Sunday 29 October 2023


నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


01..అమ్మ మమ్మేలు యమ్మ ఆశ్రిత మదిని

నమ్మ కమ్మగు తృప్తి నటనలు కావు

చెమ్మ నీటిని త్రాగి చెరితము తెల్ప

వమ్ము చేయని మాట వరమగు దేవి


 002.రసిక లెల్లరు చదివి రసరాజ్య మేలు

రసిక హృద్యమ్ము మెరుపు రంగమ్ము లేలు

పసి హృదయములు కదిలె పండుగ లందు

 విసన కర్రలు వాడు వేడి తాపముకు 


 003.. మంచి యన్నది తెల్పి మార్గమ్ము జూపు

ఎంచు కున్నది జూపి యల్లరూ సుఖము

తరుచు పండేది మనసు పందాలు కావు

 మరచి కష్టాలు తాకు మానవత్వమగు


04. దిబ్బ రొట్టెయనిన బుర్రదిబ్బ బూరె

అబ్బ నామమ్ము సిందూర మాయ మోము

నవ్వు లొలికెడి బుద్ధుడై నయన విందు

ఏమి చిత్ర విచిత్రము ఏల చెప్ప


05.బంధ మైన బాధయనక పలక రింపు

అందు బాటు పనులు చేయ అలక లేక

వయసు వుడికి మేధస్సును వరుస జూప

ఆడ వారైన ఓర్పుతో ఆశయమగు


06..ఎగసిన అల, తలను వంచె ఎల్ల లందు 

మిడిసిపడిన తల మిడతై మినుగురు లగు 

ఎత్తు పెరిగిన చెట్టుయే ఎగసి వంగు 

ఎంత వారైన కాంతకు ఏలి కొంగు


07..మనిషి గొప్పతనం అంద మేను కాదు

 అంద మన్నది మంచిగా ఆద రణయు 

 నాలుక ఆధారమేయగు నటన కాదు

పలుకులో పరమాత్మగా పాఠ మవ్వు


08..నీటితో స్నానమును చేసి నిత్య యమ్ము

వారు బట్టలు మాత్రమే మార్పు జేయు 

చెమటతో స్నానమును చేసి చింత మార్చ

వారు చరిత్రనే మారుస్తు వగచి తెల్పు


09..సూర్యకాంతిన చిక్కియు సూత్రధారి

 సూర్య కాంతమ్మ  నటనలో చూపు వేరు

 కంట నీరు పెట్టించెడి కంచు ఘంట 

శత జయంతిగా మరువలేని సాక్షి మాత


10..సంతసమ్ముగా కదిలేను సహన పరులు

బంధు వర్గము ఆడియు భాగ్యపరులు

 కాంతులు నవరాత్రులు తృప్తి కనకమగుట 

 పొద్దుటూరు నరాత్రి పొద్దు వొడిచె


11..కం.వద్దని యన్నను తప్పదు

మొద్దును ముద్దుగను పిల్వ మోముగ సాదన్

 మద్దెల దర్వును మోయుచు

ప్రొద్దున రాతిరి విడిచెను పోరుగ ఊరుణ్


12.. వద్దు తల బాదు డొద్దురా వరుస పెట్టి

ఇద్దురా నీవుకోరిడి ఇప్పుడేను

పాల పీక కావాలని బాద వద్దు

ఆట ఒప్పురా మనసుతొ ఆడవద్దు


13.. చిలక కొట్టుడు కోరి చిన్నదియు చేరి

వలక బోసె వయ్యారము వలపు ముగ్ధ 

పలుకు లేల పనులు జేయ పెదవి నీది

 థలుకు అందమైను ఇదియు తమరు కోరె


14.ఉ.మంతయు ఘాటుగా సరసమేయగు కొత్తయు పాత పధ్ధతే

పంతము కోపతాపములు పాపిడితీయగ మోహతాపముల్

వింతగ చెప్పలేకమది వేడిగ చల్లగ పిక్కలాటలే

సొంతము బంధమేయగుట సోకులుసాంతము ఇచ్చి పుచ్చుటే


ప్రాంజలి ప్రభ..25/10/2023


నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


15. కం.గుణముల రాయుని పూజలు

గణములు కలసియు మనస్సు గాఢత కోరిన్

గణగణ మనుచు సతతమును

ప్రణతులు గణనాధునకును  పరమాత్మునికే


16. గీ. అమ్మ మాటలు వినినను అలక తీర్చు

 గొప్ప లవి కూడు పెట్టును గోల యున్న 

 శ్రీ పురుషుల కళలు చూడు సిరులు పెంచు

మాయ మోహిని మాటలు మనసు చెరచు


17.గీ. సంధ్య చుక్కల చీరలో సలప రింత

    తలను నెలవంక, కుసుమాల థలుకు మాల

    సూర్య నయనాలు ముడ్చియు సూత్ర నిద్ర

    అందము అడవి వెన్నెల అగుట తీరు


18..పద్యభారతి వారి దత్తపది.ధనము..నాలుగుపాదాలలో ...నేటియువతకు అవసరమైన విద్య..

ఉ.  మానవ లక్ష్యమే ధనము మానస ధర్మము నిత్యము సత్య వాక్కులే

జ్ఞానము పంచు సాధనము జ్ఞప్తిసహాయపు విశ్వవాటికన్

మానము సర్వలై ధనము మాయలు మార్చెడి మాధనమ్ములున్ 

హానికి అడ్డుయే ధనము హాస్యపు నేరము హ్లాదమే యగున్


19..చం.మనసున మాత్ర'మెన్నయును మాత్రల చిల్లర హస్త మేనురా

చినుకులు మాదిరే వినయ చేష్టలు ఆదరణమ్ము చూపురా

అణువణువేను భారతపు నేత్రపు సార్వ జనీయ బంధమే

మనిషిగ భిన్నమైనను సమానము గౌరవమేను జీవితం 


20..ఉ..కృత్యము కింత భీతి మది? కిమ్మని తోఁచదు యేమి నీకు? నో

 నిత్యము ప్రేమ నందు నొక నీడగ నుండుట, చెందెనేనియున్

 సత్య వడంకదే? నభము సారము మ్రోయును వార్ధులింకవే?

 ముత్యము సాప్త బింబము సు ముఖ్యము గానులె స్త్రీల మాలగన్


21.. గీ. తార చంద్రుల వెన్నెల థలుకు బెలుకు 

ఓహొ జగమేకదెలెనుగా ఓర్పు జూప

రసమయిన జగమున తెలే రవ్వ వెలుగు

ప్రకృతి పరవశమును చెంద ప్రతిభ నటన


22. శా..శాశ్వతమ్మగు వాయువే లహరై శ్వాసించ సర్వమ్ముగన్

విశ్వాసమ్మగు పార్ధునీ పలుకే వేనోళ్ల జాడ్యమ్ముగన్

ప్రశ్వశ్యామలమై గణాల పిలుపే సామాన్య నుత్సాహమున్

హ్రస్వమ్మే నయనాలవిందు కలిగే హృద్యమ్ము భావాత్మకన్


ప్రాంజలి ప్రభ..26/10/2023


నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


తే. జీవన కెరటాలను ఆప జీవి ఎవరు

    పోరు నైపుణ్యమే నేర్పు పొదుపు వృత్తి

    ప్రకృతి ప్రభలుగా మనసు పై ప్రతిభ ఏది

    కాల నిర్ణయమే కధ కళలు కావు..23


గీ. పుట్టు ఏడుపు సంతస పుడక జీవి

     మధ్య నడమంత్రపుశిరులు మనసు పీకు

     బంధ కష్టనష్ట కుటుంబ భాద్యత మది

     గిట్టు టే మంచి గుర్తింపు గెలవ గలుగు..24


గీ. గల్లి లో పురోహితుడు చెప్ప గమ్య మైన

     దారి కత్తికి భాష్యము దివ్య మార్గ

     పెళ్లి కూతురే లేకుండ పెళ్లి జరిగె

     విందు భోజనాలు జరిగే వినయ వేళ..25


ఉ. పట్టిన కట్ట పాశమది పాఠము నేర్పెడి పట్టుచీకడే

 గట్టిగ పట్టుబట్టినను గమ్యము తెల్పెడి గొప్పధీరుడే

 గుట్టుగ రట్టుచేసియును గుర్తులు చూపెడి గోలచేసెడే

 చిట్టిగ చిన్నవాడనియు చింతను మాపెడి చిన్ని కృష్ణుడే.26


ఉ.వేదనలయ్యె మాబ్రతుకు వీసముమార్పులు లేవు లేవులే

రోదన తప్పదా చితికి రోటికి దెబ్బలు మార్చ లేరులే

 భేదము చూపలేని గతి భీరుని హీనతి జీవితమ్ములే

 వేదము లెన్నియున్న మతి వీనుల విందులు మార్పు రావులే..27


ప్రాంజలి ప్రభ..27/10/2023

నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు 


గీ.అబ్బొ అమ్మాయి అర్భాట అంద రందు

దిష్టి చుక్కల మౌనము దీన మందు

శుభములనిడు రాణి యగుట సుఖము కలిగె

అభయ వలయముల్ తెలుపుట హరిహరులగు..28


ఉ.నవ్వుల చిందులేనయని నాట్య మనోభవ సుందరే మరీ

 పువ్వుల మధ్యన మగువ పున్నమి వెన్నెల తెచ్చినే మరీ

 రివ్వున సాగుతార యది రెల్లువ రేణువు మాదిరే మదీ

తవ్విన కొద్ది తెల్పు మది తక్షణ తాపపు తత్వ భావమే..29


ఈ సమస్యకు నాపూరణ. 

కొందమటన్న వీలగునొకో తృణముం బది లక్షలిచ్చినన్*


చందన చర్చి తా మగువ చేరి మనస్సును తెల్పలేకయన్

 ముందర మొహమే ముదిత మోక్షము తట్టగ బుద్ధి మారునన్

కొందమటన్న వీలగునొకో తృణముం బది లక్షలిచ్చినన్

 పొందెటి భావభవ్యములు పోయెడి కాలము ప్రేమలే యగున్..30


ఉ. మంచిని పెంచి శాంతిగను మానస బుద్ధియు నేస్తమేయగున్

మంచువలేసహాయమును మంత్రము మాదిరి విన్నవించుటే

పంచుకోనేటి సంపదయు ప్రాణము మాదిరి ఇచ్చి పుచ్చుకో

దంచుట దుష్టచేష్టలను దారికి తెచ్చుట మానవత్వమున్.31


కన్నులలోన వెల్గుల వికాసము రెప్పల చాటునేయగున్

మన్నన పొందు చూపులవి మాయలు చేసెడు మౌనగీతికా

తిన్నని నవ్వులే యవియు తీరున ముద్దుల కోర్కెలేయగున్

మన్నన కోరుటే మగువ మానస తీరును చెప్పగల్గుటన్.32


గీ.భూరి శోభలేలు మనసు భుక్తి కోరి

లోక నితిగమనించియు లోలకమగు

భళి భళి యను భోగవాళి బ్రతుకు తెరువు

మూర్తి  దీవెన సఫలము ముఖ్య మౌను..33


గీ.మాట మధురత భావము మనసు చేరు 

నవ్వులో స్వచ్ఛత సహజ నటన చూపు

మోములో ప్రశాంతత నవ మోహనమ్ము

నటన లోన నిజాయితీ నమ్మ బలుకు..34


కానని కోరికే కదిలె కావడి కుండల మోయలేకయే

మానస బుద్దియేను యనుమానము లెవ్వియు వీడకుండగన్

బానిస లౌదురే విషయ వాంఛల యందున మత్సరంబునన్

మానవ తెల్వితేటలవి మాయకు చిక్కియు వేంకటేశ్వరా''35


గీ. ఏ పరిస్థితి నైనను ఎదురు యనకు

యిది భరించ యాలోచనా ఇష్ట పలుకు

కాని గర్వాంధ కారము కలలు తీరు

ఇష్ట ఇష్టాలు మనుగడ ఈశ్వరేశ్చ 

***

 నిత్యోదయాలు.. సీస పద్యము 


నిత్యోదయాలుగా నిత్యావస్థలు ఏలు 

నిత్యకర్మలు ఏలు నియమ మందు


ప్రకృతి గాలి కదలి ప్రతిభ మెల్లగ లేపి 

తనువును తాకియు తపము చెందు 

ఉదయపు కాంతులు ఊయల ఊగుచు 

కిటికీన దూరియు కెలుకు బిందు


కళ్ళలోకిని చేరి కనికరమును జూపు 

నిలబెట్టి నటనలు నెమ్మగించు 

పక్షులుకిలకిలా పకపక అరచియు 

బద్ధకం విడిచియు పడక నెంచు 


బయటకు రమ్మని భగలు గోలలు చేసి

ఉద్యాన వనాన ఉరక నెంచు 

గుడిగంటలే మ్రోగి గుర్తుగా సుప్రభాత

కీర్తన గేయాలు కెవ్వు మనుచు


రారమ్మనుచు పిల్వ రక్తియు శక్తియు 

భక్తిని పెంపొంది భవ్య మనుచు 

ఉత్సాహ పరచుటే ఊయల దేహాన్కి 

మనసును తట్టియు మమత పంచు


గీ.పనులకు ఉసిగొలిపి గొప్ప ప్రాప్తి చెందు 

కడుపు ఖాళీని నింపుతూ కళలు పంచు 

పేగులు గొడవ తగ్గియు పిలుపు మంచు 

కమ్మని కవితలను జెప్ప కలము నాది


సీస పద్యం 


ధర్మమే భక్తిగా ధరణికి నేస్తమై 

విధిఅమితాసక్తి విద్య నౌను 

తన అసాధారణ తపము సత్యము గాను 

జ్ఞాపక శక్తియు సాధ్య మౌను

విషయ పరిజ్ఞాన విజయము ఆసక్తి

సర్వసాధారణ సహజ మౌను 

 అందరిలో స్ఫూర్తి ఆలనా పాలన 

ఆటైనా పాటైనా ఆత్ర మౌను


గీ.ఇందులో ఇసుమంతైన ఇష్టముంది

 అతిశయోక్తి అనక నుండు ఆది నుండి 

 రంగవల్లులు ముంగిట రంగు లద్ది 

దినకరుడగాను ఇష్టమై దివ్య వెలుగు


ప్రాంజలి ప్రభ..29/10/2023

నేటి నా ఆలోచనా లలిత శృంగార భక్తి పారవస్యపు పద్యాలు

గీ.నీరు నింగిముద్దాడాలని కలలుగను

నీరు పృద్విని తాకుతూ నీడ దోస్థి

మన్ను మిన్నుకలుపుజలం మనసు కడలి

కడలి పరువమ్ము  పరవళ్లు కలవర మగు


ఉ. తోరణమౌనువిద్యభువి తోడ్పడునిత్యము సర్వులందునన్

ద్వారమె విశ్వ వాహినియు దాతగ నేతగ విశాలశాలకున్

భారత మాత బిడ్డలను భూగ్యము సంతస సంస్కృతీడగన్

కారణ శక్తి యుక్తులకు గాంచెను భూతల మానవాభ్యుగన్


గీ. ఈర్ష్య , అనుమానము, అసూయ ఇప్సితమ్ము 

రెండు కనులలో నలుసుగా రగులు యగ్ని

మనము స్వచ్చమైన నిర్మలమైన మనసు

నుంచ గలిగినా ఆనంద ను డికరమగు


గీ. ఉన్న గుర్తుకు రాకయు ఊహ పెరుగు

అర్ధ సంపద తెలియదు ఆశ యదియు

లేని దాని వెంట బడినా లీల మారు

కాలమే బుద్ధి చెప్పును కథలు తీరు


గీ.తెలివి మీరిన తనువు బుద్ధి తెప్ప రిల్లె 

మరిచె వినయాల వాలకం మనసు నెంచె 

మనసున తరించ స్వార్థాన మభ్య పెట్టి 

చరిచె విలువైన మానస జపము నెంచి


గీ. తల్లి పేగుబంధము ప్రేమ తరము తరము

తండ్రి విద్య శక్తి వినయ తరము తరము 

నవసమాజం మనిషి గుర్తు నటన తరము 

జీవితం నిత్య పన్నీరు జీవ యాత్ర


గీ.కళల జాబిల్లి నందాలు కనుల విందు

యాకసాన వెలుగు కాంతి యద్భుతమ్ము

గ్రహణము విడిపోవయదియు కళలు జూపు

నిత్య సంతసమ్ము జనులు నియమ భక్తి


ఉ.కన్నులు మాయతొల్గెను సకార్యము నందున దైవ నిర్ణయ

స్సన్నిధి అంబరాన కళ సాగెను వెన్నెల మధ్యరూపమున్

వెన్నెల మారుటే గ్రహణ వీక్షణ సంబ్రమ తొల్గిపోవగన్

మన్నిక దేహతాపమది మానస మందిర మెప్పుకోరియున్


మూడో ప్రపంచ యుద్ధం? వస్తే 

సీస పద్యం..


ఆధిపత్యమునకై ఆరాటపడుతుంది

పాముపడగక్రింద ప్రాకు లాట 

యుద్ధాన్ని కోరుతూ యుద్యమ నేతలు 

యువతీయువకులుగా యూగు లాట

శాంతినే కోరుట సహనపు మౌనమే 

ప్రజలలో అలజడే ప్రగతి ఆట 

 అలల సముద్రము ఆరాట యుద్ధము 

ఆకాశ మేఘాల ఘర్షణాట 

 చెలరేగెడి తుఫాను చింతకు చేరువ 

బీభత్స రణమౌను భీకరాట


గీ.. పీనుగల లోక మవుటయే హీన కళలు 

రక్త సిక్తమవ్ రణరంగ రక్ష ఆట 

మనము రణమౌన శరణమా ముఖ్య మౌను

 ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత 

***

సీస పద్యము 


మనిషి పెదాలతో మనుగడ ఆటగా

 పలికించెడి పెదాలు పలుకు నిజము

 పద్ధతి ప్రేరణ పదనిస రాగాలు

 పెద కౌశిలపు తీపి ప్రేమ నిజము

పరిమిళాల పెదవి పడచు పొందుసుఖము

ఆనంద డోలిక ఆట నిజము 

 ప్రాణమై బ్రతికించు పరువాల జంటగా

బిడియాల గుర్తుగా బిడ్డ నిజము


గీ..ఏరి కూర్చి పలుకు కూడు ఏర్పడుటయె

     అమృత నాలుకకు పనియు ఆశయగుట

     కొత్త సృష్టికి మూలమై కోరు కొనుట

      జీవితం ఒక పాఠము జీవ యాత్ర

            ***

జ్ఞానమే సుఖమార్గం మమ్మా సాహిత్య సామాన్య మమ్మా

మానవాళికి శక్తిన్ మిమ్మూ మానమ్ము నిర్ధుష్ట మమ్మా

 మౌనమే విధి వేగన్ మమ్మా మార్గమ్ము తెల్పాలి యమ్మా

ధ్యానమే సరి దివ్య మ్మమ్మా ధర్మమ్ము తెల్పాలి యమ్మా 


మానవుల్ సిరులెన్ని యున్నన్ మంత్రమ్ము మాయేను మమ్మా

మనసే విధి యాట లేలన్ మచ్చేల పెర్గేను మమ్మా

కాననమ్మున నున్నపూజ్యుల్ కర్తవ్యంమే తీర్చుమమ్మా

వాణిగా మది విద్య యిమ్మూ వాత్సల్య మేసేవ దేవీ


.మానసమ్ము వినోద మమ్మా మార్గమ్ము మాధుర్య మమ్మా 

 కానరాని సహాయమేలే కాలంబు వై నంమ్ము మమ్మా 

కానిదై సహనమ్ము మేలే కార్యము సంతోష మమ్మా 

 రానిదైన సుఖమ్ము మేలే రంజిల్లు వెల్గు యె దేవీ

మల్లాప్రగడ..పూరణ
సమస్య:
అంధుడుగాడు వర్ణముల యంతరమింతయు గానలేడయో
ఉ.
బంధువు లన్న రాత్రి సెగ బంధన బుద్ధిగ గొప్ప నీతులౌ
సంధులు హృద్య మందుననె సంతత భాధల వర్ణమేయగున్
రంధివలే మదీయ కళ రమ్యత వర్ణమె గొప్పదన్న,వా
డంధుడుగాడు వర్ణముల యంతర మింతయు గానలేడయో
గీ.శ్వాస మీద ధ్యాసగమార్గ చాకి రేవు
ధ్యాస మీద కామ్యపుమార్గ కాల రేవు
ద్రష్ట మీద దృష్టిని పెట్టు ధర్మ రేవు
సాక్షి సాక్షిగా ఉండడం సమర రేవు
అంబర మన్నదే మదిని ఆడుట ఉన్నత తీర్పు లేకయున్
సంబర బత్కు తెప్పలగు సందడి లేకయు తేలిపోవుటన్
చుంబన దేహమే యలిగి చూపులు మారుట ఆశపాఠమున్
అంబగ నిస్సహాయమగు అంటుగనుండక రెప్పమాటునన్
ఏదియ చేయురో యదియు ఎంత యనేదియు నాకు పంచుటే
వాదిగ భక్తి తత్త్వమున వాలుగ చేసిన నాదె బాధ్యతే
మాదిరి దానమిచ్చినను మానసమే గతి యర్పనేయగన్
ఏది తపస్సు యన్నగతి ఎల్లరు లక్ష్యము మారకుండగన్
వంటి మీద వీసమెత్తు సొమ్ములు లేకుండా
కంటిచూపు కానవొచ్చు సోకుగ ఏకం మై
తోట నంత దున్ని ఓర్పు నాడిని చేర్చం గా
చేట తన్వి ఘర్మ బిందు సోకుగ భోగమ్మే
ప్రాంజలి ప్రభ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు హరిహరుల దర్శన అనంతరము ఆలోచన నేటి పద్య కుసుమాలు ( అహోబిలం యాగంటి నవనందుల దర్శనము) గీ. ధరణి కంటి రెప్ప విసిర ధాత్రి గాను సూపు నందు నిలిచె శోభ సూత్ర మౌను ప్రొద్దు పొడుపులా కడలిలో పొంగు గాను నిద్ర లేని రాత్రి పగలు జీవి గాను గీ.ఉన్నది అసలేన్నని యన ఊయలగుట ఎన్ని నాళ్ళని వేచేది ఏల యనుట ఎంత అందమానందము ఏరు యగుట పరిమళం అనుభూతియు పరమ మొగుట గీ.కలువ రేకుల కన్నుల కాల మహిమ సరిగ జూపెడి కళలగు సమయ మహిమ విసిరి ఒంటిగ నడిచెడి వినయ మహిమ పడుచు వాని గుండె పగలు పడతి మహిమ గీ.మనిషికీ సుఖ సంతాన మేను శుభము గుణము గోప్య విశాలమే గుర్తు శుభము జ్ఞానమును పంచి పొందుటే జ్ఞాని శుభము జ్ఞానమునకు ఓర్పు మనసు జాతి శుభము గీ.సూటిగా చూపు గెలుపుకు సూత్రమగుట దిక్కులన్ని జూడ గెలుపు చిక్కులగుట ప్రకృతి అనుకరణ కలిగి ప్రతిభ లగుట తరువు లా కష్టమును పంచ తనువు లగుట గీ. పగలు రగిలి పంతముననే పడక జూప సెగల బ్రతుకులో చినుకులు సిగలు జూప వగలు మారి ఓటు మనకు ఓర్పు జూప మగువ రాజకీయము నేడు మాయ జూప గీ. వేకువ వినిపించు పలుకు వింత గొలుపు క్రొత్త గాన మలుపు చింత కోరి గెలుపు కాంత లాలన పాలనా కాల మలుపు ప్రేమతో పిలుపులె జీవి ప్రీతి సలుపు గీ.పెదవులపయిన పలికెది పిలుపు జూపు ననగ నదియును నయనాల నమ్మ జూపు కష్ట కనికరమగు దుఃఖ కనుల జూపు పెగలు చిలికెడి తెగువుగా పిడచ జూపు గీ.పెదవులపయిన పలికెది పిలుపు జూపు ననగ నదియును నయనాల నమ్మ జూపు కష్ట కనికరమగు దుఃఖ కనుల జూపు పెగలు చిలికెడి తెగువుగా పిడచ జూపు గీ. వనితలందు మూలపు కళ వలపు చిగురు వనిత నలుపు తెలుపు కాదు వగలు పొగరు చినుకు కోసమే చరితగా చిగురు వగరు మనము మానసికము సుఖ మాయ లహరు గీ. శరీరం పునర్జీవితం శబధ మౌను మనసు పూర్వమై అతకదు మౌన మౌను నమ్మకం పోయి నలిగిన నటన నౌను మొక్కలైన బ్రతుకు లేని మోక్ష మౌను గీ. వెన్న కన్న మెత్తనిదేది వినయ మేది జగతి లోనసుందర మేది జాగృతి ఏది మన దయాళు హృదయమేది మనసు ఏది అన్యుల వెతల కగు దయా కరుణఏది గీ.ఇద్దరి అనుబంధ ప్రక్రియ ఇప్సి తమ్ము పుస్తకమ్ము పేజీలగా పురులు విప్పు ఏళ్ళ సమయమ్ము సాగేది ఏరు వాక క్షణము ఊపిరాగుట ఎండ క్షేత్ర మౌను గీ.వయసుకుబిడియమున్నది వరుస కాదు కొత్తపాతయు లేదులే కోరు విద్య నాట్య సంపద నటనకు నాంది యగుట సర్వ ఇంద్రియ యుపయోగ సమయ మనిషి

చీకటి తరిమే వెలుగుల ఆటవెలది రచన.. మల్లాప్రగడ ఆ.తీరని దిగులంత తీరిపోయేలాగ చేరగలగు తీరు చేరువగుట తెరల మాటు కధల తీరు కోరిక దోచు పొరలు తొలగ గలిగి పోరు వెలుగు ఆ.నీడ కలతలన్ని నిజము కరిగిపోయె తోడు నీడ నేను చేయికలిపి వీడక వెను వెంట వాడుకలా వచ్చి అడుగడుగు కనబడు ఆశ వెలుగు ఆ.కల్ల నిజము ఎరుక కళలు విశద పడు మంచి చెడుల గనుట మాయ తేడా చూప ఎల్లవేళ లందు ఎరుక కంటికి రెప్ప చల్లగనులె తల్లి చల్లగా వెలుతురు ఆ. అడ్డు వచ్చినాక ఆగేది లేదలే హితము కోరడముయె ఈశ్వరాంశ జీవితమ్ము మలుపు పెంచ గతిగ శోభ గమ్యముగను సాగ గమనానికి వెలుగు

May be an image of temple
All reactions

No comments:

Post a Comment