Monday, 16 August 2021

 


1🧘‍♂️జ్ఞానిసన్నిధి🧘‍♀️*


 దేవుడు నిద్ర నుండి లేపితేనే...     మేలుకునే మనం!

    దేవుణ్ణి నిద్ర లేపడనికి సుప్రభాతం పాడుతున్నాము.

    ఇది విచిత్రంగా      లేదూ !...


* 'ఇచ్చట నీడ దొరకబడును' అని ఏ చెట్టూ బోర్డ్ వేసుకోదు.

* ఎండనబడి వచ్చినవాడు ఎవడైనా నీడను చేరి సేద తీరుతాడు.

  

*ఏ వ్యక్తి గుణదోషాలనుగాని అతడి చర్యల స్వరూపాన్నిబట్టి నిర్ద. ఏ దృష్టితో, ఏ విధంగా అతడు తన కర్మలను నిర్వర్తిస్తాడో దానిని బట్టి మానవుడి న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చును.*

****


*(-Sri Paramahansa యోగనంద / శ్రీ పరమహంస యోగానంద)*

*(- పవిత్రీకరణ / Purification)*

*మంచిని చెయ్యడానికి మనం ఒక్కొక్కసారి బాధను అనుభవించాలి. ప్రభు దర్శనం కోసం బాధననుభవించడానికి మనం సిధ్ధపడి ఉండాలి. నిత్యమైన ఆత్మ సౌఖ్యం పొందడానికి శారీరక అసౌకర్యాన్ని , మానసిక క్రమ శిక్షణను  భరించ వలసి వస్తే మాత్రం ఏమి?* 

 *దైవం యందలి ఆనందం ఎంత గొప్పదంటే ఆయన దేవుని కోసం తన శరీరాన్ని త్యాగం చెయ్యడానికి ఇష్టపడ్డాడు. జీవితం యొక్క లక్ష్యం  అద్భుతానందం సాధించడమే -- అదే ఈశ్వరప్రాప్తి.*

***

_*"సాధనకు సోపానంగా !"*_

_*{రెండో భాగం}*_

_*నేనెవరు ! [సత్యానుభవం]*_

_*2. త్రిగుణాలు [సత్వగుణం-3] :*_

_*శ్రీరమణమహర్షి అద్భుతమైన ఒకగొప్ప విషయం చెప్పారు. మన మనసుకేకాదు కాలంలో కూడా త్రిగుణాలు ఉంటాయి. పగటిపూట కొంతసేపు రజోగుణంతో కార్యోముఖమై ఉంటుంది. అందులోనే మనసంతా కోపంగా, చికాకుగా, తొందరగా ఉంటుంది. మరికొంతసేపు మనసు శాంతిగా సత్వగుణంలో ఉంటుంది. అప్పుడు అన్నీ సరిగా అర్ధమై సానుకూలంగా అనిపిస్తాయి. మత్తులోకి జార్చే తమోగుణంతో మనసు బద్ధకంగా ఉంటుంది. సంశయాలు, ఆక్షేపణలు, అపార్ధాలతో మనసు అశాంతిగా ఉంటుంది. ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో అనుభవంలోకివచ్చి ఉండవచ్చు. కానీ వేకువకు ముందుండే బ్రహ్మీముహూర్తంలో అందరికీ మనసు సత్వంలో ఉంటుంది !*_

_*"{గ్రంథం : సత్యదర్శనం}"*_

_*"శ్రీరమణమహర్షి - శ్రీజిడ్డు కృష్ణమూర్తి గారల బోధనల్లోని ఏకాత్మతా విశ్లేషణ !"*_ 

_"ఋభుగీత "(450)_*

*_"సచ్చిదానంద రూపము"_*

*_30వ అధ్యాయము_*

*_మనో దేహాలను విమలంగా ఉంచుకుంటే...  బ్రహ్మమే అవుతాము !!_*

*_ఎప్పటికీ తుదిలేని మన అనంతస్వరూపమే మన అవ్యయస్థితిని తెలుపుతుంది. బ్రహ్మము ఎలా ఉంటుందంటే నిర్మలంగా, విమలంగా, కల్మష రహితంగా ఉంటుంది. మనంకూడా నిత్యజీవితంలో కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటే, మనో దేహాలను విమలంగా ఉంచుకుంటే ఆ బ్రహ్మమే అవుతాము. నిర్మలమైన ఆ బ్రహ్మ వస్తువు సదా ఆద్యంతాలు లేనిది. అందుకే జ్ఞాని ఎప్పుడూ బ్రహ్మపదార్థంగానే మనగలుగుతుంటారు. సర్వము నిండిన బ్రహ్మం నిరంతరమైన బ్రహ్మముగా తెలుస్తుంది. 'సత్'గా  ఉండి 'చిత్'గా ప్రకాశిస్తూ వ్యక్తమయ్యేదంతా మన జ్ఞానానికి దైవం కల్పించిన అవకాశమే. అదే దాని చిదానందము... సచ్చిదానందము !_*

***

  శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*

దగ్ధబీజమరోహే ఽ పి భక్షణాయోపయుజ్యతే ౹

విద్వదిచ్ఛాప్యల్పభోగం కుర్యాన్న వ్యసనం బహు ౹౹165౹౹

  వేయించిన గింజలు కూడా తినడానికి ఉపయోగపడును, జ్ఞాని వలే.

ఎక్కువ తినడం వల్ల అజీర్తి చేయును. ఏది అతిగా చేస్తే వ్యసనం క్రింద మారును.


భోగేన చరితార్థత్వాత్ర్పరబ్ధం కర్మహీయతే ౹

భోక్తవ్యసత్యతా భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే 

౹౹ 166 ౹౹

మా వినశ్యత్వయం భోగో వర్థతా ముత్తరోత్తరమ్ ౹

మా విఘ్నాః ప్రతిబధ్నన్తు ధన్యోఽ స్మ్యస్మాదితి భ్రమః 

౹౹167౹౹

అనుభవమే ఉద్దేశమగుటచే, భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.భోగములు వర్ధిల్లుగాక.నేను ధన్యుడనగుదును ఇట్టిదే భ్రమ.

వ్యాఖ్య :- విద్వాంసుని ఇచ్ఛకు భోగరూపం ఉండదా? అంటే -

విషయములు మిథ్య అన్న జ్ఞానముండుటచే, 

వేయించబడిన బీజం(గింజలు) అంకురించే శక్తిని కోల్పోయినను - అంకురోత్పాదనకు పనికి రాకపోయినను తినటానికి పనికివస్తుంది.

అట్లాగే,విద్వాంసుని ఇచ్ఛ అల్పభోగము నిచ్చును.

గొప్ప దుఃఖమును అవి కల్పింపలేవు.

అనేకమైన వ్యసనాదుల్ని పుట్టించలేదు.

విపత్తుల్ని,కష్టాలని కలిగించలేదు.

కర్మయే వ్యసనాన్ని కూడా పుట్టిస్తుంది గదా ! అంటే -

అనుభవములు సత్యములను భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.అనుభవమే ఉద్దేశమైతే,ప్రారబ్ధము అనుభవింపబడిన తీరిపోవును.

ప్రారబ్ధమనేది భోగాన్ని (అనుభవాన్ని)యిచ్చి చరితార్థమైనందున వినష్టమైపోతుంది.అది వ్యసనాన్ని కలిగించలేదు. కాని,భోక్తవ్య పదార్థాలు సత్యము అనే భ్రమయే వ్యసనం పుట్టటానికి కారణమౌతోంది.అంతే తప్ప వ్యసనాదులకు కర్మ కారణం కావటం లేదు.

వ్యసనానికి హేతువైన భ్రమ తెలుసుకుందాం -

భ్రమ వలననే దుఃఖము,లోలుపత,దర్పము మొదలగునవి కలిగి ఇతరులకు దుఃఖము కలిగించును.

"ఈ భోగాలు ఎన్నడూ నష్టం కాకూడదు - ఈ భోగము నశింపకుండుగాక ",

"ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉండాలి - ఇక మీద కూడా అది వర్ధిల్లుగాక",

"దానికి విఘ్నములు లేకుండు గాక - ఈ భోగాలకు విఘ్నాలవల్ల ఏ విధమైన అడ్డంకి కలుగ కూడదు",

"దీనిచే నేను 

దన్యుడనగుదును  - ఈ భోగాలవల్లనే నేను కృతార్ధుణ్ణి అవుతాను" 

అని ఈ విధమైన భ్రమ కలుగుతుంది.ఈ భ్రమయే వ్యసనాలకు కారణమౌతుంది.

జ్ఞానికి ఇవన్నీ మిథ్య అనే భావం సంస్కార రూపంలో దృఢమై యుండును. సద్వస్తువు "అద్వైతమే" రెండదంటూ ఉండదనే "నిర్ణయాత్మకముగా" వున్న అద్వైత బుద్ధి ఎన్నడూ నశించదు.

లోక వ్యవహారం మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది, వివేకమనేది వ్యవహారాన్ని అడ్డగించదు కాబట్టి ! అర్థక్రియ అట్లా సాగిపోతూనే ఉంటుంది.

జరుగు కర్మలు

వివేకజ్ఞానం వలన ఆత్మయొక్క అమరత్వము,సచ్చిదానంద రూపత్వ ప్రేరణతో కూడిన  దృష్టితో జరుగుతాయి.

*****

*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*

1.శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా

2.ఘన దశరథునకు కౌసల్యాదేవికిని జననమందిన రామచంద్రా నరేంద్రా కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా!!

3.అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి సరవినేలిన రామచంద్రా నరేంద్రా!!

4.పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా!!

****

*||శ్రీమన్నారాయణీయము|| దశమ స్కంధము 42వ దశకము - శకటాసురవధ - 42-10 శ్లోకము*

42-10

అనోనిలీనః కిల హంతుమాగతః సురారిరేవం భవతా విహింసితః।

రజో౾పి నో దృష్టమముష్య తత్కథం సశుద్ధసత్త్వే త్వయి లీనవాన్ ధృవమ్॥

భావము:-

భగవాన్! శకటరూపమున నిన్ను వధించుటకు వచ్చిన శకటాసురుని నీవు వధించితివి. "లేశ మాత్రము రజోగుణము చూపకపోయినను ఆ శకటాసురునికి నీ వలన మరణము సంభవించెను. అది ఎట్లు సాధ్యమయ్యెను? శుద్ధ సత్వగుణరూపుడవయిన నీ దరి చేరగనే అతను (నీ అనుగ్రహముతో) గుణరహితుడై నీలో లయమయి యుండవచ్చును".

***

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)****

 


Wednesday, 11 August 2021

 

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

  • రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 


ఊపిరిపోసి పార్టీకి కొత్త శక్తి తెచ్చావు 

- ప్రజాసేవ కోసం నిరంతరము తపించావు


గరళం మింగి అమృతం ప్రజలకు పంచావు 

- రాజకీయము రక్షించుటకు కృషి చేసావు    


సమస్యల వలయాన్ని ధర్మంతో జయించావు 

- మహాత్మ , రచయితగా నిస్వార్ధ పరుడవు 


ఐక్యరాజ సమితిలో వాగ్ధాటిని చూపావు  

- ప్రజల నమ్మకాన్ని న్యాయంగా నిలబెట్టావు  


పార్టీ సభ్యులను ఏకం చేసే చతురుడవు 

- రాబోయే కాలము అంతా మాదేనని చాటావు


 నీవు ఎవరిని నొప్పించని నాయకుడవు 

-రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన ధీరుడవు 


 రాజకీయములో కొల్లగుడ్డతో నడిచి 

- భరత జాతి గర్వించే మహాత్ముడవు  


మరచిపోలేని మానసులోఉన్న  స్వాతంత్ర 

సమరవీరుడు ఐన అజాతశత్రువు

- ప్రజల హృదయాలలో ఉన్న ఆత్మబంధువు 

తుపాకీ గుండ్లకు బలయిన మహాత్మా గాంధి


జీవికి మరణం తప్పదు 

మరణానికి పుట్టుక తప్పదు    

ధర్మం, సత్యం, న్యాయానికి చావు ఉండదు 

అధర్మం రాజ్య మేలితే ప్రజల్లో తిరుబాటు తప్పదు 

   

--((**))--

Saturday, 7 August 2021

పద్యాలు





528724_113689365450378_783989963_s.jpg
 ఇంట్లో పాడైపోయిన విరిగిపోయి న లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..
ఈ సమస్య మరియు ప్రశ్న  అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు ఏ దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం.
క్షమించరాని నేరం. ఇంట్లో వున్నంతకాలం  పూజలు చేసి తరువాత అవసరం లేదని లేదా పాడైపోయాని  వాటిని ఏ చెట్టు🌳 క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన "హిందూ దేవుళ్ళ" ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు. వారికీ ఆ అవకాశం ఇవ్వకండి.
ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని  పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికి 🔥ఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం మీకు రావచ్చు.
కానీ అగ్ని 🔥సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు లేదా ప్రవహిస్తున్న నది🌊లో గాని మన ఊరి చెరువుల్లో గాని "నిమజ్జనం"  చేయండి. అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి 🙏నమస్కరించి '' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.
ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ 🗣సమాచారం ఇవ్వండి. ఇది మన కర్త్యం.  ధర్మ ఆచరణ చేయండి. ధర్మాన్ని  కాపాడండి. "ధర్మో రక్షతి రక్షితః".
"ఓం నమో నారాయణాయా 🙏🕉


ధైర్యము వల్లనే సంపద ధర్మము లభ్యము
శౌర్యము వల్లనే విజయము శక్తి లభ్యము
జ్ణాణము వల్లనే మోక్షము జపము లభ్యము
దానము వల్లనే సత్కీర్తి తపము లభ్యము


మత్స లేని దేది నచ్చు మనసు
సత్స మేది తెల్ప లేని బతుకు
వత్స రాది నాడు వచ్చె నవమి
నిత్స మైన వాడు పుట్టె దశమి

వన్నెలే మన మధ్య పోరు గ వల్క బోరున దేనికో
కన్నులన్నియు చూచు చుండెను కామ్య మోనము దేనికో
చన్నులన్నియు శిల్ప మల్లెను చూడ పల్కులు  దేనికో
మిన్ను నున్నను ఆశ ఉన్నను మన్ను నున్నను దానికే

******************
మంచె మీద మగువ పిలుపు లగుచు
పంచు కొనెటి మగని పనిని తలచు
ఎంచు కొనెను మనసు పంచ దలచు
కంచు కంఠ ముగను పిలుపు దాచు
పంచు కొను మనిషి పక్క చరుచు

ప్రేమ మనసు విరియు సుమము లగును
ప్రేమ భువన వెలుగు కురియు కలలు
ప్రేమ బ్రతుకు విమల రవము రగును
ప్రేమ చినుకు విషయ వలల కళలు
ప్రేమ మెరుపు వినయ పూర్వ కమ్ము

మనిషి కళలు మార్పు మనసు చేరి
వినయ తలపు వాంఛ వరుస మారి
తనువు తపన తీపి వెంట కోరి
అణువు యొక్క అలుపు ఆశ వూరి
కణము అరుపు కావు కావు మనెరె

ఒంటరి గాను ఓర్పు వృద్ధు లందు
ఇంటి నందు ఈశ్వర కృప చెందు
అంటి నట్లు అంట నట్లు పొందు
కంటి నీరు కార గుండు నందు
చంటి వాడి చూపు మల్లె బతుకు

పతకాలు సాధించు దేశపు పర్వాలు పండుగగా
పెద్దల ప్రశంస పరముగా పిన్నలు ఉత్సాహమ్ము
ఆటల పోరులో భాగంగా భారతీయ ప్రతిభ
బహుమతులుతొ వెల్లువ విరిసే  బ్రహ్మండమందు

దక్షిణమ్ముగ పుజసల్పియు తక్షణమ్మున సేవలే
అక్షరాస్యత ఆత్మతృప్తియు అక్షయమ్ముగ సాగులే
దీక్ష సల్పియు నిష్టచూపియు దీప్తి వెల్గులు వచ్చులే
సాక్షి గుండియు నిర్మలమ్ముగ సామరస్యపు భావమే

చిటికేయుట హృదయ వాంఛ పిలుపన్నాయన్
కుటిలాలక యెడమ కన్ను కుడికన్నాయన్
పటికే జలములలొ మడ్డి తొలగించేయున్
కిటికీ పవనుడను పిల్పులతొఆహ్వానమ్

కత్తుల బావినందు మది కాంతిని దోచియు మన్మధుండుగా
చిత్తము తెల్పియే సుగుణ జాడ్యము చూపియు చింతచెందియే
మత్తుగ నుండియే మనసు వాకిలి తెర్చిన చెప్పి నామగం
డుత్తమడంచు బేర్కొని యూరో సతి గోరుకొనెన్ విడాకులన్

వను కాయే మనసాయె హాయిగొను యుక్తిన్ శ్రీ కరుండైతివే
వినునంతా వివరమ్ము ప్రేమ గను భక్తిన్ శ్రీ చరుండైతివే
కనునంతా కలనందు సేవలుయె శక్తిన్ శ్రీ ధరుడైతి చం
ద్రునిమౌళిన్ ధరియించు నాథ నను భక్తున్ బ్రోవవే..నీదయన్
0

నీతి పరుని నింద మోపు టేల
ఖ్యాతి పరుని ఖర్చు నడుగు టేల
ప్రీతి పరుని పలుకు కధలు యేల
జాతి గూర్చి జపము బాధ యేల

ఛాతి చూసి జయము చెప్పు టేల
మధుర మైన మాట తీయ గుండు
నిదుర పోవు నీతి చేదు గుండు
బెదురు తోను బేర కార మెండు

చెదురు బుద్ధి చెప్పాలి మవ్వ  గుండు
ముదురు తెలివి ముడుపు వగరు గుండు
తప్పు అనుట దమన కాండ కలుగు
ఒప్పు మంచి ఓర్పు నేర్పు గలుగు

పప్పు కూడు పెట్టి పెంచ గలుగు
చిప్ప కూడు చింత వల్ల జరుగు
అప్పు వల్ల ఆస్తి అంత కరుగు
కామ మున్న కళలు మాయ మవ్వు

నామ జపము నందు తృప్తి నివ్వు
ప్రేమ పాఠ పలుకు లందు కొవ్వు
భామ కులుకు పట్టు నందు నవ్వు
జాము రాత్రి చంద్ర బింబ పువ్వు

మనమ్ముతో తపమ్మతో సమమ్ముగా అనామికే
సునామియే సుఖమ్మగా సుభమ్ముగా సుధామణే
వినమ్రమై విధానమే వివాదమే విధూషిణీ
ఘనమ్ముగా భయమ్ముగా మదమ్మగా సహాషిణీ

అందమైన మోము చందనమ్మ చేరి సుందరాంగి రూపు
మంద హాసచూపు అద్దమందు మెరుపు అదిరిపోవు సొగసు
విందు చేయు ఛాతి పొందు కోరు జాతి మత్తుమోహనాంగి
చిందు లేయకుండు జయము నీకు కలుగు సద్దుచేసిపొమ్ము 

ఆమెని పిల్పులు ఆశల కొల్వులు ఆర్త నాదపు ఆత్రుతయే
సోముని నవ్వులు సోకుల చిందులు సొప్పగ పల్కలు సొమ్ములయే
కాముని సప్పుడు కార్యమప్పుడు కాలమెప్పుడు కాంతులు యే
ప్రేమను పంచియు ప్రేమను పొందియు ప్రేమ జీవిగ జీవితమే
0 comments


.......
లోక ముందు లహరి లాగ నుండు
ఏక మైన ఏక బుధ్ధి కలుగు
శోక మైన సాము చేయు చుండు
పోక చెక్క పోరు కలిగి వుండు
కాక పట్టి కాపు రమ్ము చూడు

కోప మున్న కోరు కున్న బాధ
తాప మున్న తపన తీర్చు బాధ
పాప మున్న పనుల లోన బాధ
శాప మున్న శని అసూయ బాధ
బాపనయుని మాట బాధ తొలగు

మారనిది ప్రేమ మనసు కలిగిన వేదమ్
ప్రార్ధన ల క్రాంతి గుణము వలననె దేశమ్
సర్వ విధి భ్రాంతి తొలిగి సహజపు సేవల్
భారత దేశంబు ఘనత పదిలము సేయున్

అమ్మ పల్కును ఆదరమ్ము గ  ఆలకించియు యీ సహా
యమ్ము తెల్పియు పంచ పాండవ లందరూ సహనమ్ము గా
బొమ్మ యైనను కొమ్మయైనను భక్తినిమ్మియు నిత్యమూ
ప్రేమ పంచియు కృష్ణ తీర్పును సావధానము ఒప్పుటే

నేరము చేయ నేమి బతు కంతయు చుక్కలు చూపు టేమి యౌ
కారము కల్గునేని కల కాలము చెక్కెర లాభసాటి యౌ
బేరము వల్లనేమి పలు కాయలు కుల్లియు పోవు టేమియౌ
హారము పొంది యున్న పలు కోర్కలు భార్యకు కల్గు టేమి యౌ

ప్రేమను పొందియు పంచుటే...భావమ్ము భాగ్యమ్ము బంధమ్మె
క్షేమము తెల్పియు  నిత్యమూ.. చైతన్య సౌభాగ్య భావమ్మె
సౌమ్యము గుండియు సత్యమే ... సర్వమ్ము పద్యమ్ము గద్యమ్మె
సామము దానము భారతీ..... సంతృప్తి సాహిత్య వాగ్దేవి
0


ధనమును తృణముగ దలచిన వారు
ఋణముయు బతుకుకు ఋతువులు వారు
కణములు కలిపిన కధలతొ వారు
మణిమయ సుఖమును మలిచెడి వారు

మనసు న మెచ్చిన మాన్యులు వారు
మనము గ చెప్పిన మనుషులు వారు
వినిమయ ధర్మపు వనితలు వారు
ఘనమగు కీర్తితొ గాలులు వారు

హేమ మైన హేయమైన బతుకు
రామ నామ రమ్య మగును పలుకు
సీమ లోన సమర మైన ఓర్పు
భామ ఎంత భజన అంత నేర్పు

అనురాగం సదా మోహం 
సుసంపన్నం యుగార్ధతమే
సహాయకులు మాధుర్యం 
సహనమ్మే మనస్తిరమే

*🙏🙏నమస్కారం🙏🙏*

అది ఒక రైల్వే స్టేషన్.. పిల్లవాడు తాగే నీరు అమ్ముతున్నాడు.
ఒక పెద్దాయన "అరేయ్ ఇటురా..." అని పిల్లవాడిని పిలిచాడు.
"ఒక ప్యాకెట్ ఎంత?" అని అడిగాడు.
"రూపాయి" అన్నాడు.
"యాభై పైసలకు ఇస్తావా?" 
కుర్రాడు ఏమీ అనలేదు. చిన్నగా నవ్వాడు.
ముందుకు సాగిపోయాడు.
ఇదంతాచూశాడు ఒక సాధువు. 
రైలు దిగి ఆ పిల్లాడి వద్దకు వెళ్లాడు.
"ఆ పెద్దాయన అన్నదానికి ఎందుకు నవ్వావు?" అని అడిగాడు సాధువు.
"స్వామీ... అతనికి దాహం వేయలేదు. దాహం వేసిన వాడు ముందు ప్యాకెట్ తీసుకుని నీరు తాగుతాడు. 
తరువాత ధర ఎంత అని అడుగుతాడు. అతనికి కేవలం టైమ్ పాస్ కావాలి." అని అన్నాడు.
"నిజమే... దేవుడిని కోరుకునేవాడు తర్కాలు, కుతర్కాలు చేయడు. ఆత్రంగా సాధన చేస్తాడు. ఆర్తితో పూజిస్తాడు తప్ప శషభిషలుండవు. 
అవసరం ఉంటే బేరం ఉండదు. అవసరం లేకుంటే బేరం తప్ప మరేమీ ఉండదు." అనుకున్నాడు
సాధువు.....

"సత్య హీనా వృధా పూజా
సత్యహీనో వృధా జపః
సత్య హీనం తపో వ్యర్థం
ఊషరే వపనం యథా "

చవిటి నేలలో(నిస్సారమైన భూమి లో) విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్టుగా సత్యహీన మైన పూజ, జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

రాం రమ్యతారక్తి రవ్వల వెలుగె
గెలువె లవ్య రక్తి రతామ్య రరాం
రాం గమ్యతాశక్తి యవ్వన జెలుగె
గెలుజెనవ్వయక్తి శతామ్య గ రాం

అతివ తెలుపు ఆలుమగల గుట్టు
అతిధి తెలుపు ఆశ పాశ మెట్టు
పతికి తెలుపు పడక నందు పట్టు
సతికి తెలుపు సుఖము లోని రట్టు
బతికి తెలుపు భాగ్య ముండు ఒట్టు

చుక్క లన్ని చక్క గుండు టేను
మోక్కు లన్ని మక్కు తీర్చు టేను
కిక్కు లన్ని కక్కు తెచ్చు టేను
చిక్కు లన్ని చక్క గుండు టేను
ముక్క లన్ని మక్కువుండు టేను

వద్దు అంటె వాట మంత చూపె
సద్దు అంటె సంబ రమ్ము చేసె
హద్దు అంటె హాయి అంటు వేసె
పొద్దు అంటె ఫలము అంటు తీసె
మోద్దు అంటె మోజు అంటు ఆశె

వంకలేనమ్మ డొంక పట్టుకొని ఏడ్చె
సంకనెక్కని భర్త ముట్టుకొని ఏడ్చె
అంకమందేను అండ పెట్టుకొని ఏడ్చె
బంకతీసేను చెట్టు పట్టుకొని ఏడ్చె
జంక గుండాను చంప తప్పు చేసి ఏడ్చె
1 comm
********
దీన్ని గురించి ఒక చోట చదివాను... మిత్రులతో share చేస్తాను...
ఒక్కప్పుడు  జగదంబ భండాసురుడు అనే రాక్షసుడుతో యుద్ధం చేస్తుండగా, వాడి సోదరుడు విశుక్రుడు అనేవాడు ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి ప్రయోగించాడు.. ఆ యంత్రం పేరు" జయవిఘ్న శీల".. దానిలో 8 విఘ్నాలు కూర్చి ఉంచాడట..
1) అలస,( సోమరితనం ) 2) దీన 3)కృపణ(బేలతనం ) 4)నిద్ర 5)తంద్ర ( కునుకు పాటు )
6) క్లీబ (వెనుదీయటం ) 7) ప్రమీలిక ( సంకోచం )

😎 నిరహంకార
ఇవన్నీ కలిసి దేవతల సైన్యం మందకొడి అయ్యేట్టు చేసి వారిని ఓడించారు...
అప్పుడు జగన్మాత ఈశ్వర దర్శనం చేత పొందిన ఆనందం తో,  మందహాసం చేసింది.. ఆ తేజం నుండి గణపతి ఉధ్భావించ్చాడు..
ఈ ఆనంద చైతన్యం తో,   ఆ 8 విఘ్న శక్తులు సంహారించబడ్డాయి...
మంత్ర శాస్త్రం లో, గణపతి పుట్టుక గురించి ఉన్న కథలలో ఇది కూడా ఉన్నది...

ఈ గణపతి శక్తిని భావించి

ఐశ్వర్యం కోరే వారు లక్ష్మీ గణపతి గా,
శీఘ్ర ఫల ప్రదాత గా క్షిప్ర గణపతి గా 
కోరికలు తీర్చే చింతామణి గణపతి గా 
సిద్ధులను ప్రసాధించే " సిద్ధి గణపతి " గా 
సాహిత్యంలో  అక్షర గణపతి
సంగీతం లో స్వర రాగ గణపతి గా 
నృత్య శాస్త్రం లో నర్తన గణపతి
శిల్ప శాస్త్రం లో బహురూప గణపతి..

ఇలా అందరూ వారి వారి ఉపాసనను చేశారు.. దీనినే గాణపత్యం మతం అని కూడా అంటారు...
శుక్లామ్బరధరం విష్ణుం...... శ్లోక రహస్యం కూడా అదే...
అలాగే  యజుర్వేదం లోని  " ఓం గణానామ్ త్వా... మంత్రం కూడా.. ఊతిభిః సీద సాదనం అని అంటుంది అంటే సత్వరం కాపాడి అనుగ్రహించుదువు గాక అని భావం....
కొంచెం critical గా observe చేస్తే " జ్ఞానా నంద శక్తి నుండి ఉత్సాహం కార్యాశీలత, success, జనించి, అలసట, నిద్ర కునుకు ఇత్యాది వికారాలు పోయి, సంతోషం, success  వస్తుంది , అని symbolic గా చెప్పారు...
స్వామి వారి నైవేద్యం కూడా " మోదకము" అని తెలిసిందే గా.....
ఇదీ ఒక నేపధ్యం లక్ష్మిగణపతి కి
🙏🙏🙏

కంచె చేను మేస్తే మరి కరుణ ఏది
రెప్ప కంటినె కాటేస్తే రణము ఏది
బిడ్డ నే తల్లి చంపెస్తే పలుకు ఏది
చెడ్డ యే రాజ్య మేలితే చెప్పు టేది
నమ్మ పలుకులే నాశనమ్ము చేయుు

మంచి పనులు మనసు కిచ్చు హాయి
కంచి నందు కనుల అమ్మ చూడు
సంచి నందు సరుకు వుంచు హాయి
నుంచి ఏమి ననకు దాచ గుండు
ఖచ్చితాలు కులము నందు హాయి

శీల తత్వ సహన ముంచు పుడమి
సమయ తత్వ సూర్య యందు వెలుగు
వినయ తత్వ విశ్వ మందు బలిమి
జయము తత్వ చంద మామ వెలుగు
మనిషి తత్వ మాయ కలుగు పుడమి

మతము మరచి యున్న మనసు మారు
కథలు తెలిపి గాయ పరచ వద్దు
వెతలు తగ్గు వేగ పడుట మారు
గతులు తప్పు గళము పెంచ వద్దు
మతియు మారు మోనముండి యున్న

అమ్మ  తెల్పు అలక వొద్దు అనెను
కొమ్మ కుండు కొత్త తేనె చుండు
నిమ్మ కుండు నీకు తెలుసు అనెను
బొమ్మ ‌‌యైన బోధ చేయు చుండు
 నమ్మ కమ్ము నిన్ను బతక మనెను

పలక పైబలపము తోను పలుకు లేల
అలకతో పలకలొ గీసి మవ్వు చుండు
బలప ముండగ సాధ్యము పదము వ్రాయు 
వెలుగు అక్షరం వరుసగా వైన మవ్వు

నలిగి భయమనందున వుండి నటన వద్దు
అలిగి సుఖములందు మగువ ఆట లాడు
పొలతి పదములంది మగడు పూజ సేయు
చిలుక పలుకుతూ ముక్కుతో చిగురు తినును

అమ్మయె సర్వమూ కనును కార్యము మిక్కిలి భారమైన నే
కొమ్మలు ఉన్ననే తరువు కొత్తగ కాయలు పంచుటే నులే
నిమ్మతి నీరు కార్చుటయు నీకును నాకును బాధ్యతే సుమా
బొమ్మ రిల్లే యనీ అనకు బంధము తోనుయె సంతసమ్ము యేచెల్లు బాటు చిందు లేల నీకు

చిల్లి గవ్వ చిక్కగుండు నీకు
చల్ల నమ్ము చిన్న దొద్దు నీకు
చెల్లి పెల్లి చేసి తుదకు నీకు
చిల్లు బూర చక్క చేయి లేవు

సిరులు పొందాలనే..ఆశ ఘొరమ్ముయే
సరులు పొందాలిలే.. భేషజం లేదులే
ధరణి యందేనులే.. ప్రేమ గుచ్ఛమ్ములే
త్వరగ రావాలిలే.... కోర్క తీరాలిలే

తనను తానేననీ...దారి దారేననే
మనకు మాధుర్య మే.. మోహ ఆదర్శమే
తనువు తాపత్రమే... దాపరీకమ్ముయే
మనసు మాంగల్యమే.. మేలి బంగారమే

సూర్య రశ్మి సర్వ జనుల తాకు
కార్య జయము కావలెనని తాకు
అర్ధ మందు ఆర్య పలుకు తాకు
సర్వ శిద్ధి సుఖము కొరకు తాకు
సూర్య కిరణ సంఖ్య కళలు తాకు

నేత్రమ్ము చిమ్మును వెలుగుతో నెమ్మది నెమ్మది గా
గాత్రమ్ము వినిషించు డమరుకం కాలమ్ము శాంతి గా
అతని హృదయముయే సరస గంగాధర శబ్ధమ్ము గా
అతని రచనా చమత్కృతి శివ తాండవ కృతులు గా

నీ దయ వల్లనే మనసు నెమ్మది నుండెను నిర్మలమ్ము గా
నీ దయ నిన్ను నే తలచి నిత్యము పూజలు నిర్భయమ్ము గా 
నీ దయ సంభవమ్ముగును నీ కృప కావ్యము నిశ్చయమ్ము గా
నీ దయ జూపు నాపయిన నిన్నును కోరితి ధర్మయుక్తి గా

మమ హృదయమ్ము నా కలిగె మనో బలమ్ముయు జీవరక్ష కై
కమల వినమ్ము యే సహన ము కోమ లమ్ముయు కాలదీక్ష కై
సమరము మాని శూలి రంభ సమ్మున బారెను ప్రాణరక్ష కై
సమయము నందు పొందు భయసమ్మున కోరెను కార్యదీక్ష కైనిత్య సత్య ప్రాంజలి ప్రభ పద్యాలు..3/8


కాలము ఏదీ కార్యము నందు 
ఆలన ఏదీ పాలన ముందు 
తాళము ఏదీ గొళ్ళెము నందు 
మేళము ఏదీ పండుగ నందు 

ఆకలి ఏదీ  ఆశల యందు 
రోకలి ఏదీ దంచుట యందు 
చాకలి ఏదీ  యుత్కుట యందు 
చీకటి ఏదీ వెల్గుల నందు 

ఆత్రుత ఏదీ పోరుల ముందు 
భద్రత ఏదీ బాధ్యత యందు 
ముద్రలు ఏవీ ముక్కెర నందు 
నిద్రలు ఏవీ నాటక  మందు 

ఆశయ ఏదీ  కార్యము యందు 
పాశము ఏదీ మోహము నందు 
జోస్యము ఏదీ జాప్యము నందు 
హాస్యము ఏదీ ఆత్మలయందు 

సౌమ్యము ఏదీ సాహస మందు
గమ్యము  ఏదీ గోప్యము నందు
రమ్యపు ఏదీ బాధ్యత నందు
దాశ్యము ఏదీ జోశ్యము పొందు
0

 రెండు అక్షరాలు * మద్యం వద్దు       

" విస్కీ "  " బ్రాందీ "  " రమ్ "  " జిన్ " " వోడ్కా "
 " బీర్ "  " స్కాచ్ "  " గ్లాసు "  " నీళ్లు " సోడ " 
 " బార్ "  " పెగ్ "  " మత్తు " " వాంతి "  " రోడ్డు " 
 " జనం "  " మానం "  " భార్య "  రోగం "  " ఖర్చు 

"డప్పు " " ఏడ్పు " " పోరు "  "ఆశ " "డబ్బు " 
 " అప్పు "  " ఆస్తి "  " చావు "  " పాడి "  " గుంత " 
 " అగ్ని "  " తిథి " " ఫోటో " :" మద్య " "పానం"  
 *వద్దు:"  ఉంటే  రోడ్డు పాలు  *వద్దు:"....

 సమస్యను పూరించుట..

రణమై సాగుట నిత్యమూ ధరలు  రాష్ట్రంలో  ఓదార్యం చెడున్     
ప్రణమై పొందుట సర్వమూ కళలు బాంధవ్యం ప్రభావం చెడున్ 
రుణమై ఉండుట గుర్తుగా బతుకు రాగత్వం రమ్యత్వం చెడున్  
ధనమై పోదురు శాంతికాముకుల క్రోధాగ్నుల్ విజృంభించుచోన్

నీకు ముఖపుస్తక ము ఉంటె నవ్వులు ఉన్నట్లు
వేకువ ఝామున కధలు వెల్లువ వికసించు
మక్కవతొ ఆకర్షించు ట మేలు గ ఉంటుంది
చక్కని నిత్య సంఘటనల చిత్రాలు ఉన్నాయిరా

మనము నేరాలు, ఘోరాలు మనుగడలో చే‌ యోచ్చు 
మనుగడ సిగ్గు‌ తో భయం తో మోటు‌గా మా రొచ్చు    
వినయ మే దారుణ మగు టే విశ్రాంతి కలగొచ్చు
చినుకు లన్నియు నదుల లో చేరి దాహం తీర్చచ్చు

తనువులు ప్రేమ బంధాల దారిగా మా రొచ్చు
విను నవన్నీ నిజములయ్యె విధము కాక పోవచ్చు  
కనులు వంచన వాంఛలు కురిపించి బతకొచ్చు
అణువు పరమాణువు కలిసి ఆశను మార్చొచ్చు

కణము స్త్రీ, పురుషుల మధ్య దగ్గర ఒక టవ్వచ్చు 
గుణము ఆలు బిడ్డల రక్ష గోప్యత మవ్వొచ్చు  
రణము కాంతా కనకముయే రక్తము చిందొచ్చు
మనసు మర్దన ఆరోగ్య మర్మము మారవచ్చు

కళ్లు మాయచే కధలన్ని కనికరం కాకపోవచ్చు
చెల్లు బాటుల తేడాలు చైతన్యం కాకపోవచ్చు
ఇల్లు ఇల్లాలి కోరిక తీరక పోవచ్చు
ముళ్లు ఎన్నుంన్న బాధల మెప్పును లేకపోవచ్చు
 ంంంంంంంం


నిదుర పోరా మువ్వ గోపాలా
ఎదురు చూసి కనులు కాయలు కాసేనురా
అదురు చెందకు బెదురు వద్దురా
సదరు సేవలో హాయిగా నిదురపో గోపాలా

చక్కగా నెలరాజు కొలువు దీరాడు
చుక్కలన్నీ మెరుపుల తోనులె మెరిసాయి
దిక్కులు గా తెలియ పరిచి ఉన్నాయి
మోక్కిన వారికి మోక్షము ఇచ్చే గోపాలా....ని

పాలు తాగిన దూడ నిదురపోయింది
వేలు పట్టీ చీకి నిదురపోరా నాతండ్రి
ఆలు బిడ్డలు ఇంక నిదురపోలేదు
గోల చేయకు అన్నీ ముద్దులిచ్చెద గోపాలా...ని

పాట పాడిన పడుచులు వెల్లారు
ఆటలాడిన పిల్లలు అలసిపొయ్యారు
బాట లన్ని చూపు పరమాత్మ
తోటలో పూలన్ని నీకే నిదురపో గోపాలా..ని

గిలక్కాయలు చూస్తూ హాయిగా నుండురా
కాలగజ్జలు పెట్తాను నవ్వుతూ హాయిగా నిదురపో
అల్లిబిల్లి ఆటలు ఆడావు గదురా
అలక చూపక కలలు తీర్చు గోపాలా.....ని

0





*పూర్వ జన్మ కర్మ.....*
ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది. వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని తన భార్య గర్భవతి అని చెప్పాడు.
గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే...నీ భార్యను అడిగి రా...తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగిరా, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.
మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటూ ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రసవించింది.
మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు. భార్య భర్తలు గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు.
తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, చేసేది. ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు.
మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వనుకాక ఇవ్వను అంటూ మొండి కేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. కాని ఒక్క సారి బిడ్డను నా చేతి కిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను.తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు.
సరే ననీ బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు.
గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి...ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొని మంత్రించి...ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...
ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు.
రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గత జన్మలో వీడు బాకి పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే వచ్చాను.
వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను . కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు.
ఇంకే ముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నంపెట్టి ఆదరించాడు.
నేను పోయే వరకు నన్ను పోషించాడు.
అందుకే...ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లితండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్ధం.
ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే కలుగుతుంది.ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...
మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు కాని అది కాదు.మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు...ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది, నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను,మళ్లీ ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి.ఇదే మోక్షం.మరుజన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు.



ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.

వినుమాటలను తెల్పి జనులు బాధ్యత గనరే వనధర్మమును బూను జనుల భాగ్యము గనరే కనుసైగలకు ఆశ జనులు కష్టము గనరే మనువాడి పలుకేను మనసు ఇష్టము గనరే చేయి చేయి కలిపి మనసు నిలిపి వేయి అడుగు బతుకు తెరువు కలుగు హాయి పొందు జీవి తాన నీకు వేయ్యి ఏనుగుల బలమును యిచ్చు ఆశ నిన్ను సోమరిని చేయు పాశ మనెటి బంధాన్ని చేరు వీశ మంత నమ్మక ముంచు విశ్వ మాయను చేయించి సాగు వశము పొందక అడుగు వేయి ప్రేమ ఉన్న చోట కోప ముండు కామ మున్న చోట కళ్ళు లేవు చీమ కుట్టి నంత చావు చేరు జాము రాత్రి వెన్నెల లంతపంచు వాము వాడి చూడు జీర్ణ మవ్వు హృదయ మెటులుండునో లోకమెల్ల నటులె కథలు తలుపుండునో కాలమెల్ల వెలితె వ్యధలపిలుపుండునో గాధలెల్ల చినుకె అద్దపు కనులుండునో కొత్త వెల్గు బతుకె సతి పతి మనసొప్ప లేక తిట్టెడి ధూర్తుల్ ప్రతి విషయము చెప్పలేక కొందరు ధూర్తుల్ సుతుల మతులు ఒప్పలేక అందురు ధూర్తుల్ అతివినయము గల్గిన ట్టి యాంధ్రులు ధూర్తుల్ మనిషి మేధస్సు వృద్ధి కి మనసుయే యంత్రము మనసుకు ప్రశాంతత నిచ్చు గుణము యే యంత్రము గుణము యే బానిసవకయే కళతీర్పు యంత్రము వినయ కళలన్ని పెంచితే విజయపు యంత్రము విరహపు పరదాలను తొలిచి విధి రాత తెలిపావు పరువపు అందాలు పంచియు మాధుర్యం అందిచావు చిరునవ్వుతో మది తొలిచావు చందనం పూసావు చిరు నామ మల్లేను వదనంలొ చిగురించి కల్సినావు పాప పరిశీలనకు నీవు బియ్యాన్ని దానమివ్వు కోప మనసు శాంతి కొరకుయే గావెండి దానమివ్వు దోష నివారణ బంగారం దానము చేయవలే వేషసుధ్ధి బుద్ధికి పండ్లు దానము చేయవలే 0


*******

గోప పిల్లే నిన్ను వలదిక తాప మల్లే నేను తలచే నన్ను చూడూ ఆశ తీర్చే మనసు కృష్ణా నీదు పాటే నన్ను లాగే ప్రేమ యందే మునిగి ఉన్నా బాధ నంతా తెల్పి యున్నా మనసు కృష్ణా కాల మాయే నన్ను చేరే కన్ను లన్నీ పిల్పు లాయే కాంక్ష తోనే నిన్ను కోరే మనసు కృష్ణా నియమ నిష్టా సలిపి ఉన్నా కళలు అన్నీ చూపి యున్నా కధలు చెప్పక వేచి ఉన్నా మనసు కృష్ణా జపతపాదులు చేయు చున్నా సమయపాలన తలచి ఉన్నా బ్రతుకు నాదము తెలుపు చున్నా మనసు కృష్ణా వేణు గానం హాయి గొలిపే రమ్య రాగం మత్తు పెంచే రాసి లీలా వేళ ఆయే మనసు కృష్ణా *****


మనసు నిజమై..మర్కటమురా
తనువు చలమై.. ఊయలగుటే
చినుకు మెరుపై..ఆశలుడికే
కనులు పిలుపై.. ప్రేమ పలుకే

వయసు ఉడుకై... తొందరగురా
భయము పరుగై... భారమగురా
నియమ తెరపై... నాన్యతగురా
లయల వలపై.... లాస్య మగురా

కధలు మెదిలే... రాక కొరకై
రధము కదిలే... రాకపిలుపై
పదము పలికే... పాపవలపై
విధము తెలిపే... వాదిఅరుపై

లక్ష్మి సత్యాను సారిణీ లభ్యమవ్వ
సాక్షి త్యాగాను సారిణీ సత్యకీర్తి
కక్ష కర్మాను సారిణీ కాంక్ష దీప్తి
లక్ష్యమున విద్య బుధ్ధియు లక్ష ణమ్ము

చిల్లు గారెలు రుచియుండు చిత్ర మవ్వు
మళ్ళి మళ్ళీ తిన్నా రుచి మెండుగా ను
అల్లము తొ పచ్చడి రుచిగా నంచితినుట
ఉల్లిముక్కలు కలిపినా ఊపిరిచ్చు

ప్రణయ తాపమా యిదియని ప్రశ్న యడిగె
తృణము కోపమే అదియును తప్పు మడుగె
కణువు కలలన్ని మదినేలు గొప్ప అడుగె
ఋణపు జీవితం కధమల్లె రవ్వ వెలుగె

వినుమాటలను తెల్పి జనులు బాధ్యత గనరే
వనధర్మమును బూను జనుల భాగ్యము గనరే
కనుసైగలకు ఆశ జనులు కష్టము గనరే
మనువాడి పలుకేను మనసు ఇష్టము గనరే

చక్కని చుక్కగా మనసు మేలును చేయుచు వచ్చె సుందరీ
యాకలి దీర్చగా దలచి యంగన సాగెను సద్ది మూటతో
వేకువ సాక్షి గా పనులు వేగము సాగుట సత్య పల్కుగా
మక్కువ నేస్తమే విషయ వాంఛను తీర్చియు నిత్య సత్య మై

సమయ మిదేననీ యనుట సౌఖ్యము పొందుట సర్వులందునన్
సమరము యేననీ యనుట సర్వము తప్పుయు తెల్పుచుండుటన్
విముఖత చూపుటే విషయ వాంఛలు నందును శాంతి పొందుటన్
జమున ను జూడగా విజయ శాంతి లభించె జయప్రదమ్మునన్

ఎదురుగా ఉన్నా ఎందరి కడుపులు లొ ఆకలి తీర్చే ను
వెదురు బొంగులా గ వేణుగానమ్మే చేయలేకున్నాను
బెదురు చూపులతో బెడిసి కొట్టకుండు ముసలి వయసు బతుకు
కుదురు మల్లెనేను కాలముతో బతుకు జీవ సమాధి యే
0 comm

***** విశాల విశ్వ మందునే విషేష దివ్య మన్నదే వినోద మున్షి భావమే వివాదమయ్యె లక్షణం సరాగరాగమందిరం విశేష భావ సుందరం సకాలమోక్షయవ్వనం సుమాలి ఆశ బంధనం అనంత పద్మనాభ యే అనుంగు వేద మంత్ర మే సుధా సుమాల బంధమై అకాలమృత్యు మాపుటే ప్రయాణమే ప్రమాదమే ప్రకోపమే ప్రకంపణం ప్రకాశమే ప్రభంజనం ప్రసాదమే ప్రభుత్వమే ఓనమాలు నేర్పి తెలుగు ఒకటి రెండు తెల్పి, ఒదిగి లెక్కలు నేర్పు తేట గీతి ఓగు తెలివిగా మార్పుల ఓర్పు తెల్పి, విధము నేడు లేదు చదువే వింత మనిషి సత్వరం వేద్యపరుచుటే సంధి కలుగు విద్య వైద్యము వేద్యమే వింత మలుపు మత్తు వేద్యపరుచు మది మోన మందు విశ్వ మాయవేద్య మవుట వ్యాధి యగుట కవులకు కరువైంది కవితలు కొరతైంది కధలు అటక లెక్క చెవులకు ఇంపుగా చేయు కవితలే వి చెత్త సినిమా లే భవుని రూపంలో భాగ్యసీమలో న భద్ర రచనలివియె శివుని మాయలన్ని సంఘమందు వెలుగు ధర్మధీక్ష పరమె శ్రీ రమ హృదయమే సిరులు కురిపిస్తున్న కొరత వుంది నాలొ శ్రీ నిధిని పోందీ శరణు అనుచు ఉన్న హృదయ వాంఛ పెరిగి శ్రీ లతప్రేమయు సీఘ్రముగా పొందు మార్గ మెరుక లేదు శ్రీ కృపా కటాక్ష సాధనమ్ముగాను శోధన జరుపు టే సీసపద్యము.. మాంగల్య మహత్యం మాంగల్య ధారణం.. మమకారమిచ్చుటే మనసుకు రక్షణై... మమత నిచ్చు మము కన్న వారికే... మహిమలా మనుగడే మనువు తో భయమను..ముసుగు తొలగు మంత్రములా బంధ మైఅనుగ్రహము గా మోక్షము ఇచ్చేటి.. మోహమవ్వు మధుర మాధురినొంది.. మంగళమ్ముగనులే మరులగొల్పేటిది... మదిలొ నుండు తేటగీతి.. అలి మెడ లోన తాళియె ఆది మలుపు ఆది సృష్టి క్రమమునకు ఆలుమగలె ఆది సూత్ర బంధము మోక్ష యానమవ్వు ప్రాంజలి ప్రభ వెలుగుల ప్రాంత మయ్యె
****************
మమత తోడ మమ్ము గాంచు రా
సమయ మందు శక్తి నివ్వు రామ
తమను భక్తి తోను కొలిచె రామ
తమరి కావ్య గాధ యగుట రామ
గమన యుక్తి గాను మార్చు రామ.....
నమ్మ కమ్ము నిన్ను మార్చ గలదు
నమ్మ కుంటే నీవు మార గలవు
నమ్మ పలుకు నటన కాక జూడు
నమ్మ కమ్ము నీకు సత్య మల్లె
నమ్మి నీవు నమ్మ కముతొ బతుకు
చెట్టు లాగ చుట్టి సేవ చేయు
గట్టు మార గుండు నట్లు చూడు
రట్టు అనకు రమ్య మగుట చేయు
పట్టు వీడి బెట్టు చేయ కుండు
ఒట్టు నేర్పు ఓనమాలు రవళి
ముర్తీభవించే వినయాను బంధం
ఆర్తానునాదం సహనమ్ము బంధం
కూర్మావతారం క్రమబధ్ధ బంధం
మార్తాండదేవం కమలాప్తబంధం
చింత చెట్టు చిగురు పుల్ల గుండు
వింత గాను విపుల కథలు ఉండు
సంత లోన సంబరమ్ము ఉండు
పంత మున్న పనులు సాగ కుండు
గంతులేయగుండు గమ్ము గుండు .......
నడుపు తున్న నడక తెలుగు వెలుగు
నాడి పట్టి నటన లేని మెరుగు
కడుపు మాడి గళము తెల్పి పరుగు
విడుపు చూపి సేవ వింత కలుగు
ముడుపు కట్టి మోక్ష మడగ జరుగు
నవ్వు వారి నయన మెరుపు చూడు
నవ్వి ఏడ్చు నటన నమ్మ బోకు
జివ్వు మన్న జీవి తాన్ని చూడు
జీవి కార్చు జావ నమ్మ బోకు
జీవి దైవ జపము రక్ష గుండు
కనులు మాయ గలుగు కధల మల్లె
కనుల రెప్ప కాచు నిత్య మల్లె
కనుల నీరు కాన రాని జల్లె
కనుల చూపు కాంతి గుచ్చు ముళ్ళు.
కనులు తెల్పు కధలు పంచ రవళి.
నిన్ను చూసాక నామదీ ఉరికే
కన్ను గీటాక నాకలా చెదిరే
ఎలా గడపాలీ యీరేతిరీ
ఎలా చెప్పాలీ తనువు తిమ్మిరీ
ప్రేమ పొంగి పిలిచింది.. పరువమంతా చూపింది
బాస లెన్నో చేసింది... బాధ్యతుంది ఆగమంది
కునుకు తీయకుండా చేసింది...తపన మోయు మన్నాది
ఓర్పు చూపాలన్నాది ... ఓటమిని ఒప్పు కున్నాది
మిత్రు లందరునూ మిడిమిడి జ్ఞానము కీర్తి చూడలేరు
మిత్ర ధనాశతో మిత్ర ద్రోహి పరచు ముందు కొచ్చుచుండు
మిత్ర విద్య ఫలం మిణుగురు పురుగులా వచ్చి పోవు చుండు
మిత్రుడు ఆపదను మిత్ర భావముతో ధనము ఆరోగ్యం
వికసించే లత ఊపులే మనసు వుయ్యాలై సుఖాన్ని చ్చుటే
ప్రకటించే ప్రతిభా సమర్ధతలు ప్రభంజనం ప్రబోదధమ్ముగా
ప్రకృతే ‌హాయిని ఇచ్చుటే బలము పెంపొందీ మనోనేత్ర జం
టకుసింగారపుభర్తవై గిరులకోటన్ వెలుగు స్వామీ నతుల్
May be an image of 1 person

1 
విశాల విశ్వ మందునే


విషేష దివ్య మన్నదే
వినోద మున్షి భావమే
వివాదమయ్యె లక్షణం

సరాగరాగమందిరం


విశేష భావ సుందరం
సకాలమోక్షయవ్వనం
సుమాలి ఆశ బంధనం

అనంత పద్మనాభ యే


అనుంగు వేద మంత్ర మే
సుధా సుమాల బంధమై
అకాలమృత్యు మాపుటే

ప్రయాణమే ప్రమాదమే


ప్రకోపమే ప్రకంపణం
ప్రకాశమే ప్రభంజనం
ప్రసాదమే ప్రభుత్వమే

ఓనమాలు నేర్పి తెలుగు ఒకటి రెండు


తెల్పి, ఒదిగి లెక్కలు నేర్పు తేట గీతి
ఓగు తెలివిగా మార్పుల ఓర్పు తెల్పి,
విధము నేడు లేదు చదువే వింత మనిషి
సత్వరం వేద్యపరుచుటే సంధి కలుగు

విద్య వైద్యము వేద్యమే వింత మలుపు

మత్తు వేద్యపరుచు మది మోన మందు
విశ్వ మాయవేద్య మవుట వ్యాధి యగుట

కవులకు కరువైంది కవితలు కొరతైంది కధలు అటక లెక్క


చెవులకు ఇంపుగా చేయు కవితలే వి చెత్త సినిమా లే
భవుని రూపంలో భాగ్యసీమలో న భద్ర రచనలివియె
శివుని మాయలన్ని సంఘమందు వెలుగు ధర్మధీక్ష పరమె

శ్రీ రమ హృదయమే సిరులు కురిపిస్తున్న కొరత వుంది నాలొ


శ్రీ నిధిని పోందీ శరణు అనుచు ఉన్న హృదయ వాంఛ పెరిగి
శ్రీ లతప్రేమయు సీఘ్రముగా పొందు మార్గ మెరుక లేదు
శ్రీ కృపా కటాక్ష సాధనమ్ముగాను శోధన జరుపు టే


 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ప్రేమంటే ఇదేనా ?

అప్పుడే అడుగు పెట్టింది కొత్తకాపురానికి, కోటి ఆశలతో,ఆశయాలతో ఒకవైపు ఉద్యోగం చేయాలి, మరోవైపు కాపురాన్ని సరిదిద్దు కోవాలి, అదే ఈనాటి స్త్రీకి, భర్త కూడా  అవకాశవాదిగా మారి పోతున్నాడు, ఈ  తప్పు ఎవరిదో  మీరే ఈ కధబట్టి మిరే చెప్పగలరు కథానాయికి ఆనందీ, కథానాయకుడు  ఆనందరావు . ఇక చదవండి. 

కంటికి కునుకు రాదు, ఎంతసేపు వేచి చూసిన గడియారం కదులుతుంది తప్ప, మనసులో వేధిస్తున్న ఆలోచనలకు దారి దొరకక, నోరు విప్పి చెప్పుకోలేక, సన్మార్గంలో నడుస్తున్న అనుమానం బీజంతో ఉన్నవానికి అంతా దుర్మార్గంగా కనిపిస్తున్నది, ఎప్పుడో చేసిన తప్పును పదే పదే వల్లిస్తూ,  ఎప్పుడూ  వెకిలి చేష్టలతో, మానసికంగా హింసించి సంతోష పడేవారు మావారు, అని తలుస్తూ వాకిటముందు కూర్చొని ఉన్నది ఆనందీ, ఆనందం అంటే ఏమిటో తెలియదు, పెళ్లయిన ఒక్కసిన్మాకు పోవటం, హోటల్ కు పోవటం అనేదిలేదు, చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగి, పెళ్ళైన సుఖపడాలని ఆశతో జీవిస్తూ ఉన్న మహిళ.

నెమ్మదిగా పాడుకుంటున్నది, నీలి కన్నుల కృష్ణా, వాలు చూపులతో ఉడికిస్తున్నావా కృష్ణా, నీ నవ్వులో రాలు రత్నాలు, నీ కాలి  మువ్వల శబ్దం నన్ను ఒక్క నిముషము  కూడా  నిలవ నీయుటలేదు, నా మేని సొగసులు, అమాయకపు నడకలు, హొయలు పోయే నీకోసం, ఈ పండు వెన్నెల, ఆ పూల గంధాలు వేచి వున్నాయి మనకోసమే, అందుకొని అల్లుకోగా రారా..నా మనసే నీదిరా, నీవంటే నేనురా వెన్నెల స్నానాలు చేద్దాం.......రారా, ఇద్దరమూ ఒకటయ్యి, ఏలుదాము ఈ రస జగతిని., ..

రోజూ జరిగే భారతమే ఈరోజు మరీ ఎక్కువ అయింది, బాగుగా త్రాగి,  పచ్చి బూతులు పలుకుతూ, ఇంట్లోనించి బయటకుపో, నా కళ్ళ ఏదుట కనబడ వద్దు, నేను మారను, ఉండ గలిగితే ఉండు, లేకపోతె తక్షణం, బయటకు నడువు అన్న మాటలకు ఓర్పు నశించి, దుర్మా ర్గుని ఆశ్రయించి  ఉండే బదులు అనాధలకు,  సేవ చేయదలచి  కట్టు బట్టలతో నడిచింది బయటకు ఆనందీ. మత్తులో ఉండుట వల్ల  సోఫాలో పడుకున్నాడు ఆనందరావు .

నిద్రలేవంగానే కాఫీ రాలేదు , చక్కటి పలకరింతలేదు, తనతప్పు గ్రహించాడు, వెంటనే ఫోన్ తీసుకోని తెలిసిన వారందరికీ ఫోన్ చేసాడు, భార్య వివరాలు తెలియలేదు, భార్య  ఆఫీసుకు బయలు దేరాడు రాలేదని తెలుసు కున్నాడు, తను ఆఫీసుకు చేరాడు, ఆఫీసులో డబ్బు పోయ్యిందని దానికి కారణం  తనే కారణమని భావించి పోలీసులకు దొరక కుండా తిరిగాడు,  ఆనందరావు  మారి, భార్య చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని ఏడ్వసాగాడు, స్నేహితులెవరూ సహకరించలేదు, పలకరింపులు లేక, ఆఫీసుకు పోక, రోడ్డువెంట తిరుగుతున్నాడు, మనసు మనసులో లేదు, భార్యను మరువలేక త్రాగుటకు బానిస అయినాడు, ఒక వైపు పోలీసువోల్లు, మరోవైపు అప్పులవాళ్ళు వెంబడిస్తున్నారు, అనారోగ్యముతో బాధను భరించ లేక రోడ్డుమీద పడిపోయాడు.

కళ్లుతెరచి చూడగా ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గ్రహించాడు, గురువుగాను చెప్పిన మాటలు విన్నాడు ఆనందరావు. 
   
   ఆశ్రమంలో   ఈవిధముగా గురువుగారు నీతి  బోధ చెప్పటం మొదలు పెట్టారు, మనిషికి అహంకారమే పరమ శత్రువు, చెడుస్నేహము మనిషిని కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కొన్ని అలవాట్లకు కొందర్ని బానిసగా మారుస్థాయి,  చేతులారా జీవితాన్ని నాశనం చేసు కుంటారు, అట్టివారు ఎవరైనా పశ్చాత్తాపముతో తప్పు వప్పుకుంటే వారిని ఆదేవుడు క్షేమించి మంచి మార్గము చూపిస్తాడు.

అక్కడి వాతావరణ, అలవాట్లు ఆనందరావుకు కొత్తఆశలు వేళ్ళు విరిశాయి, అక్కడ దేవుని ముందు కూర్చొని తనతప్పులు చెప్పుకున్నాడు, అక్కడ  వున్న  వారికి  సేవచేస్తూ ఉన్నాడు. 

అప్పుడే అక్కడకు ఒక ఉత్తరము వచ్చింది, మీ అప్పులు తీర్చటం జరిగినది, ఆఫీసు డబ్బు కట్టడం జరిగింది, ఇక మీరు స్వేశ్చ జీవి . 
   
దుర్జన స్నేహమ్ము - దూరమ్ము సేయుమా - వర్జించువారలన్ నీవు 
అప్పులన్ జేయకుమ - ఆర్జనల్ చాలుగా - ముప్పులన్ దేబోకు నీవు 
గర్వమున్ వీడుమా - కల్లలన్ వీడుమా - సర్వ మా దైవమే నీకు 
అమ్మయే దైవ మా - అబ్బయే దైవమ్ము - బమ్మయే సృష్టించె నిన్ను


నీ ప్రేమ ఓప్పులో భాగము పంచుకున్నాను, ఆ చిరుకానుకనీకు అందిస్తున్నాను, నా గురించి వెదక వద్దు నీవుమారావని గమనించాను, నన్ను కలవాలను కుంటేరావచ్చు,  క్షమించే గుణం ఒక్క స్త్రీ   కే ఉన్నది,  ఓర్పుతోనీకోసం వేచి ఉన్నాను.
    

ఆశ్రమంలో  గురువు గారికి తన గురించి పూర్తిగా చెప్పటంవళ్ళ ఆయన సలహా ప్రకారము భార్యను కలవటానికితిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు .
 

--((*))--


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 

గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగా బంధువుల తో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు.

0


స్నేహ మన్నది చెప్పి వచ్చేది కాదు

స్నేహ సంపద కరణ తోకూడి ఉండు

స్నేహము ప్రాణానికియె ప్రాణమ్ము అగును

స్నేహ ముండు ట దైవ నిర్ణయ మగును


 విశ్వాస ముంచాక మనవీ తలపే నిజమ్మే

శాశ్వత్వ కీర్తేను మనసే తరుణం నిజమ్మే

పాశమ్ము పొందేది శుభమే మగుటే నిజమ్మే

ఐశ్వర్య మిచ్చేది చెలిమీ సహనం నిజమ్మే


తుమ్మెద' చూపు ఆశల భవిత కలలుగా

నమ్మిన పువ్వు సఖ్యత తెలుపు విధముగా

కిమ్మన కుండి గమ్మున జుర్రు సమముగా

చెమ్మకు సంత సించియు వెచ్చ దనముగా


గురువు గారికి ధన్యవాదాలు గాను

అరువు కాదిది స్నేహ భావము గాను

పరువు కాదిది ప్రాణ స్నేహము గాను

తరువు లాగను ధార పోసెద మనము


పలికి పలక లేదనుట ఎందుకో తెల్పు

నిలిచి నిశ్చల హృదయ శ్వాసను తెల్పు

చిలికి చెలిమినే ప్రశ్న  లేయక తెల్పు

చిలిపి వేషాలు వలదు మోనంబు వీడు


చెలిమి చీకటి అనకు మనసుకు మజలి

కలిమి ఉన్నను లేక పోయినా చెలిమి

బలిమి నేనను స్ప్రహ అహమ్ము మజలి

పలికి లేదను మాట ఒప్పదు చెలిమి


మది తలుపులన్ని చెప్పి ఒప్పించు ప్రేమ

చెదిరి పోయిన మనసు కలిపేది చెలిమి

కథల తలుపులు తెర్చి మార్చును కళలు

విధిని తలచియు ప్రకృతి ఒడిలో న కలలు


కలువ కన్నుల కాంతి కనకమై వెలుగు

చిలక పల్కులు భ్రాంతి చిగురించు వెలుగు

వలపు సింగారం శాంతి కల్పించు వెలుగు

చెలిమి జీవితం మార్పు తెచ్చేటి వెలుగు


నిజము తెలిపినా నీకు నిస్పృహ కలుగు

విజయ వాంఛతొ నీకు చెలిమియే పెరుగు


మేలు చేయు గురువు మేలు దైవంబు గ తల్లి దండ్రి చెలిమి

నేల నమ్మి బతుకు నిష్ఠగా పాటించు చెలిమి యే

పాలు నీరు నటుల పాలవెన్నెలుగా పుడమి నందు చెలిమి

కాల మార్పు ఉన్న కలిసి బతుకు చెలిమి కధలు కాని జీవి


మధుర మైనది గా మనసు లో స్నేహం దేవుడు కలిపేను

అదియు శాశ్వితం అక్కరగా చెలిమి, ఉండ దెపుడు అహం

చెదరనిదే చెలిమి జాతి నంత కలుపు నిజము శాశ్వితం

మదిలొ మహిమ చూపి మానవత్వమ్మే బతికె చెలిమిగాను


శ్రీమత్సుందర నాయకీం  భయహరాం  జ్ఞానప్రదాం నిర్మలాం

( సుందరేశ్వరుని అర్ధాంగి, భయమును నిర్మూలించునది, జ్ఞానము ప్రసాదించునది, పవిత్రమైనది )


శ్యామాభాం కమలా సనార్చితపదాం  నారాయణ స్యానుజామ్

( నల్లని వర్ణము కలిగి, బ్రహ్మ చే పదములు ఆర్చించబడిన నారాయణుని చెల్లెలు )


వీణా వేణు మృదంగ వాద్య  రసికాం నానావిధాం అంబికామ్

( వీణా వేణువు మృదంగం మొదలగు వాద్యములను ఆనందించునది, అనేక విషయములకు తల్లి )


మీనాక్షిమ్ ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిమ్

( ఓ మీనాక్షి దేవి, కరుణా సముద్రురాలా ఎల్లప్పుడూ నీకు, నేను  ప్రణామములు చేస్తాను )