ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
రవీంద్రనాధ్ ఠాగూర్
రవీంద్రనాధ్ ఠాగూర్
విశ్వకవి అనే వాక్యాన్ని ఘనమైన ఆ నేపథ్యంలోంచి గ్రహించాల్సి ఉంది. ఎక్కడ
మనసు నిర్భయంగా ఉంటుందో ... ఎక్కడ మానవుడు సగర్వంగా
తలెత్తుకు తీరుతాడో...అగాధమైన సత్యంలొంచే ఉబికివచ్చే మాటలు ఎక్కడ
వినబడతాయో.. ఓ తండ్రి అటువాని స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలొకలుపు
అంటూ ప్రార్ధన చేయాలన్న ఊహసాధారణ కవులకు తోచేది కాదు. ఇది ఋషుల ఆలోచనా
సరళి. ఆ పరంపరకు చెందినవారు.
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో...
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకు తిరుగుతాడో...
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో..
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకు గోడల మధ్య మగ్గిపోదో..
... ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేల్కొనేటట్టు అనుగ్రహించు తండ్రీ...
గీతాంజలి అనే గొప్ప కావ్యం లో రవీంద్రనాథ్ టాగోర్ రాసినవీ వాక్యాలు.. భారత దేశానికి జాతీయగీతమైన 'జనగణమణ'ని ఇచ్చిన రవీంద్రనాథ్ టాగోర్ పుట్టిన రోజు ఈరోజు అంటే మే 7వ తేదీ 1861. రవీంద్రుడిగా అందరికీ తెలిసిన ఈయన రాసిన గీతాంజలికి 1913 లో నోబెల్ బహుమతి లభించింది. ఆసియాలో మొదటగా సాహిత్యంలో నోబెల్ రవీంద్రుడికే దక్కింది. మొదట బెంగాలీలో దీన్ని రాసి తర్వాత ఇంగ్లీషులోకి అనువదించాడాయన. దీన్ని తెలుగులోకి చలంతో సహా మరి కొందరు అనువదించారు..
జాతీయ గీతమైన జనగణమణ టాగోర్ రాసినదే. నిజానికి దీన్ని ఆయన బ్రిటిష్ రాజు జార్జికి స్వాగతం పలికేందుకు రాశారంటూ వివాదం ఉంది కానీ దాన్ని ఆయన అంగీకరించలేదు. రవీంద్రుడికి 1915 లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదిచ్చింది.. కానీ రెండేళ్ల తర్వాత జలియన్ వాలా బాగ్ లో భారతీయుల్ని బ్రిటిష్ సైన్యం ఊచకోత కోసినందుకు నిరసనగా ఆయన దాన్ని వెనక్కిచ్చేశారు..
భారతీయ ఆత్మ నిరంతరం మనుషుల మధ్య ఐక్యతను ప్రతి పాదిస్తునే ఉంది అని ఆయన గుర్తించారు. దాన్ని ప్రకటించారు . 1921 లో విశిష్ట నోబెల్ పురస్కారాన్ని స్వీకరిస్తూ రవీంద్రుడు నేని గొప్ప కాలానికి చెంది, ఈ గొప్ప యుగంలో జీవిస్తున్నందుకు నాతో సంతోషింస్తున్నారు.
రవీంద్రుడి రచనల్లో అతి ముఖ్యమైంది గీతాంజలి అయినా ఇంకా ఆయన గీతాలు
రవీంద్ర సంగీత్ పేరుతో బెంగాల్లో చాలా ప్రసిద్ధికెక్కాయి. టాగోర్ నాటకాలూ..
కథలూ.. నవలలూ కూడా రాశారు.. ఛోకేర్ బాలీ, The post office (డాక్ ఘర్),
Sadhana, Shishir kavita, My boyhood days, Gora, The Post master, My
reminiscences, Kabuliwala, Chaturanga... ఇలా ఎన్నో.. వీటిలో కొన్ని,
అంటే.. గోరా, The post office, కాబూలీవాలా లాంటివాటిని... మనం స్కూలు,
కాలేజీల్లో non detailed గా చదువుకున్నాం.
ఆయన రచనల్లో చరణదాసి.. చారులత.. ఛోకేర్ బాలీ.. చతురంగ.. Ghare Baire... ఇంకా కొన్నింటిని సత్యజిత్ రే... రితుపర్ణ ఘోష్ లు సినిమాలుగా తీశారు.
రవీంద్రుడు కేవలం కవీ రచయితా మాత్రమే కాదు.. మంచి సంగీతకారుడూ.. చిత్రకారుడూ కూడా.. అన్ని కళలూ తెలిసినందువల్లే ఆయన కేవలం కళలు మాత్రమే నేర్పించే శాంతినికేతన్ ని స్థాపించారు..గురుదేవుడిగా పేరు గడించారు.. కలకత్తా దగ్గర్లోని ఇది విశ్వభారతి పేరుతో గొప్ప కళావిద్యాలయంగా ప్రపంచమంతా పేరు పొందింది.. ఇప్పుడు ఆ విలువలూ.. ఆ స్థాయీ లేకపోయినా అది రవీంద్రుడికి గుర్తుగా కొనసాగుతూనే ఉంది. టాగోర్ 1941 ఆగస్టు 7 న మరణించారు.. నువ్వు లేవు.. నీ పాట ఉంది.. అన్న రీతిలో అడుగడుగునా గుర్తొస్తూనే ఉంటారు..
No comments:
Post a Comment