Tuesday, 12 December 2017

#ధనుర్మాసం ప్రారంభం
16-12-2017 శనివారం ధనుర్మాసం ప్రారంభమవుతున్నది.ఈ నెలరోజులు బాలికలు,మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ ముగ్గులు పెట్టి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో ఉంచి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో,పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు చివరరోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు .(ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం గా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు ) హరి దాసులు (మాల దాసరులు హరిమాల ధరించిన వారు వీరినే మాలలు అని ప్రస్తుతం పిలుస్తున్న హరిభక్తులు) వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు.చివరలో గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. వాటికి కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు.
ఈ మాసము శ్రీ మహా విష్ణు వుకు ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. " శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి కటు పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు ) నివేదించి భక్తు లకు ప్రసాదములు పంచిపెట్తారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది (ప్రతి చలికాలంలో మన శరీరంలో రక్త మార్పిడి జరుగుతుంది.అందువలన ఆసమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది )
అనంత శయనమువందున్న విష్ణు చిత్తుడను భ్రాహ్మ ణుని ఏకైక పుత్రిక గోదాదీవి అత్యద్భుత సౌందర్యరాశి . ఆమె తోటలోని పూలను కోసి రకరకములుగ అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్ర తి బింబమును చూచుకొని మురిసి పోవుచూ .ఆమాలలను పదిలంగా తండ్రి కివ్వగా , ఆవిషయము తేలియని ఆమహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు .
ఇదే విధంగా ప్ర తి రోజూ జరుగ సాగింది .అయితే గోదాదేవి స్వామి వారి రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్త గా ఊహించుకొనేది . చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రి కరణ శుద్ధిగా నిర్ణయించుకుంది . ఎప్పటివలెనే మాలలను ధరించి తనప్ర క్కనే తన మనోధుడువ్నట్లు గా భావించిమురిసి పోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా .ఒక పర్యాయము పూజార్లు ఆమాలలను అలంకరించు సమయమందు ఆమాలలొ దాగియున్నోపొడవాటి కేశము(వెంట్రుక ) ను కను గోన్నారు. అది స్త్రీ కేశమని తెలుసు కున్నారు. ఆమాలలను తెచ్చిన ఆమహాభక్తునినానాదుర్భాషలాడారు.అంత విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికివెళ్ళగా , ఆచ్చటమాలలదంకరించుకుని స్వామి వారి తోభాషించుచున్న పుత్రికను చూచి అమితమైన ఆగ్ర హము తో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా తన ప్ర ణయ వృత్తాంతమును విసిదపర్చింది .కాని , ఆబ్రాహ్మణుడు ఆమె మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగాఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్ర మూతప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ప్రి యమని తెలియ పరచి ఆందరి సమక్షమున శ్రీ రంగనాథస్వామి గోదాదేవినివివాహమాడాడు.
అప్పటినుండిగోదాదేవి ఆండాళ్ గాపిలువబడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు " ఆముక్త మాల్యద "అను పేర ( విష్ణు చిత్తియం అనిగూడ అందురు ) గ్రంధరచన గావించెను .ఆముక్తమాల్యద అనగా 'తీసి వేసినదండ 'అని అర్థము.
గమనిక :
ఈ మాసమందే వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి ) వచ్చును. ఆరోజు బ్రాహ్మీ ముహూర్త ముందు అందరూ ఉత్తర ద్వారదర్శనమున స్వామి వారిని దర్శించెదరు .
ఇది ప్రకృతి ఆరాధన
శుభం భూయాత్ !!



జగత్ ప్రసిద్ధి పొందిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారో , దాని వెనుక ఉన్న కధ ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు.

''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకోదలచాను. కలియుగం అంతమయ్యే వరకు వేంకటేశ్వరుని అవతారంలో, కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అన్నాడు.

వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను...'' అని బదులిచ్చాడు.
అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.


తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.
ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందుకోసం కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.
ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూట్టానికి రెండు కళ్ళూ చాల్లేదు.
వేంకటేశ్వరుడు ఆలయంలో ప్రవేశించే సమయంలో దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. దక్షిణ, తాంబూలాలు ఇచ్చారు. వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆవిధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.

No comments:

Post a Comment