Saturday, 16 December 2017

*ముక్కోటి ఏకాదశి* *డిసెంబ‌ర్-29*


*ముక్కోటి ఏకాదశి* *డిసెంబ‌ర్-29*
*మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత.
*హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని ‘హరి వాసరం’గా వ్యవహరిస్తారు.
ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’ అనే మరో పేరు పురాణ గాథ అనుసరించి ఏర్పడింది.
ఆషాఢ బహుళ ఏకాదశి- కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి (లలిత ఏకాదశి అంటారు). రెండోది, అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి.
**ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు.
వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం మోక్ష ద్వారమని ప్రతీతి. అది ఆ ఒక్క రోజే తెరుచుకుంటుంది. దాన్ని ‘వైకుంఠ ద్వారం’ అంటారు. తిరుమలలో వైకుంఠద్వార ప్రవేశానికి భక్తులు ఉవ్విళ్లూరుతారు.
వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక, దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది.
వైకుంఠ ద్వారం నుంచి దర్శనానికి- భక్తులే కాదు, మూడు కోట్లమంది దేవతలూ తహతహలాడతారని చెబుతారు.
అందువల్ల దీనికి ‘ముక్కోటి’ అనే పేరు సార్థకమైంది.
ముక్కోటి ఏకాదశినాటి విధివిధానాలను, ఏకాదశి వ్రత నియమాలను పాటించినవారికి స్వర్గసుఖప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కారణంగా దీనికి ‘సౌఖ్యద ఏకాదశి’గా పేరుంది. మోక్షప్రాప్తినిస్తుందనే అర్థంలో మోక్ష‘ద’ ఏకాదశిగానూ సార్థక నామాలు ఏర్పడ్డాయి.
*వైఖానసుడు అనే రాజుకు తన తండ్రి నరకంలో యాతన పడుతున్న దృశ్యం కలలో కనిపించిందట.
ముక్కోటి ఏకాదశినాడు ఆ రాజు దీక్ష స్వీకరించి, వ్రతం, ఉపవాసాది నియమాలు పాటించడం వల్ల ఆయన తండ్రికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణ గాథ. ఆ కారణంగా దీనికి ‘మోక్ష్తెకాదశి’ అనే పేరు స్థిరపడిందంటారు.
*బ్రహ్మ నుదుటి నుంచి అకస్మాత్తుగా ఓ చెమటబొట్టు రాలి పడిందట. దాని నుంచి రాక్షసుడు జన్మించి, తనకో చోటు కల్పించాలని బ్రహ్మను కోరాడట. ఏకాదశినాటి అన్నం మెతుకుల్లో అతడికి బ్రహ్మ చోటు కల్పించాడంటారు. ఆనాటి నుంచి ఏకాదశి తిధిలో ఉపవాస నియమం ఏర్పడిందని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
*మానవుల కాలమానం లెక్కల్లోని మన ఆరునెలల కాలం, దేవతలకు ఒక పగలుతో సమానం. తక్కిన ఆరు నెలలూ దేవతలకు ఒక రాత్రి.
ఆషాఢ మాసంలో, అంటే దక్షిణాయనంతో మొదలయ్యే చీకట్ల నుంచి దేవతలు విముక్తులై ఈ ఏకాదశితో వెలుతురులోకి ప్రవేశిస్తారు.
అందుకే ఉత్తరాయణ పుణ్యకాలానికి దీన్ని శుభారంభ తిథిగా భావిస్తారు.
*ఏకాదశులన్నీ ప్రత్యేకమైనవే అయినా- విధివిధానాలు, పురాణ గాథలను అనుసరించి కొన్ని ఏకాదశులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చాతుర్మాస్య దీక్షలకు ఆరంభదినం కాబట్టి, ఆషాఢమాస ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. యోగనిద్ర ముగించి శ్రీమహావిష్ణువు మేలుకుంటాడన్న గాథ ప్రకారం ‘కార్తికమాస ఉత్థాన ఏకాదశి’గా భావిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ధనుర్మాస ముక్కోటి ఏకాదశిని- ‘నిర్ణయ సింధువు’ వంటి గ్రంథాలు మరీ విశేషమైనవిగా వర్ణిస్తున్నాయి.
*ఇంతటి ఘనత వహించిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియమంతో సాకారం చేసుకోవాలి. దాన్ని శ్రీవారి దివ్య పాదారవింద ‘చింతనామృత పాన విశేష శుద్ధ చిత్తం’తో సద్వినియోగం చేసుకోవడం మన వంతు!
_*🦑ఓం..నమో...శ్రీవేంకటేశాయా!!!* 🦑_

తిరుప్పావై - మొదటి పాశురం
ఈ రోజు నుండి ధనుర్మాసం ప్ర్రారంభమము అయ్యింది కదండి. మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలు ను గోదాదేవి ఈ వ్రతం చేయుటకు చేయుటకుముందుగా వారు మార్గశిరమాసం గురించి వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు. తరువాత ఈ వ్రతం ఎవరు చేసారో దాని వల్ల కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు. ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు. మొదటి పాశురం
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
మరి ఈ పాశురం తాత్పర్యము ఏమిటంటే ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము


తిరుప్పావై - మొదటి పాశురం

మార్గశీర్ష స్నానముచేయుదము 
రండి వేగముగా రండి పడచులారా
వెన్నెలతో నిండిన  శుభదినము
ఆభరణములు గల పడచులారా  

కృష్ణునకు ఆపదరాకుండాచూచెదము 
నీలమేఘ శ్యాముడను చూచుదుమురా 
సూర్యునివలె ప్రకాశిస్తున్న మొఖము 
కన్నులతో చూచెదము ఓ బాలికలారా

చంద్రునివలె ఆహ్లాదమును చూచెదము  
దివ్యముఖమండలము  చూచెదమురా 
సంకల్పముతో తామరకళ్లను చూచెదము
"పరా" అను వాయిద్యమును పొందెదమురా   

ప్రాంజలిప్రభ
నేటి పద్యం
సమ గుణములు మనిషికి దొరకవు
దొరికినవి మనసునకు సరిపడవు
వగచుట వలదు నగవులు తడవవు
కుమిలి కలతలు మనషికి తగవవు

Wednesday, 13 December 2017

గూగుల్ ప్రభ



*'వందే సంస్కృతమాతరమ్'*

812. గద్యం || 
అథారిమర్దనస్తదాకర్ణ్య పితృపైతామహక్రమాగత
మంత్రిభిః సార్ధం మంత్రయాంచక్రే.

--పంచతంత్రం. కా.కీ.5-132.

అది విన్న అరిమర్దనుడు (ఉలూకరాజు) తండ్రి తాతలు మొదలుగా వంశపారంపర్యంగా వచ్చిన మంత్రులతో ఈ విధంగా ఆలోచన చేయసాగాడు.
***

కాబట్టి, అతడికి కానుకలు సమర్పించి సంధిచేసుకోవడమే సరియైనపని. అందుకే- 'శత్రువు బలవంతుడని తెలిసినచో బుద్ధిమంతులైనవారు తమ సర్వస్వం అర్పించియైనా ప్రాణాలను రక్షించుకోవాలి. ప్రాణాలను రక్షించుకుంటే ధనాన్ని మళ్లీ సంపాదించుకోవచ్చని' విజ్ఞులన్నారు.

*తచ్ఛ్రుత్వా తేన దుర్జనకోపితేన త్వత్పక్షపాతినం మామాశంక మానేనేమాం దశాం నీతః. 
తత్తవ పాదౌ సాంప్రతం మే శరణమ్. కిం బహునా విజ్ఞప్తేన? 
యావదహం ప్రచలితుం శక్నోమి తావత్త్వాం తస్యావాసం నీత్వా సర్వవాయసక్షయం విధాస్యామి' ఇతి.*,

అంతకుముందే దుష్టుల చాడీలవలన నాపట్ల కోపంతో ఉండే అతడు, నా ఈమాట వినగానే నన్ను నీ పక్షం వాడిగా అనుమానించాడు. నన్ను హింసించి, ప్రస్తుతం ఈ అవస్థ కలిగించాడు, కాబట్టి, ఇప్పుడు మీ పాదాలే నాకు దిక్కు. నాకు కదిలే శక్తి రాగానే మిమ్మల్ని అతని నివాసానికి తీసుకుని పోతాను. కాకులన్నింటిని మీచేత నాశనం చేయిస్తాను.

*అథారిమర్దనస్తదాకర్ణ్య పితృపైతామహక్రమాగత మంత్రిభిః సార్ధం మంత్రయాంచక్రే. తస్య చ పంచ మంత్రిణః తద్యథా రక్తాక్షః, క్రూరాక్షః, దీప్తాక్షః, వక్రనాశః, ప్రాకారకర్ణశ్చేతి. తత్రాదౌ రక్తాక్షమపృచ్ఛత్--*,

అది విన్న అరిమర్దనుడు (ఉలూకరాజు), తన తండ్రి తాతలు మొదలుగా వంశపారంపర్యంగా వచ్చిన మంత్రులతో ఆలోచన చేయసాగాడు. అతడికి ఐదుగురు మంత్రులున్నారు. వారి పేర్లు రక్తాక్షుడు, క్రూరాక్షుడు, దీప్తాక్షుడు, వక్రనాశుడు, ప్రాకారకర్ఢుడు. వారిలో మొదట రక్తాక్షుడిని ఇలా అడిగాడు--

*భద్ర, ఏషతావత్తస్య రిపోర్మంత్రీ మమ హస్తగతః. తత్ కిం క్రియతామ్' ఇతి. రక్తాక్ష ఆహ- 'దేవ! కిమత్ర క్రియతే. అవిచారితమయం హంతవ్యః. యతః- హీనః శత్రునిహంతవ్యో యావన్న బలవాన్ భవేత్, ప్రాప్తస్త్వపౌరుషబలః పశ్చాద్భవతి దుర్జయః*,

శుభమూర్తీ! ఇతడు ఆ శత్రుమంత్రి. నా చేతిలో చిక్కాడు. కాబట్టి, ఇప్పుడేం చేయాలి? అప్పుడు రక్తాక్షుడు ఇలా చెప్పాడు- 'ప్రభూ! ఇందులో ఆలోచన చేయదగినది ఏముంది? ఇక ఎలాంటి ఆలోచన చేయకుండా వెంటనే సంహరించాలి. శత్రువు దుర్బలుడై ఉన్నప్పుడే అనగా అతడు బలవంతుడు కాకముందే చంపివేయాలి. ఎందుకంటే, అతడు పౌరుషమైన బలం పొందిన తర్వాత అజేయుడౌతాడు.

*కించ 'స్వయముపాగతా శ్రీ స్త్యజ్యమానా శపతి'- ఇతి లోకే ప్రవాదః. ఉక్తంచ- కాలో హి సకృదభ్యేతి యన్నరం కాలకాంక్షిణమ్, దుర్లభః స పునస్తేన కాలకర్మాచికీర్షతా.*,

మరియు 'స్వయంగా వచ్చిన లక్ష్మి తిరస్కరించబడినచో శపిస్తుందని' లోకంలో జనప్రసిద్ధి ఒకటుంది. అందుకే- 'తన అభివృద్ధికి తగిన కాలాన్ని కాంక్షించే పురుషుడికి, అటువంటి కాలం, జీవితంలో ఒకసారి మాత్రమే లభిస్తుంది. కానీ, ఆ కాలంలో తగిన పనులు చేయగోరువారికి (లభించిన కాలాన్ని వినియోగించుకోలేనివాడికి) మళ్లీ అలాంటి కాలం జీవితంలో లభించదని' విజ్ఞులన్నారు.

*శ్రూయతే చ యథా- చితికాం దీపితాం పశ్య ఫటాం భగ్నాం మమైవ చ, భిన్నశ్లిష్టా తు యా ప్రీతిర్న సా స్నేహేన వర్ధతే. అరిమర్దనః ప్రాహ- 'కథమేతత్?' రక్తాక్షః కథయతి--*,

ఇలా ఒక కథ వింటున్నాము- 'ఓ బ్రాహ్మణా! మండుచుండే నీ పుత్రుడి చితిని, గాయపడిన నా పడగను చూడు. మనసు విరిగిపోయి అతికించిన ప్రేమ- స్నేహం ప్రకటించినా వృద్ధిపొందదు'. అప్పుడు అరిమర్దనుడు, 'ఏమా కథ? అని అడిగాడు. దానికి, రక్తాక్షుడు ఇలా చెప్పసాగాడు.

రక్తాక్షుడు చెప్పబోయే కథా వివరాలు, రేపటి *'బ్రాహ్మణసర్పకథా'* అనే 6వ కథలోని గద్య వివరణలో తెలుసుకుందాం!

అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.

అంబాళం పార్థసారథి, 
20-02-2019, బుధవారం,

184. నిర్ణయ శక్తితో కూడిన బుద్ది దాని యొక్క అహం మరియు జ్ఞానేంద్రియాలు అనగా విజ్ఞానమయ కోశము తమతమ గుణాలను వ్యక్తము చేస్తూ సాధకునిలో మార్పు తెచ్చుటకు తోడ్పడుతుంది.
185. ఈ విజ్ఞానమయ కోశము చిత్తము యొక్క ప్రతిస్పందన వలన ఏర్పడినది. ప్రకృతి యొక్క మార్పులు జ్ఞాన ప్రభావము వలన ఏర్పడుతుంటాయి. అవి పూర్తిగా శరీరము వాటి అంగములకు అనుగుణముగా రూపొందుతాయి.

186,187. జీవి యొక్క అహంభావము వలన మొదలు, చివరి లేని ఈ భౌతిక ప్రపంచము యొక్క క్రియలు రూపొందుతాయి. అందుకు అహం యొక్క గత జన్మల కోరికలను అనుసరించి మంచి, చెడుల అనుభవములు వాటి ఫలితములతో కూడి ఉంటుంది. జీవుడు వివిధ జన్మలు ఎత్తుట వలన అవి రూపొందుతాయి. ఈ విజ్ఞానమయ కోశము ఎఱుకతో కూడిన కలలు, ఇతర స్థితులు, అనుభవాలు, ఆనందాలు, దుఃఖాలు ఇవన్నీ అలానే దర్శనమవుతుంటాయి.

188. బుద్ది ఎల్లప్పుడు శరీరమునకు చెందిన పనులు, విధులు అన్నియూ తనవి గానే పొరపాటు పడుతుంది. విజ్ఞానమయ కోశము అతి ప్రకాశవంతమై ఆత్మకు అతి చేరువుగా ఉండి తానే ఆత్మ అను భావముతో భ్రమలో ఉంటుంది. అందువలన అది అత్యంత మోసముతో కూడిన ఆత్మ భావన.

189. స్వయంగా అత్యంత ప్రకాశవంతమైన ఆత్మ హృదయములో అది స్వచ్ఛమైన విజ్ఞానము కలిగి ప్రాణములో ప్రకాశిస్తుంది. అది నిర్వికారమైనప్పటికి దాని కారణముగానే అనుభవాలు మరియు దాని అత్యంత ప్రభావము వలన విజ్ఞానమయ కోశము రూపొందుతుంది.

190. జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ బుద్ది యొక్క కొన్ని పరిమితులకు లోబడి తప్పుగా తనను తాను ఈ ప్రపంచములో వేరుగా భావిస్తుంది. మట్టి కుండ మట్టితో తయారైనప్పటికి తాను మట్టి కంటే వేరుగా భావిస్తుంది.

191. దివ్యాత్మతో సంబంధము వలన తాము దానితో సమానముగా భావించి, అది ప్రకృతి సిద్దముగా స్వచ్ఛమైనప్పటికి తాను ఉన్నతమైన ఆత్మవలె ప్రకాశిస్తుంది. మార్పు చెందని అగ్ని వివిధ మార్పులు చెందుతూ ఇనుమును అగ్నిగా ఎర్రగా ఎలా మారుస్తుందో అలానే.

192. మాయ వలన కాని ఇతర కారణముల వలన ఉన్నతమైన ఆత్మ తననుతాను జీవాత్మగా భావిస్తుంది. ఈ భావనకు మొదలుగాని, చివరగాని లేదు. దీనికి అంతము లేదు. అది జీవాత్మగా పిలువబడుతుంది.

Tuesday, 12 December 2017

#ధనుర్మాసం ప్రారంభం
16-12-2017 శనివారం ధనుర్మాసం ప్రారంభమవుతున్నది.ఈ నెలరోజులు బాలికలు,మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ ముగ్గులు పెట్టి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో ఉంచి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో,పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు చివరరోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు .(ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం గా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు ) హరి దాసులు (మాల దాసరులు హరిమాల ధరించిన వారు వీరినే మాలలు అని ప్రస్తుతం పిలుస్తున్న హరిభక్తులు) వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు.చివరలో గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. వాటికి కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు.
ఈ మాసము శ్రీ మహా విష్ణు వుకు ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. " శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి కటు పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు ) నివేదించి భక్తు లకు ప్రసాదములు పంచిపెట్తారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది (ప్రతి చలికాలంలో మన శరీరంలో రక్త మార్పిడి జరుగుతుంది.అందువలన ఆసమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది )
అనంత శయనమువందున్న విష్ణు చిత్తుడను భ్రాహ్మ ణుని ఏకైక పుత్రిక గోదాదీవి అత్యద్భుత సౌందర్యరాశి . ఆమె తోటలోని పూలను కోసి రకరకములుగ అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్ర తి బింబమును చూచుకొని మురిసి పోవుచూ .ఆమాలలను పదిలంగా తండ్రి కివ్వగా , ఆవిషయము తేలియని ఆమహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు .
ఇదే విధంగా ప్ర తి రోజూ జరుగ సాగింది .అయితే గోదాదేవి స్వామి వారి రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్త గా ఊహించుకొనేది . చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రి కరణ శుద్ధిగా నిర్ణయించుకుంది . ఎప్పటివలెనే మాలలను ధరించి తనప్ర క్కనే తన మనోధుడువ్నట్లు గా భావించిమురిసి పోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా .ఒక పర్యాయము పూజార్లు ఆమాలలను అలంకరించు సమయమందు ఆమాలలొ దాగియున్నోపొడవాటి కేశము(వెంట్రుక ) ను కను గోన్నారు. అది స్త్రీ కేశమని తెలుసు కున్నారు. ఆమాలలను తెచ్చిన ఆమహాభక్తునినానాదుర్భాషలాడారు.అంత విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికివెళ్ళగా , ఆచ్చటమాలలదంకరించుకుని స్వామి వారి తోభాషించుచున్న పుత్రికను చూచి అమితమైన ఆగ్ర హము తో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా తన ప్ర ణయ వృత్తాంతమును విసిదపర్చింది .కాని , ఆబ్రాహ్మణుడు ఆమె మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగాఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్ర మూతప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ప్రి యమని తెలియ పరచి ఆందరి సమక్షమున శ్రీ రంగనాథస్వామి గోదాదేవినివివాహమాడాడు.
అప్పటినుండిగోదాదేవి ఆండాళ్ గాపిలువబడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు " ఆముక్త మాల్యద "అను పేర ( విష్ణు చిత్తియం అనిగూడ అందురు ) గ్రంధరచన గావించెను .ఆముక్తమాల్యద అనగా 'తీసి వేసినదండ 'అని అర్థము.
గమనిక :
ఈ మాసమందే వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి ) వచ్చును. ఆరోజు బ్రాహ్మీ ముహూర్త ముందు అందరూ ఉత్తర ద్వారదర్శనమున స్వామి వారిని దర్శించెదరు .
ఇది ప్రకృతి ఆరాధన
శుభం భూయాత్ !!



జగత్ ప్రసిద్ధి పొందిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారో , దాని వెనుక ఉన్న కధ ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు.

''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకోదలచాను. కలియుగం అంతమయ్యే వరకు వేంకటేశ్వరుని అవతారంలో, కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అన్నాడు.

వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను...'' అని బదులిచ్చాడు.
అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.


తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.
ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందుకోసం కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.
ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూట్టానికి రెండు కళ్ళూ చాల్లేదు.
వేంకటేశ్వరుడు ఆలయంలో ప్రవేశించే సమయంలో దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. దక్షిణ, తాంబూలాలు ఇచ్చారు. వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆవిధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.

Saturday, 2 December 2017

ప్రాంజలి ప్రభ - (జి .కే - 9)



ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ- జనరల్ ఎస్సేస్ 

image not displayed
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 9)



సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

23 జూన్ అంతర్జాతీయ ఒలంపిక్స్ దినోత్సవం (23 Jun International Olympics Day)

ఒలంపిక్స్ దినోత్సవం, ఒలంపియాడ్ దినము- ఈ రెండింటితో పలువురు గందరగోళ పడతారు. ఇది ఒలంపిక్స్ దినోత్సవం. విషయాలవారీగా, అంశాలవారీగా పోటీలు నిర్వహించే సంస్థలు గణీత ఒలంపియాడ్, సంగీత ఒలంపియాడ్ వంటి పేర్లతో నిర్వహించుకుంటాయి. ఒలంపిక్స్ దినోత్సవాన్ని అంతర్జాతీయ ఒలంపిక్స్ సమితి ఆధ్వర్యం‌లో ఆయాదేశాల జాతీయ ఒలంపిక్స్ కమిటీలు నిర్వహిస్తాయి.

స్టాక్ హం (స్వీడన్ రాజధాని)లో 1947 సం. జరిగిన 41 వ సమావేశం‌లో జెకోస్లేవియాకు చెందిన డాక్టర్ గ్రస్, ‘ఒలంపిక్ క్రీడలనే భావాన్ని ప్రపంచ ప్రజానీకం‌లోకి తీసుకువెళ్ళడంకోసం ఒలంపిక్స్ దినొత్త్సవం జరుపుకోవాలని’ సూచించాడు. కొన్నినెలల తర్వాత స్విజర్‌లాండ్‌లోని సెయింట్ మోరిజ్ పట్టణం‌లో జరిగిన 42 వ సమావేశం‌లో ఈ ప్రతిపాదన కార్యరూపం దల్చింది. దానికణుగుణంగా ఆధునిక ఒలంపిక్ క్రీడల వ్యవస్థాపకుడు క్యూబర్టిన్ ఈక్రీడల పునరుధ్ధరణకు పూనుకున్న జులై 23వ తేదీ (1894) ని అంతర్జాతీయ ఒలంపిక్స్ దినోత్సవంగా నిర్ణయించారు.
తొలి ఒలంపిక్స్ దినోత్సవం 23 జూన్ 1948లో జరిగింది నాటి అంతర్జాతీయ ఒలాంపిక్స్ కమిటీ అద్యక్షుడు సిగ్ఫిడ్ ఎడ్‌స్టమ్మ్ క్రీడలు, క్రీడాస్ఫూర్తిపట్ల యువతనుద్దేశించి సందేశమిచ్చాడు.
ఒలంపిక్స్‌ను నాలుగేళ్లకోసారి జరిగే మొక్కుబడి కార్యక్రమం మాదిరిగా కాకుండా ప్రపంచ శాంతి సాధనంగానూ, ఉద్యమంగానూ నిర్వహించడం కోసం ఒలంపిక్స్‌ దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనీ, యువతనూ, విద్యార్ధులనూ, ప్రత్యేకింఛి మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలనీ సభ్యదేశాలను కోరింది.
ఒలంపిక్స్ పట్ల , క్రీడల పట్ల యువతను జాగృతం చేయడానికి జాతీయ ఒలంపిక్స్ సంఘాలు ప్రతీ సంవత్సరం ఈరోజున ఒలంపిక్ పరుగును నిర్వహిస్తాయి.
(LSD Vs MLD) ఒలంపిక్స్ దినోత్సవం కేవలం పరుగులకే పరిమితంకాకుండా ఒలంపిక్ క్రీడలకు మూలభావనలైన “కదులు (move- M), అభ్యసించు(learn- L), కనుగొను (discover- D), సంక్షిప్తంగా MLD నేటిసమాజం‌లోని జాతి, మత, లింగ, సామాజిక అభిజాత్యాలవంటి LSD (Lysergic Acid Diethylamide- అత్యంత శక్తివంతమైన మత్తుమందు) కు విరుగుడుగా వర్ణించారు. గతం‌లో ఎటువంటి క్రీడా నెపధ్యం‌లెనివారు కూడా క్రీడాకారులుగా ఎదగవచ్చుననీ, ఆరోగ్యవంతమైన జీవితంతోపాటు శాంతియుత సమాజాన్ని కూడా నెలకొల్పవచ్చుననీ వివరీంచారు.
యోగా క్రీడలతోపాటు ప్రకృతి విధ్వంసక వినిమయ సంస్కృతిని నిసర్జించినప్పుడే ఆరోగ్యకరమైన, శాంతియుత సమాజం నిర్మితమౌతుంది.

ఆధునిక ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమైన 6 ఏప్రిల్ (1896) తేదీని “అంతర్జాతీయ క్రీడల ద్వారా శాంతి దినోత్సవంగా ఐక్య్యరాజ్య సమితి నిర్వహిస్తుంది.

బారత హాకీ మాంత్రికుడు ధ్యాంచంద్ జయంతియైన ఆగస్ట్ 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము.





ప్రాంజలి ప్రభ - (జి .కే - 8)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 8)


సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  



1 .మని షి కి ఉండవలసిన మూడు లక్షణాలు ఏమిటో చెపుతారా?
నాదృష్టిలో మని షి కి ఓర్పు ఓదార్పు ఒరవడి మరియు దానము, భోగము ఆధ్యాత్మికము ఉండాలి

2 . నిజమైన  సుఖి,  యోగి,  రోగి, ఎవరో చెప్పగలరా ?
కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచగల సాధకుడే " సుఖి, యోగి " అనుమానము, ఆశతో ఉండి తృప్తి లేని వాడు రోగి.

త్రీ. మనసుకు మందు, మమతకు పొందు, కులుకుకు చిందు, పదాల భావమేదో ఎవరైనా చెప్పండి ?
నాదృష్టిలో ప్రశాంతత కొరకకు మాత్రమే.

4 . నిరీక్షణ అనగా నేమి ?
నాదృష్టిలో నిరీక్షణ అనగా "సాధన కొరకు, ఆనందం కొరకు, కోరిక కొరకు " వేచి ఉండుట,  అర్ధం లేని నిరీక్షణ కాలాన్ని వ్యర్థం చేస్తుంది, ఆలోచనా భారం పెంచుతుంది 

5 . స్థితి ప్రజ్నుడు అనగా ఎవరో తెలియ పరచండి ?

దు:ఖములకు క్రుంగి పోని వాడును, సుఖములకు పొంగి పోని వాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు

6. మనిషికి, సూర్యభగవానునికి, ఒక పోలిక ఉన్నది, అది ఏమిటో చెప్పా గలుగు తారా? 
సూర్యుడు ప్రపంచానికి వెలుగును పంచి అస్తమించి ఉదయిస్తాడు, మనిషి దేశం కోసం, కుటుంబం కోసం సహాయం అందించి మరణిస్తాడు పుడతాడు కదా

*7 . పత్రికలూ, టివిలో ప్రోగ్రాములు ఎంత వరకు ఉపయోగపడతాయి ?
మేధావులు చెప్పే మంచి విషయాలు,  కళాకారలు నటనా సామర్థ్యంతో మనసుకు హత్తుకొనేవి ఉన్నాయి, కొందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మంచిని చూసే శక్తి తెలుసుకొనే శక్తి భగవంతుడిచ్చాడు కాబట్టి "రెండు" అవసరము, సమయం వ్యర్థం కాకుండా ఉండగలిగితే మంచిది.       

8 . త్రిగుణా తీతుడు ఒకే స్థితిలో ఉండుటకు ఏమిచేయగలడు ?
సత్వగునరూపమైన ప్రకాశము, రజొగునకార్యరూపమైన ప్రవ్రుత్తి,తమొగునకార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగునాతితుడు ద్వేషింపడు, అనగా విచారించాడు,వాటికి కాంక్ష పడడు కనుక ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండును.     

9 . చదువుకున్న వాడికి, చదువు కోని వాడికి కొద్ది తేడా ఉంటుంది అది ఏమిటో మీరు చెపుతారా?
చదువుకున్న వాడికి ఎం మాట్లాడాలన్నా ఆలోచన అడ్డు పడుతుంది, చదువుకోని వాడికి తెలుసుకున్న మాట చెప్పందే నిద్రపోడు.     

సహాయం పొందినవారు నోరెత్తరు, గిట్టనివారు నోరెత్తి ఈర్ష్యతో కాకిలాగా అరుస్తారు, ప్రభుత్వంవారు అక్రమసంపాదన అని తెలిస్తే తీసుకుంటారు, నిరూపించే వ్యక్తే ధైర్యంతో ముందుకు వచ్చి ఆధారాలు చూపితే మంచిది   

10 . డ్రగ్స్ గురించి సినిమానటులను, మరికొందరిని విచారిస్తున్నారు, ఫలితమేమన్న ఉంటుందా ?
 అనుమానంతో ప్రశ్నలు వేసి దోషులను నిర్ధారించటం, నల్లమందు అరికట్టడం ప్రభుత్వధర్మం - ముందున్నది అంతా మంచి కాలం అని సమర్ధించుకోవటం మానవుల నైజం 

ప్రాంజలి ప్రభ - (జి .కే - 7)



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 7)


సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

మానవజన్మ - సుగుణాలు 

హస్తస్య భూషణం దానం -- చేతులకు దానమే భూషణం 

సత్యం కంఠస్య భూషణం -- కంఠమునకు సత్యమే భూషణం 

శ్రోతస్య భూషణం శాస్త్రం -- చెవికి ధర్మ వచనములే ఆభరణం. 

ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు భర్తృహరి. మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలు లేకుంటే మానవజన్మ వ్యర్ధమవుతుందని హెచ్చరించాడు.    

ఒక అడవిలో మనుష్య శవం ఉంది. కొద్ది దూరంలో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అతరాయం కలిగి కన్నులు తెరచి చూశాడు. వెంటనే దివ్య  దృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు. కనుక వాటిని తినకూడదని" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదలి చెవులను తినబోగా, " ఈతని చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలనుగాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. " ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు. కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, " ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జనులను, తీర్ధాలను దర్శించి ఎరుగవు. కావున తినడానికి తగినవి కావని" అన్నాడు. 

మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని మహర్షి చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ  తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు. మహర్షి ఆ నక్కకు తన ఆశ్రమంలోని కందమూలములు ఇచ్చి దాని క్షుద్భాధ తీర్చి పంపాడు. 

" సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి . సౌశీల్యమూర్తిగా మనిషి మెలగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు " అని ఈ కధ ద్వారా మనం గ్రహించాల్సినది.


Friday, 1 December 2017

ప్రాంజలి ప్రభ - (జి .కే - 6)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 6)
సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  


పుట్టు మచ్చలు ఫలితాలు 

కుడి కణత = ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు 

ఎడమ కణత = అపజయాలు, దుర దృష్టం 

కుడి కనుబొమ్మ =ధన వంతులతో వివాహం 

ఎడమ కనుబొమ్మ = దూర దృష్టం 

చెక్కిలి యందు =సకల భోగాలు 

ముక్కు మీద = కార్య సిద్ది 

పెదవులందు =చమత్కారులు 

గడ్డమందు = ధనము ,కీర్తి 

గళము నందు = వివాహం వలన ధన ప్రాప్తి 

ముక్కు ప్రక్కల యందు = దేశ సంచారి 

దవడల యందు ( స్త్రీ లకు ) = దుఖ: వంతులు 
చంకల నుండి కటి ప్రదేశము వరకు (కుడి ఎడమ ప్రక్కలు 
) =ఆరోగ్య భంగం, ధన వ్యయం 

ఉదరము = తిండి పోతూ, దురాశ కలవారు 

పొట్టి కడుపు =బల హీనతలు కలవారు 

కుడి భుజం= వివేకులు, వినయము కలవారు 

ఎడమ భుజం =మూర్ఖత్వానికి గుర్తు 

కుడి బాహువు =బల ధైర్యవంతులు 

ఎడమ బాహువు =కార్య సిద్ది 

మోచేయి దగ్గర = చంచలత్వం 

మోచేయి క్రింద = జీవితాన్తమున ధన లాభము 

కుడి తోడ = అదృష్టము 

ఎడమ తోడ =దారిద్యము 

కుడి మోకాలు = భార్య వలన గృహ సౌక్యము 

ఎడమ మోకాలు (పురుషులకు ) =అల్ప బుద్ధి 

ఎడమ మోకాలు ( స్త్రీలకూ ) = అధిక సంతానం 

పిక్కల యందు =అలసత్వం 

పాదాల యందు =ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం 

ముక్కుమీద – కోపము, వ్యాపార దక్షత 

కుడికన్ను – అనుకూల దాంపత్యము 

ఎడమకన్ను – స్వార్జిత ధనార్జన 

నుదిటి మీద – మేధావి, ధన వంతులు 

గడ్డము – విశేష ధన యోగము 

కంఠము – ఆకస్మిక ధన లాభం 

మెడమీద – భార్యద్వారా ధనయోగం 

మోచేయి – వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి 

కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు 
ధరించుట 

పొట్టమీద – భోజనప్రియులు 

పొట్టక్రింద – అనారోగ్యం 

కుడి భుజం – త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు 

బొడ్డులోపల – ధనలాభములు 

కుడితొడ – ధనవంతులు 

ఎడమతొడ – సంభోగం 

చేతి బ్రొటన వ్రేలు – స్వతంత్ర విద్య, వ్యాపారం 

కుడి చేయి చూపుడు వ్రేలు – ధనలాభము, కీర్తి 

పాదముల మీద – ప్రయాణములు 

మర్మస్థానం – కష్ట సుఖములు సమానం. 


ప్రాంజలి ప్రభ - (జి .కే - 5)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 5)
సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  


తెలుసుకోదగ్గ విషయాలు
1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.

5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.

21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.

29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.

37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.

41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

91. దిగంబరంగా నిద్రపోరాదు.
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి


ప్రాంజలి ప్రభ - (జి .కే -4)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే -4)
సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  


తిధుల ప్రాధాన్యత ఏమిటి? 
ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి? 
తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి? 

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది. 

పాడ్యమి : అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి. 

విదియ : అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది. 

తదియ : అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం. 

చవితి: అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.  

పంచమి: అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది. 

షష్టి : అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి. 

సప్తమి: అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది. 

అష్టమి: అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము. 

నవమి: అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది. 

దశమి: అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి. 

ఏకాదశి: అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.  

ద్వాదశి: అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును. 

త్రయోదశి: అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది. 

చతుర్దశి: అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.  

అమావాస్య: అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం. 

పౌర్ణమి: అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

ప్రాంజలి ప్రభ - (జి.కె -3)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రాంజలి ప్రభ - (జి.కె -3)

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు అడిగారు. 

వాటికి ధర్మరాజుగారు ఇచ్చిన జవాబులు: 

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
 (బ్రహ్మం) 

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
 (దేవతలు) 

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? 
(ధర్మం) 

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
 (సత్యం) 

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
 (వేదం) 

6. దేనివలన మహత్తును పొందును?
 (తపస్సు) 

7. మానవునికి సహయపడునది ఏది?
 (ధైర్యం) 

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
 (పెద్దలను సేవించుటవలన) 

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును?
 (అధ్యయనము వలన) 

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? 
(తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.) 

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
 ( మృత్యు భయమువలన) 

12. జీవన్మృతుడెవరు? 
(దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు) 

13. భూమికంటె భారమైనది ఏది?
 (జనని) 

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
 (తండ్రి) 

15. గాలికంటె వేగమైనది ఏది? 
(మనస్సు) 

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? 
( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది) 

17. తృణం కంటె దట్టమైనది ఏది? 
(చింత) 

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? 
(చేప) 

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
 ( అస్త్రవిద్యచే) 

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
 ( యజ్ఞం చేయుటవలన) 

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు) 

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? 
(రాయి) 

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? 
(శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన) 

24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
 (నది) 

25. రైతుకు ఏది ముఖ్యం? 
(వాన) 

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? 
(సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు) 

27. ధర్మానికి ఆధారమేది? 
(దయ దాక్షిణ్యం) 

28. కీర్తికి ఆశ్రయమేది?
 (దానం) 

29. దేవలోకానికి దారి ఏది?
 (సత్యం) 

30. సుఖానికి ఆధారం ఏది? 
(శీలం) 

31. మనిషికి దైవిక బంధువులెవరు?
 (భార్య/భర్త) 

32. మనిషికి ఆత్మ ఎవరు? 
( కుమారుడు) 

33. మానవునకు జీవనాధారమేది?
 (మేఘం) 

34. మనిషికి దేనివల్ల సంతసించును?
 (దానం) 

35. లాభాల్లో గొప్పది ఏది? 
(ఆరోగ్యం) 

36. సుఖాల్లో గొప్పది ఏది?
 (సంతోషం) 

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
 (అహింస) 

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? 
(మనస్సు) 

39. ఎవరితో సంధి శిధిలమవదు?
 (సజ్జనులతో) 

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
 (యాగకర్మ) 

41. లోకానికి దిక్కు ఎవరు?
 (సత్పురుషులు) 

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
 (భూమి, ఆకాశములందు) 

43. లోకాన్ని కప్పివున్నది ఏది?
 (అజ్ఞానం) 

44. శ్రాద్ధవిధికి సమయమేది?
 (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు) 

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
 ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో) 

46. తపస్సు అంటే ఏమిటి?
 ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం) 

47. క్షమ అంటే ఏమిటి?
 ( ద్వంద్వాలు సహించడం) 

48. సిగ్గు అంటే ఏమిటి?
 (చేయరాని పనులంటే జడవడం) 

49. సర్వధనియనదగు వాడెవడౌ? 
( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు) 

50. జ్ఞానం అంటే ఏమిటి? 
(మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం) 

51. దయ అంటే ఏమిటి? 
( ప్రాణులన్నింటి సుఖము కోరడం) 

52. అర్జవం అంటే ఏమిటి?
 ( సదా సమభావం కలిగి వుండడం) 

53. సోమరితనం అంటే ఏమిటి? 
(ధర్మకార్యములు చేయకుండుట) 

54. దు:ఖం అంటే ఏమిటి? 
( అజ్ఞానం కలిగి ఉండటం) 

55. ధైర్యం అంటే ఏమిటి?
 ( ఇంద్రియ నిగ్రహం) 

56. స్నానం అంటే ఏమిటి?
 (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం) 

57. దానం అంటే ఏమిటి?
 ( సమస్తప్రాణుల్ని రక్షించడం) 

58. పండితుడెవరు? 
( ధర్మం తెలిసినవాడు) 

59. మూర్ఖుడెవడు?
 (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు) 

60. ఏది కాయం? 
( సంసారానికి కారణమైంది) 

61. అహంకారం అంటే ఏమిటి?
 ( అజ్ఞానం) 

62. డంభం అంటే ఏమిటి?
 (తన గొప్పతానే చెప్పుకోవటం) 

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? 
(తన భార్యలో, తన భర్తలో) 

64. నరకం అనుభవించే వారెవరు?
 (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు) 

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? 
(ప్రవర్తన మాత్రమే) 

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
 (మైత్రి) 

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? 
(అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు) 

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
 (సుఖపడతాడు) 

69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
 (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు) 

70. ఏది ఆశ్చర్యం?
 (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం) 

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
 (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు) 

72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?
 (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)