Monday, 12 December 2016



 ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రే నమ:

సర్వేజనాసుఖినోభవంతు 

ఓం శ్రీ రామ్  -  శ్రీ మాత్రే నమ:

సర్వేజనా సుఖినోభవంతు


*నవదంపతులకు అక్షరమాల ఆశీర్వచనములు

కన్న కలలు నిజం చేసుకోవాలి
గతం మరచి జయం చూసుకోవాలి
ఘన కీర్తిని పొందేవిధముగా ఉండాలి
చక్కని పిల్లలతో సంసారం గుట్టుగా ఉంచాలి

ఛత్రంలా వారిని కాపాడి విద్య నేర్పించాలి
జయంగా సమస్యలు లేకుండా సుఖపడాలి
జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ బ్రతకాలి
టక్కరి పనులు పిల్లలు చేయకుండా చూడాలి

డంబాలు, బేషజాలు లేకుండా ఉండాలి
ఢంకాలా చదువులయందు విజఢంకా మొగించాలి
బాణంలా దూసుకు పోతూ ధైర్యంతో సాగాలి
తన్మయత్వంతో నమ్మిన వారికి సుఖం పంచాలి

దందాలు వద్దని, ధ్యానం తో శాంతిని పొందాలి 
ధనాన్ని దురినియోగం చేయక జాగర్త పడాలి
నమ్ముకున్న వారిని ప్రేమతో ఆదుకోవాలి
పరీక్షలు ఎదుర్కొని  జీవితం సాగించాలి

ఫలాపేక్షలేకుండా పెద్దల ఋణం తీర్చుకోవాలి
బలగం పెంచుకుంటూ మానసికంగా బ్రతకాలి
మంగళ తోరణాలతో ఉషోదయాన్ని ఆహ్వానించాలి

యముడిని జయించే పతివ్రతగా బ్రతకాలి
రమ్య మైన జీవితంలో అపశృతులు మానాలి
లంచం అడుగక అడిగిన వారిని పట్టించాలి
వద్దు చేతకాదు అనేది మనసుకు రాకుండాలి

శంకలన్నీ తుడిచేసి ధైర్యంతో ఎదుర్కోవాలి
షరా మామూలుగా తేలిక భావంతో ఉండాలి
సగటు మనిషిని గౌరవించటం నేర్చుకోవాలి
హక్కుల కోసం అవసర మయితే పోరాడాలి

క్షణ క్షణం మంచి కోసం తపన చెందాలి
ఱంపంలా నిరంతరం చెడును తుంచాలి
ప్రకృతిలో ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలి
అర్ధం కోసం బ్రతకకండి ధర్మ కోసం బ్రతకాలి

--((*))--



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 Image may contain: 1 person , people sitting and text
సర్వేజనా సుఖినోభవంతు

తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితకు
శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పగుచ్ఛాలు అర్పిస్తున్నాను


అమ్మ అమ్మా భువి నుంచి దివికి ఎగసినావమ్మా
మా హృదయంలో నీకున్న స్థానం పదిలమమ్మా
మా భాదలు, నష్టాలూ ఎవరికీ చెప్పు కోవాలమ్మా
నీవు చూపిన మంచిమార్గాన్నే ఎంచుకుంటావమ్మా


మా కోసం నీవుకన్న కలలన్నీ మేము నిర్వహిస్తావమ్మా
ఇకలేవని అనుకోవమమ్మా, హృదయంలోనే ఉన్నావమ్మా
మానత్వం నిలిపి అందనంతదూరములో ఉన్నావమ్మా
మా హృదయంతో పుష్పాంజలిని ఆర్పిస్తున్నా మ్మమ్మా


ప్రాంజలి ఘటించి నీకు వందనాలు ఆర్పిస్తున్నామమ్మా
సత్య,ధర్మ,న్యాయం కోసం పోరాడుతామని శబధంమమ్మా
అమ్మ అమ్మా మామనసును అంతర్గతముగా చూడాలమ్మా
అమ్మా నింగి నుండి మాకు హితబోదచేసే జయలలిత వమ్మా

--((*))--
కన్నీరుతో సమర్పిస్తున్నది ప్రాంజలి ప్రభ




అత్యంత విషాద సంఘటన -
విప్లవ వనిత (పురచ్చితలైవి ) గా పేరుగాంచి , అశేష అభిమానులచేత ' అమ్మ' గా ఆప్యాయంగ పిలువబడిన అన్నా డి.యం.కె . అధినేత్రి , తమిళ నాడు ముఖ్యమంత్రి , కుమారి జయలలిత (68) ఇకలేరు . షుగరు .బి.పి. కీళ్ళనొప్పుల కొరకు అపోలో హాస్పిటల్ చేరి 72 రోజులు మృత్యువుతో పోరాడి , హృద్రోగంతో నవంబరు 5 న రాత్రి గం. 11.30 లకు తమిళ నాడును శోకసముద్రములో ముంచి ఆమె తుది శ్వాస విడిచారు.
1948 లో వైష్ణవుల ఇంట మాజి సినితార సంధ్య కు కుమార్తె గా జన్మించి , స్టేట్స్ లో విధ్యా భ్యాసం ముచించుకొని , తన 15 న ఏటనే చిత్ర రంగం ప్రవేశించి , ఆనాటి హీరోలు , ఎన్టియార్ , ఏయన్నార్ , ఎంజియార్ , శివాజి గణేశన్ , కృష్ణ ,శోభన్ బాబు మొదలైన హీరోలతో , కధానాయికగా , తమిళం , తెలుగు , కన్నడ భాషలలో 146 చిత్రాలలో నటించి , అలనాటి తమిళ నాడు ముఖ్యమంత్రి యం.జి.ఆర్ . వారసురాలిగా 1987 న రాజకీయ రంగంలో ప్రవేశించి తొలి మహిళా ముఖ్య మంత్రి గా నాటినుండి నేటి వరకు తిరుగులేని రాజకీయ నాయకురాలు కుమారి . జయలలిత . లక్షలాది అభిమానుల హృదయం లో చోటు చేసుకున్న ' పురుచ్చి తలైవి ' ఇకలేరు .
మనందరి తరఫున అన్నా డి.యం .కె . అధినేత్రి , తమిళనాడు ముఖ్యమంత్రి ,
జయలలిత గారి ఆకస్మిక మృతికి , నా ప్రగాఢ సానుభూతి !!
- అమర్ రహే !!
నేటి ప్రపంచం

దేశము దిన దినాభి వృద్ధి  జరుగు తున్నది అనేది దేవుడెరుగు !
పల్లెవాసులు పోట్ట  చేతపట్టుకొని తిండికోసం, విధి విధి తిరుగు !
ఉద్యోగములు ప్రభుత్వమువారు చూపకపొవడమువల్ల దొంగలగు !
విద్యాలయములలో డబ్బున్నవారికే చదువుకొనేందుకు వీలుకలుగు !

వ్యపారములుచేయలేక, పోటి పంచములో  బ్రతికేందుకు తికమకమగు !
మద్యం దుకాణాలువల్ల, కొందరు తాగుబోతులుగామారి కొందరికి బానిసలగు !
వ్యపారస్థులు నిత్యవసర వస్తువులు దాచుటవల్ల ప్రజలకు ఇబ్బంది కలుగు !
వైద్యులు రోగికి అవసరమైన కాకపోయిన పరిక్షలు చేయాలంటే భయము కలుగు !

ప్రతివస్తువుమీద సుంకమును పెంచుటవల్ల, కొనలేక ప్రజల గుండె కరుగు !
పెట్రోలు, గ్యాసు, అన్నివస్తువులు పెరగటము వల్ల ప్రజలలో తిరుగుబాటుజరుగు !
క్లబ్బులు, అంగాంగ ప్రదర్శనలు పెరుగుట వల్ల విద్యార్ధుల చదువులు మరుగు ! 
అధికారులు కాసులుకోసం అంధులుగా మారుట వల్ల  ప్రజలకు వేదన కలుగు !

నీతి, నిజాయితిగా,న్యాయం,  ధర్మం తప్పక ఉన్నవారు అనేకమంది ఈదేశం ల్లో  ఉండుటవల్ల
ఇదేశం మూడుపూవులు ఆరు కాయలుగా వెలసిల్లి ప్రజల జీవితము వెలుగు   
నిత్యా నూతన  విధానములతో ప్రజలకు భాదలు తొలగించడానికి అనేక పథకాలతో ముందుకు పరుగు,
 ఇతరదేశా లకు సహాయ సహాకారా లు అందిస్తూ , అందరి సహకారంతో ఏక మార్గంలో నడిచేదేశం మనది 
--((*))--
* నిరాశ ఎందుకు -ఎప్పుడూ

తాళిని ఎగతాళి చేసి, చెప్పలేని తప్పలు ఎత్తి చూపకు  !
ఎవరినైనా ఎదిరించగల వీరుడని మనస్సులో కుడా గర్వపడకు !
ఎప్పుడూ దైవమే ఆపదలలో వచ్చి కాపాడుతుందని ఆశపడకు !
ఎకాగ్రతతో బ్రతకటమే మనవంతు, ఫలితముకోసం ఎదురుచూడకు !

ఇల్లాలిని కష్టపెట్టకు, సుఖపెట్టలేదని దిగులు చెందకు !
పనికిరాని ఆలోచనతో సమయాన్ని  వ్యర్ధము చేయకు !
అనవసరపు పనిలో తలదూర్చి మాట వినలేదని అనకు !
ఆడదాన్ని కన్నీరు పెట్టించకు, అర్ధము చేసుకో లేదనకు !

శ్రమజీవిగా బ్రతుకు, ఆశలకు, కలవరింతలకు దారి చూపకు !
మొహమాట పడకు, అడిగి తెలుసుకొని కదులు ముందుకు !
పచ్చ నోట్లకు, ప్రలోభాలకు వ్యక్తిత్వం చంపుకొని దాసోహం  అనకు !
స్వార్ధ సంకుచిత భావాలను మనస్సులోనికి ఎపరిస్తితిలో రానీయకు !

కర్మానుసారము బుద్ధి మారుతుందని  వితండవాదం  చేయకు !
ప్రకృతి అనుసరించి ఆత్మీయుల పంచన చేరి చులకన అవకు !
ఎప్పుడు అని అనకు ఇప్పుడే బ్రతికి బ్రతికించు కొనే మార్గము వెతుకు!.      
దేశం నాకేమిచ్చింది అనకు, దేశానికి ఏమి చేయాలి అని వెతుకు!
 --((*))--

*ప్రేమలో పట్టు

సరిగమల సరాగం ప్రేమతో పుట్టు
చెరపలేని ప్రేమ మనసులో పుట్టు
ప్రేమార్ధం విశ్వ మంతటి లో గుట్టు
అంతుతెలియని మాధుర్యంతో పట్టు

అరిగిపోని అనురాగం పంచె పట్టు
కడలి పొంగును చల్లఁపరిచే పట్టు
ఆలింగనాల అభిరుచులతో పట్టు
తీపిగుర్తులు అందించి నలిగే పట్టు


నిరంతర త్యాగాలతో, ఓర్పుతో పట్టు
వివరించలేని సుఖం ఇచ్చిన పట్టు
తెలియని ఆనందం అందించే పట్టు
వీడని నమ్మకం తో బ్రతికించే పట్టు


ఇరుహృదయాల సంగమమే ప్రేమ పట్టు
ఈశ్వరుని లీలలను తట్టుకొనే ప్రేమ పట్టు
ఆకలేస్తే అన్నంపెట్టు, కోరికను వడిసి పట్టు
క్షణమొక యుగంగా బ్రతుకు ఈడిస్తు పట్టు


--((*))--

*ఆత్మీయత భావం 

మనిషి మేథా స్పూర్తి, కొన్నిపరిస్తితులలో  మహితమై భాసించు !
అణువు పరామాణువుల కూర్పు,  పవిత్రమైనదని భావించు !
అణువులద్వారా అణుబాంబు తయారుచేసి దేశ ప్రగతికి ఉపయోగించు !
నీటి బిందువులు కలసి, దాహార్తులకు దాహము తగ్గించు !

మనోధైర్యముతో, మంచిమనస్సుతో, మచ్చలేని మనిషిగా జీవించు !
పరుల తప్పులుదిద్ది , శరణు కోరినవారిని కాపాడి, అందరి నీ క్షమించు  !
మౌనముగా అన్వేషించి, వేద వేదాంత స్థితి ప్రజ్ఞను వ్యక్తపరచు !
గాత్ర మాదుర్యముతో భయమును తొలగించి అందరిని సంతోషపరచు !

అందరికి ప్రేమను పంచి, మరో వసంతము వచ్చినట్లు  వ్యక్త బరచు !
కాలమును దుర్వినియోగము పరచక విలువ తెలుసుకొని చలించు !
విధినిర్వాహణలొ వచ్చు అనుకోని సంఘటనలు గమనించి ప్రవర్తించు !
అందు కోలేనివాటిని గూర్చి ఆలోచించక అందుబాటలో ఉన్నదానిని గమనించు !
 
ఎదుటివారి స్థాయిని గమనించి ని సలహాను తెలుపుటకు  ప్రయత్నిమ్చు
నీ తోటివారు,  ప్రేమించే వారు బాగుంటేనే మన శాంతి  అని గమనించు 
మాట వ్యక్తపరిచి మధురాన్ని, మమతను అందించి ఆనందించు
కాలం మనచేతిలోలేదు దుఃఖాలు,కష్టాలు,నష్టాలు ఎవ్వరికి వద్దని ప్రార్ధించు
సర్వేజనా సుఖినోభవంతు అని తలంచి జీవితము సాగించు   
--((*))--

* నీవు ఒంటరి వా ?

నవ్వినా ఏడ్చినా అందని తలపుల తడి
ఉండినా లేకున్నా పట్టించుకోని లోక వడి
ఇష్టమున్న లేకున్నా రక్తబంధంలేని తడి
ఎండకు వానకు చలికి తలచు కోలేని వడి    

నేనున్నాను అనే విశాలమైన మనసుకు మడి
అహంకాము, మమకారము లే నట్టి చీకటి  తడి 
మనిషిని అర్ధం చేసుకొనేశక్తి లేని మానవులబడి
గుండె మంటలను, వేదన గాయాలను తీర్చే తడి

కళ్ళలో కారే కన్నీరు, వినిపించే గుండె చప్పుడు
నిన్ను చుట్టు ముట్టే కోటి భావాల కలలు తోడు  
చీకటిని తరిమే వెలుగు కోసం నీవు వేచి చూడు
మనో ధైర్యముతో ఉంటే  మనసు తేలిక పడు

చీకటి శాశ్వతము కాదు, వెలుగు తెచ్చు  తప్పక తోడు 
గతాన్ని మరిస్తే వర్తమానమే మానవులకు తోడు 
ప్రకృతిని ఆరాధించి ప్రేమను పంచటంలో ఉంది తోడు 
నమ్మకమే మనుష్యులకు నిజమైన మనుగడకు తోడు 
--((*))-- 

*.ఓటు వేసేటప్పుడు ఆలోచించారా                                                                                         

నిజాయతి పరునకు వేయాలి ఓటు !
ఒట్టు పెట్టి చెపుతున్న నికే వేసాను ఓటు !
ఓటు ఓటుకు ఎంత ఇస్తాన్నన్నావు నోటు !
నోట్లు ఖర్చు పెట్టనిదే రాదు కొందరికి సీటు !        

వృద్ధ నాయకులతో వస్తుంది తలపోటు !
పదవికోసం నాయకులు చేస్తారు తిరుగు బాటు !
కోర్కలుతీర్చి బుజ్జగింపులతో చేస్తారు సర్దుబాటు !
అందరూ వేసే ఓటు దేశ పురోగతికి తోలి మెట్టు !

ఓట్ల కోసం ధనం పంచుతారు మెట్టు మెట్టు !
నాయకులు పడతారు ప్రజల నాడి  పట్టు !
ఓట్ల కోసం కడతారు చేతులకు కట్టు !
ఓటుతో బయట పడుతుంది ఇంటి గుట్టు !

ఓట్ల కోసం బిందెలు, వస్త్రాలు పంచి పెట్టు  !
ఓట్లకోసం కొందరు విధినపడి పడతారు కుస్తీ పట్టు !
నాయకులకు తమకులస్తులపై ఉంటుంది పట్టు !
గెలిచే   ఓట్లకోసం తిరుగుతారు ప్రజలచుట్టు !

ప్రజల సొమ్మును తనదిగా పంచిపెట్టు  !
వ్యాపారముగా మారే రాజకీయ మైనట్టు !
రాజకీయము ప్రజలపై వ్యాపార మైనట్టు !
అధికార పీఠంపై ఎక్కితే తిరుగుబాటు తట్టు

మనకున్న తోడును సంప్రదించి వేశావనుకో ఓటు!
మనప్రాంతానికి సహాయ సహకారాములున్నట్టు !
ఆశ, బంధు ప్రీతి లేని నాయకుడ్ని ఎన్నుకుంటే!
మనదేశ ప్రగతి ప్రపంచ దేశాలలో ఎగురును బావుటా!
--((*))--
    
*ఓ చిన్నదానా! .... ఓ చిన్నోడా!


ఓ చిన్నదానా!

నువ్వెప్పుడూ నా గుండఁడెల్లోనే ఉన్నదానా
ఆ నెమలి ఎంత బాగుందో చూడు -
పూరి విప్పి  ఆడుతున్నది.!


ఓ చిన్నోడా!

నువ్వెప్పుడూ నా గుండఁడెల్లోనే
ఉన్నవాడా వినబడు తున్నదా -
ఆ చెట్టుపై కోయల కూస్తున్నది!


ఇటుచూ డు చిన్నదానా

ఈ కలవపూలు చూడు..ఎంతముద్దుగున్నాయో.. !
దేన్ని చూసినా నాకు నువ్వే కనిపిస్తావే..
ఇలా నిన్ను తలుచుకుంటూ.
నీ పేవలో పిచ్చోన్నయిపోతానే...!


నిజమేనా ! చిన్నోడా !

ఇది పైత్యం కదా
నీ ఊహల్లో నీవు బ్రతుకు!


కాదే..పిచ్చి ప్రేమే!



నీకోసం.. ఏదైనా చేస్తానే ..!



ఇంటి వా?. చిన్నదానా....

 చెరువులో  నీటి.కలువలు చూడు
వాటి కళ్ళు  నీ ప్రేమ కళ్ళే..!
నాట్యమాడు నెమిలిని చూడు
ఆ నడకలోన నీ సొంపే..!


ఓ చిన్న వాడా

పున్నమి చంద్రుడి. అందం నీలో
వెన్నెల వెలుగంతా నా సొంతం!  


ఓ చిన్నదానా

నీ  జతకోసమే నాప్రాణం
నా మోము సర్వం నీ సొంతం .!


ఓ చిన్న వాడా

పువ్వుల గుబాళింపులు ఆశ్వాదించుదాం!
 ఓ చిన్నదానా
వెన్నెల  సౌఖ్యం పంచుకుందాం !


ఓ అలాగే  ...   ఓ ఓ అలాగే



--((*))__





కలియుగ మానవుడు



గాలిలో కోటలు కడుతున్నాడు,

తన ఆధిక్యతను చాటుతున్నాడు !
ముక్కుకు సూటిగా వెళుతున్నాడు,
ఎవరుఎమిచెప్పిన వినిపించుకోడు !


తాను ఇష్టమైనవి తినలేడు,

ఎవరైనా తిన్న ఒర్వలేడు, ఎవరికీ పెట్టడు !
కాలిలో ముళ్ళుగా మారుతున్నాడు,
ఆవులిస్తే పేగులు లేక్కపెడుతాడు !


ఏమితెలియని అమాయకుడు,

ముద్దిస్తే చాలు చంక నేక్కుతాడు !
అందరి తలలో నాలుకలా  ఉన్నాడు,
అప్పులతో మునిగి ఉన్నాడు  !


సమస్యలను సృస్టింస్తున్నాడు,

తప్పించుకోలేక తాగుబోతవుతున్నాడు !
మంచి చెడు తెలుసుకోలేక,
 కక్క లేక మింగలేక బ్రతుకుతున్నాడు !


నడమంత్రపు సిరి కోసం ఆశకు చిక్కుతున్నాడు,

 కొత్త అలవాట్లు నేర్చకొని భాదపెడుతున్నాడు !
వసపోసిన పిట్ట లాగా వాగుతున్నాడు,
అంతా నాకు తెలుసాని గొప్పగా చెపుతాడు !


ఎగతాళి కైన ఆభద్దమాడడు,

అందరూ  నావాళ్లని సేవచేస్తాడు
పట్టుదల్లో విక్రమార్కుడు
అనుకున్నది సాదిమ్చేదాక నిద్రపోడు !


పెద్దలకు తల్లి తండ్రులకు సేవచేసేవాడు

అనాధులను ఆదుకొని దేశానికి సేవచేవాడు
భాహను బ్రతికించాలని తాపత్రయ పడేవాడు
అన్నిమతాలను ఆదరిస్తూ ఉన్న భారతీయుడు 
--((*))--

*స్త్రీ తత్త్వం


స్త్రీని గోరవించటం పురుషుని ప్రేమ

పురుషుని ప్రేమించటం స్త్రీ ప్రేమ
ఇరువురి మెలికలయక బిడ్డ లా ప్రేమ
స్త్రీ పురుషుల ప్రేమ ఇదేనేమో


స్త్రీ - పురుషుల  ప్రేమలు

ఒక చిరునవ్వో  - ఒక మంచి మాటో
ఒక కనికరపు చూపో - ఒక కైదండయో  
ఒక ప్రోత్సాహ భంగిమమో - ఒక ఆలింగనమో
ఒక మంజుల లేఖయో - ఒక ముఖ వైఖిరియో 
ఒక మధురా పాంగమో - ఒక నడక యో
ఒక భుజ స్పర్శయో - ఒక అప్రయత్ర చుంబనమో
ఒక నయనాల చూపుయో - క్రియాత్మకమగు ప్రేమయో
సహాజ హృదయాలు - తన్మయత్వ కలయిక లే  


ప్రకృతి పరిణామము - ఆత్మాను భూతియే

సమైక్య భూతితో సాగితేనే - జీవనాభ్యుదయమే
ధనము, కీర్తి, మిత్రబృందం - మనబిడ్డలు
ఆరోగ్య బలములు విడిపోవు - ప్రేమబంధమే మిగులు
--((*))--      

Friday, 9 December 2016

రాగం: శుద్ధ సావేరి

నిర్గుణ రూపాయ, నిఖిలాత్మకాయ
సగుణ స్వరూపాయ, శ్రీనివాసాయ. || నిర్గుణ||

1. చింతామణి, భక్త జన ఆశ్రితాయ, అ
నంతకోటి బ్రహ్మాండ నాధాయ, భవ
బంధ దుస్తర భయ నాశకాయ,
మందార వనమాలి, మధుసూదనాయ. || నిర్గుణ||

2. చారు వదన స్మిత సుందర రూపాయ
మరు మదన జనకాయ, మేఘశ్యామాయ
సిరి హృదయవాసాయ సర్వేశ్వరాయ
తిరు వేంకటాగిరి తత్వరూపాయ. || నిర్గుణ||

3. రత్న మణి యంకిత వజ్రకిరీటాయ, విశ్వ
ఛత్ర దివ్య విస్ఫూర్జితాయ, ధ
రిత్రి నాధాయ, దశకంఠ దమనాయ, వట
పత్ర శయనాయ వేంకటేశాయ. || నిర్గుణ||

Pranjali Prabha 

1. నేనొక మోటు మానసిని - నేర్చిన విద్య తక్కువయే
జ్ఞానము పంచె శారదని - ప్రార్ధన తో వరమ్ములను
కోరితి సేవ చేయుటకే.

2. సంఘము కోరి విద్యలను - పంచుట నిల్చి తోడ్పడుట
తల్లియు తండ్రియే మనకు - దీవెన నమ్ము టే కవిగ
సేవలు చేయు టే పనిగా.

3. పొద్దునె లేచి వ్రాయటయు - నిత్యము సత్య మార్గమున 
విద్యయు  ధర్మ మార్గము - దానము చేసి తృప్తి పడె 
జీవన మే దినమ్ము సిరీ.

4. అగ్నిపు నీత లౌఅక్షర - బాణమే నాకు రక్షణయు 
నిర్ణయం విజ్ఞ ప్రేరణయు - వచ్చిన బంధు దీవనలె
నిత్యమూ సత్యమే అగుటే.        

5. కర్తల పాలనా క్రమము - సాక్షిగా మేలు చేయుటయు 
మర్మము బట్టి తెల్పుటయు - శక్తిని బట్టి నేర్పుటయు 
వ్యక్తి గ యుక్తి ప్రేరణయే. 

6. సూక్తుల సాధనే మనకు - సాక్షుల ప్రేమ యే మనకు 
పాఠము చెప్పు గాత్రముతొ - సౌఖ్యము పంచు మార్గమున 
పాలన చేయు టేమనకూ.

7. అక్రమ వక్ర మార్గమున - మూర్కుల కోప తాపమున
తామస వళ్ళ జాతులను - పిచ్చిత నం తొ అనేకముగ 
కష్టము పాలు చేయువక్రా.

8. ఏమియు ఉంది లోకమున - స్వర్గ సుఖాలు ఎక్కడను 
లేకయు కష్ట మే ఉదయ - భానుల తిర్గి సేవలను 
పంచుట యే యశస్సులదీ.

9. ఈ నిశి రాత్రి పువ్వులను - నవ్వుల కాంతి వెల్గులను
రమ్యముగా సరాగమును - తెల్పి సమాన ప్రేమలను 
పంచి సమంగ బ్రతుకుటే.          
     
   


           

Saturday, 3 December 2016

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:

Dance for the Dancer. Love for the Lover.:
సర్వేజనాసుఖినోభవంతు

జయలలితా - 

సార్థకనామ గణాక్షరవృత్తము జయలలితా - 

జయలలితా - జ/య/న/య/య/ల IUII UU - IIII UUI UUI 
16 అష్టి 37838 

జయమ్ముల నెన్నో - జయలలితా యీయు మోయమ్మ 
భయమ్ముల బల్ నీ - వభయము సేయంగ రావమ్మ 
ప్రియమ్ముగ నా యీ - వినతుల నాలించ వేలమ్మ 
నయమ్ముగ నీ యా - నగవులఁ జిందించు మాయమ్మ 

వసంతము వచ్చున్ - వనమున బుష్పాలు పూయంగ 
విసంధియు వచ్చున్ - విరహపు బాష్పాలు రాలంగ 
రసార్ద్రము లెల్లన్ - రమణుఁడు రమ్మంచుఁ బిల్వంగ 
నసీమము నిక్క - మ్మరుసము నిమ్మంచుఁ గోరంగ 

నిరాశయు వద్దోయ్ - నిజముగ నాశాప్రసూనమ్ము 
బిరానను నేఁడే - విరియును మోదమ్ము నీయంగ 
నిరీక్షణమే యా - నిజమగు ధైర్యమ్ము నీకిచ్చు 
వరమ్ముల నెన్నో - వరదుఁడు నీకొసమే దెచ్చు 

అనంతము గాదా - యగపడు స్వర్గంగ మార్గమ్ము 
లనంతము గాదా - యగపడు తారార్క విశ్వమ్ము 
లనంతము గాదా - యవనియు నాదూర తీరమ్ము 
లనంతము గాదా - యనుపమ సృష్టుల్ వినాశమ్ము 

నీ మనికి మార్చునిక.. 
------------------------------ 

మాధురి వృ. 


జయలలిత (నూతన వృత్తము) 

సార్థకనామవృత్తము 

గణములు - జ,య,లఘువు,న,త ( IUI IUU IIII UUI ) 
యతి- 8 

భయమ్మెది లేకుండఁ బనులఁ జేయించి 
జయమ్ముల నీవమ్మ సకలకార్యాల 
రయమ్ముగ నిమ్మట్లె లలిత! సద్భక్తిఁ 
బ్రియమ్ముగ నేఁ బాడి కృతుల మెప్పింతు 

విమోహమునున్‌ బాపి విమల, వాగ్దేవి 
ప్రమాణముగానుండు పలుకులే రాల్చ 
రమాసతితోఁ గూడ రమణనిప్పించు 
ప్రమోదముగాఁ గొన్ని పసిడి నాణేలు 

ఎడందను నున్నట్టి యెలమితో నీకుఁ 
గడంకను నేఁజేయఁ గలిమితో సేవ 
గడించఁగ లేదమ్మ ఘనముగా డబ్బు 
కడిన్‌ దినఁగా నేదొ కలదు కొంచెమ్ము 

విశేషముగా నేది విధియు నీకున్న 
ప్రసాదముగాఁ దల్చి బ్రతుకు సాగింతు 
నసాధ్యము గాకుండ నడుగు నీ సేవ 
ప్రసిద్ధిగ నాకిమ్ము వలయు ధీశక్తి /ధైర్యమ్ము 

హతాశను గాకుండ నడుగువందించి 
సతమ్మును దీవించి జతగ నీవున్న 
వితానముగా గూర్చి విమల వాక్యాల/వృత్తాల 
స్తుతించెదనేనాఁడు శుభదగా నిన్ను 


గణములు - భ,జ,స,న,భ,య 
యతి - 9 

సాధనల సల్పితివి శారదనుఁ గొల్చుకొని భక్తిన్‌ 
బోధనయుఁ జేసితివి మోదముగ నెందఱికొ భూమిన్‌ 
మాధుకరవృత్తిమెయి మౌనివలె జీవనము సాగన్‌ 
సాధువుగ నుంటివొక జన్మమున ధాతయును మెచ్చన్‌ 

వ్రాసితివి గ్రంథములు రమ్యమగు ఛందములనెన్నో 
గాసినిడ నన్నియునుఁ గాలినవి చూడకయె వెల్గున్‌ 
వాసినిడ గల్గెడివి వ్రాతలవి నిల్చినను ధాత్రిన్‌ 
వేసరిలకేవిధిని వెళ్ళితివి నీదయిన దారిన్‌ 

ఈసుగొని కొందఱిల నింపయిన నీకృతులఁ గాల్చన్‌ 
వ్రాసెనటులా విధియె , బాధపడుటెందులకు నంచున్ 
నీ సములు లేరనఁగ నివ్వటిలినావపుడు నేలన్‌ 
వాసరములన్నియును వత్సరములై చనఁగ వేగన్‌ 

చింతలెవి లేవనుచుఁ జిత్తమును సుస్థిరత నుండన్‌‌ 
స్వాంతమున నిల్పుకొని సంతతము విద్యలిడు తల్లిన్‌ 
కాంతలకు దూరముగఁ, గారడవినో తపసి వౌచున్‌ 
దాంతివయి సాగితివి దైవకృప తోడగుచు నుండన్ 

ధీమతిగ సన్మతిగ దివ్యమగు జ్ఞానమును బొందన్‌ 
భ్రామరినిఁ గొల్చితివి భారమనకెట్టి నియమంబుల్‌‌ 
సామములఁ బాడితివి సాదరముతోఁ దలికి నిచ్చల్‌ 
పామరులు పండితులు ప్రత్యహము వందనములీయన్‌ 

గమ్యమునుఁ జేరకయె కాయమది నేలపయి రాలన్ 
కామ్యమది యందకయె కన్నుగవ మూతవడి పోగా‌ 
సౌమ్యతను నీదయిన సాధనయు నెర్గినది యౌటన్‌‌ 
రమ్యకునుఁ గన్నులను రాలినవి బాష్పములు నీకై ‌ 

ప్రేమమెయి వచ్చినది వెంటబడి యీజనమ నందున్ 
నీమనములో నిలిచి నీస్మృతిని నీకునిడి నీతో‌‌‌ 
నీమహియు మెచ్చునటు లెన్నొ నుతులందుకొని ప్రీతిన్ 
కామితము నీకొసఁగి గమ్యమునుఁ జేర్చు మతి తోడన్‌ 

నేమమున నేర్పినది నేర్పరిగ మర్చినది విద్యన్‌ 
నీమదినిఁ బల్కుచును నిత్యమును నీవడుగకున్నన్‌ 
భూమికిని శ్రేయమవ, పుట్టువిది ధన్యమవ నీకున్‌ 
నామ, గుణ గానముల నాణ్యముగఁ జేయ నిడి స్ఫూర్తిన్‌ 
నీమనికి మార్చునిక నివ్వెఱఁగు నెల్లరునుఁ గాంచన్‌ 

క్రొత్త గణములతో పద్యములు - 7 

ఈ రోజు బుధ-గురు-గురు గణములతో కొన్ని అమరికలను మీకు తెలుపుతాను. ప్రతి పాదమును 7.17.17 = 2023 విధములుగ వ్రాయ వీలగును. సూర్య-ఇంద్ర-ఇంద్ర గణములతో (తేటగీతి పూర్వార్ధము) 2.6.6 = 72 విధములుగా మాత్రమే వ్రాయ వీలగును. బుధ గురు గణముల పరిధి, వైశాల్యము ఎంత అధికమో అనే విషయము మనకు ఇప్పుడు బోధ పడుతుంది. కొత్త కొత్త లయలు గతులు సాధించుట సులువు ఈ గణముల ఉపయోగమువలన. క్రింద కొన్ని ఉదాహరణములు - 

చంపకమాల (రుక్మవతి) - UII UUU IIUU 
కానఁగ రావేలా కమలాక్షీ 
గానము పాడంగాఁ గలకంఠీ 
ధ్వానము లేచున్గా వరవీణన్ 
స్నానము సేయంగా స్వరవార్ధిన్ 
(ఈ వృత్తమును చతుర్మాత్రలతో UII UU - UII UU వివరించుట సామాన్యము) 

సాంద్రపదా - UII UUII IIUU 
చూచితి సౌందర్యము నడువంగా 
దోచితి నా నవ్వుల విరియంగా 
దాచితిఁ బీయూషము కురియంగా 
వేచితి నందమ్మును మడువంగా 
(ఇది కూడ ఒక చతుర్మాత్రా వృత్తమే) 

బృహతికా - III UIU UIU 
మధుర భావముల్ నిండఁగా 
మధుర రావముల్ మెండుగా 
మధుర వాహినుల్ పారఁగా 
మధుర మోహన మ్మయెఁగా 

సుందరలేఖా - UU UUU IIUU 
బేలా నీకేలా వగలింకన్ 
శ్రీలన్ దానిచ్చున్ సఖుఁడింకన్ 
చాలే యాయశ్రుల్ జలజాక్షీ 
లీలాలోలుండే తను వచ్చున్ 
(ఇది కూడ ఒక చతుర్మాత్రా వృత్తమే) 

అభిహితా (ముఖచపలా) - UU IIIII IIIU 
రామా రవికులపు తిలకమా 
శ్యామా యదుకులపు తిలకమా 
స్వామీ మనుజకుల తిలకమా 
కామీ వలపులకు తిలకమా 

ఇప్పుడు బు/గు/గు గణములను రెండు మారులు ఉపయోగించుదామా? అలా చేస్తే 40 లక్షలకన్న ఎక్కువ రీతులలో ఒకపాదమును వ్రాయ వీలగును! సుప్రసిద్ధ వృత్తములైన చంపకోత్పలమాలలు కూడ ఇందులో ఉన్నాయి. కొన్ని ఉదాహరణములు - 

చంపకమాల గణములు - IIII UIU IIIU - IIU IIUI UIU 

దినమున నెండలోఁ దను విటన్ - దెలివిన్ విడనాడె గ్లానిలో 
ఘనముగ నెందుకో పులుగులున్ - గసితో సడి లేపె మ్రానిలో 
వనమునఁ బూచెఁగా కుసుమముల్ - వ్యధగా మధుమాస వేళలో 
మనమున నిన్ను నేఁ దలఁతుఁగా - మరులన్ హృది వేఁగ జ్వాలలో 

ఉత్పలమాల గణములు - UII UIU IIIU - IIU IIUI UIU 

నిండెను నింగిలోఁ గళలతో - నెలయున్ నిశిలోనఁ జల్లఁగా 
వెండిగఁ గౌముదీ ద్యుతులఁ దాఁ - బ్రియమై మహిపైనఁ జల్లెఁగా 
మండెను నీదు యా కలలు నా - మదిలో విడకుండ మెల్లఁగా 
దండుగ యయ్యె వెన్నెల కళల్ - తలపుల్ దహియించె నుల్లమున్ 

(ఇక్కడ యతి స్థానము సంపఁగివలె ఒక అక్షరము తఱువాత వస్తుంది) 

మందాకినీ - UU IUU UIU - UU IUU UIU 
నిన్నే వసంత మ్మందునా - నిన్నే లతాంత మ్మందునా 
నిన్నే ప్రశాంత మ్మందునా - నిన్నే ప్రమోద మ్మందునా 
నిన్నే ప్రభాత మ్మందునా - నిన్నే ప్రభాస మ్మందునా 
నిన్నే యనంత మ్మందునా - నిన్నే యనూహ్య మ్మందునా 

టంకణము - UI UIII UIU - III UIU IIIU 
ఏమి మాయ యిది సెప్పరా - హృదయ మెక్కడో వెడలెరా 
నామ మెప్పుడును నీదెరా - నవము నాకు నిన్ వదలరా 
స్వామి నీవెగద నాకు నీ - వసుధపైన నీ యెడఁదలో 
భూమి మిన్ను లీట నేకమై - ముదము నీయఁగాఁ ద్వరగ రా 

సువదనా - UU UUI UUII - IIII UUU IIIU 
కావన్ నన్నిందు కారుణ్యము - కనఁబడ రావేలా నగవుతో 
దేవీ నీకేల నీకిన్కయు - దినముల లెక్కింతున్ గనులతో 
బూవుల్ బుష్పించె నీయామని - ముదముల ఫేనమ్మై వనములో 
దీవెల్ వెల్గింతు నీయామిని- తృషలను దీర్చన్ రా క్షణములో 

సూచన - అన్ని పద్యాలలో సామాన్యముగా గణమునకు తగ్గట్లు పదములు ఉపయోగించబడినవి.



మత్తేభవిక్రీడితములో ఒక మార్పుగా "బుధోత్సాహ" -

మీకు కొన్ని రోజులకు ముందు "బుధోత్సాహ" ఛందమును పరిచయము చేసినాను. ఉత్సాహలో ఎలా ఏడు సూర్య గణములు, ఒక గురువు ఉంటాయో, అదే విధముగా బుధోత్సాహములో ఏడు "బుధ" గణములు (III, IU, UI, IIU, UII, UU, IIII), ఒక గురువు ఉంటాయి. మత్తేభవిక్రీడితములో రెండు అక్షరాలను తొలగిస్తే మనకు బుధోత్సాహపు అమరిక లభిస్తుంది. దీనికి రజనీకాంత అని పేరుంచినాను. అదెట్లనగా -

IIU UII UI UI IIU UUI UUI U - మత్తేభవిక్రీడితము
IIU UII UI UI IIU --IU UIU - రజనీకాంత

క్రింద బుధోత్సాహలోని ఒక ప్రత్యేకతయైన రజనీకాంత వృత్తమునకు నా ఉదాహరణములను చదువ వచ్చును. సాధ్యమైనంతవఱకు గణములకు తగ్గట్లు పదముల విఱుపును గమనించండి.

 
తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితకు 

శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పగుచ్ఛాలు అర్పిస్తున్నాను 

అమ్మ అమ్మా భువి నుంచి దివికి ఎగసినావమ్మా 
మా హృదయంలో నీకున్న స్థానం పదిలమమ్మా 
మా భాదలు,  నష్టాలూ ఎవరికీ చెప్పు కోవాలమ్మా 
నీవు చూపిన మంచిమార్గాన్నే ఎంచుకుంటావమ్మా 

మా కోసం నీవుకన్న కలలన్నీ మేము నిర్వహిస్తావమ్మా 
ఇకలేవని అనుకోవమమ్మా, హృదయంలోనే ఉన్నావమ్మా
మానత్వం నిలిపి అందనంతదూరములో ఉన్నావమ్మా
మా హృదయంతో పుష్పాంజలిని ఆర్పిస్తున్నా మ్మమ్మా 

ప్రాంజలి ఘటించి నీకు వందనాలు ఆర్పిస్తున్నామమ్మా
సత్య,ధర్మ,న్యాయం కోసం పోరాడుతామని శబధంమమ్మా 
అమ్మ అమ్మా మామనసును అంతర్గతముగా చూడాలమ్మా 
అమ్మా నింగి నుండి మాకు హితబోదచేసే జయలలిత వమ్మా

--((*))--       
 కన్నీరుతో సమర్పిస్తున్నది ప్రాంజలి ప్రభ    

తాకఁగఁ దలఁపగు ... 
---------------------------- 

ద్విపద 

ఎండిన తరువులె యెచ్చటఁ గనిన 
కొండల, దారుల గుబురుగ నిండి 

రంగును మార్చియు రాలని యాకు 
హంగుగ నున్నది యద్దిన యటుల 

సతతహరితములు చక్కనివెన్నొ 
తతులుగ నిలువగ దారుల ప్రక్క 

వివిధవర్ణములతో వింతగనుండె 
నవనియంతయును నేఁడందము లొలికి 

మోడులై యుండియున్‌ భూజములన్ని 
వేడుకఁ గొలుపును బెక్కుతీరులుగ 

ఎండిన పత్రము లిలపయి రాల 
పండిన యాకులు పసిడి కాంతులిడ 

నిలుచుని యుండును నింగినిఁ గనుచు 
వెలుఁగుల రేనికి వినతుల నిడుచు 

మారెను ఋతువని మ్రగ్గక మదిని 
నేరము మోపక నీరజాప్తుపయి 

నాశల నింపుక నంతరంగమున 
మాసములెన్నియొ మనుచుండునటె 

నేర్పును చక్కని నీతిని మనకు 
నోర్పునుఁ జూపుచు నుర్విని నిలిచి 

చెందవు కలతలు, సేయవు నింద 
నందము బాసియు నవని మార్పులను 

ధీరత నిలుచును స్థిరమతులటుల 
భారము నొందక బ్రహ్మ చేతలకు 

తల్లియొడిని నున్న తనివియె యెపుడు 
నుల్లసిల్ల నెడద యుర్వరకైన 

ఎండిన శాఖల నెఱ్ఱని యాకు 
పండిన తీరున పసిడి యాకులును 

నిండిన యాకుల నిత్యహరితము 
కొండొకచోనటఁ గూర్చును ముదము 

విరియఁగ రంగులు పృథ్వి నెల్లెడల 
మఱి మఱి మురియఁగ మనమిది లోన 

మిన్నగ సొబగుల మించుచుండి తరు 
లెన్నియొ కనఁబడ నింపుగ నెదుట 

దాకగఁ దలఁపగు తరుశిఖరముల 
నాకుల యందము లావిధి జూడ 

   
  




హృల్లయ - 

నేను కల్పించిన ఈ హృల్లయ కూడ లయగ్రాహి వర్గమునకు చెందినదే. ఇందులోని పంచమాత్రా గణములు వరుసగా సల/భల/సల/భల/సల/భల/సల/గగ. ఒక గణము లఘువుతో ఆరంభమయితే, తఱువాతిది గురువుతో ఆరంభమవుతుంది ఇందులో, అందువలన గతిలో ఒక వైవిధ్యము కలుగుతుంది. లయ వృత్తములకన్నియు ప్రాసయతులే, కావున దీనికి కూడ ప్రాసయతియే. క్రింద నా ఉదాహరణములు - 

హృల్లయ - స/జ/న/జ/భ/న/ర/న/స/య - రెండేసి గణములకు ప్రాసయతి 
IIUI UIII - IIUI UIII - IIUI UIII - IIUI UU 
30 మహః 334228460 

సూచన - సామాన్యముగా పుస్తకాలలో ఛందస్సులు 26 సంఖ్యవఱకే. రమణకవి దానికన్న ఎక్కువగా ఉండే సంఖ్యలకు కూడ పేరులను పెట్టినాడు. 27- భూ, 28 - భువః, 29 - సువః, 30 - మహః. 


6 - సుగంధి UIII UIII - UIII UIII - UIII UU

రాముడికి  జానకికి   - లగ్గమును  చేసిరట   - పోద మిపు డేనూ
పల్లెలలొ  గ్రామములొ - సంబరము సంతసము - మేళముల తోనూ
ఆకులతొ  పందిరిలు - బ్రాహ్మణులు క్షత్రియులు - ఒక్కొకరు వచ్చే
విశ్వమిత్ర,  బ్రహ్మపుత్ర - జ్ఞాన సుధ,  దివ్య భవ - అందరును వచ్చే

అమ్మలక్కలు ఆలు బిడ్డలు అత్తమామలను
వీరు వారును కాదు అందరు కల్సి వచ్చియును
అందర్నీ ఆత్మీయంగా ఆదర్శంగా ఆహ్వానించియును
భూలోకములో స్వర్గమును తలపించే ఏర్పాట్లను
 
శివధనస్సు ఎక్కుపెట్టదలచి రాజులు వచ్చిరి
సీతను చేపట్ట దలచి ఆతృతగా రాజులు వచ్చిరి
విశ్వామిత్రునితో సకల గుణాభిరాముడు వచ్చిరి
వసిష్ఠుడు మునివర్యులను శిష్యులను ఆహ్వానించిరి 



శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0901)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,
కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,
నీ కటాక్షము మా కనేకథనము,
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.
నీ సహాయము మాకు నిత్యసుఖము,
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,
నీ పద ధ్యానంబు నిత్య జపము
.
తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత !
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!