ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
సంసారంలో సరిగమలు -6
పుల్లారావు గారు బాగున్నారా
ఎవరా అని వెనక్కి తిరిగి చూసాడు పుల్లారావు
భీమారావు గారిని చూసి గాలికి ఎగిరి పోయే పుల్ల లాగా పరిగెత్తాడు.
భీమారావు ఏమన్నా తక్కువ, రోడ్డు రోలర్ జారినట్టు జారుతూ గట్టిగ పట్టు కున్నాడు.
ఎందుకు అపరిగెత్తావ్ నిన్ను చూస్తే నాలో ఒకటే టెన్షన్, పిండిని నలిపినట్లు నలుపుతావని భయం, గధ తిప్పినట్లు తిప్పుతావని భయం.
మనమిద్దరం
స్నేహితులం, డబ్బుకోసం కష్టపడ్డ రోజులున్నాయి, ఆనందం అనుభవించిన
రోజులున్నాయి. ఏది అయతే ఒకరినొకరు విడిపోయి మోసకారి చిక్కి మోసపోయాం.
మనిద్దరం
కలసి మరల బిజినెస్ చేద్దాం, మనల్ని నమ్ము కున్న వారిని బ్రతికిద్దాం
అన్నాడు పుల్లారావు, పుల్ల లాగా సన్నగా ఉంటాడు, సరే అన్నాడు భీమారావు మనిషి
భీముడి లాగేనే ఉంటాడు.
ఆటలాడుతూ అన్నాన్ని మరిచాము, కుళాయి నిల్లు త్రాగి బ్రతికాము,
ఇప్పుడు మినరల్ వాటర్ వ్యాపారం, కొబ్బరి బొండాల వ్యాపారం కలసి చేద్దాం అంటూ చేయి చేయి కలిపారు.
టివి
అనేది తెలియని సమయంలో రేడియోనే గొప్పగా చెప్పుకొని విన్నాము, కానీ ఇప్పుడు
వందల సంఖ్యలో చానల్స్ వస్తున్నాయి, ఎవరు ఏ ఛానల్ చూస్తారో ఎవరికీ తెలుసు, కానీ లేని ఇల్లు లేదు కనుక మనం కలసి కేబుల్ కనెక్షన్ ఇస్తూ కొంత సంపాయిద్దాం అంటూ చేయి చేయి కలిపారు.
ఎర్ర
ని ఎండ సైతం లక్క చేయ కుండా తిరిగే వాళ్ళం, ఇప్పుడు కొద్ది ఎండకే తట్టు
కోలేక కూల్ డ్రింక్స్ త్రాగేవారు పెరిగారు, కనుక మనమే చల్లఁటి కుండల్లో
చల్లటి మజ్జిగ, నిమ్మకాయ నీరు, సుఘందాల నీరు తయారు చేసి తక్కువ రేటు
కిద్దాం అంటూ చేయి చేయి కలిపారు.
మన మిద్దరం
కలసి పేరున్న అభిమాన నటులు సంఘాలను ఏర్పరుద్దాం, నెంబర్లను చేర్చుదాం,
సినిమా హాలు వారితో మాట్లాడు కుందాం, ఇంటర్ నెట్ ద్వారా సినిమా టిక్కట్లు
మనమే బుక్ చేద్దాం కొత్త సినిమాకు టిక్కట్లు ఇంటికి వచ్చి ఇస్తామని
చెప్పుదాం, నెలవారీ నెంబర్ షిప్ వసూల్ చేద్దాం, రోజు వచ్చే తెలుగు పేపర్లు,
సినిమా పేపర్లు ఏర్పాటు చేసి, ఇండోర్ గేమ్ సంబంధించినవి ఉంచితే సభ్యుల
సంఖ్య బాగా పరుగునట్లు చేయాలంటూ చేయి చేయి కలిపారు.
మన
మిద్దరం పంచ కట్టుకొని ఆలయము దగ్గరకు పోయి ఆక్కడ పేరున్న పూజారుల
అడ్రస్సులు తీసుకోని వారి ఇంటికి పోయి, మేము కొత్తగా " మీ అవసరానికి
పూజారులు దొరుకును వెంటనే సంప్రదించండి" అని ప్రకటన ఇస్తాము, మేము మీరు
తీసుకొనే అమౌంట్ పూజల నిమిత్తం ఏంతో ముందుగా మాకు చెప్పండి, మీకు ఖాళి
ఉన్న రూజు మాకు తెలపండి, పూజలు మీరే చేస్తారు, మేము కేవలం మీకు వచ్చే
దానిలో కమిషన్ మాత్రమే తీసుకుంటా మని కొందరి బ్రాహ్మణుల సహకారంతో పూజా
కార్యక్రమములు నిర్వహిస్తామంటూ చేయి చేయి కలిపారు.
ఎర్ర
బస్సుల్లో కిటికీ దగ్గర కూర్చొని తిరిగిన వాళ్ళం, ఇప్పుడు ఆ ఎర్రబస్సు
ఎక్కడుందో తెలియదు, ఇంద్ర, గరుడ, ఐరావతం, అలా ఏసీ బస్సులు వచ్చాయి, అప్పడు
ఒక్క రోజులో పోయే ప్రయాణాన్నీ ఇప్పుడు కేవలము రోడ్లు బాగా ఉండుట వళ్ళ
వేగముగా పోయాయి ఎక్కువ సమయంలో చేరుస్తున్నాయి. అందుకని మనం హైవే రోడ్డు మీద
కాబా హోటల్ పెట్టి భోజనం మరియు ఫలహారశాల పెట్టి, భోజనం చేసిన వారికీ
కిల్లి ఫ్రీ, ఫలహారం చేసిన వారికి కాఫీ టి ఫ్రీ అని చెప్పి బస్సులు ఆపమనిచెప్పి వ్యాపారం చేయాలంటూ చేయి చేయి కలిపారు.
ఒకనాడు డాక్టర్ చదువంటే
చాలా కష్టమను కొనేవారు, కానీ ఇప్పుడు ఎక్కువమంది చదువుతున్నారు, వీధికొక
డాక్టర బోర్డు పెట్టుకొని బతుకుతున్నారు. అందుకని మనం ఒక వ్యాన్
కొనుక్కొని, కొన్ని గ్రామాలు ముందుగా నిర్ధారించుకొని అక్కడకు పోయి ఉచిత్ వైద్య పరీక్షలు అని గ్రామాలలో తెలియ పరిచి ముందుగా రోజూ కొందరి డాక్టర్లను మనమే వారి పేర్లను తెలిపి, అనారోగ్యలను తగు విధముగా పరిక్ష చేయించి నప్పుడు వైద్యుడు
రోగమునకు తగ్గ మందులను కూడా మనమే తీసుకోని వెళ్లి, అక్కడ ఉన్న రోగాలను
తగ్గించుట కు వాళ్ళు ఇచ్చే కొద్ది పైకముతోనే డాక్టర్లకు ఇచ్చి కొంత మనం
తీసుకోని ప్రజాసేవ చేయాలంటూ చేయి చేయి కలిపారు.
ఇప్పుడు
ఎక్కడ చూసిన ఎత్తైన భవనాలు భవనాల వద్ద ఉన్న వాచ్ మన్ లను, ఆభవనాలా ఓనర్లను
మంచి చేసుకొని క్రింద ఉన్న కారు పార్కింగ్ లో పెట్టె ఇస్త్రీ చేసి ఇవ్వ
బడును అప్పటి కప్పుడే , మీరు చూస్తున్నంత సేపులోనే బట్టలను ఇస్రి చేసి
ఇస్తాము భవనంలో ఉన్న వారి కందదరికి చెప్పి, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మనమే
ఒక బల్లలు ఏర్పటు చేసుకొని రెండు ఇస్త్రీ పెట్టెలు (1టి కరెంటు రెండు
బొగ్గులు ) పెట్టుకొని బ్రతకాలంటూ చేయి చేయి కలిపారు .
ఇప్పుడు డబ్బున్నవారు భవనాల నుంచి క్రిందకు కూడా దిగ కుండా సెల్ ద్వారా వారి కావలసినవి వెంటనే బుక్ చేసుకొని తెప్పించుకొనే పద్దతి వచ్చింది కనుక మనమే భవనంలో ఉన్న ప్రతి ఇంటికి పోయి మీకు కావలసి ఆహారధాన్యాలు , నిత్యావసర వస్తువులు తెస్తాము మేము అని చెప్పి వారికి కావలసినవి వ్రాసుకొని మనమే సూపర్ మార్కెట్కు వెళ్లి వాళ్ళను బ్రతిమలాడుకొని ఉచితముగా నమ్మకముగా ముందుగా తెచ్చి ఇచ్చి వారు ఇచ్చిన పైకము సూపర్ మార్కెట్లో కట్టి ఇంటివారు ఇచ్చే టిప్పు, షాప్ యజమాని ఇచ్చే పైకముతో బ్రతకాలంటూ
చేయి చేయి కలిపారు.
ఏమిటిరా చేయి చేయి పట్టుకొని పొద్దెక్కినా కూడా ఇంకా నిద్ర లేవలేదు, ఈ గేదలను కడిగి, మేత వేసి పాలు పిండి బయటకు
పోయి అమ్మేదెవరు ఈరోజు మీఇద్దరిలో, కబెళాకు మేకలను కోళ్లను తీసుకెళ్లి
మాంసం తెచ్చెదెవరు అంటూ గట్టిగా అరిచింది వీరు పనిచేసే ఇంటి యజమాని.
ఇద్దరు ముక్త ఖంఠముగా మేమిద్దరం ఏకమయ్యాం, మీదగ్గర పనిచెయ్యం, అంటూ చేతులు దులుపుతూ అన్నారు.
అప్పుడే నగరానికి లారీ పోతున్నది కూలీలు కావాలిట అన్న పిలుపు విన్నారు ఇద్దరూ .
ప్రపంచ జ్ఞానాన్ని మేమిద్దరం పొందాలనుకున్నాం చేయి చేయి కలిపాం, మమ్ము ఆశీర్వదించండి అని యజ మానికి దండం పెట్టారు.
అనాలోచనముగా తధాస్తు అన్నది.
అంతే ఒక్క పరుగున చేయి చేయి కలిపి పగటికలలు నెరవేర్చుకొనుటకు ఎక్కారు లారీ.
No comments:
Post a Comment