*పూర్వ జన్మ కర్మ.....*
ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది. వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని తన భార్య గర్భవతి అని చెప్పాడు.
గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే...నీ భార్యను అడిగి రా...తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగిరా, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.
మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటూ ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రసవించింది.
మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు. భార్య భర్తలు గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు.
తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, చేసేది. ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు.
మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వనుకాక ఇవ్వను అంటూ మొండి కేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. కాని ఒక్క సారి బిడ్డను నా చేతి కిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను.తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు.
సరే ననీ బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు.
గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి...ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొని మంత్రించి...ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...
ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు.
రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గత జన్మలో వీడు బాకి పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే వచ్చాను.
వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను . కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు.
ఇంకే ముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నంపెట్టి ఆదరించాడు.
నేను పోయే వరకు నన్ను పోషించాడు.
అందుకే...ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లితండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్ధం.
ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే కలుగుతుంది.ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...
మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు కాని అది కాదు.మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు...ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది, నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను,మళ్లీ ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి.ఇదే మోక్షం.మరుజన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు.
ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.
*******
గోప పిల్లే నిన్ను వలదిక
తాప మల్లే నేను తలచే
నన్ను చూడూ ఆశ తీర్చే
మనసు కృష్ణా
నీదు పాటే నన్ను లాగే
ప్రేమ యందే మునిగి ఉన్నా
బాధ నంతా తెల్పి యున్నా
మనసు కృష్ణా
కాల మాయే నన్ను చేరే
కన్ను లన్నీ పిల్పు లాయే
కాంక్ష తోనే నిన్ను కోరే
మనసు కృష్ణా
నియమ నిష్టా సలిపి ఉన్నా
కళలు అన్నీ చూపి యున్నా
కధలు చెప్పక వేచి ఉన్నా
మనసు కృష్ణా
జపతపాదులు చేయు చున్నా
సమయపాలన తలచి ఉన్నా
బ్రతుకు నాదము తెలుపు చున్నా
మనసు కృష్ణా
వేణు గానం హాయి గొలిపే
రమ్య రాగం మత్తు పెంచే
రాసి లీలా వేళ ఆయే
మనసు కృష్ణా
*****
మనసు నిజమై..మర్కటమురా
తనువు చలమై.. ఊయలగుటే
చినుకు మెరుపై..ఆశలుడికే
కనులు పిలుపై.. ప్రేమ పలుకే
వయసు ఉడుకై... తొందరగురా
భయము పరుగై... భారమగురా
నియమ తెరపై... నాన్యతగురా
లయల వలపై.... లాస్య మగురా
కధలు మెదిలే... రాక కొరకై
రధము కదిలే... రాకపిలుపై
పదము పలికే... పాపవలపై
విధము తెలిపే... వాదిఅరుపై
లక్ష్మి సత్యాను సారిణీ లభ్యమవ్వ
సాక్షి త్యాగాను సారిణీ సత్యకీర్తి
కక్ష కర్మాను సారిణీ కాంక్ష దీప్తి
లక్ష్యమున విద్య బుధ్ధియు లక్ష ణమ్ము
చిల్లు గారెలు రుచియుండు చిత్ర మవ్వు
మళ్ళి మళ్ళీ తిన్నా రుచి మెండుగా ను
అల్లము తొ పచ్చడి రుచిగా నంచితినుట
ఉల్లిముక్కలు కలిపినా ఊపిరిచ్చు
ప్రణయ తాపమా యిదియని ప్రశ్న యడిగె
తృణము కోపమే అదియును తప్పు మడుగె
కణువు కలలన్ని మదినేలు గొప్ప అడుగె
ఋణపు జీవితం కధమల్లె రవ్వ వెలుగె
వినుమాటలను తెల్పి జనులు బాధ్యత గనరే
వనధర్మమును బూను జనుల భాగ్యము గనరే
కనుసైగలకు ఆశ జనులు కష్టము గనరే
మనువాడి పలుకేను మనసు ఇష్టము గనరే
చక్కని చుక్కగా మనసు మేలును చేయుచు వచ్చె సుందరీ
యాకలి దీర్చగా దలచి యంగన సాగెను సద్ది మూటతో
వేకువ సాక్షి గా పనులు వేగము సాగుట సత్య పల్కుగా
మక్కువ నేస్తమే విషయ వాంఛను తీర్చియు నిత్య సత్య మై
సమయ మిదేననీ యనుట సౌఖ్యము పొందుట సర్వులందునన్
సమరము యేననీ యనుట సర్వము తప్పుయు తెల్పుచుండుటన్
విముఖత చూపుటే విషయ వాంఛలు నందును శాంతి పొందుటన్
జమున ను జూడగా విజయ శాంతి లభించె జయప్రదమ్మునన్
ఎదురుగా ఉన్నా ఎందరి కడుపులు లొ ఆకలి తీర్చే ను
వెదురు బొంగులా గ వేణుగానమ్మే చేయలేకున్నాను
బెదురు చూపులతో బెడిసి కొట్టకుండు ముసలి వయసు బతుకు
కుదురు మల్లెనేను కాలముతో బతుకు జీవ సమాధి యే
0 comm
****************
మమత తోడ మమ్ము గాంచు రామ
సమయ మందు శక్తి నివ్వు రామ
తమను భక్తి తోను కొలిచె రామ
తమరి కావ్య గాధ యగుట రామ
గమన యుక్తి గాను మార్చు రామ.....
నమ్మ కమ్ము నిన్ను మార్చ గలదు
నమ్మ కుంటే నీవు మార గలవు
నమ్మ పలుకు నటన కాక జూడు
నమ్మ కమ్ము నీకు సత్య మల్లె
నమ్మి నీవు నమ్మ కముతొ బతుకు
చెట్టు లాగ చుట్టి సేవ చేయు
గట్టు మార గుండు నట్లు చూడు
రట్టు అనకు రమ్య మగుట చేయు
పట్టు వీడి బెట్టు చేయ కుండు
ఒట్టు నేర్పు ఓనమాలు రవళి
ముర్తీభవించే వినయాను బంధం
ఆర్తానునాదం సహనమ్ము బంధం
కూర్మావతారం క్రమబధ్ధ బంధం
మార్తాండదేవం కమలాప్తబంధం
చింత చెట్టు చిగురు పుల్ల గుండు
వింత గాను విపుల కథలు ఉండు
సంత లోన సంబరమ్ము ఉండు
పంత మున్న పనులు సాగ కుండు
గంతులేయగుండు గమ్ము గుండు .......
నడుపు తున్న నడక తెలుగు వెలుగు
నాడి పట్టి నటన లేని మెరుగు
కడుపు మాడి గళము తెల్పి పరుగు
విడుపు చూపి సేవ వింత కలుగు
ముడుపు కట్టి మోక్ష మడగ జరుగు
నవ్వు వారి నయన మెరుపు చూడు
నవ్వి ఏడ్చు నటన నమ్మ బోకు
జివ్వు మన్న జీవి తాన్ని చూడు
జీవి కార్చు జావ నమ్మ బోకు
జీవి దైవ జపము రక్ష గుండు
కనులు మాయ గలుగు కధల మల్లె
కనుల రెప్ప కాచు నిత్య మల్లె
కనుల నీరు కాన రాని జల్లె
కనుల చూపు కాంతి గుచ్చు ముళ్ళు.
కనులు తెల్పు కధలు పంచ రవళి.
నిన్ను చూసాక నామదీ ఉరికే
కన్ను గీటాక నాకలా చెదిరే
ఎలా గడపాలీ యీరేతిరీ
ఎలా చెప్పాలీ తనువు తిమ్మిరీ
ప్రేమ పొంగి పిలిచింది.. పరువమంతా చూపింది
బాస లెన్నో చేసింది... బాధ్యతుంది ఆగమంది
కునుకు తీయకుండా చేసింది...తపన మోయు మన్నాది
ఓర్పు చూపాలన్నాది ... ఓటమిని ఒప్పు కున్నాది
మిత్రు లందరునూ మిడిమిడి జ్ఞానము కీర్తి చూడలేరు
మిత్ర ధనాశతో మిత్ర ద్రోహి పరచు ముందు కొచ్చుచుండు
మిత్ర విద్య ఫలం మిణుగురు పురుగులా వచ్చి పోవు చుండు
మిత్రుడు ఆపదను మిత్ర భావముతో ధనము ఆరోగ్యం
వికసించే లత ఊపులే మనసు వుయ్యాలై సుఖాన్ని చ్చుటే
ప్రకటించే ప్రతిభా సమర్ధతలు ప్రభంజనం ప్రబోదధమ్ముగా
ప్రకృతే హాయిని ఇచ్చుటే బలము పెంపొందీ మనోనేత్ర జం
టకుసింగారపుభర్తవై గిరులకోటన్ వెలుగు స్వామీ నతుల్
1
విశాల విశ్వ మందునే
విషేష దివ్య మన్నదే
వినోద మున్షి భావమే
వివాదమయ్యె లక్షణం
సరాగరాగమందిరం
విశేష భావ సుందరం
సకాలమోక్షయవ్వనం
సుమాలి ఆశ బంధనం
అనంత పద్మనాభ యే
అనుంగు వేద మంత్ర మే
సుధా సుమాల బంధమై
అకాలమృత్యు మాపుటే
ప్రయాణమే ప్రమాదమే
ప్రకోపమే ప్రకంపణం
ప్రకాశమే ప్రభంజనం
ప్రసాదమే ప్రభుత్వమే
ఓనమాలు నేర్పి తెలుగు ఒకటి రెండు
తెల్పి, ఒదిగి లెక్కలు నేర్పు తేట గీతి
ఓగు తెలివిగా మార్పుల ఓర్పు తెల్పి,
విధము నేడు లేదు చదువే వింత మనిషి
సత్వరం వేద్యపరుచుటే సంధి కలుగు
మత్తు వేద్యపరుచు మది మోన మందువిద్య వైద్యము వేద్యమే వింత మలుపు
విశ్వ మాయవేద్య మవుట వ్యాధి యగుట
కవులకు కరువైంది కవితలు కొరతైంది కధలు అటక లెక్క
చెవులకు ఇంపుగా చేయు కవితలే వి చెత్త సినిమా లే
భవుని రూపంలో భాగ్యసీమలో న భద్ర రచనలివియె
శివుని మాయలన్ని సంఘమందు వెలుగు ధర్మధీక్ష పరమె
శ్రీ రమ హృదయమే సిరులు కురిపిస్తున్న కొరత వుంది నాలొ
శ్రీ నిధిని పోందీ శరణు అనుచు ఉన్న హృదయ వాంఛ పెరిగి
శ్రీ లతప్రేమయు సీఘ్రముగా పొందు మార్గ మెరుక లేదు
శ్రీ కృపా కటాక్ష సాధనమ్ముగాను శోధన జరుపు టే
No comments:
Post a Comment