Thursday 25 October 2018

ఆరాధ్య లీల





ఆరాధ్యలీల (విమలజలా ) 
రచాయ: మల్లాప్రగడ రామకృష్ణ 

రాధికను మరుతువా  - మదిలోని కధలివే  
బాధలను తొలచవా - యదలోని వెతలివే
కారణము వలదుగా - మనసే మనముగా 
ధైర్యమును కలపగా - సుఖమాయె మనసే 

వాదములు వలదులే - సరిలేని తరుణమే 
వేదముల పలుకులే - మతిమాయ సుమములే
కావ్యముల కధలులే - సుమమాల సుగుణమే 
ప్రేమమును కలుపవా - నవమోహన సువిధా 

స్థానములు మెరుపులే - కలలోని కతలులే 
భారములు బరువులే - కళ కోస పరువమే 
నేత్రముల పిలుపులే - సుమమాల వదువువే 
దేహమును కలుపగా - మనసాయె మనుగడే         



--((**))--



ఆరాధ్య లీల - ఉందెక్కడ  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనసు లోతు కనుగొను సూత్రము ఉందెక్కడ 
వయసు పెర్గు తెలుసుకొ సూత్రము ఉందెక్కడ  

సొగసు పంచు మనసుకు సూత్రము ఉందెక్కడ   
తపసు  చేయు మగువకు సూత్రము ఉందెక్కడ  

నయన చుక్క కడలికి సూత్రము ఉందెక్కడ  
మెరుపు వెల్గు పుడమికి సూత్రము ఉందెక్కడ    

కలల అమ్మ మనుగడ సూత్రము ఉందెక్కడ  
కళల తండ్రి పలుకుకు సూత్రము ఉందెక్కడ  
  
ఆత్మకు రూపం, ప్రేమకు అర్ధం 
జీవికి మోక్షం, శ్రమకు సాక్ష్యం 
అమ్మ ఆరాటం, నాన్న పోరాటం 
స్నేహానికి సూత్రము ఉందెక్కడ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
-((**))--



బేసి పాదములు - 

నదీ (అరి) - భ/న/లగ UIII IIIU 127 

విమలజలా - స/న/లగ IIUI IIIU 124

ఈడా - త/న/లగ UUII IIIU 125

శిఖిలిఖితా - మ/న/లగ UUUI IIIU 121


సరి పాదములు - 

క్షమా – మ/ర/లగ UUUU IUIU 81 

నాగరక – భ/ర/లగ UIIU IUIU 87 

నారాచ – త/ర/లగ UUIU IUIU 85

ప్రమాణికా – జ/ర/లగ IUIU IUIU 86

హేమరూప – ర/ర/లగ UIUU IUIU 83


UIII IIIU // UIIU IUIU 

రాధికను మఱతువా 

మాధవ నీకు భావ్యమా 

వేదనయె మనసులో 

మోదము నిమ్ము మోహనా


UUUI IIIU // UUIU IUIU 

ఆకాశమ్మున శశితో 

నాకెందుకో వివాదమే 

ఆకాంతిచ్ఛట సెలలో 

నీకైరవమ్ము పూయదే


IIUI IIIU // IUIU IUIU 

కమలాప్తుఁడు వెలుఁగన్ 

సుమమ్ము లెన్నొ పూయఁగా 

రమణీయపు రవముల్ 

ద్రుమమ్ములందు నిండెఁగా


UUII IIIU // UIUU IUIU

రావోయి నను గనఁగా 

జీవనాకాశ చంద్రుఁడై 

నీవేగద మనసులో 

నావసంతర్తు యామినుల్


UUUI IIIU // UUUU IUIU

ఆవర్ణమ్ముల చెలువుల్ 

భావాతీతమ్ము సంధ్యలో 

రావేలా నను గనఁగా 

దేవీ సంధ్యా స్వరూపమై




విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు




1 comment: