ఇంట్లో పాడైపోయిన విరిగిపోయి న లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..
ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు ఏ దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం.
క్షమించరాని నేరం. ఇంట్లో వున్నంతకాలం పూజలు చేసి తరువాత అవసరం లేదని లేదా పాడైపోయాని వాటిని ఏ చెట్టు🌳 క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన "హిందూ దేవుళ్ళ" ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు. వారికీ ఆ అవకాశం ఇవ్వకండి.
ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికి 🔥ఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం మీకు రావచ్చు.
కానీ అగ్ని 🔥సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు లేదా ప్రవహిస్తున్న నది🌊లో గాని మన ఊరి చెరువుల్లో గాని "నిమజ్జనం" చేయండి. అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి 🙏నమస్కరించి '' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.
ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ 🗣సమాచారం ఇవ్వండి. ఇది మన కర్త్యం. ధర్మ ఆచరణ చేయండి. ధర్మాన్ని కాపాడండి. "ధర్మో రక్షతి రక్షితః".
"ఓం నమో నారాయణాయా 🙏🕉
ధైర్యము వల్లనే సంపద ధర్మము లభ్యము
శౌర్యము వల్లనే విజయము శక్తి లభ్యము
జ్ణాణము వల్లనే మోక్షము జపము లభ్యము
దానము వల్లనే సత్కీర్తి తపము లభ్యము
మత్స లేని దేది నచ్చు మనసు
సత్స మేది తెల్ప లేని బతుకు
వత్స రాది నాడు వచ్చె నవమి
నిత్స మైన వాడు పుట్టె దశమి
వన్నెలే మన మధ్య పోరు గ వల్క బోరున దేనికో
కన్నులన్నియు చూచు చుండెను కామ్య మోనము దేనికో
చన్నులన్నియు శిల్ప మల్లెను చూడ పల్కులు దేనికో
మిన్ను నున్నను ఆశ ఉన్నను మన్ను నున్నను దానికే
******************
మంచె మీద మగువ పిలుపు లగుచు
పంచు కొనెటి మగని పనిని తలచు
ఎంచు కొనెను మనసు పంచ దలచు
కంచు కంఠ ముగను పిలుపు దాచు
పంచు కొను మనిషి పక్క చరుచు
ప్రేమ మనసు విరియు సుమము లగును
ప్రేమ భువన వెలుగు కురియు కలలు
ప్రేమ బ్రతుకు విమల రవము రగును
ప్రేమ చినుకు విషయ వలల కళలు
ప్రేమ మెరుపు వినయ పూర్వ కమ్ము
మనిషి కళలు మార్పు మనసు చేరి
వినయ తలపు వాంఛ వరుస మారి
తనువు తపన తీపి వెంట కోరి
అణువు యొక్క అలుపు ఆశ వూరి
కణము అరుపు కావు కావు మనెరె
ఒంటరి గాను ఓర్పు వృద్ధు లందు
ఇంటి నందు ఈశ్వర కృప చెందు
అంటి నట్లు అంట నట్లు పొందు
కంటి నీరు కార గుండు నందు
చంటి వాడి చూపు మల్లె బతుకు
పతకాలు సాధించు దేశపు పర్వాలు పండుగగా
పెద్దల ప్రశంస పరముగా పిన్నలు ఉత్సాహమ్ము
ఆటల పోరులో భాగంగా భారతీయ ప్రతిభ
బహుమతులుతొ వెల్లువ విరిసే బ్రహ్మండమందు
దక్షిణమ్ముగ పుజసల్పియు తక్షణమ్మున సేవలే
అక్షరాస్యత ఆత్మతృప్తియు అక్షయమ్ముగ సాగులే
దీక్ష సల్పియు నిష్టచూపియు దీప్తి వెల్గులు వచ్చులే
సాక్షి గుండియు నిర్మలమ్ముగ సామరస్యపు భావమే
చిటికేయుట హృదయ వాంఛ పిలుపన్నాయన్
కుటిలాలక యెడమ కన్ను కుడికన్నాయన్
పటికే జలములలొ మడ్డి తొలగించేయున్
కిటికీ పవనుడను పిల్పులతొఆహ్వానమ్
కత్తుల బావినందు మది కాంతిని దోచియు మన్మధుండుగా
చిత్తము తెల్పియే సుగుణ జాడ్యము చూపియు చింతచెందియే
మత్తుగ నుండియే మనసు వాకిలి తెర్చిన చెప్పి నామగం
డుత్తమడంచు బేర్కొని యూరో సతి గోరుకొనెన్ విడాకులన్
వను కాయే మనసాయె హాయిగొను యుక్తిన్ శ్రీ కరుండైతివే
వినునంతా వివరమ్ము ప్రేమ గను భక్తిన్ శ్రీ చరుండైతివే
కనునంతా కలనందు సేవలుయె శక్తిన్ శ్రీ ధరుడైతి చం
ద్రునిమౌళిన్ ధరియించు నాథ నను భక్తున్ బ్రోవవే..నీదయన్
0
నీతి పరుని నింద మోపు టేల
ఖ్యాతి పరుని ఖర్చు నడుగు టేల
ప్రీతి పరుని పలుకు కధలు యేల
జాతి గూర్చి జపము బాధ యేల
ఛాతి చూసి జయము చెప్పు టేల
మధుర మైన మాట తీయ గుండు
నిదుర పోవు నీతి చేదు గుండు
బెదురు తోను బేర కార మెండు
చెదురు బుద్ధి చెప్పాలి మవ్వ గుండు
ముదురు తెలివి ముడుపు వగరు గుండు
తప్పు అనుట దమన కాండ కలుగు
ఒప్పు మంచి ఓర్పు నేర్పు గలుగు
పప్పు కూడు పెట్టి పెంచ గలుగు
చిప్ప కూడు చింత వల్ల జరుగు
అప్పు వల్ల ఆస్తి అంత కరుగు
కామ మున్న కళలు మాయ మవ్వు
నామ జపము నందు తృప్తి నివ్వు
ప్రేమ పాఠ పలుకు లందు కొవ్వు
భామ కులుకు పట్టు నందు నవ్వు
జాము రాత్రి చంద్ర బింబ పువ్వు
మనమ్ముతో తపమ్మతో సమమ్ముగా అనామికే
సునామియే సుఖమ్మగా సుభమ్ముగా సుధామణే
వినమ్రమై విధానమే వివాదమే విధూషిణీ
ఘనమ్ముగా భయమ్ముగా మదమ్మగా సహాషిణీ
అందమైన మోము చందనమ్మ చేరి సుందరాంగి రూపు
మంద హాసచూపు అద్దమందు మెరుపు అదిరిపోవు సొగసు
విందు చేయు ఛాతి పొందు కోరు జాతి మత్తుమోహనాంగి
చిందు లేయకుండు జయము నీకు కలుగు సద్దుచేసిపొమ్ము
ఆమెని పిల్పులు ఆశల కొల్వులు ఆర్త నాదపు ఆత్రుతయే
సోముని నవ్వులు సోకుల చిందులు సొప్పగ పల్కలు సొమ్ములయే
కాముని సప్పుడు కార్యమప్పుడు కాలమెప్పుడు కాంతులు యే
ప్రేమను పంచియు ప్రేమను పొందియు ప్రేమ జీవిగ జీవితమే
0 comments
.......
లోక ముందు లహరి లాగ నుండు
ఏక మైన ఏక బుధ్ధి కలుగు
శోక మైన సాము చేయు చుండు
పోక చెక్క పోరు కలిగి వుండు
కాక పట్టి కాపు రమ్ము చూడు
కోప మున్న కోరు కున్న బాధ
తాప మున్న తపన తీర్చు బాధ
పాప మున్న పనుల లోన బాధ
శాప మున్న శని అసూయ బాధ
బాపనయుని మాట బాధ తొలగు
మారనిది ప్రేమ మనసు కలిగిన వేదమ్
ప్రార్ధన ల క్రాంతి గుణము వలననె దేశమ్
సర్వ విధి భ్రాంతి తొలిగి సహజపు సేవల్
భారత దేశంబు ఘనత పదిలము సేయున్
అమ్మ పల్కును ఆదరమ్ము గ ఆలకించియు యీ సహా
యమ్ము తెల్పియు పంచ పాండవ లందరూ సహనమ్ము గా
బొమ్మ యైనను కొమ్మయైనను భక్తినిమ్మియు నిత్యమూ
ప్రేమ పంచియు కృష్ణ తీర్పును సావధానము ఒప్పుటే
నేరము చేయ నేమి బతు కంతయు చుక్కలు చూపు టేమి యౌ
కారము కల్గునేని కల కాలము చెక్కెర లాభసాటి యౌ
బేరము వల్లనేమి పలు కాయలు కుల్లియు పోవు టేమియౌ
హారము పొంది యున్న పలు కోర్కలు భార్యకు కల్గు టేమి యౌ
ప్రేమను పొందియు పంచుటే...భావమ్ము భాగ్యమ్ము బంధమ్మె
క్షేమము తెల్పియు నిత్యమూ.. చైతన్య సౌభాగ్య భావమ్మె
సౌమ్యము గుండియు సత్యమే ... సర్వమ్ము పద్యమ్ము గద్యమ్మె
సామము దానము భారతీ..... సంతృప్తి సాహిత్య వాగ్దేవి
0
ధనమును తృణముగ దలచిన వారు
ఋణముయు బతుకుకు ఋతువులు వారు
కణములు కలిపిన కధలతొ వారు
మణిమయ సుఖమును మలిచెడి వారు
మనసు న మెచ్చిన మాన్యులు వారు
మనము గ చెప్పిన మనుషులు వారు
వినిమయ ధర్మపు వనితలు వారు
ఘనమగు కీర్తితొ గాలులు వారు
హేమ మైన హేయమైన బతుకు
రామ నామ రమ్య మగును పలుకు
సీమ లోన సమర మైన ఓర్పు
భామ ఎంత భజన అంత నేర్పు
అనురాగం సదా మోహం
సుసంపన్నం యుగార్ధతమే
సహాయకులు మాధుర్యం
సహనమ్మే మనస్తిరమే
*🙏🙏నమస్కారం🙏🙏*
అది ఒక రైల్వే స్టేషన్.. పిల్లవాడు తాగే నీరు అమ్ముతున్నాడు.
ఒక పెద్దాయన "అరేయ్ ఇటురా..." అని పిల్లవాడిని పిలిచాడు.
"ఒక ప్యాకెట్ ఎంత?" అని అడిగాడు.
"రూపాయి" అన్నాడు.
"యాభై పైసలకు ఇస్తావా?"
కుర్రాడు ఏమీ అనలేదు. చిన్నగా నవ్వాడు.
ముందుకు సాగిపోయాడు.
ఇదంతాచూశాడు ఒక సాధువు.
రైలు దిగి ఆ పిల్లాడి వద్దకు వెళ్లాడు.
"ఆ పెద్దాయన అన్నదానికి ఎందుకు నవ్వావు?" అని అడిగాడు సాధువు.
"స్వామీ... అతనికి దాహం వేయలేదు. దాహం వేసిన వాడు ముందు ప్యాకెట్ తీసుకుని నీరు తాగుతాడు.
తరువాత ధర ఎంత అని అడుగుతాడు. అతనికి కేవలం టైమ్ పాస్ కావాలి." అని అన్నాడు.
"నిజమే... దేవుడిని కోరుకునేవాడు తర్కాలు, కుతర్కాలు చేయడు. ఆత్రంగా సాధన చేస్తాడు. ఆర్తితో పూజిస్తాడు తప్ప శషభిషలుండవు.
అవసరం ఉంటే బేరం ఉండదు. అవసరం లేకుంటే బేరం తప్ప మరేమీ ఉండదు." అనుకున్నాడు
సాధువు.....
"సత్య హీనా వృధా పూజా
సత్యహీనో వృధా జపః
సత్య హీనం తపో వ్యర్థం
ఊషరే వపనం యథా "
చవిటి నేలలో(నిస్సారమైన భూమి లో) విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్టుగా సత్యహీన మైన పూజ, జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాం రమ్యతారక్తి రవ్వల వెలుగె
గెలువె లవ్య రక్తి రతామ్య రరాం
రాం గమ్యతాశక్తి యవ్వన జెలుగె
గెలుజెనవ్వయక్తి శతామ్య గ రాం
అతివ తెలుపు ఆలుమగల గుట్టు
అతిధి తెలుపు ఆశ పాశ మెట్టు
పతికి తెలుపు పడక నందు పట్టు
సతికి తెలుపు సుఖము లోని రట్టు
బతికి తెలుపు భాగ్య ముండు ఒట్టు
చుక్క లన్ని చక్క గుండు టేను
మోక్కు లన్ని మక్కు తీర్చు టేను
కిక్కు లన్ని కక్కు తెచ్చు టేను
చిక్కు లన్ని చక్క గుండు టేను
ముక్క లన్ని మక్కువుండు టేను
వద్దు అంటె వాట మంత చూపె
సద్దు అంటె సంబ రమ్ము చేసె
హద్దు అంటె హాయి అంటు వేసె
పొద్దు అంటె ఫలము అంటు తీసె
మోద్దు అంటె మోజు అంటు ఆశె
వంకలేనమ్మ డొంక పట్టుకొని ఏడ్చె
సంకనెక్కని భర్త ముట్టుకొని ఏడ్చె
అంకమందేను అండ పెట్టుకొని ఏడ్చె
బంకతీసేను చెట్టు పట్టుకొని ఏడ్చె
జంక గుండాను చంప తప్పు చేసి ఏడ్చె
1 comm
********
దీన్ని గురించి ఒక చోట చదివాను... మిత్రులతో share చేస్తాను...
ఒక్కప్పుడు జగదంబ భండాసురుడు అనే రాక్షసుడుతో యుద్ధం చేస్తుండగా, వాడి సోదరుడు విశుక్రుడు అనేవాడు ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి ప్రయోగించాడు.. ఆ యంత్రం పేరు" జయవిఘ్న శీల".. దానిలో 8 విఘ్నాలు కూర్చి ఉంచాడట..
1) అలస,( సోమరితనం ) 2) దీన 3)కృపణ(బేలతనం ) 4)నిద్ర 5)తంద్ర ( కునుకు పాటు )
6) క్లీబ (వెనుదీయటం ) 7) ప్రమీలిక ( సంకోచం )
😎 నిరహంకార
ఇవన్నీ కలిసి దేవతల సైన్యం మందకొడి అయ్యేట్టు చేసి వారిని ఓడించారు...
అప్పుడు జగన్మాత ఈశ్వర దర్శనం చేత పొందిన ఆనందం తో, మందహాసం చేసింది.. ఆ తేజం నుండి గణపతి ఉధ్భావించ్చాడు..
ఈ ఆనంద చైతన్యం తో, ఆ 8 విఘ్న శక్తులు సంహారించబడ్డాయి...
మంత్ర శాస్త్రం లో, గణపతి పుట్టుక గురించి ఉన్న కథలలో ఇది కూడా ఉన్నది...
ఈ గణపతి శక్తిని భావించి
ఐశ్వర్యం కోరే వారు లక్ష్మీ గణపతి గా,
శీఘ్ర ఫల ప్రదాత గా క్షిప్ర గణపతి గా
కోరికలు తీర్చే చింతామణి గణపతి గా
సిద్ధులను ప్రసాధించే " సిద్ధి గణపతి " గా
సాహిత్యంలో అక్షర గణపతి
సంగీతం లో స్వర రాగ గణపతి గా
నృత్య శాస్త్రం లో నర్తన గణపతి
శిల్ప శాస్త్రం లో బహురూప గణపతి..
ఇలా అందరూ వారి వారి ఉపాసనను చేశారు.. దీనినే గాణపత్యం మతం అని కూడా అంటారు...
శుక్లామ్బరధరం విష్ణుం...... శ్లోక రహస్యం కూడా అదే...
అలాగే యజుర్వేదం లోని " ఓం గణానామ్ త్వా... మంత్రం కూడా.. ఊతిభిః సీద సాదనం అని అంటుంది అంటే సత్వరం కాపాడి అనుగ్రహించుదువు గాక అని భావం....
కొంచెం critical గా observe చేస్తే " జ్ఞానా నంద శక్తి నుండి ఉత్సాహం కార్యాశీలత, success, జనించి, అలసట, నిద్ర కునుకు ఇత్యాది వికారాలు పోయి, సంతోషం, success వస్తుంది , అని symbolic గా చెప్పారు...
స్వామి వారి నైవేద్యం కూడా " మోదకము" అని తెలిసిందే గా.....
ఇదీ ఒక నేపధ్యం లక్ష్మిగణపతి కి
🙏🙏🙏
కంచె చేను మేస్తే మరి కరుణ ఏది
రెప్ప కంటినె కాటేస్తే రణము ఏది
బిడ్డ నే తల్లి చంపెస్తే పలుకు ఏది
చెడ్డ యే రాజ్య మేలితే చెప్పు టేది
నమ్మ పలుకులే నాశనమ్ము చేయుు
మంచి పనులు మనసు కిచ్చు హాయి
కంచి నందు కనుల అమ్మ చూడు
సంచి నందు సరుకు వుంచు హాయి
నుంచి ఏమి ననకు దాచ గుండు
ఖచ్చితాలు కులము నందు హాయి
శీల తత్వ సహన ముంచు పుడమి
సమయ తత్వ సూర్య యందు వెలుగు
వినయ తత్వ విశ్వ మందు బలిమి
జయము తత్వ చంద మామ వెలుగు
మనిషి తత్వ మాయ కలుగు పుడమి
మతము మరచి యున్న మనసు మారు
కథలు తెలిపి గాయ పరచ వద్దు
వెతలు తగ్గు వేగ పడుట మారు
గతులు తప్పు గళము పెంచ వద్దు
మతియు మారు మోనముండి యున్న
అమ్మ తెల్పు అలక వొద్దు అనెను
కొమ్మ కుండు కొత్త తేనె చుండు
నిమ్మ కుండు నీకు తెలుసు అనెను
బొమ్మ యైన బోధ చేయు చుండు
నమ్మ కమ్ము నిన్ను బతక మనెను
పలక పైబలపము తోను పలుకు లేల
అలకతో పలకలొ గీసి మవ్వు చుండు
బలప ముండగ సాధ్యము పదము వ్రాయు
వెలుగు అక్షరం వరుసగా వైన మవ్వు
నలిగి భయమనందున వుండి నటన వద్దు
అలిగి సుఖములందు మగువ ఆట లాడు
పొలతి పదములంది మగడు పూజ సేయు
చిలుక పలుకుతూ ముక్కుతో చిగురు తినును
అమ్మయె సర్వమూ కనును కార్యము మిక్కిలి భారమైన నే
కొమ్మలు ఉన్ననే తరువు కొత్తగ కాయలు పంచుటే నులే
నిమ్మతి నీరు కార్చుటయు నీకును నాకును బాధ్యతే సుమా
బొమ్మ రిల్లే యనీ అనకు బంధము తోనుయె సంతసమ్ము యేచెల్లు బాటు చిందు లేల నీకు
చిల్లి గవ్వ చిక్కగుండు నీకు
చల్ల నమ్ము చిన్న దొద్దు నీకు
చెల్లి పెల్లి చేసి తుదకు నీకు
చిల్లు బూర చక్క చేయి లేవు
సిరులు పొందాలనే..ఆశ ఘొరమ్ముయే
సరులు పొందాలిలే.. భేషజం లేదులే
ధరణి యందేనులే.. ప్రేమ గుచ్ఛమ్ములే
త్వరగ రావాలిలే.... కోర్క తీరాలిలే
తనను తానేననీ...దారి దారేననే
మనకు మాధుర్య మే.. మోహ ఆదర్శమే
తనువు తాపత్రమే... దాపరీకమ్ముయే
మనసు మాంగల్యమే.. మేలి బంగారమే
సూర్య రశ్మి సర్వ జనుల తాకు
కార్య జయము కావలెనని తాకు
అర్ధ మందు ఆర్య పలుకు తాకు
సర్వ శిద్ధి సుఖము కొరకు తాకు
సూర్య కిరణ సంఖ్య కళలు తాకు
నేత్రమ్ము చిమ్మును వెలుగుతో నెమ్మది నెమ్మది గా
గాత్రమ్ము వినిషించు డమరుకం కాలమ్ము శాంతి గా
అతని హృదయముయే సరస గంగాధర శబ్ధమ్ము గా
అతని రచనా చమత్కృతి శివ తాండవ కృతులు గా
నీ దయ వల్లనే మనసు నెమ్మది నుండెను నిర్మలమ్ము గా
నీ దయ నిన్ను నే తలచి నిత్యము పూజలు నిర్భయమ్ము గా
నీ దయ సంభవమ్ముగును నీ కృప కావ్యము నిశ్చయమ్ము గా
నీ దయ జూపు నాపయిన నిన్నును కోరితి ధర్మయుక్తి గా
మమ హృదయమ్ము నా కలిగె మనో బలమ్ముయు జీవరక్ష కై
కమల వినమ్ము యే సహన ము కోమ లమ్ముయు కాలదీక్ష కై
సమరము మాని శూలి రంభ సమ్మున బారెను ప్రాణరక్ష కై
సమయము నందు పొందు భయసమ్మున కోరెను కార్యదీక్ష కైనిత్య సత్య ప్రాంజలి ప్రభ పద్యాలు..3/8
కాలము ఏదీ కార్యము నందు
ఆలన ఏదీ పాలన ముందు
తాళము ఏదీ గొళ్ళెము నందు
మేళము ఏదీ పండుగ నందు
ఆకలి ఏదీ ఆశల యందు
రోకలి ఏదీ దంచుట యందు
చాకలి ఏదీ యుత్కుట యందు
చీకటి ఏదీ వెల్గుల నందు
ఆత్రుత ఏదీ పోరుల ముందు
భద్రత ఏదీ బాధ్యత యందు
ముద్రలు ఏవీ ముక్కెర నందు
నిద్రలు ఏవీ నాటక మందు
ఆశయ ఏదీ కార్యము యందు
పాశము ఏదీ మోహము నందు
జోస్యము ఏదీ జాప్యము నందు
హాస్యము ఏదీ ఆత్మలయందు
సౌమ్యము ఏదీ సాహస మందు
గమ్యము ఏదీ గోప్యము నందు
రమ్యపు ఏదీ బాధ్యత నందు
దాశ్యము ఏదీ జోశ్యము పొందు
0
రెండు అక్షరాలు * మద్యం వద్దు
" విస్కీ " " బ్రాందీ " " రమ్ " " జిన్ " " వోడ్కా "
" బీర్ " " స్కాచ్ " " గ్లాసు " " నీళ్లు " సోడ "
" బార్ " " పెగ్ " " మత్తు " " వాంతి " " రోడ్డు "
" జనం " " మానం " " భార్య " రోగం " " ఖర్చు
"డప్పు " " ఏడ్పు " " పోరు " "ఆశ " "డబ్బు "
" అప్పు " " ఆస్తి " " చావు " " పాడి " " గుంత "
" అగ్ని " " తిథి " " ఫోటో " :" మద్య " "పానం"
*వద్దు:" ఉంటే రోడ్డు పాలు *వద్దు:"....
సమస్యను పూరించుట..
రణమై సాగుట నిత్యమూ ధరలు రాష్ట్రంలో ఓదార్యం చెడున్
ప్రణమై పొందుట సర్వమూ కళలు బాంధవ్యం ప్రభావం చెడున్
రుణమై ఉండుట గుర్తుగా బతుకు రాగత్వం రమ్యత్వం చెడున్
ధనమై పోదురు శాంతికాముకుల క్రోధాగ్నుల్ విజృంభించుచోన్
నీకు ముఖపుస్తక ము ఉంటె నవ్వులు ఉన్నట్లు
వేకువ ఝామున కధలు వెల్లువ వికసించు
మక్కవతొ ఆకర్షించు ట మేలు గ ఉంటుంది
చక్కని నిత్య సంఘటనల చిత్రాలు ఉన్నాయిరా
మనము నేరాలు, ఘోరాలు మనుగడలో చే యోచ్చు
మనుగడ సిగ్గు తో భయం తో మోటుగా మా రొచ్చు
వినయ మే దారుణ మగు టే విశ్రాంతి కలగొచ్చు
చినుకు లన్నియు నదుల లో చేరి దాహం తీర్చచ్చు
తనువులు ప్రేమ బంధాల దారిగా మా రొచ్చు
విను నవన్నీ నిజములయ్యె విధము కాక పోవచ్చు
కనులు వంచన వాంఛలు కురిపించి బతకొచ్చు
అణువు పరమాణువు కలిసి ఆశను మార్చొచ్చు
కణము స్త్రీ, పురుషుల మధ్య దగ్గర ఒక టవ్వచ్చు
గుణము ఆలు బిడ్డల రక్ష గోప్యత మవ్వొచ్చు
రణము కాంతా కనకముయే రక్తము చిందొచ్చు
మనసు మర్దన ఆరోగ్య మర్మము మారవచ్చు
కళ్లు మాయచే కధలన్ని కనికరం కాకపోవచ్చు
చెల్లు బాటుల తేడాలు చైతన్యం కాకపోవచ్చు
ఇల్లు ఇల్లాలి కోరిక తీరక పోవచ్చు
ముళ్లు ఎన్నుంన్న బాధల మెప్పును లేకపోవచ్చు
ంంంంంంంం
నిదుర పోరా మువ్వ గోపాలా
ఎదురు చూసి కనులు కాయలు కాసేనురా
అదురు చెందకు బెదురు వద్దురా
సదరు సేవలో హాయిగా నిదురపో గోపాలా
చక్కగా నెలరాజు కొలువు దీరాడు
చుక్కలన్నీ మెరుపుల తోనులె మెరిసాయి
దిక్కులు గా తెలియ పరిచి ఉన్నాయి
మోక్కిన వారికి మోక్షము ఇచ్చే గోపాలా....ని
పాలు తాగిన దూడ నిదురపోయింది
వేలు పట్టీ చీకి నిదురపోరా నాతండ్రి
ఆలు బిడ్డలు ఇంక నిదురపోలేదు
గోల చేయకు అన్నీ ముద్దులిచ్చెద గోపాలా...ని
పాట పాడిన పడుచులు వెల్లారు
ఆటలాడిన పిల్లలు అలసిపొయ్యారు
బాట లన్ని చూపు పరమాత్మ
తోటలో పూలన్ని నీకే నిదురపో గోపాలా..ని
గిలక్కాయలు చూస్తూ హాయిగా నుండురా
కాలగజ్జలు పెట్తాను నవ్వుతూ హాయిగా నిదురపో
అల్లిబిల్లి ఆటలు ఆడావు గదురా
అలక చూపక కలలు తీర్చు గోపాలా.....ని
0
No comments:
Post a Comment