Saturday 11 November 2023

  




   

 చూసీ చూడదు ధర్మమార్గమనే కాలాన్ని రాజ్యాంగమే
చేసీ చెప్పెది చేయకుండ మనసే చిన్మాయ ఓటర్లపై 
రాశీజూపుటయే సహాయ మమతా రాగమ్ము సర్వార్థమై
ఆశాపాశముగానువాక్కు సుఖసామాన్యమ్ము విశ్వాసమే 

వారే వీరనుచూ సుఖమ్ము మనకే గర్వోన్నతీ లేదులే
వారేరీ సిరిమూట కట్టుకొని పోవంజూలిరే ప్రథ్విపై
పేరైనా మనకేనుతెల్వ జయమే పీఠమ్ము ఓటేయుటే
దారైనా తెలిపే సహాయ వరమై ధైర్యమ్ము తోయెన్నుకో 

ఇంద్రియనిగ్రహమ్ము గతి యిష్టమనస్సగు జ్ఞానసంపదే
ఇంద్రియవాక్కు నేస్తమగు యిల్లుగనుండియు యిచ్ఛసంపదే
ఇంద్రియ సౌరభమ్ము విధి యింతికి చిక్కియు స్వర్గ దుఃఖమే 
ఇంద్రియ లక్ష్యసాధనలు యీశ్వరసృష్టియె జీవితమ్మునన్

తన్నులు తిన్న తప్పులన తత్త్వగతీ మతి తారుమారుగా
ఎన్నడు చేయకిప్పుడగు యేలను బుద్ధియు వచ్చిచేరగా
మన్నన లేకమానసము మాయలమోహము మాధురేకదా
అన్నాయెతమ్ముడయ్యె మరియన్నగమారెను తమ్ముడత్తరిన్

నీతిగ నానుడేననియు నిర్మల వెల్గుల రత్నమేయగున్
జాతికి సేవలే నిజము జాద్యపు కాంతులు సత్యవాక్కులన్
ప్రీతికి సంఘ దృష్టియగు ప్రేమను పంచుట నిత్యసత్యమున్
ఖ్యాతి యానేది మంచియగు కాలముతీర్పుయు ఎల్లవేళలన్

నీదయవల్లనే మతియు నిర్మల మాయకు చిక్కకుండగన్
వేదము వల్ల జీవితమె వెన్నెల కాంతులు సర్వమేయగున్
మోదము మార్చలేనిదగు మోక్షపు నీడలు తృప్తినెంచగన్
నాదము సర్వ శోభలగు నానతి యమ్మది యీశ్వరేచ్ఛగన్

స్థిరమేదోసహనమ్ముగా నియమచిత్రమ్మే సహాయమ్ముగన్
స్వరమేస్వేచ్ఛగచెప్పగల్గుటయు స్వాతంత్రమ్ముగానే యగున్
తరమే మారినసత్యమే పలుకు తత్త్వంమేను నిష్టాకళన్
చిరుహాసమ్మగు జీవితమ్ముకళ చిన్మాయోను సర్వార్ధమున్
రాధా మాధవ తత్త్వము 

నీవుగ నిండియుందువు ననేకమెయున్నను నిర్మలమ్ముగన్
నీవుగ నిత్య కాలుడవు నీడల నిచ్చెడి కర్మబంధువున్
నీవుగ సర్వ కాలమగు నిర్ణయలక్ష్యము సర్వదృష్టిగన్
నీవుగ జూపెడీ మనసు నిశ్చయ భావము ప్రేమతత్త్వమున్

రాధవు నీవు రాణివగు రాసవిలాపము రమ్యమేయగన్
బాధలుతీర్చహృద్యమగు భాగ్యమనోమయ బంధమేయగన్
నాదము సర్వవేళల సనాతనధర్మము తృప్తినింపగన్
వేదము సృష్టిరూపమగు వెన్నెల మోహము బంధమోక్షమున్

మాధురి మందహాస సుఖ మైమరుపేమది పిల్పులే యగున్
సాధు సమానమోహమును సామ్యభవమ్మును పొందగోరగన్
మోదము లీలలే మదన మోక్షపురోగతి భాగ్యమేయగున్
చేదుగ తీపి తృప్తిగను చింతలనేవి వినోద మాయగన్

లోగిలిలో నివాసమగు లోకమనోమయ జాలిజూపగన్ 
కౌగిలి గాసుఖమ్ముగతి కౌలుపరమ్మగు మేలుజేయగన్ 
యోగిని రాగమేవిధియు యోగ్యతనీదియు దారిజూపగన్ 
వేగిర వెన్నలేకళలు వేకువ జామున యారగించుమున్ 

సేమము కోరి రాధగను చెంతకు పిల్చిన మానసంబునన్
కామనలేమియో తెలియ కష్టము, నిష్ఠురమొందకుండగన్
కాముని వానితోసలుప కాగల కాలమునందు మేలగున్,
ఏమరుపాటునొందకయె , ఏమియు సంశయమందు మాకుగన్!

భారము తగ్గచేయుకళ భవ్యమనోమయ లీలలేయగున్
వైరము కాదులేమనసు వైనము లక్ష్యము తెల్పనెంచంగన్
కారణమేది తెల్పకయు కాగలకార్యము కాలమోహమున్
ధారణ ధర్మమార్గమగు దారికి తన్మయ ముక్తిమోక్షమున్
1 . మహిమాన్వితం శ్రీకృతకృత్య రామలింగేశ్వరం

ఎంతో మహిమాన్వితమైనదిగా పేరొందినది గుడిమూల శ్రీకృతకృత్య రామలింగేశ్వర క్షేత్రం. పురాతన కాలంనాటి ఈ క్షేత్రాన్ని కార్తీకమాసంలోనే గాకుండా పర్వదినాల్లో ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. దోషనివారణలో కూడా ఈ క్షేత్ర దర్శనం ప్రసిద్ధిగాంచింది.

రాముని దోషాన్ని రూపుమాపిన లింగం

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అందువల్ల ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వరమని కూడా అంటారు. అందమైన ప్రకృతి నడుమ ఆవిర్భవించిన గుడిమూల శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం కార్తీకమాసమంతా ‘హరహర మహాదేవ శంభోశంకర’ అనే భజనలతో మారుమోగుతుంది. పర్వదినాల్లో భక్తుల శివనామస్మరణలతో ప్రతిధ్వనిస్తుంది. కార్తీకమాసంలోనూ, శివరాత్రి పర్వదినాన భక్తులు స్వామి దర్శనంతోపాటు ఉపవాస దీక్షలు చేపడతారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతోపాటు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుతారు.

స్థలపురాణం

త్రేతాయుగంలో∙రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాతకానికి గురైన శ్రీరామచంద్రుడు మహర్షుల ప్రోద్బలంతో కోటిలింగాలను ఆసేతు హిమాలయ పర్యంతం ప్రతిష్ఠ చేశాడని పురాణ ప్రతీతి. ఈ క్రమంలో శివలింగాన్ని వశిష్టనదికి తూర్పువైపున గుడిమూలలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. వశిష్టానది పడమర వైపున మరొక శివలింగాన్ని లక్ష్మణునిచే ప్రతిష్ఠింపచేశాడు. నాటినుంచి తూర్పుగోదావరి జిల్లాలో రామప్రతిష్టకు రామేశ్వరమని, పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష్మణప్రతిష్ఠకు లక్ష్మణేశ్వరమని సార్థక నామమయింది. ఇప్పటికీ అవే నామాలతో దివ్య క్షేత్రాలుగా కొనసాగుతున్నాయి.

తొలగిన బ్రహ్మహత్యా పాతకం

కోటిలింగ ప్రతిష్ఠల కార్యక్రమం ప్రారంభంలో వశిష్ఠుడు శ్రీరాముని చేతికి ఓ కంకణం కట్టి, అది ఎక్కడ రాముని చేతినుంచి విడువడుతుందో, అప్పటినుంచి బ్రహ్మహత్యా పాతకం తొలగుతుందని చెప్పాడట. ఆ ప్రకారం ఈ క్షేత్రంలో లింగప్రతిష్ఠతో రాముని చేతినుంచి కంకణం విడివడి బ్రహ్మహత్యా పాతకం తొలగటంతో శ్రీరాముడు కృతకృత్యుడయ్యాడు. దీంతో ఈ క్షేత్రం నాటినుంచి కృతకృత్య రామలింగేశ్వర స్వామివారి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.

సఖీ!.. నేటి పల్లి... ఇదే!

శ్రీరాముడు కోటి లింగాల ప్రతిష్ఠాపనలో భాగంగా తన పరివారంతో పర్యటిస్తుండగా ఒక ప్రాంతానికి చేరుకున్నారు. చీకటి కావస్తున్న సమయంలో శ్రీరాముడు సీతాదేవితో ‘‘సఖీ... మనం విశ్రమించే నేటి పల్లి ఇదే’’ అని చెప్పాడట. శ్రీరాముడు సీతమ్మవారితో పలికిన సఖి, నేటి పల్లి మాటలు ప్రస్తుతం సఖినేటిపల్లి గ్రామంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు పర్యటించిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం నిత్యం సుభిక్షంగా, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా పచ్చని వాతావరణంతో కూడి ఉంటుందని ఈ ప్రాంత ప్రజల నమ్మిక.

పురాతన కట్టడం

త్రేతాయుగాన శ్రీరామునిచే ప్రతిష్ఠించబడి, 11వ శతాబ్దంలో వేంగీరాజులచే పునర్నిర్మించబడిన ఈ దేవాలయం తిరిగి 1971లో పునర్నిర్మాణం జరిగింది. అప్పటి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, గుడిమూలకు చెందిన రుద్రరాజు రామలింగరాజు ప్రోత్సాహంతో ప్రారంభించిన పనులు 1973లో పూర్తిచేశారు. నాటి నుంచి ఆలయంలో శివునికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో సోమవారాలు లక్ష బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకం, శివరాత్రికి స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ చైర్మన్‌గా రుద్రరాజు వంశీయులైన వెంకట్రామరాజు (రాము) పర్యవేక్షణలో ఆలయంలో పర్వదినాలను అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహిస్తారు.

ఉపాలయాలకు ఆలవాలం

ఆలయంలో ప్రధాన సింహద్వారానికి ఒకవైపున ప్రతిష్ఠించిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఉపాలయంలో వైభవోపేతంగా ఏటా షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే రెండవ వైపున ప్రతిష్ఠించబడిన శ్రీపార్వతీదేవి అమ్మవారి ఉపాలయంలో దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు సహస్రనామార్చన, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. వీటితోపాటు మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలోను విశేషమైన పూజలు శివునితోపాటు జరుగుతూ ఉంటాయి.

ఈ క్షేత్రానికి ఇలా రావాలి

తూర్పుగోదావరి జిల్లా వాసులు రాజోలు డిపోకు చేరుకుని, అక్కడ నుంచి సఖినేటిపల్లి సెంటర్లో దిగాలి. అక్కడ నుంచి ఆటోలో 10 కిలో మీటర్ల దూరంలోని గుడిమూలకు చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులు నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి రేవు మీదుగాను, చించినాడ వంతెన మీదుగాను సఖినేటిపల్లికి చేరుకుని అక్కడ నుంచి ఆటోలో వెళ్లవచ్చు.
--***

\ప్రాంజలి ప్రభప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

ఇది అద్భుతమైన భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి మచ్చుతునక ....
సౌదీ అరేబియా లోని. ..మక్కా మసీదు  ( ఒకప్పుడు శివాలయం )
మహారాష్ట్ర ఎల్లోరా లోని. ...కైలాస నాథ్ శివాలయం 
కాంభోజ రాజ్యం../ కంబోడియా దేశంలో ఉన్న  అంగ్ కోర్ వాట్ శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రము. ..
ఈ మూడు నిర్మాణాలు ఒకే సరళ రేఖలో నిర్మించబడ్డాయి చూశారా. ...
అది ఈ నాటి శాస్త్ర వేత్తలు శాటిలైట్ సాయంతో కనుగొన్నారట. ..
ఏ శాటిలైట్ లు లేని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఇలా ఒకే సరళ రేఖలో నిర్మాణాలు ఎలా చేశారు. ..
పైగా ఇవి ఒకే కాలంలో నిర్మించినవి కావు. ..
వేరు వేరు కాలాల్లో నిర్మించినవి. ..
శాటిలైట్ విజ్ఞానం కంటే ఎన్నో రెట్లు గొప్ప విజ్ఞానం 
మన భారతీయుల సొంతం అని ఇప్పటికైనా అర్థమయిందా అందరికీ. ..
ఇంతటి మహత్తర విజ్ఞానాన్ని అందించిన మన పూర్వీకులను మనం స్మరించుకోవడమే మరిచాము. .
మన మహర్షులు మనకు అందించిన వేద విద్యను కాదని. ..విదేశీయుల విద్యలు నేర్చుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నాము. ..
ఇది ఎంతటి శోచనీయం...
మన మహర్షులకు. ..గొప్ప ఆర్కిటెక్చర్లు అయిన విశ్వకర్మలకు మనం ఎంతగానో ఋణపడి ఉన్నాము. .
మన హైందవ ధర్మాన్ని మనసా వాచా కర్మణా  పాటిస్తున్న నిజమైన హిందువులకు ...
దేవాలయ పూజారులకు. ..వాటిని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు. .అందరికీ వందనాలు. .
సనాతన హైందవ ధర్మమా నీవు కలకాలం వర్థిల్లుదువుగాక. ..
జై విశ్వకర్మ భగవాన్ 
జై భరతమాత 
జై తెలుగు తల్లి 
జై హింద్


గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు ప్రతి ఒక్కరు చదవి  ఇతరులకు తెలియజేయండి

 ఈ కేసులో చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులు శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు 20 లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ 22 లక్షలు, శ్రీ మహేష్ జీత్మలానీ 35 లక్షల దాకా తీసుకుని వీరంతా గోమాంస వ్యాపారుల తరపున కేసును వాదించారు.

ఇక మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత " కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే ?" అని అడిగినప్పుడు " అది సంతోషమే కానీ, కేసు మేమే వాదించేందుకు అనుమతించాలని" శ్రీ రాజీవ్ భాయి కోరారు. కోర్టు అలా అనుమతిస్తునే, శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించడంతో కేసు కొనసాగింది.
ఇక గోమాంస వ్యాపారుల వాదనలు చూద్దాం.

1వ వాదన: గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.

2వ  వాదన:  గోవులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేక  ఆకలితో చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.

3వ వాదన:  మనదేశంలో మనుష్యులకే చోటులేదు. పశువులను ఎలా వసతి ఇస్తాం.

4వ వాదన:  మనకు అత్యంత విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది.

5వ వాదన:  మాంసాహారం తినడం మతపరమైన హక్కు.

    ముస్లీం మతంలోని "ఎక్కువ గో హింసకు పాల్పడే  ఖురేషీ" అనే వర్గంవారు ఈ వ్యర్ధ వాదనలు చేసారు.

  ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనంతో, అన్ని  గణాంకాలను  కోర్టు వారి ముందుంచారు.

 శ్రీ రాజీవ్ భాయి సమాధానాలు చూద్దాం.

 ఒక ఆరోగ్యంగా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-
  ఒక ఆరోగ్యమైన గోవు రోజుకి  10కిలోల గోమయం,( ఆవుపేడ ), 3 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు " ఇది ఎలా సాధ్యం " అని అడిగారు. ఆయన తన వాదనను నిరూపించటానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత కోర్టువారి ముందు శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారుచేసి కోర్టుకు సమర్పించారు. I R C  శాస్త్రవేత్తలు గోమయంతో చేసిన ఎరువును పరీక్షించి అత్యుత్తమ సేంద్రీయ ఎరువుగా ప్రకటించారు. ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలు అందిస్తుందని  శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం 3 ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా 10 రెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో అంగీకరించింది.

శ్రీ రాజీవ్ భాయి కోర్టుకి అభ్యంతరం లేకపోతే,తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా  తాను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోవుపేడ నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, చూడమని ఆహ్వానించారు.

తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో 6 రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయం  తెచ్చి పెడుతుంది.  ( ౩౩ కిలోల ఆవు పేడ నుండి  330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా ! 330 X Rs.6/- ).  పైగా ఈ గోవుల కు ఆదివారం  శెలవులు కానీ లేవు కదా ! ఈ లెక్కన గోమాత వలన  ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం.

 శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాల ప్రకారం రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయం దాదాపు  1 కోటి 31  లక్షల 40వేలు రూపాయలు దాటిపోవడం చూచి ఆశ్చర్యం చెందారు.

వేల సంవత్సరాల పూర్వం నుండి గోమయంలో "లక్ష్మి" నివసిస్తుందని మన పూర్వీకులు ఎందుకు భావించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు.

ఇది హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంటబట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన "గోమయం లో "లక్ష్మి" నివాసముంటుంది అంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారని నవ్విన వారు నోళ్ళు వెళ్ళబెట్టారు.

ఇక "గోమూత్రము" పై శ్రీ రాజీవ్ భాయి గారి వివరణ

  " ఒక గోవు రోజుకి 2 లేక 2.25  లీటర్ల  గోమూత్రం ఇస్తుంది. ఇది అనేక రకాల వ్యాధులకు, మధుమేహం, క్షయ, కీళ్ళ వాతం, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగ కు సంబంధించిన వ్యాధులు మొదలైన  48 రకాలైన  రోగాలన్నీ సమూలంగా నిర్మూలించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపుతున్నాయి. (చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పారు. )

ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం "పేటెంటు" కూడా చెయ్యబడింది. గోమూత్రానికి 3 పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేస్తున్నది.

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం ( వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన  గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం
రూ.3000/- X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 ( అక్షరాల 2 కోట్ల 19 లక్షల రూపాయలు) గోమూత్రము వలన కోట్ల ఆదాయం.

ఇదే గోమయం " మిథైన్ " అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో వంటకి వాడుకోవచ్చును. మన ద్విచక్ర  వాహానాలను, మన కార్లు కూడా ఈ వాయువును తో నడుపుకోవచ్చును.

ఈ వాదన  ధర్మాసనంలోని ఒక జడ్జీ  నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి " మీరు అనుమతిస్తే, మీ కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీ కారు మీరే డ్రైవ్ చేసి మీరే పరీక్షించండి". అని తన వాదన పటిమ చూపించారు. ఆ న్యాయాధీశుడు అనుమతించి, తన కారును 3 నెలలు మిథైన్ వాయువుతో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు 50నుండి 60 పైసల కంటే ఎక్కువ ఖర్చు  కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు 40 రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.
ఆ జడ్జీ సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నారు.

రోజు వచ్చే 10 కిలోల గోవు పేడతో ఎంత మిథైన్ వాయువు తయారవుతుందో, అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొదుపు చేస్తుందో చెప్పి ధర్మాసనం నకు తన గణాంకాలు సమర్పించారు. దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు 1 లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమైతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనక్కర లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనక్కర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది గోవు వల్లనే సాధ్యం.

   ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి,  శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనలో "సత్యాన్ని గ్రహించి, " గో సంరక్షణ" వలన దేశానికి ఆర్ధికంగా, భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు.
సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, గోహంతకుల తల బొప్పికట్టి, దిక్కుతోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోందని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్ల రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.

అప్పుడు గోహంతకులు "గోమాసం తినడం  ఇస్లాం మతపరమైన హక్కు" అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి" అయితే, ఎంతమంది ఇస్లాం పాలకులు ఈ మతపరమైన హక్కును వాడుకున్నారు? ఈ మతపరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.

అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు". ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసం తినడంపై ఏమి చెప్పాయి ? ఆ హక్కనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని " ఈ కమిటీని ఆదేశించారు.

ఈ కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.

 " ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్ " ఆయన తన "బాబర్ నామా"లో గోవధ నేరమని, అలాంటి నేరం తను చనిపోయినా  ఈ దేశంలో  జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు.

ఇక్కడ దక్షిణాపధంలో టిప్పుసుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసేవాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలామంది ఈ శిక్షలో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి, గోవధకు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు".

  సుప్రీకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి,  వాదనకు మరింత పుష్టి వచ్చింది.

   " గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు.

తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా, హదీద్ లు, " గోవును రక్షించమని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి " అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దానిపట్ల దయగలిగి ఉండాలని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో " గోవును వధించిన వాడికి నరకంలో కూడా స్థానం లేదు " అని చెప్పారు.

తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు, గోవధను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాం మతహక్కు ఎలా అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనాలలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు.

 గోహంతకులు మాన్పడిపోయారు.  సుప్రీకోర్టు మాంసాహారులను, పదే పదే  అడిగింది. వారు ఇస్లాంలో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు.

సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం  ఈ అత్యంత కీలకమైన కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది.

ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.

తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.

  "గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము,   గోవును రక్షించడం  రాజ్యాంగ ధర్మముగా భావించాలి. మనం మన రాజ్యాంగంలో, " రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగం  వ్రాసుకున్నాం. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది. "
సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది.

 శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోవు కొవ్వుతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. ఈ ఘటన మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసి, గో సంరక్షణ ప్రారంభమైంది. శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం.

గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం. అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరం కాదు.

వందే గోమాతరం!  భారత జాతి యావత్తూ మాత "శ్రీలక్ష్మి "యే !!
స్వస్తి !!

--(())--
ప్రేమ పాశముకు కట్టు బడిన ఓ పరంధామ,,,,
ఐహిక భోగ బంధాల కట్లతో నను బంధించితివి,,,,,
వైరాగ్యమందబోవుననుటకు నీవు శివునివి గాక కేశవునివే,,,,
ప్రేమాప్యాయతలు ఏనాటికి వేములా చేదెక్కవు,,,,
త్రావే కొద్ది త్రాగుచుండాలనిఉంటే,,,,
ఇహ నా బాంధవ్యముల కట్లు ఎలా తెంచేదవు,,,
అమ్మచే కట్టుబడిన ఓ చిన్నబుడతస్వరూపమైన కృష్ణా,,,,
బంధముల మాయను త్రెంచుటకు రణభూమిగా 
మార్చి అర్జునుని కైవల్యమున జేర్చితివే,,,,
అందునా నాకు వైరాగ్యంబును ఇచ్చి నను స్వీకరించరా,,,,
ఈ జన్మ పాపపుణ్య సంపద నీదేరా,,,
ఇందులో అణువంత పుణ్యమైన నాకు వలదు,,,,
ఒకవేళ పుణ్యమాశాంచిన మరియొక 
జన్మన భోగ లాలసుడనై నిను మరచునేమో,,,,
ఆకారణం చేత నాకేమి వధ్ధురా తండ్రి,,,
వెన్నదొంగ వైన నీవు నామనసు దొంగవు 
అటువంటి ఓ తస్కరుడా 
భూమాత పతివై భూమాతనె మోముపై నిలిపినట్టి ఓ ఘనుడా,,,
అంటూ అలా రచన బూనితిని,,,,
ఐహిక భోగ బంధాల కట్లతో నను బంధించితివి,,,,,
వైరాగ్యమందబోవుననుటకు నీవు శివునివి గాక కేశవునివే,,,,
  
ప్రేమాప్యాయతలు ఏనాటికి వేములా చేదెక్కవు,,,,
త్రావే కొద్ది త్రాగుచుండాలనిఉంటే,,,,
ఇహ నా బాంధవ్యముల కట్లు ఎలా తెంచేదవు,,,

అమ్మచే కట్టుబడిన ఓ చిన్నబుడతస్వరూపమైన కృష్ణా,,,,
బంధముల మాయను త్రెంచుటకు రణభూమిగా 
మార్చి అర్జునుని కైవల్యమున జేర్చితివే,,,,

అందునా నాకు వైరాగ్యంబును ఇచ్చి నను స్వీకరించరా,,,,
ఈ జన్మ పాపపుణ్య సంపద నీదేరా,,,
ఇందులో అణువంత పుణ్యమైన నాకు వలదు,,,,

ఒకవేళ పుణ్యమాశాంచిన మరియొక 
జన్మన భోగ లాలసుడనై నిను మరచునేమో,,,,
ఆకారణం చేత నాకేమి వధ్ధురా తండ్రి,,,

వెన్నదొంగ వైన నీవు నామనసు దొంగవు 
అటువంటి ఓ తస్కరుడా 
భూమాత పతివై భూమాతనె మోముపై నిలిపినట్టి ఓ ఘనుడా,,,

అంటూ అలా రచన బూనితిని,,,,
నా కవితకు మీ ప్రతికవిత బాగా కుదిరిందండి,,,,
ధన్యవాదములతో,,,,,

* జాపాలి తీర్థం :......

దట్టమైన అటవీ ప్రాంతంలో, ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలతో,దివ్య తీర్థలిలతో,పక్షుల కిలకిలారావాలతో,బెట్లుడుతల ఉయ్యాలాటలతో,దివ్య సుగంధాలతో,ఔషధీ మూలికల సంపదతో,కారణ జన్ముల కర,పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5కి.మీ దూరంలో పాపవినాశం పోయే దారిలోఉన్నఒక సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం,ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం.

ఈ తీర్థ మహిమ వరాహ,స్కాంధ పురాణాలలో వర్ణితం.33కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహా విష్ణువు,రామావతారం దాల్చినప్పుడు, రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో,దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను.అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వేంకటాచలంలో అనగా తిరుమలలో జప,హోమాలు చేయసాగెను.అతని భక్తికి మెచ్చి భగవంతుడు తనయొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని(ప్రస్తుతమున్న సింధూరకవచంలేని రూపాన్ని) స్వయంభువుగా అవతరించి చూపించెను.జపంవల్ల అవతరించినందున ఈ స్థలం ‘జాపాలి’ అయింది.అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందున జాపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానకు సంకల్పించినది.హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది.అలా మారిన శేషగిరిపై శ్రీ వేంకటేశ్వరస్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్చావతారంగా నిలిచాడు.

అయోధ్యకాండలో జాపాలి ఋషి తనయొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటగట్టుకొని, జపాలి తీర్థములో తపస్సుచేసి రామగుండములో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యెను.శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సీతాసమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను.అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా ,సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారయై వెలుగొందుతున్నాడు. ఇందుకు ప్రతీకగా నేటికీ ధ్రువతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచూ ధ్రువతీర్థమనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నీటిని ఆంజనేయస్వామి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నది. పంచమహాపాతకములు,భూతప్రేత పిశాచాది బాధలు,బ్రాహ్మణత్వం కోల్పోయినవారు,బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంధ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యములో చెప్పబడినది.ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం.జన్మ శనిగలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలుగవు.

శ్రీశ్రీశ్రీ హథీరాంజీ బావాజీవారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీశ్రీశ్రీ 1008 అర్జునదాసుగారి పర్యవేక్షణలో ఉన్నది. పూజారి 108 శ్రీ రామదాసు బాలాజీ(88 సంవత్సరములు) ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు, వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి ఆంజనేయున్ని కొలుస్తూ ఆంజనేయస్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేస్తున్నారు. ఈ చోటు ఎందరో మహాత్ములు,సాధువులు,యోగులు సిద్ధిపొందిన చోటు.దేవతలు నడయాడిన చోటు. ఇంకా ఎన్నో లీలావిశేషాలకు, అశోకవనంలో ఆంజనేయుడు సీతమ్మ వారిని సంతోషపరచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాన్ని నింపుతున్న చోటు. నేడు ఎంతోమంది ఉన్నత స్థానములలో ఉన్న చాలా మంది ఈ స్వామి భక్తులే. వారి జాబితాకు అంతే లేదు.

జాపాలి తీర్థమందు జై సీతారామ్ నామాన్ని స్మరించండి. మనస్సును స్వామియందే లగ్నం చేయండి. జపాలి ప్రకృతిని వీక్షించండి. నిశ్శబ్దం వల్లే ఇది సాధ్యం. జపాలి పర్యావరణాన్నిపరిరక్షించండి. సాధువుల ఆశీర్వాదాన్ని పొందండి.

******

శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయం – మురమళ్ళ

ఈ ప్రదేశంలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారని అందువలన ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చింది. అది కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి.
గౌతమీ నది తీరాన ఉన్న సుప్రసిద్దమైన క్షేత్రం ఇది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఉన్న మురమళ్ళ గ్రామం లో వెలసిన వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది. భద్ర ఖాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఇది. ప్రతి రోజు ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది.
దక్షయజ్ఞం ద్వంసంగావించి తదుపరి మహావిష్ణువు కోరిక పై దక్ష యాగం పుర్తిగావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు గొర్రె తలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయన చేత వేదోక్తముగా యజ్ఞమును పూర్తి చేయించిన తారువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడలేదు. దేవతలందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింప చేయుటకై వైకుంటమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్తించి శాంతింప చేయమని కోరిరి. మహా విష్ణువు నరసింహ అవాతరం దాల్చి వీరభద్రుని శాంతింప చేయుటకు ప్రయత్నించిన పలితం కలగలేదు.
అప్పుడు మహా విష్ణువు జరిగినదంతా బ్రహ్మ లోకమునకు వెళ్లి బ్రహ్మ కు చెప్పగా అప్పుడు త్రిమూర్తులు ఆది పరాశక్తిని ధ్యానించి గ షోడ కళ లో ఒక కళ ను భాద్రకాళి నామము తో భూలోకమునకు పంపి వీరభాద్రున్ని శాంతింప చేయుటకు ప్రయత్నించిన వీరభద్రుడు శాంతింప నందున అప్పుడు భద్రకాళి ప్రక్కనగల తటాకమునందు మునిగి భాద్రాకాలి స్వరూపం నుండి కన్య రూపమును దాల్చి వీరభద్రుడి ముందు నిలువగా అప్పుడు వీరభద్రుడు శాంతి అయ్యాడు అని అప్పుడు వారీరువురికి గందర్వ వివాహ పద్దతిన కాల్యణం జరిపించారు అని స్థల పురాణం.
ఆ నాటి నుండి స్వామీ వారికి గందర్వ పద్దతిలోనే కల్యాణోత్సవం జరిపిస్తారట అందుకే ఈ క్షేత్రం లో పెల్లిలు కాని వాళ్ళు కల్యాణోత్సవం జరిపిస్తే తొందరగా పెళ్ళిలు జరుగుతాయని భక్తుల నమ్మకం.

***                                              
       

 💐💐పాకిస్తాన్ లోని ముల్తాన్ సూర్యదేవాలయం.!💐💐💐

ఓం నమః శివాయ..!!

హైందవమతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్తుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు. అలాంటి సూర్యుని కొలుచుకునేందుకు వేల  ఏళ్ల క్రితమే ఓ ఆలయాన్ని నిర్మించారు. 
అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్యదేవాలయం! 

దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో 
ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.  ఆ నగరానికంతటికీ ఆ సూర్యదేవాలయమే 
ముఖ్య ఆకర్షణగా ఉండేదట.  ఆ ఆలయాన్ని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించు కునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట. అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు. క్రమేపీ ఆ పేరు ‘ముల్తాన్’గా మారిపోయింది.

ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి.  అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుడిని, కుష్టు వ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 

ఆ మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు,  కష్టాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు.  అక్కడి మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు. 
ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు. అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది.

అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు, 
తలుపులు, స్తంభాలు, శిఖరాలు... అన్నీ కూడా వెండి, బంగారాలతో ధగధగలాడిపోతుండేవి. ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి. 

ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలయినా కూడా ఆలయానికి ఏమాత్రం ఢోకా రాలేదు.  క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఆ పోరులో ముల్తాను మీద పైచేయి సాధించినవారు తమ కసినంతా సూర్యదేవాలయం మీద చూపించారు. పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు. 

ఇప్పుడైతే ఈ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్లు లేవు.

ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది. 
అదే నరసింహస్వామి ఆలయం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం. అందుకనే ఈ ఊరికి హిరణ్యకశిపుని పేరు మీదుగా కశ్యపపురం అనే పేరు కూడా ఉంది. 

హిరణ్యకశిపుని వధ తర్వాత, స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట. ఈ ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు అల్లరిమూకలు ధ్వంసం చేస్తూ వచ్చాయి. 
అయినా కూడా స్థానిక హిందువులు ఆలయాన్ని పునర్నిర్మించుకునేవారు. 

1992లో మన దేశంలో బాబ్రీ మసీదుని కూల్చివేసినందుకు నిరసనగా,  ఈ ఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేసేశారు. ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి అంతే కాదు ఈ ఆలయం నుండే ముల్తానీ మట్టి వచ్చేది  
ఓం శ్రీ సూర్య దేవాయ నమః.!🙏
--(())--


 100.... 🕉కదిరి నృసింహ స్వామి🕉

నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీనరసింహుని ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న దివ్యక్షేత్రం. కదిరినే ఖాద్రి అనికూడా అంటారు. కులమత భేదాలు లేకుండా అన్ని మతాలవారూ, అన్ని కులాలవారూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఇక్కడి విశేషం. ఖదిర అంటే చండ్ర చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కదిరి అన్న పేరు వచ్చింది. ఈ కదిరి నృసింహ క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నృసింహ క్షేత్రం హైదరాబాదుకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడికి చిత్తూరు, గుంతకల్లు మరియు అనంతపురం మీదుగా బస్సు, మరియు రైలు సౌకర్యాలుకూడా ఉన్నాయి. దగ్గరలో పుట్టపర్తి విమానాశ్రయం కూడా కలదు.
కదిరి ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మింపబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయం ఎంతో విశాలంగా, ఎత్తైన ప్రహారీ గోడ తో అద్భుతమైన శిల్పకళ తో విరాజిల్లుతుంది. ఆలయానికి నలువైపుల గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. ఇక్కడున్న ప్రధానమైన కోనేరును భృగు తీర్థం అంటారు. భృగు తీర్థం మాత్రమే కాకుండా ఇక్కడ ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలైన తీర్థాలు ఉండేవి. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.

నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కదిరి క్షేత్రం లో నృసింహస్వామితోపాటుగా ప్రహ్లాదుడు కూడా దర్శనమిస్తాడు. కదిరికి దగ్గరలోని గూటిబయలు గ్రామం లో 600 సంవత్సరాలనాటి తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. మహాయోగి అయిన వేమన గారి సమాధిగల కటారిపల్లే కదిరికి సమీపం లోనే ఉంటుంది.
కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఎక్కడెక్కడినుంచో ప్రజలు బ్రహ్మోత్సవాలను దర్శించడానికి తరలివస్తారు.

పండ్లబుట్ట కథ .శ్రద్ధగా చదవoడి...

జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి..!!

*అరటిపండును తొక్క తీసేసి తింటాం.
🕉కదిరి నృసింహ స్వామి🕉

నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీనరసింహుని ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న దివ్యక్షేత్రం. కదిరినే ఖాద్రి అనికూడా అంటారు. కులమత భేదాలు లేకుండా అన్ని మతాలవారూ, అన్ని కులాలవారూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఇక్కడి విశేషం. ఖదిర అంటే చండ్ర చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కదిరి అన్న పేరు వచ్చింది. ఈ కదిరి నృసింహ క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నృసింహ క్షేత్రం హైదరాబాదుకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడికి చిత్తూరు, గుంతకల్లు మరియు అనంతపురం మీదుగా బస్సు, మరియు రైలు సౌకర్యాలుకూడా ఉన్నాయి. దగ్గరలో పుట్టపర్తి విమానాశ్రయం కూడా కలదు.

కదిరి ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మింపబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయం ఎంతో విశాలంగా, ఎత్తైన ప్రహారీ గోడ తో అద్భుతమైన శిల్పకళ తో విరాజిల్లుతుంది. ఆలయానికి నలువైపుల గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. ఇక్కడున్న ప్రధానమైన కోనేరును భృగు తీర్థం అంటారు. భృగు తీర్థం మాత్రమే కాకుండా ఇక్కడ ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలైన తీర్థాలు ఉండేవి. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.

నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కదిరి క్షేత్రం లో నృసింహస్వామితోపాటుగా ప్రహ్లాదుడు కూడా దర్శనమిస్తాడు. కదిరికి దగ్గరలోని గూటిబయలు గ్రామం లో 600 సంవత్సరాలనాటి తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. మహాయోగి అయిన వేమన గారి సమాధిగల కటారిపల్లే కదిరికి సమీపం లోనే ఉంటుంది.
కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఎక్కడెక్కడినుంచో ప్రజలు బ్రహ్మోత్సవాలను దర్శించడానికి తరలివస్తారు.సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.

*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు
లోపలి గింజలు కూడా వదిలేస్తాం.

*ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.

*జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.

*ఒక్కోటి ఒక్కో రుచి.
తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. 
అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.

*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. 
మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.

*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.

*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు...
ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే...
అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది.

పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?
కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు..వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప..చిరాకుపడo కదా!!?

*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం..
ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం..

*కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!!
కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ..
శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!!


--((**))--

No comments:

Post a Comment