Saturday, 7 August 2021

 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ప్రేమంటే ఇదేనా ?

అప్పుడే అడుగు పెట్టింది కొత్తకాపురానికి, కోటి ఆశలతో,ఆశయాలతో ఒకవైపు ఉద్యోగం చేయాలి, మరోవైపు కాపురాన్ని సరిదిద్దు కోవాలి, అదే ఈనాటి స్త్రీకి, భర్త కూడా  అవకాశవాదిగా మారి పోతున్నాడు, ఈ  తప్పు ఎవరిదో  మీరే ఈ కధబట్టి మిరే చెప్పగలరు కథానాయికి ఆనందీ, కథానాయకుడు  ఆనందరావు . ఇక చదవండి. 

కంటికి కునుకు రాదు, ఎంతసేపు వేచి చూసిన గడియారం కదులుతుంది తప్ప, మనసులో వేధిస్తున్న ఆలోచనలకు దారి దొరకక, నోరు విప్పి చెప్పుకోలేక, సన్మార్గంలో నడుస్తున్న అనుమానం బీజంతో ఉన్నవానికి అంతా దుర్మార్గంగా కనిపిస్తున్నది, ఎప్పుడో చేసిన తప్పును పదే పదే వల్లిస్తూ,  ఎప్పుడూ  వెకిలి చేష్టలతో, మానసికంగా హింసించి సంతోష పడేవారు మావారు, అని తలుస్తూ వాకిటముందు కూర్చొని ఉన్నది ఆనందీ, ఆనందం అంటే ఏమిటో తెలియదు, పెళ్లయిన ఒక్కసిన్మాకు పోవటం, హోటల్ కు పోవటం అనేదిలేదు, చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగి, పెళ్ళైన సుఖపడాలని ఆశతో జీవిస్తూ ఉన్న మహిళ.

నెమ్మదిగా పాడుకుంటున్నది, నీలి కన్నుల కృష్ణా, వాలు చూపులతో ఉడికిస్తున్నావా కృష్ణా, నీ నవ్వులో రాలు రత్నాలు, నీ కాలి  మువ్వల శబ్దం నన్ను ఒక్క నిముషము  కూడా  నిలవ నీయుటలేదు, నా మేని సొగసులు, అమాయకపు నడకలు, హొయలు పోయే నీకోసం, ఈ పండు వెన్నెల, ఆ పూల గంధాలు వేచి వున్నాయి మనకోసమే, అందుకొని అల్లుకోగా రారా..నా మనసే నీదిరా, నీవంటే నేనురా వెన్నెల స్నానాలు చేద్దాం.......రారా, ఇద్దరమూ ఒకటయ్యి, ఏలుదాము ఈ రస జగతిని., ..

రోజూ జరిగే భారతమే ఈరోజు మరీ ఎక్కువ అయింది, బాగుగా త్రాగి,  పచ్చి బూతులు పలుకుతూ, ఇంట్లోనించి బయటకుపో, నా కళ్ళ ఏదుట కనబడ వద్దు, నేను మారను, ఉండ గలిగితే ఉండు, లేకపోతె తక్షణం, బయటకు నడువు అన్న మాటలకు ఓర్పు నశించి, దుర్మా ర్గుని ఆశ్రయించి  ఉండే బదులు అనాధలకు,  సేవ చేయదలచి  కట్టు బట్టలతో నడిచింది బయటకు ఆనందీ. మత్తులో ఉండుట వల్ల  సోఫాలో పడుకున్నాడు ఆనందరావు .

నిద్రలేవంగానే కాఫీ రాలేదు , చక్కటి పలకరింతలేదు, తనతప్పు గ్రహించాడు, వెంటనే ఫోన్ తీసుకోని తెలిసిన వారందరికీ ఫోన్ చేసాడు, భార్య వివరాలు తెలియలేదు, భార్య  ఆఫీసుకు బయలు దేరాడు రాలేదని తెలుసు కున్నాడు, తను ఆఫీసుకు చేరాడు, ఆఫీసులో డబ్బు పోయ్యిందని దానికి కారణం  తనే కారణమని భావించి పోలీసులకు దొరక కుండా తిరిగాడు,  ఆనందరావు  మారి, భార్య చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని ఏడ్వసాగాడు, స్నేహితులెవరూ సహకరించలేదు, పలకరింపులు లేక, ఆఫీసుకు పోక, రోడ్డువెంట తిరుగుతున్నాడు, మనసు మనసులో లేదు, భార్యను మరువలేక త్రాగుటకు బానిస అయినాడు, ఒక వైపు పోలీసువోల్లు, మరోవైపు అప్పులవాళ్ళు వెంబడిస్తున్నారు, అనారోగ్యముతో బాధను భరించ లేక రోడ్డుమీద పడిపోయాడు.

కళ్లుతెరచి చూడగా ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గ్రహించాడు, గురువుగాను చెప్పిన మాటలు విన్నాడు ఆనందరావు. 
   
   ఆశ్రమంలో   ఈవిధముగా గురువుగారు నీతి  బోధ చెప్పటం మొదలు పెట్టారు, మనిషికి అహంకారమే పరమ శత్రువు, చెడుస్నేహము మనిషిని కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కొన్ని అలవాట్లకు కొందర్ని బానిసగా మారుస్థాయి,  చేతులారా జీవితాన్ని నాశనం చేసు కుంటారు, అట్టివారు ఎవరైనా పశ్చాత్తాపముతో తప్పు వప్పుకుంటే వారిని ఆదేవుడు క్షేమించి మంచి మార్గము చూపిస్తాడు.

అక్కడి వాతావరణ, అలవాట్లు ఆనందరావుకు కొత్తఆశలు వేళ్ళు విరిశాయి, అక్కడ దేవుని ముందు కూర్చొని తనతప్పులు చెప్పుకున్నాడు, అక్కడ  వున్న  వారికి  సేవచేస్తూ ఉన్నాడు. 

అప్పుడే అక్కడకు ఒక ఉత్తరము వచ్చింది, మీ అప్పులు తీర్చటం జరిగినది, ఆఫీసు డబ్బు కట్టడం జరిగింది, ఇక మీరు స్వేశ్చ జీవి . 
   
దుర్జన స్నేహమ్ము - దూరమ్ము సేయుమా - వర్జించువారలన్ నీవు 
అప్పులన్ జేయకుమ - ఆర్జనల్ చాలుగా - ముప్పులన్ దేబోకు నీవు 
గర్వమున్ వీడుమా - కల్లలన్ వీడుమా - సర్వ మా దైవమే నీకు 
అమ్మయే దైవ మా - అబ్బయే దైవమ్ము - బమ్మయే సృష్టించె నిన్ను


నీ ప్రేమ ఓప్పులో భాగము పంచుకున్నాను, ఆ చిరుకానుకనీకు అందిస్తున్నాను, నా గురించి వెదక వద్దు నీవుమారావని గమనించాను, నన్ను కలవాలను కుంటేరావచ్చు,  క్షమించే గుణం ఒక్క స్త్రీ   కే ఉన్నది,  ఓర్పుతోనీకోసం వేచి ఉన్నాను.
    

ఆశ్రమంలో  గురువు గారికి తన గురించి పూర్తిగా చెప్పటంవళ్ళ ఆయన సలహా ప్రకారము భార్యను కలవటానికితిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు .
 

--((*))--


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 

గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగా బంధువుల తో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు.

0


స్నేహ మన్నది చెప్పి వచ్చేది కాదు

స్నేహ సంపద కరణ తోకూడి ఉండు

స్నేహము ప్రాణానికియె ప్రాణమ్ము అగును

స్నేహ ముండు ట దైవ నిర్ణయ మగును


 విశ్వాస ముంచాక మనవీ తలపే నిజమ్మే

శాశ్వత్వ కీర్తేను మనసే తరుణం నిజమ్మే

పాశమ్ము పొందేది శుభమే మగుటే నిజమ్మే

ఐశ్వర్య మిచ్చేది చెలిమీ సహనం నిజమ్మే


తుమ్మెద' చూపు ఆశల భవిత కలలుగా

నమ్మిన పువ్వు సఖ్యత తెలుపు విధముగా

కిమ్మన కుండి గమ్మున జుర్రు సమముగా

చెమ్మకు సంత సించియు వెచ్చ దనముగా


గురువు గారికి ధన్యవాదాలు గాను

అరువు కాదిది స్నేహ భావము గాను

పరువు కాదిది ప్రాణ స్నేహము గాను

తరువు లాగను ధార పోసెద మనము


పలికి పలక లేదనుట ఎందుకో తెల్పు

నిలిచి నిశ్చల హృదయ శ్వాసను తెల్పు

చిలికి చెలిమినే ప్రశ్న  లేయక తెల్పు

చిలిపి వేషాలు వలదు మోనంబు వీడు


చెలిమి చీకటి అనకు మనసుకు మజలి

కలిమి ఉన్నను లేక పోయినా చెలిమి

బలిమి నేనను స్ప్రహ అహమ్ము మజలి

పలికి లేదను మాట ఒప్పదు చెలిమి


మది తలుపులన్ని చెప్పి ఒప్పించు ప్రేమ

చెదిరి పోయిన మనసు కలిపేది చెలిమి

కథల తలుపులు తెర్చి మార్చును కళలు

విధిని తలచియు ప్రకృతి ఒడిలో న కలలు


కలువ కన్నుల కాంతి కనకమై వెలుగు

చిలక పల్కులు భ్రాంతి చిగురించు వెలుగు

వలపు సింగారం శాంతి కల్పించు వెలుగు

చెలిమి జీవితం మార్పు తెచ్చేటి వెలుగు


నిజము తెలిపినా నీకు నిస్పృహ కలుగు

విజయ వాంఛతొ నీకు చెలిమియే పెరుగు


మేలు చేయు గురువు మేలు దైవంబు గ తల్లి దండ్రి చెలిమి

నేల నమ్మి బతుకు నిష్ఠగా పాటించు చెలిమి యే

పాలు నీరు నటుల పాలవెన్నెలుగా పుడమి నందు చెలిమి

కాల మార్పు ఉన్న కలిసి బతుకు చెలిమి కధలు కాని జీవి


మధుర మైనది గా మనసు లో స్నేహం దేవుడు కలిపేను

అదియు శాశ్వితం అక్కరగా చెలిమి, ఉండ దెపుడు అహం

చెదరనిదే చెలిమి జాతి నంత కలుపు నిజము శాశ్వితం

మదిలొ మహిమ చూపి మానవత్వమ్మే బతికె చెలిమిగాను


శ్రీమత్సుందర నాయకీం  భయహరాం  జ్ఞానప్రదాం నిర్మలాం

( సుందరేశ్వరుని అర్ధాంగి, భయమును నిర్మూలించునది, జ్ఞానము ప్రసాదించునది, పవిత్రమైనది )


శ్యామాభాం కమలా సనార్చితపదాం  నారాయణ స్యానుజామ్

( నల్లని వర్ణము కలిగి, బ్రహ్మ చే పదములు ఆర్చించబడిన నారాయణుని చెల్లెలు )


వీణా వేణు మృదంగ వాద్య  రసికాం నానావిధాం అంబికామ్

( వీణా వేణువు మృదంగం మొదలగు వాద్యములను ఆనందించునది, అనేక విషయములకు తల్లి )


మీనాక్షిమ్ ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిమ్

( ఓ మీనాక్షి దేవి, కరుణా సముద్రురాలా ఎల్లప్పుడూ నీకు, నేను  ప్రణామములు చేస్తాను )


No comments:

Post a Comment