Thursday 16 November 2023


092. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ |

మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ‖ 11 ‖ 

తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది. రునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.

093.తత్త్వ నిశ్చయకామేన న్యాయాగమ విచారిణామ్ ౹

 ఏకైవ ప్రతిపత్తిః స్యాత్సాఽ ప్యత్ర స్ఫుటముచ్యతే ౹౹

122.  తత్త్వమును తెలియగోరువారు శ్రుతిని తర్కమును అనుసరింతురు.వారి నిర్ణయము కూడా ఈశ్వరుడొక్కడే అనునదే.అదే ఇచ్చట స్పష్టముగ చెప్పబడుచున్నది.

094.మాయాంతు ప్రకృతిం విద్యాన్మయినం తు మహేశ్వరమ్౹

 అస్యావయవ భూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ ౹౹

123.  విశ్వమునకు ఉపాదాన కారణమగు ప్రకృతియే మాయయనీ మాయాధీశుడే మహేశ్వరుడనీ అతడు అచేతన చేతనాత్మకమైన జగత్తునంతటిని వ్యాపించి ఉన్నాడనీ ఆ జగద్విషయములన్నీ అతని అవయవముల వంటివే అనీ శ్రుతి చెప్పును.శ్వేతాశ్వతర ఉప.4.10.

095.ఇతిశ్రుత్యనుసారేణ న్యాయ్యో నిర్ణయ ఈశ్వరే ౹ 

తథాసత్యవిరోధః స్యాత్ స్థావరాన్తేశవాదినామ్ ౹౹౹

.  ఈశ్వరుని పట్ల ఇది శ్రుత్యనుసారమైన న్యాయమైన నిర్ణయము.అట్లయిననే వృక్షములను ఈశ్వరుడను వారితో కూడా విరోధముండదు.

096. నాభ్యుత్ధానక్రియా యత్ర  నాలాపా మధురాక్షరా: ౹

గుణదోషకథా నైవ తత్ర హమేర్యనగమ్యతే ౹౹

ఏ చోట ఎదురుక్కొనే పని ఉండదో ఎక్కడ మధురమైన ఇష్టమైన మాటలు ఉండవో ఏ చోట గుణదోషాలు గురించి ఆలోచనలు ఉండవో అటువంటి ఇంటికి వెళ్లకూడదు.

095 .శ్లో𝕝𝕝 విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం

విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః।

విద్యా బంధుజనో విదేశ గమనే విద్యా పరా దేవతా

విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యా విహీనః పశుః॥

తా𝕝𝕝 విద్య మనిషి తేజస్సుని ఇనుమడింపచేస్తుంది... అది ఎవ్వరి కంటా పడని రహస్య నిధితో సమానం.... విద్య భోగాలను, సుఖాలను, కీర్తినీ కలిగిస్తుంది....అందుకనే విద్య గురువులకే గురువుగా నిలుస్తోంది..... విద్యావంతుడు ఏ దేశమేగినా, అతనికి సాయపడే బంధువుగా అతనిలోని విద్య నిలుస్తుంది.... అలాంటి విద్య కలిగినవాడిని రాజులు కూడా పూజిస్తారు... మరి జీవితానికి ఇంతగా ఉపయోగపడే విద్య లేనివాడు పశువుతోనే సమానం కదా!!!

096. జీవత శ్చాంత్రాభ్యుద్ధారః శ్వగృధ్రైర్యమసాదనే|

సర్పవృశ్చికదంశాద్యైర్దశద్భిశ్చాత్మవైశసమ్॥

తాత్పర్యము : యమలోకమున ఆ జీవునియొక్క ప్రేవులను కుక్కలు, గ్రద్దలు బయటికి పీకివేయును. ఆ యాతనా దేహమును పాములు కాటువేయును. తేళ్ళు, అడవి ఈగలు మొదలగు విషప్రాణులు కుట్టి బాధించును.

097. కృంతనం చావయవశో గజాదిభ్యో భిదాపనమ్|

పాతనం గిరిశృంగేభ్యో రోధనం చాంబుగర్తయోః॥

తాత్పర్యము : ప్రతి అవయవమును ముక్కలు ముక్కలు చేయుదురు. ఏనుగులు మొదలగు వాటిచే తొక్కింతురు. గిరి శిఖరములు నుండి పడద్రోయుదురు. నీళ్ళలోను, మురికి గుంటల లోను ముంచి అదిమి పెట్టుదురు.

098. యాస్తామిస్రాంధతామిస్రారౌరవాద్యాశ్చ యాతనాః|

భుంక్తే నరో వా నారీ వా మిథస్సంగేన నిర్మితాః॥

తాత్పర్యము : స్త్రీగాని, పురుషుడుగాని పరస్పరాసక్తితో చేసిన పాపకర్మలకు ఫలితముగా  తామిస్రములు, అంధతా మిస్రములు, రౌరవములు మొదలగు యాతనలను అనుభవించవలసి వచ్చును.

099. అత్త్రైవ నరకః స్వర్గ ఇతి మాతః ప్రచక్షతే|

యా యాతనా వై నారక్యస్తా ఇహాప్యుపలక్షితాః॥

తాత్పర్యము : తల్లీ! స్వర్గము, నరకము అనునవి ఈ లోకమున కలవని కొందరు తలంతురు. మరికొందరు మాత్రము నరకయాతనలు ఇక్కడే కలవని తెలుపుదురు.

100  *. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా|

విసృజ్యేహోభయం ప్రేత్యో భుంక్తే తత్ఫలమీదృశమ్॥

తాత్పర్యము : ఈ విధముగా అనేక శ్రమలకు ఓర్చి, తన కుటుంబ పోషణను చేయు వాడును, లేదా తన పొట్టను మాత్రమే నింపుకొను వాడును కుటుంబమును, శరీరమును గూడ ఇచటనే వీడి, మరణించిన పిదప తాను చేసికొనిన పాపములకు తగిన ఫలితమును అనుభవింప వలసి వచ్చును.


1*🧘‍♂️శ్రీ శంకరాచార్యకృత  నిర్వాణ మంజరీ🧘‍♀️*

*(ఈ స్తోత్రమున నిషేధ ప్రక్రియతో శుద్ధ పరబ్రహ్మ తత్వమే ఆత్మ తత్త్వమని నిరూపింపబడుచున్నది.)*

*1) అహం నామరో నైవ మర్యోనదైత్యో న గంధర్వరక్షః పిశాచ ప్రభేదః |*

*పుమా న్నైవ నస్త్రీ తథా నైవ షండః ప్రకృష్ట ప్రకాశ స్వరూప శ్శివోహమ్||*

*-నేను దేవ జాతివాడను కాను, మానవజాతివాడను కాను, దైత్య జాతివాడను కాను. గంధర్వులు, రాక్షసులు, పిశాచములు అను విభాగములలోని వాడనుకాను - పురుషుడను కాను - స్త్రీని కాను - నపుంసకుడను కాను. కాని సర్వోత్కృష్ట సర్వావభాసక చిత్రప్రకాశ స్వరోపుడగు శివుడనే (పరబ్రహ్మ వస్తువు) నేనై యున్నాను.*

*2) అహం నైవ బాలో యువా నైవ వృద్ధా న వర్జీ నచ బ్రహ్మచారీ గృహస్థః |*

*వనస్థోపి నాహం న సన్యస్తధర్మా జగజ్జన్మ నాశైక హేతు శ్శివోహమ్||*

*-నేను బాలుడను గాని, యువకుడను గాని, వృద్ధుడను కాను. నిరంతరము వేదాధ్యయన నిష్ఠ గలిగిన బ్రహ్మచారిని గాని, గృహస్థుడనుగాని, వానప్రస్థాశ్రమస్థుడను.గాని, సన్యాసాశ్రమస్థుడను గాని కాను - కాని సర్వజగత్సృష్టి స్థితిలయములకు ఏకైక కారణమగు శివుడనే (పరబ్రహ్మ వస్తువునే) నేనై యున్నాను.*

*3) అహం నైవ జ్ఞేయ స్తిరోభూత మాయ  స్తధై వేక్షితుం మాం పృథఙ్నస్త్యుపాయః |*

*సమాక్లిష్ట కాయత్రయో వ్యద్వితీయ స్సదా తీంద్రియ స్సర్వరూప శ్శివోహమ్||*

*నేను జ్ఞానగమ్యుడను (తెలియబడువాడును) కాను - మాయాతీతుడను. నన్ను కనుగొనుటకు వేరు ఉపాయములు లేవు. (నన్ను ఆశ్రయించిన నే మాయను తరించి నన్ను తెలిసికొని నన్ను పొందగల్గుదురు). నేను స్థూలము సూక్ష్మము కారణము అను మూడు దేహములతో కూడుకొనియున్నవాడనైనను - సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడనే - నేను కాలత్రయమునందును - అతీంద్రియుడును, విశ్వాత్మకుడును నగు శివస్వరూపుడనే (పరబ్రహ్మ వస్తువునే) అయి యున్నాను.*

*4) అహం నైవ మన్తా న గన్తాన వక్తా న కర్తా న భోక్తా న ముక్తాశ్రమస్థః |*

*యధాహం మనోవృత్తి భేదస్వరూప స్తదా సర్వవృత్తిప్రదీప శ్శివోహమ్ ||*

*-నేను ఆలోచనలు చేయువాడను గాని, గమనము చేయువాడను గాని, మాటలాడువాడను గాని, కార్యములను చేయువాడను గాని, భోగముల ననుభవించు వాడను గాని, యత్యాశ్రమము నందున్నవాడను గాని కాను. సర్వవిధములగు మనోవృత్తి భేదములన్నియు నా స్వరూపములే. అట్లే ఆ మనోవృత్తులను ప్రకాశింప జేయువాడగు శివస్వరూపుడనే (పరబ్రహ్మ వస్తువునే) నేనై యున్నాను.*

*5) నమే లోకయాత్రా ప్రవాహ ప్రవృత్తి ర్నమే బంధబుద్ధ్యా దురీహానివృత్తిః |*

 *ప్రవృత్తిర్నివృత్తిశ్చ చిత్తస్య వృత్తి ర్యత స్త్వన్వహం తత్స్వరూప శ్శివోహమ్ ||*

*నాకు ఈ లోక యాత్రయే సంబంధించి సర్వమానవ సాధారణమగు ప్రవృత్తియు లేదు. నేను సంసార బంధమున తగుల్కొని యుంటిని. ఈ బంధమును తొలగించు కొనవలయునను తలంపుతో నిషిద్ధ కర్మములు వగైరాలను చేయకయుండుట యను నివృత్తియును లేదు. ఈ నివృత్తియు, ప్రవృత్తియు ఈ నా చిత్తము (అంతఃకరణము) యొక్క వ్యాపారములు కాని నావి కావు. కాన నేను ఎల్లప్పుడును నిష్క్రియ పరబ్రహ్మ స్వరూపుడౌ శివుడనే అయి యున్నాను.*

*6) నిదానం య దజ్ఞానకార్యస్య కార్యం వినా యస్య సత్త్వం స్వతో నైవ|*

 *భౌతి యదాద్యన్త మధ్యాన్త రాలా నరాల ప్రకాశాత్మకం స్యాత్తదేవాహమస్మి ||*

*ఎయ్యెది అజ్ఞానము వలనను ఉత్పాదితమైన సమస్త ప్రపంచమునకు మూల కారణమగుచున్నదో, దేనియొక్క సత్తాచేతనే (ఉనికిచేతనే) కార్యమగు ఈ దృశ్య ప్రపంచమంతయు సత్త (ఉనికి) కలదివలె భాసించుచున్నదో, ఎయ్యది సమస్త దృశ్య పదార్థముల యొక్క ఆద్యంత మధ్యభాగముల యందును, అంతరాలాంతరాళముల యందును (లోలోపలి భాగములందును) ప్రకాశాత్మకమైవర్తించుచుండునో అట్టి సర్వకారణ కారణమైన -సదాత్మకమైన-చిదాత్మకమైన పరబ్రహ్మ వస్తువు నేనై యుంటిని.*

*7) యతోహం న బుద్ధి ర మే కార్యసిద్ధి ర్యతో నాహ మంగం నమే చాంగభంగ |*

 *హృదాకాశవర్తీ గతాంగ త్రయార్తిః సదా సచ్చిదానందమూర్తి శ్శివోహమ్ ||*

*-బుద్ధియను వస్తువు నేను కాను. కాని బుద్ధిచే సంకల్పింపబడిన కార్యముల యొక్క సిద్ధి నాదియు కాదు. స్థూల సూక్ష్మాది దేహములు నేను కాను (సూక్ష్మ దేహమునకు లింగ దేహమను సంజ్ఞ కలదు. అది కారణ దేహమగు అవిద్య యొక్క కార్యము. ఆత్మతత్వ విజానము కలుగగా అవిద్య నశించును. కారణమగు అవిద్య.*

*8) లింగభంగము అని అందురు. ఇయ్యది ముక్తిహేతువు అని శాస్త్ర ప్రవాదములు కలవు. లింగభoగ మనునది లింగ (సూక్ష్మ) దేహమునకు సంబంధించినదియే యగును గాని ఆత్మకు సంబంధించినది కాదు. ఈ యంశమిచట వర్ణింపబడుచున్నది. నేను ఎల్లపుడును హృదయాకాశ మధ్యవర్తియు స్థూల సూక్ష్మకారణ దేహములకు సంబంధించిన బాధ లేమాత్రమును లేనట్టి సచ్చిదానంద స్వరూపుడగు శివ స్వరూపుడనే అయియుంటిని.*

*8) య దాసీ ద్విలాసా ద్వికారో జగద్య ద్వికారాశ్రయో నాద్వితీయత్వతస్స్యాత్||*

 *మనోబుద్ధి చిత్తాహ మాకారవృత్తి ప్రవృత్తిర్యతస్స్యాత్త దేవాహమస్మి ||*

*ఏది లీలా మాత్రముగ ఈ దృశ్యమాన జగత్తుగా తాను అయ్యెనో ఏది స్వతః తాను అద్వితీయమై (స్వగతాది భేదములేని) ప్రపంచమునకు ఆశ్రయము కాకయే శుద్ధమై యుండెనో; దేని నుండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను అంతః కరణము యొక్క వృత్తులు బయలుదేరుచున్నవో అట్టి పరమశివ (పరబ్రహ్మ) తత్త్వమే నేనై యుంటిని.*

*8) యదస్తర్బహి ర్వ్యాపకం నిత్యశుద్ధం యదేకం సదా సచ్చిదానందకన్దమ్ |*

 *యత స్థూల సూక్ష్మ ప్రపంచస్య భానం యత స్తత్ప్రసూతి స్తదేవాహ మస్మి ||*

*- ఏది నిత్యశుద్ధమైనదో, ఏది సచ్చిదానంద ఘనమైనదియో, దేని వలన స్థూల సూక్ష్మ ఏది సర్వ దృశ్యపదార్థ జాతమునందు బాహ్యాభ్యంతర వ్యాప్తియై యుండెనో; ప్రపంచములకు ప్రకాశ మేర్పడుచున్నదో; దేని నుండి ఈ ప్రపంచము ఏర్పడుచున్నదో; అట్టి పరబ్రహ్మ తత్త్వమే నేనై యుంటిని.*

*10) య దర్కేందు విద్యుత్ప్రభాజాల మాలా విలాసాస్పదం య త్స్వభేదాదిశూన్యమ్ |*

*12) సమస్తం జగ ద్యస్యపాదాత్మకం స్యా దృత శ్శక్తి భావం తదేవాహ మస్మి ||*

*-ఏది సూర్యుని యొక్కయు, చంద్రుని యొక్కయు, మెరుపుల యొక్కయు నానావిధ కాన్తి పుంజములకు మూలమై యుండెనో (ఎవని కాంతిచే నవి కాంతివంతము లగుచున్నవో) ఎయ్యది సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిదియో - ఈ సమస్త ప్రపంచమును ఎవని యొక్క అంశ మాత్రమే అయి యుండెనో - సమస్త ప్రపంచమునకు కారణమైన మాయాశక్తియు దేనివలన ప్రకాశించుచు నుండెనో అట్టి పరబ్రహ్మ తత్త్వమే నేనై యుంటిని.*

*11) యతః కాలమృత్యుర్బిభేతి ప్రకామం యత శ్చిత్త బుద్దీంద్రియాణాం విలాసః |*

 *హరి బ్రహ్మ రుదేంద్ర చంద్రాదినామ ప్రకాశో యత స్స్యాత్తదేవాహ మస్మి ||*

*-దేని భయము వలన మృత్యు దేవతయు మిక్కిలి భయపడుచు స్వకార్యములను నిర్వర్తించుచున్నదో, దేనినుండి సర్వజీవుల జ్ఞానేంద్రియములును ఆయా జ్ఞానములను సంపాదించగలుగుచున్నవో, దేనివలన హరియని, బ్రహ్మయని, రుద్రుడని, ఇంద్రుడని, చంద్రుడని బహువిధములగు నామములు విలసిల్లుచున్నవో అట్టి పరబ్రహ్మ తత్త్వమే నేనై యుంటిని.*

*12) యదాకాశవత్సర్వగం శాంతరూపం పరం జ్యోతి రాకారశూన్యం వరేణ్యమ్ |*

*య దాద్యన్త శూన్యం పరం శంకరాఖ్యం యదన్తర్విభావ్యం తదేవాహ మస్మి ||*

*-ఏది ఆకాశమువలె సర్వవ్యాపకమైనదో - ఏది ప్రశాంతమగు స్వరూపము గలదియో-ఏది ఏ విధమైన ఆకారములు లేని ప్రార్ధనీయమగు పరమజ్యోతి స్వరూప మైనదియో-ఏది ఆద్యంతరహితమైనదియో-ఏది హృదయాంతర్భాగముననే భావింపదగినది. అట్టి సర్వోత్కృష్టమగు శంకరా పరబ్రహ్మ తత్వమే నేనే అయియుంటిని.*

****

** శ్రీ దుర్గా సూక్తం


1.ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః |

స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః ||


2.తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |

 దుర్గాం దేవిగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||


3.అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |

పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||


4.విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాతిపర్‍షి |

అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్ ||


5.పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థాత్ |

స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ||


6.ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |

స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ || 


7.గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |

నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం ||


ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

|| ఇతి దుర్గా సూక్తమ్ ||


తాత్పర్యము:-

^^^^^^^^^^^^^^^^^^^

అగ్నిదేవా! సోమాన్ని పిండి రసాన్ని నీకు సమర్పిస్తాము. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అగ్ని దేవుడు దగ్ధము చేయు గాక!

 పడవ ద్వారా సముద్రము దాటే విధంగా మమ్మల్ని సమస్త బాధలనుండి, తప్పులనుండి అగ్నిదేవుడు కాపాడు గాక!

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను.

 దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము.

ఓ అగ్నిదేవా! నీవు కీర్తింప తగినవాడవు. సంతోషకర మార్గాల ద్వారా మమ్మ్ములను సమస్త దుఃఖాలనుండి దూరంగా తీసుకెళ్ళు, మా ఊరు, దేశము, ప్రపంచము, సుభిక్షముగా ఉండు గాక!

మా పిల్లలకు, వారి పిల్లలకు సంతోషాన్ని ఇచ్చే వాడిగా నువ్వు ఉంటావు గాక!అగ్నిదేవా! సమస్త దుఃఖాలను హరించేవాడా!

 సముద్రంలో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ కాపాడిన రీతిలో ఈ దుఃఖాల బారినుండి మమ్ము రక్షించు. మా శరీరాలను కాపాడే వాడా! 'యావన్మందీ సంతోషంగా ఉండుగాక' అంటూ మనసులో పదే పదే చెపుతున్న అత్రి మహర్షిలా మా శ్రేయస్సు మనస్సునందు జ్ఞప్తి యందు ఉంచుకో.

శత్రు సైన్యాన్ని ముట్టడించేవాడు, వాటిని నాశనం చేసే వాడు, ఉగ్రమైన వాడు అయిన అగ్ని దేవుడుని సభయొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడకు వేంచేయమని ఆహ్వానిస్తున్నాము.

ఆయన మమ్ములను సమస్త క్లేశాలకు, నశించేవాటికి,తప్పిదాల ఆవలకు తీసుకు వెళ్ళు గాక!మమ్ము కాపాడు గాక!అగ్నిదేవా!

 యాగాలలో కీర్తించబడుతున్న నువ్వు మా ఆనందాన్ని ఇనుమడింప చేస్తున్నావు. యాగం చేసే వారిలో సనాతనుడిగాను, కొత్త వాడి గాను నువ్వు వెలుగుతున్నావు. నీ రూపంగా ఉంటున్న మాకు సంతోషం ప్రసాదించాలి.

 మాకు సర్వతోముఖ శ్రేయస్సు తీసుకురావాలి.భగవంతుడా! నీవు పాపము అంటని వాడవు, సకలవ్యాపివి.

 అసంఖ్యాకమైన పశువులతో కూడిన సంపదను పొంద పరమానందము అనుభవింప మేము నిన్ను వెన్నంటుతాము.

 విష్ణు స్వరూపమైన దుర్గా దేవీ పట్ల మాకున్న భక్తి వలన ఉన్నత దేవలోకంలో నివసించే దేవతలు ఈ ప్రపంచంలో నాకు సంతోషాన్ని ప్రసాదించు గాక!కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. అందులకై ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!

***

॥ శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకమ్ ॥

1) కదాచిత్కాలిన్దీ తటవిపిన సఙ్గీతకవరో  ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః

రమాశమ్భుబ్రహ్మామరపతిగణేశార్చితపదో  జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

ఒకొక్కప్పుడు కాళిందీనది ఒడ్డునందలి వనములలో వేణుగానం చేయుచూ సంతోషముతో గోపికల ముఖ పద్మములలోని మధురిమను ఆస్వాదించువాడు, లక్ష్మి  - ఈశ్వరుడు - బ్రహ్మ - దేవేంద్రుడు - వినాయకుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు అగు శ్రీ జగన్నాథ స్వామి నాకళ్ళకు కనబడుగాక.

2) భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిఞ్ఛం కటితటే దుకూలం నేత్రాన్తే సహచరకటాక్షం విదధత్ ।

సదా శ్రీమద్బృన్దావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

ఎడమచేతిలో వేణువును , తలపై నెమలిపింఛమును , నడుము నందు పట్టువస్త్రమును , కళ్ళచివర మిత్రులపై కటాక్షమును కలిగి ఉండి ఎల్లప్పుడు అందమైన బృందావనము నందు ఆటలాడు శ్రీ జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.

3) మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాన్తస్సహజబలభద్రేణ బలినా ।

సుభద్రామధ్యస్థస్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

సముద్రతీరంలో , బంగారు కాంతి - నల్లని శిఖరం కల భవనంలో , సోదరులైన సుభద్రా బలరాముల మధ్య కూర్చుని దేవతలందరిచే పూజింపబడు శ్రీ  జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.

4) కృపాపారావారాస్సజలజలదశ్రేణిరుచిరో రమావాణీసౌమస్సురదమలపద్మోద్భవముఖైః ।

సురేన్ద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో  జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

దయాసముద్రుడు , కారుమబ్బుల వరసవలే సుందరుడు , లక్ష్మి - సరస్వతి - సూర్యుడు - అగ్ని - బ్రహ్మదేవుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు , ఉపనిషత్తులచే కొనియాడబడువాడు అగు శ్రీ జగన్నాథ స్వామి నాకళ్ళకు కనబడుగాక.

5) రథారూఢో గచ్ఛన్ పథి మిలిత భూదేవపటలైః స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః ।

దయాసిన్ధుర్బన్ధుస్సకలజగతాం సిన్ధుసుతయా జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

రథమెక్కి ఊరేగుచూ దారిలో కలసిన బ్రాహ్మణులు చేయు స్తోత్రములలోని ప్రతిపదమును విని దయచూపించు కరుణాసముద్రుడు , సకల జగద్బాంధవుడు అగు శ్రీ  జగన్నాథస్వామి లక్ష్మితో కలిసి నాకళ్ళకు కనబడుగాక.

6) పరబ్రహ్మాపీడః కువలయదలోత్ఫుల్లనయనో   నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనన్తశిరసి ।

రసానన్దో రాధాసరసవపురాలిఙ్గనసఖో   జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

పరబ్రహ్మ స్వరూపుడు , కలువరేకులవలే  వికసించిన నేత్రములు కలవాడు , నీలాద్రిపై నివసించువాడు , అనంతుడనే సర్పరాజు శిరస్సుపై కాలుపెట్టినవాడు , ఆనందమయుడు , రాధను కౌగిలించుకొని సుఖించువాడు అగు శ్రీ జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.

7) న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం  న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ ।

సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

నాకు రాజ్యము - బంగారము - భోగము - ఐశ్వర్యము  వద్దు. జనులందరూ ఇష్టపడే అందమైన స్త్రీని నేను కోరను. ఎల్లప్పుడు పరమేశ్వరునిచే స్తుతించబడు శ్రీ  జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.

8) హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే  హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే ।

అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥

ఓ దేవరాజా! నీవు నిస్సారమైన సంసారమును తొందరగా హరించుము. ఓ యాదవపతీ!  నా పాపములరాశిని పోగొట్టుము. దీనుడను , అనాథుడను , బండవలే నిశ్చలంగా పడి ఉన్న నన్ను రక్షించుటకై శ్రీ  జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకం సమ్పూర్ణమ్ ॥

***

122.  దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |

ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ‖ 122 ‖ 

 607. దేవేశీ -దేవతలకు పాలకురాలు., 608. దండనీతిస్థా - దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.  609. దహరాకాశరూపిణి -  హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది. 610. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా - పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.


దేవతలకు పాలనాధ్యక్షని -- సేవ తత్పరమ్మె  

దండనీతినధర్మ శాస్త్రము   -- అండ నిలుపు కొరకు 

హృదయములో ఉండు రూపము -- హృదయవాంఛతీరు 

పాడ్యమి నుండియు పౌర్ణమి -- పాడి పూజ చేయు 

 

 123. కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |

సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ‖ 123 ‖ 

 611. కళాత్మికా - కళల యొక్క రూపమైనది.  612. కళానాథా - కళలకు అధినాథురాలు. 613. కావ్యాలాపవినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది.  614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా -వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.


కళలతో రూపమ్ము కలదియు -- కళలు నేర్పు తల్లి 

కళలకు అధినాధు రాలుగా   --  కళల నాధురాలు 

కావ్యము వల్ల వినోదిని     ---  సావ ధానమందు   

కుడిఎడమలవైపు సేవితా -- అడుగు అడుగు పూజ

 

 124. ఆదిశక్తి, రమేయా,ఽఽత్మా, పరమా, పావనాకృతిః |

అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ‖ 124 ‖ 

 615. ఆదిశక్తిః - ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.  616. అమేయా - కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది. 617. ఆత్మా - ఆత్మ స్వరూపిణి.  618. పరమా - సర్వీత్కృష్టమైనది. 619. పావనాకృతిః -  పవిత్రమైన స్వరూపము గలది.  620. అనేకకోటి బ్రహ్మాండజననీ - అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.

 621. దివ్యవిగ్రహా - వెలుగుచుండు రూపము గలది.


ఆదిగా శక్తిస్వరూపిణి --- కాదు లేదు అనని  

అలవికాని గుణించనట్టిది --- కలలు తీర్చు తల్లి 

సర్వీత్కృష్టమై స్వరూపిణి  ---  నరుల ఆత్మ రూపి 

బ్రహ్మాండమునతల్లి కాంతులు --  అహము తుంచె కాంతి 

 125. క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ ‖ 125 ‖ 

 622. క్లీంకారీ - ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.  623. కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది. 624. గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.  625. కైవల్యపదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది. 626. త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.  627. త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది. 628. త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది. 629. త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.

' క్లీం ' అను బీజాక్షరముగాను   -- కాంతి నిచ్చు మాత 
 తత్వపు కారణ నిష్టగా .   ----- తత్వ మాయ తెల్పు 
 నిత్య రహస్యమైనట్టిది     --- నిత్య సత్య మైన  
 మోక్షస్థితిని ఇచ్చు తల్లియే --- మోక్ష మిచ్చు మాత 
మూడు పురములను కలిగేను --- నేడు పాల నవ్వు 
మూడు లోకములచే పూజించు --- వేడు కొనుట వీలు 
బ్రహ్మ, విష్ణు,మహేశ్వ రని రూపి  --- అహము తగ్గు చేయు 
దేవతలకు ఈశ్వరి గ అండ ---- దైవ రక్ష గాను 
 
126. త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా ‖ 126 ‖ 🍀

 630. త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.  631. దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది. 632. సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది. 633. ఉమా - ఉమా నామాన్వితురాలు. మూడు లోకములచే పూజింపబడునది.
 634. శైలేంద్రతనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.  635. గౌరీ - గౌర వర్ణములో ఉండునది. 636. గంధర్వసేవితా - గంధర్వులచేత పూజింపబడునది.

మూడు అక్షరముల రూపిణి  -- - మూడు అక్షరమ్ము 
పరిమళ ద్రవ్య గంధములున్న --- స్థిర శక్తి కలది 
సిందూర తిలకముచేకాంతి --- సందియమును తీర్చు 
నామాన్వితముగా ఉమా.దేవి --- ప్రేమ పంచు తల్లి 

హిమవత్పర్వతము యొక్క పుత్రి --- హిమము పంచు తల్లి 
గౌర వర్ణములోన ఉన్నది    ---- గౌర వించు తల్లి 
గంధర్వులచె పూజలందేది -- బంధ యుక్తి కొరకు 
మూడు లోకములలో పూజించు --  వేడుకలుగ పూజ 

127. విశ్వగర్భా, స్వర్ణగర్భా,ఽవరదా వాగధీశ్వరీ |

ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా ‖ 127 ‖ 

 

విశ్వమునే గర్భముధరించు -- విశ్వ రక్ష కొరకు 

బంగారు గర్భము గలిగేను  --- అంగ సౌష్ఠ మగుట 

తనకు మించినదాత లేరును  -- మనసు ఇచ్చి పుచ్చు 

వాక్కునకు అధిదేవతగాను  --- మక్కువగను ఉంచు 


 ధ్యానము చేత పొందగలుగు -- ధ్యాన నిష్ఠ వలన 

విభజింప వీలులేనిది శక్తి     - నిర్భయమ్ము పెంచు 

జ్ఞానమునందించి పోషించు .- జ్ఞాన మయము చేయు 

జ్ఞానము మూర్తిగా దాల్చింది. - జ్ఞాన శక్తి యుక్తి 


 

No comments:

Post a Comment