
ప్రేమికుల రోజు సందర్బముగా
అంత్యప్రాస భావ కవిత్వం
నచ్చితే షేర్ చేసుకొని స్నేహాన్ని పెంచుకోండి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
శ్రీరాముని వలె నుండుము నిత్యము
పో రాటము చేయబోకు సత్వరము
నోరార పూజ్యులతో నిజం పల్కుము
యాఱును నూరైనా కల్ల లాడకము ....... (1 )
కల్ల= అబద్ధం
గురువే చనువు నీకు నొసంగిన
పరమానందం వచ్చు ఆసమయాన
గురు జనులతో చనువు చూపిన
కరువు లాంటి బాధలు తరుణాన ....... (2 )
గురువులతో వైరము వద్దునయ్యా
పొరబాటున కుడా తిట్టకుమయ్యా
గురువేదన బ్రతుకు కాల్చునయ్యా
గురుసేవతో నీవు తరించుమయ్యా ..... ( 3 )
నేరములు చెప్పబోకు ఎవ్వరితో
నేర విషయం వినకు ఆరాటంతో
మరి తప్పుచేసి బొంకకు కోపంతో
తరుణి మాటనమ్ము అభిమానంతో ....... (4 )
అపకారికి చేయు ఉపకారము
ఉపకారికి చేయ కపకారము
అప్పుచేసి పప్పుకూడు తినకము
తప్పొప్పులు ఏఘడియ చూడకుము ...... (5 )

ఉల్లమునందు కృతజ్ఞతా భావము
యెల్లఁరుమెచ్చునట్లు ఉండేభావము
అల్లరి చేయక నిత్య సాధనము
కళా సంస్కృతీ బ్రతుకు స్వభావము ...... 6
గుల్లలు చెప్పి చేయకు తప్పిదము
జెల్లును కీర్తి చేరు అంధకారము
జిల్లర బ్రతుకై ఉండక చేయము
తల్లి, తండ్రి, గురువుకు వందనము ...... 7
చెడు వినకము చెడు అనకము
చెడు కనకము చెడును స్నేహము
చెడు నాదరిస్తే తగ్గును బలము
చెడే మన: శాంతి కరువై తరుము ........ 8
నలుగురిలో మాటను తూలకము
నలిగి నవ్వుల పాలు చేయకము
కలుషిత మనస్సు మార్చుకొనుము
కల్లోల భావము తుడిచి వేయుము ......... 9
నీ యునికే మనస్సును నొప్పింపును
గాయము చేసి నిత్యం ఆడు కొనును
గాయపడి మనస్సు పాశ మగును
మాయ సంతోషము హరించి వేయును .... 10

పోరైన పొందైన పిచ్చి కబుర్లైన
నోరే నిన్ను బతికించు ఎప్పుడైన
నోరే తుంచేది పెంచేది ఎప్పుడైన
దూరికి దూరికి మాటలు తూలిన ....... 11
దూరికి= ఎప్పుడూ
మనవారు మెప్పు మంచివనుకోకు
మనము చేసేది నిజమను కోకు
మన పనిని మెచ్చుకొనే వరకు
జనము తృప్తి నీదే నని బతుకు ....... 12
మనసు గాయపరచక భాషించు
నిను తీర్చి దిద్దు వారిని గుర్తించు
మనువాడిన దాన్ని తృప్తి పరచు
యనములతో జీవితం గమనించు...... 13
యనమల = అగ్ని
నిన్ను నమ్మిన వారితో గొడవుంటే
మన్ను నమ్మిన వారితో గొడవుంటే
మిన్ను నమ్మినవారితో గొడవుంటే
కన్ను కలిగి నిప్పు పక్కనున్నట్టే ....... 14
వంచన చేయకు జీవిత జపంలో
వంచకులు మహాపాపుల లెక్కలో
అంచితులగు గురువుల సేవలో
వంచిస్తే జన్మ బ్రష్టుత్వం ఈకాలంలో ...... 15
అంచితులు = పూజ్యులు

అడిగిన సుఖము ఇవ్వననిన
మిడిమేలపు వనిత కొలిచిన
వడిగల మహిమలు తలచిన
మడి దున్నకయు మౌనమే మ్రొక్కిన
అల్లుని మంచి తనం ఎంతవరకు
గొల్ల సాహిత్య విద్య ఎంత వరకు
బొల్లున దంచే బియ్యం ఎంతవరకు
తెల్లవి నల్లగా మారేంత వరకు
ఇచ్చునదే విద్య సమస్త లోకంబు
ముచ్చునదే నీవు చేసిన ధర్మంబు
జొచ్చునదే నిత్యం మనో నిగ్రహంబు
వచ్చునదే సుఖాల వాద కుటుంబు
ఎప్పటి కయ్యెది అప్పుడే చేసియు
అప్పటి కప్పుడు మాటలు మెచ్చియు
నొప్పింపక కధలు గొప్ప చెప్పియు
తప్పించుక తిర్గేవాడు సంతోషియు
ఎప్పుడు సంపద నిలకడగా ఉన్నా
అప్పుడు బంధువులు వచ్చేడి రన్నా
దెప్పలుగ చెరువంతా నిండి ఉన్నా
కప్పలు పదివేలు చేరుట రన్నా

నమ్మకు జూదరి సుంకరి పోకిరి
నమ్మకు అంగడి మాటల వైఖిరి
నమ్మకు వెలయాలి సొగసు సిరి
నమ్మకు వామహస్తపు దెబ్బ మరి
కూరిమి గల దినములు సంతసం
నేరము లెన్ని చేసిననూ సంబరం
కూరిమియు విరసంబైన విషాదం
నేరములే తోచు చుండు ప్రతి నిత్యం
వాకుల సంధించు వాని వదలకు
జీకటిలో పొందే సుఖము కొరకు
నీకై వెల్గు నిచ్చే తోడు వదలకు ......
గురువులను పిలవక చేసేవి
గురుదక్షణలు ఇవ్వక చేసేవి
పరమేశ్వరని ప్రార్ధన లైనవి
తిరమగు నపకీర్తి పొందేటివి
వంచకుడుగా విధి నెదిరించినన్
ఖచ్చి తంగా దైవము నిన్ను శిక్షించున్
మంచిగా నటిస్తూ మోసం చేసినన్
పొంచిన కాలము పుట్టి నిను ముంచున్
దాసుడని అతి వినయంగా మారి
మోసం చేసిన శాపంలా పోవుసిరి
అసలు చెడి ఉన్న ఆరోగ్యం మారి
గాసిలు నపకీర్తి తో చేరు ఉరి
మైత్రిని నీవు సర్వార్ధములయందున్
ఛత్రమ్ము పట్టినట్లు సాగింపవలెన్
ధాత్రిని నిజాయితిగా ప్రేమించుమున్
మిత్రమ్మగా ఇచ్చు సహకారములన్
గురువుకు విద్య చెప్పగ రాదని
పొరబాటున కూడా పల్కవద్దని
చిరకాలము దాగని సత్యమని
గురుశిష్యుల బంధము వీడునని ......
తప్పొప్పు కొనెడివాని నిజాయితి
యిప్పుడమిలో ధన్యజీవిగ మతి
తప్పును ఒప్పుగా సమర్ధించు రీతి
తప్పుడు మానసికవై అధోగతి
గురువుని భూషించటం మన:శాంతి
గురువుని దూషించటం పాప భీతి
గురుసత్కారం శ్రేయము తెల్పు ప్రీతి
గురుధిక్కారము బతుకే హారతి
పెట్టే చేతులను ప్రేమించక తెగ
గోట్టెడి పండితుడైన భీరుడేగ
ముట్టడు వాని పూజలు శివ ధీమాగ
అట్టివాడొక అధముడే ననగ
చెప్పుడు మాట విని అనుమానించి
తిప్పలు తప్పవని తెల్సి భావించి
గొప్పకు తల్లి తండ్రులను వేధించి
తప్పొప్పులు తెల్పి ధన్యుడని పించె
పెద్దలనెదిరించకు ఏ స్థితిలో
యొద్దికగా ఉండువారి పద్దతిలో
పెద్దలమాటలు ఉంచు మనసులో
హద్దనక నడవడి సత్యములే
మంచి తనానికి ఉండు భవిషత్తు
కంచెలను చూడలేని భవిషత్తు
మంచిని వంచనే చేయుటే విపత్తు
పొంచిఉన్న నిజంపెంచును సంపత్తు
పరాయి వారు చెప్పారని అనకూ
సరివారి మనసు కష్టపెట్టకూ
గరిక తినే గాడిదల మారకూ
పరుషమ్ములకు పోయి చెడిపోకూ
నీ వారెవరో ముందు తెల్సుకోవాలి
సావాసము చేసి అనుకరించాలి
నీవాలోచించి ధర్మం బతిఁకించాలి
నీ వారి కానివార్ని సత్కరించాలి
వినదగు మాట ఎవ్వరు చెప్పిన
విననంతనే వేగపడక విన
వినినట్లు ఉండి వినయ విధాన
కను సైగల్తో విందు చేయు జగాన
నిను నమ్మి విద్యాదానము చేసిన
నిను నమ్మి ధనం సహకరించిన
నిను నమ్మి నిజాలు నీతో చెప్పిన
నిను ఎమన్నా నిజాయితీ రక్షణ
విననంతనే వేగపడక విన
వినినట్లు ఉండి వినయ విధాన
కను సైగల్తో విందు చేయు జగాన
నిను నమ్మి విద్యాదానము చేసిన
నిను నమ్మి ధనం సహకరించిన
నిను నమ్మి నిజాలు నీతో చెప్పిన
నిను ఎమన్నా నిజాయితీ రక్షణ
నిను దిద్దుట కొరకే నని కన్నా
విను నామాటలను వినయంబున
కను చేసిన తప్పు తెల్పాలి కన్నా
మన తలపుల్లో ఉన్న భావమే
మన మాటల యందుకూడా తెల్పుమా
మన చేతలు మాట తగ్గ విధమే
కనిపించిన నాడే కీర్తి కనుమా
మలినాటి చెలి కూరిమి కొరకు
తొలినాటి చెలి వదులుటెందుకు
నెల పున్నమి వెలుగుల కొరకు
వెలుగుకై రవి విడుచు టెందుకు
తీయగా మాట్లాడేవారని నమ్మకు
తీయగా ఉందని ఎక్కువ తినకు
పాయలులా వీడి ఉండుత ఎందుకు
చేయాలన్నది చేసి భయపడకు

ప్రేముంటే దాగుడు మూతలు కావులే
ప్రేమంటే నిత్య మేను తల్పం కాదులే,
ప్రేమికులంతా కాముకులు కాదులే,
ప్రేమంటే స్వర్గము అనుకున్నా తప్పులే ,
ప్రేమలోనే వుంది సర్వము ఒప్పులే,
ప్రేమే అద్బుతం అనుకోటం మెప్పులే ,
ప్రేమ పొందడం విధాత వరములే ,
ప్రేమ అర్ధం తృప్తి సంతృప్తి అనేలే
ప్రేమ మనసు ప్రేమకు ఊతములే
ప్రేమ పరువపు వయసు బోధలే
ప్రేమ మనోబలముకు దీవెనలే
ప్రేమ పరీక్షకు శీలస్వచ్ఛతలే
ప్రేమ సరాగ చెలిమి సంగీతాలే
ప్రేమ ప్రణయసౌందర్య పిపాసిలే
ప్రేమతో మాటలు మంత్రాక్షతలులే ,
ప్రేమ ఉన్నచోట హృదయానందంలే
ప్రేమ కంటిపాపలో ఉన్న నేస్తంలే
ప్రేమ జన్మబంధమై సుకృతాలే ,
ప్రేమ కళ నిలిచిపోవు పాశంలే
ప్రేముంటే నిజమైన సౌభాగ్యములే ,
ప్రేమ ఎదలోతుల్లో జీవించే కళే
ప్రేమ సాంగత్యం నిత్య ఆదర్సములే
ప్రేమ కడవరకు ఉండే జీవములే
ప్రేమ నిత్య వసంతము పంచునులే
No comments:
Post a Comment