Wednesday, 13 December 2017

గూగుల్ ప్రభ



*'వందే సంస్కృతమాతరమ్'*

812. గద్యం || 
అథారిమర్దనస్తదాకర్ణ్య పితృపైతామహక్రమాగత
మంత్రిభిః సార్ధం మంత్రయాంచక్రే.

--పంచతంత్రం. కా.కీ.5-132.

అది విన్న అరిమర్దనుడు (ఉలూకరాజు) తండ్రి తాతలు మొదలుగా వంశపారంపర్యంగా వచ్చిన మంత్రులతో ఈ విధంగా ఆలోచన చేయసాగాడు.
***

కాబట్టి, అతడికి కానుకలు సమర్పించి సంధిచేసుకోవడమే సరియైనపని. అందుకే- 'శత్రువు బలవంతుడని తెలిసినచో బుద్ధిమంతులైనవారు తమ సర్వస్వం అర్పించియైనా ప్రాణాలను రక్షించుకోవాలి. ప్రాణాలను రక్షించుకుంటే ధనాన్ని మళ్లీ సంపాదించుకోవచ్చని' విజ్ఞులన్నారు.

*తచ్ఛ్రుత్వా తేన దుర్జనకోపితేన త్వత్పక్షపాతినం మామాశంక మానేనేమాం దశాం నీతః. 
తత్తవ పాదౌ సాంప్రతం మే శరణమ్. కిం బహునా విజ్ఞప్తేన? 
యావదహం ప్రచలితుం శక్నోమి తావత్త్వాం తస్యావాసం నీత్వా సర్వవాయసక్షయం విధాస్యామి' ఇతి.*,

అంతకుముందే దుష్టుల చాడీలవలన నాపట్ల కోపంతో ఉండే అతడు, నా ఈమాట వినగానే నన్ను నీ పక్షం వాడిగా అనుమానించాడు. నన్ను హింసించి, ప్రస్తుతం ఈ అవస్థ కలిగించాడు, కాబట్టి, ఇప్పుడు మీ పాదాలే నాకు దిక్కు. నాకు కదిలే శక్తి రాగానే మిమ్మల్ని అతని నివాసానికి తీసుకుని పోతాను. కాకులన్నింటిని మీచేత నాశనం చేయిస్తాను.

*అథారిమర్దనస్తదాకర్ణ్య పితృపైతామహక్రమాగత మంత్రిభిః సార్ధం మంత్రయాంచక్రే. తస్య చ పంచ మంత్రిణః తద్యథా రక్తాక్షః, క్రూరాక్షః, దీప్తాక్షః, వక్రనాశః, ప్రాకారకర్ణశ్చేతి. తత్రాదౌ రక్తాక్షమపృచ్ఛత్--*,

అది విన్న అరిమర్దనుడు (ఉలూకరాజు), తన తండ్రి తాతలు మొదలుగా వంశపారంపర్యంగా వచ్చిన మంత్రులతో ఆలోచన చేయసాగాడు. అతడికి ఐదుగురు మంత్రులున్నారు. వారి పేర్లు రక్తాక్షుడు, క్రూరాక్షుడు, దీప్తాక్షుడు, వక్రనాశుడు, ప్రాకారకర్ఢుడు. వారిలో మొదట రక్తాక్షుడిని ఇలా అడిగాడు--

*భద్ర, ఏషతావత్తస్య రిపోర్మంత్రీ మమ హస్తగతః. తత్ కిం క్రియతామ్' ఇతి. రక్తాక్ష ఆహ- 'దేవ! కిమత్ర క్రియతే. అవిచారితమయం హంతవ్యః. యతః- హీనః శత్రునిహంతవ్యో యావన్న బలవాన్ భవేత్, ప్రాప్తస్త్వపౌరుషబలః పశ్చాద్భవతి దుర్జయః*,

శుభమూర్తీ! ఇతడు ఆ శత్రుమంత్రి. నా చేతిలో చిక్కాడు. కాబట్టి, ఇప్పుడేం చేయాలి? అప్పుడు రక్తాక్షుడు ఇలా చెప్పాడు- 'ప్రభూ! ఇందులో ఆలోచన చేయదగినది ఏముంది? ఇక ఎలాంటి ఆలోచన చేయకుండా వెంటనే సంహరించాలి. శత్రువు దుర్బలుడై ఉన్నప్పుడే అనగా అతడు బలవంతుడు కాకముందే చంపివేయాలి. ఎందుకంటే, అతడు పౌరుషమైన బలం పొందిన తర్వాత అజేయుడౌతాడు.

*కించ 'స్వయముపాగతా శ్రీ స్త్యజ్యమానా శపతి'- ఇతి లోకే ప్రవాదః. ఉక్తంచ- కాలో హి సకృదభ్యేతి యన్నరం కాలకాంక్షిణమ్, దుర్లభః స పునస్తేన కాలకర్మాచికీర్షతా.*,

మరియు 'స్వయంగా వచ్చిన లక్ష్మి తిరస్కరించబడినచో శపిస్తుందని' లోకంలో జనప్రసిద్ధి ఒకటుంది. అందుకే- 'తన అభివృద్ధికి తగిన కాలాన్ని కాంక్షించే పురుషుడికి, అటువంటి కాలం, జీవితంలో ఒకసారి మాత్రమే లభిస్తుంది. కానీ, ఆ కాలంలో తగిన పనులు చేయగోరువారికి (లభించిన కాలాన్ని వినియోగించుకోలేనివాడికి) మళ్లీ అలాంటి కాలం జీవితంలో లభించదని' విజ్ఞులన్నారు.

*శ్రూయతే చ యథా- చితికాం దీపితాం పశ్య ఫటాం భగ్నాం మమైవ చ, భిన్నశ్లిష్టా తు యా ప్రీతిర్న సా స్నేహేన వర్ధతే. అరిమర్దనః ప్రాహ- 'కథమేతత్?' రక్తాక్షః కథయతి--*,

ఇలా ఒక కథ వింటున్నాము- 'ఓ బ్రాహ్మణా! మండుచుండే నీ పుత్రుడి చితిని, గాయపడిన నా పడగను చూడు. మనసు విరిగిపోయి అతికించిన ప్రేమ- స్నేహం ప్రకటించినా వృద్ధిపొందదు'. అప్పుడు అరిమర్దనుడు, 'ఏమా కథ? అని అడిగాడు. దానికి, రక్తాక్షుడు ఇలా చెప్పసాగాడు.

రక్తాక్షుడు చెప్పబోయే కథా వివరాలు, రేపటి *'బ్రాహ్మణసర్పకథా'* అనే 6వ కథలోని గద్య వివరణలో తెలుసుకుందాం!

అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.

అంబాళం పార్థసారథి, 
20-02-2019, బుధవారం,

184. నిర్ణయ శక్తితో కూడిన బుద్ది దాని యొక్క అహం మరియు జ్ఞానేంద్రియాలు అనగా విజ్ఞానమయ కోశము తమతమ గుణాలను వ్యక్తము చేస్తూ సాధకునిలో మార్పు తెచ్చుటకు తోడ్పడుతుంది.
185. ఈ విజ్ఞానమయ కోశము చిత్తము యొక్క ప్రతిస్పందన వలన ఏర్పడినది. ప్రకృతి యొక్క మార్పులు జ్ఞాన ప్రభావము వలన ఏర్పడుతుంటాయి. అవి పూర్తిగా శరీరము వాటి అంగములకు అనుగుణముగా రూపొందుతాయి.

186,187. జీవి యొక్క అహంభావము వలన మొదలు, చివరి లేని ఈ భౌతిక ప్రపంచము యొక్క క్రియలు రూపొందుతాయి. అందుకు అహం యొక్క గత జన్మల కోరికలను అనుసరించి మంచి, చెడుల అనుభవములు వాటి ఫలితములతో కూడి ఉంటుంది. జీవుడు వివిధ జన్మలు ఎత్తుట వలన అవి రూపొందుతాయి. ఈ విజ్ఞానమయ కోశము ఎఱుకతో కూడిన కలలు, ఇతర స్థితులు, అనుభవాలు, ఆనందాలు, దుఃఖాలు ఇవన్నీ అలానే దర్శనమవుతుంటాయి.

188. బుద్ది ఎల్లప్పుడు శరీరమునకు చెందిన పనులు, విధులు అన్నియూ తనవి గానే పొరపాటు పడుతుంది. విజ్ఞానమయ కోశము అతి ప్రకాశవంతమై ఆత్మకు అతి చేరువుగా ఉండి తానే ఆత్మ అను భావముతో భ్రమలో ఉంటుంది. అందువలన అది అత్యంత మోసముతో కూడిన ఆత్మ భావన.

189. స్వయంగా అత్యంత ప్రకాశవంతమైన ఆత్మ హృదయములో అది స్వచ్ఛమైన విజ్ఞానము కలిగి ప్రాణములో ప్రకాశిస్తుంది. అది నిర్వికారమైనప్పటికి దాని కారణముగానే అనుభవాలు మరియు దాని అత్యంత ప్రభావము వలన విజ్ఞానమయ కోశము రూపొందుతుంది.

190. జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ బుద్ది యొక్క కొన్ని పరిమితులకు లోబడి తప్పుగా తనను తాను ఈ ప్రపంచములో వేరుగా భావిస్తుంది. మట్టి కుండ మట్టితో తయారైనప్పటికి తాను మట్టి కంటే వేరుగా భావిస్తుంది.

191. దివ్యాత్మతో సంబంధము వలన తాము దానితో సమానముగా భావించి, అది ప్రకృతి సిద్దముగా స్వచ్ఛమైనప్పటికి తాను ఉన్నతమైన ఆత్మవలె ప్రకాశిస్తుంది. మార్పు చెందని అగ్ని వివిధ మార్పులు చెందుతూ ఇనుమును అగ్నిగా ఎర్రగా ఎలా మారుస్తుందో అలానే.

192. మాయ వలన కాని ఇతర కారణముల వలన ఉన్నతమైన ఆత్మ తననుతాను జీవాత్మగా భావిస్తుంది. ఈ భావనకు మొదలుగాని, చివరగాని లేదు. దీనికి అంతము లేదు. అది జీవాత్మగా పిలువబడుతుంది.

No comments:

Post a Comment