ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
సర్వేజన సుఖినోభవంతు
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరికి ఒక శక్తి
అదే మనుష్యులను ఉత్తేజ పరిచే యుక్తి
అందుకే ఉండాలి జీవుని నిరంతరం భక్తి
తల్లి తండ్రుల పాద సేవే అందరికీ ముక్తి
అదే మనకు కలిగించును దివ్యాను రక్తి
జగత్ యొక్క నిజతత్వాన్ని తెల్సుకొనే శక్తి
సత్యం శివం సుందరం అని తల్చటమే భక్తి
ఇదే మాయా బ్రమలను తొలగించే ముక్తి
విడదీయరాని భంధంగా కలవటమే రక్తి
వ్రుర్తి - ప్రవుర్తి ధర్మ భద్దంగా ఉంటేనే ముక్తి
కాల గమ్యం బట్టి ఉంటేనే ఉండు శక్తి
నిత్యకర్మలతో నామ జపమే నిత్య భక్తి
ప్రణయ ప్రాధాన్యాన్ని రక్షించేది రక్తి
వినయ విధేయతను పెంచేది ముక్తి
మన: శాంతితో ధైర్యాన్ని ఇచ్చేది శక్తి
మనుగడకు సహాయంగా ఉండేది భక్తి
--((*))--
ప్రాంజలి ప్రభ
రచయత:మల్లాప్రగడ రామకృఫ్ణ
కర్తవ్యం ఉంటే ఉండు మనో నిబ్బరం
- మానవత్వానికి అదే ఆదర్శం
భాందవ్వం ఉంటే ఉండు జన్మ విశ్రుతం -
బంధుప్రీత్వానికి అదే అణ్యూణ్యం.
స్త్రీ తత్వం ఉంటే ఉండు ప్రేమ మిశ్రితం
సౌలభ్యత్వానికి అదే మాత్రృత్వం
కారుణ్యం ఉంటే ఉండు దైవ కల్పితం
కార్యసమ్మోహని అదే జీవత్వం
కర్తవ్యాన్ని గుర్తించే మనో నబ్బర శక్తిని పెంచే మానవాభ్యుదయం ఉండాలి.
బందుత్వం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటేనే బాంధవ్వం పెరుగుతుంది.
స్త్రీ గా ఉండి స్త్రీ ప్రేమ నందించి మాత్రృత్వం పొంది జీవ సాఫల్యం పొందాలి.
దైవ సంకల్పం ప్రకారంగా ప్రతిఒక్కరు మోహానికి లొంగి కరునకు చిక్కి జీవితం సాగించాలి
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమతో - ప్రేమ లేఖ (3)
రాధా మన పెళ్లి కాకముందు జరిగిన సంఘటనను ఇదిగో మెసేజ్ గా నీకు గుర్తు చేస్తున్నాను, ఒక్కసారిగా ౩౦ సంవత్సరాలు వెనక్కి పోయి ఇప్పుడు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన లేఖలో ఏదన్న మరచి పోయినా నీ లేఖలో నాకు తెలుప గలవు, మన ప్రమ లేఖలు మనల్ని ఇంతకాలం బ్రతికిస్తున్నాయి.మన తీపి జ్ఞాపకాలు మన పిల్లలు చదువుకొని నవ్వుకుంటారో మరి ఏమో నాకు మాత్రం తెలియదు .
ఆనాడు నీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు ఉన్నది, నేను గుంటూరులో ఉన్నప్పుడు నీవు ,మాప్రక్క ఇంటిలో కొత్తగా అద్దెకు మీరు వచ్చారు గుర్తున్నదా, అవును నీవు మరచి పోయి ఉంటావు ఆసంఘటన ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నందుకు ఏమి అనుకోకు.
అప్పుడు మీ అక్కకు పెళ్లి కుదిరింది అప్పటికి నివయసు 14 సంవత్సరములు చిన్న చిన్న లంగాలు వేసుకొని, కాళ్లకు పట్టాలు పెట్టుకొని, చెవులకు దిద్దులు పెట్టుకొని, లంగా పైకెత్తుకుని కోడె దూడ ఎగిరినట్లు ఎగురుతున్న విషయం నన్ను కవ్వించిన విషయం ఏనాటికి మరవలేను, ఆ పరుగులే నాలో ఎదో కలవరింతలు రేపినవి.
అప్పుడే నాదగ్గరకు వచ్చి మాధవ్ నాకు జామకాయ కోసి పెట్టవా అని అడిగావు, అంతే అంతే ఒక్క గంతులో హనుమంతునిలా ఎగిరి జామకాయ కోశాను గుర్తున్నదా, పెట్టు పెట్టు అన్నప్పుడు, అప్పుడే కాకి ఎంగిలి అని గుడ్డ అడ్డం పెట్టి కొరికి మరీ ఇచ్చాను, పెదాలు రుచి ఎంత బాగున్నది అన్నావు, అప్పుడే అనాలోచనముగా వెంటనే బుగ్గను ముద్దు పెట్టుకొని పరుగెత్తాను, అప్పడే భామ్మా అంటూ ఏడుస్తూ లోపలకు వెళ్లి ఎదో చెప్పావు, అప్పుడు ఏమి జరిగిందో నాకు తెలియదు నీకు గుర్తుందో వ్రాస్తే సంతోషిస్తాను.
బామ్మ అరుస్తున్నది పక్కింటి పిల్లగాడు ఖాళీగా ఉన్నాడేమో ఒక్కసారి పిలువు అని రాధను పురమాయించింది.
మాధవ్ మాధవ్ అంటూ గోడకు వెనుకాల నుండి మెల్లగా పిలిచావ్.తర్వాత గట్తిగా పిలిచావు.
అప్పుడు నాలో వణుకు పుట్టింది, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, చమట పట్టేసింది, ఎం చెప్పిందో రాధ, నాకు ఈరోజు ఎదో జరగ పోతుంది, ఎం ఝరిగినా రాధ కోసం వేచి ఉండాలి, రాధ పిలుస్తున్నది కనుక పోవాలి అని నెమ్మదిగా బామ్మ దగ్గరకు వచ్చాను.
ఏమిటిరా అలా దిక్కులు చూస్తావు అని ఘర్జించింది బామ్మ , అయోమయం పక్షిలాగున్నావు, ఏమిటి ఆ బిత్తర చూపులు, నిన్నెవరు కొరుక్కు తినటంలేదు, వేధించటం లేదు ఇక్కడ, చలికి వణికి నట్లు వణుకుతూ ఏమిటి అలా కార్చుకున్నావు, పోయి డ్రస్సు మార్చుకొని రా అన్నాది బామ్మ అప్పటికి కానీ నేను ఏం చేసానో తలచుకొని చాలా సిగ్గు పడ్డాను, అక్కడ ఉండక వెంటనే వెనక్కు వచ్చా,
బామ్మ అరుపులు విన్న ఏమన్నదో తెలియదు, పనివారు లోపలకొచ్చి గుడ్డతో తుడిచినట్లు నేవే ఒకసారి చెప్పి బాల్య చేష్టలు అని చెప్పి నన్ను ఉడికించిన విషయం నాకు ఇంకా గుర్తు ఉన్నది, అదికూడా పెళ్లైన మొదటి రాత్రిలో గుర్తు చేసికొని మరి నవ్వుకున్నాము.
ఒకనాడు నీవే నాదగ్గరకొచ్చి చిల్లు గారే తింటావా అన్నావు, నాకొద్దులే అన్నాను, అప్పుడే వేలుకి గుచ్చుకొని నాదగ్గరకొచ్చి తిను మాధవా అంటూ వేలు అందించావు, అప్పుడే నీ వేలును కూడా కొరికాను, అప్పడే నీకు పిచ్చి కోపము వచ్చి నన్ను నాలుగు ఉతికి మరీ ఏడుస్తూ పోయావు.
అప్పుడు బామ్మకు చెపుతావని అనుకున్నా, కానీ అట్లు చేయక గారెలు బూరెలు కవర్లో తెచ్చి నీవు తిను నీమీద నాకు కోపము లేదే అంటూ నవ్వుకుంటూ జడ తిప్పుకుంటూ వెళ్ళటం నాకు ఇంకా గుర్తు ఉన్నది.
నాకింకా గుర్తుంది రాధా, నీవు పుట్టినరోజు పండుగగా బుట్టఁగౌన్ వేసుకొని కేక్ కట్ చేస్తూ కొంత వంటిమీద పడేసు కొనగా మీ బామ్మా అక్షంతలు వేయగా తర్వాత గౌన్ కడుగు కొనుటకు బాత్ రూంలో చేరగా అక్కడ సబ్బుపై కాలుమోపి పెద్దగా కేకవేసి క్రింద పడ్డావు, అప్పుడే బామ్మ మాధవ్ నీవు వెళ్లి చూడు అన్నప్పుడు వెంటనే పరుగెత్తి బాత్ రూంలో చేరా నీ పరిస్థితిని నాకు భయం ఏర్పడినది అప్పుడే బామ్మను పిలిచా బామ్మ బాత్ రూమ్ లో రాధను చూసి ఓరై నీవు ఆటుపోరా నేను రాధను తెస్తాను అన్న మాటలు ఇంకాగుర్తు ఉన్నాయి.
నీవు పుష్పావతి అయినట్లు గమనించి చీరకట్టించి పెద్ద బంతి ఏర్పాడు చేసి భోజనాలు ఏర్పాటు చేసి అనై దీవెనలు ఇప్పించి నన్ను మాత్రం ఆనాటి నుండి ఓర చూ పులతో ఉడికించి, కొత్త అందాలతో ఎగసి పడుతున్న విషయాలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న ఇంకా వ్రాయాలని ఉంది, కానీ ఆనాటి అనుభవాలు నీవు వ్రాస్తావని నా వ్రాతలు ముగిస్తున్నాను.
written by Malapragada RamaKrishna
--((*))--ఓం శ్రీ మాత్రేనమః శ్రీ దుర్గా సూక్తమ్ ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ | స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితాஉత్యగ్నిః || తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ | దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ || అగ్నే త్వం పా’రయా నవ్యో’ అస్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” | పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ఉర్వీ భవా’ తోకాయ తన’యాయ శంయోః || విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితాஉతి’పర్-షి | అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”உస్మాకం’ బోధ్యవితా తనూనా”మ్ || పృతనా జితగ్ం సహ’మానముగ్రమగ్నిగ్‍మ్ హు’వేమ పరమాథ్-సధస్థా”త్ | స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితాஉత్యగ్నిః || ప్రత్నోషి’ కమీడ్యో’ అధ్వరేషు’ సనాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ | స్వాంచా”உగ్నే తనువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ చ సౌభ’గమాయ’జస్వ || గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోరనుసంచ’రేమ | నాక’స్య పృష్ఠమభి సంవసా’నో వైష్ణ’వీం లోక ఇహ మా’దయంతామ్ || ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ || ఓం శాంతిః శాంతిః శాంతిః’ || శ్రీనివాసమూర్తి గంజాం గారికి ప్రాంజలి ప్రభ తెలుగు ప్రజలకు అందించినందుకు అభినందనలు.
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మృత్యు భయమువలన)
12. జీవన్మృతుడెవరు?
(దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది?
(జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
(తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది?
(మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తృణం కంటె దట్టమైనది ఏది?
(చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
(చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
( అస్త్రవిద్యచే)
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ఞం చేయుటవలన)
| ||
మీ ప్రాంజలిప్రభ లోని కవితలు, కథానికలు చాలా బాగా ఉన్నాయి. ధన్యవాదాలు.
ReplyDelete