అర్కమరీచి..న జ భ భ భ భ జ ర 24/13
పలుకుల నేస్త బంధము దీన ప్రభావము భాగ్యమగు సర్వ సృష్టిగా
మలుపుల జీవిగా మది భావ మహా మయ లక్ష్యమగు కాంతి దృష్టిగా
తలపులు నిచ్చి పొందుట సత్యపు తత్త్వపు నేస్తమగు నిత్య తృప్తిగా
అలల విశాల కాలపు తామస ఆశ్రి త సంభవము విశ్వ నిష్ఠయే
పలుకుల నేస్త బంధము దీన ప్రభావము భాగ్యమగు సర్వ సృష్టిగా
మలుపుల జీవిగా మది భావ మహా మయ లక్ష్యమగు కాంతి దృష్టిగా
తలపులు నిచ్చి పొందుట సత్యపు తత్త్వపు నేస్తమగు నిత్య తృప్తిగా
అలల విశాల కాలపు తామస ఆశ్రి త సంభవము విశ్వ నిష్ఠయే
(శ్రీమాతా వృత్తము :- "“భరభ భభమ” 18 - యతి 10”)
దీక్షను పొందగా మంగళ దీకృతి నిత్యము సత్యమ్మే
వీక్షణ వల్లనే సద్గతి విశ్వము కామిత స్వర్గమ్మే
శిక్షణ ఘర్షిణి పూర్ణిమ శీగ్రము సర్వము నిర్దేశీ
రక్షణ అమ్మగా వర్షిణి రమ్యత భావము శ్రీదేవీ
తలపులమ్మ వృత్తము.. భ త త భ న ర గ..10
ఈశ్వర నీసన్నిధీపార్వతీ మనసు కలి పే విదీ జగ్
దీశ్వర నీ పెన్నిధీ బ్రహ్మ దృష్టిగ పలుకు విద్య తెల్పే
పాశ్వము నీవన్నదీ ప్రశ్న పంతము వలన విష్ణు రక్షే
విశ్వ పరాశక్తి రూపే విజేతల కళలు రక్ష దేవీ
241..భార వహా.. ర త య గ..5
కక్షర మ్మే కాలము తెల్పేలే
శిక్షణ యే శీలము తెల్పేలే
భక్షణ యే బంధము తెల్పేలే
రక్షణ యే రత్నము శ్రీదేవీ
355
326.. ప్రసర ఉన్నత.. మ స స గ..7
చామంతీ వలితిన్ చతురత్మా
సామన్తమ్ముగ శేష విలాసా
ధీ మంతమ్మగు వైదిక మూర్తీ
ప్రేమాత్మా యగుటే విధి దేవీ
327.. ప్రహర్షిణీ.. మ న జ ర గ..8
నిక్షిప్తమ్ముగన ననేక కష్ట మౌనే
రక్షించే ప్రక్రియ పరాన్న భూతమౌనే
కాంక్షించే మనసు వికల్ప శుద్ధి పొందే
విక్షించే అవగత విద్య ఆత్మ దేవీ
328.. మలిణీ శ్రీ పుట.. న న మ య..8
అభయ వలయ మోహమ్మేను ప్రేమా
శుభములు గల ప్రాముఖ్యమ్ము ప్రేమా
రభముల మది ప్రారంభమ్ము ప్రేమా
యుభయ కళలు చేయున్నత్వ దేవీ
329..ప్రహ్లాధ.. సభ సభ సభ ర గ..7,13
భవ బంధమ్ముల భయ హేలల్ విన బడు నేలన్ నర జన్మ మూలన్
భవ శాపమ్ముల భయ రోగమ్ములు బడు భూమిన్ విధి కర్మ మూలన్
భవ రూపమ్ముల పరమార్ధమ్మున భగవన్నామము భక్తి మూలన్
భవదీయమ్మగు భవసారమ్ముల పర శక్తీ సహనమ్ము దేవీ
330.. ప్రాకార బంధః..త త త గ గ..7
దాహమ్ము ఏర్పాటు దాత్రుత్వ మేలే
దేహమ్ము తోడ్పాటు దీనత్వ మేలే
సోహమ్ము దాస్యమ్ము సూత్రమ్ము మేలే
నీ హార లక్ష్యమ్ము నీ భక్తి దేవీ
331.. ప్రియ కాంత.. న య న య స గ 11
నటనల నాట్యం నయన నినాదం సమయమ్మే
అటుకుల శబ్దం చటకు నిదానం సహనమ్మే
చిటికల శబ్దం తలపు విలీనం ప్రభవమ్మే
కిటుకుల వైనం మనసు న కీర్తి దేవీ
332.. ప్రియ జీవితం.. భ భ భ భ భ భ భ భ గ గ
లెక్కలు జూచిది నిత్యము నిల్చెడు లీలల గుక్కలు తిప్పక నుండుట యేలే
చిక్కుల చుక్కుల కర్మలు దీర్చెడు చిక్కెడు భారము లన్నియు దీర్చటయేలే
దిక్కుల దిక్కుగ చక్కగ దక్కుచు దీనుల సాయము పొందుట సత్యము యేలే
మ్రొక్కుల మాయెన దాగెడు నిశ్చల మోక్షము నిచ్చెడి జీవన సారధి దేవీ
333.. ప్రియ వచనము.. న య మ గ..7
మెలుకువ నెంచే మాధుర్యమ్మే
తెలివిని జూపే చాతుర్యమ్మే
అలసట చేందే ఆత్మీయమ్మే
మెలుకువ వల్లే మోక్షం దేవీ
334.. శిశు భరణం.. నన నన సగ..10
కలక కరుగు కలియుగము సుఖముగాలే
నిల నిలయ దినకర నికర మేలే
కలతల నెలవు తరగనిదేలే
స్వలితలపు మదిమన సహదేవీ
335.. బంధక.. భ న మ గ..6
గట్టున మెలగ చింతాక్రాంతిన్
పట్టున తడుప శాంతావాసిన్
కట్టుగ మెరగ శీలా సౌరీ
పట్టున సలప దివ్యా దేవీ
346.. భసలసలాక.. స భ స మ న య త న గగ..9,17
మలుపే బంధ మగుట మాంగల్యం మే మనసగు మార్గమ్మే జ్ఞానమగుట ప్రేమా
పలుకే సత్య మగుట ప్రారంభమే స కలము ప్రేరత్వం సర్వ మగుట ప్రేమా
వలపే దాహమగుట వాచల్యమ్మే సమయము యారోగ్యం నిత్య మగుట ప్రేమా
అలుకే ఆనతియగు ఆశ్చర్యమ్మే వినయము యానందం విద్య యగుట దేవీ
347..భస్త్రనిస్తరణం.. మస జ ర స గ..15
విశ్వమ్మంతయు రక్షసేయు దైవమే తరువై నీ
శశ్వచ్ఛుండపరాక్రమోద్ధ తిష్టయే మనసై యీ
విశ్వశ్రేయము గూర్చు తల్లి సేవ యే కరుణా ణీ
విశ్వాసమ్మునకున్ బలమ్మి కూర్మి గావిన దేవీ
348.. భారావతార: న స జ న న త గగ..13
అవసరము గా సహాయ పలుకు అనుభవమ్మేను ఓర్పే
నవవిధములేను భక్తి వినయ నయనాల నేర్పే
యువకుల విద్య లనేర్పు సహన యువలోక తీర్పే
భవ భవము భారతీ విజయము భవ నేస్త దేవీ
349..భాజనశీలా.. త య ర ర గ..7..
సంతోషము యుర్వీ సామ రస్యమ్ము గానే
పంతమ్ములు సర్వమ్ ప్రాణ రక్షత్వ మేలే
శాంతమ్ములు పొందే సాహసమ్మేనులే ప్రే
మత్వమ్ముయు కోరే మానసమ్మేను దేవీ
349.. భాజనశీలా.. త య ర ర గ..7
ఆరోగ్యసహాయం అర్ధ దేహమ్ముగా స
మ్యారాగము చెప్పే మానదాహమ్ముగా సు
స్వారాజ్యము పొందే సాధ్యసాద్యమ్ముగా యీ
భారమ్మగు వైనం భాద్యతా బంధమ్ము దేవీ
350.. భాష మాన భింబం..రస భస జభ నయ..7, 16
ఎల్లవేళలా భయమ్ము మరచియే మదీయ ఎల్లలు గనుట సాధన్
కల్ల లాడకే జయమ్ము తలపుయే సహాయ కాలమగుటయు సాధన్
జల్లులాగనే నిజమ్ము మలుపుయే విధాన జాడ్యము కళల సాధన్
తల్లిలాగనే వినమ్ర సహనమే సుతార తత్త్వము తెలుపు దేవీ
355..భీమావర్త:. మ భ న న స గ..11
వేదంమ్ముల్ యోగము విజయసభ సమయమేలే
మోదమ్ముల్ రోగము విముఖసముఖ ముగనేలే
నాదమ్ముల్ రాగము సహజము నటన మదినేలే
ఖేదమ్ముల్ దీర్చుట నియమము కళలు దేవీ
356..య య య య..8
నియోగమ్ములన్ సంఘ నిర్మాణ మేలే
వియోగమ్ములన్ సంఘ విజ్ఞాన మేలే
దయామూర్తిగన్ ధర్మ జిజ్ఞాస యేలే
నయమ్మై జనానంద నాదమ్ము దేవీ
357..బుజంగ:.. యయ యయ యయ యయ..8,21
గుణాత్మా సుఖాత్మా సగుణ్యాత్మ భూతాత్మ పూతాత్మ సంచార సా గుణ్య రూపా
ధనాత్మా నవాత్మా విధాతాత్మ భా వ్యమ్ము సంఘమ్ము ధర్మమ్ము సంతాన రూపా
జనాత్మా సురాత్మా విసుద్దాత్మ దేహాత్మ జీవాత్మ దివ్యాత్మ నాదాత్మ రూపా
ఘనాత్మా శివాత్మా ప్రకాశాత్మ లక్ష్యాల కాలమ్ము వైనమ్ము వైగాచు దేవీ
358.. మధుకరీ.. న న మ యతి లేదు
కనులు కలియు భాగ్యమ్మే
తనువు రగిలి దుఃఖమ్మే
క్షనిక సుఖము బంధమ్మే
మనము తెలుపు శ్రీదేవీ
359.. భుజంగ శిశురుతము .న న య యతి లేదు
చిలక పలుకుల యందున్
కలత చిలికెడి నందున్
మలుపు తిరిగెడి చిందున్
కలము కలలగు దేవీ
No comments:
Post a Comment