ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
సర్వేజన సుఖినోభవంతు
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నేను చెప్పిన మాట ఎపుడు ఒప్పినావు నేస్తమా
మన కబురులు ఆట ఎచట విప్పినావు నేస్తమా
మనసు మాట చెప్పుకొనగ నీవు గాక ఉందేవ్వరు
నీ తీయని పలుకు లన్నీ నాకు తెల్పినవే నేస్తమా
ఎంత ఓర్పు, ఎంత నేర్పు, కూర్పు కడలి హృదయమా
చెప్పరాని నా నేత్రం చెప్ప మంటున్నది మిత్రమా
మనసు విప్పు చెప్పు కొనుటకు నీకన్నా నాకెవ్వరు
చెప్పు కోలేనివి తెల్పినా ఫలితము లేదుగా నేస్తమా
స్వస్చమైన పాల వలే ఉన్నది నీ హృదయం
అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని స్నేహమా
చిత్తశుద్ధి మంత్రముంది, మాటనేర్పు ఉంది నీ దగ్గరా
గుండెను బట్టి ఆర్ధం చేసుకొనే తత్వం లేదు మిత్రమా
దివ్య ప్రేమ సందేశం, మనసుకు శాంతి తెల్పవా
నీ శ్వాస సాక్షిగా నా మాటలు గమనించవా నేస్తమా
--((*))--
నేటి పద్యం జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
మనసుకు భావమేది , భావానికి వయసు ఏది -
చివరికి నేస్తమేది నేస్తానికి బంధము ఏది
వయసుకు గాయమేది - గాయానికి మరుపు ఏది -
భందానికి భాష ఏది - భాషకు ప్రేమ ఏది
మరపుకు గానమేది - గానానికి వలపు ఏది
ప్రేమకు మార్పు ఏది - మార్పుకు ఓర్పు ఏది
వలపుకు మాట ఏది - మాటలకి చివరి ఏది
ఓర్పుకు తీర్పు ఏది - తీర్పుకు నేర్పు ఏది
ఐ లోకంలో అందరు మెధాఉలే ప్రతిఒక్కరు సలహాలిచ్చేవారే ఆచరణకు వచ్చేటప్పటి కల్ల తోక ముడిచేవారే మాటా గారడి ఒక్క సారి చదవండి మికేఅర్ధం అవుతుంది
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామక్రృష్ణ
కుటుంబంలో రెండు మనస్తత్వాలు ఉంటాయి - అవి తాత్కాలమే రాత్రి కి సర్దు కుంటాయి.
బాదించే కోపం నీదీ - భరించే తత్వం నాది
హింసించే వైనం నీదీ - సహించే భావ్వం నాది
ద్వెషించే గోప్యం నీదీ - శ్రమించే లక్ష్యం నాది
ఛేదించే ధైర్యం నీదీ - క్షమించే గుణం నాది
శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
written by Mallapragada ramakrishna
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేణమ:
ప్రాంజలి ప్రభ ( జికె -2)
1 .ద్విత్వ అక్ష రాలు తెలుపుము ?
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము
ముగ్గురు
గజ్జెలు
తప్పెట
వియ్యము
కయ్యము
కళ్ళు
నమ్మకం
2 . ప్రక్రుతి వికృతిలు కొన్ని వ్రాయుము ?
ప్రకృతి - వికృతి
భాష - బాస
రాజు - రేడు
శాస్త్రము - చట్టము
వర్ణము - వన్నె
విద్య - విద్దె
అక్షరము - అక్కరము
ఆధారము - ఆదరువు
కుమారుడు - కొమరుడు
కృష్ణుడు - కన్నడు
పద్యము - పద్దెము
న్యాయము - నాయము
దీపము - దివ్వె
భద్రము - పదిలము
3. లింగములు ఎన్ని ?
లింగములు 3 రకాలు అవి
1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.
👌 👌
ReplyDelete