Monday, 18 February 2019

ప్రాంజలి ప్రభ (చదవండి చదవమని చెప్పండి )






నేటికవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

పువ్వు వైనానీవె, సాహస స్పూర్తివైనా నీవే
సహనానికి పేరు నీదే, ఘనకీర్తికి మరోపేరు నీదే
ఓర్పు వహించి, నిగ్రహాన్ని పెంచే స్త్రీవి నీవే
రాతలలో ఘనత నీదే, మాటలలో నేర్ప నీదే

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

స్త్రీ అణకువ తనాన్ని చులకచేయుట ఎందుకు
స్త్రీని చూసి నిర్మల హ్రదయంతో సాగు ముందుకు
స్త్రీ సీలాన్ని పరీక్ష చేసి వేదించుట ఎందుకు
స్త్రీని ఎప్పుడు అవమానించి సాగలేవు ముందుకు

స్త్రీ గౌరవాన్ని నలుగురిలో చులకన ఎందుకు
స్త్రీని అందరిముందు ఆదరంచుట మరువకు
స్త్రీ శ్రమలో శ్రవంతి అంటూ హింసించుట ఎందుకు
స్త్రీకి శ్రమలో సహాయపడి ఆనందించుట మరువకు

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం


--((**))--
.ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి  ప్రభ 



(5)సర్వేజనా సుఖినోభవంతు 
(5)
శ్రీకృష్ణుడు నెమలి పించం ధరించడం వెనుక అసలు కథ
కృష్ణుడు అంటేనే లీలలు .. కృష్ణుడు ఎప్పుడు నెమలిపించం ధరించకుండా కనబడడు.. అసలు శ్రీకృష్ణుడు నెమలి పించం ఎందుకు ధరిస్తాడు ?
ఒక విశ్లేషణ నెమలి శారీరిక సంపర్కం చేయదు కాబట్టి:
ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం.
మగనెమలికి పించం ఉంటుంది. వర్షాకాలంలో గంభీరంగా ఉరుముతున్నప్పుడు పులకించిన మగనెమలి నాట్యం చేసినపుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి.ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం ద్వారా ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం ధరిస్తుందట.
ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు అని ఒక విశ్లేషణ.
మరో విశ్లేషణ బ్రహ్మదేవుడు నెమలికి ఇచ్చిన వరం:
ఒకానొక రోజు బ్రహ్మ లోకాన బ్రహ్మదేవుడు దీక్షగా కూచుని రకరకాల పక్షులను తీర్చిదిద్దుతున్నాడు. చిలకలు, పిచ్చికలు , గోరువంకలు, పాలపిట్టలు, పావురాలు ఇలా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఖాయం చేస్తున్నాడు.
అన్ని పక్షులు చిన్న చిన్నవే అవుతున్నాయని అప్పుడు ఒక పెద్ద పక్షిని ఊహించి, తయారుచేయడం మొదలు పెట్టాడు. దాని రూపురేఖలు, రంగులు అన్నీ కొత్తగా దిద్దాడు. దానికి రెక్కలను చిన్నదిగా, చిత్రంగా అమర్చాడు. పొడవైన తోక పెట్టాడు. దానికి చిత్రాతిచిత్రమైన యీకలు సమకూర్చాడు. అది తలుచుకుంటే ఆ తోకను విసనకర్రలా విప్పాలి . అప్పుడు ఆ పక్షి ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనుకున్నాడు .
ఇదంతా ఒక పక్కనుంచి గమనిస్తున్న సరస్వతీదేవి ఆ పక్షి అందచందాలకు చాలా మురిసిపోయింది. “దానికి మంచి నాట్యకౌశలం కూడా వుంటే, ఆ చక్కదనానికి మరింత శోభ చేకూరుతుంది” అని బ్రహ్మ కు సలహా ఇచ్చింది.
విద్యా బుద్ధులు అనేది నీపని, నువ్వే అనుగ్రహించాలి అని బ్రహ్మ అనగా, అనుగ్రహించి దానికి “నెమలి” అని పేరు పెట్టింది సరస్వతి. అంతే కాకుండా తన వాహనంగా స్థానం కల్పించింది.
నెమలి అందానికి, ఆటకి సార్ధకత చేకూరిందని బ్రహ్మ ఆనందించాడు. కానీ నెమలి ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. ఏమిటీ నీ కోరిక? అన్నాడు బ్రహ్మ .
ఒక్క బ్రహ్మ లోకానికే పరిమితం కావడమా? అని అడిగింది నెమలి
అయితే కుమారస్వామికి వాహనమై కైలాసంలో గెంతులు వెయ్యమని కటాక్షించాడు. నెమలి ఆ మాట వినగానే ఒక్కసారి పురివిప్పి ఆనందంతో నాట్యం చేసింది.
కొంత సేపు నాట్యం కాగానే నెమలి పించం ముడుచుకుంది. దానితో పాటు దాని ముఖమూ చిన్నపోయింది.
నీకు మళ్ళీ ఏమైంది? అన్నారు బ్రహ్మ మరియు సరస్వతి.
మరి విష్ణులోకంలో నా సంగతి తెలిసేదెలా? అని దీనంగా ముఖం పెట్టింది నెమలి తెలివిగా .
బ్రహ్మకు ఆ మాట వినగానే కోపం వచ్చింది. కాని నిదానించుకొని, ఎంతైనా తను ఏరికోరి తయారుచేసిన ప్రాణి కదా!
పైగా అది అనూహ్యంగా అద్భుతంగా కూడా తయారైంది. అందుకని తెలియకుండానే దాని మీద, మమకారం ఏర్పడింది.
అంతే కోపాన్ని అణచుకొని విష్ణులోకంలో కాదు కానీ, ద్వాపర యుగంలో ని నెమలి పించం కృష్ణుని తలపై కిరీటంలో నిత్యం రెపరెపలాడుతుంది. సరేనా!” అన్నాడు.
అప్పుడు నెమలి ముఖం దీపంలా వెలిగింది..
ఈ విధం గా బ్రహ్మ వారానికి ఫలితం గా ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడు నెమలి పించం ధరిస్తాడని మరొక విశ్లేషణ.


~ పసి తనం  ~(4)

నాకు నిన్ను చూపుతూ నువ్వు మొదలైన క్షణం ఇంకా నా అరచేతుల నిండా ఆకాశమై పరుచుకునే ఉంది, వేవేల వసంతాలు ఒక ఉధృతమై ఒక్క సారిగా
కమ్ముకున్న సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది

ముద్దు ముద్దు మాటలని మూటగట్టేసి, నా మౌనాన్ని చిధ్రం చేసిన తీపి గాయం ఇంకా పచ్చిగానే ఉంది, కలల్ని మాట్లాడటం పట్టుబడని నన్ను కలల సరిహద్దుని దాటించేసిన నీ భవిత ఇంకా పలకరిస్తూనే ఉంది, శూన్యం నను తడిమినప్పుడల్లా
నువ్వొక అలారం మోతవై నన్ను తట్టిలేపుతున్న సందర్భాలు కొనసాగుతూనే ఉన్నాయ్, నిద్రిస్తూ నువ్వు కనే కలల లేత చిరునవ్వులలో వెలిగే అమాయకత్వపు వెలుగులు ఎప్పటికీ తరగని ఒక ఆశ్చర్యమై నన్ను కట్టేస్తున్నాయ్. 

నిన్ను నేను లాలించడమే అందరికీ తెలిసిన నిజం నువ్వు నన్ను పాలించడం నాకు మాత్రమే తెలిసిన అలౌకిక ఆనందం నవ్వుతూ తుళ్ళుతూ కళ్ళు పెద్ద చేసి నువ్వు ‘నాన్నా' అని పిలిచినప్పుడల్లా నువ్వు యువరాణివై నన్ను ఈ ప్రపంచానికి రాజుని చేసిన ఆనందం నీ పసి స్పర్శలో ఏ మర్మాలు దాచావో ఏమో నా శూన్యాల అలికిడిని చెరిపేస్తూ ఒక దైవత్వం కురుస్తున్న చప్పుడు వినవడుతుంది. 
నీ నవ్వుల మంత్రదండంతో నా కలతలన్నిటిని సరి చేసేసి మనఃక్లేశాలన్నిటినీ మాయం చేసేస్తున్న అద్వైత అల్లరివి ఎప్పటికప్పుడు నన్ను కొత్తగా మొదలు పెట్టడం ఎక్కడికక్కడ నన్నునిర్మలంగా ఆవరించుకోవడం తెలిసిన ఏకైక సత్యానివి నువ్వు.

నా వంటినే మెట్లుగా నడచిన నిన్నటి నీ పసినడకల నిర్వచనాలని దాటి
నేడు నేను పరిచే దారిలో రేపటి నీ పరుగుని కలగంటూన్నా… కన్నా… నన్ను తడిపే సున్నితపు ప్రేమ సుమాల తొలకరివి నువ్వు నువ్వు నా ఆనందానివి… నువ్వే నా అనంతానివి…!


 --((*))--



సెల్ మాయ ... (3)

నమస్తే ! మీ నంబర్ ఏంటి?... ఇది ఒక వ్యక్తీ పరిచయం కాగానే అడిగే మొదటి మాట . ముందు అతని నంబర్ సేవ్ చేసుకుని తర్వాత మిగతా ముచ్చట్లు. ఇంతకూ ముందు ఐతే ఇంటికో ఫోన్ ఉండేది. దానికి కాల్ చేస్తే ఇంట్లో ఉంటే మాట్లాడతాడు లేకుంటే వచ్చాక మాట్లాడొచ్చు అని ఉండేది. కాని ఇపుడు ఏ వ్యక్తినైనా ఏ సమయంలో అయినా పట్టుకునే సులువైన మార్గం మొబైల్ ఫోన్. అవసరానికి పనికొచ్చే వస్తువుగా ప్రారంభమైన ఈ సెల్లు వాడకం ఇపుడు అత్యవసరం ఐపోయింది. ఎంతగా అంతే బాత్ రూం లోకి కూడా తీసుకెళ్తున్నారు. గుళ్ళో దేవుడికి పూజ చేసే పంతులు మంత్రాలకు మధ్యలో తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తి మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడుతూనే తిరుగుతూ ఉంటాడు. అదేం భక్తో మరి? స్కూలు పిల్లలకు కూడా మొబైల్ అవసరమే అంటున్నారు కొందరు బడాబాబులు, అమ్మలు. కాలేజీ పిల్లలకైతే అన్నం లేకున్నా సెల్లు ఉంటే చాలు. ఒకటే ముచ్చట్లు. మనిషి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ సాధనం కనుక్కున్నారు .కాని అది ఆ దూరాన్ని మరింత పెంచుతుంది. పక్క రూం లో, క్యాబిన్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే సులువైన మార్గం మొబైల్. నడిచి వెళ్లి అతనితో మాట్లాడే ఓపిక లేదో,సమయం లేదో, బద్ధకమో మరి..

ఈ అవసరాన్ని తమ వ్యాపార సూత్రంగా మార్చుకున్నాయి కంపీనీలు. పుట్టగొడుగుల్లా రోజుకో కొత్త మొబైల్ కంపెనీ,మాడలు. వాటికి దీటుగా రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు. ఈ వ్యాపారంలో పేరు, డబ్బు సంపాదించుకోవడానికి కొత్త ఆఫర్లు. ఒకడిని చూసి ఇంకోడు బట్టలిప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఫోన్ రెట్లు, కాల్ రెట్లు ఒకరిని చూసి ఇంకొరు తగ్గించేస్తున్నారు. ఈ కాల్ రెట్లు, మెసేజుల రెట్లు ఎంతగా ప్రభావితం చేసాయంటే పనిమనుష్యులు, బిచ్చగాళ్ళు, కూరగాయల బండి వాడు కూడా సెల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు సెల్ లేదు అన్నవాడు పిచ్చోడు ఈరోజుల్లో. సేల్ ఫోన్ మోడల్ బట్టి అతని గౌరవం విలువ కడతారు కొందరు మహానుభావులు. ఉద్యోగాలు,వ్యాపారస్తులకు ఈ సెల్లు చాలా ఉపయోగకరమే. కాని అది ఎంతో మంది చేతుల్లో దుర్వినియోగం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో..
ఓ చిన్న జోకు..

"హలో!"
"హలో! ఇది ఫలానా కస్టమర్ కేర్. మీకే విధమైన సేవ చేయగలం?"
"హలో! నేనో కంప్లెయింట్ చేయాలి"
"చెప్పండి"
"నా నంబర్ కి కాల్ చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.మా అమ్మకు తెలిస్తే అది కాన్సిల్ చేయిస్తుంది.మీరు చేయొద్దు"
"సరే చేయం కాని. ఏ నంబర్ అండి?"
"అమ్మా! నంబర్ చెప్తే మీరు కాల్ చేస్తారు. మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది.మీరు చేయనపుడు ఆ నంబర్ ఎందుకు చెప్పాలి?"
"ఏదైనా ఆఫర్ ఉంటే కాల్ చేస్తాము, బిల్ కట్టకుంటే కాల్ చేస్తాము అంతే"
"వద్దు.. చేయొద్దు.మీరు కాల్ చేసి మా అమ్మకు కంప్లెయింట్ చేస్తే నేను మీ ఆఫీసుకు వచ్చి కంప్లెయింట్ చేస్తాను."
" సరే చేయనులెండి"
ఇలా ఒక అమాయకుడు ఇంగ్లీషులో చేసిన సెల్లు లొల్లి వినండి మరి.
ఇది వింటుంటే మన తెలుగు న్యూస్ చానెల్స్ లో యాంకరమ్మలు తెలుగు మాట్లాడడానికి బలవంతంగా పడుతున్న పాట్లు గుర్తొస్తాయి. కాదంటారా?
ఈ సందర్భంగా ఓ గీతోపదేశం కాదు కాదు.. సెల్లోపదేశం..(మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా స్టైలులో పాడుకోండి) 




మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు మదలరా

ఆ మత్తులోన పడితే అడ్డంగా బుక్కవుదువురా.. //మత్తు//

జీవితమున సగభాగం ఫోన్ సోల్లుకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం బిల్లు కట్టుతకే సరిపోవు.
సెల్లుఫోన్ లేనివారు పనికిరాని మూర్ఖులు
వద్దురా అంటే చెడామడా తిడతారు ... // మత్తు //

రింగ్ టోన్స్, కాలర్ ట్యూన్స్ పిచ్చిగా వాడకురా
పాటలు వింటూ రోడ్డు మాత్రం దాతకురా (చస్తావుర్రోయ్)
బుద్ధి చెప్పడం మావంతు తప్పు తెలుసుకోవడం నీ వంతు
సెల్లు లేకున్నా నడిచే కాలం చూడు మారకుంటే నీ ఖర్మం.. //మత్తు //

ఈ సెల్ పిచ్చోడి చేతిలో రాయా, లేదా  మంచోడి  చేతుల్లో  రాయా ఏదైనా ఒక సమస్త సమాచారమును తెలిపి చూపే ఒక దిక్సూచి. 
ఉపయోగించు కోవటం వచ్చినా చేతకాకపోయినా ఎక్కువసేపు వాడితే చెవులకు కళ్ళకు బాధ ఉంటుంది. 

--((**))--        

(2)
అది నీకు పనికి రాదు --- నువ్వట్టాగా అంటే మాకు ఫుడ్డేట్టాగా అన్నా ??

మాగ్నెటిక్ థెరఫీ అనేది .. తరచూ రాజ్యమేలుతూ ఉంటుంది.
మన రక్తంలో , ఐరన్ ఉంటుంది .అది రక్తానికి , శక్తిని ఇస్తుంది . అందుకని గర్భిణీ స్త్రీలకు "ఐరన్ " టాబిలెట్లు " ఇస్తారు . ఈ వంట్లో వుండే ఐరన్ కి - గోడకి కొట్టే మేకులలో వుండే ఐరన్ కి పోలికే ఉండదు .

కానీ మాటలతో మ్యాజిక్కులు చేసి పొట్ట పోసుకునేవాళ్ళు - 
" నీ వంట్లో ఐరన్ వుంది - నాదెగ్గర - మాగ్నెట్ వుంది - ఈ మాగ్నెట్లు పెట్టి కుట్టిన చడ్డీ తీసుకొని నీ వంటిమీద మీద వేసుకో .. నీవంట్లో వున్నా ఐరన్ ఆంతా.. మాగ్నెట్ కోసమని .. నడుములదెగ్గరికి వచ్చి గడ్డ కట్టుద్ది .నీ నడుములో ఇనుప బలం వస్తది . ముందువైపు కూడా మాగ్నేట్లు పెట్టాము . అక్కడ కూడా ఇనప బలం వస్తది. గర్ల్ ఫ్రెండ్తో మస్తు ఎంజాయ్ చేయచ్చు . ప్లిలలలు లేని వారికి ఇది వరప్రసాదం " అని ప్రకటనలు ఇస్తారు . లాజిక్కు చాలా సింపులుగా , తేలిగ్గా అర్థమయ్యేటట్లు వుంది .అమాయకులు , పిల్లలకోసం పరితపించే వాళ్ళు , 1000/- 2000/- వేలు ఖర్చుచేసి, కొని - పరీక్షించి -- 0% కూడా ఫలితం లేదని - నిరాశ పడుతుంటారు .

అమ్మేవాడు సింపుల్ లాజిక్కు వాడినట్లు -- మనము కూడా సింపుల్ లాజిక్కు వాడాలి . ఒక అయస్కాంతం తీసుకుని మనవంటి కి అతుక్కుంటుందేమో చూడాలి . అతుక్కుంటే , అప్పుడు ఇలాంటివి కొనుక్కోవాలి . అతుక్కోకపోతే , మనరక్తం అయస్కాంతానికి లోంగే రక్తం కాదని - అలాంటి రక్తం ఎవరికన్నా ఉందేమో కానీ - మనకు లేదని - సమాధాన పడాలి . మనకు మనం నచ్చ చెప్పుకోవటమే తెలివంటే .

ఫొటోలో చూపిన చెడ్డీ " మాగ్నెటిక్ " చెడ్డీ . అయస్కాంతాలు ఎక్కడ ఉన్నాయో ? ఎలా పనిచేస్తాయో? అన్నది యానిమేటే చేసి చూపించారు . మీ కళ్ళని నమ్మించటం కోసం. దీనికి ఆర్డర్ ఇచ్చేముందు - మీవంటి అయస్కాంతం అంటుకుంటుందేమో చూడండి - అంటుకోకపోతే ఇది మీకు పనికి రాదు . మీ వంట్లో వాళ్ళు చెప్పే ఐరన్ లేదు . 



No photo description available.

(1)


శ్రీమతిగారు! ఈ మధ్య కాలంలో కాస్త విచారంగా కనిపిస్తున్నావేంటి సంగతీ?


నాకెందుకో తెలీని బెంగ పట్టుకుందండీ!


కాస్త విడమరచి చెప్పొచ్చుగా!


ఏమీ లేదండీ, ఈ మద్య మనమ్మాయి పోకెట్ మనీ అడగడం మానేసింది!


ఓస్! అంతేనా! క్లుప్తంగా ఖర్చు చేస్తోందై వుంటుందిలే! 


అది సరే గాని నా జేబులో డబ్బులు నిండుకున్నాయ్, 


ఆ డబ్బులిటివ్వు!


చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.


అన్నీ అంటే అన్నీ ...సమస్యలు ,ఉద్యొగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాకా తాను నమ్మిన దైవాన్ని ,చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.


చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు.


" భగవంతుడా ! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా " అని అడుగుతాడు


దానికి భగవంతుడు వాత్సల్యంగా " నాయనా !ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి ,వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"


"అవును .కనిపిస్తున్నాయి."


"నేను ఆ గడ్డి విత్తనాలు వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి ,నీరు సూర్యరశ్మి ...అన్ని అవసరమైనవి అన్నీ అందించాను."


గడ్డి వెంటనే మొలకెత్తింది.


భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా ...


కానీ వెదురు మొలకెత్తనే లేదు.


కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు .


విస్మరించనూలేదు .

ఒక సంవత్సరం గడిచింది .

గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది 


అందంగా ఆహ్లాదంగా...


కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు .


రెండు , 


మూడు , 


నాలుగు సంవత్సరాలు గడిచాయి 


వెదురు మొలకెత్తలేదు


కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు 


ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది .


గడ్డి కన్నా ఇది చాల చిన్నది


కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ..


ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది.


పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి .


ఆ బలం వాటికి లేకపోతె వెదురుమనలేదు(నిలబడలేదు).


నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను.


ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ ,ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి .


వెదురు మొక్కను విస్మరించలేదు.


నిన్నుకూడా విస్మరించను.


నిన్ను నువ్వు ఇతరులతో 


ఎన్నటికీ పోల్చుకోకు .


రెండూ అడవిని అందంగా మలచినప్పటికీ ...


గడ్డి లక్ష్యం వేరు ..


వెదురు లక్ష్యం వేరు ..


నీసమయం వచ్చ్చినప్పుడు 


నువ్వూ ఎదుగుతావు."


"ప్రభు ! మరి నేను ఎంత ఎదుగుతాను??"


"వెదురు ఎంత ఎదిగింది?"


'అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."


"నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు"


నీతి: భగవంతుడు ఎప్పుడూ.. ఎవరినీ ... విస్మరించడు. విడిచిపెట్టడు.


మనం కూడా భావంతునిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచిపెట్టకూడదు.


నీ సమస్య ఎంత పెద్దదో దైవానికి చెప్పకు.


నీ దైవ০ ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.


--((*))--



No comments:

Post a Comment