అస్మదాత్మీయవిద్వత్కవిబంధుస్నేహితులందరికి విజయదశమీపర్వ శుభాకాంక్షలు + శుభాశయాలు !!! "
చం ప్రగతికి నీవె యంకుర సువర్ణ పదాలగు వెల్లువే సుధీ
పగలును రాత్రి గంధములు భవ్యపరాత్పర లీలలున్ సదా
పగలను మార్చి బంధములు బంచ ప్రకాశ ప్రభావమే మదిన్
మగసిరియర్ధ మోహములు మాన్య మనోమహి వేంకటేశ్వరా ..o01
: పుట్టుక యర్థమే యిదియు పూజ్యుల పల్కులు తెల్ప గల్గుటే
మట్టిని నమ్మియే మనము మానస నేస్తము నిచ్చి పుచ్చుటే
వట్టిగ మాట లేవలదు బంచుడి విద్యలు జన్మ మెందుటన్
బుట్టుక సార్థకమ్మనగ పున్నమి వెన్నెల వేంకటేశ్వరా ..o02
ఉ.మ్రొక్కెద ఎల్లవేళలను మోక్షము కోరిక నాదు జన్మగా
దక్కిన విద్య పంచుటయు దారిని చూపుట నాదు లక్ష్యమై
చిక్కిన ప్రేమ పాశమున చింతను చిక్కిన ధైర్య సంపదే
మక్కువతోడ నీదరికిమానక వచ్చెద వేంకటేశ్వరా..o03
ఉ. కాలము వెల్ల బుచ్చ కలి కాలము వెంటన కాల మంతయున్
గోలలు చేసి వెంటపడు గోప్యము లేకను బత్కు నంతయున్
హేళణ జేయు మానసము హీనత మార్చని జీవితమ్మదే
యేలె సతీ పతీ యన యెల్లరు మెచ్చగ వేంకటేశ్వరా.. O04
ఉ.ఆగదదేది నాది యని యాలన పాలన కొంత నేర్పుకే
వేగిర నున్న మానసము వీనులు విందుగ చింత మార్పుకే
మాగిన పండుగా రుచియు మానస ప్రక్రియ సర్వ సృష్టికే
మూగిన కామ చేష్టలను ముఖ్యము మార్చుము వేంకటేశ్వరా..005
ఉ. జీవిత సత్యమే పలుకు జీవన మార్గము నెంచలేక యే
భావము తెల్ప నమ్మకము బాధ్యత నెంచియు సేవ చేయుటే
యేవిధి నైనచేయుటయు నేమియటన్ననవేమి చేయకే
దేవర మెచ్చునట్లు మన దేవల మందున వేంకటేశ్వరా..006
శాంతముకోరి నిన్నుమది చక్కని వాంఛను తెల్పి యుంటినే
పంతము లేల నీకు మది పాలన లాలన పాఠమే కదా
పొంతన లేని మా పలుకు పోరుగ నేరుగ మీకు తెల్పగా
స్వాంతము చక్కదిద్దియను శాసన జేయుము వేంకటేశ్వరా..007
ఉం.ఖంగని శబ్ద ఘోషలగు ఖర్చుల కష్టములేలపెర్గెనే
చెంగని దూకబుద్దిమది చింతని తెల్చిన దొడ్డ బుద్ధిగా
ముంగిట వచ్చి మొక్కితియు ముందర లక్ష్యము తెల్పలేకయే
సంగతి యేది యైననిక సంతసముంచుము వేంకటేశ్వరా..008
ఉ.అచ్చట నిత్యకాంతులట అంబుజనాధుని కోరవచ్చెనే
ముచ్చట గొల్పు చూపులట బుద్ధి వికాసపు మార్గమందునే
ముచ్చట చూపు భక్తులగు ముందర మోక్షము కోరియుండుటే
చెచ్చెర ధర్మపాలనను జే నయనాలగు వేంకటేశ్వరా..009
ఉ.పాపము చేయువారు తమపాపము లన్నియు పంచగల్గుటే
ప్రాపితమైన కష్టమును ప్రాంజ లి తెల్పుచు వేడియుండిరే
మోపరి యైన వారిమది మోక్ష ము నిచ్చెడి బుద్ధి నీదయా
పాపమంచేయకుండ తగు బాటను చూపుము వేంకటేశ్వరా 010
స్త్రీ గతి నిర్విరామమగు లీలల గీతల బోధనేయగున్
స్త్రీ విధి సర్వ రక్షగసుధీర్గపు సత్యము తెల్పగల్గుటే
స్త్రీ మది నెంచలేరగుట శీఘ్రము బంధపు జ్ఞాననేతలై
స్త్రీ రమ జన్మ సాఫలత చిన్మయమౌధర వేంకటేశ్వరా .011
చం. తడిపొడి బత్కునూరువిధి తాపము నమ్మియు తిండినేతినే
గడసరి వాని కోర్కెలగు కామిత బుద్ధికి యాశ తీర్చుటే
గొడవల మధ్య జీవితము గొప్పగ జూపియు కాంతి రూపమున్
పొడిచెను ప్రొద్దుటూరున,నభోమణి రాతిరి వేంకటేశ్వరా 012
ఉ. రూకలు కోరి నేదలచి రోయుచు నీ దరి చేరి యుంటినే
మూకలు భక్తులేయనిన మూలుగు చున్నను నాదు జన్మ మీ
వాకిట సేవ చేసెదను వచ్చిన పైకము కుమ్మరింతునో
మీకడ ముక్తి చాలును సమీపము చూపులు వేంకటేశ్వరా..013
ఉ.సారము లేనిజీవనము సాధన నోచని భక్తి మార్గమున్
భారము బంధ మైననిక బాధ్యత వీడక ప్రస్తుతించెదన్
బేరములాడ లేనిదియు భీకర మైనను నాదు కొందువే
కూరిమి కోరియుంటినయ గోగణపాలప వేంకటేశ్వరా..014
ఉ.తెచ్చితి మొక్కులే ధనము తెచ్చితి పూలను పూజచేయగన్
మచ్చుకి కష్ట మైనమది మార్గము నీకును తెల్పగల్గుటన్
వచ్చితి నీదునామమును భక్తిగధ్యానము చేయుటందుకే
ముచ్చట తీర్చుమయ్య హరి మోహనరూపుడ వేంకటేశ్వరా..015
చం.క్రమముగ పూర్ణ బింబమయి కాలము మార్పుగ కూర్పు బట్టియే
విముకము నెంచ వీలవక వేగిర బంధము మార్చ నీడయై నిముషము నైన ప్రార్థనయు నెయ్యము వియ్యము బంధు వ ర్గమే
సముఖము నున్న వేడిగని సామ్యము సౌఖ్యము వేంకటేశ్వరా..17
నేనుగ నిన్ను కోరితిని నేస్తపు నీడయు నెల్లవేళలన్
మానుగ నైతి ఓర్పుగని మానస బుద్ధిని పంచగల్గితిన్
వానిని వీని నేననను వాంఛలు నున్నను కాల తీర్పుగన్
నానుడి గాలమై మనసు నాట్యము నిత్యము వేంకటేశ్వరా..18
No comments:
Post a Comment