Monday, 15 May 2017

*mallapragada ramakrishna Telugu stories-47

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

సంసారంలో సరిగమలు 

ఒకే సంస్థ లో పనిచేస్తూ ప్రక్క ప్రక్క సీటులలో ఉండి ఉద్యోగము చేసే నవయవ్వనం తో ఉన్న వనితా శిరోమణి శిరీషా, రంగు తక్కువైనా ఆరడుగుల బలాఢ్యుడు, తనకన్నా అధిక జీతము తీసుకుంటున్న సాటి ఉద్యోగి ప్రభాస్. వారిరువురి మధ్య  ప్రేమ చిగురించి పెద్దలు వద్దన్నా ప్రమే ముఖ్యమని భావించి ఒకరికొకరు తోడుగా, పనులు చేసుకుంటూ ఉద్యోగము ఒక వైపు సంసారము మరోవైపు, ఆశలతో ఆశయాలుతో ముందుకుపోతున్నారు.         

ఇద్దరు పిల్లలు పుట్టారు, చిన్న పిల్లలగుట వల్లా. వారిని కంటికి రెప్పలాగా కాపాడు కొనుటకు ఒకరితర్వాత ఒకరు సెలవులు పెట్టుకుంటూ పెంచసాగారు. ఎందు కైనా మంచిదని ఒక అయాను కూడా పెట్టుకున్నారు, నమ్మకస్తురాలుగా పనిచేయుట వల్ల పిల్లలను ఆమెకు అప్పగించి  ఉద్యోగమునకు పోవుట మొదలు పెట్టారు.      

పిల్లల జాగర్త తగ్గింది, ఆయాకు ఇచ్చే ఖర్చు పెరిగింది, పిల్లలు ఎప్పుడు అనా  రోగ్యముతో ఉండుట  జరిగింది, పిల్లల పెంపకము, జాగర్తలు ఆయాకు భారమైనది, బొమ్మలు ఇచ్చిన పిల్లలను కొట్టడం తిట్టడం జరుగుతుంది.

శిరీషా, ప్రభాస్ అఫీసుకు పోయాక పిల్లలను నిద్రపుచ్చింది, ఇంట్లో ఉన్న డీవీడీ ప్లేయర్, కొంత డబ్బుతో పారి పోయింది.

నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహము చేసి పోతున్నాను అని ఉత్తరం వ్రాసి పోయింది, పొలీస్ రిపోర్టు ఇచ్చిన ఫలితం లేకుండా పోయినది.

పిల్లలు మత్తుగా పడుకోవటం వళ్ళ అనుమానం పెరిగింది, ఆయా పిల్లలు ఏడుపు మానుటకు మత్తు మాత్రలు వేయుట జరిగింది అని డాక్టర చెప్పింది. డాక్టర్ పిల్లల తల్లి తండ్రులను పిలిచి పిల్లల రక్షణ పెరగాలంది, పిల్లలకోసం శిరీషా తన ఉద్యగం మానేస్తానని గెట్టిగా చెప్పింది

భర్త తో నెమ్మదిగా ఉద్యోగానికి సెలవు పెట్టి,  పిల్లలకోసం, పిల్లల భవిషత్,ఆరోగ్యం నాకు ఆలనా పాలన ముఖ్యం, డబ్బు  ఉన్నంత మాత్రాన పిల్లలకు తెప్పియలేము సంతోషం, అన్నది శిరీషా
వేలకు పాలు పండ్లు పెట్టి పాటలుపాడి నిద్రపుచ్చుటే ముఖ్యం, పిల్లల ఆరోగ్యమే నాకు ముఖ్యం. 

రెండు రోజులు తర్వాత క్యాంపు నుండి వచ్చాడు, పిల్లలు సరదాగా ఆడుకోవటం చూసి ముచ్చటపడ్డాడు ప్రభాస్, వారిని ఎత్తుకొని సరదాగా తిప్పి ఆడించాడు, పిల్లల సంతోషము చూసి  కలిగెను ఉత్యాహం

శిరీషా పిల్లల నెపంతో నీవు ఉద్యోగం మానుట నాకు ఇష్టం లేదు, నాఒక్క జీతము ఇంటి ఖర్చుకు, పిల్లల పోషణకు సరిపోదు, పిల్లల కోర్కలు నీ కోర్కలు తూర్చుట నా వళ్ళ కాదు, మరోమార్గం చూసి, నీవు ఉద్యోగం చేయుట తప్పదు.అన్నాడు ప్రభాస్.  

పిల్లలు పెరుగుతున్నారు, ఇంటి అద్దె కూడా పెంచుతున్నారు, గ్యాసు, పెట్రోలు, లక్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు పెంచారు, మందులు, పాలడబ్బాలు, పాలు పండ్లు అన్ని పెంచారు, ఖర్చులు దృష్టిలో పెట్టుకొని నీవు మరలా ఉద్యోగంలో చేరు మొగుడి సతాయింపు పెరిగింది.

మానసిక వత్తిడికి ఇద్దరూ లోనవుతున్నారు, పిల్లలనుసరిగా చూడ లేక పోతున్నారు, చితికి మాటికీ కోపాలు పెరుగుతున్నాయి, ఇద్దరి మధ్య పిల్లలు నలిగి పోతున్నారు, పిల్లల రక్షణ కోసమైనా వెంటనే సుభాష్ శిరీషతో మీ అమ్మా నాన్నను ఇక్కడ వచ్చి ఉండమని చెప్పు అన్నాడు. ఏమని చెప్పేదండి మనం వాళ్ళను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాము అన్నది. అయితే ఒక పని చేద్దాం నేను మా అమ్మ నాన్నను పిలుస్తునాను, నీవు మీవాళ్ళను పిలువు అన్నాడు. 

ఇద్దరు ఒకేసారి వస్తే నీకు భారం అగుతుం దండి, ఏది ఏమైనా పిల్లల పోషణ మనకు ముఖ్యం, వాళ్లొస్తే నీవు ఉద్యోగము చేయ వచ్చు అన్నాడు. 

అప్పుడే టెలిగ్రామ్ అంటూ ఒక లెటర్ వచ్చింది. లెటర్ విప్పి గబా గబా చదివాడు సుభాష్ 
ఏముందండి దానిలో మాఅమ్మకు ఆరోగ్యం బాగా లేదుట వెంటనే రమ్మనమని పిలుపు అన్నాడు. 
పోదాం పదండి

సరే ఏ.టి.ఎం లో డబ్బులు డ్రా చేయండి ఎందుకైనా మంచిది అన్నది. 

ఆఫీసుకు సెలవు పెట్టి, మరి తీసుకొస్తా , అక్కడ ఎలాఉన్నాదో ఏమి తెలియటలేదు, అన్నాడు
ఎలా ఉన్న తప్పదండి కొడుకుగా మీకర్తవ్యం అది, వాళ్ళు  నన్ను ఏది అన్నా కోపం తెచ్చుకోకండి అన్నది. 
ఇంటికి చేరారు ఇద్దరూ అక్కడ అంటా ప్రాశాంతముగా ఉన్నది, నాన్న అని పిలవగా లోపలనుండి వస్తూ లోపలకు రండి అన్నాడు ముభావంగా. 

నాన్న అమ్మకు అని గొణిగాడు సుభాష్ 

అవునురా అదిగో ఆగదిలో ఉన్నది పక్ష వాతం వచ్చింది,  ఆగదిలో మంచం మీద పడుకొని ఉన్నది. 

ఎవరు ఎవరూ  అని పిలుపుకు అమ్మా నేనమ్మా నీబిడ్డను, ఇన్నాళ్లకు గుర్తొచ్చామా మేము అన్నది. 
అసలు మిమ్మల్ని మర్చి పోతే కదమ్మా, మా పిల్లలకు ఒకరికి తాతయ్య పేరు, మరొకరికి అమ్మొమ్మ ఎంపెరు పెట్టుకున్నాము మంచిది. 

అమ్మాయి పిల్లలు వచ్ఛారురా,  వచ్చారు 
అప్పుడే అత్తయ్యగారు అనగా మంచం మీద కూర్చోబెట్టుకొని, పిల్లలను చూసి సంతోష పడింది. 
చూడమ్మా నన్ను దేవుడు పిలుస్తున్నాడు, ఇంకా భూమి నూకలు ఉండటంవల్ల ఇలా బ్రతుకుతున్నాను, అందరికి భారంగా మారు తున్నాను అని కాళ్ళ వెంబడి నీళ్లతో పలకరించింది. 
మీరు ఏమి భయపడకండి మేము వచ్చాముగా ఇక్కడ ఉంటాము లేండి అన్నది. 
మీరు ఉద్యోగాలు మానుకొని ఎన్ని రోజులు ఉండగలుగుతారు,  ఇక్కడ పిల్లలతో 
బాబు నీవు అమ్మాయి పిల్లలూ ఈరోజు ఉండి రేపు వెళ్ళండి అన్నది. 
నాన్న అమ్మ అట్లా అంటున్నదేమిటి నాన్న
అవునురా తల్లికి కొడుకు దగ్గర ఉండాలని ఉంటుంది, నీవు అక్కడ నుండి ఇక్కడ వచ్చి ఉండలేవు 
మేము ఇక్కడనుండి అక్కడకొచ్చే పరిస్థితిలో లేము మరి ఇంత కన్నా ఏమి చెప్పగలము అన్నాడు తండ్రి

ఆమాటలకు సుభాష్ ను ప్రక్కకు పిలిచి మీరు ఆ ప్రవేటు ఉద్యోగము మాని ఇక్కడ ఉద్యోగము సంపాదించు కోండి, అత్తయ్యగారికి ఎటుతిరిగి పని మనిషి ఉన్నది, నేను ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటాను, అత్తయ్య గారి ఆరోగ్యము బాగుపడేదాకా ఉండక తప్పదండి. 

నాన్న అంటూ సుభాష్ మేము ఒక నిర్ణయానికి వచ్చాము, నేను ఇక్కడ ఏదన్న ఉద్యోగమూ సంపాదించుకుంటా మీకు తోడుగా ఇక్కడే ఉంటా అన్నాడు 

ఆమాటలకు తల్లి తండ్రుల కళ్ళ యందు వెలుగు చూసాడు సుభాష్ . 

ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది శిరీషా 
మన మొకటను కుంటే దేముడు మరొకటి చేస్తాడు, అందుకే విధి వైపరిత్యానికి అందరూ బాద్యులే 
               

No comments:

Post a Comment