Friday, 28 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -24/9 (14-08-2020)


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
 

మనసులో ముసుగు - చిన్న కధ దా  

 వేసవిలో ఉష్ణ గాలుల ప్రభావము వల్ల, శరీరమునకు అనుకోని విధముగా కప్పివేస్తూ మనసును శరీరమును వెచ్చగా మార్చు చున్నది, అనగా మనసు ప్రభావముగా పనిచేయక ప్రకృతి ప్రభావమునకు లొంగి పోయి హృదయంలో ఉన్న రక్తము ఉడికి చమట రూపములో బయటకు వస్తున్న జలము మనసును చికాకు పరిచేదే మనసులో ముసుగు.

మనసుకు పున్నమి వెన్నెల, చల్లని గాలి చేరగా శరీరము పులకింత చెందగా అనుకోని శరీరములో కొన్ని స్పందనలు బయటకు చెప్పుకోలేక, వాటిని సుఖము వైపు తిప్పుకోలేక, పకృతి సౌరభాన్ని అనుభవించలేక, తోడు ఉన్న తోడు లేనివాడిగా, చకటిని తరిమే వెన్నెలను పంచుకోలేక వెన్నెల నీడలాగా ఏవిధముగా పనికిరాని వానిగా మనసులో ముసుగు ఏర్పడుతున్నది .         
     
కొందరు ఆశలవలయం లో చిక్కి తెలివిలేని వానిగా ప్రవర్తించి తనుచెప్పునదే వేదమని వా దించి, తన మాటను ధిక్కరించారని పదే పదే అనుకొని, తనలో ఉన్న భావాలన్నీ వ్యక్తపరిచి, కాల గమనంలా తిరుగుతూ కాలక్షేపంతో బ్రతికేవారు కొందరుందురు వారి మనసులో ముసుగు ఉంటున్నది.

మరికొందరు జంతువుల్లాగా కష్టపడుతూ, తను చెప్పాలనుకున్నది చెప్పుకోలేక మూగ వానిగా మారి, తను మదన పడుతూ ఇతరుల బాధను అర్ధం చేసుకోలేక చేతికి దొరికినవి తింటూ, వీలు ఉన్నచోట శయనిస్తూ దొడ్రికిన నిరు త్రాగుతూ ఎవ్వరు లేని వాడిగా, మొండిగా బ్రాతుకు లాగే వారి మనసులో ముసుగు ఉంటున్నది      

సరస్సులోని  కమలం తన్మయత్వంతో వికసించింది, గూటిలోని చిలకా గోరింకలు గుసగుసలాట మొదలైనది, చిగురాకు కదలిక మొదలైంది, కానీ మానవుని మనసులో ఏమున్నదో మాత్రమూ ఎవ రూ తెలుపలేరు, పైన ఒక మాట లోన ఒక మాట నడుస్తున్నది, పెదాలతో ఒకమాట, హృదయంతో మరోమాట చెప్పేవారు కొందరుంటారు, వారు కేవలము ఆశా సౌధములో మునుగుతూ గొప్పవారిగా నటిస్తూ మనసును మునుగులోకి మార్చి బ్రతుకుతారు.       

 గంగమ్మ తల్లి కిరణవెలుగుతో నూతనోత్సాహముతో పరవళ్లు తొక్కుతూ కదలిక ప్రారంభిస్తుంది
సకలజీవకోటికి ప్రాణా ధారమవుతుంది, కానీ మానవుడు సాటి మనుష్యులకు సహాయము చేయుటకు ముందుకురారు, ముందుకు వచ్చినా మన స్ఫూర్తితో చేయరు, వారి మనసు ఒక వైపు చేతలు మరోవైపు మానవులు జీవనదాతలుగా మారక, మనసు ఒక వైపు, మమత మరోవైపు, ధనము చుట్టూ తిరుగుతూ మనసులో మునిగి ఇవిగా మాత్రమే బ్రతుకుతున్నాడు.    

జీవకోటి కనులు విప్పి ప్రకృతినిచూసి ఆనంద పారవశ్యంలో కర్తవ్య నిర్ధారణకు వేళైనది అని ముందుకు వచ్చే వారెందరో మిరే తెలపండి .
       
   "అంతరంగాల భావం మానవులు అర్ధం చేసు కోలేరు, ముఖ్యముగా ఆడవారి భావాలు ప్రత్యక్షముగా చెప్పలేరు, అవసరము వచ్చినప్పుడు మనసులోని ముసుగు తెలియపరచి వప్పించు కోవటం స్త్రీలలో ఉన్న ప్రత్యేకత, దానికి లోబడి అనుకరించుటే భర్తగా భవిషత్ మార్గం చూపే విధముగా ఇరువురి కలసి నిర్ణ ఐమ్చుకొని మనసులోని ముసుగును తొలగించు కోవటం జీవితానికి నిజమైన మార్గం.  అని ఆశ్రమానికి వచ్చిన వారితో చప్పటం ముగించారు  గురువుగారు. 

అనురాగం ఇంటర్నెట్టులో 
అవగాహన వెబ్సైడ్ లో 
అలక ... కరంటు 
ఆనందం ..... నిత్యాన్వేషణ 

ఆడదాని వయసు - మొగవాని సంపాదన 
సుఖము పొంది లేదనుట - సుఖము కోసం వెంపర్లాడటం 
ఆడదాని కోపం మొగవాడి ముద్దు తో సమానం 
మొగవాడి ప్రేమ నీటి బుడగలాంటి దనుకోవడం 


2 comments: