప్రత్యేకతను (separativeness) కోల్పోయి,,,
మనమూ దైవం ఒక్కటే
అన్న ఎరుకనూ "ఏకత "నూ పొందుతాం.
మీరు ఇప్పుడు అత్యంత స్పృహతో ఉండాల్సిన
తరుణం ఆసన్నమైంది....ఈ ఒక్క సందేశాన్నే నా
జీవితం మొత్తం భోధించాను...ఎందుకంటే భూమి
తన గతిని మార్చుకుంటోంది....ఎలాగంటే
పాము తన పాత చర్మాన్ని కుబుసం రూపంలో
వదిలి0చుకుని కొత్త చర్మాన్ని పొందడానికి చేసే
ప్రయత్నమే భూమీ చేస్తోంది....
పాము తన పాత చర్మాన్ని కుబుసం గా మార్చి
ఆ కుబుసాన్ని తన నుండి వదిలించు కోవడానికి
అది ఇరుకైన మార్గాలగుండా,,,,ఇరుకైన కొమ్మలగుండా,,,
తన శరీరానికి ఎక్కువ ఎక్కడైతే రాపిడి కలుుగుతుందో,,
ఆయా మార్గాలగుండా ప్రయాణిస్తుంది,,అప్పుడే పాత కుబుస రూప చర్మం తొలగించబడుతుంది,,,
అలాగే 🌍భూమి కూడా తన పాత ఎనర్జీని తొలగించుకుని
కొత్త ఎనర్జీ పంథాలోకి ప్రయాణించాలంటే పాము ప్రయాణించి
నట్లే అనేక ఓడుదొడుకులున్న పరిస్తితులద్వారా ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించినప్పుడు భూమి మీద చాలా వేగవంతమైన మార్పులు సంభవిస్తాయి ...
వదిలిపోతున్న పాత చర్మం మీద గగ్గోలు పెట్టె వారే ఎక్కువగా
వుంటారు..
కొత్తరూపం పొందుతున్న దాన్ని కేవలం మేల్కొన్న
వాడు మాత్రమే చూడగలుగుతాడు...,పాత చర్మం వలే
ఏ మాత్రం స్వీయచైతన్యం పట్ల స్పృహ లేని
మానవజాతి చేసే ప్రకృతి వినాశనాన్నీ,,,
ఇతర జీవరాసుల జీవిఃచే హక్కును కాలరాసే ఈ మానవ జాతి యొక్క పాత తత్వాాన్నీ వదిలించు కోవడానికి
పాము అనే 🌍భూమి అనేక
సంక్షోభమార్గాల ద్వారా ప్రయాణించ నున్నది----ఇది అత్యంత
నిషితమైన కన్నుల ద్వారా ,అత్యంత స్పృహతో ఉండాల్సిన తరుణం--కదిలిపోతున్న దానిపట్ల మీకు ప్రేమ గానీ ,ద్వేషం గానీ అవసరం లేదు--అసత్యం పతాక స్థాయిలో కీర్తించ బడుతూ సత్యం అడుగంటిన పరిస్థితులలో మీరున్నారు--
చెప్పనుగా వదిలిపోతున్న పాత చర్మం మీదే అందరి ధ్యాస ,
అందరి చూపు ఉంటుందని---
పాత చర్మం వదిలించుకోగానే పాము ( 🌍భూమి ) ఆ వదిలిన కుబుసపు
చాయలలో కూడా ఉండదు నిద్రపో కండి---మేలుకొని ఉండండి---
మరొక్కసారి గట్టిగా చెప్పాల్సి వస్తే ఎరుకతో ఉండండి---
స్వీయ చైతన్యం పట్ల----మీరూ & దైవం ఒక్కటే అన్న
స్పృహలో నిరంతరం మేలుకొని ఉండండి---
ఈ మార్పు చెందే
సమయంలో ఇంతకంటే.. ఆత్మయోధుడికి పని ఉండదు...
🕉🌞🌍🌙⭐🚩
--))((--
దేవుడు ఉన్న చోటును కనుక్కోవడం కష్టమేమి కాదు., దేవుడు లేని చోటును కనుక్కోవడమే కష్టం.
⚡️✨⚡️✨⚡️✨
భార్యాభర్తల మధ్య ఉన్న భౌతిక సంబంధం - రక్తి.
గురుశిష్యుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం - భక్తి.
జీవేశ్వరుల మధ్య ఉన్న ఆత్మ సంబంధం - ముక్తి.
⚡️✨⚡️✨⚡️✨
నిజమైన నాస్తికుడు భగవంతుణ్ణి ఏమి కోరడు., ఎందుకంటే వాడికి భగవంతుడే లేడు గనుక.
నిజమైన ఆస్తికుడు కూడా భగవంతుణ్ణి ఏమి కోరడు.,ఎందుకంటే వాడు 'భగవదిచ్ఛ' అని ఉంటాడు గనుక.
🕉🌞🌎🌙🌟🚩--(())--
ఆత్మానుభవం అంటే--
కిరణ్ 'ఆత్మ'ను అనుభవించడం కాదు.,
ఆత్మ 'కిరణ్'ను (నామ రూపాలను) అనుభవించడం.
⚡️✨⚡️✨⚡️✨
నిజమైన ఆధ్యాత్మిక సూక్తి ఆలోచింప చేయదు., ఆలోచన లేకుండా చేస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
--(())--
ఆత్మానుభవం అంటే--
కిరణ్ 'ఆత్మ'ను అనుభవించడం కాదు.,
ఆత్మ 'కిరణ్'ను (నామ రూపాలను) అనుభవించడం.
⚡️✨⚡️✨⚡️✨
నిజమైన ఆధ్యాత్మిక సూక్తి ఆలోచింప చేయదు., ఆలోచన లేకుండా చేస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
--(())--
ఎవరికి అవసరమైన వేదాంతాన్ని వారి వారి జీవితమే నేర్పిస్తుంది.,ప్రతి వారి జీవితము ఓ సిద్ధాంతమే, వేదాంతమే.
⚡️✨⚡️✨⚡️✨
శాస్త్రం వలన పొందడం జరగదు. పొందిన తర్వాత శాస్త్రం రూఢీ పరుస్తుంది.అంతవరకే శాస్త్ర ప్రయోజనం.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్నించేవాడే ఓ పెద్ద ప్రశ్న.
🕉🌞🌏🌙🌟🚩
--(())--
మనం ఎప్పుడూ ఉండేది చీకటిలోనే. (మాయలోనే)
ఆ సత్యాన్ని గుర్తిస్తే అదే అసలైన శివరాత్రి.
⚡️✨⚡️✨⚡️✨
ఇతరాన్ని చూడడానికి మాత్రమే ఈ రెండు నేత్రాలు.
తనను తాను చూడడానికి అవసరమైనది మూడో నేత్రం..
తనను తాను చూసే ప్రతి ఒక్కడు ముక్కంటే...
🕉🌞🌏🌙🌟🚩
🌏🌙🌟🚩
వేదాంతం వలన నష్టం ఏమిటంటే -- 'లాభం ఉంది' అనుకోవడం.
వేదాంతం వలన లాభం ఏమిటంటే -- 'నష్టం లేదు' అని తెలియడమే.
⚡️✨⚡️✨⚡️✨
ఎవరి X-Ray filmను వారు నిత్యం చూసుకుంటూ ఉంటే, వేదాంతం త్వరగా బోధపడుతుంది.
⚡️✨⚡️✨⚡️✨
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
సర్వ ధర్మములను వదిలేస్తే మిగిలి ఉండేది 'సత్యము'.
అనగా 'నాది'నంతా వదిలేస్తే మిగిలి ఉండేది 'నేను'.
( నేను = సత్యం; నాది = ధర్మం)
🕉🌞🌏🌙🌟🚩
--(())--
దేవుడు డిమాండ్ అయింది -- చూపించేవాడు లేక కాదు, చూచేవాడు లేక.
⚡️✨⚡️✨⚡️✨
అమ్మ గర్భంలో ప్రవేశించింది మొదలు భూదేవి గర్భంలో కలిసే వరకు...
ప్రతిదీ (జననం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం) తన ప్రమేయం లేకుండానే (అప్రయత్నంగా) ఒకటి తర్వాత మరొకటి తొలగిపోతూ ఉంటాయి.
ఈ జనన మరణాల చక్రానికి కారణం తెలియనంత వరకు...
తాను నియతికి బానిసగా ఉంటాడు.
కారణం తెలిసిన క్షణం తానే కర్త అనేది తెలుస్తుంది.
⚡️✨⚡️✨⚡️✨
భగవంతుడు పరీక్షలు పెట్టడం, మార్కులు వేయడం అంటూ ఏమీ లేదు.
తనకు తానే పరీక్షలు పెట్టుకుంటాడు, తనకు తానే మార్కులు వేసుకుంటాడు.
🕉🌞🌏🌙🌟🚩
--(())--:
🕉🌞🌎🌙🌟🚩
సాక్షిగా తన జీవితాన్ని తాను చూడగలిగితే చాలు., అంతకు మించిన ఆధ్యాత్మికత లేదు.
⚡️✨⚡️✨⚡️✨
బోధను గ్రహించి బోధకుణ్ణి వదిలేయాలి. చెప్పినవాడు 'మాయం' కావడమే, చెప్పిన బోధ సఫలం అయినట్లు లెక్క.
⚡️✨⚡️✨⚡️✨
మాకు సంస్కృతం తెలియదు, మాకు శాస్త్ర పరిచయం లేదు.
మా అనుభవమే మాకు శాస్త్రం, మా అనుభవమే మాకు ప్రమాణం.
⚡️✨⚡️✨⚡️✨
రామకృష్ణ:- ముక్తికి సిద్ధులు ఆటంకమా?
సద్గురు:- నామ రూపాలు లేని 'తాను', నామరూపాలు కలిగిన 'రామకృష్ణ' గా ఉండడమే తొలి సిద్ధి.
"రామకృష్ణయే" ప్రధాన ఆటంకం ముక్తి కి.
⚡️✨⚡️✨⚡️✨
సత్యాన్ని తెలుసుకో అంటే :--
హేమ 'సత్యాన్ని' తెలుసుకోమని కాదు,'హేమయే అబద్దం' అనే సత్యాన్ని తెలుసుకో అని.
⚡️✨⚡️✨⚡️✨
'కలలో మెలకువ'గా ఉన్నాము ఇప్పుడు.
'మెలకువలో కల'గా ఉండాలి ఎప్పుడు.
⚡️✨⚡️✨⚡️✨
రమేష్:- కర్త ఈశ్వరుడే, మరి నేనేమీ చేయడం లేదా?
సద్గురు:-రాజాస్థానంలో పనిచేసే రాజోద్యోగి స్వయంగా తానే అన్ని పనులను నిర్వహిస్తున్నట్టు కనబడిన, ఆ నిర్వహణలో అంతర్లీనంగా రాజ ఉత్తర్వు ఉంటుంది. అట్లే జీవుల సంకల్పములతో కూడిన సకల కర్మలు కూడా 'పరా'ధీనములే సందేహము లేదు.
🕉🌞🌎🌙🌟🚩
* శ్రీ భక్త మందారము
* అన్నమయ్య సంకీర్తన
* శ్రీ రమణీయం
* పంచకోశములు - ప్రాణమయకోశము
* శ్రీదుర్గా పంచరత్నం
శ్రీ భక్త మందారము (తల్లి)ఓం రామ్ - ప్రాంజలి ప్ద్రభ
తేటగీతి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అమ్మ చూపుతుంది మనకు దిక్కుమొక్కు
అమ్మ నేర్పుతుంది మనకు సత్య వాక్కు
అమ్మ సేవతో ప్రేమను పంచు హక్కు
అమ్మ సర్వము తెలిపేటి హృదయ బుక్కు
అమ్మ ది మనస్సు ఘంధం శాంతి దూత
అమ్మ ది యశస్సు సుఘంధం నగవు పంచు
అమ్మ ది వయస్సు గ్రంధాన్ని తెలుపు జ్ఞాని
అమ్మ ది తపస్సు నిర్మళం నిత్య మందు
అమ్మ ది సహనం కరుణకు ప్రణయ రాశి
అమ్మ ధైర్యము నిత్యము జీవరాశి
అమ్మ మాటలు ఆనంద వినయ రాశి
అమ్మ సంసార నడకకు తీర్పు రాశి
అమ్మ పిలుపులు నిత్యము మేలు కొలుపు
అమ్మ అరుపులు న్యాయాన్కి మారోమలుపు
అమ్మ తెలివియు బతుకుకు తెచ్చె కొలువు
అమ్మ తోడుంటే స్వర్గపు గెలుపు కళలు
అమ్మ స్పర్సలో వాస్చల్య గట్టి గుండు
అమ్మ చూపులో ఆప్యాయత కరుణ ఉండు
అమ్మ తలపుల్లో నైర్మల్య మేమి లేక
అమ్మ పిలుపుల్లో ప్రశాంత చూపు చుండు
శివుని ప్రియురాలు లక్ష్మలు కల్గి ఉండి
మహిమ లుగలిగి ఆదిపత్యమును కలిగి
గుర్తు చేసేటి స్థితికల్గి ధైర్య శాలి
యంత్ర మంత్ర మహేశ్వర శక్తి మాత
--((*))--
* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 43-1
సంపుటము: 1-261
ఆదిమునుల సిద్ధాంజనము
యే దెసఁ జూచిన నిదివో వీఁడే !!
॥పల్లవి॥
నగిన సెలవిఁ బడు నాలుగుజగములు
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే !!
॥ఆది॥
కనుదెరచిన నలుగడ నమృతము లటు
అనువునఁ గురసీ నపారము
వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
మనికికి నిరవై మలసీ వీఁడే !!
॥ఆది॥
పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
పరిపూర్ణ పరాత్పరుఁడు
సరుస రుక్మిణికి సత్యభామకును
వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే !!
॥ఆది॥
🕉🌞🌎🌙🌟🚩
కీర్తనలో అర్ధాలు:
---------------------------
ఆదిమునులకు= సనకాదిమునులు
సిద్ధాంజనము= తలచినప్పుడు దర్శింపజేసే ప్రేక్షకుడు
మోహనము= అద్భుతము
నిగిడి= విభృభించి
మనికికినిరవై= జీవనాధారమై
మలసీ= వసించినాడీ
పరాత్పరుడు=సర్వశ్రేష్ఠుడు
భావామృతం
-----------------------
ఈ శ్రీకృష్ణపరమాత్మ సనకాది మునివర్యులకు తలచినప్పుడు దర్శనమిచ్చే వారికి యెక్కడ చూచినా ఇదిగో వీడే. యశోదకు తన నోటిలో అద్భుతము విజృంభించి చూపిన నిధానమితడే. నాలుగు జగములను బోసినవ్వుల నోటిలో జూపినాడు. ఆగొపెమ్మగృహమున కీర్తించబడినాడు. బాలకృష్ణుడు తన విశాల నేత్రాలను విప్పి చూస్తే నలుదిక్కులా అమృతం వర్షించేది. రేయింబవళ్ళు ఆ అపారమైనధారలో నందగోకులంలోని వనితలు తేలియాడిరి. ఈ బాలకృష్ణుడే జీవనాధారమై వసించినాడీ దేవదేవుడు. ఈ శ్రీకృష్ణుడే పరమునకు పరమై అత్యున్నత మోక్షదాతయై వెలసిన పరిపూర్ణుడు. ఈయననే సర్వశ్రేష్ఠుడు క్రమముగా రుక్మిణీ సత్యభామలను పెండ్లాడిన వరుడితడే శ్రీవేంకటాచలమున కాదనక వరము నొసగునది వీడేవీడే అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌎🌙🌟🚩
[16:33, 02/07/2020] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - July 2.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూలై 2.
The more opposition there is, the better. Does a river acquire velocity unless there is resistance? The newer and better a thing is, the more opposition it will meet with at the outset. It is opposition it will meet with at the outset. It is opposition which is foretells success. Where there is no opposition there is no success either.
ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిరేకతే విజయ సూచకం. ప్రతికూలత ఎక్కడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు.
🕉🌞🌎🌙🌟🚩
SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...
TRUE EFFORT
One must work as the dictate comes from within, and then if it is right and good, the society is bound to veer round, perhaps centuries after one is dead and gone.
స్వామివివేకానంద-ధీరయువతకు...
సత్ప్రయత్నం
అంతర్వాణి ప్రబోధమును అనుసరించి వ్యక్తి పని చేయాలి. అది యోగ్యమైనది, న్యాయమైనది అయితే సమాజం తన ఆమోదాన్ని తెలుపవలసిందే. కాకపోతే అది ఆ వ్యక్తి మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత కావచ్చు.
🕉🌞🌎🌙🌟🚩
: 🕉🌞🌎🌙🌟🚩
తానెప్పుడు 'నవీన్' గానే ఉంటూ ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తాను ఆత్మ అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం -- ఇది సరికాదు.
తానెప్పుడు 'ఆత్మ'గానే ఉంటూ ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తాను నవీన్ అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం -- ఇది సరి.(జీవన్ముక్తి)
⚡️✨⚡️✨⚡️✨
శివలింగం పైన అభిషేకించిన ద్రవ్యములన్నీ కిందకు జారి పోయినట్లు, 'నేను-నాది' అనుకునే ప్రతిదీ ఎప్పటికైనా జారిపోతాయని, ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని గుర్తించడమే "అభిషేకం"లోని అంతరార్ధం.
🕉🌞🌎🌙🌟🚩
: శ్రీరమణీయం - (575)
🕉🌞🌎🌙🌟🚩
"ఈ ప్రపంచంలో జీవించడానికి ఒక పరిధి అవసరం కదా ! మరి సాధనలో పరిధిలేకుండా జీవించమంటారెందుకు ?"
నేను జీవించటానికి దేనితో పనిలేదని అనుకునేవాడు సుఖిస్తాడు. ఎందుకంటే నా జీవితానికి ఎంతకావాలి ? ఏమికావాలి ? అనుకుంటున్నామంటేనే పరిధిని నిర్ణయిస్తున్నామని అర్థం. ఆ పరిధే ముక్తిని దూరం చేస్తుంది. మన ఇంటికి ప్లాన్ వేయించుకుని ఎంతో కర్తృత్వంతో ఊగిపోతాం. కానీ అప్పటికే ఊరి వెలుపల ఉన్న ఏరు, కొండకు ఎవరు ప్లాన్ వేశారో ఆలోచిస్తే అర్థమవుతుంది. విచారణమార్గంలో మన నిమిత్తం ఏమిటో అర్థమైతే పరిధికి అతీతమైన శాంతి వస్తుంది. సముద్రం చేరిన నదికి ప్రవాహం, ప్రత్యేక ఉనికి ఉండనట్లే, మనసు స్వరూపం తెలిసిన తరువాత ఏ గుణానికి ఇక విలువ ఉండదు. ఈ ప్రపంచం నాకు ఏమీ ఇచ్చింది ? అన్న ప్రశ్నకు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు ఇలా చెప్పారు.. "ఇల్లు, డబ్బు పేరుతో కొంత…
[16:38, 02/07/2020] +91 92915 82862: "ఋభుగీత "(42)
🕉🌞🌎🌙🌟🚩
3వ అధ్యాయము
జ్ఞానమే అంతిమఫలంగా నిలుస్తుంది !
ఆత్మబోధనలో ఎందుకంత ఉన్నత స్థాయి మాటలు చెప్పారంటే... గురువు, దైవం ఎప్పుడూ తాము గొప్పగా ఉండి పూజలందుకోవాలని భావించరు. మనందరిని అంత ఉన్నతులుగా మార్చాలన్నదే వారి దృక్పథం. అందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించడమే ఇక్కడ ఋభుమహర్షి ఉద్దేశ్యం. ఉపదేశాలు, మంత్రాలు , సాధనామార్గాలన్నీ మన ప్రారబ్ధంలోనివి. అవి ఏఏ పద్ధతుల్లో ఎన్ని చేసినా మనకు కలిగే జ్ఞానమే అంతిమఫలంగా ఉంటుంది. మనకు కలిగే అవగాహనే ఆ జ్ఞానంగా పరిణమిస్తుంది !
🕉🌞🌎🌙🌟🚩
🌹. పంచకోశములు - ప్రాణమయకోశము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ...
📚. ప్రసాద్ భరద్వాజ
పంచ ప్రాణములు - కర్మేంద్రియములు ఐదింటిని కలిపి ప్రాణమయకోశము అంటారు.
ఆకలి దప్పికలు ప్రాణమయకోశ ధర్మములు.
ఈ ప్రాణమయకోశము శరీరము, మనస్సులకు మధ్య వాహకముగా పనిచేస్తుంది.
ప్రాణము లేని శరీరమును దహనము చేస్తున్నారు. ప్రాణము ఉన్నంత వరకే ఈ శరీరమునకు విలువ. కనుక ప్రాణమయకోశమే ఆత్మ అని పొరపడుటకు అవకాశమున్నది.
ప్రాణశక్తి లోకిని , బయటకు సంచరిస్తూ నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ప్రాణమయకోశము ఆత్మ కాదు.
కాని నేను వ్యవహరించే సమయమున
నేను ఆకలిగొన్నాను
నేను దప్పికగొన్నాను
నేను ఆరోగ్యముగా లేక అనారోగ్యముతో ఉన్నాను( ప్రాణము బాగుండ లేదు)
అని ప్రాణమునకు సంబందించిన ధర్మములను నేను(ఆత్మ)కు ఆపాదిస్తున్నాము.
ఇవన్నియూ ప్రాణము ధర్మములు అని భావించి వాటితో తధాత్మ్యత చెందక నేను ఆత్మ స్వరూపుడను, సాక్షిని అను భావంతో మెలగ వలెను.
🌹 🌹 🌹 🌹 🌹
పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం
శ్రీదుర్గా పంచరత్నం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩
దుర్గాదేవిని
స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం. అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు.
అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది.
అదే శ్రీదుర్గా పంచరత్నం
(శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము “మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి ” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు)
మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి అలోచిస్తున్న శిష్యులు వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది నీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది” అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను.
వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు.
ఆ శ్లోకం ఇదే “బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”
“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.”
ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.
||శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం ||
1.తే ధ్యాన యోగానుగా తాపస్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూడాం
త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!
ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండ గానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.
2.దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత
మహర్షిలోకస్య పుర:
ప్రసన్న
గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!
ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.
3.పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!
ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.
4.దేవాత్మ శబ్దేన శివాత్మ భూత
యత్కూర్మ వాయవ్య వచో వివృత్య
త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!
దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.
5.త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత
జ్ఞాన స్వరుపాత్మ దయఖిలానాం
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!
అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.
కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment