ఆరాధ్య లీల (తాగొద్దురా )
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే బాబు చెలిమి చెడునురా
తాగితే బాబు కలమి పోవునురా
తాగితే బాబు బలిమి తగ్గనురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే అప్పులు పెరిగి పోవునురా
తాగితే తప్పులు జరిగి పోవునురా
తాగితే ఒప్పులు మనసు కెక్కవురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే హద్దులు మార్పు వచ్చురా
తాగితే పద్దులు చెర్గి పోవురా
తాగితే ముద్దులు తొల్గి పోవురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే వళ్ళు గుళ్ళగ మారురా
తాగితే పళ్ళు నొప్పిగ ఉండురా
తాగితే కళ్ళు తిర్గుచు నుండురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే రక్త నాళాలు చెడునురా
తాగితే వక్త వేషాలు తెల్వవురా
తాగితే యుక్త నేరాలు పెర్గునురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే ఒట్టు మరచి పోవునురా
తాగితే గట్టు విడిచి పోవాలిరా
తాగితే పట్టు సడలి ఉండునురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా
om
ReplyDelete