ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
నిరుద్యోగి ప్రయాణం -6
మాధవ్
ట్యాన్క్ బండ్ మీద ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం చూస్తున్నాడు, అప్పడు
రెడ్డుమీద ముగ్గురు (ఒక యువకుడు ఇద్దరు యువతులు) ఎక్కిన బైక్ ఒక్కసారిగా
స్లిపై క్రిందకు పడ్డారు, దెబ్బలు బాగా తగిలినాయి.ఆ పక్కనే ఉన్న మాధవ్ నేను
మీకేమన్నా సహాయం చేయాలా అని అడిగాడు, నీవొక పల్లెటూరు మొద్దులాగున్నావు
మాకేం సహాయం చేస్తావు అన్నారు.
అప్పుడే అక్కడకు పోలీస్
వచ్చి ఇక్కడేం జరిగింది యాక్సిడెంట్ ఎక్కడా అన్నాడు, అక్కడ ఉన్నవారు ఏమి
మాట్లాడలేదు, అప్పుడే పోలీస్ తో వీళ్ళు చాలా స్పీడు రావటం వళ్ల ఇక్కడ
పడ్డారు.
సరే సరే ఇక్కడనుంచి కదలండి అన్నాడు, వెంటనే వెళ్లి పోయారు పడ్డవారు.
ఏమిటి మీరు కనీసం ఆవిద్యార్థులను హెచ్చరించకుండా వదిలేశారు.
ఎంబాబు
నీవు నగరానికి కొత్తలాగున్నావు, ఇప్పుడు నేనువాళ్ళమీద ఏదన్న కేసు
వ్రాసాననుకో నేను రెజువెళ్లే స్టేషన్కు పోనక్కరలేదు, వాల్లెవరనుకుంటావు
నగరంలో ఉన్న ధనవంతులు మరియు నాయకుల బిడ్డలు అన్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళ
బాగాపెరిగారు, వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి, పూర్వం వంటింటి కుందేలు
అనేవారు, ఇప్పుడు పెళ్ళికి ముందే అనేక షరతులు పెట్టి మరి పెళ్ళికి
ఒప్పుకుంటున్నారు. ఇప్పుదు ఆడదాన్ని పెళ్లి సెహెసుకోవాలంటే మొగవాడు భయపడే
పరిస్థితి వచ్చింది. ఇది కలియుగ మాయ
నీవుకూడా
ఇక్కడనుండి బయలుదేరు, వాళ్ళు క్రింద పడ్డ నీవు చూసావు, వాళ్ళు అవమానంగా
భావించి నీమీద కేసు పెట్టారనుకో నిన్ను బందిఖానాలో పెట్టాల్సి వుంటుంది.
ఏమిటి ధర్మం ఇంత దిగజారిపోయినదా,
బాబు పెద్ద పెద్ద మాటలు పలుకుతున్నావు, మాడ్యూటీ మెం చేసుకో నివ్వు అంటూ లాటి తిప్పాడు.
పోలీస్ తో ఘర్షణపడుట ఎందుకు అని నేను వెళుతున్నాను, అని కదిలి ప్రక్కనే ఉన్న లుంబినీ పార్కు చేరాడు మాధవ్ .
అక్కడ పచ్చని గడ్డిపై నడుం వాల్చాడు అప్పడే కలలోకి చేరాడు.
పెళ్లి చూపులకు మాధవ్ వచ్చాడు. తల్లి తండ్రులతో బయలు దేరాడు.
అక్కడవారు
మాధవ్ ను చూసి రూపు రంగు ఎత్తు బాగున్నారు, కాని అమ్మాయి కన్న రంగు
తక్కువే అబ్బాయి వయసు కొద్దిగా ఎక్కువని పించింది అని గుస గుస లాడారు.
పెళ్లి చేసుకొనే అమ్మాయి, పెళ్లి చేసుకొనే అబ్బాయితో ప్రశ్నలు వేస్తానని మొగపెళ్ళివారిని అడిగింది.
దాని
దే వుంది మీరిద్దరూ అభిప్రాయాలు ఒకటవ్వాలి పెళ్లి అవ్వాలి , మొఖమాట,పడ
కుండా నీ అభిప్రాయాలు అడుగు, ఒరేయ్ మాధవ్ నీవు కూడా ప్రశ్నలు అడుగు
అన్నారు .
రాధ పెల్లి కొడుకుతో పరసనల్ గా మాట్లాడింది. (మాటలు ఈ విధముగా సాగినాయి)
రాధా: పెళ్లి ఆయిన తర్వాత మనం చేయ వలసిన పనేమిటి ?
మాధవ్ : హనీమూన్ వెళ్ళటం, కాపురం చేయటం.
రాధ : పెళ్లి అయిన తర్వాత నేను ఉద్యోగము చేయాలా, నేను స్వతంత్ర భావంతో ఉండాలా, ? .
మాధవ్ : ఉద్యోగమా నీఇష్టం, పూర్తి స్వతంత్రం నీకు ఇస్తాను, నీకు స్వేశ్చ కల్పిస్తాను .
రాధ: : పెళ్లి అయిన తర్వాత మానాన్న అమ్మను నా దగ్గరకు తెచ్చుకుంటాను మీకెమైనా అభ్యంతరమా?
మాధవ్ : పెద్దలందరూ నాకు పూడ్యులు మీపెద్దలను తెచ్చుకుంటే నాకు అభ్యంతరం లేదు.
రాధ : ఇతర దేశాలకు పొవాలని ఉన్నదా ?
మదఃవ్ : ఇంత చదువు చదివి ఇతర దేశాలకు పోయి సంపాదించాలని లేదు, దేశాభివృద్ధికి సహకరించాలని ఉన్నది.
రాధ: ఇంతకీ నేను నచ్చానా
మాధవ్ : నేను నీకు నచ్చానో లేదో చప్పు .
రాధ: మీరు నాకు నచ్చారు
మాధవ్ : ఎలా సెహెప్పగలిగావు, నాకు ఉద్యోగము లేదు, నాకు ఉదోగాము ఉన్నది.
రాధ : మీరు ఉద్యోగము చేయకపోయినా పర్వాలేదు, ఇంటిపట్టు నుంటే చాలు
మాధవ్ : పిల్లలు కావాలా వద్దా
రాధ : శృంగార సాహిత్యాన్ని అనుభవించాలి మనం, మనం కోట సృష్టికి కారకులవ్వాలి
మాధవ్ : పిల్లలు కావాలా వద్దా
రాధ : పిల్లలను కనేది నేను, పెంచేది నీవు.
మాధవ్ : ప్రశ్నలైనాయ ఇంకా ఉన్నాయా.
రాధ : ఇక లేవు, మీరు నాకు నచ్చారు అంటూ ఓరచూపు చూసి, దగ్గరకు చేరి బుగ్గన ముద్దు ఇచ్చి మరి వెళ్ళింది రాధ
రాధా తల్లి తండ్రులు మా అమ్మాయి మీకు నచ్చితే ఇంటికి వెళ్లి అలోచించి చెప్పండి ఈ రోజే చెప్పాలి సుమా అన్నారు.
నాన్న అమ్మాయి బాగా చదువు కున్నది, పెద్ద ఉద్యోగము చేస్తున్నది.
నాన్న ఆమెలో గర్వం తొణికిస లాడుతున్నది, నేను ఈమెను చేసుకోను అని అన్నాడు.
ఒక్క నిముషం నాన్న రాధకు ఒక చిన్న కధ చెప్పి వస్తాను, ఈమె ఒక్కతే కూతురు, వీళ్లకు డబ్బు బాగా ఉన్నది
చదువుకున్న విలువ ప్రేమకున్న విలువ వీళ్లకు లేదు.
అప్పుడే లోపలకు పోయి రాధను ఒక్కసారి పిలుస్తారాండి అని అడిగాడు
అట్లాగే అన్నారు
రాధతో : స్త్రీకుండ వలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, పూర్వం స్త్రీలు ఎలాఉండేవారో ఒక కదా చెపుతా విను అన్నాడు
ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు యువకులు వచ్చారు.
"లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.
మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.
భర్త
పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి
వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా,"
అని అడిగింది." లేదు..... కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి
వస్తాడు అది మా నియమం" అన్నారు.
ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో
చూస్తుండగా యువకుల పేర్లు " నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఈయన పేరు
'ఐశ్వర్యం'. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మాములు
మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న యుగ
పురుషులని తెలుసుకున్నారు .
సంతోషంతో పొంగిపోతు అమె ఆ
విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము
కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని" అన్నాడు.
దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య ఆహ్వనిద్దాం" అని అంది.
వీరి
ఇద్దరి మాటలు వింటున్న వారి కూతురు , గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది
భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ
మూలాధారం సుఖజీవనానికి" అంటూ సలహ ఇచ్చింది.
వెంటనే ఆ ఇంటి యజమాని
బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ
అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో
బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.
అందరికి భోజనం పెట్టారు వారు
ఆముగ్గురూ
"మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది
.ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే
గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ" అన్నారు......కాబట్టి
ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి.
వారు ముగ్గురు కలసి దీవించారు, మీకూతురికి ప్రేమను పంచి సుఖమును అందించే మంచి పురుషుడు లభిస్తాడు అని దీవించారు.
మాధవ్ : కపట ప్రేమ వ్యక్తం చేయవద్దు, హృదయాంతరములో ఉన్న మనిషిని ప్రేమించు అన్నాడు.
రాధ:
నన్ను క్షమించండి నేను ఒకరిని ప్రేమించాను, అతన్ని చేసుకోలేక, నన్ను
చూడటానికి వచ్చిన అబ్బాయిలను ఇష్టమొచ్చినట్లుగా అడిగి నచ్చలేదని
చెపుతున్నాను అన్నది రాధ .
అప్పుడే రాధ తల్లి తండ్రులను
పిలిచి చూడండి నేను చిన్న వాడ్నయినా చెపుతున్నాను, మీ అమ్మాయి ప్రేమించిన
కృష్ణునకు ఇచ్చి పెళ్లి చేయండి, దయచేసి మల్ల సంబంధాలు వెతకకండి అని చెప్పి
బయటకు వచ్చాడు మాధవ్
అప్పుడే తల్లి తండ్రులతో నేను
నిరుద్యోగిని దయచేసి నాకు పెళ్లి చేయాలని తాపత్రయ పడకండి, సమయం వచ్చేదాకా
ఆగుదాం, పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి కదా, అవును స్వర్గంలో జరుగుతాయి
అని నవ్వుకున్నారు.
మాధవ్ నిద్దర్లో నవుతున్నడు.
అప్పుడే పోలీస్ వచ్చి ఇక్కడ నిద్రపోకూడదు లే అన్నాడు
ఇది నాకొచ్చిన కలా ,
ఎంబాబు నీవు పగటి కలలు కంటున్నావా.
ఈ యువకులు ప్రేమలో పడి పిచ్చోళ్లుగా తిరుగుతారు ఇదేమి లోకంలో అని గొణిగాడు పోలీస్
సంచి చంకన పెట్టుకొని పోలీస్ కు నమస్కరించి ప్రయాణ మయ్యాడు మాధవ్ ......
om
ReplyDeleteinteresting
ReplyDelete