(14-04-2017)సమభావ ప్రవక్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
నెహ్రు పభుత్వంలో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ శ్వీకారమ్
భారత రాజ్యాంగ రూపకల్పనతొ “అక్షర విజేతగా గుర్తించే ప్రపంచం
అంటరాని తనంతో నలిగిపోతున్న నిమ్న కులాల కోసంచేసె ఉద్యమం
సమభావ ఉద్యమ నేత దళితుల ఆశాజ్యోతి, అంబేద్కరుడు చిరస్మర
నీయుడు
అంబేద్కర్ దళితులను ఉత్తేజ పరుచుటకు సాపించే దళిత జర్నలిజం
1920-01-31 నాడుదళితుల వికాసంకొరకు మానినాయాక్ ప్రతిక ప్రారంభం
దళితసాహత్యం వళ్ళ ఉపన్యాసాలవల్ల దళితుల కొందరికి రాజకీయ అధికారం
దండోరా అంబేద్కర్ అభీశతమె, దళితులను పైకిరావాలని చేసె ఉద్యమం
అంబేద్కర్ వాదులు అనుసరిస్తున్న మార్గాలు ఆగమ్యగోచరం
కులరిజర్వేషన్ పొంది కొందరు అగ్రవర్ణాల ఆధిపత్యంలో చేరడం
రిజర్వేషన్ లో ఉద్యోగము పొంది సాటివారిని వెన్నుపోటు పొడవడం
అంబేద్కర్ వాదం మానవ వాదం, అందరిలో అదే విశ్వజనితం
భారతజతీయ సాంఘికోద్యము చరిత్రలో డా: అంబేద్కర్ కు విసిష్టస్థానం
డా: అంబేద్కర్ ఆశయాలను మనస్సాక్షిగా పజల్లోకి తీసుకు వెళ్లుదాం
జారవిడిచిన హక్కుల్ని నిరంతరం పోరాటం ద్వారా పొందగలుగుదాం
డా: అంబేద్కర్ నాయకత్వం హక్కుల వళ్ళ దేవాలయాల్లోకి ప్రవేశం
దళితులు దుస్తితికి ఆర్దిక వెనక బాటు తనం కారణం
ప్రజ్ఞ, సమత, కరుణ, త్రిశసరణాలపై ఉండటమే అందరి ఆదర్శం
డా: అంబేద్కర్ వ్రాసిన గ్రంధాలు అన్ని ప్రజలందరికి ఆదర్శం
డా: అంబేద్కర్ దళితుల గుండెల్లో సూర్యుడై ఉండు స్థిరనివాసం
దళితులందరు ఏకమై అగ్రకులాలతో సమాన మవ్వాలి
దళితులు ఆర్ధికంగా రాజకీయ్యంగా, సామాజికంగా బలపడాలి
దళితులు పాలితులుగా కాక, పాలకులగా ఎదగాలి
డా: అంబేద్కర్ మనమిచ్చే ఘనమై నివాళిగా గుర్తించాలి
--((*))--1920-01-31 నాడుదళితుల వికాసంకొరకు మానినాయాక్ ప్రతిక ప్రారంభం

భీంరావ్ రాంజీ అంబేడ్కర్
భారతీయ రాజకీయ ఉద్యమకారుడు
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.
బాల్యము
యువకునిగా అంబేద్కర్[1]
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) [2] [3] రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ మరియు చివరి సంతానంగా జన్మించాడు[4] . అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) వారు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహార్ కులానికి చెందినవారు[5]. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వికులు పనిచేశారు. వీరి తండ్రి భారత సేవలు మోహో సైనిక స్థావరంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశాడు. [6]
భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.
బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్య: మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్‌రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్‍కు రాలేకపోయారు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్‌రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్‌రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులంపేర భీమ్‌రావ్ ను అవమానాలకు గురిచేశారు. రామ్‍జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరాడు. భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు.
విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష: బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడింది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది
మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు! కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు.
దళిత మహాసభ (1927) - మనుస్మృతి దహనము: 1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండినది: అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయ కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. ' అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు. 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ 'మనుస్మృతి'ని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కల్గించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అపుడపుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు. అంతేకాదు, మనుస్మృతి లోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు.
ఆంటరానితనానికి అంబేద్కర్ చూపిన పరిష్కారం: భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తీ స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజము యొక్క ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమజములో ఉన్నదని ఆయన సమర్ధించాడు. అయితే అంటరానివారుగా చూడబడుతున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొనెను. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలపై గాంధీ vs అంబేద్కర్- పూనా ఒప్పందం: 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమీషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931, మరియు 1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకు అంబేద్కర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయము కుదరక పోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలు ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధి శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నారు. ఈ ప్రకటన గూర్చి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. అంబేద్కర్ పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్ కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరాని తన నిర్మూలనలో గాంధి కున్న చిత్తశుద్ధి మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధి ఉద్యమమునుండి బయటకు వచ్చి ప్రత్యేఖముగా దళిత సమస్య పరిష్కారానికి ఆలిండియా డిప్రేస్సేడ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసారు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్: రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు
బౌద్దమును స్వీకరించుట: అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. . 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.
డా.బి.ఆర్.చదువులు:
Dr.Ambedkar * (1891-1956) * B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D., D.Litt., Barrister-at-Law
B.A. (ముంబాయి విశ్వవిధ్యాలయం) M.A. (కోలంబియా విశ్వవిధ్యాలయం) M.Sc. ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్) Ph.D. (కోలంబియా విశ్వవిధ్యాలయం) D.Sc. ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్) L.L.D. ( కోలంబియా విశ్వవిధ్యాలయం) D.Litt. ( ఉస్మానియా విశ్వవిధ్యాలయం) Barrister-at-Law (గ్రేస్ ఇన్ లండన్) law qualification for a lawyer to practice law in royal court of England.
..
డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు
మహారాష్ట్ర ప్రభుత్వం (బొంబాయి), విద్య శాఖా వారు డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములను వివిధ సంపుటములో ప్రచురించారు. 1994 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటములను తెలుగులో అనువదించి ప్రచురించారు.
సంపుటం సం.
వివరణ
సంపుటం 1
భారతదేశంలో కులాలు: వాటి విధానాలు, పుట్టుక మరియు అభివృద్ధి మరియు 11 ఇతర వ్యాసాలు
సంపుటం 2
బొంబాయి చట్టసభలో, సైమన్ కమిషన్తో మరియు రౌండ్ టేబుల్ సమావేశంలో డా. అంబేద్కర్ ఉపన్యాసాలు,1927–1939
సంపుటం 3
హిందూమతం తాత్వికత; భారతదేశం మరియు [[కమ్యూనిజం|కమ్యూనిజానికి ముందు కావలసినవి; విప్లవం - ప్రతి విప్లవం; బుద్ధుడు లేకకారల్ మార్క్స్
సంపుటం 4
హిందూతత్వంలో చిక్కుప్రశ్నలు, డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం[7], హిందూమతంలో చిక్కుముడులు [8]
సంపుటం 5
"అంటరానివారు మరియు అంటరానితనం పై వ్యాసాలు" డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం[9]
సంపుటం 6
బ్రిటీషు భారతదేశంలో ప్రాంతాలఆర్ధికబలం పరిణామం
సంపుటం 7
"శూద్రులంటే ఎవరు? అంటరానివారు "
సంపుటం 8
"పాకిస్తాన్ లేక భారతదేశ విభజన", డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం[10]
సంపుటం 9
అంటరానివారిగురించి కాంగ్రెసు మరియు గాంధీ చేసినకృషి. గాంధీ మరియు అంటరానివారి ఉద్ధరణ. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9 -ఆచార్య పేర్వారం జగన్నాథం[11]
సంపుటం10
గవర్నర్ జనరల్ కార్యనిర్వాహకమండలి సభ్యునిగా డా.అంబేద్కర్ 1942–46
సంపుటం 11
"బుద్ధుడు మరియు అతని ధర్మం". డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథం[12]
సంపుటి12
"అముద్రిత రచనలు: ప్రాచీన భారత వాణిజ్యం; చట్టాలపై వ్యాఖ్యలు, వీసాకొరకు వేచివుండుట మరియు ఇతరాలు. "డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-12 (అచల బోధ సిద్దాంతము) [13]
సంపుటం13
భారతదేశ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా డా. అంబేద్కర్
సంపుటం14
(2 భాఘాలు) డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరయు హిందూ కోడ్ బిల్
సంపుటం15
భారతదేశపు మొదటి స్వతంత్రా న్యాయశాఖ మంత్రి మరియు పార్లమెంట్ లో ప్రతిపక్షసభ్యునిగా డా.అంబేద్కర్ (1947–1956)
సంపుటం16
పాలి వ్యాకరణం -డా. బాబాసాహెబ్ అంబేద్కర్
సంపుటం17
(భాగం 1) డా.బి.ఆర్ అంబేద్కర్ మరియు అతని సమతా విప్లవం –మానవహక్కులపై పోరాటం . మార్చి 1927 నుండి 17 నవంబర్ 1956 వరకు కాలక్రమంలో ఘటనలు
(భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్ మరియు అతని సమతా విప్లవం –సామాజికరాజకీయ మరియు మతపరమైన చర్యలు .నవంబర్ 1929 నుండి 8 మే 1956 వరకు కాలక్రమంలో ఘటనలు
(భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్ మరియు అతని సమతా విప్లవం –ఉపన్యాసాలు.1 జనవరి నుండి 20 నవంబరు 1956 వరకు కాలక్రమంలో ఘటనలు
సంపుటం18
డా.thoka sahebఅంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో (భాగం 1)
సంపుటం19
డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో (భాగం 2)
సంపుటం 20
డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో (భాగం 3)
సంపుటం 21
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఛాయాచిత్రమాలిక మరియు లేఖావళి
మూలాలు
↑ Frances Pritchett. "youth". Columbia.edu. Archived from the original on 25 June 2010. Retrieved 17 July 2010.
↑ "[[జాతిరత్నం]] దళితవైతాలికుడు డాక్టర్ బి,ఆర్,అంబేద్కర్". సూర్య. 2013-12-15. Retrieved 2014-01-29. URL–wikilink conflict (help)
↑ Jaffrelot, Christophe (2005). Ambedkar and Untouchability: Fighting the Indian Caste System. New York: Columbia University Press. p. 2. ISBN 0-231-13602-1.
↑ Pritchett, Frances. "In the 1890s" (PHP). Archived from the original on 7 September 2006. Retrieved 2 August 2006.
↑ Encyclopædia Britannica. "Mahar". britannica.com. Retrieved 12 January 2012.
↑ Ahuja, M. L. (2007). "Babasaheb Ambedkar". Eminent Indians : administrators and political thinkers. New Delhi: Rupa. pp. 1922–1923. ISBN 8129111071. Retrieved 17 July 2013.
↑ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం
↑ "Riddle In Hinduism". Ambedkar.org. Retrieved 2010-07-17.
↑ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం
↑ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం
↑ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9ఆచార్య పేర్వారం జగన్నాధరావు

No comments:
Post a Comment