దేవీనవరాత్రులు (దసరా)
9 వ. రోజు
సిద్ధిదాత్రి
శ్రీరాజరాజేశ్వరీదేవిగా
(చిలుకపచ్చనివర్ణవస్త్రాలు, తీపిపదార్థాలు, చిత్రాన్నము, దద్దోజనము)
శ్లోకము
సిద్ద గంధర్వయక్షాద్యైరసురై రమరైరపి ।
సేవ్యమానా సదాభూయత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ।।
హ్రీం కూటత్రయరూపిణీం సమయనీం సంసారిణీం హంసినీమ్
వామాచార పరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం
కామాక్షీం కరుణార్థ్రచిత్త సహితాం శ్రీంశ్రీం త్రిమూర్త్యంబికాం
శ్రీచక్రప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ ।।
శ్రీరాజరాజేశ్వర్యష్టకము
1. అంబా శాంభవి చంద్రమౌళిరబలా√పర్ణా హ్యుమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ ।
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।
2. అంబా మోహిని దేవతా త్రిభువనీ యానంద సంధాయినీ
వాణీ పల్లవపాణీ వేణుమురళీగాన ప్రియాలోలినీ ।
కల్యాణీ హ్యుడురాజబింబ వదనాంభుజే ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ।।
3. అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీ చంపక వైజయంతిలహరీ గ్రైవేయవైరాజితా ।
వీణా వేణు వినోద మండితకరా వీరాసనా సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ।।
4. అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్య మానోజ్జ్వలా ।
చాముండా√√శ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ వల్లభా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।
5. అంబా శూలధనుఃకుశాంకుశధరీ హ్యర్థేందు బింబాధరీ
వారాహీ మధుకైటబ ప్రశమనీ వాణీ రమా సేవితా ।।
మల్లాద్యాసుర మూక దైత్యదమనీ మాహేశ్వరీ చాంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।
6. అంబా సృష్టి వినాశ పాలనకరీ హ్యార్యావి సంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా ।
ఓంకారీ వినుతా సురార్చితపదా హ్యుద్దంండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।
7. అంబా శాశ్వత ఆగమాదివినుతా హ్యార్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యా వై జగన్మోహినీ ।
యా పంచప్రణవాది రేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ !!
8. అంబా పాలితభక్తరాజ రనిశం చాంబాష్ఠకం యఃపఠేత్
అంబా లోక కటాక్షవీక్షలలితా చైశ్వర్యమవ్యాహతమ్ ।
అంబా పావనమంత్రరాజ పఠనా ద్దంతేశ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।
". ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్ "
శమీప్రార్థనా
దశమ్యాం సాయాహ్నే శమీపూజాం కృత్యాత్
తదనంతరం ధ్యాయేత్.
ధ్యానమంత్రము
శమీ శమయతేపాపం __ శమీ శత్రువినాశనీ
అర్జునస్యధనుర్ధారీ రామస్యప్రియదర్శనీ ।। (1)
శమీం కమలపత్రాక్షీం శమీం కటకధారిణీం
ఆరోహతు శమీలక్ష్మీం నృూణాం ఆయుష్యవర్దనీం।। (2)
నమో విశ్వాస వృక్షాయ పార్థశస్త్రాస్త్ర ధారిణీ
త్వత్తః పత్రం ప్రతీష్యామి సదామే విజయీభవ ।। (3)
ధర్మాత్మా సత్యసంధశ్చ దామోదాశరథిర్యది
పౌరుషేచా ప్రతి ద్వంద్వ శరైనంజహి రావణం ।। (4)
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్యచ నాశినీం
దుస్స్వప్నహరిణీ ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం ।। (5)
ఈ విజయదశమినాడు మహాకవి పోతన శారదాంబ, పార్వతీ దేవి అమ్మవార్ల గురించి చేసిన స్తుతి రమణీయం, చిర స్మమరణీయం! ఇదిగో టీకా తాత్పర్య సహితంగా క్రింద ఇస్తున్నాను. అవధరించండి !
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు భారతీ!
శారద నీరద=శరదృతునందలి మేఘము/నీటి మేఘము; ఇందు = చంద్రుడు ఘనసార = కర్పూరము, పటీర = మంచి గంధము; మరాళ = హంస; మల్లికా = మల్లెపువ్వు; హార = ముత్యాల హారము; తుషార = మంచు; ఫేన = నురుగు; రజతాచల = వెండికొండ; కాశ = రెల్లు పువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = బొండుమల్లె; మందార = కల్పవృక్షము; సుధాపయోధి = అమృత సముద్రము; సిత తామరస = తెల్ల తామర పువ్వు, అమరవాహినీ = ఆకాశగంగ, శుభాకారత = శుభమైన ఆకారముతో, ఒప్ఫు నిన్ను = అందముగానున్న/ఒప్పుతున్న నిన్ను, మదిఁ గానఁగ = మనస్సునందు దర్శింపగా; ఎన్నడు గల్గు= ఎప్పుడు కల్గునో కదా!; భారతీ = ఓ సరస్వతీ!
తాత్పర్యం :-
ఓ సరస్వతీ! నీవు శరదృతువులోని మేఘము. చంద్రకళలు, కర్పూరము, మంచిగంధము, హంస, మల్లెలు,ముత్తెముల హారము, మంచుబిందువులు, ఫేనము, కైలాసము, రెల్లుపువ్వు, ఆదిశేషుడు, బొండుమల్లెలు, కల్పవృక్షము, అమృత సముద్రము, తెల్లతామర పువ్వు, ఆకాశగంగ వంటి రూపముల సృష్టితో శుభప్రదమైన ఆకారముతోనొప్పు నువ్వు నాకెప్పుడు కనిపిస్తావో కదా?
వివరణ & విశ్లేషణ :-
తెల్లనిరంగు దర్శన జ్ఞానమునకు చిహ్నము. శరదృతువులో నదుల జలాలు తేరుకొని స్వచ్ఛంగా ( తెల్లగా ) కనిపిస్తాయి. మనస్సు రజో, తమో గుణములనుండి తేటపడుటకిది చిహ్నము. చంద్రుడు మనోస్థానానికి చిహ్నము. హంస ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు చిహ్నము. కైలాసము మోక్షమునకు చిహ్నము. ముత్యాల హారము అక్షరమాలకు చిహ్నము. మంచుపొర సృష్టి విలాసమునకుచిహ్నము. రెల్లుపొద సుబ్రహ్మణ్యేశ్వరునకు చిహ్నము. ఆదిశేషుడు అనంత జ్ఞానమునకు చిహ్నము. ఆకాశగంగ పవిత్రతకును, కల్పవృక్షము ఇష్టసిద్ధికిని, అమృత సముద్రము ఆత్మను తపస్సుతో మథించుటకునుచిహ్నములు. కనుక ఇవన్నీ సరస్వతీ స్వరూపాలుగానే భావించాలి. నా ఈ విశ్లేషణ పండిత పామర జన సమ్మతమైనదిగా భావిస్తున్నాను.
--((**))--
ఇదిగో పోతనామాత్యుని మరో ప్రసిద్ధ పద్యం - టీకా తాత్పర్య సహితంగా ....
నిన్న శారదాంబ గురించి, నేడు విజయదశమి సందర్భంగా జగజ్జనని పార్వతీదేవి గురించి........
అమ్మలఁ గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలఁ బె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చినయమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
నాకీపద్యం చదివినప్పుడల్లా తెనాలి రామకృష్ణుని చమత్కార పద్యం....." తృవ్వట బాబా ........అంటూ మొదలెట్టి " హుళక్కి అవ్వట......" అంటాడు. హుళక్కి అంటే మాయ. అవ్వ అంటే ఇంకెవరు ఆ లోకమాతే. ఆమె అమ్మలకే అమ్మ.......అమ్మమ్మ = అవ్వ.
పోతన అదే అంటున్నాడు. అయితే ఇంకా వివరంగా చెప్పాడు.
ఈమె ఎవరట ?
అమ్మలగన్న యమ్మ......ముగురమ్మల మూలపుటమ్మ . చాలఁ బెద్దమ్మ. త్రిమూర్తుల భార్యలైన లోకమాతలకు తల్లి.
సురారులమ్మ, కడుపాఱడి పుచ్చినయమ్మ.......ఇదంతా కలిపిచదవాలి. అంటే........
సురులు = దేవతలు; అరులు = శత్రువులు. వెరసి......
సురారులు = రాక్షసులు
సురారులమ్మ , కడుపు+ఆరడి పుచ్చినయమ్మ..... వారి తల్లియైన దితికి గర్భ శోకాన్ని కలిగించిన తల్లి.
చాలఁ బెద్దమ్మ = అందరికన్న పెద్దదియగు తల్లి,
మూలపుటమ్మ = మూలమైన తల్లి., తన్ను లోనమ్మిన = తన్ను తమ మనసులలో నమ్ముకున్నవారికి; వేల్పులటమ్మ= దేవతలకు తల్లి; మనమ్ముల నుండెడియమ్మ = మనస్సులలో నిలుచు తల్లి; కృపాబ్ది = దయకు సముద్రమువంటి , మా యమ్మ = మా తల్లి; దుర్గ = దుర్గాదేవి; మహత్త్వ = గొప్పతనముతోకూడిన, కవిత్వ పటుత్వ = కవిత్వమునందు శబ్దములకు సార్థక్యమును చేకూర్చు, సంపదల్ = సంపదలను, ఇచ్చుత = ఇచ్చుగాక!
తాత్పర్యం :-
దుర్గాదేవి దయతో తన కవిత్వమునకు పటుత్వము, గొప్పదనము, సంపద కలిగించు గాక యని పోతనామాత్యుని ఆశాభావము. సంఫద అంటే శ్రీకైవల్యము లేక మోక్షము. ఈ దుర్గాదేవి సప్తమాతృకలను గన్న మహాశక్తి. త్రిమూర్తుల భార్యలైన గౌరి, లక్ష్మి, సరస్వతులు తన అంశలే. ఈమె చాల పెద్దమ్మ. ఆకాశము, కాలము తన స్వరూపముగా కలది. రాక్షసుల తల్లియైన దితికి గర్భశోకము కలిగించినది. దేవతా స్థ్రీలు తన్ను ధ్యానింపగా వారి మనస్సులలో నిలిచినది. గౌరీదేవి, రుక్మిణి తమ కళ్యాణములకుముందు ఈమెనే ధ్యానించారు. అజ్ఞాతవాస కాలమున , విరాటనగర ప్రవేశమునకు ముందు, ద్రౌపది ఈమెని కొలిచి కష్టాలను తరించినది. సావిత్రీదేవి ఈమెను కొలిచి తనభర్తయైన సత్యవంతుని మృత్యువునుండి కాపాడుకొన్నది. జగన్మాతను నమ్మి కొలిచినవారికి అసాధ్యమేమున్నది.
ఓం దుర్గాయై నమః !
--((**))--
|
[11/10 17:01] muneeswararaoe: దేవీనవరాత్రులు (దసరా)
2 వ. రోజు బ్రహ్మచారిణి
( శ్రీలలితా త్రిపురసుందరీదేవి )
పసుపురంగు వస్త్రాలు -- తీపివంటకములు నివేదన
శ్లో " దధానా కరపద్మభ్యాం అక్షమాలా కమండలాం
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్య నుత్తమా !!
ధ్యానము
శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టి స్థితి లయేశ్వరీమ్
నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం
ఉద్యత్కోటి రవి ప్రభాం మహాత్రిపురసుందరీం
పాశాంకుశేక్షు కోదండ ప్రసూన విశిఖాం శ్మరేత్ !!
సకుంకుమ విలేపనా మలికౘుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేష జనమోహినిీ మరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం !!
శ్రీలలితాపంచకము
1). ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభి నాసమ్ !
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యమ్
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ !!
2). ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం
రత్నాగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్ !
మాణిక్య హేమవలయాంగద శోభమానం
పుండ్రేక్షు చాప కుసుమేషుసృణీర్ దధానామ్ !!
3). ప్రాతర్నమామి లలితా చరణారవిందం
భక్తేష్టదాన నిరతం భవసింధు పోతమ్ !
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ !!
4) ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్ !
విశ్వస్య సృష్టివిలయస్థితి హేతు భూతాం
విశ్వేశ్వరీం నిగమ వాజ్ఞ్మనసో√తిదూరామ్ !!
5) ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి !
శ్రీ శాంభవీతి జగతాం జఞీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి !!
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే !
తస్మైదదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రిరం విపులసౌఖ్య మనంతకీర్తిమ్ !!
" ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పాదాచార్య విరచితం లలితాపంచకమ్ "
దేవీనవరాత్రులు (దసరా)
3వ రోజు
చంద్రఘంటాదేవి ( అన్నపూర్ణా దేవి)
( ఆకుపచ్చని వస్త్రాలు-- తీపిపదార్థాలు, కొబ్బరి అన్నము, చిత్రాన్నము )
ధ్యానము
అన్నపూర్ణాష్టకము
1) నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ,
ప్రాలేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
2) నానారత్న విచిత్రభూషణకరీ హేమామ్బరాడంబరీ
ముక్తాహారవిడమ్బమాన విలసద్వక్షోజ కుంంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
3) యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
4) కైలాసాచల కందరాలయకరీ గౌరీహ్యుమాశంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
5) దృశ్యాదృశ్య విభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
6) ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియే ! శాంకరీ
కాశ్మీరేత్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!!
7) ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
8) దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామాస్వాదు పయోధరప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
9) చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!
10) క్షత్రత్రాణకరీ మహా√భయకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!!
11) అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకరప్రాణవల్లభే !
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి !!
12) మాతాచ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ !!
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత మన్నపూర్ణాష్టకమ్
నఅమ్మవారిని మనము రెండవ రోజున బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధన చేసి ఆ తల్లి కృపకు పాత్రులం అవుతాము. అసలు ఈ బాల అంటేనే లలితమ్మ యొక్క ప్రాణశక్తి, జ్ఞ్యానశక్తి - శ్యామలాదేవి, క్రియాశక్తి - వారాహీదేవి. ఈ బాలాత్రిపురసుందరి ప్రాణశక్తి కాబట్టి లలితమ్మకు మరియు బాలాత్రిపురసుందరికి భేదం లేదు. ఇద్దరూ ఒక్కటే. ఆ తల్లి మహాశక్తిసంపన్నురాలు. పైగా, బాలారూపంలో ఆ తల్లి మనలను త్వరగా అనుగ్రహిస్తుంది. ఇప్పటి వరకు అమ్మను మనము అమ్మా!! అని పిలిచినప్పుడు...ఆ తల్లే చుబుకం పట్టుకుని ఒక పసిపిల్లను బుజ్జగించి బువ్వ తినిపించిన రీతిగా ఆ తల్లి చుబుకం పట్టుకుంటే మరి ఎంత అదృష్టం?? అలాంటి అదృష్టం ఆ హిమవంతునికి కలిగింది. నిజానికి ప్రతి ఇంట్లో తిరుగాడుతున్న 10 సం: లోపు పిల్ల ఆ బాలా రూపమే. ఈ బాలాత్రిపురసుందరిని ఆరాధించిన వారికి వాక్శుద్ధి, వాక్సిద్ధి కలుగుతాయి. ఈ తల్లి శ్రీచక్రంలోని చిన్మయానంద బిందువులో కొలువై ఉంటుంది. నిజానికి బాలారూపం అనగానే ఆ శ్రీచక్రంలో కొలువై ఉన్న తల్లే కాదు. ఆ తల్లి ఎక్కడో లేదు. మన యొక్క శరీరంలోనే ఉంది. మన శరీరంలో కూడా చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన చక్రాలలో - అగ్నికాంతి, ఆజ్ఞా, విశుద్ధి చక్రాలలో - చంద్రకాంతి, అనాహిత, మణిపూరాబ్జా చక్రాలలో - సూర్య కాంతి తో ఉంటాయి. అవి ఒక త్రికోణంగా ఏర్పడి ఈ మూడింటిలో ఉండే చిత్ శక్తి రూపమే బాలాత్రిపురసుందరి.
బాల అంటే చిన్నపిల్ల. మరి త్రిపుర అనగా 3 పురాణాలు. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. శరీరంలో ఉండే 3 నాడులు - పింగళ, సుషుమ్న నాడులు. సత్వ, రజో, తమో గుణాలు. అలాగే త్రయి వేదాలు - ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ. వీటన్నిటి గుర్తుగా ఆ తల్లి త్రిపుర. అందుకే ఆ తల్లి బాలాత్రిపురసుందరి. తల్లి మంచి అరుణ వర్ణంలో ఉంటుంది. మన యొక్క సహస్రార చక్రంలో కల్హారము అనే కమలం పైన కూర్చుని ఉంటుంది. ఈ తల్లి 9 సం: వయస్సు ఉన్న చిన్న పిల్లగా ముద్దులు మూటకడుతూ పట్టు పరికిణీ వేసుకుని చేతులకు గాజులు, కాళ్ళకి అందియలు పెట్టుకుని ఎంతో అందంగా చూసి చూడగానే బుగ్గలు పుణికిపుచ్చుకుని ముద్దు గొలిపే రూపంలో ఈ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లి తన నాలుగు చేతులలో - పై రెండు చేతులలో పుస్తకం, అక్షమాల పట్టుకుని అలాగే క్రింది రెండు చేతులలో అభయహస్తం, వరదహస్తం పట్టుకుని మనలను అనుగ్రహించి వాక్సిద్ధిని, బుద్ధిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ బాలోపాసనను ముఖ్య ప్రాణోపాసన అని కూడా అంటారు. ఎంతో మంది ఈ బాలను ఉపాసన చేసి తరించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ రోజు మనము శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం. మనకు కూడా అలాంటి ఉపాసనా శక్తిని అనుగ్రహించమని ఆ తల్లిని కొలిచి సాక్షాత్కారం పొందిన మహనీయులను వేడుకుందాము. మనకి ఈ దేవీనవరాత్రులలో సువాసినీ పూజ మరియు బాలపూజ ముఖ్యంగా చెప్పబడ్డాయి. 3 సం: వయసు నుండి 10 సం: బాలిక వరకు మనము బాలపూజ చేసి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. 2 సం: కుమారి అని 3 సం: త్రిమూర్తి అని, 4 సం: కళ్యాణి అని, 5 సం: రోహిణి అని, 6 సం: కాళీ అని, 7 సం: చండిక అని, 8 సం: శాంభవి అని, 9 సం: దుర్గ అని, 10 సం: సుభద్ర అని వయసుని బట్టి ఆయా తల్లుల పేర్లతో వారిని సంబోధించి బాలపూజ చేసుకుంటాము. మనందరిని కూడా ఆ బాలాత్రిపురసుందరి మందస్మితవదనంతో ఉండి మనలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. మనం వెళ్లి ఆ తల్లి దగ్గిర చేతులు రెండూ జోడించి వేడుకోవడమే తరువాయి.
"జయ జయ శంకర హర హర శంకర"
'అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే'
సర్వేజనా సుఖినోభవంతు.
కళ్యాణాయుత పూర్ణచంద్ర వదనాం ప్రాణేశ్వరానందినీం
కల్లోలాయుత ధర్మ కర్మ సహనాం జీవేశ్వరానందినీం
విల్లోలా మతి సత్య న్యాయ ప్రధమాం భీమేశ్వరానందినీం
ముల్లోకా లెలి నిత్య శోభ తరుణామ్ ముక్తేశ్వరానందినీం
శ్రీ రాజరాజేశ్వరీ మాతృకా మంత్రస్తవము
1 కల్యాణాయుత పూర్ణచంద్ర వదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణా పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమాం అమృతకలాం విద్యావతీం భారతీం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం
2 ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం
చైతన్యాత్మక చక్రరాజ నిలయాం చంద్రాంత సంచారిణీం
భావా భావ విభావినీం భవపరాం తద్భక్తి చింతామణీం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
3 ఈహాధిక్పర యోగి బృంద వినుతాం స్వానంద భూతాంపరాం
పశ్యంతీం తను మధ్యమాం విలసినీం శ్రీవైఖరీ రూపిణీం
ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
4 లక్ష్యాలక్ష్య నిరీక్షణాం నిరుపమాం రుద్రాక్షమాలాధరాం
త్రైక్ష్యార్దాకృతి దక్షవంశ కలికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం
భద్రాం భద్ర వరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
5 హ్రీం బీజాంగత నాదబిందు భరితాం ఓంకార నాదాత్మికాం
బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీంఙ్ఞానేశ్వరీం ఙ్ఞానదాం
ఇచ్ఛాఙ్ఞా కృతిణీం మహీం గతవతీం గంధర్వ సంసేవితాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
6 హర్షోన్మత్త సువర్ణ పాత్ర భరితాం పీనోన్నతాం ఘూర్ణితాం
హుంకార ప్రియ శబ్దజాల నిరతాం సారస్వతోల్లాసినీం
సారా సార విచార చారుచతురాం వర్ణాశ్రమా కారిణీం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
7 సర్వేశాంగ విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం
సంయోగ ప్రియ రూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం
సర్వాంార్గతి శాలినీం శివతనూం సందీపినీం దీపినీం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం
8 కర్మా కర్మ వివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌలినీం
కారుణ్యాంబుధి సర్వకామ నిరతాం సింధుప్రియోల్లాసినీం
పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
9 హస్త్యుత్కుంభనిభ స్తనద్విదయతః పీనోన్నతా దానతాం
హారాద్యాభరణాం సురేంద్ర వినుతాం శృంగార పీఠాలయాం
యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవర్ణాత్మికాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పరణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
10 లక్ష్మీ లక్షణపూర్ణ భక్తవరదాం లీలా వినోదస్థితాం
లాక్షారంజిత పాదపద్మ యుగళాం బ్రహ్మేంద్ర సంసేవితాం
లోకాలోకిత లోక కామ జననీం లోకాశ్రయాంక స్థితాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
11 హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనుం శ్రీ యోగ పీఠేశ్వరీం
మాంగ్యల్యాయుత పంకజాభ నయనాం మాంగల్య సిద్ధిప్రదాం
కారుణ్యేన విశేషితాంగ సుమహా లావణ్య సంశోభితాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
12 సర్వఙ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం
సత్యాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం
సంగాసంగ వివర్జితాం సుఖకరీం బాలార్క కోటిప్రభాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
13 కాదిక్షాంత సువర్ణబిందు సుతనుం సర్వాంగ సంశోభితాం
నానావర్ణ విచిత్ర చిత్ర చరితాం చాతుర్య చింతామణీం
చిత్రానంద విధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
14 క్ష్మీీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం
సూర్యేంద్వగ్ని మయైక పీఠనిలయాం త్రిస్థామ్ త్రికోణేశ్వరీం
గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశప్రియాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం
15 )హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారీణీం హంసినీం
వామాచార పరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం
కామాక్షీం కరుణార్థ్ర చిత్త సహితాం శ్రీం శ్రి త్రిమూర్త్యంబికాం
శ్రీ చక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వవరీం
16 యా విద్యా శివకేశవాది జననీం యా వై జగన్మోహినీం
యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయినీం
యా పంచ ప్రణవ ద్విరేఫనళినీం యా చిత్కళా మాలినీం
సా పాయాత్ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీం
శ్రీరాజరాజేశ్వరీం శ్రీరాజరాజేశ్వరీం
ఓం శ్రీమాత్రేః నమ
మిత్రులందరకూ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు
దేవీనవరాత్రులు (దసరా)
మొదటిరోజు " బాలా త్రిపురసుందరీదేవి "
(నైవేద్యం= తీపి పదార్థాలు,ౘక్కెరపొంగలి, చిత్రాన్నము, కొబ్బరన్నము,
ఎఱుపురంగువస్త్రాలు )
ధ్యానము
ఐంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వర సుధాధౌతాంత రంగోజ్వలాం
వందే పుస్తక పాశసాంకుశ జపస్రగ్భాసురోద్యత్కరాం
తాం బాలాం త్రిపురాం భజే త్రినయనాం షట్చక్రసంచారిణీం !!
నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం
చాంపేయపుష్ప సుషమోజ్వల దివ్యనాసాం
పద్మేక్షణాం ముకుర సుందర గండ భాగాం
త్వాం సాంప్రదం త్రిపుర సుందరి దేవి వందే !!
శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి పంచరత్నస్తోత్రము
1) నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం
చాంపేయపుష్ప సుషమోజ్వల దివ్యనాసాం
పద్మేక్షణాం ముకుర సుందర గండ భాగాం
త్వాం సాంప్రదం త్రిపుర సుందరి దేవి వందే !!
2). శ్రీ కుంద కుట్మల శిఖోజ్వల దంత బృందాం
మందస్మిత ద్యుతి తిరోహిత చారు వాణీం
నానామణి స్థగిత హార సుచారు కంఠీం
త్వాం సాంప్రదం త్రిపుర సుందరి దేవి వందే !!
3). పీనస్తనీం ఘనభుజాం విపులాబ్జహస్తాం
భృంగావళీ జిత సుశోభిత రోమ రాజీమ్
మత్తేభ కుంభ కుచభార సునమ్ర మధ్యాం
త్వాం సాంప్రదం త్రిపుర సుందరి దేవి వందే !!
4). రంభోజ్జ్వలోరు యుగళాం మృగరాజ పత్రా
మింద్రాది దేవ మకుటోజ్వల పాద పద్మాం
హేమాంబరాం కర ధృతాంచి ఖడ్గ వల్లీం
త్వాం సాంప్రదం త్రిపుర సుందరి దేవి వందే !!
5). మత్తేభ వక్తృ జననీం మృడ దేహ యుక్తాం
శైలాగ్ర మధ్య నిలయాం వర సుందరాంగీం
కోటీశ్వరాఖ్య హృది సంస్థిత పాదపద్మాం
త్వాం సాంప్రదం త్రిపుర సుందరి దేవి వందే !!
బాలే త్వత్పాద యుగళం ధ్యాత్వా సంప్రతి నిర్మితం
నవీనం పంచరత్నంచ. ధార్యతాం చరణ ద్వయే !!
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశ
*శ్రీదేవీ తత్వం - 1- నవ రాత్రి* *పూజా మహిమ..* . ( *దేవీ* **భాగవతం నుండి* )
శ్రీ గురుభ్యోనమః
ఓం చైతన్య రూపాం తామాద్యాంచ ధీమహి బుద్ధింయానః ప్రచోదయాత్.
చైతన్య రూపయై, ఆద్యయై, విద్యా స్వరూపిణియైన ఏ దేవి మా బుద్ధిని ప్రేరేపించు చున్నదో ఆ దేవిని ధ్యానించేదను. అట్టి భగవతి యగు దేవి యొక్క ఉపాసన గురించి కొందఱు భ్రాంత చిత్తులు మాయ రూపమైన భగవతి యొక్క ఉపాసన తగదు అని అందురు. మాయ మిధ్య, అసత్యము అని అందురు. అట్టి మిధ్యా స్వరూపిణి మోక్షము ఇవ్వజాలదు అని అందురు.
కానీ వారన్నట్లు మాయ అన భ్రాంతి స్వరూపిణి కాదు, మాయ యన శక్తి. సర్వ జగములను సృష్టి, స్థితి, లయములను గావించునది. అట్టి శక్తిని ఉపాసించిన వారు జనన మరణ రూపమగు భానా సంసారము నుండి తరించు చున్నారనియు,మోక్షమును బొందుచున్నారనియు నృసింహతాపిన్యుపనిషత్తు తెలియజెప్పుచున్నది.
మాయావా ఏషా నారసింహీ, సర్వ మిదం సృజతి, సర్వమిదం రక్షతి, తస్మాన్మాయా మేతాం శక్తిం, విద్యా ద్యఏతాం మయా శక్తిం, వేద సమృత్యుం జయతి సపాప్మానం, తరతి సోzమృతత్వంచ గచ్ఛతి, మహతీం శ్రియమశ్నుతే.
ఆ శక్తిని భజించిన వాడు మృత్యువును జయంచి పాపమును తరించి మోక్షమును బొందును. గొప్ప సంపాద ననుభవించును. మరియు ఆ మాయ వైష్ణవి, శక్తి, విశ్వ బీజమని స్మృతులు ఘోషించినవి.
త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మేతత్.
ఈ సమస్త లోకములన్నియు మాయా శక్తి చే సమ్మోహితమగుచున్నవి. ఒకరేమిటి అందరూ కూడా. ఆ మాయా శక్తికి లోను కానివాడు ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ లేరు. రావణ బ్రహ్మ కూడా ఆ మాయా శక్తి కి లోనైన వాడె. దేవతలు, మనుజులు, ఆఖరాకి త్రిమూర్తులు అందరూ ఆ మాయకి లోబడిన వారె. మాయ బ్రహ్మ రూపిణీ, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.
శక్తి అనగా క్షుద్ర శక్తి గాదు. ఈమె పరా శక్తి, ఆది శక్తి, పర బ్రహ్మ మహిషి. ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి యైన జగన్మాత. భానా త్రిపురోపనిషత్తు, త్రిపురతాపిన్యుపనిషత్తు, దేవ్యుపనిషత్తు, బహ్వృచోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు, సౌభాగ్యలక్ష్ముపనిషత్తు అను ఉపనిషత్తులు అన్నీ అమ్మ గురించి, శక్తి గురించి ఎంతగానో శ్లాఘించినవి. ఆ పరా శక్తియే హిమవంతుని కుమార్తె పార్వతియై శివుని వరించి, పరమేశ్వరుని పట్టమహిషియై జగన్మాతయైనది.
బ్రహ్మవాదులు దేవి పరమ పదమును బ్రహ్మమనియే చెప్పిరి. హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమనియు, మోక్ష ప్రదమనియు జెప్పిరి. మరియు దేవీ భాగవతము నందు
నిర్గుణా సగుణా చేత ద్విధా ప్రోక్తా మనీశిభి: సగుణా రాగిభి: సేవ్యా నిర్గుణాతు విరాగిభి:
సగుణ యగు దేవిని కోర్కెలు గలవారును, నిర్గుణయగు దేవిని మోక్షమును గోరువారు ఉపాసింతురని దేవీ భాగవతము నందు చెప్ప బడినది.
బ్రహ్మాండ పురాణమున లలితోపాఖ్యానమున " చితిస్తత్పదలాక్ష్యార్దా చిదేకరస రూపిణీ" అని అన్నారు. జ్ఞాన స్వరూపిణి యగు ఆ దేవి తత్పదమునకు, లక్ష్యార్ధ యని చెప్పబడినది.
ఈ విధముగా స్మృతులు,అష్టాదశ పురాణములు, ఉప పురాణములు దేవి పర బ్రహ్మ మని దేవీ తత్వమును గురించి చెప్ప బడినవి. శక్తి బ్రహ్మము కంటే వేరుగా యుండదు, భానా అందువలన కేవలమగు బ్రహ్మోపాసనము అసంభవమగు చున్నది.
అలాగే కేవలము మాయోపాసనము అసంభవమగు చున్నది. ఎందుకంటే అంతటా వున్నది ఆ బ్రహ్మాధిష్టాన యుతయైన మాయ యొక్క ఉనికియే అని తెలియ వలెను.
కావున అమ్మే అయ్య, అయ్యే అమ్మ అని తెలియ వలెను. వారిని రెండుగా వేరుగా చూడరాదు. ఒకరిలో ఒకరు వున్నారు. అటువంటి అర్ధనారీశ్వర తత్వమైన అమ్మను గురించి రోజూ నాలుగు మాటలు మనము రోజూ తెలుసుకొంటాము. అమ్మ యొక్క ఉపాసన, పూజ, నవరాత్రి మహిమ గురించి రేపు విన్న వించుకొంటాను. చక్కగా ఈ నవ రాత్రులు అందరూ అమ్మ పూజ చేసుకొని అమ్మ అనుగ్రహము పొందేదరు.
శ్రీమాత్రేనమః ...
No comments:
Post a Comment