Monday, 16 August 2021

 


1🧘‍♂️జ్ఞానిసన్నిధి🧘‍♀️*


 దేవుడు నిద్ర నుండి లేపితేనే...     మేలుకునే మనం!

    దేవుణ్ణి నిద్ర లేపడనికి సుప్రభాతం పాడుతున్నాము.

    ఇది విచిత్రంగా      లేదూ !...


* 'ఇచ్చట నీడ దొరకబడును' అని ఏ చెట్టూ బోర్డ్ వేసుకోదు.

* ఎండనబడి వచ్చినవాడు ఎవడైనా నీడను చేరి సేద తీరుతాడు.

  

*ఏ వ్యక్తి గుణదోషాలనుగాని అతడి చర్యల స్వరూపాన్నిబట్టి నిర్ద. ఏ దృష్టితో, ఏ విధంగా అతడు తన కర్మలను నిర్వర్తిస్తాడో దానిని బట్టి మానవుడి న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చును.*

****


*(-Sri Paramahansa యోగనంద / శ్రీ పరమహంస యోగానంద)*

*(- పవిత్రీకరణ / Purification)*

*మంచిని చెయ్యడానికి మనం ఒక్కొక్కసారి బాధను అనుభవించాలి. ప్రభు దర్శనం కోసం బాధననుభవించడానికి మనం సిధ్ధపడి ఉండాలి. నిత్యమైన ఆత్మ సౌఖ్యం పొందడానికి శారీరక అసౌకర్యాన్ని , మానసిక క్రమ శిక్షణను  భరించ వలసి వస్తే మాత్రం ఏమి?* 

 *దైవం యందలి ఆనందం ఎంత గొప్పదంటే ఆయన దేవుని కోసం తన శరీరాన్ని త్యాగం చెయ్యడానికి ఇష్టపడ్డాడు. జీవితం యొక్క లక్ష్యం  అద్భుతానందం సాధించడమే -- అదే ఈశ్వరప్రాప్తి.*

***

_*"సాధనకు సోపానంగా !"*_

_*{రెండో భాగం}*_

_*నేనెవరు ! [సత్యానుభవం]*_

_*2. త్రిగుణాలు [సత్వగుణం-3] :*_

_*శ్రీరమణమహర్షి అద్భుతమైన ఒకగొప్ప విషయం చెప్పారు. మన మనసుకేకాదు కాలంలో కూడా త్రిగుణాలు ఉంటాయి. పగటిపూట కొంతసేపు రజోగుణంతో కార్యోముఖమై ఉంటుంది. అందులోనే మనసంతా కోపంగా, చికాకుగా, తొందరగా ఉంటుంది. మరికొంతసేపు మనసు శాంతిగా సత్వగుణంలో ఉంటుంది. అప్పుడు అన్నీ సరిగా అర్ధమై సానుకూలంగా అనిపిస్తాయి. మత్తులోకి జార్చే తమోగుణంతో మనసు బద్ధకంగా ఉంటుంది. సంశయాలు, ఆక్షేపణలు, అపార్ధాలతో మనసు అశాంతిగా ఉంటుంది. ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో అనుభవంలోకివచ్చి ఉండవచ్చు. కానీ వేకువకు ముందుండే బ్రహ్మీముహూర్తంలో అందరికీ మనసు సత్వంలో ఉంటుంది !*_

_*"{గ్రంథం : సత్యదర్శనం}"*_

_*"శ్రీరమణమహర్షి - శ్రీజిడ్డు కృష్ణమూర్తి గారల బోధనల్లోని ఏకాత్మతా విశ్లేషణ !"*_ 

_"ఋభుగీత "(450)_*

*_"సచ్చిదానంద రూపము"_*

*_30వ అధ్యాయము_*

*_మనో దేహాలను విమలంగా ఉంచుకుంటే...  బ్రహ్మమే అవుతాము !!_*

*_ఎప్పటికీ తుదిలేని మన అనంతస్వరూపమే మన అవ్యయస్థితిని తెలుపుతుంది. బ్రహ్మము ఎలా ఉంటుందంటే నిర్మలంగా, విమలంగా, కల్మష రహితంగా ఉంటుంది. మనంకూడా నిత్యజీవితంలో కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటే, మనో దేహాలను విమలంగా ఉంచుకుంటే ఆ బ్రహ్మమే అవుతాము. నిర్మలమైన ఆ బ్రహ్మ వస్తువు సదా ఆద్యంతాలు లేనిది. అందుకే జ్ఞాని ఎప్పుడూ బ్రహ్మపదార్థంగానే మనగలుగుతుంటారు. సర్వము నిండిన బ్రహ్మం నిరంతరమైన బ్రహ్మముగా తెలుస్తుంది. 'సత్'గా  ఉండి 'చిత్'గా ప్రకాశిస్తూ వ్యక్తమయ్యేదంతా మన జ్ఞానానికి దైవం కల్పించిన అవకాశమే. అదే దాని చిదానందము... సచ్చిదానందము !_*

***

  శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*

దగ్ధబీజమరోహే ఽ పి భక్షణాయోపయుజ్యతే ౹

విద్వదిచ్ఛాప్యల్పభోగం కుర్యాన్న వ్యసనం బహు ౹౹165౹౹

  వేయించిన గింజలు కూడా తినడానికి ఉపయోగపడును, జ్ఞాని వలే.

ఎక్కువ తినడం వల్ల అజీర్తి చేయును. ఏది అతిగా చేస్తే వ్యసనం క్రింద మారును.


భోగేన చరితార్థత్వాత్ర్పరబ్ధం కర్మహీయతే ౹

భోక్తవ్యసత్యతా భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే 

౹౹ 166 ౹౹

మా వినశ్యత్వయం భోగో వర్థతా ముత్తరోత్తరమ్ ౹

మా విఘ్నాః ప్రతిబధ్నన్తు ధన్యోఽ స్మ్యస్మాదితి భ్రమః 

౹౹167౹౹

అనుభవమే ఉద్దేశమగుటచే, భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.భోగములు వర్ధిల్లుగాక.నేను ధన్యుడనగుదును ఇట్టిదే భ్రమ.

వ్యాఖ్య :- విద్వాంసుని ఇచ్ఛకు భోగరూపం ఉండదా? అంటే -

విషయములు మిథ్య అన్న జ్ఞానముండుటచే, 

వేయించబడిన బీజం(గింజలు) అంకురించే శక్తిని కోల్పోయినను - అంకురోత్పాదనకు పనికి రాకపోయినను తినటానికి పనికివస్తుంది.

అట్లాగే,విద్వాంసుని ఇచ్ఛ అల్పభోగము నిచ్చును.

గొప్ప దుఃఖమును అవి కల్పింపలేవు.

అనేకమైన వ్యసనాదుల్ని పుట్టించలేదు.

విపత్తుల్ని,కష్టాలని కలిగించలేదు.

కర్మయే వ్యసనాన్ని కూడా పుట్టిస్తుంది గదా ! అంటే -

అనుభవములు సత్యములను భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.అనుభవమే ఉద్దేశమైతే,ప్రారబ్ధము అనుభవింపబడిన తీరిపోవును.

ప్రారబ్ధమనేది భోగాన్ని (అనుభవాన్ని)యిచ్చి చరితార్థమైనందున వినష్టమైపోతుంది.అది వ్యసనాన్ని కలిగించలేదు. కాని,భోక్తవ్య పదార్థాలు సత్యము అనే భ్రమయే వ్యసనం పుట్టటానికి కారణమౌతోంది.అంతే తప్ప వ్యసనాదులకు కర్మ కారణం కావటం లేదు.

వ్యసనానికి హేతువైన భ్రమ తెలుసుకుందాం -

భ్రమ వలననే దుఃఖము,లోలుపత,దర్పము మొదలగునవి కలిగి ఇతరులకు దుఃఖము కలిగించును.

"ఈ భోగాలు ఎన్నడూ నష్టం కాకూడదు - ఈ భోగము నశింపకుండుగాక ",

"ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉండాలి - ఇక మీద కూడా అది వర్ధిల్లుగాక",

"దానికి విఘ్నములు లేకుండు గాక - ఈ భోగాలకు విఘ్నాలవల్ల ఏ విధమైన అడ్డంకి కలుగ కూడదు",

"దీనిచే నేను 

దన్యుడనగుదును  - ఈ భోగాలవల్లనే నేను కృతార్ధుణ్ణి అవుతాను" 

అని ఈ విధమైన భ్రమ కలుగుతుంది.ఈ భ్రమయే వ్యసనాలకు కారణమౌతుంది.

జ్ఞానికి ఇవన్నీ మిథ్య అనే భావం సంస్కార రూపంలో దృఢమై యుండును. సద్వస్తువు "అద్వైతమే" రెండదంటూ ఉండదనే "నిర్ణయాత్మకముగా" వున్న అద్వైత బుద్ధి ఎన్నడూ నశించదు.

లోక వ్యవహారం మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది, వివేకమనేది వ్యవహారాన్ని అడ్డగించదు కాబట్టి ! అర్థక్రియ అట్లా సాగిపోతూనే ఉంటుంది.

జరుగు కర్మలు

వివేకజ్ఞానం వలన ఆత్మయొక్క అమరత్వము,సచ్చిదానంద రూపత్వ ప్రేరణతో కూడిన  దృష్టితో జరుగుతాయి.

*****

*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*

1.శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా

2.ఘన దశరథునకు కౌసల్యాదేవికిని జననమందిన రామచంద్రా నరేంద్రా కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా!!

3.అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి సరవినేలిన రామచంద్రా నరేంద్రా!!

4.పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా!!

****

*||శ్రీమన్నారాయణీయము|| దశమ స్కంధము 42వ దశకము - శకటాసురవధ - 42-10 శ్లోకము*

42-10

అనోనిలీనః కిల హంతుమాగతః సురారిరేవం భవతా విహింసితః।

రజో౾పి నో దృష్టమముష్య తత్కథం సశుద్ధసత్త్వే త్వయి లీనవాన్ ధృవమ్॥

భావము:-

భగవాన్! శకటరూపమున నిన్ను వధించుటకు వచ్చిన శకటాసురుని నీవు వధించితివి. "లేశ మాత్రము రజోగుణము చూపకపోయినను ఆ శకటాసురునికి నీ వలన మరణము సంభవించెను. అది ఎట్లు సాధ్యమయ్యెను? శుద్ధ సత్వగుణరూపుడవయిన నీ దరి చేరగనే అతను (నీ అనుగ్రహముతో) గుణరహితుడై నీలో లయమయి యుండవచ్చును".

***

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)****

 


No comments:

Post a Comment