ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
సర్వేజన సుఖినోభవంతు
ఈ నాటి విషయ సూచిక
1. సంపాదకీయం
2. ఆధ్యాత్మిక కథామృతమ్
3. ఆధినిక సూక్తులు
5. చిత్రం
6. జీవన జ్యోతి పద్యాలు
7. నేటి కవిత
8. నడక కధామృతం
9. విజ్ఞాన వేదిక
10 . హాస్య గుళిక
ఈ కథపై మరియు ప్రాంజలి ప్రభలో ఉన్న అన్ని విషయాల పై మీ అభిప్రాయాలు తెలపండి
అందరికి వందనాలు తెలుపుతూ మీ మల్లాప్రగడ రామకృష్ణ , అమరావతి
సూక్తులు
1. సంపాదకీయం
2. ఆధ్యాత్మిక కథామృతమ్
3. ఆధినిక సూక్తులు
5. చిత్రం
6. జీవన జ్యోతి పద్యాలు
7. నేటి కవిత
8. నడక కధామృతం
9. విజ్ఞాన వేదిక
10 . హాస్య గుళిక
ఈ కథపై మరియు ప్రాంజలి ప్రభలో ఉన్న అన్ని విషయాల పై మీ అభిప్రాయాలు తెలపండి
అందరికి వందనాలు తెలుపుతూ మీ మల్లాప్రగడ రామకృష్ణ , అమరావతి
సూక్తులు
▪మురికి నీటితో ఉతికిన దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రన శుభ్రం కావు.
▪ ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు. ఆ బాగోదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్టే.
▪ తెలియనిది అడిగితే బయటపడే అజ్ఘానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అజ్ఘానమే.
▪తోటివారితో కలసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించమే నాయకత్వం.
▪నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొత్తగా పెళ్ళైన వారి భాధ
మాటలో మర్మాన్ని విప్పాలి - రా రా కామ్యమ్ము తీర్చి పోవాలిరా
పాలలో నీల్లలా కల్వాలి - రా రా ఆరోగ్య మార్పు కావాలిరా
ఓర్పుతో తీర్పునే మార్చాలి - రా రా రంజింప చేయ రావాలిరా
మటల విలువ తెలుసుకొని ప్రేమ ఇచ్చి పోవలిరా, ఆరోగ్య మార్పుకొరకు ఒకరికొకరు కల్వాలిర, రంజిల్లుట కోరకు ఓర్పుతో తీర్పు నె మార్చాలిరా
--((*))--
నేటి కవిత
2. నడక
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే,
శ్రీకృష్ణారునసంవాదే, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయఃఅని టివిలో
ఉపన్యాసం వసున్నది, మాధవ్ వింటూ ఉంటాడు
శ్రీకృష్ణారునసంవాదే, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయఃఅని టివిలో
ఉపన్యాసం వసున్నది, మాధవ్ వింటూ ఉంటాడు
ఓ శ్రీమతీ నీకు భగవద్గీత ఎమన్నా అర్ధ మవుతున్నదా, నా బదులు మీరేవింటారు ఎక్కువగా, మీకు అర్ధ మయితే చెప్పండి, అలా నడుచుకుంటూ మాట్లాడు కుంటూ, లోకాభి రామాయణం వింటూ పోదాము, కాస్త ఉండండి చీర కట్టు కొని వస్తా, ఏమిటీ ఇప్పటిదాకా చీరకట్టుకోలేదా, ఏమీ ఇప్పడి దాకా నామోహమే చూడలేదా, ఇక నా వళ్లెం చూస్తారు మీరు, దున్నపోతు నిద్ర మీది, వంటి మీద ఏమి ప్రాకినా మీకు తెలియదు, అన్నీ నేను చూసి చెప్పాలి, అబ్బా ఎందుకే అన్ని మాట లంటావు, ఎదో జోకేద్దా మనుకున్నా అంతే , ఆవునులెండి ఈ మొగవాళ్లందరికి ఆడదానిని చూస్తే జోకు లేసి ఏడి పించాలని బుద్ధి వుంటుంది. అబ్బా ఆందరిని ఎందుకు కలుపు తావు, నేను అడిగిన విషయము చెప్పగా, ఇక నడు తాళాలు వేసి, బయలు దేరుదాం, ఆ అట్లాగే వస్తున్నా, తాళం వేసి తాళం జాగర్తగా పెట్టుకోండి, అసలే మతి మరుపు మీకు అంటూ నవ్వు కుంటూ నడవటం మొదలు పెట్టారు మైదానం వైపు.
మైదానం చేరారు, రెండు వృత్తాలుగా తిరగటం జరిగింది, విశ్రాంతిగా ఒక బల్లపై కూర్చొని ఉన్నారు రాధా మాధవ్, ఆ ఇప్పుడు చెప్పండి భగవద్ గీత అన్నది మాధవ్ తో రాధ.
అమ్మో అది చెప్పటం నావల్ల కాదే, గుర్తున్న కొన్ని విషయాలు చెప్పగలను అంతే, అంతవరకు చాలు మన మేమి స్వామిజీలు, కాము పర్వాలేదు చెప్పండి.
అమ్మో అది చెప్పటం నావల్ల కాదే, గుర్తున్న కొన్ని విషయాలు చెప్పగలను అంతే, అంతవరకు చాలు మన మేమి స్వామిజీలు, కాము పర్వాలేదు చెప్పండి.
1. అగ్ని కట్టెలను ఎలాబూడిదచేయునో, మనిషిలో చేరిన అజ్ఞానము వలన సమస్తము భాధపడుటకు కారణ మగును, వయసు పెరిగిన కొలది జ్ఞానము పెరుగును, ఆ జ్ఞానమును నలుగురికి పంచకపోతే ఉన్న జ్ఞానము బూడిదలో పోసిన పన్నీరగును, జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును.
2. ఈ లోకములో జ్ఞానానికి మించినది ఏదియు లేదు, అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున
పరమాత్ముని యందే స్వయముగ లినమై పోగలడు.
పరమాత్ముని యందే స్వయముగ లినమై పోగలడు.
3. (గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు
పరమ శాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.
పరమ శాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.
4.జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.
5. ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని (బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు.
6. ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, అజ్ఞానమువలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే చేదించివైచి నిష్కామ కర్మయోగము నాచరించుము.
లెమ్ము.
లెమ్ము.
7. ఓ అర్జునా ! మనిషిని తప్పు దోవ పట్టించే వాటిలో మొహం ముఖ్యమైనది. అది లోభానికి దారితీస్తుంది. అహంకారానికి అదే కారణం. దీనివల్ల వివేకం నశిస్తుంది. అటువంటి వక్తి దేనికి పనిరాని వస్తువు క్రింద ఉన్నట్లే అది గమనించు
8.ఓ అర్జునా ! ఖ్యాతి కైనా, అపఖ్యాతి కైనా కారణాలు రెండు. ఒకటి హృదయం రెండవది నాలుక. హృదయ వైశాల్యమే సత్కిర్తికి కారణం. నాలుక దురుసుతనం అపకీర్తికి మూలం. ఈ రెండు మనిషిలో ఉంటాయి. మాట విలువ తెలుసుకొని హృదయం
అర్పించుటలో ఉన్న ముఖము వర్ణించుటలో కాదు.
అర్పించుటలో ఉన్న ముఖము వర్ణించుటలో కాదు.
భగవంతుడు మనకు తెలియపరిచారు జ్ఞాన సంపదవలన అజ్ఞానము తొలగించుకొని కర్మలాచరించమని, ధైర్యముగా చేయవలసిన పని చేయమని మనకు హితబోధగా 4వ
అధ్యాయంలో తెలియపరిచారు, నాకు తెలిసినవి క్లుప్తముగా తెలియపరిచాను రాధా ఈ రోజుకి.
అధ్యాయంలో తెలియపరిచారు, నాకు తెలిసినవి క్లుప్తముగా తెలియపరిచాను రాధా ఈ రోజుకి.
చాలండి ఈరోజుకు మీరు చెప్పింది, మంచి విషయాన్ని రెండ్ మూడు సార్లు వింటేగాని మనసు కెక్కదు, అదే చెడ్డ విషయమైతే వెంటనే మనసును చేరి బాధకు గురిచేస్తున్నది. అందుకే పతి మాట సతికి వేదవాక్కు, భర్తను బట్టే భార్యకు గౌరవము పెరుగుతున్నది. మీరు చాలా మంచి విషయాలు, ఇక ఇంటికి బయలు దేరుదామా, ఇంకా చమట పట్టలేదు, ఇంకా కొద్ది సేపు తిరిగావనుకో దేవుడెరుగు, కాళ్ళ నెప్పుల బామ్ ఉపయోగించాలి, అదికూడా నేనే వ్రాయాలి అవసరమా .. అంతదాకా నేను రానులే, నీవు చెప్పినట్లుగా బయలు దేరుదాం ....
అంత మాట అనకండి, మీరంటే నాకు ప్రాణం, మీ క్షేమమే నా క్షేమము ఏమిటే పొగుడు తున్నావా, తిడుతున్నావా ఏమో నాకర్ధం కావటంలేదు, భగవద్ గీతనే అర్ధం చేసుకున్నవారు నామాటలు అర్ధం చేసుకోలేరా .... ఎందుకు చేసుకోలేను
నీ ఊహలకు ఊపిరి నాది ..., నీ భావాలకు భాండాగారం నాది ..., నీ చిలిపితనానికి చిరునామా నాది ... నీ విరహానికి విహంగం నాది ... నీ ఆర్ద్రతకు ఆలంబన నాది ...నీ వేదనకు వేదిక నాది ... నీ ప్రతి కదలికకు హంస తూలిక నాది ... నీ ప్రతి స్పందనకూ ప్రతిబింభ తోడు నాది ... నీ ఒంటరితనానికి ఓదార్పు నాది ...నీ తుంటరి తనానికి ఆటవిడుపు నా తెలివి ... నీ మొండి తనానికి కారణం నేను - నీ అమాయకత్వానికి తోడు నా ప్రతిభే ... అబ్బా ఏంతో అద్భుతముగా పలికావు, భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు జీవితాంతం ఉండాలి అదేనేను కోరుకునేది ...... అయ్యో నేను కూడా అన్నది అదే అన్యదా భావించవద్దు ... మన ఇద్దరి మధ్య ఎదో ఒకటి అనుకోక పోతే అది సంసారమే కాదు .... అట్లాగా అయితే నన్ను 5 స్టార్ హోటల్ కు తీసికెళ్తావా ... నీవు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకోని వెళ్ళగలను ... ఆమ్మో నన్ను మోస్తూ తీసుకెళ్లొద్దులే . తీసుకెళ్తనన్న మాటేచాలు ....
--((*))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి.కే -1)
1 మానవునికి కోరికలు ఎన్ని ఉంటాయి, అవి ఏవి?
మానవుడుకు ముఖ్యంగా మూడు రకాల కోర్కెలు ఉంటాయి.
అవి.
1.కాంత - అనగా స్త్రీ వ్యామొహం
2.కనకం - బంగారం మీద ఆశ
3.కీర్తి - పదిమంది చేతా పొగిడించుకోవడం
2. త్రివేణి సంగమనగానేమి, ఆ నదుల పేర్లు వ్రాయుము ?
మూడు నదులు ఒక చోట కలవడాన్ని త్రివేణీ సంగమం అంటారు.
ఆ త్రివేణీ సంగమ నదులు ఏవంటే..
1.గంగ
2. యమున
3. సరస్వతి
3. త్రివిధాఅగ్నులను తెలుపుము?
త్రివిధాగ్నులు
1.కామాగ్ని
2. క్రోధాగ్ని
3. క్షుద్రాగ్ని
4. చతుర్విధ పాశములు ఏవి ?
చతుర్విధ పాశములు
1. ఆశా పాశము
2. మోహ పాశము
3. మాయా పాశము
4. కర్మ పాశము
5. చతుర్విధ పురుషార్ధాలు ఏవి
1. ధర్మము
2. అర్ధము
3. కామము
4. మోక్షము
6. చతుర్విధ బలములు ఏవి ?
1. బాహు బలము
2. మనో బలము
3. ధన బలము
4. భందు బలము
7. చతుర్విధ ఆశ్రమాలు ఏవి ?
1.బ్రహ్మచర్యం
2.గార్హస్థ్యము
3.వానప్రస్థము
4.సన్యాసము
8. చతుర్విధొపాయములు ఏవి ?
1. సామము
2. దానము
3. భేధము
4. దండము
9. స్త్రీలలో జాతులు ఎన్ని? అవి ఏవి ?
మన పూర్వీకులు స్త్రీలను నాలుగు జాతులుగా విభజించారు.
1. పద్మినీ జాతి
2. హస్తినీ జాతి
3. శంఖినీ జాతి
4. చిత్తనీ జాతి
10. చతుర్విధ కర్మలు తెలుపుము ?
1. ద్యానము
2. శౌచము
3. భిక్ష
4. ఏకాంతము
ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నవ్వులే నవ్వులు
ఒరేయ్ మానవల్లారా ఏంచేస్తున్నార్రా
గాలికి ఎగిరి వచ్చిన పేపరు చదువుతున్నాము బామ్మ
ఏమున్నాయో చదివి వినిపించు కృష్ణా
ఆశల పల్లకీలో వేదేశ యానం అని చదివాడు
కృష్ణా దాన్ని అర్థమయ్యేటట్లు చెప్పు
"ఉట్టి కెక్కలేనివాడు స్వర్గానికి ఎగబాకాడుటా" అదే కద బామ్మ
రాము నీవు చెప్పు
వర్తమానం లో బాగా చదివి ఆశల పల్లకి చిక్కి సుఖమెరగని వాడు
బాగుగా చెప్పారు ఆశయ సాధనకు, దేశాభివృద్ధికి దోహదపడాలని ఆశతో పోయే ప్రయాణం
అయిన ఒక పాత కత గుర్తుకొస్తున్నది చెప్పమంటారా
చెప్పు బామ్మా చెప్పు
పూర్వం పంటలు పండేవి కావు, గడ్డి పచ్చడి తిని బ్రతికేవారు కొందరు, నీరు దొరికేవి కావు కష్టాలు పడలేక వలసపోయేవారు అంటే ఏమిటి బామ్మా
అదేరా విదేశీ యానాం
"కృష్టుడు అంటే పక్షులు సంచారము చేసి గూటికి వచ్చినట్లుగా బామ్మ"
ఒరేయ్ కృష్ణా కధ చెప్పమంటావా వద్దంటావా
కృష్ణా అని గట్టిగా అరుస్తూ బామ్మా నీవు చెప్పు అన్నాడు రాము
ఒక ఊరిలో బక్క చిక్కిన రైతు పొలాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాడు, ఈరోజు వర్షం పడుతుంది తప్పక పొలం దున్నాలి అనుకున్నాడు నాగలికి భార్యను ఒకవైపు కొడుకు మరోవైపు ఉంచి దున్నటం మొదలు పెట్టాడు.
అప్పుడే దేవతలా చక్రవర్తి ఇంద్రుడు భూలోకానికి వచ్చి పేద రైతు కష్టపడటం చూసి ఓదార్చాలని ప్రత్యక్షమైనాడు
అందరిని కష్టపెట్టుట ఎందుకు ఏదన్నా వరము కోరుకో ఇస్తాను అన్నాడు. చూడండి మీరెవరో నాకు తెలియదు మీ వరము నాకవసరము లేదు, ఈరోజు రాత్రికి వర్షము పడుతుంది అందుకే దున్నుతున్నాను.
అప్పుడు నేను దేవరాజును ఇంద్రుణ్ణి నామాట కాదని వరము కోరుకోమన్న వద్దని కష్టపడుతావా అన్నాడు.
నా నమ్మకాన్ని వమ్ము చేయకండి, మా ఓర్పును పరీక్షించకండి దయచేసి, మా సమయాన్ని వ్యర్ధము చేయటం మీకు సమంజసము కాదు అన్నాడు వినయంగా రైతు.
"బామ్మ అప్పుడు ఇంద్రునికి కోపం వచ్చి ఉంటుంది కదా అన్నాడు కృష్ణా "
రాము కలగ చేసుకుంటూ ఇంద్రుడు ఎదో యుక్తి పన్ని ఉంటాడు కదా బామ్మా
చక్కగా చెప్పావు మనవడా
ఇంద్రుని కోపం వచ్చి వర్షము కురవకుండా చేయాలనీ తలంపుతో దేవతలను పిలిచాడు. అందులో వరుణుడిని పిలిచి అక్కడ వర్షము పడకూడదు అన్నాడు " వరుణుడు మీ మాట కాదనను కానీ చల్లని గాలి వీస్తే నేనేమి చేయలేను" అన్నాడు. వెంటనే పవణుని పిలిచి "అక్కడ చల్లని గాలి వీచ కూడదు అన్నాడు" పవణుడు మీ మాట కాదనను కానీ అక్కడ "కప్పలు అరిస్తేమాత్రం నేనేమి చేయలేను " అన్నాడు. కప్పల నాయకున్ని పిలిచి అరవకుండా జాగర్త పడమన్నాడు. కప్పల రాజు మీ మాట కాదనను కానీ మిణుగురు పురుగులు మినుకు మిణుకుమని కనిపిస్తే మాత్రం మేము ఏమి చెయ్యలేం " అన్నాడు. ఇంద్రుడు మిణుగురు పురుగులను పిలిచి బయఁటకు రావద్దని శాసించాడు. అవి మేము ఈరాత్రికి బయటకు రాము అని చెప్పాయి. ఇంద్రుడు ఎలా వర్షం కురుస్తుందో చూస్తానన్నాడు.
ఆరోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం కుండ పోతగా కురిసింది.
బామ్మా వర్షం ఎలా పడింది అని అడిగాడు కృష్ణా
రాము ఎలా పడిందో నీవు చెప్పగలవా
"అహం కారము ఉన్నచోట ఎదో తప్పు జరుగుతుంది, ఒకరి నమ్మకాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు వాడే నాశనమైపోతాడు "
వెంటనే కృష్ణుడు "రావణుడి లాగానా "
బామ్మా అసలు కధ నీవు చప్పు
అప్పడు ఇంద్రునికి కోపం వచ్చి దేవతలను అడిగాడు, వరుణుడు చల్లగాలి వీచింది అని చెప్పాడు, వాయుదేవుడు కుప్పలు అరవటం వల్లనే వీచాను అన్నాడు, కప్పలరాజు మిణుగురు పురుగులు మెరవటం వల్లనే అరిచాను అన్నాడు, మిణుగురు పురుగులు అస్సలు మేము బయటకు రాలేదని అన్నాయి. ఇంద్రునికి ఎంత ఆలోచించిన అంతు చిక్కలేదు.
అప్పడే నారదుడు వచ్చి ఒక్కసారి స్థిమితంగా ఆలోచించండి అన్నాడు. అంతా తెలుసుకున్నాడు
బామ్మ ఏమి తెలుసుకున్నాడు ఎలా వర్షం పడింది చెప్పు అన్నాడు కృష్ణ
రైతు రాత్రి కదా అని కాగడాలతో పొలం దున్నటం మొదలు పెట్టాడు, కాగడా వెలుగులే మిణుగురు పురుగుల్ని భ్రమించి కప్పలు అరిచాయి. అంతే
అవునా బామ్మ అవునా అని ఒకటే నవ్వు
ఎందుకురా ఆ నవ్వూ, మోసం చేయాలనుకున్నవానికి బుద్ధి బాగా చెప్పావు బామ్మ అందుకనే నవ్వు
అప్పుడే రాము "నమ్మకంతో ప్రయత్నం చేసినవారు ఎన్నడూ నష్టపోరు, ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది "
అక్షరాలా నీవు చెప్పింది నిజం రాము అన్నది బామ్మ
అప్పడే కృష్ణుడు బామ్మా నేను చేదువుకొని విదేశాలకు పోను, ఇక్కడే కష్టపడే దేశానికి సహకరిస్తా అన్నాడు అందరూ ఒకటే నవ్వులు, నవ్వులే నవ్వులు
ఓం శ్రీ రాం
ReplyDelete