స్వర్గానికి రోడ్డు మార్గం
(స్వర్గారోహిణి యాత్ర-3)
విశేష సూచన:
ఈ స్వర్గారోహిణి యాత్ర అత్యంత కఠినమైనది, అత్యంత సాహసోపేతమైనది. ఎంతో కొంతవరకైనా పర్వతారోహణ చేయగలిగే వారు మాత్రమే చేయగలిగేది. ఆస్తమా, హృద్రోగ, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు లేని వారు మాత్రమే ఈ యాత్ర చేయడానికి అర్హులు.
దేవతాభూమియైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనున్న ఈ స్వర్గారోహిణి తీర్థయాత్ర వైభవాన్ని క్రితం పోస్టులో నాకు భగవనుగ్రహంతో తెలిసినంతవరకు చెప్పియున్నాను. ఇప్పుడు ఈ యాత్ర చేయుట ఎలాగూ అన్న విషయం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకొందాము.
మనము ఈ యాత్రను డిల్లీ నుండి లెక్కేసుకొందాము. డిల్లీ నుండి బయలుదేరి హరిద్వార్ చేరుకోవాలి. అక్కడినుండి పబ్లిక్ ట్రాన్స్ పోర్టుగానీ, ప్రైవేట్ గా కానీ మాట్లాడుకొని బదరి చేరుకోవాలి. చేరుకొన్న రోజు మొత్తం బదరిక్షేత్రంలోనే దర్శనాలు పూజలు ఇతరత్రా బ్రహ్మకపాలం వద్ధ పితృపూజలు వగైరాలకు ఒకరోజు సరిపోతుంది.
ఈ స్వర్గారోహిణి యాత్ర జూన్ నెల నుంచి అక్టోబరు వరకు ఉంటుంది అక్కడి వాతావరణం బట్టి అటు ఇటు మార్పులు ఉండవచ్చును. ఒక గ్రూపుగా కనీసం నలుగురైదుగురుకు తగ్గకుండా సమూహం ఉండేటట్లుగా యాత్రికులు ఉండటం మంచిది. ముందుగా బదరినాథ్ లో ఈ యాత్ర చేయడానికి అధికారులనుంచి పర్మీషన్ తీసుకోవలిసి ఉంటుంది. ఈ యాత్రకు ఒక గైడు, ఇద్దరు, ముగ్గురో షెర్పాలు(సేవకులు) అవసరం ఉంటుంది.యాత్రికులను బట్టి వీరి సంఖ్యలో మార్పు ఉండవచ్చును. వారే మనకు వంట వండిపెట్టడానికి, వంటసామగ్రి, మనము పడుకోవడానికి టెంట్లు, వగైరా సామాగ్రి మోసుకొస్తారు. వీరిని బదరినాథ్ లోనే మాట్లాడుకోవాలి. గైడ్ కూడా ఖచ్చితంగా అవసరమే.
బదిరినుంచి బయలుదేరి యాత్ర ముగించుకొని రావడానికి 4-5రోజులు పట్టవచ్చును. మొత్తం మీద ట్రెక్కింగ్ 32 కి. మీ. ఉంటుంది.
మొదటిరోజు బదరి నుంచి లక్షీవనం వరకు యాత్ర 10కి.మి నడకద్వారా చేరుకోవాలి. మానా దాటగానే మాతా మందిర్ దర్శనం అవుతుంది. అక్కడే ద్రౌపతిదేవి శరీరత్యాగం చేసిన ప్రదేశం. అలకనందా నది ప్రక్కనుండి నడుస్తూ యాత్ర సాగుతుంది. మధ్యలో ఆనందవన్ అనే ప్రదేశం వస్తుంది. నిజంగా ఆనందవనమే అది. హిమాలయాలలో పూచే పుష్పాలు పచ్చిక బయళ్ళతో ఆ ప్రదేశం మనోహరంగా ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి నడవవలసి ఉంటుంది.
అక్కడనుంచి వసుధార చూడవచ్చును.
మద్యలో బాను గ్లేషియర్ వస్తుంది.
అక్కడే నకులుడు శివైక్యం చెందిన ప్రదేశం.
అది దాటాలి. అక్కడ చమ్టోలి అని మైదానంలాంటి ప్రదేశం వస్తుంది.
అలకనందా నది దాటి లక్ష్మీవనం చేరుకొంటారు యాత్రికులు, దాదాపు 5-6 గంటలు పడుతుంది ఇక్కడికి చేరుకోవడానికి.
ఆ రోజే అక్కడే విశ్రామం.
ఈ ప్రదేశంలోనే సహదేవుడు శరీరత్యాగం చేశాడు.
2వరోజు
లక్ష్మీవనంలో నుండి వీలయినంత త్వందరగా బయలుదేరి చక్రతీర్థం చేరుకోవలసి ఉంటుంది. ఇది కూడా దాదాపు 10కి.మి ప్రయాణం ఉంటుంది. ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. దారిలో బంధా గ్లేషియర్ అని ఒక ప్రదేశం వస్తుంది. దాని ప్రక్కనుండి జాగ్రత్తగా వెళ్ళవలయును. అక్కడే భాగీరథి గ్లేషియర్ వస్తుంది. అక్కడే సహస్రధార ఫాల్స్ ఉండేది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రెండు కళ్ళు సరిపోవు. ఒకవైపు సుందరమైన పర్వతాలు మరొకవైపు సహస్రధార. చాలా సుందరమైన దృశ్యం. ఇది కూడా ప్రమాదకరమైన నడక ప్రయాణమే. అక్కడే గైడ్ సలహాలు సూచనలు ఉపయోగ పడతాయి. అక్కడనుండి మూడు కిలోమీటర్లు క్లైంబింగ్ చేసుకొంటు వెళితే మరొక ప్రదేశానికి చేరుతారు. చుట్టుతా మూడువైపులా పర్వతాలు కప్పబడియుండి సుందరమైన మైదానం లాంటి ప్రదేశం వస్తుంది. దాన్నే చక్రతీర్థం అంటారు. అక్కడే అర్జునులవారు కైవల్యం పొందిన ప్రదేశం.
ఆరోజు అక్కడే విశ్రామం.
3వరోజు
చక్రతీర్థం నుండి బయలుదేరి సతోపంథ్ చేరుకోవడానికి ప్రయాణం ప్రారంభించాలి. ఈ ప్రయాణం నిట్టనిలువునా ఎక్కవలసి ఉంటుంది. పెద్దపెద్ద బండరాళ్ళు ఎక్కుతు దిగుతు నడక సాగించాలి. ఆక్సజన్ తక్కువగా ఉంటుంది. ఇది కూడా దాదాపు 8కి.మి ప్రయాణం.దాదాపు 7గంటలు పైన పట్టవచ్చును ఇది అధిరోహించడానికి. ఇక్కడే మహా పరాక్రమశాలియైన భీములవారు శరీరత్యాగం చేసిన ప్రదేశం. ఆరోజు అక్కడే సతోపంథ్ నందే విశ్రామం. మరుసటిరోజు ఉదయమే లేచి అక్కడి సతోపంథ్ సరస్సులో స్నాన, జప, తప, అనుష్ఠానాలు చేసుకోవాలి. ఈ తీర్థంలోనే త్రిమూర్తులు ప్రతి ఏకాదశినాడు స్నానమాచరించి తపస్సు ఆచరిస్తారని పురాణాలలో చెప్పబడియుంది. ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఒకవైపు స్వర్గారోహిణి పర్వతం దర్శనమిస్తుంటుంది. మరొకవైపు చౌకుంబా పర్వతం, మరొకవైపు భాగీరథి పర్వతాలు భూతల స్వర్గమంటే అదే అనటంలో ఏమాత్రమూ అతిశయోక్తి కాదు.
అరోజు అక్కడే విశ్రాంతి.
4వరోజు
యాత్రలో ఆఖరి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక్కడనుండి స్వర్గారోహిణి పర్వతం వరకు నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడితోనే యాత్రికులు చాలామంది తదుపరి యాత్రకు స్వస్తి పలుకుతారు. మహాపుణ్యాత్ములు మాత్రమే వెళ్ళగలుగుతారు. ముందుగా చంద్రకుండము, సూర్యకుండము ఒకవైపు దర్శనమిస్తాయి, మరొకవైపు విష్ణుకుండము దర్శనమిస్తుంది. ఆ పుణ్య ప్రదేశమునుండే స్వర్గారోహిణి పర్వతం సంపూర్ణంగా దర్శనమిస్తుంది. ఇక్కడిదాకా వెళ్ళినవారు పర్వతంపైనున్న మెట్లను కూడా చూడవచ్చును. ఇక్కడినుండే మహా ధర్మత్ముడు, పుణ్యశ్లోకుడు, ప్రాతఃస్మరణీయుడు ఐన శ్రీ ధర్మరాజులవారు స్వర్గారోహిణి సోపానాలు అధిష్టించి సశరీరంతో పుష్పక విమానం అధిష్టించి స్వర్గానికి చేరుకొన్నారు.
అ మధురానుభూతులను స్మరించుకొంటూ యాత్రికులు మరల అదేరోజే తిరుగు ప్రయాణం చేసి చక్రతీర్థంయచేరుకొంటారు.
ఆరోజు రాత్రికి అక్కడే బస చేయవలసి ఉంటుంది.
సతోపంథ్ నుండి స్వర్గా రోహిణి వెళ్ళలేకపోతే ఇక్కడినుండి స్వర్గారోహిణి పర్వతాన్ని దర్శించుకొని నాలుగవరోజే బయలుదేరి రిటర్న రావచ్చును.
5వరోజు
చక్రతీర్థం నుండి బయలుదేరి లక్షీవనం మీదుగా బద్రినాథ్ చేరుకొంటారు.
నేను సేకరించిన సమాచారాన్ని మన తీర్థయాత్రలు-క్షేత్ర మహిమలు గ్రూపులో మిత్రులందిరితోను పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నేను కూడా ఈ యాత్ర ఎప్పుడెప్పుడు చేద్ధామా అనే ఉత్సుకతతో ఉన్నాను.
తన్మే మనః శివసంకల్పమస్తు.
--(())--
[
ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు..! రేపే ఆలయ సాకారం...
అయోధ్యలో రామాలయం భూమిపూజ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి
నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు..
శంకుస్థాపనకు పుణ్యనదుల నుంచి జలాలు
తొలి ఆహ్వానం ముస్లిం ప్రముఖుడికి.. బాబ్రీ కేసు కక్షిదారు అన్సారీకి అందజేత
రాముడి కోరిక కావచ్చు.. అందుకే అందుకున్నా: అన్సారీ
అతిథుల కుదింపు.. వేదికపై మోదీ సహా ఐదుగురే!
ఆన్‌లైన్‌లో ఆడ్వాణీ, జోషీ హాజరు.. పటిష్ఠ ఏర్పాట్లు
ఆహ్వాన పత్రిక ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతి
బృహత్తర రామాలయానికి అయోధ్యలో భూమిపూజ
ఆడ్వాణీ రథయాత్రతో ఉద్యమానికి రాజకీయ రూపు
తర్వాత రెండేళ్లకే బాబ్రీ విధ్వంసం
30 ఏళ్లుగా రాముడి చుట్టూనే రాజకీయం
70 ఏళ్లుగా కోర్టుల్లో నలిగిన కేసు
అంతిమంగా తెరదించిన సుప్రీంకోర్టు
శ్రీరాముడికి అనుకూలంగా తీర్పు
అయోధ్యలో రామాలయం కొలువు తీరాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరబోతోంది. బృహత్తర ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరగనుంది. అయోధ్యలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలు తీసుకుంటూనే.. ముందుజాగ్రత్త చర్యగా అతిథుల జాబితాను ఆలయ నిర్మాణ ట్రస్టు కుదించి వేసింది. సంఘ్ అధినేత మోహన్ భాగవత్, ఆయన సహచరులు తరలిరానుండగా..
రామజన్మభూమి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
శతాబ్దాల కల.. దశాబ్దాల ఉద్యమ ఫలితం..
విశ్వవ్యాప్తంగా హిందువులు వేచి చూస్తున్న తరుణం.. రానే వచ్చింది.. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరుగనుంది. వేద పఠనం, మంత్రోచ్చారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా.. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భూమిపూజకు ముందస్తుగా సోమవారం నుంచే పూజాదికాలు మొదలయ్యాయి. మూడ్రోజులు సాగే ఈ క్రతువు బుధవారం నాడు భూమిపూజతో పరిసమాప్తమై.. అనంతరం నిర్మాణ మహాయజ్ఞం ప్రారంభమవుతుంది.
అది సరయూనది.. ఒడ్డునే అయోధ్య నగరం.. కోసల రాజ్య రాజధాని. త్రేతాయుగం నుంచి ఇది శ్రీరామచంద్రుడి జన్మస్థానమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి ఆలయాన్ని మొగల్ పాలకుడు బాబర్ హయాంలో అతడి సేనాపతి మీర్ బాకీ 1528లో ద్వంసం చేసి.. రామాలయ శిథిలాలపై బాబరు పేరిట బాబ్రీ మసీదు నిర్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతారు.
నాటి నుంచే అక్కడ రామాలయ పునర్నిర్మాణానికి డిమాండ్ మొదలైంది. మరో ఎనిమిదేళ్లలో ఈ డిమాండ్‌కు ఐదు శతాబ్దాలు పూర్తవుతాయన్న మాట. 1855లో ఆలయ నిర్మాణం కోసం ఘర్షణలు జరిగాయి. నాటి నుంచి క్రమక్రమంగా హిందువుల గళం పెరుగుతూ వచ్చింది. 1980ల్లో ఉద్యమ రూపం దాల్చింది. రాజకీయ రంగు పులుముకుంది. న్యాయస్థానాల్లోనూ పోరాటం జరిగింది. దరిదాపుగా 70 ఏళ్లు కోర్టుల్లో నలిగిన ఈ కేసుకు నిరుడు తెరపడింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని గత ఏడాది నవంబరు 9వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఇప్పుడు ఆలయ నిర్మాణం మొదలుకాబోతోంది..
కోర్టు తీర్పులు..
రామాలయ నిర్మాణానికి ఇటు న్యాయపోరాటం కూడా సాగింది. ఆ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా చేయాలంటూ 2010 సెప్టెంబరు 30న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. మధ్యవర్తులను నియమించినా ఫలితం లేకపోయింది. తుదకు నాటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరిపింది. నిరుడు నవంబరు 9న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
ఆలయం ఉన్నట్లు తేల్చింది ఓ ముస్లిం అధికారి!
అయోధ్యలో బాబ్రీమసీదు అడుగున భారీ ఆలయ శిథిలాలు ఉన్నాయని భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) రెండు సార్లు (1976-77, 2003ల్లో) జరిపిన తవ్వకాల వల్ల తెలిసింది. 1976-77లో జరిగిన మొదటి తవ్వకాలు నాటి ఏఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ బీబీ లాల్ సారథ్యంలో జరిగాయి. ఆ బృందంలో సీనియర్ ఆర్కియాలజిస్ట్ కె.కె.ముహమ్మద్ కూడా సభ్యుడు. మసీదు కింద పెద్ద ఆలయ నిర్మాణం ఉందని తేల్చింది ఆయనే. సుప్రీం తీర్పును తొలుత స్వాగతించింది కూడా ఆయనే. ముస్లింలు మనస్ఫూర్తిగా దీనిని స్వాగతించాలని.. సయోధ్య, సామరస్యంతో హిందువులతో సహజీవనం చేయడానికి అందివచ్చిన ఈ అవకాశాన్ని జారవిడవొద్దని పిలుపిచ్చారు. అలాగే హిందువులు కూడా పెద్ద మనసుతో ఫైజాబాద్‌లో గానీ లఖ్‌నవూలో గానీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని ప్రతిపాదించారు. భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అయోధ్యలో మాత్రం భూమి కేటాయించవద్దన్నారు.
ప్రపంచం నలుమూలలా..
భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యనదుల జలాలను తెప్పిస్తున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం జరిగే హనుమాన్‌గఢీ పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఏడు వేల దేవాలయాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఐదో తేదీన ఈ ఆలయాల్లో దీపాలు వెలిగించి వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు సహా పలు విదేశాల్లోని భారతీయులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను శంకుస్థాపనకు ఆహ్వానించారు.
మార్చిలోనే నిర్మాణ తొలిదశకు శ్రీకారం..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ ఏడాది మార్చిలోనే ఆలయ నిర్మాణ తొలిదశకు శ్రీకారం చుట్టింది. అయితే కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఆంక్షలతో పనులు పెద్దగా ముందుకు సాగలేదు. మార్చి 25న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహాన్ని తాత్కాలిక ఆవాసంలోకి మార్చారు. ఆలయ నిర్మాణానికి ఎలాంటి అవరోధాలు కలగకుండా వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా విజయ మహామంత్ర జప అనుష్టానాన్ని (శ్రీరామ నామ జపం) నిర్వహించింది.
ఆలయ స్వరూపమిదీ..
వాస్తు శాస్త్రం ప్రకారం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం. దిగువ అంతస్తులోనే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ. ఐదు మండపాలు.. నృత్య మండపం, సింహద్వార్, పూజామండపం, రంగ్ మండపం, గర్భగృహం.. ఉంటాయి. 27 నక్షత్ర వాటికలను ఏర్పాటుచేస్తారు. భక్తులు తమ జన్మదినాన ఇక్కడి చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. భూమిపూజ అనంతరం రామ్‌లల్లాను ఆలయ సముదాయంలోని శేషావతార్ ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్ఠిస్తారు. ఆలయ సముదాయంలో ప్రార్థనా మందిరం, ఉపన్యాస వేదిక, వేద పాఠశాల, సంత్ నివాస్, యాత్రి నివాస్‌లను నిర్మిస్తారు. ఆలయ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ సంస్థ చేపడుతోంది. మూడున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని అంచనా.
ఆలయం పొడవు, వెడల్పు, ఎత్తు
అయోధ్య రామ మందిరాన్ని ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నాగర శైలి’లో నిర్మించనున్నారు. ఇక.. రామాలయ నిర్మాణ ప్రధాన స్థపతి చంద్రకాంత్ సోంపుర (ఆయన తాత ప్రభాకర్‌జీ సోంపుర సోమనాథ్ ఆలయ నమూనా రూపకర్త). ఆలయ నిర్మాణానికి ఈయన 1983లో ప్రాథమిక డిజైన్ రూపొందించారు. తర్వాత 1998లో పూర్తిస్థాయి నమూనాను తయారుచేశారు. ఇప్పుడీ డిజైన్‌ను ఈయన కుమారులు నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపుర నవీకరించారు. ఆలయం వెడల్పు 140 అడుగులు, పొడవు 268 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉండాలని చంద్రకాంత్ ప్రతిపాదించగా.. ఆయన కుమారులు ఎత్తు 161 అడుగులు, పొడవు 300 అడుగులు, వెడల్పు 268-280 అడుగులకు మార్చారు. పాత నమూనాలో 212 స్తంభాలు ఉపయోగించాలని భావించగా.. ఎత్తు, పొడవు, ఎత్తు పెరిగినందున సమతుల్యత కోసం 360 స్తంభాలు అమర్చాలని నిర్ణయించారు. 15అడుగుల లోతున పునాదులు నిర్మిస్తారు.
ఇదీ చరిత్ర...
1528 నుంచి 1822 వరకు ఆలయం కోసం డిమాండ్ ఉన్నా.. మత ఘర్షణలు జరగలేదు. రామాలయంపై మసీదు నిర్మించారని 1822లో ఫైజాబాద్ కోర్టు అధికారి ఒకరు పేర్కొనడం హిందువులకు ఆసరా అయింది. దీని ఆధారంగా.. మసీదున్న ప్రదేశం తమదేనని.. దానిని గుడికట్టేందుకు తమకివ్వాలని నిర్మోహి అఖాడా వాదన అందుకుంది. ఈ విషయమై 1855లో పెద్దఎత్తున హిందూ-ముస్లిం ఘర్షణలు జరిగాయి. మున్ముందు ఇలాంటివి జరగకుండా.. 1859లో మసీదు ఆవరణలో బ్రిటిష్ పాలకులు రెయిలింగ్ ఏర్పాటుచేశారు. 1949 వరకూ ఎలాంటి గొడవలు లేకుండా నడిచింది. 1949లో హిందూమహాసభ కార్యకర్తలు కొందరు మసీదు ప్రాంగణంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. వ్యవహారం కోర్టుకెక్కింది. దీనిని వివాదాస్పద కట్టడంగా ప్రకటించారు. మసీదు తలుపులకు తాళం వేశారు. అదే సమయంలో రామజన్మభూమి ఉద్యమం మొదలైంది. 1980లో విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) రంగప్రవేశం చేసింది. వివాదాస్పద ప్రదేశంలో రామాలయం నిర్మించాలని ఉద్యమం ప్రారంభించింది. 1986లో ఫైజాబాద్ జిల్లా జడ్జి.. ఆ కట్టడం తలుపులు తెరిచి హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతించారు. దీనిని కేంద్రంలో నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం సమర్థించింది. షాబానో కేసులో ఆయన ప్రభుత్వ తీరుతో హిందువులు కాంగ్రె్‌సకు దూరమయ్యారు. తిరిగి వారికి చేరువయ్యేందుకు జిల్లా కోర్టు నిర్ణయానికి రాజీవ్ మద్దతు పలికారు. అయితే రెండు వర్గాల ఓట్లు దూరమై 1989లో ఆయన అధికారం కోల్పోయారు. లోక్‌సభలో బీజేపీ బలం పుంజుకుంది. దాని సీట్లు 2 నుంచి 88కి పెరిగాయి. ఆ పార్టీ మద్దతుతో వీపీ సింగ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత కొద్దికాలానికి బీజేపీ పూర్తిస్థాయిలో రామజన్మభూమి ఉద్యమంలోకి దిగడమే కాకుండా.. దానిని సంపూర్ణ రాజకీయ ఉద్యమంగా మార్చేసింది. దీనిని ఎల్‌కే ఆడ్వాణీ మరింత ఉర్రూతలూగించారు. సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకు రామ రథయాత్ర ప్రారంభించారు. హిందువుల ఓట్లను మరింత సంఘటితం చేయడమే ఈ యాత్ర ప్రధానోద్దేశం. 1990 సెప్టెంబరు 25న సోమ్‌నాథ్‌లో ఆడ్వాణీ మొదలుపెట్టిన ఈ యాత్ర వందల గ్రామాలు, నగరాల గుండా సాగింది. దీనివల్ల ఉత్తర భారతంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. నాటి బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్.. రథయాత్ర సమస్తిపూర్ చేరుకోగానే సరిహద్దులోనే ఆడ్వాణీని అక్టోబరు 23న అరెస్టు చేయించారు. దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన సంఘటన ఇదే. లక్షన్నర మంది కరసేవకులను యూపీలోని ములాయంసింగ్ యాదవ్ సర్కారు అరెస్టు చేసింది. అయినప్పటికీ వేల మంది కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. పోలీసు కాల్పుల్లో 20 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన బీజేపీ.. వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. బీజేపీ తన బలాన్ని 120 స్థానాలకు పెంచుకుంది. 1996 ఎన్నికలనాటికి బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీ (161 స్థానాలు)గా ఎదిగింది. వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ లౌకికవాద పార్టీలేవీ మద్దతివ్వకపోవడంతో 13 రోజులకే రాజీనామా చేశారు. 1998 ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతుతో వాజపేయి సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాది గడవకముందే ఒకే ఓటు తేడాతో ఓడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ వాజపేయి ప్రభుత్వం ఏర్పడింది. ఆలయానికి అనుకూలంగా చట్టం తేవాలని సంఘ్‌పరివార్ డిమాండ్ చేసినా.. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు అందుకు సుముఖంగా లేకపోవడంతో వాజపేయి సాహసించలేదు. కొన్నాళ్లకు ఉత్తరభారతంలో ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. ఫలితంగా 2004-14 మధ్య పదేళ్లు ఆ పార్టీ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం నడిచింది. కానీ నిష్ర్కియాపరత్వం కారణంగా పరాజయం పాలైంది. 2014, 19ల్లో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాముడికి అనుకూలంగా వచ్చిన సుప్రీం తీర్పుతో ఇప్పుడు రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది.
39.🙏 శ్రీమదాంధ్ర భాగవతం 🙏
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు. నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’ దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమన్నది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడు వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో అన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఈకోట శిధిలం అయిపోయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది.
ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి' అని నారదుడిని అడిగాడు. నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పడడము ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.
పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర.
భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!
స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారదమహర్షి గురుత్వం లభించింది. నారదమహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా! నీకు పట్టాభిషేకము చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.
ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా! సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి ఉంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆయన – మహానుభావా ! మీరు వచ్చి ఈ మాట చెప్పారు. నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.
chinna kadha
గోదాదేవి పూర్వజన్మ వృత్తాంతము :
చూడి కొడుత్త నాచ్చియార్ జన్మ గురించి ఒక భగవత్‌గాథ ప్రాచుర్యంలో ఉంది. పురుషోత్తమక్షేత్రంగా ప్రసిద్ధిచెందిన పూరీలో వసంతాచార్యులనే భక్తాగ్రేసరుడు జగన్నాథుని ఆలయంలో ప్రథమ అర్చకుడిగా సేవలందించేవాడు. ఎక్కడాలేని విధంగా దైవం పక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకు వెలితిగా ఉండేది. శ్రీకృష్ణావతారంలోని సుభద్ర ఎందుకు వెలసిందో అనే అనుమానం ఆయనను వేధిస్తూండేది. ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు. శ్రీకృష్ణావతారం సందర్భంగా ఆ అవతారపురుషుని అసమాన సౌందర్యం చెల్లెలు సుభద్రనూ సమ్మోహపరచిందనీ, అందుకే స్వయంభూ అయిన పూరీ క్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన పక్కన ఈ క్షేత్రంలో చోటుకల్పించాడని తండ్రి వివరించాడు.
ఈ వివరణతో సంతృప్తిపడని వసంతాచార్యులు శ్రీలక్ష్మికి లభించాల్సిన న్యాయమైన స్థానం కోసం దగ్గరలోని వనానికి వెళ్లి దైవాన్ని ధ్యానిస్తూ అన్నపానాదులను విడిచి వ్రతం ప్రారంభించాడు. ఆలయంలో ప్రధాన అర్చకుడు లేని కారణంగా జగన్నాథుని పూజాదికాలు సక్రమంగా జరగకపోవడంతో జగన్నాథుడు- వసంతాచార్యుని అనుమానం తీర్చేందుకు వసంతుని ముందు ప్రత్యక్షమయ్యాడు. తాను లౌకిక సంబంధ బాంధవ్యాలకు అతీతుడనీ, అందరిలోనూ అన్నింటా ఉంటూ అనన్య భావం కలిగి ఉంటానని వివరించాడు. కనీసం శ్రీలక్ష్మితోనైనా జగన్నాథుడు తనకు కనిపించాలని వసంతుడు పట్టుబట్టడంతో దైవం ఆ భక్తునికి వరం ప్రసాదిస్తూ 'వసంతా! నీవు వీక్షించడానికి ఆరాటపడే శ్రీలక్ష్మి నీకు మరుజన్మలో కూతురిగా లభిస్తుంది. నీవు నిర్వహించిన అర్చన సేవల కారణంగా మరుజన్మలో నీవు శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునిగా జన్మించి శ్రీరంగనాథుని భక్తునిగా ప్రఖ్యాతి చెందుతావు. నీ భక్తినే నాపై అనురక్తిగా చేసుకొని నీ కూతురిగా పెరిగిన శ్రీలక్ష్మి నన్ను కీర్తిస్తూ ప్రబంధాన్ని రచించి తరిస్తుంది' అని తెలిపాడు. అలా ఒక భక్తుని ఆరాటాన్ని తొలగించడంకోసం చూడికొడుత్త నాచ్చియార్ అవతరించిందని చెబుతారు. ఆండాళ్ (చూడికొడుత్త నాచ్చియార్) పసివయస్సులోనే పరిమళించిన వికసిత భక్తి కుసుమం.
ప్రకృతిభాగస్వాముల ఆవేదనలలో భాగంగా ఈరోజు త్రిమూర్తుల సమాలోచనలు:-
(మొదటి భాగం)
ప్రకృతి లోని జీవులు పంచభూతాలు అనుభవిస్తున్న ఆవేదనలు గ్రహించిన శంకర,నారాయణులు ఇద్దరు తక్షణమే తగు పరిష్కారం చూడాలనుకున్నారు.
బ్రహ్మ దేవుడిని రమ్మని పిలిచారు.
నారాయణుడు:- శంకరా ! భూమిపై జీవులు మానవుని వలన అనేక విధాలుగా బాధలకు గురౌతున్నారు. భూదేవికి కూడ మనుషులు అపకారం తల పెడు తున్నారు . వాళ్ళను కట్టడి చేసే మార్గమేమిటి ?
శంకరుడు :- అవును ,నేను కూడా గమనించాను. గంగాదేవిపట్ల కూడ మనుషుల అపచారం గమనిస్తున్నాను. ఇది క్షమించరానిది .వారికి గుణపాఠంనేర్పవలసిన సమయం ఆసన్నమైంది...బ్రహ్మా !మానవులకు మేధస్సునిచ్చి తప్పు చేసావు. మేము మానవులలో స్త్రీపురుషులు ఇద్దరిని మాత్రమే సృష్టించమంటే నీవు మూడవజాతిని ఎందుకు సృష్టించావు?
బ్రహ్మ:--మూడవజాతి మనుషుల సృష్టి నేను చేయలేదు . కొందరు తమ స్వయంకృత అక్రమ విధానాలవల్ల మూడవజాతిగా మారుతున్నారు
కొందరు , శంకరా నీవుగౌరికి నీశరీరంలో అర్ధభాగం చేసి నర్తిస్తున్న విధానాన్ని అనుకరిస్తూ అదేతమ నైజంగా ప్రవర్తిస్తున్నారు . భూలోకంలో స్త్రీలోలురైన రాజులు కొందరు కంటికి ఇంపైన ప్రతి కన్యను పరిణయమాడి తమ అంతఃపురం చేర్చడం, తదుపరి వారి ఆలనాపాలనలు చూచుకొనక నిర్లక్ష్య ధోరణి వహించడం ఆనవాయితిగా మారింది. కాని పెండ్లాడిన ఆడువారిపై నమ్మకం లేక వారి సేవలకు నియోగించబడు పురుషులకు నాటువైద్యంతో వారి పురుషత్వం హరింపజేసి అంతఃపురంలో సేవలకు నియోగిస్తుంటారు. వారే మూడవజాతి మనుషులు.
వారిని కొజ్జాలని ,హిజ్రాలని పిలుస్తుంటారు .
(సశేషం )
ప్రకృతి భాగస్వాముల ఆవేదనలలో భాగంగా ఈరోజు త్రిమూర్తుల సమాలోచనలు:- (రెండవ భాగం)
విష్ణుమూర్తి :- ధరణిపై భారం పెరిగిపోతున్నది .మనుషుల సంఖ్య అత్యధికంగా పెరగడమే కారణమని తోచుచున్నది .భూమిపైగల మిగతాప్రాణులకువలె వీరికి కామప్రకోపమునకు ప్రత్యేక ఋతువు నిర్దేశించబడక పోవడమే ఒక కారణం .వత్సరమంతా దివారాత్రభేదం లేకుండ కామవాంఛ తీర్చుకునే వారి ప్రవృత్తి వలన వావి వరస ,వయో తారతమ్యాలు పాటించుట లేదు . స్త్రీ జాతి పురుషజాతి దౌర్జన్యాలకు గురవడం తరచు చూస్తన్నాము. అంతేకాక అధిక జనాభా కారణంగా భూమిపై వనరుల కొరత ఏర్పడుతున్నది . మానవులు భూమిపై నివసించు ప్రాణులపట్ల దుర్మార్గపు ధోరణి మితి మీరినది . భూమండలాన్ని ధ్వంసం చేసినది చాలక మరో గ్రహం మీదకు కాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు . దీనికంతటికీ మూలం మానవుడిలో గల మేధస్సు . బ్రహ్మా ! నీవు వెంటనేమానవ జాతిని మేధోరహిత ప్రాణిగా మార్చు . లేనిచో జరుగరాని అనర్ధాలు అనేకం జరుగగలవు.
బ్రహ్మ :-- నారాయణా ! అది సంభవంకాదు. ఒకపర్యాయం మట్టిని పాత్రలుగానో , బొమ్మలుగానో తీర్చి అగ్నిలో కాల్చిన తరువాత వాటి ఆకారం మార్చలేము . అట్లే మాతృ గర్భంలో ప్రవేశపెట్టబడిన బీజం నవమాసాలు అక్కడ అనేకయాతనలు అనుభవించి మానవలోకంలో ప్రవేశించు సమయాన కూడ ఒత్తిడికి గురౌతూ తనను ధరించిన తల్లినికూడవేదనకు గురిచేయడం ప్రకృతి ధర్మం . అట్టి జీవిని మార్చడం అసంభవం .
విష్ణుమూర్తి :-- ఎందుకుసంభవంకాదు ? నీవు సృష్టించిన మానవుడు ఒకజాతి వృక్షమును మరోజాతి వృక్షముతో సంపర్కము చేసి క్రొత్తవృక్షజాతిని
సృష్టిస్తున్నాడు . అట్లే ఒకఅవసరము కొరకు తను తయారు చేసిన పరికరాలను అనేక ఇతర అవసరాలకు తగిన మార్పులు చేసుకుని వాడడం జరుగు చున్నది. ఆమాత్రపు సామర్ధ్యంకూడ నీకు కొరవడినదా?
బ్రహ్మ :-- గతంలో మానవరాజైన విశ్వామిత్రుడునాసృష్టికి ప్రతి సృష్టికావంచిన జీవజాలము యొక్క ఉపయోగం పరిమితమైనదే కదా ! అవి శుభంకరములు కానివి యఙ్ఞయాగాదులకు పనికిరానివి . ఇప్పుడు మానవులు సృష్టిస్తున్న వృక్ష
సంతతి (బొన్సాయ్ ) ఇచ్చే ఫలాలు ఒక కుటుంబ అవసరాలను కూడ తీర్చలేవు. మానవులు తమ పరికరాల ఉపయోగాలు మార్చుకునే పధ్ధతి కూడ
సందేహాస్పదమే .
( సశేషం )
కధ
ప్రాంజలి ప్రభకు పంపినవారికి ధన్యవాదములు
కృష్ణుడి చిన్నతనం లో ఒక రోజు గోపవాడలోకి ఒక పళ్ళమ్మి వచ్చింది.పళ్ళు తీసుకొని మారుగా కొంత ధాన్యం ఆమె బుట్టలో పోశాడు కన్నయ్య.అవి మణిమాణిక్యాలు గా మారిపోయాయి.దాంతో ఆ పళ్ళమ్మి ఈ పిల్లవాడు బాలుడు కాడు,పరమాత్ముడే అనుకోని మురిసిపోతుంది తన భాగ్యానికి.
మధురమైన పండ్లు మధురసమ్ముల పండ్లు కొనుడు ధాన్య మిచ్చికొనగ రండు
పిల్లలార ! యంచు వ్రేపల్లె వీధిలో పండ్లనమ్మ వచ్చె పడతి యొకతె అమ్మి, యిటుల వేగమె రమ్మురమ్మని, పిలిచి తాను వడిగ యింటిలోని కరిగి, చిట్టి దోసిలొగ్గి చిన్నారి కృష్ణుండు, ధాన్య మందుకొనుచు త్వర త్వరగ, చిన్నారి చేతులందున, పన్నుగ ధాన్యమ్ము పట్టి పరుగున రాగా, వున్నవి రాలగ మిగిలిన, కొన్నింటిని పట్టుకొనుచు కూరిమి తోడన్, చిట్టి దోసిలొగ్గి బుట్టలో పోయంగ, ముద్దు కృష్ణు గాంచి మురిసి మురిసి, చిన్ని నాన్న రార కన్నయ్య రమ్మంచు, యెత్తుకొనుచు యెదకు హత్తు కొనుచు, ముద్దులాడి. మరల మురిసి నేలకు దించి, బుజ్జి బుగ్గనిమిరి పుణికి పుచ్చి , యింద తీసికొమ్ము యివి యన్ని నీవంచు, పండ్ల నన్ని యిచ్చె పడతి యంత, చిన్ని కృష్ణు డంత చిరునవ్వు లోలికించి, చిట్టి చేతులదిమి చేర్చి పట్టి, పండ్ల నదుముకొనుచు, పండ్లమ్మి సెలవంచు, లోనికేగె హర్ష లోలుడగుచు, బుట్ట నెత్తుకొనుచు బుట్టలో రాశిగ, కాంతులీను దివ్య కనక రత్న, భూషణమూల గాంచి పొలతి విస్మయ మొంది, తలచె నిటుల హర్ష తరళ యగుచు, బాలుడేమి గాడు పరమాత్ము డీతండు, ధరకు దిగిన శారజ ధరుడు గాని . వీసమెత్తు నాదు ప్రేమ భావమ్మున, కమిత సిరుల నందజేసె!
పాలసంద్రమున వసియించు పరమాత్మ పసులకాపరులింటి పంచ జేరె
భోగీంద్ర శయననుండు బుజ్జి పాపాయిగా తూగుటుయ్యాలలో వూగి తూగె
శంఖ చక్రముల సారించు విష్ణుండు లక్కకాయలు చేతులందు పట్టె
నిగమాగములకు నెలవైన దేవుండు వుంగా వుంగా యంచు వూసులాడే
సౌఖ్య భావమందు సంగమెంతయు లేక ధర్మ కార్య నిపుణ దక్షులగుచు
అలతి పదములందు నాశ్రయమ్మును గోరి అనఘు లవతరింతు రవనియందు.
అటుల విశ్వస్థితి కారకుడైన విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించిన ఘట్టం సుమనోహరం.ఆ కన్నయ్య కథా శ్రవణం అతి రమ్యం.
.(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)
-----------------------శుభరాత్రి ---------------------------
--(())--
నాద యోగం - సమాధి స్థితి - దశ విధ నాదాలు :
భట్టాచార్య
సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నపుడు....కుండలినీ శక్తి మేల్కొని, అనాహత చక్రం చైతన్య వంతమైతే "దశ విధ నాదాలు" అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిర పడితే, రక రకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే "చిత్కళలు" అంటారు. కూటస్త చైతన్యమునే "బిందువు" అంటారు. అయితే ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.
నాద యోగాభ్యాసంలో భాగంగా, ప్రణవ సాధన చేసేవారికి....మొదటి దశలో, లోపలి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం, దీక్షగా అభ్యాసం చేస్తూ ఉంటే, చివరికది సూక్ష్మ నాదంగా పరిణమిస్తుంది. ప్రారంభంలో, లోపల నుండి (1). సముద్ర ఘోష (2). మేఘ ఘర్జన (3). భేరీ నాదం (4). నదీ ప్రవాహం చప్పుడు.......వినిపిస్తుంది. అయితే ఈ నాదాలు ప్రణవం యొక్క వివిధ పరిణామ రూపాలే. సాధన మధ్య దశలో 1. మద్దెల శబ్దం 2. ఘంటా నాదం 3. కాహళ నాదం వినిపిస్తాయి. ఇవన్నీ, కుండలినీ శక్తి జాగృతిలో, "నాదానుసంధాన" యోగ సాధనలో, ధ్యానావస్థల్లోని...పరిపూర్ణ దశలలో వినిపించే నాదాలివి. ఈ ప్రణవ అభ్యాసం చివరి దశలో, చిరుమువ్వల చప్పుడు, మధురమైన వేణు గానం, తుమ్మెద ఝంకారం....లాంటి వివిధ నాదాలు....అత్యంత సూక్ష్మంగా సాధకునికి వినిపిస్తాయి.
సాధకుడు, తన సమాధి స్థితిలో నాదాన్ని వింటూన్నపుడు, మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినపడతాయి. ఆ సమయంలో, దాని వెనుకే....అత్యంత సూక్ష్మ నాదాలు వినపడతాయి. ఈ నాదాలను కూడా జాగ్రత్తగా వినాలి. సూక్ష్మ నాదాలు వింటూ...పెద్ద ధ్వనులను విడిచి పెట్టాలి. అలాగే పెద్ద ధ్వనులు వినేటపుడు, సూక్ష్మ నాదాలు విడిచి పెట్టాలి. ఇలా నిరంతరం నాదాభ్యాసం చేస్తున్నపుడు, మనస్సు ఒక నాటికి ఏదియో ఒక నాదంపై ఏకాగ్రతను పొంది, మనోలయం జరుగుతుంది. మనోలయమే కదా, కావలసింది.
--(())--
నాద యోగం
భట్టాచార్య
నాద యోగుల భావనలోను ,నాద యోగ గ్రంథాల లోను’’ నాదబ్రహ్మ’’ .లేక పారమార్ధిక నాదం నుండే సకల సృష్టి ఆవిర్భావం జరిగిందని ఉన్నది. ప్రపంచం అంటే శబ్ద కంపనాల ప్రాక్షేపణ( projection )అని నాద యోగుల విశ్వాసం .ఈ నాద ప్రకంపన వలననే సకల చరాచర సృష్టి ఆవిర్భవించింది . వేదాంతులు శబ్దం నుండే సృష్టి ఉద్భవమైనదని అన్నారు .5జ్ఞానేంద్రియాలు ,5కర్మేంద్రియాలు ,5జ్ఞానేంద్రియాలు ,4 విధాల మానసిక వృత్తులు ,3గుణాలు అన్నీ ఒక ఒక విశ్వ నాదం నుండి ఆవిర్భ వి౦చాయని నాద యోగులు భావిస్తారు .అంటే ప్రకృతి ,భౌతిక ,మానసిక బౌద్ధిక విశ్వాలన్నీ నాద బ్రహ్మ నుండే ఉద్భవించాయి .ఇదే నాద యోగులందరి ఏకాభిప్రాయం .కనుక కంపనాల వలన అది ఏర్పడిందన్న సత్యాన్ని నాద యోగి నమ్ముతాడు. ఈ కంపనాలు ఒకో సారి... అసలు కంపించక పోవటం లేక అధిక తీవ్ర ఫ్రీక్వెన్సీలలోమానవ ఇంద్రియాలు అందుకోలేని విధంగా కంపించటం జరుగుతుంది .
శాశ్వత ,మూల నాదం కు అత్యంత గరిష్ట ఫ్రీక్వెన్సీ ,కంపనాలు ఉంటాయి .ఏ వస్తువైనా విపరీతమైన ,ఊహింప రాని వేగం తో కంపిస్తే అది చివరికి చలనం లేనిది అవుతుంది .కనుక కదలిక లో,కంపనలో గరిష్ట బిందువు వద్ద ఏర్పడేది నిశ్చలనమే .ఈ నిశ్చలనమే సకల చరాచర సృష్టికి మూల కారణ హేతువౌతుంది .
నాద యోగుల భావనలో ఈ విశ్వం లో ప్రతిదీ శాశ్వత ,అనంత నాదం నుండే పుట్టి ,పరిణామం చెందుతుంది .ఈ విషయాలపై పూర్తి పరిజ్ఞానం పొందాలంటే నాద బిందు ఉపనిషత్,మరియు హంసోపనిషత్ లను పూర్తిగా అధ్యయనం చేయాలి .ఇవికాక అనేక అధ్యాత్మిక సంస్థలు నాద యోగశాస్త్రం పై ప్రత్యేక అధ్యయనం చేసినవి ఉన్నాయి.
సంగీతం కూడా ఆ నాదం యొక్క భౌతిక రూపమే .స్వచ్చమైన మంత్ర౦ కూడా ఆ నాదం యొక్కఅభివ్యక్త రూపమే (manifestation) .శరీరం లోని ప్రాణ స్పందనలు కూడా నాదము యొక్క వ్యక్తీకరణలే .నాద యోగ సాధన ముఖ్యోద్దేశం ...ప్రాథమిక, మూల, అత్యుత్తమ ,అంతిమ ,అంతర్నాదం, శబ్దం ,పదాన్ని కనుగొనటమే .ఈ శాశ్వత అభౌతిక నాదాన్ని అన్వేషింఛి తెలుసుకోవటానికి విధానాన్ని స్థూలం నుండే ప్రారంభించాలి .చివరికి ఆ అనంత శాశ్వత పారమార్ధిక మానసిక నాద దర్శన కోసం మన చేతన ప్రభావాన్ని దాటి మరింత లోతుగా వెతకాలి.
చైతన్యము యొక్క పూర్ణానుభవమే "సమాధి". ఈ పరిపూర్ణ స్థితిలో, మనస్సు- శరీరాలను, సమాధి అధిగమిస్తుంది. పరిపూర్ణ చైతన్యాన్ని అన్వేషించే మార్గంలో, శరీరానికి, మనస్సుకు సంబంధించిన పూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు.
ఈ నేపథ్యంలో ఒక సాధకుడు అభిజ్ఞా జ్ఞానాన్ని, భావాత్మక జ్ఞానాన్ని కూడా కలిగి యుంటాడు. సాధకుడు....ఆత్మ యొక్క విస్త్తృతిని నాద బ్రహ్మం గానూ లేదా శబ్ద బ్రహ్మం గానూ గుర్తిస్తాడు.
The Soul and It's Mechanism.
సాధనలో ఈ "నాద బ్రహ్మం" అనుభవానికి వచ్చిన తరువాతనే, నిర్గుణ పరబ్రహ్మం అనుభవానికి వస్తుంది.
నాదము అనగా, శబ్ద ప్రవాహం. యోగము అనగా కలయిక. నాద యోగము అనగా, వ్యక్తి చేతనను ...విశ్వ చేతన స్థాయికి తీసుకువెళ్ళడం. అంటే మనం వైశ్విక చైతన్యాన్ని, నాద యోగాభ్యాసం ద్వారా పొందవచ్చును.ఎప్పుడైతే వైశ్విక చైతన్యం, అహంకారం చేత అడ్డగించబడుతుందో, ఆ వైశ్విక చైతన్యానుభవానికి....అడ్డుగా ఉన్న అహాన్ని....ఈ నాదం తొలగించి, ఒక యోగి పరిపూర్ణ చైతన్యానుభవం పొందేలా చేస్తుంది, ఈ నాదయోగం.
అనాహత నాదం అంటే ఏమిటి ? కొందరు దాన్ని విశ్వాంతరాళ నాదమైన ప్రణవనాదం ఓంకారం అన్నారు . కాదు కాదు ,అది తుమ్మెదలు చేసే నిరంతర ఝంకార నాదాన్ని తలపించే భ్రామరీ నాదం అన్నారు మరికొందరు .ఇంకొందరు అదే ఖట్ ఖట్ మని నినదించే హృదయ స్పందనం అనాహత నాదం అన్నారు .
ఈ అనాహత నాదాన్నే కొందరు అనాహద నాదమన్నారు .రెండిటిలో అర్ధ భేదం ఉంది .అన్ +,ఆహతం =అనాహతం .అన్ అంటే కాదు అని అర్ధం. ఆహతం అంటే కొట్టటం ,సుత్తితో మోదటం ,దెబ్బ కొట్టటం అని అర్ధం .మొత్తం మీద దెబ్బ కొట్టటం వలన ఘర్షణ వలన వచ్చే శబ్దం కాదు అని అర్ధం .కనుక అనాహతం అంటే వస్తువుల పరస్పర ఘర్షణ వలన జనించే శబ్దం కాదని అర్ధం .ఎక్కడ శబ్దం ఉత్పత్తి అవాలన్నా రెండు వస్తువుల మధ్య పరస్పర రాపిడి లేక ఘర్షణ ఉండాలని మనకు తెలుసు .ఇదే ‘’ఆహత నాదం’’.అనాహతం అంటే రెండు వస్తువుల మధ్య పరస్పర ఘర్షణ వలన జనించిన శబ్దం కాదని స్పష్టమౌతోంది .అనాహతం సహజంగా(స్పాంటేనియస్ ) ,యాదృచ్చికంగా స్వయం చాలితమైన (ఆటోమేటిక్ )నాదం .కొందరు అనాహద నాదమని ఎందుకన్నారు ?అన్+హదం=అనాహదం.అన్ అంటే కాదు అని అర్ధం . హదం అంటే సరిహద్దు (బౌండరి ).ఈ రెండూ కలిస్తే సరిహద్దులు లేని నాదమే అనాహద నాదం అని అర్ధమొస్తుంది .అంతులేని, హద్దు లేని ఏ నాదమైనా అనాహత నాదమే అవుతుంది .
హృదయ చక్రము లేదా అనాహత చక్రముపై ధారణ చేసినపుడు ఈ అనాహత నాదం వినవచ్చును. ఈ నాదం సృష్టి ఆది నాదం. ఓంకారమన్నది, సృష్టించబడని స్పందనాత్మక నాదం. అన్ని శబ్దాలు, సృష్టి ఆవిర్భావం కూడా ఓంకారం నుండే సంభవించింది.
తస్య వాచక ప్రణవః
ప్రకృతి అన్నది శక్తి అయితే, ఆ శక్తియే స్పందనగా మారితే....అన్ని స్పందనలూ "శబ్ద బ్రహ్మమే".
మనిషి జన్యువుల నుండి బాక్టీరియాల వరకు, భూమి నుండి నక్షత్ర గ్రహ మండలాల వరకు, నక్షత్రాల నుండి కృష్ణ బిలాల వరకు.....ప్రతీ దానికీ ఒక శబ్దం ఉంది, నాదం ఉంది. ఒక యోగి నక్షత్ర సంగీతాన్ని వినగలడు. గ్రహాల శబ్దాన్ని కూడా అతను వినగలడు. ఈ బ్రహ్మాండ చాలక యంత్ర ధ్వని "ఓంకారమే" అన్న స్ఫురణకు కూడా వస్తాడు.
ఆకాశం , చెవితో సంబంధం కలిగి ఉంది. ఈ చెవియే శబ్దాన్ని వింటుంది కూడా. ఆకాశం యొక్క గుణం శబ్దం. మనిషి చనిపోయే క్రమంలో, చిట్ట చివరిగా కోల్పోవలసినది వినికిడి శక్తియే. అందుకనే, హిందూ సాంప్రదాయంలోనూ, యోగ సాంప్రదాయంలోను....మనిషి శరీరాన్ని వదలి వేసే సమయానికి ముందే, పవిత్ర శబ్దాలు , చెవిలో ఉచ్ఛరిస్తారు. ఆ శబ్దాలు వినిన తర్వాతనే ఆ జీవి మరణిస్తాడన్నమాట! ఈ ఆచారం వెనుక ఉన్నది "నాద యోగ సాంప్రదాయం".
➡️ నాద యోగం –మహర్షి గోరఖ్ నాథ్
మత్స్యేంద్ర నాధుని శిష్యులైన మహర్షి గోరఖ్ నాథ్, ఆధ్యాత్మికతలో గురువును మించిన శిష్యులై విపరీతప్రచారం పొందారు .ఆయన ‘’సాధువులారా !’’సో –హం ‘’ను నిరంతరం జపించండి ఈ జపాన్ని మనసుతో చేయకండి .దానిని మీ అంతశ్చేతన తో చేయండి..అలా చేస్తే మీరు మీ దైనందిన జీవితం లో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ మీ శ్వాస 24గంటల రోజులో నిమిషానికి 15నుంచి 19సార్లు ఉండేట్లు అంటే రోజుకు 21,600 సార్లు ఉండేట్లు జాగృతమవండి .అంటే మీ శ్వాస గంటకు 900సార్లు లేక ఆ పైన ఉండేట్లు చూసుకోండి . అప్పుడు అనాహద నాదం ఉద్భవించి(ఎమర్జ్ ) వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ).వెన్నెముకలో కాంతి జ్యోతకమవుతుంది .సూర్య నాడి మేల్కొంటుంది .అప్పుడు వర్ణనాతీతమైన కంపించే నాదం మీ శరీరం లోని ప్రతి సూక్ష్మ రంధ్రం నుండి ఓం లేక సోహం లాంటి నాదం వినే అనుభూతి కలుగుతుంది ‘’అని మహర్షి గోరఖ్ నాథ్, నాద యోగాన్ని గురించి తన గ్రంథాలలో వర్ణించారు .
అంతిమ నాదం :
ఉన్నత స్థాయి చేతనలో వ్యక్తమయ్యే నాదాన్ని గురించి మాటలలో వర్ణించి చెప్పలేము .అ నాదం ఆనంద మయ కోశం ఆవలి నుండి వస్తుంది. వ్యక్తిగత చేతన పూర్తిగా కరిగిపోయే నాదం లోని అత్యున్నత బిందువు నాద యోగికి అనుభవమౌతుంది .సాధకుడు నాదం లో తన ఉన్నత చేతనను గుర్తిస్తాడు .అప్పుడు ఈ విశాల విశ్వం అంతా ఆ నాదమే అని గ్రహిస్తాడు .
నర్మదా పరిక్రమ యాత్ర - అశ్వత్థామ దర్శనం :
మేము సంన్యాస దీక్ష తీసుకున్న తరువాత పరివ్రాజకులము అయ్యాము. పరివ్రాజకుల మొదటి లక్షణం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండడం. ఒక స్థిర నివాసం ఉండకూడదు. పల్లెల్లో ఎక్కడ ఎన్నాళ్ళు ఉండాలి? నగరాలలో ఎన్నాళ్ళు ఉండాలి? దివ్యక్షేత్రాలలో ఎన్ని రోజులు ఉండాలనే లెక్కలు కూడా ధర్మశాస్ర్తాలు నిర్దేశిస్తున్నాయి.
నేటి కాలంలో సామాన్యజీవనం చేస్తున్నవాళ్ళకు యతీశ్వరుల జీవన విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంన్యాస జీవితంలో ఉన్నవారు ఈ విధంగా పరిభ్రమిస్తూ నిరంతం ఉండడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు కలుగుతాయి. దానికి సమాధానంగా సాధువులు చేసే కొన్ని
అత్యంతకఠినమైన తీర్థయాత్రల గురించి తెలుసుకోవాలి. వీటిలో కొన్నింటిని సామాన్యులు చేయలేరు. అటువంటి మహాకష్టమైన యాత్రల్లో అత్యంత కఠినమైన యాత్ర నర్మదా పరిక్రమ. ఇది మూడు ఏళ్ళ మూడునెలల 13 రోజుల పాటు చేస్తారు. నర్మద పుట్టిని చోటునుంచీ మొదలుపెట్టి నర్మదతో పాటు ప్రయాణం చేసి మళ్ళీ పుట్టిన చోటుకువచ్చి ప్రదక్షిణ పూర్తిచేస్తారు. అయితే నర్మదాస్థానంలో (పుట్టిన చోటు నుంచే) మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ నుంచీ మొదలు పెడితే అక్కడకు చేరి ప్రదక్షిణం ముగిస్తే చాలు.
భారతీయ తీర్థయాత్రలను పరిశీలిస్తే కొన్ని తీర్థయాత్రలు కొండలను ఎక్కడంతో ఉంటాయి. కొన్ని మైదాన ప్రాంతాలలో ఉంటాయి. నర్మద యాత్ర నీటితో కూడిన యాత్ర. నది ఒడ్డు నుంచీ సాగే నడక యాత్ర. శ్రీశైలం, తిరుపతి, అమర్ నాథ్, కేదార్ నాథ్ పర్వతారోహణ యాత్రలు. అరుణాచలం పర్వతం చుట్టూ చేసే పరిక్రమ. శ్రీకాళహస్తి, కాశీ క్షేత్ర ప్రాధాన్య ప్రాంతాలు.
నర్మదకు మరో పేరు రేవానది. మా గురుదేవులు ఆంధ్రవ్యాసులవారు స్కాందపురాణం రేవాఖండాన్ని అనువక్తీకరించారు. అమ్మవారి విశేష కృప ఆయనపై ఉంది. అన్నవరం దేవస్థానం దాన్ని ప్రచురించగా 100 ఏళ్ళ అన్నవర దేవస్థాన స్థాపక ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి శ్రీ శంకరదయాళ్ శర్మ ఆవిష్కరించారు. ఆ అమ్మవారి దివ్యచరిత అంతా ఆ ఖండంలో ఉంది.
నర్మదా పరిక్రమ చేసిన మహనీయుల దర్శనం నాకు లభించింది. వారిలో ఒక పరివ్రాజకమహారాజు ‘‘నర్మదా పరిక్రమ కాళ్ళకు చెప్పులు లేకుండా చేస్తారు. నదీతీరం వెంట చేస్తే ఫర్వాలేదు. కానీ గట్టు మీద చేశామా, అక్కడ చాలా తీక్ష్ణమైన ముళ్ళు ఉంటాయి అవి పాదాలలో దిగాయా కాళ్ళను చాల సలుపుతాయి‘‘ అని చెప్పారు.
మాకు కలిసిన మరో బాబా నర్మదాపరిక్రమ చేస్తే గోచీ కూడా మిగలదని, బట్టలను ముళ్ళు చీల్చివేస్తాయని అన్నారు. యతిరాజుల జీవితంలో దివ్య క్షేత్రాలు మహాతీర్థాలు ఎటువంటి దీక్షలు ఇస్తాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు.
అంతేకాదు నర్మదా పరిక్రమ చేసేటప్పుడు ధనాన్ని కూడా తీసుకువెళ్ళకూడదు. ఇది ముఖ్యనియమం. దారి వెంట కొందమంది ఆటవికులు దోచుకునే ప్రమాదం ఉంది.
యూట్యూబ్ లో నర్మదా పరిక్రమ మీద ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. Narmada Parikrama Part 1 || Ashvasthama Darshan. దీన్ని Anna Maharaj Bawaskar అన్నా మహరాజ్ బవాస్కర్ అనే పరిక్రమవాసి చెప్పగా రికార్డు చేశారు. వారు నర్మదా పరిక్రమ చేసి తమ అనుభవాలు చెప్పారు.
అన్నా మహరాజ్ నర్మదా పరిక్రమ చేస్తుండగా వారి మార్గం శూలపాణేశ్వర్ ఉన్న శూలపాణి స్థలం వైపు మళ్ళింది. అయితే అటువైపు వెళ్ళవద్దని అదంతా పర్వతప్రాంత మయం అనీ, ఆటవికులు ఉంటారు వారు దోచుకుంటారని కొందరు భయపెట్టారు. దానికి ఆయన నవ్వి నా దగ్గర ఏమున్నాయి గోచీ, కమండలం, దండం తప్ప అని నవ్వి శూలపాణి ప్రాంతానికి పయనం అయ్యారు.
అన్నా మహరాజ్ శూలపాణి క్షేత్రానికి వెళు తుండగా అక్కడి ఆదివాసులు మందిరం గోపురం మాత్రమే కనిపిస్తుందని దూరం నుంచీ చూడమని చెప్పారట. ఆయన అలాగే దూరం నుంచీ మందిరాన్ని చూసి నమస్కారం చేసి ముందుకు వెళుతుండగా మరోకరిని కలిశాడు. అతడు త్రిశూలం పట్టుకొని కాషాయాలు కట్టుకొని ఉన్నాడు. మాటల్లో ఆయన మూడోసారి పరిక్రమ చేస్తున్నాను అని చెప్పారట. శూల్ పాణి దర్శనం చేసుకున్నారా అని అడిగారట. అన్నా దానికి సమాధానంగా తాను కేవలం శిఖరమే చూశానని గుడి నీటిలో మునిగిపోయిందని అన్నారట. దానికి ఆ సాధువు తాను గుడి జలంలో మునిగిపోకపూర్వం దర్శనం చేసుకున్నానని అన్నారట. అది విన్న అన్నా ఆయన్ని అశ్వత్థామ దర్శనం అయిందా అని అడిగి ఆయన్ని పరిక్రమానుభవాలు చెప్పమని కోరారట. వారు అంగీకరించి ఆరోజుకు అక్కడే విశ్రమిద్దామని కొన్ని ఎండుకట్టెలు పోగేసుకుని మంట వేసుకొని మొదటి సారి 1994లో చేసిన పరిక్రమ అనుభవాలు చెప్పడం ప్రారంభించారట.
ఆయన శూలపాణి క్షేత్రంలో శూలపాణేశ్వర్ దర్శనానికి గుడికి వెళ్ళారట. అక్కడ ఆయన వెళ్ళేసమయానికి కేవలం గుడి పూజారి మాత్రమే ఉన్నాడట. దర్శనం అయ్యాక పూజారిని అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతాయా అని అడిగితే ఏమీ దొరకవని చుట్టుపక్కల కూడా దొరకవని అయితే ఈ రాత్రి ఇక్కడే ఉంటే రేపు ఉదయం తాను స్వామి అర్చనకు వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా తీసుకువస్తానని అన్నారట. సరే! ఉంటానని అన్నారట. రాత్రి అక్కడ ఉండేట్టు అయితే గుడిలో ఉండవద్దని ఎదురుగా ఉన్న వటవృక్షం కింద ఉండమని తొమ్మిదింటికి వస్తానని హెచ్చరించి గుడి తలుపులు వేసి వెళ్ళిపోయారట. దానికి తాళాలు లేవు. కేవలం ఒక గొళ్ళెం మాత్రమే ఉంది. ఆరోజు అమావాస్య.
‘‘పూజారి చెప్పినట్టు బుద్ధిమంతుడిలా ఆ సాధువు వటవృక్షం కింద పడుకొన్నాను. కానీ రాత్రి చలి, కింద కంకరరాళ్ళు నాకు నిద్రపట్టనివ్వలేదు. దాంతో తప్పని సరి పరిస్థితిలో గుడి తలుపులకు ఉన్న గొళ్ళెం తీసి లోపల పడుకోవడానికి ప్రవేశించాను. తలుపులు లోపల నుంచీ బంధించడానికి గొళ్ళాలు లేవు. దాంతో దగ్గరగా తలుపులు వేసి తలుపులకు కొంచెం దూరంగా అక్కడ బిస్తర వేసి పడుకున్నాను.‘‘
‘‘అర్ధరాత్రి వేళ పెద్దపెద్ద అడుగుల శబ్దం వినిపించింది. నాకు గుండె ఆగినంత పనైంది. అడుగులు గుడి తలుపుల దగ్గరకు వచ్చి ఆగాయి. గుడి తలుపులు ఒక్కసారి భళ్ళున తెరుచుకున్నాయి. ఆ తలుపులు బలమైనవి. గాలికి తెరుచుకునేంత తేలికైనవి కాదు. గుడిలో వెలిగించిన దీపాల వెలుతురులో చూశాను. తెరిచిన తలుపుల నుంచీ ఎవరూ లోపలకు రాలేదు. ఏ జంతువూ రాలేదు. ఏ మనిషీ రాలేదు. కానీ అడుగుల శబ్దం మాత్రం వినిపించింది. నా మీద నుంచీ నడిచి వెళ్ళినట్టు నాకు అనిపించింది. అయితే ఏ వ్యక్తీ ఏ ప్రాణీ నాకు కనిపించలేదు.‘‘
‘‘అయితే ఎవరో తరలి శివలింగం వైపు వెళుతున్నట్టు అనిపించింది. అటువైపు చూస్తుంటే శివలింగం పక్కనే ఒక దివ్యరూపం కనిపించింది. నాకు ఆ ఆకృతి చుట్టు ఉన్నవెలుగు కనిపిస్తోంది కానీ రూపం కనిపించడంలేదు. నాకు భయం వేసింది. ఆ ఆకృతి 12 అడుగులు ఉంది.‘‘
‘‘శివలింగం దగ్గర నిలుచుని మంత్రాలు చదివింది. స్తోత్రాలు చదివింది. నాకు ఆ క్షణంలో అది ఎవరో తెలియలేదు. ఏ బ్రహ్మరాక్షసుడో అనుకున్నాను. నాకు ఒళ్ళంతా చెమటపట్టి ధారలుగా కారడం మొదలుపెట్టింది. నేను తలుపు దగ్గరకు చేరుకున్నాను. అవసరం అయితే బయటకు పారిపోవడానికి అన్నట్టు. అది పూజ ముగించుకొని నేను ఉన్నవైపు వచ్చింది. ఎందుకంటే అది కూడా బయటకు పోవాలంటే అదే తలుపులోనుంచి వెళ్ళాలి. అది నా దగ్గరకు వస్తుండే సరికి పారిపోవడానికి కూడా నా ఒంట్లో శక్తిలేనట్టు అయిపోయింది. కాళ్ళు నీలుక్కుపోయాయి. అది సరిగ్గా నా ముందుకు వచ్చి ఆగింది.‘‘
‘‘నేను దాన్ని చూస్తూనే ఉండిపోయాను. నా గొంతుమూగబోయింది. అది నన్ను చూస్తూ ‘‘నువ్వు నర్మదా పరిక్రమ చేస్తూ ఇక్కడకు వచ్చావా?‘‘ అని అడిగింది.నా గొంతులో నుంచీ మాట పెగల్లేదు. అవునని తల ఊపాను.‘‘
‘‘ఆ ఆకృతి నా నుంచీ దూరంగా వెళ్ళిపోయింది. నేను అలాగే బిగిసిపోయాను. ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. నన్ను ఎవరో కుదుపుతుంటే స్పృహ వచ్చింది. ఉదయం 9 అవడంతో పూజారి అర్చనకు వచ్చి బిగిసిపోయిన నన్ను చూసి స్పృహతెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆయన శాంతి చేయడంతో నేను సాధారణ స్థితికి వచ్చాను. పండిట్ జీని గుడిలోపల నిద్రించినందుకు క్షమించమని కోరాను. తరువాత రాత్రి జరిగిందంతా చెప్పాను.‘‘
‘‘ ఆయన నన్ను ఆశీర్వదించి ప్రతీ అమావాస్య రోజున దివ్యశక్తి అయిన చిరంజీవైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ వస్తారు. గతరాత్రి ఆయనే వచ్చారు అని చెప్పి తాను తెచ్చిన ప్రసాదం నాకు పెట్టారు. నేను దాన్ని స్వీకరించి పరిక్రమలో ముందుకువెళ్ళాను.‘‘
‘‘దారిలో భిల్లులు కొందరు అటకాయించి నీ దగ్గరున్నది బయట పెట్టు అన్నారు. నా జోలెలో ఉన్నవన్నీ వారి ముందు పెట్టాను. వారు నా దగ్గర డబ్బులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకొని వెళ్ళిపోయారు.‘‘
‘‘నేను కొంతదూరం వెళ్ళాక ఒక కుక్క పరిగెత్తుకుంటూ వస్తోంది. దాని వెనుక ఇందాక వెళిపోయిన భిల్లులు వస్తున్నారు. నా దగ్గరకు వచ్చి ‘బాబా! నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు‘ అన్నాడు. పాత సంభాషణనే చెప్పాను. అతడు నీ జడల్లో దాచుకున్న ఐదువేల రూపాయలూ తీసి అక్కడ పెట్టు అన్నాడు. ఈ సారి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఎంతో రహస్యంగా తలపైన అట్టలు కట్టిన జడలు ముడులు వేసి అందులో దాచుకున్న డబ్బు ఆ ఆటవికుడికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. ఆ ఆశ్చర్యంలో ఉండగా ఆ భిల్లుడు హెచ్చరికగా డబ్బు తీయకపోతే కుక్కను ఉసిగొల్పుతాను అది పిక్కలు పీకేస్తుందని హెచ్చరించాడు.‘‘
‘‘ఆశ్చర్యం నుంచీ తేరుకోకుండానే జడల్లో దాచుకున్న ఐదువేల రూపాయల కట్టను తీసి వాడి ముందర పెట్టా. వాడు అందులోనుంచీ కొన్ని వందల రూపాయల నోట్లు తీసుకొని గంజాయి దట్టించుకొని దమ్ముకొట్టటం ప్రారంభించాడు. నాకు విషయం అర్థం అయింది. వాడు డబ్బును ఎలా ఉపయోగిస్తాడో తెలిసి అతడికి కావలసిన కాగితాలు తీసుకొని మిగిలినవి నాకు ఇచ్చేయమన్నా. వాడు నవ్వి ఇంక అవి రావు నీదారిన నువ్వు వెళ్ళు అన్నాడు.‘‘
‘‘నేను వెళ్ళడానికి సిద్ధం అవుతూ నా సందేహం అడిగా. నా దగ్గర డబ్బు ఉందని ఎలా తెలుసని అడిగా.‘‘
‘‘దానికి వాడు భిల్లులను ప్రాంతీయంగా మామ అంటారు. అంటే అమ్మ తమ్ముడు అని అర్థం. నేను ఇంతకు ముందు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోగానే నర్మదా మాత ఒక కన్య రూపంలో మా దగ్గరకు వచ్చి ఇంతకు ముందు వెళ్ళిన జటాధారి దగ్గర ఐదువేల రూపాయలున్నాయి. తలపైన జడల ముడిలో దాచుకున్నాడు అని చెప్పింది అని భిల్లుడు చెప్పాడు.‘‘ అని సాధువు చెప్పాడు.
సాధువు చెప్పిన మాటలు రాత్రి విన్న అన్నామహరాజ్ తనకు కూడా అశ్వత్థామా దర్శనం అయితే బాగుండు అనుకున్నాడట. నర్మదా పరిక్రమలో ముందుకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చోట నర్మదా నది రాళ్ళమీద కూర్చున్నారు. సరిగ్గా ఆయనకు ఎదురుగా ఒక భిల్లుడు కనిపించాడు. అతడు అన్నామహరాజుకు జీడిపప్పు ఇచ్చి తిను అన్నాడట. అన్నా వాటిని తిన్నాడు. తన జీవితంలో ఎన్నో సార్లు జీడిపప్పుతిన్నా ఆరోజు భిల్లుడు ఇచ్చిన జీడిపప్పు రుచి మాత్రం తన జన్మలో ఎప్పుడూ కలగలేదని అంత మధురంగా ఉన్నాయని అన్నాడు. అన్నాతో కాసేపు మాటలాడిని భిల్లుడు వెళిపోతుండగా సాధువు చెప్పిన వర్ణనలు స్పష్టంగా ఆ భిల్లుడిలో అన్నామహరాజ్ చూశాడట. అన్నానుంచీ దూరం అయ్యే కొద్దీ ఒక దివ్యమైన ఆకృతిగా మారి ఆ భిల్లుడు అదృశ్యం అయ్యాడట.
నర్మదా పరిక్రమలో ఆ విధంగా తనకు భిల్లుని రూపంలో అశ్వత్థామ దర్శనం లభించిందని అన్నా మహరాజ్ బవాస్కర్ వర్ణించిన వీడియో యూట్యూబ్లో నేటికీ ఉంది.
నర్మదా పరిక్రమకు మతంపేరుతో డబ్బుసంపాదించే వ్యవస్థలకు ఎటువంటి సంబంధంలేదు. ఇది 3200 కిలోమీటర్ల పైగా దూరం కాలికి చెప్పులు కూడా లేకుండా చేతిలో నయాపైసా లేకుండా నదితోపాటు నడుస్తూ సాధువులు చేసే యాత్ర.
నేటి కాలంలో, వైజ్ఞానిక దృష్టికోణంలో చూసే యువత నమ్మలేని, నిజంగా జరిగిన అనుభవాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక యాత్రల్లో అనుభవాలు ఎలా ఉంటాయి అనే దానికి ఉదాహరణగా, అత్యంత కఠినమైన తీర్థయాత్రలకు ఉదాహరణగా ఇది చెప్పడం జరిగింది.
హర్ హర్ నర్మదా
-------స్వామి అనంతానంద
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు కావు నిజాలు (3)
రచయత / సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తన గర్వమే తనకు శత్రువు
మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి . సామాన్యంగా ఐశ్వర్యమో , పాండిత్యంతో , అధికారమో గర్వానికి కారణాలవుతాయి .
కానీ ఈ గర్వమే తన శత్రువని మనిషి గ్రహించాలి . ఎందుకంటే దాని మూలకంగా అతనికి మున్ముందు అనర్ధం కలుగుతుంది .
అంతకంటే ఎక్కువగా గర్విష్ఠియైన మనిషి తప్పుడు పనులు చేస్తాడు . తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో పడతాడు .
తన దుష్కర్మల ఫలితాన్ని అతను తప్పకుండ అనుభవిస్తాడు . వీటన్నిటినీ తప్పించుకోవాలంటే గర్వాన్ని విడనాడాలి .
శ్రీశంకర భగవత్పాదులవారు ఇలా అన్నారు :-
మాకురు ధనజన యౌవన గర్వమ్ !
హరతి నిమేషాత్ కాలః సర్వం !!
దానం , యవ్వనం , పాండిత్యం మున్నగునవి కారణంగా ఏ మానవుడూ గర్వించరాదు . ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది . అంటే అవి శాశ్వతం కాదు .
శ్రీ శంకర భగవత్పాదులవంటి మహనీయులు ఎంతటి పండితులైనా ఏమాత్రం గర్వానికి లోనుకాలేదు , అందువలనే ప్రజలు వారిని మహాపురుషులుగా కీర్తించారు . కాబట్టి మనిషి ఏకారణంలో కూడా గర్వానికి లోనుకాకూడదు . వినయంతో జీవించాలి .
తస్మాదహంకార మిమం స్వశత్రుమ్ భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతమ్ !
విచ్చిధ్య విజ్ఞాన మహాసినాస్ఫుటం భుంక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యధేష్టమ్ !!
అన్న భగవత్పాదుల సూక్తిని ప్రతియొక్కరూ మననం చేస్తూ నిరహంకారమైన జీవితాన్ని గడపాలి .
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు .
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు కావు నిజాలు (2)
రచయత / సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
: ఒక మంచి జ్ఞానోదయo కలిగించే ఉదాహరణ లాంటి నిజం :-
ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,
చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.
ఒకరోజు , తాను ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం , తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి ,
పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు
, ఏమని అంటే , ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు.
నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......
ఈలోగా అకస్మాత్తుగా ఒక
జ్ఞాని వచ్చి
నేను మీ డబ్బు మీరు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువు టెక్నిక్ చెపుతాను అని అన్నాడు.
ఎలా ? అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.
దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.
Ans :-Yes.
Q ;- అమెరికాలో మీరు ఎన్ని రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు
Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు.
కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను , అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens
ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి , ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..
ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా :-
ఓ కోటీశ్వరుడా...............
అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును పాపము " లోనికి మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.
లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే , నీ డబ్బును దాన , ధర్మములు చేసి పుణ్యంగా Exchange చేయు అని చెప్పగానే .........
ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానికి 100 కోట్లు తీసుకోమంటాడు.
దానికి జ్ఞాని నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.
అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తన ఆస్తికి ఆ జ్ఞానినే Maneger గా నియమించి , తగిన జీతం ఇచ్చి , తన సంపద అంతా సన్మార్గంలోనికి , పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా ,
పాత పాప కర్మలు పరివర్తనతో నశిoచి , మంచి కర్మల వలన పుణ్య గతులకు వెళ్తాడు........
అయ్యా..... ఇదండీ సంగతి
మన సంపదలు మనతో వచ్చే విధానం.
ఇక మన ఇష్టమే .
మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గం లో ఖర్చు చేసి , పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా ?
లేక
మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?..............
ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు
For Every Action
Equal & Opposite
. Reaction
ధర్మో రక్షతి రక్షతః
👏👏👏👏👏👏
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు కావు నిజాలు (1)
రచయత / సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వీణ చిట్టి బాబు... గారి .. సన్మానం
ఎప్పుడో.. చాలా ఏళ్ల క్రిందటి సంగతి.. జగద్విఖ్యాతులైన
వీణ చిట్టిబాబుగారికి తంజావూరులో ఒక కచేరి ఏర్పాటు అయింది.మదరాసు నుండి వీణ తీసుకొని, రైలులో తంజావూరు చేరుకున్నారు ఆయన. అక్కడి సభా నిర్వాహకులు రైల్వే స్టేషనుకు వచ్చి,చిట్టిబాబు గారికి స్వాగతం పలికి,ఒక రిక్షాలో వారిని హోటలుకు చేర్చారు.అప్పట్లో తంజావూరు వంటి ఊళ్లలో రిక్షాయే అందరికీ ప్రయాణ సాధనం.
రిక్షా అతనితో "మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చి,సారును కచేరీ జరిగే హాలుకు తీసుకు రావాలి" అంటూ చెప్పి,నిర్వాహకులు చిట్టిబాబుగారి వద్ద సెలవు తీసుకున్నారు.
చిట్టిబాబుగారు ఆరోజు మధ్యాహ్నమంతా హోటల్ లో విశ్రాంతి తీసుకొని,సాయంత్రానికి కచేరీకి సిద్ధం అయ్యారు.రిక్షా అతను సకాలానికి హోటలుకు వచ్చి,సామాను మోసే అలవాటుకొద్దీ వీణను తీసుకోబోతే,ఎవరి చేతికీ తన వీణ ఇవ్వటం అలవాటులేని చిట్టిబాబుగారు,అతనితో విషయం చెప్పి,తన బాగ్ అతని చేతికి ఇచ్చి,వీణతో రిక్షా ఎక్కారు.రిక్షా వేదికను సమీపించాక,దిగుతూ రిక్షా అతనితో,"బాబూ! ఇక్కడ నాకచేరీ సుమారు మూడు గంటలసేపు ఉంటుంది.అప్పటివరకూ నువ్వు ఇక్కడ చేసేదేమీ లేదు కనుక,ఈలోపుగా నీ బేరాలు చూసుకొని,తిరిగి తొమ్మిదిన్నరకు వచ్చి,నన్ను హోటల్లో దించితే సరిపోతుంది" అని,వేదికనెక్కారు చిట్టిబాబుగారు.
వేదికను దివ్యంగా అలంకరించారు నిర్వాహకులు..హాలంతా శ్రోతలతో నిండి ఉంది.'విరిబోణి' అటతాళ వర్ణంతో అరంభమైన కచేరీ,ఒక్కొక్క అంశంతో ద్విగుణీకృతమైన రక్తిని సంతరించుకుంటూ సాగిపోయింది.సహజసుందరులైన చిట్టిబాబుగారు,చిరునవ్వుతో అలవోకగా అంగుళులు కదిలిస్తూ వీణపై పలికించిన రాగ,తాన,స్వర ప్రస్థారాలకు మైమరచిపోయి,కరతాళ ధ్వనులతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు జనం.సహకార వాద్యాలైన మృదంగ,ఘట విద్వాoసులూ లబ్ధప్రతిష్టులే..అద్భుత రీతిలో తమ సహకారం అందించారు వారు..
ఎలా గడచిపోయాయో తెలియదు..మూడు గంటలు..
'పవమాసన సుతుడుబట్టు..' అంటూ వైణికులు మంగళం ఎత్తుకున్నాక గానీ ఈలోకంలోకి రాలేదు శ్రోతలు.
నిర్వాహకుల ఆనందానికి హద్దులు లేవు.ఘన సత్కారం అందించారు...సభానంతరం..
చిట్టిబాబుగారిని అభినందించేందుకు వేదికపైకి బారులుకట్టారు జనం.
ఆ జనంలో..చివరినుండి ఒక చిరిగిన బనీనుతో,మాసిన గడ్డంతో అందరినీ తోసుకువస్తున్న ఒక వ్యక్తిని అడ్డుకున్నారు ముందున్న జనం."ఎవడివయ్యా నువ్వు? ఏంకావాలిక్కడ? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నచోటికి నీకేం పని?వెళ్లు వెనక్కి.."అంటూ గసురుతున్నారు..
"అయ్యా! ఒక్కపాలి ఆ వీనాయనతో మాటాడాల..ఎల్లనీయండి.." అంటూ వేడుకుంటున్న ఆ వ్యక్తిని చూశారు చిట్టిబాబుగారు.నిర్వాహకులతో,అతనిని తన దగ్గరకు పంపమని ఆదేశించారు.
దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారాయన! ఆ వ్యక్తి..తనను అక్కడకు తెచ్చిన రిక్షా అతను.
దగ్గరకు రాగానే వినయంగా నమస్కరిస్తూ.. "అయ్యా! మీరు మామూలు మడిసి కాదు..దేవుడు పంపిన మహిమగలోరు..మీరు పైకి ఎల్లినాక,నేను బేరాలకి ఎల్దామనుకొని గుడా,కూసింతసేపు ఇందారని ఎనకమాల సుట్టగాలూస్తా నుంచొన్నా..ఆయ్యా! తమరి ఈన ఎంత పున్నెంసేసుకుందో.. ఏయో లోకాలకి నన్ను తీసుకెల్లిపోనాది..ఇయాల వాయించింది మీరు గాదు..బగవంతుడే..కాసేపు ఇందామనుకొన్న నేను..సివరి దాకా కదలనే లేకపోయా.. నేనెంత అదురుష్టమంతున్నో...నా రిక్షాల మిమ్మల్ని తెచ్చాను..అయ్యా! నిజం సెప్తున్నా..నేను రోజుకి పది రూపాయలు సంపాయిస్తా..అందులో అయిదు రూపాయలు ఇంట్ల ఇచ్చి,ఐదుపెట్టి మందు తాగతా..అలా అయితేనే మడిసిని..కానీ ఇయాల మీ ఈన ఇన్న తరువాత నాకింక జీవితంల తాగాలనిలేదు బాబు..కడుపు నిండిపోనాది..అయ్యా! ఇదిగో..ఈ పేదోడి ఆనందం కోసం..ఈ అయిదు మీరు ఉంచుకోవాల." అంటూ తన గుప్పిట,నలిగిపోయిన అయిదు రూపాయల నోటుతీసి,చిట్టిబాబుగారి చేతిలో పెట్టి,మారు మాట్లాడనీయక,వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
చిట్టిబాబుగారి నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి.
చేష్టలుడిగి,చూస్తూ ఉండిపోయారు."నిజంగా నా జీవితంలో మరువలేని రోజు ఇదే..ఏ సంగీత జ్ఞానం,స్వరపరిచయం లేని సామాన్య వ్యక్తి నా సంగీతాన్ని మెచ్చి,ఇచ్చిన ఈ బహుమానం,వెలకట్టలేనిది.ఒక కళాకారుడి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది?" అనుకున్నారు.
చిత్రమేమిటంటే.. తనకొచ్చిన అవార్డులు,ప్రశంశాపత్రాల మాట ఎలాఉన్నా,ఆ రిక్షాఅతను ఇచ్చిన అయిదు రూపాయల నోటును మాత్రం చిట్టిబాబుగారు,తాను పరమపదించేవారకూ భద్రంగా దాచుకున్నారుట. .🙏
నీతి:- మనం ఏ స్థాయి కి వెళ్ళినా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన... మనకంటూ ఉన్న కొన్ని మధురానుభూతులను ఎన్నటికీ మరచిపోరాదు.
💥సర్వేజనా సుఖినోభవంతు💥