Thursday, 11 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు-43

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 

సంసారంలో సరిగమలు -6 

పుల్లారావు గారు బాగున్నారా
ఎవరా అని వెనక్కి తిరిగి చూసాడు పుల్లారావు
భీమారావు గారిని చూసి గాలికి ఎగిరి పోయే పుల్ల లాగా పరిగెత్తాడు. 
భీమారావు ఏమన్నా తక్కువ, రోడ్డు రోలర్ జారినట్టు జారుతూ గట్టిగ పట్టు కున్నాడు. 
ఎందుకు అపరిగెత్తావ్ నిన్ను  చూస్తే నాలో ఒకటే టెన్షన్, పిండిని నలిపినట్లు నలుపుతావని భయం, గధ తిప్పినట్లు తిప్పుతావని భయం.  

మనమిద్దరం స్నేహితులం, డబ్బుకోసం కష్టపడ్డ రోజులున్నాయి, ఆనందం అనుభవించిన రోజులున్నాయి. ఏది అయతే ఒకరినొకరు విడిపోయి మోసకారి చిక్కి మోసపోయాం.

మనిద్దరం కలసి మరల బిజినెస్ చేద్దాం, మనల్ని నమ్ము కున్న వారిని బ్రతికిద్దాం అన్నాడు పుల్లారావు, పుల్ల లాగా సన్నగా ఉంటాడు, సరే అన్నాడు భీమారావు మనిషి భీముడి లాగేనే  ఉంటాడు.           

ఆటలాడుతూ అన్నాన్ని మరిచాము, కుళాయి నిల్లు త్రాగి బ్రతికాము,
ఇప్పుడు మినరల్ వాటర్ వ్యాపారం, కొబ్బరి బొండాల వ్యాపారం కలసి చేద్దాం అంటూ చేయి చేయి కలిపారు.

టివి అనేది తెలియని సమయంలో రేడియోనే గొప్పగా చెప్పుకొని విన్నాము, కానీ ఇప్పుడు వందల సంఖ్యలో చానల్స్ వస్తున్నాయి, ఎవరు ఏ ఛానల్ చూస్తారో ఎవరికీ తెలుసు,  కానీ లేని ఇల్లు లేదు కనుక మనం కలసి కేబుల్ కనెక్షన్ ఇస్తూ కొంత సంపాయిద్దాం అంటూ చేయి చేయి కలిపారు.

ఎర్ర ని ఎండ సైతం లక్క చేయ కుండా తిరిగే వాళ్ళం, ఇప్పుడు కొద్ది ఎండకే తట్టు కోలేక కూల్ డ్రింక్స్ త్రాగేవారు పెరిగారు, కనుక మనమే చల్లఁటి కుండల్లో చల్లటి మజ్జిగ, నిమ్మకాయ నీరు, సుఘందాల నీరు తయారు చేసి తక్కువ రేటు కిద్దాం అంటూ చేయి చేయి కలిపారు.
            
మన మిద్దరం కలసి పేరున్న అభిమాన నటులు సంఘాలను ఏర్పరుద్దాం, నెంబర్లను చేర్చుదాం, సినిమా హాలు వారితో మాట్లాడు కుందాం, ఇంటర్ నెట్ ద్వారా సినిమా టిక్కట్లు మనమే బుక్ చేద్దాం   కొత్త సినిమాకు టిక్కట్లు ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పుదాం, నెలవారీ నెంబర్ షిప్ వసూల్ చేద్దాం, రోజు వచ్చే తెలుగు పేపర్లు, సినిమా పేపర్లు ఏర్పాటు చేసి, ఇండోర్ గేమ్ సంబంధించినవి ఉంచితే సభ్యుల సంఖ్య బాగా పరుగునట్లు చేయాలంటూ చేయి చేయి కలిపారు.

మన మిద్దరం పంచ కట్టుకొని ఆలయము దగ్గరకు పోయి ఆక్కడ పేరున్న పూజారుల అడ్రస్సులు తీసుకోని వారి ఇంటికి పోయి, మేము కొత్తగా " మీ అవసరానికి పూజారులు దొరుకును వెంటనే సంప్రదించండి" అని ప్రకటన ఇస్తాము, మేము మీరు తీసుకొనే అమౌంట్ పూజల నిమిత్తం ఏంతో  ముందుగా మాకు చెప్పండి, మీకు ఖాళి ఉన్న రూజు మాకు తెలపండి, పూజలు మీరే చేస్తారు, మేము కేవలం మీకు వచ్చే దానిలో కమిషన్ మాత్రమే తీసుకుంటా మని కొందరి బ్రాహ్మణుల సహకారంతో పూజా కార్యక్రమములు నిర్వహిస్తామంటూ చేయి చేయి కలిపారు.

ఎర్ర బస్సుల్లో కిటికీ దగ్గర కూర్చొని తిరిగిన వాళ్ళం, ఇప్పుడు ఆ ఎర్రబస్సు ఎక్కడుందో తెలియదు, ఇంద్ర, గరుడ, ఐరావతం, అలా ఏసీ బస్సులు వచ్చాయి, అప్పడు ఒక్క రోజులో పోయే ప్రయాణాన్నీ  ఇప్పుడు కేవలము రోడ్లు బాగా ఉండుట వళ్ళ వేగముగా పోయాయి ఎక్కువ సమయంలో చేరుస్తున్నాయి. అందుకని మనం హైవే రోడ్డు మీద కాబా హోటల్ పెట్టి భోజనం మరియు ఫలహారశాల పెట్టి, భోజనం చేసిన వారికీ కిల్లి ఫ్రీ, ఫలహారం చేసిన వారికి కాఫీ టి ఫ్రీ అని చెప్పి బస్సులు ఆపమనిచెప్పి  వ్యాపారం చేయాలంటూ చేయి చేయి కలిపారు.

ఒకనాడు డాక్టర్ చదువంటే చాలా కష్టమను కొనేవారు, కానీ ఇప్పుడు ఎక్కువమంది చదువుతున్నారు, వీధికొక డాక్టర బోర్డు పెట్టుకొని బతుకుతున్నారు. అందుకని మనం ఒక వ్యాన్ కొనుక్కొని, కొన్ని గ్రామాలు ముందుగా నిర్ధారించుకొని అక్కడకు పోయి ఉచిత్ వైద్య పరీక్షలు అని గ్రామాలలో తెలియ పరిచి ముందుగా రోజూ కొందరి డాక్టర్లను మనమే వారి పేర్లను తెలిపి, అనారోగ్యలను తగు విధముగా పరిక్ష చేయించి నప్పుడు వైద్యుడు  రోగమునకు తగ్గ మందులను కూడా మనమే తీసుకోని వెళ్లి,  అక్కడ ఉన్న రోగాలను తగ్గించుట కు వాళ్ళు ఇచ్చే కొద్ది పైకముతోనే డాక్టర్లకు ఇచ్చి కొంత మనం తీసుకోని ప్రజాసేవ చేయాలంటూ చేయి చేయి కలిపారు.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎత్తైన భవనాలు భవనాల వద్ద ఉన్న వాచ్ మన్ లను, ఆభవనాలా ఓనర్లను మంచి చేసుకొని క్రింద ఉన్న కారు పార్కింగ్ లో పెట్టె ఇస్త్రీ చేసి ఇవ్వ బడును అప్పటి కప్పుడే , మీరు చూస్తున్నంత సేపులోనే బట్టలను ఇస్రి చేసి ఇస్తాము భవనంలో ఉన్న వారి కందదరికి చెప్పి, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మనమే ఒక బల్లలు ఏర్పటు చేసుకొని రెండు ఇస్త్రీ పెట్టెలు (1టి కరెంటు రెండు బొగ్గులు ) పెట్టుకొని బ్రతకాలంటూ చేయి చేయి  కలిపారు .                         
ఇప్పుడు డబ్బున్నవారు భవనాల నుంచి క్రిందకు కూడా దిగ కుండా సెల్ ద్వారా వారి కావలసినవి వెంటనే బుక్ చేసుకొని తెప్పించుకొనే పద్దతి వచ్చింది కనుక మనమే భవనంలో ఉన్న ప్రతి  ఇంటికి పోయి మీకు కావలసి ఆహారధాన్యాలు , నిత్యావసర వస్తువులు తెస్తాము మేము అని చెప్పి వారికి కావలసినవి వ్రాసుకొని మనమే సూపర్ మార్కెట్కు వెళ్లి వాళ్ళను బ్రతిమలాడుకొని ఉచితముగా నమ్మకముగా ముందుగా తెచ్చి ఇచ్చి వారు ఇచ్చిన పైకము సూపర్ మార్కెట్లో కట్టి ఇంటివారు ఇచ్చే టిప్పు, షాప్ యజమాని ఇచ్చే పైకముతో బ్రతకాలంటూ
చేయి చేయి  కలిపారు. 

ఏమిటిరా చేయి చేయి పట్టుకొని పొద్దెక్కినా కూడా ఇంకా నిద్ర లేవలేదు, ఈ గేదలను కడిగి, మేత వేసి పాలు పిండి బయటకు పోయి అమ్మేదెవరు ఈరోజు మీఇద్దరిలో, కబెళాకు మేకలను కోళ్లను తీసుకెళ్లి మాంసం  తెచ్చెదెవరు అంటూ గట్టిగా అరిచింది వీరు పనిచేసే ఇంటి యజమాని. 

ఇద్దరు ముక్త ఖంఠముగా మేమిద్దరం ఏకమయ్యాం, మీదగ్గర పనిచెయ్యం, అంటూ చేతులు దులుపుతూ అన్నారు. 
అప్పుడే నగరానికి లారీ పోతున్నది కూలీలు కావాలిట అన్న పిలుపు విన్నారు ఇద్దరూ . 

ప్రపంచ జ్ఞానాన్ని మేమిద్దరం పొందాలనుకున్నాం చేయి చేయి కలిపాం, మమ్ము ఆశీర్వదించండి అని యజ మానికి దండం పెట్టారు. 

అనాలోచనముగా తధాస్తు అన్నది. 

అంతే ఒక్క పరుగున చేయి చేయి కలిపి పగటికలలు నెరవేర్చుకొనుటకు ఎక్కారు లారీ.  
      

Wednesday, 10 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 42

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:



సంసారంలో సరిగమలు -5

ఏమిటండి ఇంత పీనాసి బుద్దులు మీకు, సంపాదించినది కట్టుకు పోతామా, అనుభవించటానికే కదా

కాదని ఎవరన్నారు, నా సంపాదనంతా నీకు మన పిల్లలలుకు కాక ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వను,  ఇతర ఖర్చులకు  వాడను, అది నీకు తెలుసు.

మరి నీవు నన్ను పీనాసి అను, సన్నాసి అను, ఏబ్రాసి అను ఏ పదముతో నయినా తిట్టు, నేను నోరు విప్పితే నీమీద ఒట్టు.

మీరు కారు కొనుక్కుంటే ఎంతో చక్కగా అన్ని ఊరులు తిరిగి రావచ్చు,  చుట్టాల నందరిని కలసి రావచ్చు, భ్న్దు వర్గాన్ని పెంచు కోవచ్చు. 

దాని వలన ఫలితాము ఏదన్న ఉన్నదా

ఎందుకు లేదండి సమయము సందర్భము కలసి వస్తుంది, ప్రేమ బంధం పేరుగు తుంది.

దాని కోసం " కారే " కొనాలా పుణ్యక్షేత్రాలు చూడాలన్న, చుట్టాలింటికి పోవాలన్నా క్యాబ్ మీద పోదాం, ఇప్పుడు కొన్నామనుకో మన పుత్రికా రత్నం నడుపుతాడు వాడి వేగాన్ని అడ్డు కట్ట వేయలేము, రోజు చూస్తూనే ఉన్నాము కదా యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారో రోజు వింటున్నాము కదా.

మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఏమి చేస్తారు, కారు కొని డ్రైవర్ను పెట్టు కోవచ్చు కదా అని హెచ్చరించింది. ఏది ఎమన్నా నేను మాత్రం నాకున్నస్కూటర్ మీదే పోతాను, ఎక్కడకన్నా పోవాలన్న బస్సు,  రైలు దాని మీదే వెళదాం. మరోసారి ఈవిషయం నాముందు తీసుకు రాకు అన్నాడు భర్త .

ఏమిటే ఆ కాగితాలు తెచ్చావు, ముందు జాగర్త అండి

ఇప్పుడు నాకేమైందని రేపు ఏమైనా జరగ వచ్చు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీలునామా వ్రాసుకొని రిజిస్టర్ చేసుకుంటే మంచిదికదాఅన్నది భార్య .

ఇది నీ ఆలోచనా, లేదా నీ పుత్రుని ఆలోచనా ఎవరిదైతేనేమి మా ఉద్దేశ్యం చెప్పాము ముందు జాగర్తగా అన్నది

నాది గట్టి ప్రాణం " నీకు వడ్డాణం, అబ్బాయికి కాస్ట్లీ కారు కొనలేదని ఏమి ఆలోచనే మీది '

 రేపు బిసినెస్ కాన్ఫరెన్స్ పోవాలి చాలా పని ఉన్నది.  

నేను నీవు చెప్పినట్లు నీకు గిఫ్ట్ గా  2  కోట్ల పెట్టి కారు కొన్నాను, ఇంటికి తెచ్చాను అందరు మెచ్చు కున్నారు,ఇక మన కుమారుడయితే ఒక్కసారి నడుపుతానని కారు తీసు కెల్లడు

జాగర్తగా వెళ్ళమని చెప్పగా స్నేహితులతో రింగ్ రోడ్డులో౦ అధిక వేగం తో ఆగి ఉన్న బస్సు గుద్దేసి

అక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆ విషయం అప్పుడే నాకు ఎవరో ఫోన్ ద్వారా తెలిపారు, స్నేహితులకు గాయాలు దాగిలాయ్ అని       

అంతే నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.....

న ఆత్మా కలవరిస్తున్నది.

కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
కాన్ఫరెన్స్ కు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?

వసారాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దాని ప్రక్కన నా కొడుకు దేవుడా!

నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్కగదిలోకి తొంగి చూశాను....

 నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.

కొడుకును చూసి వీడు ఎప్పుడు చని పోయాడు అని అడుగు తున్నాను ఎవ్వరు పట్టించు కోవటం లేదు.
భార్యను పిలిచాను.
తనకు నా మాటలు వినిపించలేదు........
మరో గదిలోకి వెళ్ళి చూశాను.
 ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు దు;ఖంలో.
" నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను.
.ఎవ్వరూ నన్ను చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను.
అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు.
వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి, వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడ్టం మానేశాను,ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.
మరి వాడెందుకు ఏడుస్తున్నాడు.
అవును నేను చనిపోయాను.
నిజంగానే చనిపోయాను.

' దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు
 తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని ఇవ్వు.
.ఇన్ని రోజులు నేను నా వ్యాపార వత్తిడితో నా భార్యను, కొడుకును  మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను.
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను, నానా బిడ్డను కూడా తీసుకెళ్లినావు .

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను.
చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను."

" దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు..నా తల్లి మొహంలో నవ్వును చూడాలి.
.నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు ప్రాణబిక్ష పెట్టు స్వామీ! "

ఓ దేవుడా నాకు నాకొడుక్కి ప్రాణ బిక్ష పెట్టు అని గట్టిగా నిద్రలో అరుస్తున్నాడు 
ఏమండి ఏమండి ఏమైంది మీకు అలా కలవరిస్తున్నారు.
అంటూ లేపింది  
కళ్ళు తెరిచి చూశాను.
కళ్ళ ముందు నా భార్య.
" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.

అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! మన అబ్బాయిని పిలువు ముందు వాడు బ్రతికి ఉన్నడా
వాడు నిద్ర పోతున్నాడు.
ముందు వాడిని పిలువవే అన్నాడు.
బాబు నాన్న గారు పిలుస్తున్నారు, ఏమిత్తి నాన్న నిక్షేపం లాంటి కలను పాడు చేసావు చెప్పి మొఖం కడుక్కొని వస్తా అని చేపి వెళ్ళాడు.       
 కాంఫరెన్సు  టైం అయిందన్నా నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని
.నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం.
నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను......
ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,

మీరు బ్రతికే ఉన్నారు అంతే చాలు మరో ఆలోచన పెట్టుకోకండి.
ఎం కల గన్నారు. 
అబ్బా ఆకల ఒక పీడకల
ఏమిటో చెప్పండి
ఏముందే కారు కొన్నా "కొడుకు నేను దేవునిదగ్గర చేరాము " అంతే 

ఆమ్మో ఆ పాడు కలేమి టండి.
ముందు అబ్బాయిని పిలువ ఆంజనేయస్వామి గుడికెళ్ళి పూజ చేయిన్చుకొని మరి కాన్ఫరెన్సుకు బయలు దేరుతా
గుడిలో పూజారి చెడు ఆలోచనలు, తాహతుకు మించిన కోరికలు, వేరొకరు బాగున్నారు నాకు లేదే అనే ఏడుపులు ఉంటే మనసు కల్లోలముగా మారుతుంది, మనసు ప్రశాంతి కొరకు నిత్యధర్మాలు పాటిస్తూ జీవితమును సాగించుటే మానవులయొక్క ధర్మం.          

మృత్యువుని ఎవరు ఆపలేరు, కానీ దాన ధర్మాలు చేసు మంచి భావంతో సహాయం చేస్తూ ఉంటె మృత్యువు దరి చేర కుండా ఆపగలం అన్నారు. 
      

Saturday, 6 May 2017

విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
Image result for rabindranath tagore images
రవీంద్రనాధ్ ఠాగూర్

 రవీంద్రనాధ్ ఠాగూర్ విశ్వకవి అనే వాక్యాన్ని ఘనమైన ఆ నేపథ్యంలోంచి గ్రహించాల్సి ఉంది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ... ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకు తీరుతాడో...అగాధమైన సత్యంలొంచే ఉబికివచ్చే మాటలు ఎక్కడ వినబడతాయో.. ఓ తండ్రి అటువాని స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలొకలుపు అంటూ ప్రార్ధన చేయాలన్న ఊహసాధారణ కవులకు తోచేది కాదు. ఇది ఋషుల ఆలోచనా సరళి.  ఆ పరంపరకు  చెందినవారు.

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో...
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకు తిరుగుతాడో...
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో..
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకు గోడల మధ్య మగ్గిపోదో..
... ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేల్కొనేటట్టు అనుగ్రహించు తండ్రీ...

గీతాంజలి అనే గొప్ప కావ్యం లో రవీంద్రనాథ్ టాగోర్ రాసినవీ వాక్యాలు.. భారత దేశానికి జాతీయగీతమైన 'జనగణమణ'ని ఇచ్చిన రవీంద్రనాథ్ టాగోర్ పుట్టిన రోజు ఈరోజు అంటే మే 7వ తేదీ 1861. రవీంద్రుడిగా అందరికీ తెలిసిన ఈయన రాసిన గీతాంజలికి 1913 లో నోబెల్ బహుమతి లభించింది. ఆసియాలో మొదటగా సాహిత్యంలో నోబెల్ రవీంద్రుడికే దక్కింది. మొదట బెంగాలీలో దీన్ని రాసి తర్వాత ఇంగ్లీషులోకి అనువదించాడాయన. దీన్ని తెలుగులోకి చలంతో సహా మరి కొందరు అనువదించారు.. 

జాతీయ గీతమైన జనగణమణ టాగోర్ రాసినదే. నిజానికి దీన్ని ఆయన బ్రిటిష్ రాజు జార్జికి స్వాగతం పలికేందుకు రాశారంటూ వివాదం ఉంది కానీ దాన్ని ఆయన అంగీకరించలేదు. రవీంద్రుడికి 1915 లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదిచ్చింది.. కానీ రెండేళ్ల తర్వాత జలియన్ వాలా బాగ్ లో భారతీయుల్ని బ్రిటిష్ సైన్యం ఊచకోత కోసినందుకు నిరసనగా ఆయన దాన్ని వెనక్కిచ్చేశారు.. 

భారతీయ ఆత్మ నిరంతరం మనుషుల మధ్య ఐక్యతను ప్రతి పాదిస్తునే ఉంది అని ఆయన గుర్తించారు. దాన్ని ప్రకటించారు . 1921 లో విశిష్ట నోబెల్ పురస్కారాన్ని స్వీకరిస్తూ రవీంద్రుడు నేని గొప్ప కాలానికి చెంది, ఈ గొప్ప యుగంలో జీవిస్తున్నందుకు నాతో సంతోషింస్తున్నారు.
  
రవీంద్రుడి రచనల్లో అతి ముఖ్యమైంది గీతాంజలి అయినా ఇంకా ఆయన గీతాలు రవీంద్ర సంగీత్ పేరుతో బెంగాల్లో చాలా ప్రసిద్ధికెక్కాయి. టాగోర్ నాటకాలూ.. కథలూ.. నవలలూ కూడా రాశారు.. ఛోకేర్ బాలీ, The post office (డాక్ ఘర్), Sadhana, Shishir kavita, My boyhood days, Gora, The Post master, My reminiscences, Kabuliwala, Chaturanga... ఇలా ఎన్నో.. వీటిలో కొన్ని, అంటే.. గోరా, The post office, కాబూలీవాలా లాంటివాటిని... మనం స్కూలు, కాలేజీల్లో non detailed గా చదువుకున్నాం. 

ఆయన రచనల్లో చరణదాసి.. చారులత.. ఛోకేర్ బాలీ.. చతురంగ.. Ghare Baire... ఇంకా కొన్నింటిని సత్యజిత్ రే... రితుపర్ణ ఘోష్ లు సినిమాలుగా తీశారు. 

రవీంద్రుడు కేవలం కవీ రచయితా మాత్రమే కాదు.. మంచి సంగీతకారుడూ.. చిత్రకారుడూ కూడా.. అన్ని కళలూ తెలిసినందువల్లే ఆయన కేవలం కళలు మాత్రమే నేర్పించే శాంతినికేతన్ ని స్థాపించారు..గురుదేవుడిగా పేరు గడించారు.. కలకత్తా దగ్గర్లోని ఇది విశ్వభారతి పేరుతో గొప్ప కళావిద్యాలయంగా ప్రపంచమంతా పేరు పొందింది.. ఇప్పుడు ఆ విలువలూ.. ఆ స్థాయీ లేకపోయినా అది రవీంద్రుడికి గుర్తుగా కొనసాగుతూనే ఉంది. టాగోర్ 1941 ఆగస్టు 7 న మరణించారు.. నువ్వు లేవు.. నీ పాట ఉంది.. అన్న రీతిలో అడుగడుగునా గుర్తొస్తూనే ఉంటారు..  

Thursday, 4 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 32

  ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:



నిరుద్యోగి ప్రయాణం -7

మాధవ్ అలా ట్యాన్క్ బండ్ వద్ద నడుస్తూ పోతున్నాడు వెనుక నుండి ఎవరో పిలుస్తు న్నారని పించింది, చూడగా ఎవ్వరు లేరు, అక్కడ ఉన్నపూల కొమ్మలు కదులుతున్నాయి, పూలు రాలు తున్నాయి. అప్పుడు ఒక ముసలాయన వస్తూ బాబు నన్ను గుర్తు పెట్టలేదా, ఎవరు రామయ్య తాతయ్యవు కదూ, నీవు గుర్తు పట్టావు నాకొడుకులు  నన్ను గుర్తు పెట్టలేని విధముగా తయారు చేశారు, నన్ను నడివీధికి నెట్టారు. 

నీవు ఇక్కడ ఏంచేస్తున్నావు అని అడిగాడు తాతయ్య.

తాతయ్య నేను ఏం చేస్తున్నానో తర్వాత చెపుతాను ముందు మనము ఈ ప్రక్కన అమ్ముతున్న బండి దగ్గర ఇడ్లి, దోస దొరుకుతుంది, తిన్నాక మనం మాట్లాడు కుందాం.

బాబు నీవు మరోలా అనుకోకు ఆనాడు నేను అడిగిన ప్రతి మాటకు చాలా చక్కగా సమాధానము చెప్పావు ఇంకా నాకు గుర్తు ఉన్నది.

కొడుకు ధర్మాలు మన శాస్త్రాలలో ఉన్నవి చాలా చక్కగా చెప్పఁవు, మరలా చెప్పవు మదఃవ్. సరే తాత ముందు టిఫిన్ తిను ఎప్పుడు తిన్నవో అని దగ్గరుండి చిన్న పిల్లలకు తినిపించినట్లు కొసరి కొసరి పెట్టాడు మదఃవ్.

మాధవ్ మరలా సుహాపాపితం మొదలు పెట్టాడు.

 దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో...’ తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.
తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది. ‘పుత్ర శబ్దానికి- తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.

‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు... అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు... అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు... ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు. అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.

బాబు నీవు చెప్పింది అక్షరాల నిజము, అటువంటి పుత్రుడు నాకు లేడు, ఉన్న ముగ్గురు ఒకడు పెళ్ళాం మీద మోజుతో ఇళ్ల్లరికం పోయాడు, రెండవ వాడు త్రాగుడు బానిసగా మారి డబ్బులు ఇచ్చేదాకా ఇంటిని వల్లకాడుగా మారుస్తాడు, ఇక మూడోవాడు ఎవరినో ప్రేమించాడుట ఆఅమ్మాయి నాకొడుకుని వాడాలి వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లి పోయ్యిందట, అప్పటి నుండి ఇంటికి రాక పిచ్చోడిలా తిరుగుతున్నాడు, ఇప్పటిదాకా నాకు సేవలు చేసిన న శ్రీమతి దేవుని దగ్గరకు చేరింది.

అప్పటి నుండి నా బ్రతుకు నిత్యం నరకంగా మారింది.

అవును తాత నీవు పొలం దున్నేవాడివిగా, సోనా పొలం ఉండేదిగా. ఎక్కడి పొలం బాబు నా పిల్లలు నాప్రాణం హరించినట్లు నా ఆస్తిని హారతి కర్పూరం చేశారు.

నా బ్రతుకుకు ఎవరన్న దారి చూపితే బ్రతకాలనుకున్నా, ఈ ముసలివాడి సేవలు దేశానికి అవసరం లేదు అని బస్సు ఎక్కాను. ఆబస్సు యాక్సిడెంట్ అయ్యింది, ఈ ముసలి ప్రాణానికి చావు రాలేదు అని దినంగా మాట్లాడుతున్నాడు తాతయ్య.

ఆమాటలకు మాధవ్ తాత కు ఒక దారి చూపాలి, ఎట్లాగా అని ఆలోచనలో పడ్డాడు,
కొడుకు ధర్మాలు మన శాస్త్రాలలో ఉన్నవి చాలా చక్కగా చెప్పఁవు, మరలా చెప్పవు మదఃవ్. సారె తాత ముందు టిఫిన్ తిను ఎప్పుడు తిన్నావో అని దగ్గరుండి చిన్న పిల్లలకు తినిపించినట్లు కొసరి కొసరి పెట్టాడు మదఃవ్.

తాత నీవు ఇక్కడే ఉండు, నేను ఒక అరగంటలో వస్తాను, నీకొక దారి చూపుతాను అన్నాడు.
సరిబాబు ఈ బాలలమీద నాడు వాలుస్తాను.

ఇడ్లి బండి వాడితో మా తాతను కదిలించకు బాబు, కాస్త విశ్రాన్తి తీసుకోని అని మరి చెప్పి బయటకు నడిచాడు. దగ్గరగా ఉన్నపెద్ద పెద్ద భవనాల వద్దకు పోయి మాతాతకు ఉద్యోగము ఇవ్వండి అని అడిగాడు.

ఒక ఇంటివద్ద ఏంచేస్తాడు బాబు మీ తాత మొక్కలకు నీళ్లు పోస్తూ, ఇంటికి కాపలా ఉంటాడు, మీరే దన్న పెడితే అది తింటాడు, చిన్నగది ఇస్తే ఆగదిలో ముడుచు కొని పడు కుంటాడు. మీరు తిండి పెట్టె ఏర్పాటు చేయండి అని అడిగాడు.

మీతాతను తీసుకురా నేను ఒక్కరవ్ అతిగా మాట్లాడుతాను, నేను నవ్వు కోవటానికి ప్రశ్నలు వేస్తాను సమాధానము చెప్పాలి.

లోకజ్ఞానమ్ తెలిసినవాడు మీరడిగిన వానికి సమాధానము చెపితే ఉద్యోగమూ ఇస్తారా అని అడిగాడు.

ముందు నిన్ను అడుగుతా సమాధానము చెప్పు, మీ తాతకు ఉద్యోగము ఖాయం అన్నాడు
                     
ప్రక్కకు ఉండు అన్న మాట ?
ఆధి పత్యం  కోసమన్నట్లు

కలసి గుడికి పోదాం అన్న మాట ?
అన్యూన్య దాపత్యం అన్నట్లు

ఆకర్షించుతూ అన్నమాటా ?
అమాయకురాలిని పెట్టకు ఇక్కట్లు

వైకుంఠ పాళీ ఆడుతూ అన్నమాట ?
పావులు కదిపి పాము నోట్లో తోయకన్నట్లు

చేయి చేయి కలుపుతూ అన్న మాట ?
నాపై సానుభూతి చూపాలన్నట్లు

మాటకు మాట పలుకుతూ అన్నమాట ?
అహంకారం వదలి కష్టం చూడాలన్నట్లు

కళ్ళ చూపులతో పలికే మాట ?
నేను నోరు విప్పని జీవి అన్నట్లు

నోటితో గట్టిగా పలికే మాట ?
తప్పు చేస్తున్నారు వస్తాయి ఇక్కట్లు

కన్నీరు తో పలికే మాట ?
హృదయాన్ని అర్ధం చేసుకోమన్నట్లు 

నవ్వుతూ పలకరించే మాట ?
నీ శక్యతే నాకు సుఖ మన్నట్లు

సంపాదనతో పలికే మాట ?
సమానత్వం కావాలన్నట్లు

భాధ పెంచే వానితో పలికేమాట ?
మృగత్వం వదులు కోమన్నట్లు

ప్రేమతో పలికే మాట ?
మనస్సును అర్ధం చేసుకోవాలన్నట్లు

కోపంతో అనే మాట ?
మాటవిని మాట్లాడ మన్నట్లు

బాబు నీవు చక్కగా చెప్పావు, నీ తాతను తీసుకురా ఇక్కడ ఉద్యోగము ఇస్తాను అన్నాడు మదఃవ్ తో

తాతను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగానికి చేర్పించాడు.

చంకన బ్యాగ్ పెట్టుకొని నడుస్తున్నాడు.

తాతయ్యే ముగ్గురు కొడుకులు కనబడి మానాన్నగారు నీకు కనిపించారా

మీ నాన్న గారు కనబడితే తీసుకోని వెల్దామను కున్నారా అని అడిగాడు. పెద్దోడా నీవే చెప్పు అని మిగతా ఇద్దరు అన్నారు.   

మానాన్నగారు మాకు చెప్పకుండా ఇటువైపు వచ్చినట్లు తెలిసింది, వారిని మేము పోషించగలము, మేము వారిని భాధ పెట్టినది మాత్రమూ నిజం, మాతప్పు తెలుసుకున్నాము అంటుంటే , మూడవవాడు నాన్న విషయం వీడికి చెప్పేది ఏంటి ఎక్కడున్నాడో చెప్పమను అని గట్టిగా అడిగాడు. 

నేను చెప్పఁక పోతే  

మేము కనుక్కోలేమా, మానాన్నను వెతికి ఇంటికి తీసుకు వెళ్ళగలం అన్నారు.    

మంచిది మీప్రయత్నంలో మీరు ఉండండి, నాసమయాన్ని వ్యర్థం చేయకండి, నేను ఇక వేళ్ళ వచ్చా. 

మాన్నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీతో మాకేం పని అని ముందుకు నడిచారు. 

మాధవ్,  వాళ్ళు వెళ్ళాక మరలా వెనక్కి పోయి రామయ్యను కలిసాడు. 
నీ కొడుకులు నిన్ను వెతుకు తున్నారు, నిన్ను తీసుకోని వెళ్లాలని వచ్చారు ఎందుకు ?
బాబు నేను నీకు ఎం చెప్ప గలను, నాకున్న పొలము ఇల్లు అమ్మేదాకా కొడుకులు ఊరుకోలేదు, నాభార్యకు చెలాయించిన చంద్రహారం, నాంతాడు నాకష్టార్జితమ్ అదికూడా నాదగ్గర గుంజాలని వచ్చి ఉంటారు. 

ఆ ఇంటి యజమాని వస్తూ బాబు మాధవ్, నేను చాలా సంపాదించాను, నేను వృద్దాశ్రమాలను నిర్వహిస్తున్నాను , మీతాతగారికి ఒక ప్రేత్యేక గది వేలకు భోజనము, ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయిస్తాను. ఇక్కడ ఉండేవారు ఎవరూ పనివారు కాదు అందరు స్వతంత్రులు వారు ఓపిక ఉంటె పనులు చేయవచ్చు బలవంతము ఉండదు, నీవు కూడా వాచ్ మెన్ అని కోకు. 

మాధవ్ అడిగాడు రామయ్యను ఇంతా చేస్తే బంగారు నగలు ఎక్కడ ఉంచావ్ అని అడిగాడు. 

ఏమిటి నాకొడుకుల్లా నీవు అడుగుతున్నావు అన్నాడు రామయ్య . 

లేదు తాతయ్య ఎదో పొరపాటున నోరు జారా, చూడు బాబు మంచి మనసున్న వారు పొరపాటున కూడా నోరు జారకూడదు అన్నాడు. 

నిజమే తాతయ్య నన్ను క్షమించు అన్నాడు, నిన్ను గాని నన్ను గాని క్షమించేవాడు ఆభగవంతుడొక్కడే ఆయన్నే ప్రార్ధించుదాం అన్నాడు .                      

Wednesday, 3 May 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 31

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:


నిరుద్యోగి ప్రయాణం -6
 మాధవ్ ట్యాన్క్ బండ్ మీద ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం చూస్తున్నాడు, అప్పడు రెడ్డుమీద ముగ్గురు (ఒక యువకుడు ఇద్దరు యువతులు) ఎక్కిన బైక్ ఒక్కసారిగా స్లిపై క్రిందకు పడ్డారు, దెబ్బలు బాగా తగిలినాయి.ఆ పక్కనే ఉన్న మాధవ్ నేను మీకేమన్నా సహాయం చేయాలా అని అడిగాడు, నీవొక పల్లెటూరు మొద్దులాగున్నావు మాకేం సహాయం చేస్తావు అన్నారు.

అప్పుడే అక్కడకు పోలీస్ వచ్చి ఇక్కడేం జరిగింది యాక్సిడెంట్ ఎక్కడా అన్నాడు, అక్కడ ఉన్నవారు ఏమి మాట్లాడలేదు, అప్పుడే పోలీస్ తో వీళ్ళు చాలా స్పీడు రావటం వళ్ల ఇక్కడ పడ్డారు.

సరే సరే ఇక్కడనుంచి కదలండి అన్నాడు, వెంటనే వెళ్లి పోయారు పడ్డవారు.

ఏమిటి మీరు కనీసం ఆవిద్యార్థులను హెచ్చరించకుండా వదిలేశారు.
ఎంబాబు నీవు నగరానికి కొత్తలాగున్నావు, ఇప్పుడు నేనువాళ్ళమీద ఏదన్న కేసు వ్రాసాననుకో నేను రెజువెళ్లే స్టేషన్కు పోనక్కరలేదు, వాల్లెవరనుకుంటావు నగరంలో ఉన్న ధనవంతులు మరియు నాయకుల బిడ్డలు అన్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళ బాగాపెరిగారు, వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి, పూర్వం వంటింటి కుందేలు అనేవారు, ఇప్పుడు పెళ్ళికి ముందే అనేక షరతులు పెట్టి మరి పెళ్ళికి ఒప్పుకుంటున్నారు. ఇప్పుదు ఆడదాన్ని పెళ్లి సెహెసుకోవాలంటే మొగవాడు భయపడే పరిస్థితి వచ్చింది. ఇది కలియుగ మాయ 

నీవుకూడా ఇక్కడనుండి బయలుదేరు, వాళ్ళు క్రింద పడ్డ నీవు చూసావు, వాళ్ళు అవమానంగా భావించి  నీమీద కేసు పెట్టారనుకో నిన్ను బందిఖానాలో పెట్టాల్సి వుంటుంది.

ఏమిటి ధర్మం ఇంత దిగజారిపోయినదా,

బాబు పెద్ద పెద్ద మాటలు పలుకుతున్నావు, మాడ్యూటీ మెం చేసుకో నివ్వు అంటూ లాటి తిప్పాడు.

పోలీస్ తో ఘర్షణపడుట ఎందుకు అని నేను వెళుతున్నాను, అని కదిలి ప్రక్కనే ఉన్న లుంబినీ పార్కు చేరాడు మాధవ్ .

అక్కడ పచ్చని గడ్డిపై నడుం వాల్చాడు అప్పడే కలలోకి చేరాడు.


పెళ్లి చూపులకు మాధవ్ వచ్చాడు. తల్లి తండ్రులతో బయలు దేరాడు.

అక్కడవారు మాధవ్ ను చూసి  రూపు రంగు ఎత్తు బాగున్నారు, కాని అమ్మాయి కన్న రంగు తక్కువే అబ్బాయి వయసు కొద్దిగా ఎక్కువని పించింది అని గుస గుస లాడారు.
పెళ్లి చేసుకొనే అమ్మాయి, పెళ్లి చేసుకొనే అబ్బాయితో ప్రశ్నలు వేస్తానని మొగపెళ్ళివారిని అడిగింది.
 
దాని దే వుంది మీరిద్దరూ అభిప్రాయాలు ఒకటవ్వాలి పెళ్లి అవ్వాలి , మొఖమాట,పడ కుండా నీ అభిప్రాయాలు అడుగు, ఒరేయ్ మాధవ్ నీవు కూడా ప్రశ్నలు  అడుగు అన్నారు .

రాధ పెల్లి కొడుకుతో పరసనల్ గా  మాట్లాడింది. (మాటలు ఈ విధముగా సాగినాయి)

రాధా:  పెళ్లి ఆయిన తర్వాత మనం చేయ వలసిన పనేమిటి ?
మాధవ్  : హనీమూన్ వెళ్ళటం,  కాపురం చేయటం.

రాధ : పెళ్లి అయిన  తర్వాత  నేను ఉద్యోగము చేయాలా,   నేను స్వతంత్ర భావంతో ఉండాలా, ?      .      
మాధవ్  : ఉద్యోగమా నీఇష్టం, పూర్తి స్వతంత్రం నీకు ఇస్తాను, నీకు స్వేశ్చ కల్పిస్తాను .

రాధ: : పెళ్లి అయిన తర్వాత మానాన్న అమ్మను నా దగ్గరకు తెచ్చుకుంటాను మీకెమైనా అభ్యంతరమా?
మాధవ్  : పెద్దలందరూ నాకు పూడ్యులు మీపెద్దలను తెచ్చుకుంటే నాకు అభ్యంతరం లేదు.

రాధ :  ఇతర దేశాలకు పొవాలని ఉన్నదా ?
మదఃవ్  : ఇంత చదువు చదివి ఇతర దేశాలకు పోయి  సంపాదించాలని లేదు, దేశాభివృద్ధికి సహకరించాలని ఉన్నది.
    
రాధ:  ఇంతకీ నేను నచ్చానా
మాధవ్  : నేను నీకు నచ్చానో  లేదో చప్పు .

రాధ: మీరు నాకు నచ్చారు
మాధవ్ : ఎలా సెహెప్పగలిగావు, నాకు ఉద్యోగము లేదు, నాకు ఉదోగాము ఉన్నది.

రాధ : మీరు ఉద్యోగము చేయకపోయినా పర్వాలేదు, ఇంటిపట్టు నుంటే చాలు
మాధవ్ : పిల్లలు కావాలా వద్దా

రాధ : శృంగార సాహిత్యాన్ని అనుభవించాలి మనం, మనం కోట సృష్టికి కారకులవ్వాలి 
మాధవ్ : పిల్లలు కావాలా వద్దా

రాధ : పిల్లలను కనేది నేను, పెంచేది నీవు.    
మాధవ్ : ప్రశ్నలైనాయ ఇంకా ఉన్నాయా.

రాధ :  ఇక లేవు, మీరు నాకు నచ్చారు అంటూ ఓరచూపు చూసి, దగ్గరకు చేరి బుగ్గన ముద్దు ఇచ్చి మరి వెళ్ళింది రాధ 
రాధా తల్లి తండ్రులు మా అమ్మాయి మీకు నచ్చితే ఇంటికి వెళ్లి అలోచించి చెప్పండి ఈ రోజే చెప్పాలి సుమా అన్నారు.    

నాన్న అమ్మాయి బాగా చదువు కున్నది, పెద్ద ఉద్యోగము చేస్తున్నది.

నాన్న ఆమెలో గర్వం తొణికిస లాడుతున్నది, నేను ఈమెను చేసుకోను అని అన్నాడు.

ఒక్క నిముషం నాన్న రాధకు ఒక చిన్న కధ చెప్పి వస్తాను, ఈమె ఒక్కతే కూతురు, వీళ్లకు డబ్బు బాగా ఉన్నది   
 చదువుకున్న విలువ ప్రేమకున్న విలువ వీళ్లకు లేదు.

అప్పుడే లోపలకు పోయి రాధను ఒక్కసారి పిలుస్తారాండి అని అడిగాడు
అట్లాగే అన్నారు

రాధతో : స్త్రీకుండ వలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, పూర్వం స్త్రీలు ఎలాఉండేవారో ఒక కదా చెపుతా విను అన్నాడు
   
ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు యువకులు వచ్చారు.
"లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.
మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా," అని అడిగింది." లేదు..... కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం" అన్నారు.

ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా యువకుల పేర్లు " నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఈయన పేరు 'ఐశ్వర్యం'. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న యుగ పురుషులని తెలుసుకున్నారు .

సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని" అన్నాడు.

దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య ఆహ్వనిద్దాం" అని అంది.

వీరి ఇద్దరి మాటలు వింటున్న వారి కూతురు , గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి" అంటూ సలహ ఇచ్చింది.
వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.

అందరికి భోజనం పెట్టారు వారు
 
ఆముగ్గురూ "మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది .ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ" అన్నారు......కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి.

వారు ముగ్గురు కలసి దీవించారు, మీకూతురికి ప్రేమను పంచి సుఖమును అందించే మంచి పురుషుడు లభిస్తాడు అని దీవించారు.

మాధవ్  : కపట ప్రేమ వ్యక్తం చేయవద్దు, హృదయాంతరములో ఉన్న మనిషిని ప్రేమించు అన్నాడు.
 రాధ: నన్ను క్షమించండి నేను ఒకరిని ప్రేమించాను, అతన్ని చేసుకోలేక, నన్ను చూడటానికి వచ్చిన అబ్బాయిలను ఇష్టమొచ్చినట్లుగా అడిగి నచ్చలేదని చెపుతున్నాను అన్నది రాధ .

అప్పుడే రాధ తల్లి తండ్రులను పిలిచి చూడండి నేను చిన్న వాడ్నయినా చెపుతున్నాను, మీ అమ్మాయి ప్రేమించిన కృష్ణునకు ఇచ్చి పెళ్లి చేయండి, దయచేసి మల్ల సంబంధాలు వెతకకండి అని చెప్పి బయటకు వచ్చాడు మాధవ్

అప్పుడే తల్లి తండ్రులతో నేను నిరుద్యోగిని దయచేసి నాకు పెళ్లి చేయాలని తాపత్రయ పడకండి, సమయం వచ్చేదాకా ఆగుదాం, పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి కదా, అవును స్వర్గంలో జరుగుతాయి అని నవ్వుకున్నారు.

మాధవ్ నిద్దర్లో నవుతున్నడు.
అప్పుడే పోలీస్ వచ్చి ఇక్కడ నిద్రపోకూడదు లే అన్నాడు
ఇది నాకొచ్చిన కలా ,
ఎంబాబు నీవు పగటి కలలు కంటున్నావా.
ఈ యువకులు ప్రేమలో పడి పిచ్చోళ్లుగా తిరుగుతారు ఇదేమి లోకంలో అని గొణిగాడు పోలీస్
సంచి చంకన పెట్టుకొని పోలీస్ కు నమస్కరించి ప్రయాణ మయ్యాడు మాధవ్ ......