ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేణమ:
ప్రాంజలి ప్రభ ( జికె -2)
1 .ద్విత్వ అక్ష రాలు తెలుపుము ?
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము
ముగ్గురు
గజ్జెలు
తప్పెట
వియ్యము
కయ్యము
కళ్ళు
నమ్మకం
2 . ప్రక్రుతి వికృతిలు కొన్ని వ్రాయుము ?
ప్రకృతి - వికృతి
భాష - బాస
రాజు - రేడు
శాస్త్రము - చట్టము
వర్ణము - వన్నె
విద్య - విద్దె
అక్షరము - అక్కరము
ఆధారము - ఆదరువు
కుమారుడు - కొమరుడు
కృష్ణుడు - కన్నడు
పద్యము - పద్దెము
న్యాయము - నాయము
దీపము - దివ్వె
భద్రము - పదిలము
ప్రాంజలి ప్రభ ( జికె -2)
1 .ద్విత్వ అక్ష రాలు తెలుపుము ?
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము
ముగ్గురు
గజ్జెలు
తప్పెట
వియ్యము
కయ్యము
కళ్ళు
నమ్మకం
2 . ప్రక్రుతి వికృతిలు కొన్ని వ్రాయుము ?
ప్రకృతి - వికృతి
భాష - బాస
రాజు - రేడు
శాస్త్రము - చట్టము
వర్ణము - వన్నె
విద్య - విద్దె
అక్షరము - అక్కరము
ఆధారము - ఆదరువు
కుమారుడు - కొమరుడు
కృష్ణుడు - కన్నడు
పద్యము - పద్దెము
న్యాయము - నాయము
దీపము - దివ్వె
భద్రము - పదిలము
3. లింగములు ఎన్ని ?
లింగములు 3 రకాలు అవి
1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.
4. సంయుక్తాక్షరములు తెలుపుము ?
ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
పద్యము (ద + య = ద్య)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
తర్కము (ర + క = ర్క)
అభ్యాసము (భా + య = భ్యా)
కార్యం (ర + య = ర్య)
పుష్పము (ష + ప = ష్ప)
ధర్మము (ర + మ = ర్మ)
విద్య (ద + య = ద్య)
సద్గుణము (దు +గ = ద్గు)
5. సంశ్లేష అక్షరాలు తెలుపుము ?
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)
సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)
వస్త్రము (స + త + ర = స్త్ర)
రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)
వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)
సంస్కృతి (స + క + ర = స్కృ)
No comments:
Post a Comment