Sunday, 26 May 2019


ఓం శ్రీ రాం  శ్రీ మాత్రే నమ: 
సర్వే సజనా సుఖినోభవంతు 

గీ.దిమిరమును చంద్రికయు జోక నమరి నట్లు
పుండరీ కోత్పల ద్యుతు ల్పొదివి నట్లు
నీల వజ్రంబు లొకచోట నిలిచి నట్లు
హరిహరా కృతి త్రిభువనానంద మయ్యె.

"ప్రత్యగ్ రూపాయ నమః ". . .ఇది మంత్రం
 . . .
ఇది దానిఅంతర.అర్థం . . . . .

అమ్మ సర్వాంతర్యామి . స్థూలంగా చూడటానికి దృష్టి సరిపోదు . అందుకే అమ్మ తనను ఎలా చూడవచ్చో విశద పరచింది . అదే అంతర్ముఖ సాధన. మనం నిదురించే సమయంలో మనకి మనఎదురు గుండా వున్నది కూడా చూడలేం . అలాగని ఎదురుగా వున్నది లేనట్టు కాదు . అలాగే మనం పుట్టినప్పటి నుండీ వున్నామనుకుంటాం. ఎప్పటి నుంచో వున్న ఆత్మ దేహాన్ని ధరించినట్టు తెలుసు కోలేం. అలాగే ఒక రైలు మనం ఎక్కినపుడు , ఎక్కిన చోటును , ఇక్కడే రైలు మొదలైంది అనుకుంటాం. నిజానికి అది ఎక్కడ నుండి వస్తోంది అని ఆలోచిస్తూ దాని వునికి తెలుసుకోవటమే ప్రత్యక్ అనబడుతుంది. అలాగే మనం మనలోని ఆత్మని దర్శించ లేక పోవడం , మేలుకుని వున్నా , నిదురించి నట్టే లెక్క. ఆత్మ పరిశీలన అంతర్ముఖంగా జరగాలి . ఆత్మ పరదేవతా స్వరూపం . మనలోని ఆత్మ పరదేవతకి భిన్నం కాదు కాబట్టి , ఎవరు ఆత్మ దర్శనం చేయగలరో, వారే ప్రత్యక్ వైభవాన్ని తెలుసు కోగలరు . ప్రత్యగ్ రూపిణికి నమస్కారం .

తెలుగు ,సంస్కృత కావ్యాలలో మంగళాచరణ శివ స్తుతి –29 (08-12-2015)
సారంగ ధరుడు రక్షించుగాక ! పోకూరి కాశీపతి (1892-1974) ‘సారంగధరీయం’లోని (త్ర్యర్థి కావ్యం) మొదటి పద్యము

శ్రీ సన్మార్గ విలోలుడై కువలయ క్షేమ ప్రద్యోద్యత్కళో
ల్లాసుండై కలధౌత ధాముడయి లీలా సోముడై ప్రత్యరి
త్రాసుండై గత దోషుడై బుధ గురుత్వఖ్యాతి శోభిల్లు రా
జౌ సారంగ ధరుండు మత్కృతి పతిన్ సామోదునిం జేయుతన్

ప్రతిపదార్థము
శ్రీ= సంపదతో కూడిన
సత్+మార్గ= మంచి మార్గములో
విలోలుడు+ఐ= మెలిగినవాడై
కువలయ క్షేమ= భూమికి శుభాలను
ప్రద+ఉద్యత్+కళోల్లాసుండై= బాగా ఇచ్చుటకు ఎత్తబడిన కళలతో సంతోషము కలవాడై
కలధౌత= వెండి(కొండ)
ధాముడు+అయి= ఇల్లుగా కలిగిన వాడై
లీలా సోముడై= విలాసమైన సోముడను పేరు కలవాడై
ప్రతి+అరి +త్రాసుండు+అయి= ప్రతి శత్రువునకు భయంకరుడై
గత దోషుడు+అయి= పోయిన దోషము కలవాడయి
బుధ గురుత్వఖ్యాతి= బుధుడు మొదలైన దేవతలయందు గొప్పదైన కీర్తి చేత ప్రకాశించు
రాజౌ=రాజు+ఔ= రాజయిన
సారంగ ధరుండు= జింకను ధరించిన శివుడు
మత్+కృతిపతిన్= నాకృతికి పతి అయిన గద్వాల సంస్థానాధీశ్వరులైన శ్రీ సీతారామ భూపాల రావు గారిని
స+ఆమోదునిన్ +చేయుతన్= ఆనందముతో కూడిన వానిగా చేయుగాత!

తాత్పర్యము
శివుడు సంపద కలిగినవాడు. భూలోక వాసులకు శుభాలను ప్రసాదిస్తూ సంతోషపడే వాడు.వెండికొండ ఇల్లుగా కలిగిన వాడు. సోముడను పేరు కలవాడు. శత్రు భయంకరుడు. దోషములు లేనివాడు.దేవతలయందు ప్రకాశించు తన కీర్త కలవాడు. రాజు. జింకను ధరించిన వాడు. అటువంటి శివుడు నాకృతి పతి అయిన గద్వాల సంస్థానాధీశ్వరులైన శ్రీ సీతారామ భూపాల రావు గారికి ఎప్పుడూ ఆనందము కలిగించుగాక

విశేషాలు
1. రెండర్థాలు వచ్చే కావ్యాలు ద్వ్యర్థి కావ్యాలు.( ఉదా. పింగళి సూరన రాఘవపాండవీయం 1550) మూడర్థాలు వచ్చేవి త్య్రర్థి కావ్యాలు. (రాఘవయాదవపాండవీయం – బాలసరస్వతి 17వశతాబ్ది) నాలుగర్థాలు వచ్చేవి చతురర్థి కావ్యాలు (నలయాదవరాఘవపాండవీయం - మరింగంటి సింగరాచార్యులు)


2. ఆధునిక యుగంలో త్ర్యర్థి కావ్యం రచించిన కవి పోకూరి కాశీపతి (1892-1974) . ఈ నాలుగాశ్వాసాల కావ్యం సారంగధరీయం’లో పార్వతీకల్యాణం-తారా శశాంకం-సారంగధరీయం – ఈ మూడూ కలిసి పాఠకులను సంతోష పెడతాయి. ‘గద్వాల సంస్థానాధీశులు సీతారామ భూపతిరావు సారంగధరీయాన్ని 1939లో అంకితం తీసుకున్నారు. ‘కవిసింహం’ బిరుదు తో ఆయనను గద్వాల సంస్థాన ఆస్థాన కవిగా గౌరవించారు.


3. కవిగారు నివసించే గుంటూరు జిల్లాలోని మాచర్ల కు మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల నుంచి సంస్థాన మర్యాదలతో పల్లకీ వచ్చేదట. కాశీపతి దాదాపు 60కి పైగా గ్రంథాలు రచించారు


4. “సారంగ ధర” అను పదాన్ని ఎన్నుకోవటంలోనే కవి ప్రతి భ కనబడుతుంది. శివుడు సారంగధరుడు. సారాణి అంగాని యస్య సః సారంగః- మంచి అవయవములు కలిగిన జింకను సారంగము అంటారు. జింకను ధరించినవాడు శివుడు. జింక గుర్తుగా ఉన్నవాడు చంద్రుడు. అలా శివుడు, చంద్రుడు, సారంగధరుడు ఈ ముగ్గురి పేర్లను కలిపింది.ఆ జింకను ధరించిన వాడు కనుక శివుడు సారంగధరుడు. “ ఓ రంగ శాయి పిలిచితే /ఓయనుచు రా రాదా/సారంగధరుడు జూచి/ కైలాసాధిపుడు కా లేదా “అని త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో శివుని పర్యాయ పదమయిన సారంగధర శబ్దాన్ని అందంగా ప్రయోగించారు.


5. శివుడు కీర్తి కలవాడు అని చెబితే మామూలు వాక్యము.శివుని కీర్తి దేవతలలో ప్రకాశిస్తోందంటే అందమైన కవితోక్తి


6. సూతే అమృతమితి సోమః- అమృతమును పుట్టించినవాడు సోముడు. శివుడు హాలాహలాన్ని కంఠమందు ఉంచుకొన్నప్పటికీ , ఆయన పేరు తలచుకొని పరవశించే భక్తుల హృదయంలో జ్ఞానామృతా న్ని పుట్టిస్తాడు. అందుకే ఆయన సోముడు. సోమ అను పదమును స +ఉమ అని విడదీస్తే పార్వతితో ఉన్న వాడు అను అర్థము శివ పరంగా వస్తుంది. ప్రతి సోమవారం శివునికి ఇష్టమని అందుకే కొంతమంది ఆ రోజు నిష్ఠతో ఉంటారు. పోకూరి వారు ఈ సోమ శబ్దాన్ని” లీలా సోముడై”అని ముగ్గురి పరంగా వాడినతీరు ప్రశంసనీయము


7. కేలాసము అంటే స్ఫటికం . తెల్లని పటికరాయి. దాని సంబంధమైనది కైలాసము. కలం కాలుష్యం ధౌతమన్యేతి కలధౌతం. ధావు గతిశుధ్ధ్యోః పోగొట్టబడిన కాలుష్యము కలది కనుక వెండిని కలధౌతము అంటారు.కలధౌతము , కేలాసము – ఛాయలో దగ్గరి సంబంధము కలిగినవి.అందుకే కైలాస స్ఫురణము కలిగించే కలధౌత శబ్ద ప్రయోగంలో కవి చక్కని శ్రధ్ధ తీసుకొన్నారనిపిస్తోంది.కలధౌత ధాముడు మన పాప కాలుష్యాలను పోగొడుతాడు.


8. పరమశివుని రూపంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉన్నది అని పెద్దలు చెబుతారు.
ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు నాలుగు వేదాలకు సూచన.
నందీశ్వరుడు సత్సాంగత్యానికి, మూడవ నేత్రం జ్ఞానానికి ప్రతీక.
శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక.
ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం.
శివుని తలపైన ఉన్న చంద్రవంక మనోనిగ్రహానికి గుర్తు.
గంగాదేవి శాశ్వతత్వాన్ని నిరూపిస్తుంది.
స్వామి శరీరంపై ఉన్న పాములు జీవాత్మలు
ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని బోధిస్తుంది.
కూర్చున్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని చెబుతుంది.
భస్మం పరిశుద్ధత ఆవశ్యకతను వివరిస్తుంది.


9. “శరధి శరధి తార తార చంద్ర చంద్ర సద్యశా”( సముద్రాన్ని, ఈ శ్వరుని, వెండిని, కర్పూరాన్ని , చంద్రుని పోలిన కీర్తి కలవాడా!)
అని కృతిపతిని పోకూరి కాశీపతి ఈ సారంగ ధరీయపు చివరి పద్యంలో పొగిడారు. ఈ మాటలు పోకూరి కాశీపతికి కూడా వర్తిస్తాయి. స్వస్తి.⁠⁠

సర్వసర్వంసహాసముదాయంబు రథంబు, రథమధ్యమున నున్నరాయి విల్లు
విల్లువెంబడిఁ దిర్గువెలుఁగులు చక్రాలు, చక్రాలకును వైరి చారునారి
నారిఁ బట్టుక తిర్గునాగరకుఁడు గరి, గరిమీఁద విహరించుఘనుఁడు శరము
శరము నాభిక నున్నశతవృద్ధు సారథి, సారథి మాటలు సైంధవములు

గాఁగ నేఁగుదెంచి కణఁకతోఁ బురములు
గెలిచినట్టి ఘనుడు గిరిజతోడఁ



గలసి యుండునట్టి కరుణాసముద్రుండు నిష్టసిద్ధులొసఁగు నెలమి మనకు

సూక్తి ముక్తావళి.


"బలు తెలి పుల్గు వారువము, బంగరువీణియ, మిన్కుటందెలున్,

చిలుక తుటారిబోటియును, జిందపువన్నియ మేనుఁ, బొత్తమున్,

చెలువపు తెల్లతమ్మివిరి సింగపుగద్దెయుఁ గల్గి యొప్పు న

ప్పలుకులచాన, జానలరు పల్కులొసంగెడుఁ గాత నిచ్చలున్."          



(నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి)

(బలు తెలి పుల్గు = మిక్కిలి తెల్లనైన పక్షి (హంస), వారువము = అశ్వము (వాహనము), మిన్కు = ప్రకాశించు, చిందపువన్నియ = శంఖమువలె తెల్లని, మేను = శరీరము, పొత్తము = పుస్తకము, చెలువపు = అందమైన, తెల్లతమ్మివిరి సింగపుగద్దె = తెల్ల తామరపూవు సింహాసనము, పలుకులచాన = వాక్కులకు అధిదేవతయైన పడతి (సరస్వతి), జానలరు పల్కులు = సహజమైన సుబోధకమైన పలుకులు, నిచ్చలున్ = ఎల్లప్పుడు)

భావము: మిక్కిలి తెల్లనైన హంసవాహనముతో, పాదములకు ప్రకాశించు అందెలతో, శంఖమువంటి శ్వేతవర్ణశోభిత దేహకాంతితో, తెల్లని తామరపూవు సింహాసనముపై అధివసించియున్నది వాణీమాత! ఆమె తన హస్తములలో స్వర్ణవీణ, చిలుక, పుస్తకములను ధరించియున్నది. "అటువంటి వాగ్దేవి తనకు సరళసుందరములైన అచ్చతెలుగు పలుకులను ప్రసాదించి, ఆశీస్సులను అందించుగాక" అని కవి ఆకాంక్షిస్తున్నాడు.

"నీలాసుందరీ పతిణయము" అచ్చతెలుగు కావ్యము. అందుకు అనుగుణంగా ఈ భారతీదేవి ప్రార్థనాపద్యం కూడా అచ్చమైన తెలుగు పదాలతోనే సాగినది. 
--((*))--


రామస్వామి నినున్ స్వకీయపరివారంబందు నగ్రేసరుం 
గా మన్నించుటఁగాదె ముందు భవదాఖ్యం బల్కి సీతాసతిన్ 

సౌమిత్రిన్ భరతాదులన్ బిదప నెన్నంజొత్తు రుర్వీజను 

ల్నీ మహాత్మ్యముఁ దెల్పుపాటినరు లేరి భూస్థలిన్ మారుతీ 



కోట్కిలపూడి కోదండరామకవి "మారుతీ శతకము" నుండి 

--((*))--


 కం. అంకరహి తేందువదనలు, పంకజలోచనునిఁ గూడి పరఁగ నటింపన్ 

గింకిణుల నూపురంబుల, కంకణముల మ్రోఁత లెఁసగెఁ గర్ణోత్సవమై 



కం. హరిణీనయనలతోడను, హరి రాసక్రీడ సేయ నంబరవీథిన్ 

సురనాథులు భార్యలతో, సొరిది విమానంబు లెక్కి చూచి రిలేశ 


కం. కురిసెన్ బువ్వుల వానలు, మెరసెన్ దుంధుభులు మింట ముదితలుఁ దారున్ 
సరసన్ గంధర్వపతుల్, వరుసన్ హరిఁ బాడి రపుడు వసుధాధీశా 

కం. రామలతోడను రాసము, రామానుజుఁడాడఁ జూచి రాగిల్లి మనో 
రాములమీఁద వియచ్చర, రామలు మూర్ఛిల్లి పడిరి రాజకులేశా 

కం. తారాధిప నిభవదనలు, తారాధిపవంశ్యుఁ గూడి తారు నటింపన్ 
దారలు నిల్చి సుధాంశుఁడుఁ, దారును వీక్షింప రేయి తడవుగ జరిగెన్ 

పోతనామాత్య "భాగవతము" దశమస్కంధము


 --((*))--




కైకవరము జ్ఞాపకము వచ్చెనో మళ్ళి వనములోఁ జరియింప వసుధలోన 

నీలాద్రిపతిఁ జూచి నేరుచుకొంటివో వలసఁబోవంగ నీవసుధలోన 

పట్టిన సతికిఁ జెప్పఁ దలంచి పోతివో వలస పేరిడికొని వసుధలోన 

రామలదేవు కారణజన్ముఁ డని తోఁచి వరమియ్యఁ బోతివో వసుధలోన 



లేక యిదియేమివింత ముల్లోకములను జడిసి వేంచేసితిరటన్న జడుపుగాదే 
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస పోషబిరుదాంక రఘుకులాంబుధిశశాంక 

బల్లా పేరయ్య కవి "భద్రగిరి శతకము" నుండి


--((*))--

అటుకులుదిని కుచేలాఖ్య భూసురవర్యు, నకుఁగూర్చి తైశ్వర్య నికరములను 

భక్షించి యెంగిలి పండులాశబరికి, వశముఁజేసితివి కైవల్యపదవి 

నఱువదినాల్గు విద్యల నభ్యసించి సాం, దీపసుతుఁదోడి తెచ్చిపెట్టి 

తటవీప్రదేశమం దన్న మర్పించిన, మునిపత్నులకు భక్తిముక్తిలిడితి 



వెవరిఁబ్రోచితో ప్రతిఫలమేమిలేక 

లంచగొండివే నీవెప్పుడెంచిచూడ 
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస 
చన్నకేశవదేవ విశాలభావ!




--((*))--




కలువ కన్నుల కన్నయ్య! 


"లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ? 

గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా 

వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే; 

కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్." 
ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! 
తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! 
అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే 
ఈ బ్రహ్మదేవుడు! 
ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; 
చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! 
అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! 
ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా! 
(పోతనామాత్యుడు.)...


--((*))--


ఇది నాకు నెలవని యేరీతి పలుకుదు నొకచోటనక నిండి యుండనేర్తు 

నెవ్వనివాడనంచేమని పలుకుదు నాయంత వాడనై నడవ నేర్తు 

నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పోకల బోవనేర్తు 

నదినేర్తు నిదినేర్తునని యేల చెప్పంగ నేరుపు లన్నియు నేనునేర్తు 



నొరులు గారు నాకు నొరులకు నేనౌదు 
నొంటివాడ జుట్టమొకడు లేడు 
సిరియు దొల్లి గలదు సెప్పెద నా టెంకి 
సుజనులందు దఱచు జొచ్చియుందు 

దానవేంద్రా! ఇది నా చోటని నేనెట్లు చెప్పగలను? ఒక్క చోటనక నేనన్ని చోట్ల నిండియుందును. ఎవ్వనికి చెందిన వాడని నేనేమి చెప్పగలను, నాకు చెందిన వాడను నేనేయై మెలగుచుందును. ఇది నా సంచరించు చోటని నేనెట్లు చెప్పగలను, కోరి ముల్లోకములలోనూ సంచరించగలను. అది నేర్చుకొంటిని, ఇది నేర్చుకొంటిని అని చెప్పనేల అన్ని విద్యలను నేర్చుకొంటిని. ఎవ్వరును నాకు పరులు కారు, అందరికీ నేను ఆత్మీయుడను. నేనొంటరి వాడను, నాకు చుట్టమొక్కడు లేడు. ఒకప్పుడు నాకు సిరి యుండెను. నాయొక్క నివాస చెప్పెద వినుము - నేనెల్లప్పుడును సజ్జనుల హృదయమునందుండెదను. 

బలిచక్రవర్తి తన వద్ద దానమడుగ వచ్చిన వామనుని అతని పుట్టు పూర్వోత్తరములు తెలుపుమని అడుగగా వామనుడు తన నిజలక్షణాలను ఈ విధముగా తెలిపాడు. పోతన పరమాత్మ యొక్క తత్త్వాన్ని ఈ సీసము-ఆటవెలది పద్య ద్వయంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక అటుతరువాత జరిగినది వామనుని విశ్వరూపము..బలిమర్దనము. 

మహాకవి పోతన విరచిత శ్రీమదాంధ్రమహాభాగవతము అష్టమ స్కంధములోనిది ఈ వామనావతార ఘట్టము. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.


--((*))--


విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును లేదు విశ్వమునకు 

భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీముఖమున 

నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి 

హరికళాజాతుండవని విచారింపుము కావున హరిపరాక్రమములెల్ల 



వినుతిసేయు మీవు వికియుఁ జదువును, దాన మతులనయముఁ దపము ధృతియుఁ 
గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ గమలనాభుఁ బొగడఁ గలిగెనేని 

పోతన భాగవతము నుండి


శివధర్మం బతిసూక్ష్మము 

శివధర్మము లేశమైన సిద్ధించినచో 

వివిధమహాపాపోప 

ద్రవములు చేరంగ రావు ధన్యుని నతనిన్ 



స్థూలదృష్టి వీక్షించినఁ దోఁపకుండు 

సూక్ష్మదృష్టి వీక్షించినఁ జూడ్కి కందుఁ 
గాన శివభక్తిధర్మం బగాధమహిమ 
కానవచ్చినయట్లుండుఁ గానరాదు 

ఆచరం బిది యనఁగ న 
నాచరం బిది యనంగ నజునకు నైనన్ 
గోచరము గాదు శివధ 
ర్మాచారము సూక్ష్మరూపమై వర్తిల్లున్. 

శ్రీనాథ మహాకని ప్రణీత "కాశీఖండము" నుండి 


--((*))-- 



సఖియరో యాతని సంప్రదాయంబెల్ల వినువె చెప్పెద నీకు విశదముగను 

తనతల్లి గుణములు తర్కించి చూడఁగ పుత్రులఁ గని చంపు పుణ్యశాలి 

తనయక్క గుణములు తరమటే యెంచఁగ నైదుగురికి రాణి యైన గరిత 

తనయన్న గుణములు తనె యెఱుంగును దున్నుక బ్రతికెడి దుక్కిముచ్చు 



యింత బహిరంగ మాతని యింటిగుట్టు కడకుఁ దన కెట్టుసుగుణంబు కలుగునమ్మ 
తరుణి నీవేఁగి యిచటికిఁ దాడిమళ్ళ రాజగోపాలుఁ దేఁగదే రాజవదన!! 

"తాడిమళ్ళ రాజగోపాల శతకము" నుండి

--((*))--


అమరులు నీకుసైన్యతతు లాగమముల్ స్తుతివంది పాఠకుల్ 

రమ చెలికత్తె శారదచిరంటి సురాలయముఖ్య సర్వలో 

కములకు నీవ యీశ్వరివి కావున మ్రొక్కెద నీపదాబ్జదా 

స్యము దయసేయవమ్మ మహిషాసురమర్ధని పుణ్యవర్ధినీ 



దిట్టకవి రామచంద్రకవి "మహిషాసురమర్ధని శతకము" నుండి

--((*))--


మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిదచెంగట నుండ నొప్పువాఁడు 

చంద్రమండల సుధారసంబు పోలిక ముఖమునఁ జిరునవ్వు మొలచువాడు 

వల్లీ యుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాడు 


నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు 




పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు విపులభద్ర 

మూర్తివాఁడు రాజముఖ్యుఁడొక్కరుఁడునా, కన్నుఁగవకు నెదురఁగానఁబడియె 

పోతనామాత్య శ్రీమహాభాగవతము నుండి 


--((*))--

నొసలికన్గాకకు బుసబుసమను నిల్లు, కన్వేడినార్పుపై గంగబల్లు 

సగము జేసెఁగదయ్య సత్తి నిన్ బల్ పెల్లు, తలకెక్కె మరుగాలు తగనిగొల్లు 


వంచితే వంగక దెంచినఁ దెగువిల్లు, గండిగా వలపటి బండికల్లు 


పెద్దకొమరునకెట్లు పెండ్లిగాని దిగుల్లు, దండిపాములపొత్తు గుండెఝల్లు 




ఇట్టి గృహభార మహహమీకెట్టు జెల్లు, చున్నదో కద జేరు మాయున్న యిల్లు 

భావభవభంగ గౌరీహృత్పద్మభృంగ, రాజితశుభాంగ రేపాలరాజలింగా 

కొమఱ్ఱాజు వేంకటశివకవి "రేపాల రాజలింగ శతకము" నుండి


--((*))--


పొట్టియై యదితికిఁ బుట్టియై వాక్కులదిట్టయై భువనాలపొట్ట యగుచు

కల్లయై సద్గుణవల్లరై నిజముల తల్లియై కరుణకుఁ గొల్ల యగుచు


విద్యుఁడై జగదేకవేద్యుఁడై భవరోగ వైద్యుఁడై ఖండితచైద్యుఁ డగుచు 


సారమై నిరుపమాకారమై మునిజనాధారమై భూతసంచారుఁ డగుచు 




బలినిమూఁడు పదంబుల నిలను గోరి దివియు భువియును గొని వేడ్కలవిరళముగ

మఘవు నేలినదానవ మహిమహరుఁడు, కేశవుడు వానిఁ దేఁగదే కీరవాణి 

గంగాధర కవి "కీరవాణి శతకము" నుండి



--((*))--



చ. *బొలుపొడతోలు చీఱెయును పాఁపపెసల్ గిలుపారు కన్ను వె 

న్నెలతలఁజేందుకుత్తుకయు నిండిన వేలుపుటేఱు పల్గుపూ 

సలు గలఱేమిలెంక వని జానుఁదెనుంగున విన్నవించెదన్ 

వలపు మదిన్ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా. 

(* శుద్ధాంధ్రము) 


పాలకూరికి సోమనాథకవి "వృషాధిప శతకము" నుండి 


--((*))-- 


విరించి విరచిత వాసరాంబ శతకము

సీ॥...
మందారమున డాగు మకరందమోలెను

. మాతనీనామమే మధుర రసము

సోముడు వర్షించు కౌముది వోలెను

. కామాక్షి కనులలో కరుణ విరియు

చందన మొప్పారు గంధసౌరభములె

. శ్రీజాత రూపమై తేజ మొలుకు 

నవ పల్ల వాలతో నవవసంతము రీతి
. నాతల్లి లీలలే నవ్య తొసగు

తే.
మరువ జాలను నీనామ మధురిమలను
కీర్తనమ్మును జేసెద నార్తి తోడ
శరణు శరణంటి పదమంటి శారదాంబ
వాసరాపుర వాసిత వాసరాంబ

--((*))--



మానినీ మన్మథు మాధవుఁ గానరే సలలితోదార వత్సకములార! 

సలలితోదార వత్సకవైరిఁ గానరే సుందరోన్నత లతార్జునములార! 

సుందరోన్నత లతార్జునభంజుఁ గానరే ఘనతర లస దశోకంబులార! 

ఘనతర లసదశోక స్ఫూర్తిఁ గానరే నవ్య రుచిర కాంచనంబులార! 



నవ్యరుచిర కాంచన కిరీటుఁ గానరె 
గహనపదవి కురువకంబులార! 
గహనపదవి కురువకనివాసిఁ గానరే 
గణికలార! చారు గణికలార! 

పోతనామాత్య "భాగవతము" దశమ స్కంధము నుండి


--((*))-- 


బలిదానవునిద్రొక్కి పాతాళభూమికిఁ, బంపునప్పుడు నొప్పి పట్టెనేమొ 
అభివాదవేళలం దజరుద్రమౌళి క, ర్కశరత్నములుదాకి కందెనేమొ 

సామజేంద్రునిగావ సత్వరంబుగఁ దాము, వేంచేయ బడలికఁ గాంచెనేమొ 

గురుసైరిభాస్థి పంజరము నంబరవీధి, కెగఁదన్నుచో బాధ దగిలెనేమొ 



దేవాధ్దేవ నీదివ్యచరణ 

నీరజంబులనొత్తఁగనిమ్ము రమ్ము 
సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస 
చన్నకేశవదేవ విశాలభావ!




--((*))--



కలియుగమందునీదుకృప గల్గినవారలు పండితోత్తముల్ 

నెలతరొ! నీకృపారసములేని మనుష్యులువట్టిమందులై 

మెలకువజెందలేరు పరమేష్ఠిమనోహరి! నిన్నెగొల్తు నా 

కలవడజేయుమీరసమయంబగుకైతము శ్రీసరస్వతీ! 



చేబ్రోలు సరస్వతీదేవి "శ్రీసరస్వతీ శతకము" నుండి 

--((*))--

దండిబ్రహ్మాండోద రుండ వాదేవకి 

యుదరంబునందెట్టు లుంటివయ్య 

జన్మకర్మాదుల జాడఁగాననివాఁడ 

వెట్టులు బుడుతవై పుట్టితయ్య 

అజహరాదులకైన నందనివాఁడవు 

గోపబాలురనెట్లు కూడితయ్య 

వేదవేదాంతాది విద్యాకృతివిచూడ 
సాందీపుకడ నేమి చదివితయ్య 
యేమనివచింతు నీభావ మెట్లుతెలియుఁ 
జిత్రముకదయ్య నీదుచరిత్రమెల్ల 
సాంద్రకరుణాలవాల విశాలశీల 
భక్తజనజాలలోల గోపాలబాల 

పన్నాల వేంకటసుబ్బరాయశర్మ "గోపాల శతకము" నుండి 


--((*))--

నిర్భయంబుగ దాసనివహంబు నినుఁ జేర, కుండఁ బెన్బాముపైఁ బండినావు 

సిగ్గుచే నెవరు నీ చెంతఁజేరరటంచు, దార నురంబునఁ దాల్చినావు 
శరణార్థు లనిశంబు నరుదెంతురనుభీతి, నడిసందరంబులో విడిసినావు 

అండనుండినవాఁడు గుండె ఝల్లనిపోవ, భూతనాధునిమైత్రిఁ బొందినావు 



నీకు నీవౌచుఁ దిరుగాడ నేర్చినావు 

కన్నులకుఁ జూపవైతి వీవున్నతావు 

సురుచిరవిలాస లశునాఖ్యపురనివాస 
చన్నకేశవదేవ విశాలభావ! 

నారాయణం రామానుజాచార్య ప్రణిత చన్నకేశవ శతకము నుండి


 --((*))--

 హరి! నీకుఁ బర్యంకమైన శేషుఁడు చాలఁ, బవనము భక్షించి బ్రతుకుచుండు 

ననువుగా నీకు వాహనమైన ఖగరాజు, గొప్ప పామును నోటఁ గొఱుకుచుండు 
అదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి, దినము పేరంటంబు దిరుగుచుండు 

నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి, ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుండ్రు 



స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండుఁ 

గాసు నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము 

భూషణవికాస! శ్రీధర్మపురనివాస! 
దుష్టసంహార! నరసింహ దురితదూర

--((*))--
  

ఒకచేతకోల వేఱొకచేత వేణువు, పట్టి పింఛముమౌళిఁ బరగఁజుట్టి 

కర్ణికారంబులఁ గర్ణంబులనుదాల్చి, గురివెందసరులచే నురమువెలయ 

ధేనురింఖాధూళి దేహంబుపైఁగప్ప, ఘర్మబిందువులు మొగమ్మునందు 

ముత్యంబులటుదోఁప ముంగురుల్ నృత్యంబు, సల్ప నిల్చుచుఁ దరుచ్ఛాయలందు 



గోపకులఁగూడి గోవుల మేఁపు నీదు 
రూపమును నాకు నొకపరి నొకపరి చూపవయ్య 
సాంద్రకరుణాలవాల విశాలశీల 
భక్తజనజాలలోల గోపాలబాల! 

పన్నాల వేంకటసుబ్బరాయశర్మ "గోపాల శతకము" నుండి 


 --((*))--



అచట లేవని కదా యరచేత జఱచెఁ గ్రు, ద్ధత సభాస్తంభము దానవేంద్రుఁ 

డచట లేవని కదా యస్త్రరాజం బేసె, గురుసుతుం డుత్తరోదరమునందు 

నచట లేవని కదా యతికోపి ననిచెఁ బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ 

డచట లేవని కదా యాత్మీయసభను ద్రౌ, బదివల్వ లూడ్చె సర్పధ్వజుండు 



లేక యచ్చోటులను గల్గలేదె ముందు, కలవు కేవల మిచ్చోటఁ గల్గుటరుదె 
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ, హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!! 

కాసుల పురుషోత్తమ కవి "ఆంధ్రనాయక శతకము" నుండి 


--((*))--



అంబానందనుఁడు మహా

లంబోదరుఁ డఖిల దివిజలక్షిత నిజపా

దాంబుజుఁడు విఘ్నహారి ద

యాంబుధి మత్కృతిసహాయుఁడై ననుఁ బ్రోచున్



కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి
--((*))-- 





సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక 

శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు 

నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు 

వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత 



యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద 
చంద్ర చందన మందారసార వర్ణ 
శారదాదేవి మామక స్వాంతవీధి 
నిండు వేడుక విహరించుచుండు గాత! 

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి


--((*))--


రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తి

కాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి

--((*))--


*శ్లో ;--అకాండ పాతజాతనాo /ఆర్ద్రాణాం మర్మభేదినాం /
గాఢ శోక ప్రహారాణాం / అచింతైవ మహౌషధమ్//

తా ;- నిరంతరమూ బాణముల వలె మీద పడి .మర్మ భేదన మొనర్చుతుండే పలుకష్టములు.దుఃఖములు తొలగుటకు వాటిని గూర్చి చింతించకుoడు టొక్కటే మార్గము
--((*))--


* సప్తస్వర కందము, మిన్నికంటి గురునాథశర్మ, శివగీత 12-1 



మాపని సరిఁగాఁ గని 

మా పాపాగ గరిమపస మాపఁగ దగదా 

నీ పాద దరిగని గదా 

మాపా సామాగమ పదమాని సదాదా
--((*))--

జగతిలోపలను "యస్మా త్పరం నాస్తి" నాఁ, బరమపరునిమీఁదఁ బరము గలదె 

యింపారగా "ఏక ఏవ రుద్రోచ్యతే", యనఁగ రెండవరుద్రుఁ డాదిఁ గలఁడె 

కూర్మిమై "సశివ ఏకోధ్యేయ" యనఁగ ధ్యే, యుండు శివుండు వేఱొండు గలఁడె 

యిల "అపరస్స మహేశ్వరో" యన మహే, శ్వరునిపై మఱి మహేశ్వరుఁడు గలఁడె 



యటులు శంకరుఁడు మహాదేవుఁ డీశానుఁ 

డఖిలవేదవేద్యుఁ డభవుఁ డుండ 
నితరసురలఁ గూళ లెట్లొకో భజియించి 
భవనిమగ్నులైరి బసవలింగా 

పాలకురికి సోమనాథకవి "చతుర్వేదసారము" నుండి


--((*))-- 


తనది కాదది యని తగ నెరింగియు పర -శ్రీ నొంద దల్చిన జెర్రిపోతు 

పరుల సంతోషమ్ము పాడు సేయగ కుట్టి -దురద తీర్చుకు పోవు దొంగ తేలు 

పరుల అభ్యున్నతి భగ్గున మండించ -వాచార్భటుoడైన రేచు కుక్క 

పరుల చెడప దల్చి వలను గాకున్నను -పిల్లి మొగ్గల వేయు పిల్ల నల్లి



ఒకసారి శ్రీ గడియారం రామకృష్ణశర్మగారు కదిరి పట్టణానికి వెళ్ళి, రాత్రి అక్కడ బస చేయవలసివచ్చిందట. ఆ చోట విపరీతంగా దోమలు ఉండడంవల్ల, రాత్రంతా నిద్రలేక చాలా అవస్థపడి, తెల్లవారి ఈ పద్యం చెప్పారట. మనమూ చూద్దామా ఆ పద్యాన్ని! 


మనసు నొప్పించిన మరుని గాల్చిన నాటి 

శర్వు ఫాలాగ్ని కా శక్తి లేదు! 

లోకాళి బాధించు రాకాసులన్ జంపు 

పాకారి కత్తికి పదును లేదు! 

భక్తు నేచిన దైత్యు పడఁజీల్చు నరసింహు 
నఖముల కిట్టి తైక్ష్ణ్యంబు లేదు! 
చలపాదియై పూని సైంధవవధ సేయు 
జిష్ణు బాణాల కీ చేవ లేదు! 

వజ్రమున కింత భయదమౌ వాడి లేదు! 
శూలమున కీ యసహ్యమౌ చురుకు లేదు! 
నీకు నెటు లబ్బె యీ వాడి, యీ కుశక్తి! 
కాలఖడ్గంబు సమమ! ఓ కదిరి దోమ! 

(మరుడు = మన్మథుడు, శర్వుడు = శివుడు, ఫాలాగ్ని = ఫాలనేత్రము నుండి వెలువడిన మంటలు, లోకాళి = లోకముల సమూహము, రాకాసులు = రాక్షసులు, పాకారి = ఇంద్రుడు (పాకుడు అనే రాక్షసునికి శత్రువు), ఏచిన = హింసించిన, దైత్యుడు = రాక్షసుడు (హిరణ్యకశిపుడు), నఖములు = గోళ్ళు, తైక్ష్ణ్యంబు = తీక్షణత్వము, జిష్ణుడు = అర్జునుడు, చేవ = శక్తి, భయదమౌ = భయంకరమైన, వాడి = పదును, అసహ్యమౌ = సహింపరాని, కుశక్తి = చెడ్డశక్తి, కాలఖడ్గంబు = యముని చేతికత్తి, సమమ = సమానమైనదానా) 
పద్యము యొక్క భావము సరళము, సుబోధకము. 


*కరివరునిన్ విభీషణుని గాకమునున్ గుహునిన్ గుచేలునిన్ 

మరియును గుబ్జనున్ రవికుమారుని నాదిగఁ గాచినావు గా 

నరమరలేక నీవునటు నన్నొకనిన్ దయఁ జూడకుందువా 

పరమమునీంద్ర యోగిజన పాపహర మహిజామనోహరా 



రేమెల రామదాసు కవి "మహిజామనోహర శతకము" నుండి

--((*))--


ఆరగింపవే 

రాగం తోడి, రూపక తాళం 

శ్రీత్యాగరాజస్వామివారి కృతి 



పల్లవి 


ఆరగింపవే, పాలారగింపవే 
(ఆరగింపవే) 

అనుపల్లవి 

(రఘు) వీర జనకజాకర పవిత్రితమౌ వెన్న పా 
(లారగింపవే) 

చరణం 

సారమైన దివ్యాన్నము షడ్రసయుత భక్ష్యములు 
దార సోదరాదులతో, త్యాగరాజవినుత! పా 
(లారగింపవే)



*కలి నంత తంకు ధర్మకర్మపథ సంస్కారంబు మాసె న్మహా

బలవంతంబయి కానిపించె నహహా మాన్యావమానక్రియా

కలనల్ నీకరుణాకటాక్షమున నిక్కాలంబు దోలందగుం

జలనం బింతయుఁ జెందకుండ జననీ జ్ఞానప్రసూనాంబికా.



శ్రీశిష్టు సర్వాశాస్త్రి గారి "జ్ఞానప్రసూనాంబిక శతకము" నుండి
--((*))--


పితృవాక్యమునకై పినతల్లి కోరిక గడుపఁగా నేరీతి గడగినావొ 

కడగినవాఁడవై ఖరదూషణాది రాక్షస సమూహము నెట్లు చదిమినావొ 

చదిపినాఁడవై శాఖామృగశ్రేష్టు నేగతి బంటుగా నేలినావొ 

యేలినవాఁడవై యెటువలెఁ గపులచే ఘనవార్ధి నేక్రియఁ గట్టినావొ 



కట్టి లంకాధిపుని నెట్లు గొట్టినావొ యిట్టి ధైర్యము గలదొరపట్టి వరయ 

భద్రగిరివాస శ్రీరామభద్ర దాస పోషబిరుదాంక రఘుకులాంబుధిశశాంక 

బల్లాపేరయ్య కవి "భద్రగిరి శతకము" నుండి



*కంద ద్వ్యాక్షరి



మనమున ననుమానము నూ

నను నీనామ మనుమను మననమును నేన

మ్మున మన నన్ను మన్నన

మనుమను నానా మునీన మానా మానా

అర్థము: నానా=సకల, మునీన=మునిశ్రేష్టులయొక్క, మాన=ప్రమానములకు, అనూనా=అధికుడా, మనమునన్=మనస్సునందు, అనుమానమున్=సందేహముమును, ఊనను=పెట్టను, నీనామమును=నీపేరనెడు, మను=మంత్రముయొక్క, మననమును=ధ్యానమును, నే మమ్మునన్=నియమముతో మానన్=వదలను, నన్నున్=అట్టినన్ను, మన్ననన్=ప్రీతితో, మనుము+అను=జీవించుము అని చెప్పుము.

నంది తిమ్మన "పారిజాతాపహరణమూ 5-98 నుండి

__((*))--


5 కనుమలు 

శవదాహే గ్రామదాహే సిపిండీకరణే తథా

శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని



శవందహనం జరిగిన మరుసటి రోజు, గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు , సపిండీకరణమైన మరుసటి రోజు, సంక్రాంతి తరువాతి రోజు, వాటిని కనుమలు అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదు. (జి.జి.శర్మగారికి కృతజ్ఞతలు)




*సత్కారమందు టన్నది

సత్కార్యంబుల ఫలమ్ము, సంతాపమ్ముల్

చీత్కారమ్ములను కడు వి

పత్కర స్థితికిన్ దురాశ ప్రథమమ్ముగదే.

    

*సీ: శ్రీరస్తు శుభమస్తు చెల్వొందు మన్మధ
సంక్రాంతి పండుగ సంబరాన
వకవంక చలివల్ల వణుకుచు గడగడ
ముసుగులో వొదిగిన ముసలివారు
తాతల ప్రక్కన తాముతామనుచును
తగువాడు పిల్లల తగవుతీర్చి
వారి ప్రక్కన నక్కి బద్ధకముప్పిర
నిద్రించు మనుమలన్ నిమురుచుండ
గొబ్బెమ్మలనుచేసి కూర్మితో నర్తించు
కన్నెల అందెలు ఘల్లుమనగ
హరిలొరంగయనుచు హరిదాసు రాగానె
ఇంటింట తండులాల్ ఇంతులీయ
నలుగురూ గుంపుగా నగరసంకీర్తనల్
సలుపుచు తిరుగుచు సద్దుచేయ
ముంగిట వాకిట్లొ ముదమార వనితలు
రంగవల్లులుదిద్ద రమ్యమలర
పండిన పంటను బళ్ళపై ఇళ్ళకు
రైతులు కొనిరాగ ప్రీతితోడ
డూడూడు బసవన్న ఆడమనగ గంగి
రెద్దులు విన్యాస లీలజూప

ఆ.వె: ఇనుడు మకరరాశి నింపార జేరగ
తనదు కిరణములను తనివితీర
గ్రోలి మంచుబొట్లు సోలి కరిగిపోవ
పల్లెసీమ మురిసె పరవశాన

ఆ.వె: పట్టణాన యిట్టిదృశ్యమేకరువాయె
కృతిమ అందాలెగద సతతమచట
ప్రకృతి మనకిచ్చు పచ్చని సంపద
చాలు సంకురాత్రి సంబరాన

ఫేస్ బుక్ లోని అన్నిగ్రూపు సభ్యులకు
మన్మధ సంక్రాంతి శుభాకాంక్షలు

భవదీయుడు
కాలనాధభట్టవీరభద్రశాస్త్రి



--((*))--




బోటిరో సౌందర్య మేటిరో రతనాల కోటిరో ముద్దులమూటరావె 

లేమరో వరగుణధామరో ముఖజిత సోమరో పరిపూర్ణ కామరావె 

యింతిరో కంతుచేబంతిరో తేనియ దొంతిరో కీర్తిచేమంతిరావె 

కొమ్మరో కలధౌతబొమ్మరో మదనాగ్ని జిమ్మవే కనులనెత్తమ్మిరావె 



మానినీ రావె మదగజయాన రావె బాల వేరావె మరునిపూగోల రావె 
యనుచుఁ బిలిచెడు వనమాలి దనుజహరుఁడు కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి 

గంగాధర కవి "కీరవాణి శతకము" నుండి


 --((*))--

 సీసము: 

హరిహరియనుచును హరిదాసు మేల్కొలుప 

చెత్తగాలుచుమ ముంచెత్త శోభ 

రథము మ్రుగ్గిడి మనోరథము దీరుచుకొమ్ము 

ఇళ్ళముంగిటను గొబ్బిళ్ళ బెట్టి 

పొంగమది తినుమ పొంగలీ పులగమ్ము 
లరిసెగారెలరుచు లరసి నీవు 
బాలల తల దలంబ్రాలుగా పోయుము 
రేగుపండ్ల మిగుల రేగ కాంతి 

ఆటవెలది: 
గంగిరెద్దులాట ముంగిటనే జూచి 
గాలికెగురవేసి గాలిపటము 
భోగి సంక్రాంతుల భోగముల్ గనుమింక 
తెలుగునాట పరుల మనసు నాట.


గొల్లి శాస్త్రి గారు పంపినది
--((**))--



*ఎక్క గుఱ్ఱము గద్దెయెద్దు నెక్కుటెగాని యుండుట కిలుగద్దె యెలికిగాని

కట్ట వస్త్రము గద్దె గజచర్మమే గాని పొసఁగఁ గంచము గద్దె పుఱ్ఱె గాని

పెట్ట సొమ్ములు గద్దె పెనుఁబాములే గాని పూయ గంధము గద్దె బూది గాని

ఏలుకో భువి గద్దె యీశాన్యమే గాని పండుకో గది గద్దె కొండె గాని



జోగివాఁ డౌట తెలియక సుందరాంగి మరులుకొంటిని వినుమమ్మ మందయాన
వనిత నీ వేఁగి శ్రీశైలవాసుఁ డైన మల్లికార్జనుఁ దేఁ గదె మధురవాణి

"మల్లికార్జున శతకము" నుండి

 --((*))--


 అనుగత సదర్థ పరమహి 

మ నగరి సకలభవనాగ్ర మహిత గజౌఘం 

బునఁదనరు సదాగతి కృత 

ఘన సంగతి మిధిల యనఁగ గరిమాస్పదమై 



వేంకటాచార్య ప్రణీత "అచలాత్మజా పరిణయము" (ద్వ్యర్ధ ప్రబంధము)నుండి. పార్వతీ మరియు సీత పరముగా చెప్పిన కావ్యం. 

పార్వతీ పరము: అనుగత సదర్ధ పరమ - అనుగతి=అనుసరించిన, సత్=యోగ్యమగు, అర్ధ=వస్తువుల చేతను, పరమ=ఉత్కృష్టమైనదియగు, హిమనగరి=హిమవత్పురము, సకలభవనాగ్రమహితగజౌఘంబునన్- సకలభ=ఏనుగు పిల్లలతో కూడిన, వనాగ్ర=వనాగ్రములందు, మహిత=పూజ్యములైన, గజ=ఏనుగులయొక్క, ఓఘంబులన్=సమూహములచేతను, సదాగతి...మిధిల- సదాగతి=వాయువుచేతను, కృత=చేయబడిన, ఘన=మేఘములయొక్క, సంగతి=కలయికయొక్క, మిధి=మధనమును, ల=పొందినది, అనగన్=అనునట్లుగా (అనగా ఏనుగులుండగా నీ మేఘ్గములేలయని గాలి మేఘములను నెగురగొట్టినది అనుట0 గరిమ=గొప్పతనమునకు, (అనగా నౌన్నత్యమునకు) 
ఆస్పదమై=స్థానమై, తనరున్=ఒప్పును. 

సీతాపరము: - అనుగత ... మహిమ, అనుగతసదర్ధ=అనుసరించిన మంచివస్తువులచే, పర=ఉత్కృష్టమయిన, మహిమ=సామర్థ్యముగల, సదాగతి...సంగతి, సత్=యోగ్యులయొక్క, ఆగతి=వచ్చుటచేతను, కృత=చేయబడిన, ఘన=గొప్పవారియొక్క, సంగతి=కలయికగల, మిధిలయనగన్=మిధినలయను పేరుగల, నగరి=పట్టణము, గరిమ=గౌరవమునకు, ఆస్పదమై=స్థానమై, సకల...ఓఘంబునన్, సకల=సమస్తములయిన, భవన=గ్రుహములయొక్క, అగ్ర=ఎదుటను, మహిత=పూజ్యములయిన, గజ=ఏనుగులయొక్క, ఓఘంబులన్=సమూహముచేత 
గరిమాస్పదమై= తనరున్=ఒప్పును

--((*))--



బాణజాలంబులపాలు సేయఁగనేల కాముఁడా నీ రూపు కాలిపోను

చెవులు చీఁదఱగొనఁ జెలఁగి కూయఁగనేల కోకిల నీయిల్లు కాలిపోను

ప్రళయాగ్నిరూపమై పట్టుగా విసరెడు పవనుఁడా నినుఁద్రాచుపాము మ్రింగ

వెన్నెల గురియించి వేఁడి సూపఁగ నేల చంద్రుఁడా నీరూపు సమసిపోను


వలచి వలపించి నాప్రాణవల్లభుండు రాఁడనుచు వీరలందఱు గూడికొనిరి
తరుణి నీ వేఁగి యిచటికిఁ దాడిమళ్ల రాజగోపాలుఁ దేఁగదె రాజవదన!!

"తాడిమళ్ళ రాజగోపాలశతకము" నుండి
   

--((**))--