Wednesday, 20 February 2019

ఆరాధ్య పుణ్యక్షేతాలు 24-05-2020



Lord Krishna: Pencil Sketches – A MYTHOLOGY BLOG

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

౩. శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం-వుయ్యూరు గ్రామం(కృష్ణ జిల్లా) 

కృష్ణాజిల్లాలో ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు గ్రామంలో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపంలో ఉన్నది. ఈ ఆలయంలో వెలిసిన స్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. 

మనకు సాదారణంగా ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతి గ్రామం లో దాసాంజనేయ స్వామి గానో,లేక వీరాంజనేయ స్వామి గానో,భక్త ఆంజనేయ స్వామి గానో, అభయ ఆంజనేయ స్వామి గానో వెలసిన దేవాలయాలు చాల కనిపిస్తుంటాయి . కాని సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయాలు చాల అరదు. అలాంటి దేవాలయం కృష్ణ జిల్లా వుయ్యూరు లో వెలసిన సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనది మరియు శక్తి వంతమైన క్షేత్రం . ఆలయం లో వెలసిన  సువర్చల, ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆలయం నిర్మించడానికి గ్రామస్తులు, ఆలయఅర్చకులు పడిన కృషి అంత ఇంత కాదు .ఈ అరుదైన దేవాలయాన్ని గుండు లక్ష్మీ నరసింహావధానులుగారు సుమారు200 సంవత్సరాల క్రితం తన స్వంతధనంతో నిర్మించి, ఆలయంలో ఉత్సవ ముర్తులను ధ్వజస్తంభమును ప్రతిష్టించి, ధూప ధీప నైవేద్యాలను కొనసాగించినట్లుస్థల పురాణం ద్వారా తెలుస్తుంది .స్వామి వారికి ప్రతి నిత్యం తమల పాకుల పూజ, పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విశేషంగా గా జరుగుతాయి 

ధనుర్మాసంనెల రోజులు వేలాది మంది ప్రదక్షణలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి

--((**))--



ఆరాధ్య పుణ్యక్షేత్రాలు 
సేకరణ: మల్లాప్రగడ రామకృష్ణ  
పంజలి ప్రభ (11 -1 2 - 2018 )
  
(2)  శ్రీ పురం 

గోల్డెన్ టెంపుల్ అనగానే ఇంతకుముందు అమృతసర్ లోని సిక్కు దేవాలయమే గుర్తుకు వచ్చేది, కానీ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అనగానే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టి తమిళనాడులో కట్టిన నారాయణీ పీఠం నకు చెందిన నారాయణ అమ్మ అనే స్వామి ఆద్వర్యంలో నిర్మించబడిన శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దానికి పోటీగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ నారాయణి అమ్మ వారు కొలువై ఉన్నారు. 

తమిళనాడులోని వెల్లూర్ కి 6 కిలోమీటర్ల దూరంలో తిరుమలైకొడి లో ఈ శ్రీపురం స్వర్ణ దేవాలయం ఉన్నది. 
చెన్నై కి 180 కి.మీ. దూరంలో ,తిరుపతి కి 137 కి.మీ. దూరంలో గల ఈ ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది. 

ఇక్కడ కూడా తిరుమల లాగానే స్ట్రిక్ట్ రూల్స్ వున్నాయి. ఫోన్స్ కానీ కెమెరాలు కానీ లోపలికి తీసుకెళ్ల కూడదు. శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శనార్ధం వచ్చే పర్యాటకులు చిన్న ప్యాంట్లు, మిడ్డి లు మరియు కేప్రిలు వేసుకొని రాకూడదు 

మగవాళ్ళను,ఆడవాళ్ళను వేరు వేరుగా చెకింగ్ చేసిన తర్వాత క్యూ లైన్ లో పంపిస్తారు.. 

శ్రీచక్రం ఆకారంలో వున్న కారిడార్లో నడుస్తూ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.దర్శనానికి వెళ్ళే దారి అంతా అందమైన ల్యాండ్ స్కేప్స్,చక్కని సీనరీస్,పార్క్,మంచి కొటేషన్స్ తో వున్న బోర్డులు,వివిధరూపాల్లో వున్న అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చూస్తూ వెళ్తూవుంటే నడిచిన అలసట తెలియకుండా చేస్తాయి. 

ముఖ్యంగా రాత్రి పూట దర్శించుకుంటే బంగారు కాంతులతో విద్యుత్ దీపాలంకరణలో అద్భుతంగా మెరిసిపోయే అదోలోకంలో విహరించిన అనుభూతిని పొందవచ్చు. 

సంవత్సరంలో 365 రోజులు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు శ్రీపురం స్వర్ణ దేవాలయంను సందర్శించవచ్చు. ఆలయం వద్ద అభిషేకం ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు,ఆరతి సేవ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తారు. 

ఎలా వెళ్ళాలి? 
తిరుపతి. చెన్నై మొదలైన ప్రదేశా ల నుండి వెల్లూర్ కు చేరుకొని అక్కడి నుండి 6 కి.మీ. దూరంలో గల ఈ ఆలయానికి రోడ్లు మార్గంలో ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. 

వసతి 
ఈ ఆలయం వద్ద వసతి లేకున్నా ఒకవేళ బస చేయాలంటే వెల్లూర్ లో గల హోటల్ లోఉండవచ్చు.

--((**))--

Image result for mantralayam temple

ఆరాధ్య పుణ్యక్షేతాలు 
ప్రాంజలి  ప్రభ 

(1)

శ్రీ రాఘవేంద్రుని ఆరాధ్య నిలయం....మంత్రాలయం 

మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయంతుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలునుండి 100కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. 

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. 

కర్నూలు నుండి ఎమ్మిగనూరు ద్వారా తుంగభద్రానదీ తీరంలో పెద్ద సన్యాసులైన శ్రీరాఘవేంద్రస్వామి సమాధి నొందిన బృందావనం ముఖ్య విశేషం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సమాధి దేవాలయం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషనుకు సుమారు 15కి.మీ. దూరం వుంది. ఇక్కడకు రాష్ట్రంలో పలుచోట్ల నుండి టూరిస్టు బస్సులు, R.T.C. బస్సులు నడపబడుతున్నాయి. భారతీయాత్మ, ఆధ్యాత్మిక విద్య 'ద్వైతవేదాంతము' నకు విశిష్టసేవ చేసిన మహామహులు, ఉపనిషత్తులకు ఖండార్ధలు, అనేక ఆధ్యాత్మిక గ్రంధాలకు వ్యాఖ్యానములు వ్రాసి జ్ఞానభక్తిని ప్రభోధించిన సద్గురువు శ్రీమంత్రాలయ రాఘవేంద్రస్వామి వారు. వారు ఇక్కడనే జీవసమాధి పొందారు. 

వీరు మహాభక్తుడు, పురాణ పురుషుడు, హిరణ్యకశివుని కుమారుడు, నరసింహవతార కారకుడైన ప్రహ్లాదుని అవతార విశేషమయి భక్తులకు కల్పవృక్షమై క్రీ.శ.1671 నుండి 700 సంవత్సరములు ఆశ్రితులను అనుగ్రహిస్తుండగలనని అభయమిచ్చారు. ఇప్పుడు గూడ అనేకమంది హృదయాల్లో భక్తకల్పవృక్షమై వెలసి కృపాకటాక్ష వీక్షణాలను ప్రసరింప చేస్తున్నారు. ఇక్కడ కులమత వివక్ష లేకుండా నిత్యమూ జనసందోహ భరితమై ప్రార్ధనల నిలయమై శోభిల్లుతున్నది. స్వామివారి సమాధిని చూడబోయే ముందుగా ఆగ్రామదేవతయైన మంచాళమ్మను విధిగా దర్శించాలనేది స్వామివారి అభీష్టంగా చెప్పుకుంటారు. స్వామివారికి భాద్రపద మాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. భక్తులు విశేషంగా వస్తారు. 

ఇక్కడి స్థల మహాత్మ్యం అలాంటిది ! 
రాఘవేంద్రస్వామి సన్నిధిలో అడుగుపెట్టడమే అదృష్టం. ఆయన దర్శనభాగ్యమే జీవితానికో అర్థాన్నీ ... పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. రాఘవేంద్రస్వామి జీవితమే మహిమల మాలికగా కనిపిస్తుంది. అలాంటి రాఘవేంద్రస్వామి అనునిత్యం మూలరాముడి సేవలో తరిస్తూ, అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక వైభవానికి తనవంతు కృషిచేశాడు. 

ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి తన శిష్యులతో కలిసి ఆదోని నవాబును కలుసుకుంటాడు. ఆయన అభ్యర్థన మేరకు మంచాల గ్రామాన్ని కానుకగా ఇవ్వవలసినదిగా కోరతాడు. అంతకన్నా మంచి గ్రామాలను ఆయన ఇస్తానని చెప్పినా స్వామి సున్నితంగా తిరస్కరిస్తాడు. మంచాల గ్రామాన్నే అడగడానికి కారణమేవిటని శిష్యులు సందేహాన్ని వ్యక్తం చేస్తారు. 

తాను ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు అక్కడ యజ్ఞయాగాదులు చేసినట్టుగా స్వామి చెబుతాడు. అందువలన ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనదని అంటాడు. అలాగే తన బృందావన నిర్మాణానికి తుంగభద్రా నదీతీరంలోని ఫలానా బండరాయిని తీసుకురమ్మని స్వామి చెబుతాడు. ఆయన ఆ బండరాయినే ఎందుకు తీసుకురమ్మంటున్నాడో తెలియక శిష్యులు అయోమయానికి లోనవుతారు. 

రావణుడు సీతను అపహరించుకుని వెళ్లగా ఆమెను అన్వేషిస్తూ రామలక్ష్మణులు తుంగభద్రా నదీతీరానికి వచ్చారనీ, ఆ సమయంలో రాముడు ఆ బండరాయిపై సేదతీరాడని స్వామి చెబుతాడు. రాముడి పాదస్పర్శ కారణంగా ఆ బండరాయి ఎంతో పవిత్రతను సంతరించుకుందనీ, అందువలన దానినే తన బృందావన నిర్మాణానికి ఉపయోగించమని సెలవిస్తాడు. 

ప్రహ్లాదుడి అవతారంలో ఈ ప్రదేశంతో గల అనుబంధం కారణంగా ... తన ఆరాధ్య దైవమైన రాముడు నడయాడిన ప్రదేశం కారణంగా రాఘవేంద్రస్వామి ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన కొలువైన ఈ ప్రదేశం మంత్రాలయమై ... మరింత మహిమాన్వితమై భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతోంది.



--((**))--

No comments:

Post a Comment