Monday, 15 June 2026

 


పేరు ప్రాంజలి అష్టకం 

ప్రాంజలి.. అది 


నేటి చందస్సు పై పద్యం 


UIIU- IUIU- IUUU -UUUU


మానధనంబు శోభగన్ మనో నేత్రంబున్ మౌనార్ధంబున్ 

జ్ఞానశుభంబు జ్ఞప్తిగన్ జ్ఞానార్ధంబున్ సంభావ్యంబున్ 

ప్రాణవినోద మార్గమున్ ప్రభావార్ధంబున్ భోగంబున్ 

వీణనినాద సంతసమ్ నిజాధ్యానమ్ విశ్వాసంబున్ 


సరళ భావం

మానం అనే ధనం మనిషికి శోభను తెస్తుంది. మనోనేత్రం (అంతర్దృష్టి) మౌనంలోని అర్థాన్ని గ్రహించగలదు. జ్ఞానం శుభప్రదమై, స్మృతికి ఆధారమై, జీవనార్థాన్ని తెలియజేస్తుంది. ప్రాణానికి ఆనందాన్నిచ్చే మార్గం ప్రభావవంతమైన జీవనానుభూతిని ప్రసాదిస్తుంది. వీణానాదం కలిగించే సంతోషంలా, నిజమైన ధ్యానం విశ్వాసాన్ని పెంపొందించి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.

****

ధర్మగుణంబు దారిగన్ దయాదీపంబున్ సౌఖ్యంబున్

కర్మఫలంబు జ్ఞాపిగన్ సకా లంబున్  సత్యార్ధంబున్

నిర్మలచిత్త హారమున్ నిజానందంబున్ యోగంబున్

మర్మమెరిoగి ధర్మమై మనోమార్గమ్ సామాన్యంబున్


సరళ భావం:

ధర్మగుణం జీవితానికి దారిచూపుతుంది. దయ అనే దీపం సుఖశాంతులను ప్రసాదిస్తుంది. మనిషి చేసిన కర్మల ఫలితాలు కాలక్రమంలో సత్యార్థాన్ని తెలియజేస్తాయి. నిర్మలమైన మనస్సు హారంలా అలంకరించి నిజమైన ఆనందాన్ని, యోగాన్ని అందిస్తుంది. జీవన మర్మాన్ని గ్రహించి ధర్మమార్గంలో నడిచినవానికి మనోమార్గం సులభమై, సామాన్య జనులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది.

*****

చల్లగనౌను సఖ్యతా సమానంబున్ హృద్యా

నందమ్

మెల్లగనౌను శోభగన్ మనోమాయల్ మాధుర్యంబున్

పల్లమునీరు వేగమున్ ప్రభావంబుల్ ప్రా వీణ్యంబున్

తల్లిగనౌను నిత్యమున్ తపో ధ్యానమ్ సేవార్ధంబుల్


సరళ భావం:

స్నేహం సమానత్వంతో ఉంటే అది చల్లని అనుభూతిని కలిగించి హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. మెల్లగా పెరిగే శోభ, మనస్సులోని మాధుర్యాన్ని వెలికితీస్తుంది. పల్లంలోకి నీరు వేగంగా చేరినట్లే, నేర్పు మరియు ప్రావీణ్యం సాధనతో అభివృద్ధి చెందుతాయి. తల్లి ఎల్లప్పుడూ ప్రేమతో సేవ చేసినట్లే, తపస్సు మరియు ధ్యానం కూడా సేవాభావాన్ని పెంపొందిస్తాయి.

*****

నేటి చందస్సు పై పద్యం 

ప్రాంజలి ప్రభ అష్టకం.. ద్వితీయం  - IUIU- IUUU -UUUU-UIIU


సహాయమే సమానత్వమ్ సాహిత్యంబున్ గీత నిధీ 

సహాసినీ సుధాతత్త్వమ్ సామర్ధ్యంబున్ కాల విదీ 

ప్రహాసమున్ ప్రభావంబున్ ప్రాదాన్యంబున్ జ్వాల మదీ 

విహారమున్ విధానంబున్ విశ్వాసంబున్ ధార గతీ 


సరళ భావం:

సహాయం చేయడం సమానత్వ భావానికి నిదర్శనం. అది సాహిత్యంలా, గీతంలా జీవితానికి నిధిగా నిలుస్తుంది. చిరునవ్వుతో కూడిన సుధాతత్వం సామర్థ్యాన్ని పెంపొందించి కాలాన్ని సద్వినియోగం చేయడం నేర్పుతుంది.

ప్రహాసం (ఆనందభావం) వ్యక్తి ప్రభావాన్ని పెంచి ప్రాధాన్యాన్ని కలిగిస్తుంది. విహారం, విధానం, విశ్వాసం కలిసినప్పుడు జీవనప్రవాహం సరైన ధారలో సాగుతుంది.

******

సదాశయంబు సౌఖ్యంబున్ సార్థక్యంబున్ జీవనమున్

విధానవిద్య మార్గంబున్ విజ్ఞానంబున్ మానసమున్

ప్రధానమున్ సమానంబున్ విశ్వాసంబున్ లోకమునన్

మదీదయంబు శాంత్యంబున్ శోభంబేనున్ కాలమున్ ॥


సరళ భావం:

మంచి ఆశయాలు జీవితానికి సౌఖ్యాన్ని, సార్థకతను ప్రసాదిస్తాయి. విధానపూర్వకమైన విద్య, విజ్ఞానం మనస్సును సరైన మార్గంలో నడిపిస్తాయి. ఈ లోకంలో సమానత్వం, విశ్వాసం ఎంతో ముఖ్యమైనవి. నా దయ, శాంతి భావాలు కాలానుగుణంగా జీవితానికి శోభను చేకూరుస్తాయి.

********

కళామయంబు కావ్యార్ధమ్ కామ్యార్ధంబున్ కనులుగా 

శిలామయంబు సంభావ్యమ్ శ్రీమాన్తత్త్వం బేగమనా 

స్వలాభమౌను సఖ్యార్ధం సౌజన్యంబున్ కాలముగా 

నిలోత్పలా సమాధానమ్ నిర్వాహంబున్ సౌమ్యముగా 


సరళ భావం 🌹

కళలతో నిండిన కావ్యం మనకు ఇష్టమైన భావాలను కళ్లముందు నిలుపుతుంది. శిలవలె స్థిరమైన ఆలోచన, గౌరవనీయమైన తత్త్వాన్ని త్వరగా గ్రహించేందుకు సహాయపడుతుంది. స్నేహబంధాల అసలైన ప్రయోజనం పరస్పర లాభం కాదు; సౌజన్యంతో కాలాన్ని సార్థకం చేయడమే. నీలకమలంవలె ప్రశాంతమైన సమాధానం, జీవిత నిర్వహణను సౌమ్యంగా చేస్తుంది.

******

No comments:

Post a Comment