ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
బాబు మనవృత్తి విద్యపై బ్రతుకు
సాగించటం చాలా కష్టముగా ఉన్నది, నేను ఇప్పటి దాకా నిన్ను నీ చెల్లిని
చదివించ గలి గాను, చదువుకు తగ్గ ఉద్యోగము సంపాదించు కొని రాగలవని నిన్ను
ఆశీర్వదించి పంపిస్తున్నాను అని చెప్పాడు తండ్రి, నీకు ఎటువంట పైకము కూడా
సర్ద లేను అంటూ నీ మెడలో ఈ ఆంజనేయ స్వామి వెండి బిళ్ళ (లాకెట్) ఎర్రతాడులో వేసి ఇస్తున్నాను, ఇదే
నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పి నీకు కావలసిన బట్టలు తీసుకోని ఇక బయటకు
నడువు అన్నాడు మాధవ రావ్.
అప్పుడే లోపలనుంచి భార్య భారతి వస్తు ఏం చేస్తున్నారు, మీరు చేతి కందిన కొడుకుని బతకమని పంపిస్తున్నారు అన్నది, నాకు ఇంకా ఓపిక ఉన్నది మనబాబు అసమర్ధుడుగా ఇక్కడ ఉండుట కన్నా సమర్థుడుగా 2 సంవత్సరాళ్లలో తిరిగి రాగలడు, ముందు వాడ్ని దీవించి విజయుడుగా తిరిగి రమ్మనమని చెప్పు అన్నాడు. భర్త మాట ఎదురు చెప్పక అమ్మవారి కుంకుమ పొట్లామ్ ఇచ్చి రోజూ పెట్టుకో అని దీవించి పంపింది
బాబు నేను చెప్పేంత దానిని కాదు ఎదో వానాకాలపు చదువులు మావి అయినా నాకు తెలిసిన విషయాలు తెల్పెద
దేహ నీతి నెరిగి దేశాల బుద్ధితో
క్రమత మమతా జాలి కరుణ జూపు
నరులు మార్పు చెందు ఆవేశపడకుండు
నిత్య శక్తి నీవు సలుపు మాట
రసమయ కధ అయిన రామాయణంబును
హృద్య మైన రీతి ఉత్తమముగ
తీర్చెను భవభూతి త్రికరణ శుద్ధిగా
ధర్మ నీతి మరచి బతక మాకు
అట్లాగే అమ్మ
తల్లి తండ్రులకు నమస్కరించి చిన్న బ్యాగు చంకను పెట్టుకొని బయట ప్రపంచం లోకి అడుగు పెట్టాడు మాధవ్. నడిరోడ్డుమీద నడుస్తూ బయలు దేరాడు, అప్పుడే వెనుక బస్సు వేగముగా ప్రక్కనుండి పోవటం రోడ్డుకు ప్రక్కన ఉన్న చెట్టుకు గుద్దుకోవటం జరిగింది . అప్పటికప్పుడు మాధవ్ 108 కు 100 కు ఫోన్ చేసాడు. చేతనయినంత వరకు కొందరిని రక్షించ గలిగాడు.
ఒక్క సారిగా బస్సులోని వారందరు కేకలు పెట్టారు, మాధవ్ అక్కడే ఉన్న ఒక ఎద్దుల బండి నెట్టుకుంటూ వెనక అద్దాలను పగల కొట్టాడు, కొందరిని దించ గలిగాడు మరి కొందరకి గాయాలు జరిగాయి . దీనికి కారణం అతి వేగం, నిద్రతో నడపటం అన్నారు
అప్పుడే పోలీసువారు, ఫై రింజన్, రక్షకదళం, ప్రక్క ఊరి జనం రావటం అందరిని సురక్షణ దిశగా మార్చటం జరిగింది.
భాష స్వేచ్ఛ మరియు - భూషణా స్వేచ్ఛయు
వ్యక్తి మనసు స్వేచ్చ - వ్యక్తి స్వేచ్చ
సమంత మమతా శాంతి సర్వుల ఆకాంక్ష
అన్న జనని పలుకు సర్వ రక్ష
అలా తల్లి మాటలు గుర్తుచేసుకున్నాడు
అక్కడ ఉన్న ప్రజలు ఇలా అనుకున్నారు
గుండె కండ రాలు కదలి భయము తెచ్చె
నిద్ర లేని వాహ నంబు పరుగు
నరుల హృదయ ధమని సిరయు పనులు ఆగు
భయము గుప్పె టంత పట్టి ఉంచె
ఇలా అనుకున్నారు వారు
ఈ కధ ఇంకా ఉంది ... 2
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..
నిరుద్యోగి ప్రయాణం -2 (రోజువారి కధ )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ బతుకు తెరుఫుకోసం బయలు దేరి దారిలో బస్సు ప్రమాదాన్ని రక్షించాడు ఇక చదవండి (2 )
బస్సులో అందరితో పాటు నన్ను రక్షించి నందుకు నీకు కృతజ్ఞతలు తెలుసుపుతున్నాను. ' '
నీవు శక్తి వంచన లేకుండా నీ వంతు నీవు సహాయము చేసి నావు, నీకు నేను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వలేను కానీ రెండు వాక్యాలు చెపుతాను, ఋణం ఉంచు కోకూడదు, అందరూ ఉన్న లేని వాడిగా బతికే లోకం ఇది నా స్థితి కూడా అదే, యవ్వనంలో కొంత సంపాదించాను, అందరికి సహాయము చేయాలని ముందుకు పొయ్యాను చివరికి నాకు ఈ గతి పట్టించారు. ఇది వారి తప్పు కాదు ఆధునికంలో బతకలేక అనుభవాలను చెప్పుకొనే అవకాశము లేక ప్రపంచాన్ని చూద్దామని బయలు దేరాను నీ పుణ్యమా అని బతక గలిగాను ఇంకా ఈ భూమాతకు ఋణపడి ఉన్నాను
మీరేం చదివారు నా చదువులతో పనేముంది నాయనా నోరు మంచి దైతే ఊరు మంచిదౌతుంది కదా.
నీ ప్రయాణము ఎటు ఇంకా తెలియదండి
తెలియక పొతే మంచిది బాబు . తెలిసిందనుకో చేయలేదని ఒక బాధ, చేసాక ఏమను కుంటున్నారో అని మరొక బాధ, తప్పు చేస్తున్నామని మరొక బాధ ఈ భాదలు అన్నిటిని తప్పించు కోవాలంటే మనుష్యులు తేలిక భావంతో పోతే మంచిది అంత ఆలోచించ వద్దు, అసలు చేయ కుండా ఉండ వద్దు'.
ఆయినా నేచెప్పేది విని నీ ధర్మం నిర్వహించు
సంస్కృతంలో ఈ విధంగా తెలిపారు అంటూ చెప్పఁటం మొదలు పెట్టారు.
అవిద్య ' లక్షణం (విపరీతబుద్ధి, అశుచి, వాసనా, ఆత్మ )
అనిత్యాశుచిదుఃఖానాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా !!
(యోగ . సాధనపాదము సూ.)
అనిత్యమైన సంసారంలో దేహాలను నిత్యమని - అంటే కనిపించు , వినిపించు తెలుసుకోదగ్గ కార్యజగత్తు ఎల్లప్పుడు ఉందనీ యోగబలంలో దేవతల శరీరాలు ఎల్లప్పుడూ ఉంటాయనీ అనుకొంటూ విపరీత బుద్దిని కలిగి ఉండటం అవిద్యలో మొదటి భాగం.
'అశుచి' అంటే మలమయాలైన స్త్రీ పురుషుల శరీరములందు మిథ్యా భాషణాలు ,దొంగతనం మొదలైన అపవిత్రాలను పవిత్రాలుగా అనుకోవడం రెండవ భాగం.
అత్యంత విషయ వాసనారూప దుఃఖాలను సుఖమనీ అనుకోవడం మూడవ భాగం.
అనాత్మయైన దానిలో ఆత్మ భావాన్న ఉంచడం అవిద్యలో నాల్గవ భాగం.
ఈ నాలుగు విధాలైన విపరీత జ్ఞానాన్నే ' అవిద్య ' అంటారు.
ఇవి అన్ని మన పుర్విలు చెప్పినవే మరలా గుర్తు చేసాను.
ఇంకా చెప్పండి గురువు గారు
బాబు ఎప్పుడు భోజనం చేసావో ఈ నాలు గు పండ్లు తిను నాయనా, నేనే మీకు పెట్టలండి మీరు నాకిస్తున్నారు.
ఇవ్వాళ నువ్వు రేపు ఎవరో మరెవరో
మీ మాటలు బాగున్నాయండి
మాటలు బాగుంటాయి ఆచరణయే కష్టం ...
ఏంటి గురువుగారు కళ్ళంబడి నీళ్లు తిరుగుతున్నాయి
ఏమీ లేదు బాబు చిన్నప్పుడు మా అమ్మ పాట గుర్తు కొచ్చింది,
ఒక్క సారి పాడండి మనసు తేలికవుతుంది
సరే విను బాబు
నీముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను
నీ చిరు దరహాస మాటలను మరువ లేను
నా మదిలో నీ ఉనికిని విడువ లేను బాబు బాబు
నీ మనసు వేదన తగ్గేందుకు పడుతున్నాను
నీ ఒక్క ఓదార్పు కోసం జీవిస్తున్నాను
నా బ్రతుకులో అనుక్షణం నీకోసమే ఉన్నాను
అన్వేషణా, ఆరాధనా తప్పుట లేదు బాబు బాబు
నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను
నీ ఏడుపు ఎలామార్చాలో తెలియని భ్రమలో ఉన్నాను
నీ సందిగ్ద మనస్సు మార్చాలని పాడు తున్నాను
నీ కొరకు నిరంతరం శ్రమిస్తాను
నీ కొరకు ప్రేమ అందిస్తాను బాబు బాబు బాబు
నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను
ఇప్పుడు నాకు పంచ భూతాలు ఆప్తులు
తరువులు నాకు దోస్తులు
చరిత్రలో అల్లన మెల్లన వలపులు
చల్లని వెచ్చని కలిపే హృదయం నీది బాబు బాబు
చీకటి వెన్నెలలో మరిపిస్తాను
అల్లరి చేసే వయసు నీది అయినా వదలలేను
పులకించే కనులతో నిన్ను హత్తుకొని ఆడిస్తాను
నవ్వును తెప్పించే హృదయం నదీను బాబు బాబు
చిన్న పిల్లాడిలా ఒకటే ఏడుపు ఏడుపు ఏడుపు ......
ఈ కధ ఇంకా ఉంది ... 3
ప్రాంజలిప్రభ - అంర్జాల పాత్రిక
నిరుద్యోగి ప్రయాణం -3 (రోజువారి కధ )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..
గూటికి చేరిన పక్షులు లాగా అందరు వెళ్లి నట్టున్నారు మనము కూడా ఏదైనా దారి పట్టాలికదా
అవునది మీతో మాట్లాడుతుంటే,
మా గురువు గారు చెప్పి నట్లు ఉంది
మీ మాటలు ఇంకా వినాలనిపిస్తున్నది.
అవును నీకు ఆత్మా రాముడు అరవటం లేదా,
వారెవరు గురువుగారు.
వారెవరు కాదు బాబు నీలో దాగి ఆత్మ ఆకలి, ఆకలి, అని అరుస్తుంది
వీలు చిక్కినప్పుడల్లా పేగులు ఆరుస్తాయి,
అవునా
కాస్త అలా బయలు దేరి ఏదన్న భోజన శాలలో తిని ఎవరి దారి వారిది
నాదగ్గర డబ్బులు లేవండి
నా దగ్గర ఉన్నాయి కదా
నువ్వేమి ఖంగారు పడకు అంతా మనమంచికే అని ముందుకు పోదాం
అట్లాగే గురువు గారు
టిఫిన్ బాగున్నదా
బాగానే .... ...
ఆకలికి రుచి ఎరుగదు కడుపు నిండితే అన్నీ వంకలే
ఏది ఏమైనా కొద్దిగా ఓపిక వచ్చింది ఇక నడుద్దామా
కాసేపు ఇక్కడే కూర్చుందాం గురువు గారు
ఏమైనా చెప్పండి
చూడు బాబు కాల చక్రం తిరుగుతుంది నీకు కనబడుతుందా కనబడదు, గాలి ప్రాణుల్ని రక్షించుతుంది నీకు కనబడుతుందా
కనబడదు
అదే బాబు దేవుని లీల
అర్ధం కాలేదు
కుంభవృష్టి హోరును, ఉరుము తున్న ప్రకృతిని, దారి ఎదో తెలుసుకోలేని ప్రాణిని - ఎవరు ఆపగలరు .
నింగినందు ఒకవైపు మేఘ మాల, మరోవైపు కాంతి రక్తం తో మరిగే ప్రాణిని, కవితా శక్తితో ఎవరు ఆపగలరు.
వానను దోసిల్లతో పట్టు కుంటాం, నీటి ఉరవడిని ఆపలేం, ఉరుములు తో వచ్చే పిడుగు జారటం, మనిషిలో పెరిగే కోపాన్ని, ఎవరు ఆపగలరు.
కారు చీకట్లో పొద్దు తెలియని స్థితిలో తిండి లేక, కట్టు బట్ట లేక, ఉండే ఇల్లు లేక, ఎండ వానలో చిక్కన ప్రాణులను, గాలికి కూకటి వేళ్ళతో లేచే చెట్లనుఁ, పక్షములను ఎవరు ఆపగలరు
మోయలేని "భారం" బరువు గా మారినప్పుడు, ప్రేమలో హృదయం విరిగి నప్పుడు,
బరువుని మోసే, ప్రేమను భరించే శక్తి, హృదయాన్ని శబ్దం చెయ్యొద్దని ఎవరు ఆపగలరు
వాన చినుకు లేందే మనము ఉండలేం , అన్నం మెతుకు గొంతులో పడందే మనము బతకలేం , మనిషి మనిషి తోడు లేకపోతె జీతమే సాగించలేం అయినా నీరు, నిప్పు, నింగి, గాలి, నేల, వాని పని అవి చేసిన ప్రాణులు బాధపెట్టకుండా ఎవ్వరు ఆపగలరు.
ఈ మనసు ఆప్యాయత అనే ఊబిలో ఇరుక్కుంటుంది, తెలివితో బయఁటకు రావాలని విశ్వసిస్తుంది, ప్రాణులకూ చీకటి వెలుగులు, సుఖ దుఃఖాలు రాకుండా ఎవ్వరు ఆపగలరు
పువ్వుల పరిమళాలు, ఎడారికి వెన్నెలంతా అడవికి మారినట్లు, మనిషి నోరువిప్పి పలికినా దిక్కులేని స్థితిని, చూసే వారు నమ్మే వారు ఉన్నా, అబద్ధాన్ని, ఆశను - ఎవరు ఆపగలరు.
యదార్ధం తెలుసుకున్న రాజకీయం, రాజీ పడి కన్నీరు కార్చుట, వాగ్దానాల ఒరవడిలో ధనాన్ని ఖర్చు చేయటం, మనుష్యుల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా - ఎవ్వరు ఆపగలరు
అందుకే నేను అంటాను చేయి చేయి కలుపుదాం, ఒకరి కొకరం సహాయం చేసుకుందాం
మానవతా దృక్పధంతో బ్రతుకుదాం, అగ్నిలో, వర్షాల్లో, చిక్కిన వారిని రక్షించి కాపాడుదాం
దీన్ని ఎవ్వరు ఆపలేరు, సూర్య కిరణాలను ఎవరు ఆపగలరు, పరుగెత్తే హృదయాన్ని ఎవరు ఆపగలరు. కాలాన్ని ఎవ్వరు ఆపగలరు, భగవంతుని లీలలు ఎవ్వరు ఆపగలరు, జరుగుతున్నా కాలాల్ని చూస్తూ చేతనయినా సహాయం చేస్తూ కలసి మెలసి బతుకు సాగిస్తున్న వారిని ఏ దుష్ట శక్తి ప్రవేశించలేదు, ధర్మాన్ని కట్టుబడిన వారిని ఎవ్వరు ఆపలేరు.
రక్షించే గుణాన్ని ఎవ్వరూ ఆపలేరు, స్నేహాన్ని ఎవ్వరూ ఆపలేరు, ప్రేమను పంచే, సహకరించే ఆర్ధిక వనరుల సహాయాన్ని ఎవ్వరూ ఆపలేరు.
సహాయం చేయు నీ లక్ష్యాన్ని ఎవరు ఆపలేరు, ఈ విషయాలన్నీ నీకు చెప్పొద్దని ఎవ్వరు ఆపలేరు. మనిషి మనిషి తోడుగా బ్రతికేవారిని, ప్రాణ మడితోనే ఆ భగవంతుడు ఆపగలడు
భూమి నూకాలున్నంతవరుకు, ఈ గుండె ఆగేవరకు ఉద్యోగి అయినా, నిరుద్యోగి అయినా సాగి దేశానికి సహాయ పడుతూ కర్తవ్య నిర్వాహణముతో ముందుకు సాగి పోవాలి దాన్ని ఎవ్వరూ ఆపలేరు.
గురువు గారు ఎన్నో తెలియని విషయాలు తెలిపారు చాలా సంతోషం, మీ కాశీ ప్రయాణపు బస్సు వచ్చి నట్లుంది, మీకు ధన్యవాదములు చెప్పఁటం తప్ప ఏమీ చేయలేని నిరుద్యోగ అభాగ్యున్ని మన్నిస్తారని ఆశతో శెలవు చెపుతున్నా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు .... ... ...
ఈ కధ ఇంకా ఉంది ... 4
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..
ప్రాంజలిప్రభ - అంర్జాల పాత్రిక
నిరుద్యోగి ప్రయాణం -4 (రోజువారి కధ )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, 6281190539
మాధవ్ ఆలా రోడ్డు మీద నడుస్తూ పోతున్నాడు. ఏంచెయ్యాలి, ఎలా బతకాలి, ఈ లోకాన్ని ఎలా అర్ధ౦ చేసుకోవాలి అనుకుంటూ ఉండగా వేగంగా మోటార్ బైకులు శబ్దం విని పక్కకు జరిగాడు అదే సమయాన ప్రక్కనే ఉన్న ఒక ముసలమ్మా నెమ్మదిగా నడుస్తూ పోతున్నది. అవ్వ ఎటు పోతున్నావు అని అడిగాడు మాధవ్ చూడు బాబు నీవెవ్వరో కొత్తగా నన్ను పలకరిస్తున్నావు అంటూ ఒక్కసారి మాధవుని ప్రక్కకు లాగింది మాధవకు కళ్ళు తిరిగినంత పనైంది. ఎం జారుతున్నాదో అర్ధం కాలేదు. దూరంగా రెండు బైకులు ఒకదాని కొకటి గుద్దుకొని నలుగురు ప్రక్క ప్రక్కనే పడిపోయారు, వారిని లేపే మూగారు ప్రజలు, అవ్వే నన్ను రక్షించింది, ఆ బైకు నన్ను తాకేది అప్పుడు నా పరిస్థితి ఎలాఉండేదో అని అన్నాడు అవ్వతో.
చూడు బాబు యవ్వన విన్యాసాలు ఇట్లాగే ఉంటాయి, పిల్లలపై ప్రేమ పెంచు కుంటారు తల్లి తండ్రులు వారు అడిగిన వణ్ణి కొనిపెడతారు వారి ప్రవర్తనలు చూసి ఏమి అనలేక బాధ పడతారు, వాడి కర్మ వాడు అనుభవస్తాడు, ఎన్ని సార్లు చెప్పినా వినడు అంటారు కొందరు, వాడి చేసే చేష్టలు చూసి ఏమీ అనలేక మావాడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు అని చెపుతారు.
అవ్వా నన్ను రక్షించ బోయి నీ సంచి లాంటిది క్రింద పడింది. అందరూ నన్ను వదిలించు కున్నారు నేను మాత్రం ఇది పట్టుకొని వేలాడుతున్న అదే నాకు కొండంత ధైర్యం ఇస్తున్నది. నాకు దారి చూపుతుంది.
అవ్వా దీనిలో ఏమున్నాయి
నీవే చూడు
ఏమి లేవనుకుంటాను
సరిగ్గా చూడు
ఆ ఉన్నాయి
12 రాగి పైసలు
ఇంకా ఏమున్నాయి హనుమంతుని ఫోటో
ఏమిటవ్వ ఈ ఫోటో పైసలు కధ
చెపుతా బాబు ఏమనుకోకపోతే ఆబంకులో టీ అమ్ముతారు ఓ కప్పు టి నువ్వు త్రాగి నాకు తెస్తావా.
తెస్తానవ్వా నువ్వు ఇక్కడే కూర్చో అని బంకు దగ్గర కెళ్ళాడు.
బంకు వాడు ముస్సల్ది ఏమైంది నువ్వు వచ్చావు, నువ్వెవరు అని అడిగాడు
వివరాలు నీకు అవసరమా
ముందు టీ లు ఇవ్వు
అబ్బో పిల్లోడు ఇంతలేడు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటూ గొణిగి టి పోసి ఇచ్చాడు
డబ్బులు తీసుకోవా
వద్దులే బాబు ఈ టీ నే కదా అవ్వకు తీసుకెళ్ళు అన్నాడు
వాడి మాటలకు ఏమీ అర్ధం కాకా రెండు కప్పులు పట్టుకొని అవ్వకు ఒక కప్పుఇచ్చి మరో కప్పుతో టీ త్రాగుతున్నాడు మాధవ్
అవ్వా ఆ టీ వాడు ముందు దురుసుగా మాట్లాడి తర్వాత డబ్బులక్కరలేదన్నాడు
వాడు నాకొడుకు బాబు వీడు కాక ఇంకా ముగ్గురున్నారు వాళ్ళ కధలు ఇప్పుడు నీకు చెప్పి బాధ పెట్టడం, నేను బాధ పడటం నాకు ఇష్టం లేదు.
సరే అవ్వ
ఆ సంచి కధ చెపుతావా
" బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన సంచి పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో పెట్టుకున్నాను . "
.
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భర్త చాలా అందగాడు నాకు బావ అంటే చాలా ప్రేమ అపుడు బావ ఫోటో నా పర్సులో పెట్టుకున్నాను .
.
ఇక జీవిత సమరంలో నాకు కొడుకులు పుట్టారు . వాళ్లంటే నాకు చాలా ఇష్టం . వాళ్ల కోసం నేను ఉద్యోగం చేసాను
ఏమి మీ ఆయన ఉద్యోగం చేయడా
ఎందుకు చెయ్యడు చేస్తాడు జీతమంతా కల్లు, సారాయి దుకాణాలకు ధార పోస్తాడు ఒక వైపు భర్తను పిల్లలను కష్ట పడి వాళ్ళు వేసే వేషాల్ని తట్టుకొని సంసారం సాగించాను.
ఆ చప్పు అవ్వా
ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే, పిల్లలతోను లోకం అన్నట్టుగా గడిపేదానిని . వాళ్ళని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేదానిని . వాళ్ల ని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని మావారికి చాలా కోపం వచ్చేది పిల్లలు పుట్టాక నన్ను దూరం పెడుతున్నావని . వాళ్లే నా లోకం . అపుడు నా సంచి పర్సులో వాల్ల ఫోటోలు పెట్టుకునే దాన్ని . వాళ్ళ ఇపుడు ఎవరి దారి వారయ్యారు, ఎంత సేపటికి నా పెంక్షన్ డబ్బులకోసం నన్ను ఉంచుకొనేవాళ్ళు నేనంటే నేను ఉంచుకుంటానని అందరు వదిలి పెట్టారు నేను ఇట్లా ఉన్నాను.
అవ్వా కొడుకులు నిన్ను చూసుకోవటంలేదా, సహాయం చేయుటలేదా
ఎం సహాయమంటావు బాబు మనవలు మనవరాళ్లు పెరిగేటప్పడికల్లా, సంపాదన పెరిగేటప్పడికల్లా, నువ్వేం పెట్టావు మాకు అనే ప్రశ్నకు మారారు, వాళ్ళను ఏమి అనలేక నేను బయఁట రూములో ఉంటానంటే ఎవ్వరూ మాట్లాడలేదు . నా భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపొయ్యాడు . ఇపుడు నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా హనుమంతుని ఫోటో పెట్టుకున్నాను (ఆఫొటోలన్నీ తీసివేసి) . ఆయనే నాకు ఇప్పుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికిఆయనే ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో గడుపుతున్నాను . "
ఆ హనుమంతుడే మాకులదైవం నాకు కొండంత ధైర్యం ఇస్తాడు నా కలలోకి వచ్చి నన్ను నీ కొడుకు అనుకోవమ్మా నీకు అన్నీ దగ్గరుండి సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు కలలో. ఇది బాబు ఈ జీవితం ఇంకా ఎన్నాళ్ళో ...... ఈ ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళో ....
అనుకున్నాడు మాధవ్ ..... ..... ....
.--(())--
.ఈ కధ ఇంకా ఉంది ... 4
మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..
మాధవ్
నడక సాగించాడు ఒక పార్క్ వద్దకు చేరాడు అక్కడ పిల్లలు ఆడుకుంటునారు ఒక
బాబు పరుగెడుతూ క్రిందపడ్డాడు, కాలికి బాగా దెబ్బ తగిలింది రక్తం
కారుతున్నది, అందరు భయముతో చూస్తున్నారు అప్పుడే మాధవ్ అక్కడ ఉన్న ఒక
చెట్టు ఆకు రసం తీసి పిండి తనచోక్కా చింపి కట్టు కట్టాడు, కాస్త కాళ్ళు
విదిలించి ప్రక్కన ఉన్న బల్లపై కూర్చో పెట్టాడు, అప్పుడే పిల్లవాడి తల్లి
వచ్చి వీడికి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు పెద్దవాళ్ళతో ఆడ కూడదంటే
వినడు అంటూ గుంజుకుంటూ వెళ్ళింది. అందరూ ఎవరి దారి వారు వెళ్లిపోయారు.
ఎంత సహాయము చేసిన పట్టించు కోని జనం అవును ఇది కలియుగం,
తల్లి మాట గుర్తు చేసుకున్నాడు మాధవ్
చల్ల బడెడి దేహ సంబారముల్ నిల్చు
వణుకు జూపి వేడి వాలు హెచ్చు
క్రియలు జరుప నేర్చు కీడని తలవకు
మెన్నువిరిగి పాన బడ్డ చేయు సేవ
మాధవ్ నడక ప్రారంభించాడు.
చెత్త
తీసుకెళ్తూ రిక్షా ఆగింది బాబు ఈ లైన్ చివరిదాకా నాకు సహాయ పడతావా నీ ఋణం
ఉంచు కొనులే అని జేబులో నోటు తీసి ఇవ్వబోయాడు, మీదగ్గరే ఉంచండి పెద్ద
వారు లాగున్నారు మీకెందుకు ఇంత కష్టము అన్నాడు మాధవ్, నాకు కొడుకు ఉన్నాడు
వాడు చేయడు నన్ను చేయ నీయడు మాట్లాడితే చదువుకు తగ్గ ఉద్యోగము లేదు అంటూ
దేశాన్ని తిట్టి పోస్తూ కుర్రోళ్లతో తిరుగుతాడు. రిక్షాను ఒకవైపు తోస్తూ
ప్రతి ఇంటి గుమ్మం వద్దకు పోయి వారు తెచ్చే చెత్త కవర్లు రిక్షాలో ఉంచటం
చేసాడు. బాబు ఇదిగో ఈ పైసలు తీసుకో అన్నాడు, చూడండి నీకొడుకే చేసాడని
అనుకోండి నాదారిన నేను వెళ్తాను, మంచిది బాబు నీ సహాయమే నిన్ను మంచి
మార్గాన నిలబెడుతుంది అని దీవించాడు.
బాబు నీకో విషయము తెల్ప దలిచాను నీ లక్ష్యం నెరవేరే దాకా అధైర్య పడకు అంటూ
ముసలివాడు ఈ విధముగా కూర్చోబెట్టి చెప్పాడు లోకరీతి
గమ్య మెక్కడో అర్థమే తెలియ లేదు
సౌమ్య భావము ఎప్పుడు వదల లేదు
కర్మ నెవ్వరు తప్పించ లేరు ఎపుడు
ధర్మ మంతయు బతుకుకు మార్గ మవ్వు
బలము లేనప్పుడూ సంధి చేసి బతుకు
సంధి వల్లను తేజస్సు పెరుగు చుండు
కాల్చి నప్పుడే దానివిలువలు తెలియు
బలము తనకన్న తక్కువ వాని పైనె
సముని తో విరోధములు సలపక ఉండు
కాలి బంటు బలము ఉన్న వాని చెలిమి
వద్దు, పచ్చి ఘ టము అదే ఘటము తగిలి
ముక్క లగు చెలిమియు కూడ వద్దు
ఈ కధ ఇంకా ఉంది ... 2
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..
అప్పుడే వెనుక ఒక ఇసక లారీ వచ్చి ఆగింది పనికెళదాం నీవు కూడా వస్తావా అని అడిగారు, మీరు వెంటనే ఆ లారి మీదనుంచి దిగండి, ఇలా ప్రయాణం చేయటం మంచిది కాదు అని హెచ్చరించాడు మాధవ్, వస్తే "రా " లేకపోతే లేదు మాకు నీతులు చెప్పవద్దు అంటూ వెళ్లారు.
నడవలేక
అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఆగడు మాధవ్, ఒకవయసు మళ్ళిన వాడు అక్కడకు వచ్చి
ఆగాడు మాధవ్ అతన్ని మీరు ఇంత ఎండలో పనిచేయటం అవసరమా బాబు నీవు చిన్నవాడివి
రెక్కలు వచ్చిన పక్షులు గూటిలో ఉండవు గుటిలో ఉండేది చిలక గోరింకలే అన్నాడు
అసలు మీరేం చేస్తారు అని అడిగాడు మాధవ్.
అదిగో
ఆ కనబడుతున్న హోటల్ ల్లో ఫలహారాలు భోజనం రడీగా ఉన్నది అనే బోర్డు
పట్టుకొని 12 గంటలనుండి 3 గంటలదాకా నుంచుంటే నాకు నాభార్యకు సరిపడే ఆహారము
ఇస్తాడు అది చాలు మాకు బాబు అన్నాడు.
ఈరోజు నీపని నేను చేస్తాను మీరు ఈచెట్టుదగ్గర కూర్చోండి అని చెప్పి బోర్డు పట్టుకొని ఎండలో నుంచొని అహార పోట్లామ్ తెచ్చి ఇచ్చాడు.
ఈరోజు నీపని నేను చేస్తాను మీరు ఈచెట్టుదగ్గర కూర్చోండి అని చెప్పి బోర్డు పట్టుకొని ఎండలో నుంచొని అహార పోట్లామ్ తెచ్చి ఇచ్చాడు.
బాబు
నేను దీవెనలు తప్ప ఏమీ ఇవ్వలేను అవి చాలు మిమ్మల్ని దింపి నేను వెళతాను,
నేనువెళతాను బాబు ఈప్రక్కనే గుడిసె అన్నాడు. పట్టుబట్టి గుడిసేదాకా దించి
అక్కడ కాసిని మంచినీళ్లు త్రాగి బయలు దేరాడు.
నడుస్తూ పోతున్నప్పుడు ఒక్కసారిగా శబ్ధం విన్నాడు, వెనక్కి తిరిగి చూస్తే చిన్నలారీ ఫుట్ పాత్ ను కొట్టడం లారీ ముందు టైర్ బరష్టవ్వటం జరిగింది.
అసలు
ఏమైనదో కనుక్కుందామని లారిదగ్గరకు వెళ్ళాను. లారీలో కొబ్బరి
బోండాలు ఉన్నాయి. లారీ డ్రైవర్ ఒక్కడే ఉండటం వళ్ళ టైర్ మారుస్తున్నప్పుడు
కష్టపడుతుంటే మాధవ్ కూడా సహాయం చేసి కొత్త టైరును ఎక్కించాడు.
డ్రైవర్ సంతోషముతో ఈ ఐదు వందరూపాలు తీసుకో అని నా చేతిలోపెట్టాడు.
చూడండి
నేను డబ్బు ఆశించి నీకు సహాయము చేయలేదు మానవతా దృక్పధంతో సహాయపడినాను
అన్నాడు, అమాయకుడిలాఉన్నావు నీవు ఈ కలికాలంలో బ్రతకటం కష్టం.
నీ
కష్టాన్ని నేనూ ఉంచుకోలేను అన్నాడు. నేను ఒక పని చేస్తా దానికి నీవు
సమ్మతమై ఒప్పుకోవాలి అన్నాడు డ్రైవర్ .సరేచేప్పు అన్నాడు మాధవ్ . లారీ
ఎక్కు చెపుతా అన్నాడు
ఎక్కాడు మాధవ్ కదులుతున్నది లారీ, డ్రైవర్ నెమ్మదిగా చెబుతున్నాడు.
నేను ఈ కొబ్బరి బొండాలు ఇక్కడ జరిగే సంతలో కొన్ని ఒక వ్యాపారికి కాయ 5 రూపాయాలకు ఇచ్చి మిగతావి పక్కసంతలో వానికి ఇవ్వాలి. ఇంకా మిగులు తాయా
అని అడిగాడు మాధవ్ . ఎందుకు మిగలవ్ 100కు పైగా ఉంటాయి అవి కూడా వాల్లకే
ఇస్తాను డబ్బులు తీసుకుంటాను. మీ వోనరుకు చెబుతావా అని అడిగాడు.
మా ఓనరు కు చెబితే ఊరుకుంటాడా ఊరుకోడు అవి నేను త్రాగుడికి వాడుకుంటా అన్నాడు.
వెంటనే
నీవు లారీ ఆపు నీవు తప్పు చేస్తున్నావు, నీకు ఇచ్చే రోజువారీ బేటా
తీసుకోక, ఈ అక్రమ సంపాదన ఎందుకు దానివళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు
అన్నాడు.
ఒక్కసారిగా బ్రేక్ వేసాడు మాధవ్ మాటలకు
ఇంతవరకూ ఇలా చెప్పినవారు లేరు మొదటిసారిగా వింటున్నాను. ఈ రోజు నుంచి నేను న్యాయంగా బ్రతుకుతాను
నేను చెప్పిన పని చేస్తానంటే
సరే చెప్పు అన్నాడు
ఇక్కడ
సంతలో ఒక చెట్టు క్రింద 100 కొబ్బరి బొండాలు దింపుతాను, నీకు ఒక
కత్తి కూడా ఇస్తాను, నీవు బ్రతకటాని మార్గాలు వెతుకుంటూ ఉన్నావు కాయ 3
రూపాయలకే ఇస్తా నీ ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకో అన్నాడు.
చూడు
నీవు ధర్మం తప్పకూడదు, జాలి పడి తప్పు చేయ కూడదు నాదగ్గరకూడా 5 రూపాయలే
తీసుకో కానీ ఇప్పుడు ఇవ్వలేను తిరిగి వచ్చేటప్పటికల్లా కాయలు అమ్మి
నీ కత్తి ఇస్తా, అందుకు ఒప్పు కుంటేనే నేను తీసుకుంటా అన్నాడు మాధవ్ .
సంతలో చుట్టు
దగ్గర ఆపడం జరిగింది. నేను కేవలం 3 గంటల్లో తిరిగివస్తా నాకు 500
ఇవ్వగలవా. ఇవ్వగలను, నేను మాట తప్పను. సరే అలా టీ తాగుదాం వస్తావా అని
అడిగాడు డ్రైవర్.
నాకు అలవాటు లేదు నేను త్రాగాను అన్నాడు, ఈ లోకంలో ఎలా బ్రతుతాడో అమాయకుడిలా ఉన్నాడు నేను టీ త్రాగి వచ్చి వెళ్తాను అని చెప్పి హోటల్కు వెళ్ళాడు డ్రైవర్ .
అక్కడ
కాగితపు అట్ట మీద బోండా 10 రూపాయలు మాత్రమే, 5 తీసుకున్నవారికి 40 రూపాయలు
మాత్రమే అని వ్రాసాడు. అక్కడ ఉన్న ఒక వ్యాపారి మేము 20 రూపాయలకు
అమ్ముతుంటే నీవు తక్కువకు అమ్మటం మంచిదికాదు గట్టిగా అన్నాడు.
నేను మీలాగా బ్రతుకు తెరువుకోసం వచ్చాను మొత్తం కాయలు మీరే తీసుకోని మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి అన్నాడు మాధవ్ .
ఇవిగో ఈ 800రూపాయలు తీసుకో నీవు చెప్పిన లెక్కేగా అన్నాడు.
అవి
తీసుకోని హోటల్ కు బయలు దేరాడు. డ్రైవరుకు 500 రూపాయలు ఇచ్చి మిగిలిన
వానితో కొంత అల్పాహా రము తిని సంచీ తీసుకొని జై భజరంగ్ బలీ అంటూ అరిచాడు
డ్రైవర్ కూడా వంత పలికాడు.
నీవు ఎక్కడికి పోతావ్ పక్క సంత పెద్దది అక్కడ దిగి నీతెలివితో ఏదైనా వ్యాపారం చేయ్ .
నా మొదటి సంపాదనకు సహకరించినందుకు నిన్ను నేను ఎప్పటికీ మరచి పోలేను.
డ్రైవర్ గారు నేను మా గురువు గారు వ్రాసిన పాట పాడితే నీకేమన్నా ఇబ్బందా
పాడు బాబు పాడు నాకేం ఇబ్బంది లేదు, ఈ రోజు నాకు చాలా సంతోషముగా ఉన్నది
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
వేదోద్ధారణ సేసినదెవరు?
విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు?
నాట్యానందము నొందెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
ఆధారంబయి యుండెడిదెవరు?
అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు?
ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
అంతా తానయి నిండెడిదెవరు ?
ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ?
శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
కాంతిన్ గుండెల నింపెడిదెవరు?
కంటిన్ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్ గూర్చొని పల్కెడిదెవరు?
స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
బోధన్ జేయుచుఁ దెల్పెడిదెవరు?
ముక్తన్ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు?
నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు?
నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు?
నీవే నేనని యన్నది యెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా
లారీ ఆపాడు
అదిగో హనుమంతుడు గుడికి వెళ్లి వద్దాం నేను వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని దర్శనం చేసుకొని మరీ లారీ నడుపుతాను
ఇద్దరూ కలసి వెళ్లారు అక్కడ రాములవారు హనుమంతుని ఆలింగనం చేసుకున్న చిత్రం చూసారు, తన్మయత్వం తో మునిగి పోయాడు మాధవ్
దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నారు
చూడు బాబు నీవు చదువుకున్న వాడిలా ఉన్నావు నాకు చదువులేక బండగా తయారయ్యాను
చదువొక్కటే కాదు కుటుంబం అంత సక్రమ మార్గంలో ఉండాలి నమ్మకం మీద బ్రతకాలి అన్నాడు మాధవ్ .
రామాయణంలో
రాములవారు హనుమంతుని నమ్మి ఉంగరం ఇచ్చారు, సముద్రము దాటి లంకలో ఉన్న సీతను
దర్శించి ఆమెఇచ్చిన చూడామణి తెచ్చి చూపాడు అప్పుడు రాములవారు సర్వశ్రేష్ఠం
సర్వోత్తమం సర్వోన్నతం అనదగిన ఒకానొక అపురూపమైన ఆలింగనం సౌభాగ్యాన్ని
హనుమకు ఇచ్చడు.
ఆలింగనమే మనసులను కలిపేది డ్రైవర్ అంటూ
ఒక్కసారి మాధవుని హత్తుకొని నీకు ఏ సహాయము కావాలన్న ఈ హనుమన్న ఉన్నాడని
మరచి పోకు అంటూ లారీ ఎక్కాడు,
చంకను బ్యాగ్ పెట్టుకొని నడక ప్రారంభించాడు మాధవ్.
om
ReplyDeletenana i am getting your post in english
ReplyDeletegood story good ending
ReplyDelete