Sunday, 30 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 28

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
నిరుద్యోగి ప్రయాణం - 3
మాధవ్ నడుస్తున్నాడు, ఒక మధ్య రకం మనిషి వచ్చి, నేను నిన్ను ఎక్కడో చూసాను అన్నాడు, నేను ఇప్పుడే వస్తున్నాను, నన్ను చూసి ఉండరు మీరు అన్నాడు మాధవ్ . ఆ  గుర్తుకు వచ్చింది మా రామారావుగారి కొడుకు ఒడుగుకి వచ్చావు నీవు,  అక్కడ యజ్నోపవీతం గురించి చక్కగా చెప్పావు బాబు. మంచి విషయాలు తెలుసు కోవటానికి చిన్న పెద్ద, మతము కులము ఆచరించ వద్దు అని చెప్పారు మా గురువుగారు.

అవును ఎందుకు మీరు నాతో నడుస్తూ మాట్లాడుతున్నారు అని అడిగాడు మాధవ్ . నాకుటుంబం లో అంతా చీకటి కమ్మి నట్లు ఉన్నది, ఏది చేసిన ఫలించుట లేదు ఏదన్న పూజలు చేయాలా అని అడిగాడు వెంట ఉన్న "శ్రీధర్ ".

చూడండి పండితులను సంప్రదించండి వారు చెప్పినట్లు ఆచరించండి అన్నాడు.

కాదు బాబు నీవు ఏదన్న చెప్పు నేను చేస్తున్న పని మంచో,  చెడో తెలియుట లేదు అని అడిగాడు.

చుడండి ఆకురాలేకాలంలో ఆకులు రాలుతాయి, వానలు పడగానే చిగురిస్తాయి. ఎండిపోతున్నాము అనుకోవు ఆచెట్లు,  అట్లే మీకు ఉన్నట్టి కష్టాలు శాస్వితము కాదు ఓర్పు వహించండి, మంచి రోజులు తప్పక వస్తాయి అదే సంకల్పముతో బ్రతకాలి.

రామాయణంలో హనుమంతుడు సీతాకోసం లంక అంతా వెతికాడు సీత కానరాక చాలా బాధపడ్డాడు అప్పుడే ఆలోచన అవసరమని మనకు భోదించారు, వచ్చిన పని కాకపోతే ఎవరికి నష్టం అని తెలుసుకొని  ఓర్పుతో వెతుకుతాను అనుకున్నప్పుడే  శుభశకునాలు రావటం అశోకవనంలో సీతను కలవటం, సీత విషయం రామునకు చెప్పఁటం  దుర్మార్గం పై రాముడు దండయాత్రచేయటం జయం పొందటం మనకు తెలిసినదే.  .

ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి మీకు మంచి మార్గం చూపుతారు అన్నాడు మాధవ్.

అయినా ఒక కధ చూపుతాను వినండి  అంటూ మొదలు పెట్టాడు మాధవ్ శ్రీధర్ తో        
        
పిడికెడు ఉప్పు (ఒక నీతి కథ).

ఒక యువకుడి తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు..

"స్వామీజీ...నా జీవితమంతా కష్టాలే..
ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను..
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."
.
అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు..
.
ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు..
యువకుడు అలాగే చేశాడు...
ఇప్పుడు ఆ నీటిని "తాగు" అన్నాడు గురువు..
.
యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు...
వెంటనే ఉమ్మేశాడు...
"అబ్బ... భరిoచలేని ఉప్పు...."
.
ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని...
ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు..
.
"ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు..
.
ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు..
.
"ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు..??" అడిగాడు గురువు..
"నీరు తీయగా ఉంది" చెప్పాడు ఆ యువకుడు..
.
"అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేకపోయావు..??
ఇప్పుడెలా భరించావు..?? అడిగాడు గురువు..
.
అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు..
.
అది తక్కువ నీరు...
గ్లాసుడు నీరు...
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు..
అంటే ఎక్కువ నీరు..
అందుకే ఉప్పదనం లేదు... " అన్నాడు యువకుడు..
.
అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు..
.
"నాయనా...
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి...
అది గ్లాసులోనూ పిడికెడే...
చెరువులోనూ పిడికెడే...
.
కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి...
.
నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది...
ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు.

బాబు చిన్నవాడవైన మంచి కధ చెప్పావు "ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది".

బాబు నాలో మనో ధైర్యం కల్పించావు, నీవు చదువు కున్నవాడివిలాగా కనబడుతున్నావు. నాకొచ్చిన కష్టం చెప్పుకుంటా, దానికి పరిష్కారం మీరే చెప్పాలి.

నేను ఇచ్చే ఈ  పారితోషకాన్ని తీసుకోండి అన్నాడు.

చూడండి నేను నిరుద్యోగిని, ఉద్యోగ వేటలో ఉన్నాను, ఉద్యోగము  దొరికేదాకా నా ప్రయాణము ఆగదు అన్నాడు.

బాబు నేను యిచ్చే డబ్బు తీసుకోకపోతే నాకు ఒక సహాయము చేయి, మా ఇంటికి వచ్చి మా పరిస్థితిని గమనించి   నీ  అమూల్య సలహా మాకు తెలియ పరుచు అది చాలు  అన్నాడు.

సరే పోదాం పదండి మీ ఇంటికి అన్నాడు,

వెంటనే శ్రీధర్ ఆటో పిలిచాడు ఎక్కారు ఇద్దరూ .

ఇంటికి చేరగా అందరూ దిగులుగా ఉన్నారు, ఏమండి ఏమండి మీగురించి ఇప్పటిదాకా భోజనం కూడా చేయక ఉన్నాము, అనేక ఆలోచనలతో మాకు భయం ఏర్పడినది అన్నది శ్రీమతి "శాంతి ".

మన కష్టాలు యిక తొలిగి పోతాయా అని అడుగుతూ , ఇదుగోనండీ మంచి నీళ్లు త్రాగండి అని ఇచ్చింది ఇద్దరికీ .

అమ్మా నమస్కారమమ్మా అన్న పిలుపుకు మాధవన్ చూసింది శ్రీమతి శాంతి

రా బాబు రా యిలా కూర్చో అన్నది.

బాబు నీవు నాకొడుకు లాంటి వాడవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, అందరూ భోజనం చేసిన తర్వాత మాట్లాడు కుందాం, తన పిల్లలను చూపి అన్నది.

చూడు బాబు నేను కూడా చెపుతున్నా భోజనం చేద్దాం పదా అన్నాడు.

అందరూ భోజనమ్ చేసాక .

మాధవ్ ఇట్లా అన్నాడు.

అర్ధం అయ్యేలోపు దూరమయ్యేది "కల " 

అర్ధం అయిన వప్పుకోలేనిది  "వాస్తవం "  

అర్ధం అయ్యేకొద్దీ దగ్గరయ్యేది " స్నేహం "

అర్ధం తెలిసిన సరికొత్త అర్ధం తెలిపేది "ప్రేమ" 

అర్ధం అయినట్లు కనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్ధం కాదు "జీవితం"

నీ గురించి నువ్వుకాని ,, నిన్ను కన్న తల్లి కానీ, నిన్ను ప్రేమించే వారుకానీ  ఏదో క్షణమున మరచి పోవచ్చు కానీ ఆభగవంతుడు మాత్రం మరవలేడు.

భగవంతుడు ఆడించినట్లు ఆడటమే తప్పా,  కానీ ప్రాణాలు తీసుకోవటానికి ముందుకు రావటం తప్పు అన్నాడు. చీకటి తరమే వెలుగు వస్తుంది అది గమనించి మనం ముందుకు పోదాం అన్నాడు మాధవ్  ....... ..... .....

అప్పుడే గుడి గంట మ్రోగింది .........                              

 సమస్యలను తరువాత భాగంలో పరిష్కరించు కుందాం

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 27

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:


నిరుద్యోగి ప్రయాణం -2

మాధవ్ ఒక్కసారి తనదగ్గర ఉన్న పైకాన్ని చూసుకున్నాడు, ఎం చేయాలో అని ఆలోచిస్తున్నాడు, అక్కడ దగ్గరలో బ్యాంకు ఉన్నది, అక్కడ విద్యార్ధులు చాలా మంది ఉన్నారు, కొందరు డబ్బు కట్టే వారు మరికొందరు తీసేవారు ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి బ్యాగ్ లో కొంత పైకము పెట్టుకొని స్కూటర్ వద్దకు వచ్చాడు బ్యాగ్ ముందు పెట్టుకున్నాడు, స్కూటర్ లో గాలి లేదే అని వెనక్కు చూసాడు, ఒకతను ముందు పెట్టుకున్న బ్యాగ్  పట్టుకొని పరుగెత్తడం మాధవ్ చూసాడు, వెంటనే అతన్ని వెంబడించాడు, అతను పారిపోతూ మాధవ్ పై బ్యాగ్ మొఖం పై  విసిరేసి చూడకుండా పరుగెత్తాడు. బ్యాగ్ ను తీసుకోని వెనక్కి వచ్చి ఇచ్చాడు.

బాబు నీవు నా ప్రాణాలు నిలబెట్టావు, నాప్రాణాలేకాదు నాకుటుంబప్రాణాలు నిలబెట్టినవాడివి, ఈరోజు మాబాబు ఒడుగు ఏర్పాటు చేసుకున్నా అందుకే డబ్బుడ్రాచేసాను అన్నాడు రామారావు.  ఇదిగో ఈ డబ్బు తీసుకో అని ఇవ్వగా సాటి వ్యక్తిగా దొంగని పట్టుకోవటానికి ప్రయత్నిమ్చా, అతన్ని కూడా పట్టుకుంటే మంచిదయ్యేది, నాకు డబ్బు ఏమీ ఇవ్వవద్దు అని అన్నాడు.  

బాబు ఇంతకీ నీవెవరు అని అడిగాడు, నేను ఒక నిరుద్యోగిని, ఉద్యోగము కోసం పల్లెటూరు నుండి బస్తీకి వచ్చాను నాపేరు మాధవ్ అని చెప్పాడు.
నీవు ఏమి అనుకోకపోతే ఈరోజు మా ఇంటికి రా బాబు భోజనం చేసి మేము ఇచ్చే తాంబూలము తీసుకోని పోవచ్చు అన్నాడు. సరే అని స్కూటర్ ఎక్కాడు.

ఇద్దరూ కలసి ఇంటికి చేరారు, ఇంటివద్ద మేళాలు మ్రోగుతున్నాయి
బాబు ఇక్కడే ఉండు లోపలకు పోయి వస్తా అంటూ గబగబా లోపలకు పోయి జరిగిన దంతా భార్యకు చెప్పి  తిరిగివచ్చి రా బాబు రా అంటూ అక్కడ ఉన్న బ్రాహ్మణుల వద్ద కూర్చోబెట్టాడు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు.
 ప్రధాన పూజారిని ‘యజ్ఞోపవీతం’ గురించి వివరంగా చెప్పండి అని రామారావు అడిగాడు, వచ్చిన బ్రాహ్మణులు ఆలోచిస్తున్నారు, అక్కడే ఉన్న మాధవ్ మీకు అభ్యంతర లేక పోతే నాకు తెలిసినది తెలియపరుస్తా అన్నాడు. ఇదిగో బాబు నీవు ఇలా రా ఈ మైకు ముందు కూర్చొని చెప్పు అన్నారు ప్రధాన పంతులుగారు.
మాధవ్ చెప్పటం మొదలు పెట్టాడు.     

‘యజ్ఞోపవీతం’        
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ్ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
 ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’
నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.
యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.
యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ!
మా గురువుగారు నాకు చెప్పినది నేను మీకు ఉదాహరించాను అన్నాడు మాధవ్
అందరూ మెచ్చుకున్నారు,  బాబు నీవు చాలా బాగా తెలియపరిచావు ప్రధాన పూజారి మెచ్చుకున్నాడు.                ఒడుగు పూర్తికాగానే సంభావన ఇచ్చారు అందరికి మాధవ్ కు ఇచ్చిన దానిలో అక్కడఉన్న బ్రాహ్మణుల కందరికి సమభాగములుచేసి వారికీ ఇచ్చి ఇదే తనభాగమని తీసుకున్నాడు.
బ్రాహ్మణులందరూ ఆశ్చర్య పోయారు.

ఇది కూడా మీకే చెందవలసినది, నేను రావటము వల్ల మీకు తాగించి నాకు ఇచ్చారు అన్నాడు. అప్పుడే రామారావ్ కలగ చేసుకొని వారికీ ఇద్దామనుకున్నది ఇచ్చాను, నా తృప్తి కోసం నీకు ఇచ్చాను అన్నాడు. అందుకనే రామారావుగారు మాతృప్తి కోసం నాభాగమే తీసుకున్నాను.
బ్రహణులతో భోజనం చేసి వెళ్ళండి అని తెలియపరిచాడు, మాకు వేరే పూజలున్నాయి అని చెప్పి వెళ్లారు. మాధవ్ వద్దకు వచ్చి నీవుకూడా వెళుతున్నావా అని అడిగాడు, నేను ఉంటానండి.
భోజన వడ్డనలో నేను సహాయపడతాను అన్నాడు.
నీవు సహాయము చేస్తానన్న మాట చాలు అంట క్యాటరింకు ఇచ్చాము అన్నాడు రామారావు.
భోజనాలు అందరి ఆయినాయి ఎవరి దారి వారు వెళ్లిపోయారు.
రామారావుగారు నాకు అనుమతిస్తే నేను బయలు దేరుతాను అన్నాడు.                    



Saturday, 29 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -26*****

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

నిరుద్యోగి ప్రయాణం -1 (రోజువారి కధ రాద్దామని ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


బాబు మనవృత్తి విద్యపై బ్రతుకు సాగించటం చాలా కష్టముగా ఉన్నది, నేను ఇప్పటి దాకా నిన్ను నీ చెల్లిని చదివించ గలి గాను, చదువుకు తగ్గ ఉద్యోగము సంపాదించు కొని రాగలవని నిన్ను ఆశీర్వదించి పంపిస్తున్నాను అని చెప్పాడు తండ్రి, నీకు ఎటువంట పైకము కూడా సర్ద లేను అంటూ నీ మెడలో ఈ ఆంజనేయ స్వామి వెండి బిళ్ళ (లాకెట్) ఎర్రతాడులో వేసి ఇస్తున్నాను, ఇదే నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పి నీకు కావలసిన బట్టలు తీసుకోని ఇక బయటకు నడువు అన్నాడు మాధవ రావ్.   

అప్పుడే లోపలనుంచి భార్య భారతి వస్తు ఏం చేస్తున్నారు, మీరు చేతి కందిన కొడుకుని బతకమని పంపిస్తున్నారు అన్నది, నాకు ఇంకా ఓపిక ఉన్నది మనబాబు అసమర్ధుడుగా ఇక్కడ ఉండుట కన్నా సమర్థుడుగా 2 సంవత్సరాళ్లలో తిరిగి రాగలడు, ముందు వాడ్ని దీవించి విజయుడుగా తిరిగి రమ్మనమని చెప్పు అన్నాడు. భర్త మాట ఎదురు చెప్పక అమ్మవారి కుంకుమ పొట్లామ్ ఇచ్చి రోజూ పెట్టుకో అని దీవించి పంపింది 

బాబు నేను చెప్పేంత దానిని కాదు ఎదో వానాకాలపు చదువులు మావి అయినా నాకు తెలిసిన విషయాలు తెల్పెద 

దేహ నీతి నెరిగి దేశాల బుద్ధితో 
క్రమత మమతా జాలి కరుణ జూపు 
నరులు మార్పు చెందు ఆవేశపడకుండు 
నిత్య శక్తి నీవు సలుపు మాట 

రసమయ కధ అయిన రామాయణంబును 
హృద్య మైన రీతి  ఉత్తమముగ 
తీర్చెను భవభూతి త్రికరణ శుద్ధిగా 
ధర్మ నీతి మరచి బతక మాకు 
అట్లాగే అమ్మ 

తల్లి తండ్రులకు నమస్కరించి చిన్న బ్యాగు చంకను పెట్టుకొని బయట ప్రపంచం లోకి అడుగు పెట్టాడు మాధవ్. నడిరోడ్డుమీద నడుస్తూ బయలు దేరాడు, అప్పుడే వెనుక బస్సు వేగముగా ప్రక్కనుండి పోవటం రోడ్డుకు ప్రక్కన ఉన్న చెట్టుకు గుద్దుకోవటం జరిగింది . అప్పటికప్పుడు మాధవ్ 108  కు 100 కు ఫోన్ చేసాడు. చేతనయినంత వరకు కొందరిని రక్షించ గలిగాడు.

  ఒక్క సారిగా బస్సులోని వారందరు కేకలు పెట్టారు, మాధవ్ అక్కడే ఉన్న ఒక ఎద్దుల బండి నెట్టుకుంటూ వెనక అద్దాలను పగల కొట్టాడు, కొందరిని దించ గలిగాడు మరి కొందరకి గాయాలు జరిగాయి . దీనికి కారణం అతి వేగం, నిద్రతో నడపటం అన్నారు
అప్పుడే పోలీసువారు, ఫై రింజన్, రక్షకదళం, ప్రక్క ఊరి జనం రావటం అందరిని సురక్షణ దిశగా మార్చటం జరిగింది.

భాష స్వేచ్ఛ మరియు - భూషణా స్వేచ్ఛయు 
వ్యక్తి మనసు స్వేచ్చ - వ్యక్తి స్వేచ్చ 
సమంత మమతా శాంతి సర్వుల ఆకాంక్ష 
అన్న జనని పలుకు  సర్వ రక్ష 

అలా  తల్లి  మాటలు  గుర్తుచేసుకున్నాడు 

అక్కడ ఉన్న  ప్రజలు ఇలా అనుకున్నారు 

గుండె కండ రాలు కదలి భయము తెచ్చె
నిద్ర లేని వాహ  నంబు పరుగు 
నరుల హృదయ  ధమని సిరయు పనులు ఆగు 
భయము గుప్పె టంత పట్టి ఉంచె 

ఇలా అనుకున్నారు వారు      

                                                                                 ఈ కధ ఇంకా ఉంది ... 2
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  

నిరుద్యోగి ప్రయాణం -2 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మాధవ్ బతుకు తెరుఫుకోసం బయలు దేరి దారిలో బస్సు ప్రమాదాన్ని రక్షించాడు ఇక చదవండి (2 )

బస్సులో అందరితో పాటు నన్ను రక్షించి నందుకు నీకు కృతజ్ఞతలు తెలుసుపుతున్నాను. ' '
నీవు శక్తి వంచన లేకుండా నీ వంతు నీవు సహాయము చేసి నావు, నీకు నేను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వలేను కానీ రెండు వాక్యాలు చెపుతాను, ఋణం ఉంచు కోకూడదు, అందరూ ఉన్న లేని వాడిగా బతికే లోకం ఇది నా స్థితి కూడా అదే, యవ్వనంలో కొంత సంపాదించాను, అందరికి సహాయము చేయాలని ముందుకు పొయ్యాను చివరికి నాకు ఈ గతి పట్టించారు. ఇది వారి తప్పు కాదు ఆధునికంలో బతకలేక అనుభవాలను చెప్పుకొనే అవకాశము లేక ప్రపంచాన్ని చూద్దామని బయలు దేరాను నీ పుణ్యమా అని బతక గలిగాను ఇంకా ఈ భూమాతకు ఋణపడి ఉన్నాను
మీరేం చదివారు నా చదువులతో పనేముంది నాయనా నోరు మంచి దైతే ఊరు మంచిదౌతుంది కదా. 

నీ ప్రయాణము ఎటు ఇంకా తెలియదండి
తెలియక పొతే మంచిది బాబు . తెలిసిందనుకో చేయలేదని ఒక బాధ, చేసాక ఏమను కుంటున్నారో అని మరొక బాధ, తప్పు చేస్తున్నామని మరొక బాధ ఈ భాదలు అన్నిటిని తప్పించు కోవాలంటే మనుష్యులు తేలిక భావంతో పోతే మంచిది అంత ఆలోచించ వద్దు, అసలు చేయ కుండా ఉండ వద్దు'.       
ఆయినా నేచెప్పేది విని నీ ధర్మం నిర్వహించు   
సంస్కృతంలో ఈ విధంగా తెలిపారు అంటూ చెప్పఁటం మొదలు పెట్టారు.         
 అవిద్య ' లక్షణం (విపరీతబుద్ధి, అశుచి, వాసనా, ఆత్మ )

అనిత్యాశుచిదుఃఖానాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా !!
(యోగ . సాధనపాదము సూ.)

అనిత్యమైన సంసారంలో దేహాలను నిత్యమని - అంటే కనిపించు , వినిపించు తెలుసుకోదగ్గ కార్యజగత్తు ఎల్లప్పుడు ఉందనీ యోగబలంలో దేవతల శరీరాలు ఎల్లప్పుడూ ఉంటాయనీ అనుకొంటూ విపరీత బుద్దిని కలిగి ఉండటం అవిద్యలో మొదటి భాగం.

'అశుచి' అంటే మలమయాలైన స్త్రీ పురుషుల శరీరములందు మిథ్యా భాషణాలు ,దొంగతనం మొదలైన అపవిత్రాలను పవిత్రాలుగా అనుకోవడం రెండవ భాగం.

అత్యంత విషయ వాసనారూప దుఃఖాలను సుఖమనీ అనుకోవడం మూడవ భాగం.

అనాత్మయైన దానిలో ఆత్మ భావాన్న ఉంచడం అవిద్యలో నాల్గవ భాగం.
ఈ నాలుగు విధాలైన విపరీత జ్ఞానాన్నే ' అవిద్య ' అంటారు.

ఇవి అన్ని మన పుర్విలు చెప్పినవే మరలా గుర్తు చేసాను. 

ఇంకా చెప్పండి గురువు గారు
బాబు ఎప్పుడు భోజనం చేసావో ఈ నాలు గు పండ్లు తిను నాయనా, నేనే మీకు పెట్టలండి మీరు నాకిస్తున్నారు. 
ఇవ్వాళ నువ్వు రేపు ఎవరో మరెవరో     
మీ మాటలు బాగున్నాయండి 
మాటలు బాగుంటాయి ఆచరణయే కష్టం ... 
ఏంటి గురువుగారు కళ్ళంబడి నీళ్లు తిరుగుతున్నాయి 
ఏమీ లేదు బాబు చిన్నప్పుడు మా అమ్మ పాట గుర్తు కొచ్చింది, 
ఒక్క సారి పాడండి మనసు తేలికవుతుంది 
సరే విను బాబు 

నీముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 
నీ చిరు దరహాస మాటలను మరువ లేను
నా మదిలో నీ ఉనికిని విడువ లేను బాబు బాబు 

నీ మనసు వేదన తగ్గేందుకు పడుతున్నాను 
నీ ఒక్క ఓదార్పు కోసం జీవిస్తున్నాను
నా బ్రతుకులో అనుక్షణం నీకోసమే ఉన్నాను 
అన్వేషణా, ఆరాధనా తప్పుట లేదు బాబు బాబు  

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 

నీ ఏడుపు ఎలామార్చాలో తెలియని భ్రమలో ఉన్నాను
నీ సందిగ్ద మనస్సు మార్చాలని పాడు తున్నాను 
నీ కొరకు నిరంతరం శ్రమిస్తాను 
నీ కొరకు ప్రేమ అందిస్తాను బాబు  బాబు బాబు 

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 

ఇప్పుడు నాకు పంచ భూతాలు ఆప్తులు
తరువులు నాకు దోస్తులు
చరిత్రలో అల్లన మెల్లన వలపులు
చల్లని వెచ్చని కలిపే హృదయం నీది బాబు బాబు 

చీకటి వెన్నెలలో మరిపిస్తాను 
అల్లరి చేసే వయసు నీది అయినా వదలలేను  
పులకించే కనులతో నిన్ను హత్తుకొని ఆడిస్తాను 
నవ్వును తెప్పించే హృదయం నదీను బాబు  బాబు 


చిన్న పిల్లాడిలా ఒకటే ఏడుపు ఏడుపు ఏడుపు ......


                                                                                 ఈ కధ ఇంకా ఉంది ... 3

ప్రాంజలిప్రభ - అంర్జాల పాత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -3 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  


మాధవ్ బస్సులో వారిని రక్షించి అక్కడ ఓక గురువుని కలసిన తర్వాత, ఇక చదవండి మూడవ  భాగము 

గూటికి చేరిన పక్షులు లాగా అందరు వెళ్లి నట్టున్నారు మనము కూడా ఏదైనా దారి పట్టాలికదా 
అవునది మీతో మాట్లాడుతుంటే, 
మా గురువు గారు చెప్పి నట్లు ఉంది
మీ మాటలు ఇంకా వినాలనిపిస్తున్నది.
అవును నీకు ఆత్మా రాముడు అరవటం లేదా, 
వారెవరు గురువుగారు. 
వారెవరు కాదు బాబు నీలో దాగి ఆత్మ ఆకలి, ఆకలి, అని అరుస్తుంది 
వీలు చిక్కినప్పుడల్లా పేగులు ఆరుస్తాయి, 
అవునా 
కాస్త అలా బయలు దేరి ఏదన్న భోజన శాలలో తిని ఎవరి దారి వారిది 
నాదగ్గర డబ్బులు లేవండి 
నా దగ్గర ఉన్నాయి కదా 
నువ్వేమి ఖంగారు పడకు అంతా మనమంచికే అని ముందుకు పోదాం 
అట్లాగే గురువు గారు 
టిఫిన్ బాగున్నదా 
బాగానే .... ... 
ఆకలికి రుచి ఎరుగదు కడుపు నిండితే అన్నీ వంకలే 
ఏది ఏమైనా కొద్దిగా ఓపిక వచ్చింది ఇక నడుద్దామా 
కాసేపు ఇక్కడే కూర్చుందాం గురువు గారు 
ఏమైనా చెప్పండి   

చూడు బాబు కాల చక్రం తిరుగుతుంది నీకు కనబడుతుందా కనబడదు, గాలి ప్రాణుల్ని రక్షించుతుంది నీకు కనబడుతుందా 
కనబడదు 
అదే బాబు దేవుని లీల   
అర్ధం కాలేదు 

కుంభవృష్టి హోరును,  ఉరుము తున్న ప్రకృతిని, దారి ఎదో తెలుసుకోలేని ప్రాణిని - ఎవరు ఆపగలరు .  

నింగినందు ఒకవైపు మేఘ మాల,  మరోవైపు కాంతి రక్తం తో మరిగే ప్రాణిని, కవితా శక్తితో ఎవరు ఆపగలరు. 

వానను దోసిల్లతో పట్టు కుంటాం, నీటి ఉరవడిని ఆపలేం, ఉరుములు తో వచ్చే పిడుగు జారటం, మనిషిలో పెరిగే కోపాన్ని,  ఎవరు ఆపగలరు. 

కారు చీకట్లో పొద్దు తెలియని స్థితిలో తిండి లేక, కట్టు బట్ట లేక, ఉండే ఇల్లు లేక, ఎండ   వానలో చిక్కన  ప్రాణులను, గాలికి కూకటి వేళ్ళతో లేచే చెట్లనుఁ, పక్షములను  ఎవరు ఆపగలరు

మోయలేని "భారం" బరువు గా మారినప్పుడు, ప్రేమలో హృదయం విరిగి నప్పుడు, 
బరువుని మోసే, ప్రేమను భరించే శక్తి, హృదయాన్ని శబ్దం చెయ్యొద్దని  ఎవరు ఆపగలరు
       
వాన చినుకు లేందే మనము ఉండలేం , అన్నం మెతుకు గొంతులో పడందే మనము బతకలేం , మనిషి మనిషి తోడు లేకపోతె జీతమే సాగించలేం అయినా నీరు, నిప్పు, నింగి, గాలి, నేల, వాని పని అవి చేసిన ప్రాణులు బాధపెట్టకుండా  ఎవ్వరు ఆపగలరు.  

ఈ మనసు ఆప్యాయత అనే ఊబిలో ఇరుక్కుంటుంది, తెలివితో బయఁటకు రావాలని విశ్వసిస్తుంది, ప్రాణులకూ చీకటి వెలుగులు, సుఖ దుఃఖాలు రాకుండా ఎవ్వరు ఆపగలరు 

పువ్వుల పరిమళాలు, ఎడారికి వెన్నెలంతా అడవికి మారినట్లు, మనిషి నోరువిప్పి పలికినా దిక్కులేని స్థితిని, చూసే వారు నమ్మే వారు ఉన్నా, అబద్ధాన్ని, ఆశను  - ఎవరు ఆపగలరు.   

యదార్ధం తెలుసుకున్న రాజకీయం, రాజీ పడి కన్నీరు కార్చుట, వాగ్దానాల ఒరవడిలో ధనాన్ని ఖర్చు చేయటం, మనుష్యుల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా  - ఎవ్వరు ఆపగలరు

అందుకే నేను అంటాను చేయి చేయి కలుపుదాం, ఒకరి కొకరం సహాయం చేసుకుందాం  
మానవతా దృక్పధంతో బ్రతుకుదాం, అగ్నిలో,  వర్షాల్లో, చిక్కిన వారిని రక్షించి కాపాడుదాం 
దీన్ని ఎవ్వరు ఆపలేరు, సూర్య కిరణాలను ఎవరు ఆపగలరు, పరుగెత్తే హృదయాన్ని ఎవరు ఆపగలరు. కాలాన్ని ఎవ్వరు ఆపగలరు, భగవంతుని లీలలు ఎవ్వరు ఆపగలరు, జరుగుతున్నా కాలాల్ని చూస్తూ చేతనయినా సహాయం చేస్తూ కలసి మెలసి బతుకు సాగిస్తున్న వారిని ఏ దుష్ట శక్తి ప్రవేశించలేదు, ధర్మాన్ని కట్టుబడిన వారిని ఎవ్వరు ఆపలేరు.    
   
రక్షించే గుణాన్ని ఎవ్వరూ ఆపలేరు, స్నేహాన్ని ఎవ్వరూ ఆపలేరు, ప్రేమను పంచే, సహకరించే ఆర్ధిక వనరుల సహాయాన్ని ఎవ్వరూ ఆపలేరు.

సహాయం చేయు నీ లక్ష్యాన్ని ఎవరు ఆపలేరు, ఈ విషయాలన్నీ నీకు చెప్పొద్దని ఎవ్వరు ఆపలేరు. మనిషి మనిషి  తోడుగా బ్రతికేవారిని, ప్రాణ మడితోనే ఆ భగవంతుడు ఆపగలడు 
భూమి నూకాలున్నంతవరుకు, ఈ  గుండె ఆగేవరకు ఉద్యోగి అయినా, నిరుద్యోగి అయినా సాగి దేశానికి సహాయ పడుతూ కర్తవ్య నిర్వాహణముతో ముందుకు సాగి పోవాలి దాన్ని ఎవ్వరూ ఆపలేరు. 


గురువు గారు ఎన్నో తెలియని విషయాలు తెలిపారు చాలా సంతోషం, మీ కాశీ ప్రయాణపు బస్సు వచ్చి నట్లుంది, మీకు ధన్యవాదములు చెప్పఁటం తప్ప ఏమీ చేయలేని నిరుద్యోగ అభాగ్యున్ని మన్నిస్తారని ఆశతో శెలవు చెపుతున్నా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు .... ... ... 

                                                                                 ఈ కధ ఇంకా ఉంది ... 4

మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  



ప్రాంజలిప్రభ - అంర్జాల పాత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -4 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, 6281190539

మాధవ్ ప్రయాణం బస్సు ఆక్సడెంట్ మరియు గురువు గారి సంభాషణ ఇంకా చదవండి 4  వ భాగము 

మాధవ్ ఆలా రోడ్డు మీద నడుస్తూ పోతున్నాడు. ఏంచెయ్యాలి, ఎలా బతకాలి, ఈ లోకాన్ని ఎలా అర్ధ౦ చేసుకోవాలి అనుకుంటూ ఉండగా వేగంగా మోటార్ బైకులు శబ్దం విని పక్కకు జరిగాడు అదే సమయాన ప్రక్కనే ఉన్న ఒక ముసలమ్మా నెమ్మదిగా నడుస్తూ పోతున్నది. అవ్వ ఎటు పోతున్నావు అని అడిగాడు మాధవ్ చూడు బాబు నీవెవ్వరో కొత్తగా నన్ను పలకరిస్తున్నావు అంటూ ఒక్కసారి మాధవుని ప్రక్కకు లాగింది మాధవకు కళ్ళు తిరిగినంత పనైంది. ఎం జారుతున్నాదో  అర్ధం కాలేదు. దూరంగా రెండు బైకులు ఒకదాని కొకటి గుద్దుకొని నలుగురు ప్రక్క  ప్రక్కనే పడిపోయారు, వారిని లేపే మూగారు ప్రజలు, అవ్వే నన్ను రక్షించింది, ఆ బైకు నన్ను తాకేది అప్పుడు నా పరిస్థితి ఎలాఉండేదో అని అన్నాడు అవ్వతో. 

చూడు బాబు యవ్వన విన్యాసాలు ఇట్లాగే ఉంటాయి, పిల్లలపై  ప్రేమ పెంచు కుంటారు తల్లి తండ్రులు వారు అడిగిన వణ్ణి కొనిపెడతారు వారి ప్రవర్తనలు చూసి ఏమి అనలేక బాధ పడతారు, వాడి కర్మ వాడు అనుభవస్తాడు, ఎన్ని సార్లు చెప్పినా వినడు అంటారు కొందరు, వాడి చేసే చేష్టలు చూసి ఏమీ అనలేక మావాడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు అని చెపుతారు. 

అవ్వా నన్ను రక్షించ బోయి నీ సంచి లాంటిది క్రింద పడింది. అందరూ నన్ను వదిలించు కున్నారు నేను మాత్రం ఇది పట్టుకొని వేలాడుతున్న అదే నాకు కొండంత ధైర్యం ఇస్తున్నది. నాకు దారి చూపుతుంది. 
అవ్వా దీనిలో ఏమున్నాయి 
నీవే చూడు 
ఏమి లేవనుకుంటాను 
సరిగ్గా చూడు 
ఆ ఉన్నాయి 
12  రాగి పైసలు 
ఇంకా ఏమున్నాయి హనుమంతుని ఫోటో 
ఏమిటవ్వ ఈ ఫోటో పైసలు కధ 

చెపుతా బాబు ఏమనుకోకపోతే ఆబంకులో టీ అమ్ముతారు ఓ కప్పు టి నువ్వు త్రాగి నాకు తెస్తావా.
తెస్తానవ్వా నువ్వు ఇక్కడే కూర్చో అని బంకు దగ్గర కెళ్ళాడు.
బంకు వాడు ముస్సల్ది ఏమైంది నువ్వు వచ్చావు, నువ్వెవరు అని అడిగాడు 
వివరాలు నీకు అవసరమా 
ముందు టీ లు ఇవ్వు 
అబ్బో పిల్లోడు ఇంతలేడు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటూ గొణిగి టి పోసి ఇచ్చాడు 
డబ్బులు తీసుకోవా 
వద్దులే బాబు ఈ టీ నే కదా అవ్వకు తీసుకెళ్ళు అన్నాడు 
వాడి మాటలకు ఏమీ అర్ధం కాకా రెండు కప్పులు పట్టుకొని అవ్వకు ఒక కప్పుఇచ్చి మరో కప్పుతో టీ త్రాగుతున్నాడు మాధవ్       
అవ్వా ఆ టీ వాడు ముందు దురుసుగా మాట్లాడి తర్వాత డబ్బులక్కరలేదన్నాడు 
వాడు నాకొడుకు బాబు వీడు కాక ఇంకా ముగ్గురున్నారు వాళ్ళ కధలు ఇప్పుడు నీకు చెప్పి బాధ పెట్టడం, నేను బాధ పడటం నాకు ఇష్టం లేదు. 
సరే అవ్వ 
ఆ సంచి కధ చెపుతావా              
       
 " బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన సంచి పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో పెట్టుకున్నాను . "
 .
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భర్త చాలా అందగాడు  నాకు బావ అంటే చాలా ప్రేమ అపుడు బావ ఫోటో నా పర్సులో పెట్టుకున్నాను  . 
 .
ఇక జీవిత సమరంలో  నాకు కొడుకులు  పుట్టారు  . వాళ్లంటే నాకు చాలా ఇష్టం . వాళ్ల  కోసం నేను ఉద్యోగం చేసాను 
ఏమి మీ ఆయన ఉద్యోగం చేయడా 
ఎందుకు చెయ్యడు చేస్తాడు జీతమంతా కల్లు, సారాయి దుకాణాలకు ధార పోస్తాడు ఒక వైపు భర్తను పిల్లలను కష్ట పడి వాళ్ళు వేసే వేషాల్ని తట్టుకొని సంసారం సాగించాను.
ఆ చప్పు అవ్వా   
ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే, పిల్లలతోను  లోకం అన్నట్టుగా గడిపేదానిని . వాళ్ళని  భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేదానిని . వాళ్ల ని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని మావారికి చాలా కోపం వచ్చేది పిల్లలు పుట్టాక నన్ను దూరం పెడుతున్నావని . వాళ్లే  నా లోకం . అపుడు నా సంచి  పర్సులో వాల్ల ఫోటోలు  పెట్టుకునే దాన్ని . వాళ్ళ ఇపుడు ఎవరి దారి వారయ్యారు, ఎంత  సేపటికి నా పెంక్షన్ డబ్బులకోసం నన్ను ఉంచుకొనేవాళ్ళు నేనంటే నేను ఉంచుకుంటానని అందరు వదిలి పెట్టారు నేను ఇట్లా ఉన్నాను. 
అవ్వా కొడుకులు నిన్ను చూసుకోవటంలేదా, సహాయం చేయుటలేదా 

ఎం సహాయమంటావు బాబు మనవలు మనవరాళ్లు పెరిగేటప్పడికల్లా, సంపాదన పెరిగేటప్పడికల్లా, నువ్వేం పెట్టావు మాకు అనే ప్రశ్నకు మారారు, వాళ్ళను ఏమి అనలేక  నేను బయఁట రూములో ఉంటానంటే ఎవ్వరూ మాట్లాడలేదు . నా భర్త  మూడు సంవత్సరాల క్రితం చనిపొయ్యాడు  . ఇపుడు నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా హనుమంతుని ఫోటో  పెట్టుకున్నాను (ఆఫొటోలన్నీ తీసివేసి) . ఆయనే నాకు ఇప్పుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికిఆయనే  ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో గడుపుతున్నాను . " 

 ఆ హనుమంతుడే మాకులదైవం నాకు కొండంత ధైర్యం ఇస్తాడు నా కలలోకి వచ్చి నన్ను నీ  కొడుకు అనుకోవమ్మా నీకు అన్నీ దగ్గరుండి సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు కలలో. ఇది బాబు ఈ జీవితం ఇంకా ఎన్నాళ్ళో ......  ఈ ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళో ....
అనుకున్నాడు మాధవ్ ..... ..... ....
   .--(())--

 .ఈ కధ ఇంకా ఉంది ... 4

మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  


మాధవ్ నడక సాగించాడు ఒక పార్క్ వద్దకు చేరాడు అక్కడ పిల్లలు ఆడుకుంటునారు ఒక బాబు పరుగెడుతూ క్రిందపడ్డాడు, కాలికి బాగా దెబ్బ తగిలింది రక్తం కారుతున్నది, అందరు భయముతో చూస్తున్నారు అప్పుడే మాధవ్ అక్కడ ఉన్న ఒక చెట్టు ఆకు రసం తీసి పిండి తనచోక్కా చింపి కట్టు కట్టాడు, కాస్త కాళ్ళు విదిలించి ప్రక్కన ఉన్న బల్లపై కూర్చో పెట్టాడు, అప్పుడే పిల్లవాడి తల్లి వచ్చి వీడికి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు పెద్దవాళ్ళతో ఆడ కూడదంటే వినడు అంటూ గుంజుకుంటూ వెళ్ళింది. అందరూ ఎవరి దారి వారు వెళ్లిపోయారు. 

ఎంత సహాయము చేసిన పట్టించు కోని జనం అవును ఇది కలియుగం, 

తల్లి మాట గుర్తు చేసుకున్నాడు మాధవ్ 

చల్ల బడెడి దేహ సంబారముల్ నిల్చు 
వణుకు జూపి వేడి వాలు హెచ్చు 
క్రియలు జరుప నేర్చు కీడని తలవకు 
మెన్నువిరిగి పాన బడ్డ చేయు సేవ 
  
 మాధవ్ నడక ప్రారంభించాడు.
   
చెత్త తీసుకెళ్తూ రిక్షా ఆగింది బాబు ఈ లైన్ చివరిదాకా నాకు సహాయ పడతావా నీ ఋణం ఉంచు కొనులే అని జేబులో నోటు తీసి ఇవ్వబోయాడు, మీదగ్గరే ఉంచండి పెద్ద వారు లాగున్నారు మీకెందుకు ఇంత  కష్టము అన్నాడు మాధవ్, నాకు కొడుకు ఉన్నాడు వాడు చేయడు నన్ను చేయ నీయడు మాట్లాడితే చదువుకు తగ్గ ఉద్యోగము లేదు అంటూ దేశాన్ని తిట్టి పోస్తూ కుర్రోళ్లతో తిరుగుతాడు. రిక్షాను ఒకవైపు తోస్తూ ప్రతి ఇంటి గుమ్మం వద్దకు పోయి వారు తెచ్చే చెత్త కవర్లు రిక్షాలో ఉంచటం చేసాడు. బాబు ఇదిగో ఈ పైసలు తీసుకో అన్నాడు, చూడండి నీకొడుకే చేసాడని అనుకోండి నాదారిన నేను వెళ్తాను, మంచిది బాబు నీ సహాయమే నిన్ను మంచి మార్గాన నిలబెడుతుంది అని దీవించాడు.            

బాబు నీకో విషయము తెల్ప దలిచాను నీ లక్ష్యం నెరవేరే దాకా అధైర్య పడకు అంటూ 
 ముసలివాడు ఈ విధముగా కూర్చోబెట్టి చెప్పాడు లోకరీతి 
                
గమ్య మెక్కడో అర్థమే తెలియ లేదు 
సౌమ్య భావము ఎప్పుడు వదల లేదు
కర్మ నెవ్వరు తప్పించ లేరు ఎపుడు 
ధర్మ మంతయు బతుకుకు మార్గ మవ్వు 

బలము లేనప్పుడూ సంధి చేసి బతుకు 
సంధి వల్లను తేజస్సు పెరుగు చుండు 
కాల్చి నప్పుడే దానివిలువలు తెలియు 
బలము తనకన్న తక్కువ  వాని పైనె 

సముని తో విరోధములు సలపక ఉండు
కాలి బంటు బలము ఉన్న వాని చెలిమి 
వద్దు, పచ్చి ఘ టము అదే ఘటము తగిలి 
ముక్క లగు చెలిమియు కూడ వద్దు   
     
                                                                                 ఈ కధ ఇంకా ఉంది ... 2
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  



అప్పుడే వెనుక ఒక ఇసక లారీ వచ్చి ఆగింది పనికెళదాం నీవు కూడా వస్తావా అని అడిగారు, మీరు వెంటనే ఆ లారి మీదనుంచి దిగండి, ఇలా ప్రయాణం చేయటం మంచిది కాదు అని హెచ్చరించాడు మాధవ్, వస్తే "రా " లేకపోతే లేదు మాకు నీతులు చెప్పవద్దు అంటూ వెళ్లారు. 

నడవలేక అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఆగడు మాధవ్, ఒకవయసు మళ్ళిన వాడు అక్కడకు వచ్చి ఆగాడు మాధవ్ అతన్ని మీరు ఇంత ఎండలో పనిచేయటం అవసరమా బాబు నీవు చిన్నవాడివి రెక్కలు వచ్చిన పక్షులు గూటిలో ఉండవు గుటిలో ఉండేది చిలక గోరింకలే అన్నాడు 

అసలు మీరేం చేస్తారు అని అడిగాడు మాధవ్.
అదిగో ఆ కనబడుతున్న హోటల్ ల్లో ఫలహారాలు భోజనం రడీగా ఉన్నది అనే బోర్డు పట్టుకొని 12 గంటలనుండి 3 గంటలదాకా నుంచుంటే నాకు నాభార్యకు సరిపడే ఆహారము ఇస్తాడు అది చాలు మాకు బాబు అన్నాడు.

 ఈరోజు నీపని నేను చేస్తాను మీరు ఈచెట్టుదగ్గర కూర్చోండి అని చెప్పి బోర్డు పట్టుకొని ఎండలో నుంచొని అహార పోట్లామ్ తెచ్చి ఇచ్చాడు. 

బాబు నేను దీవెనలు తప్ప ఏమీ ఇవ్వలేను అవి చాలు మిమ్మల్ని దింపి నేను వెళతాను, నేనువెళతాను బాబు ఈప్రక్కనే గుడిసె అన్నాడు. పట్టుబట్టి గుడిసేదాకా దించి అక్కడ కాసిని మంచినీళ్లు త్రాగి బయలు దేరాడు. 

నడుస్తూ పోతున్నప్పుడు ఒక్కసారిగా శబ్ధం విన్నాడు, వెనక్కి తిరిగి చూస్తే చిన్నలారీ ఫుట్ పాత్ ను కొట్టడం లారీ ముందు టైర్ బరష్టవ్వటం జరిగింది. 

అసలు ఏమైనదో కనుక్కుందామని లారిదగ్గరకు వెళ్ళాను. లారీలో కొబ్బరి బోండాలు ఉన్నాయి. లారీ డ్రైవర్ ఒక్కడే ఉండటం వళ్ళ టైర్ మారుస్తున్నప్పుడు కష్టపడుతుంటే మాధవ్ కూడా సహాయం చేసి కొత్త టైరును ఎక్కించాడు. 
డ్రైవర్ సంతోషముతో ఈ ఐదు వందరూపాలు తీసుకో అని నా చేతిలోపెట్టాడు. 

చూడండి నేను డబ్బు ఆశించి నీకు సహాయము చేయలేదు మానవతా దృక్పధంతో సహాయపడినాను అన్నాడు, అమాయకుడిలాఉన్నావు నీవు ఈ కలికాలంలో బ్రతకటం కష్టం. 

నీ కష్టాన్ని నేనూ ఉంచుకోలేను అన్నాడు. నేను ఒక పని చేస్తా దానికి నీవు సమ్మతమై ఒప్పుకోవాలి అన్నాడు డ్రైవర్ .సరేచేప్పు అన్నాడు మాధవ్ . లారీ ఎక్కు చెపుతా అన్నాడు 
ఎక్కాడు మాధవ్ కదులుతున్నది లారీ,  డ్రైవర్ నెమ్మదిగా చెబుతున్నాడు. 

నేను ఈ కొబ్బరి బొండాలు ఇక్కడ జరిగే సంతలో కొన్ని ఒక వ్యాపారికి కాయ 5 రూపాయాలకు ఇచ్చి మిగతావి పక్కసంతలో వానికి ఇవ్వాలి.  ఇంకా మిగులు తాయా అని అడిగాడు మాధవ్ . ఎందుకు మిగలవ్ 100కు పైగా ఉంటాయి అవి కూడా వాల్లకే ఇస్తాను డబ్బులు తీసుకుంటాను. మీ వోనరుకు చెబుతావా అని అడిగాడు. 
మా ఓనరు కు చెబితే ఊరుకుంటాడా ఊరుకోడు అవి నేను త్రాగుడికి వాడుకుంటా అన్నాడు.  
వెంటనే నీవు లారీ ఆపు నీవు తప్పు చేస్తున్నావు, నీకు ఇచ్చే రోజువారీ బేటా తీసుకోక,  ఈ అక్రమ సంపాదన ఎందుకు దానివళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు అన్నాడు. 

ఒక్కసారిగా బ్రేక్ వేసాడు మాధవ్ మాటలకు 

ఇంతవరకూ ఇలా చెప్పినవారు లేరు మొదటిసారిగా వింటున్నాను. ఈ రోజు నుంచి నేను న్యాయంగా బ్రతుకుతాను 
నేను చెప్పిన పని చేస్తానంటే 
సరే చెప్పు అన్నాడు 
ఇక్కడ సంతలో ఒక చెట్టు క్రింద 100 కొబ్బరి బొండాలు దింపుతాను, నీకు ఒక కత్తి కూడా ఇస్తాను, నీవు బ్రతకటాని మార్గాలు వెతుకుంటూ ఉన్నావు కాయ 3 రూపాయలకే ఇస్తా నీ ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకో అన్నాడు. 

చూడు నీవు ధర్మం తప్పకూడదు, జాలి పడి తప్పు చేయ కూడదు నాదగ్గరకూడా 5 రూపాయలే తీసుకో కానీ ఇప్పుడు ఇవ్వలేను తిరిగి వచ్చేటప్పటికల్లా కాయలు అమ్మి నీ కత్తి ఇస్తా,  అందుకు ఒప్పు కుంటేనే నేను తీసుకుంటా అన్నాడు మాధవ్ . 

సంతలో చుట్టు దగ్గర ఆపడం జరిగింది. నేను కేవలం 3 గంటల్లో తిరిగివస్తా నాకు 500 ఇవ్వగలవా. ఇవ్వగలను, నేను మాట తప్పను. సరే అలా టీ తాగుదాం వస్తావా అని అడిగాడు డ్రైవర్.

నాకు అలవాటు లేదు నేను త్రాగాను అన్నాడు, ఈ లోకంలో ఎలా బ్రతుతాడో అమాయకుడిలా ఉన్నాడు నేను టీ త్రాగి వచ్చి వెళ్తాను అని చెప్పి హోటల్కు వెళ్ళాడు డ్రైవర్ . 

అక్కడ కాగితపు అట్ట మీద బోండా 10 రూపాయలు మాత్రమే, 5 తీసుకున్నవారికి 40 రూపాయలు మాత్రమే అని వ్రాసాడు. అక్కడ ఉన్న ఒక వ్యాపారి మేము 20 రూపాయలకు అమ్ముతుంటే నీవు తక్కువకు అమ్మటం మంచిదికాదు గట్టిగా అన్నాడు. 

నేను మీలాగా బ్రతుకు తెరువుకోసం వచ్చాను మొత్తం కాయలు మీరే తీసుకోని మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి అన్నాడు మాధవ్ . 

ఇవిగో ఈ 800రూపాయలు తీసుకో నీవు చెప్పిన లెక్కేగా అన్నాడు. 
అవి తీసుకోని హోటల్ కు బయలు దేరాడు. డ్రైవరుకు 500 రూపాయలు ఇచ్చి మిగిలిన వానితో కొంత అల్పాహా  రము తిని సంచీ తీసుకొని జై భజరంగ్ బలీ అంటూ అరిచాడు డ్రైవర్ కూడా వంత పలికాడు. 

నీవు ఎక్కడికి పోతావ్ పక్క సంత పెద్దది అక్కడ దిగి నీతెలివితో ఏదైనా వ్యాపారం చేయ్ . 

నా మొదటి సంపాదనకు సహకరించినందుకు నిన్ను నేను ఎప్పటికీ మరచి పోలేను. 

డ్రైవర్ గారు నేను మా గురువు గారు వ్రాసిన  పాట పాడితే నీకేమన్నా ఇబ్బందా 

పాడు బాబు పాడు నాకేం ఇబ్బంది లేదు, ఈ రోజు నాకు చాలా సంతోషముగా ఉన్నది     

ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

వేదోద్ధారణ సేసినదెవరు?
 విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు? 
నాట్యానందము నొందెడిదెవరు?

ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

ఆధారంబయి యుండెడిదెవరు? 
అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు?
 ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

అంతా తానయి నిండెడిదెవరు ?
 ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ? 
శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు?
 కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు?
 స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

బోధన్‌ జేయుచుఁ దెల్పెడిదెవరు? 
ముక్తన్‌ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు? 
నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు? 
నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు?
 నీవే నేనని యన్నది యెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా 
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా 
చెప్పవా ఇక్కడా 

లారీ ఆపాడు 
అదిగో హనుమంతుడు గుడికి వెళ్లి వద్దాం నేను వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని దర్శనం చేసుకొని మరీ లారీ నడుపుతాను  
ఇద్దరూ కలసి వెళ్లారు అక్కడ రాములవారు హనుమంతుని ఆలింగనం చేసుకున్న చిత్రం చూసారు, తన్మయత్వం తో మునిగి పోయాడు మాధవ్ 
దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నారు 
చూడు బాబు నీవు చదువుకున్న వాడిలా ఉన్నావు నాకు చదువులేక బండగా తయారయ్యాను 
చదువొక్కటే కాదు కుటుంబం అంత సక్రమ మార్గంలో ఉండాలి నమ్మకం మీద బ్రతకాలి అన్నాడు మాధవ్ .

రామాయణంలో రాములవారు హనుమంతుని నమ్మి ఉంగరం ఇచ్చారు, సముద్రము దాటి లంకలో ఉన్న సీతను దర్శించి ఆమెఇచ్చిన చూడామణి తెచ్చి చూపాడు అప్పుడు రాములవారు సర్వశ్రేష్ఠం సర్వోత్తమం సర్వోన్నతం అనదగిన ఒకానొక అపురూపమైన ఆలింగనం సౌభాగ్యాన్ని హనుమకు ఇచ్చడు. 

ఆలింగనమే మనసులను కలిపేది డ్రైవర్ అంటూ ఒక్కసారి మాధవుని హత్తుకొని నీకు ఏ సహాయము కావాలన్న ఈ హనుమన్న ఉన్నాడని మరచి పోకు అంటూ లారీ ఎక్కాడు, 
చంకను బ్యాగ్ పెట్టుకొని నడక ప్రారంభించాడు మాధవ్.     
                 

Friday, 28 April 2017


మల్లాప్రగడ రామకృష్ణ కధలు -24/9 (14-08-2020)


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
 

మనసులో ముసుగు - చిన్న కధ దా  

 వేసవిలో ఉష్ణ గాలుల ప్రభావము వల్ల, శరీరమునకు అనుకోని విధముగా కప్పివేస్తూ మనసును శరీరమును వెచ్చగా మార్చు చున్నది, అనగా మనసు ప్రభావముగా పనిచేయక ప్రకృతి ప్రభావమునకు లొంగి పోయి హృదయంలో ఉన్న రక్తము ఉడికి చమట రూపములో బయటకు వస్తున్న జలము మనసును చికాకు పరిచేదే మనసులో ముసుగు.

మనసుకు పున్నమి వెన్నెల, చల్లని గాలి చేరగా శరీరము పులకింత చెందగా అనుకోని శరీరములో కొన్ని స్పందనలు బయటకు చెప్పుకోలేక, వాటిని సుఖము వైపు తిప్పుకోలేక, పకృతి సౌరభాన్ని అనుభవించలేక, తోడు ఉన్న తోడు లేనివాడిగా, చకటిని తరిమే వెన్నెలను పంచుకోలేక వెన్నెల నీడలాగా ఏవిధముగా పనికిరాని వానిగా మనసులో ముసుగు ఏర్పడుతున్నది .         
     
కొందరు ఆశలవలయం లో చిక్కి తెలివిలేని వానిగా ప్రవర్తించి తనుచెప్పునదే వేదమని వా దించి, తన మాటను ధిక్కరించారని పదే పదే అనుకొని, తనలో ఉన్న భావాలన్నీ వ్యక్తపరిచి, కాల గమనంలా తిరుగుతూ కాలక్షేపంతో బ్రతికేవారు కొందరుందురు వారి మనసులో ముసుగు ఉంటున్నది.

మరికొందరు జంతువుల్లాగా కష్టపడుతూ, తను చెప్పాలనుకున్నది చెప్పుకోలేక మూగ వానిగా మారి, తను మదన పడుతూ ఇతరుల బాధను అర్ధం చేసుకోలేక చేతికి దొరికినవి తింటూ, వీలు ఉన్నచోట శయనిస్తూ దొడ్రికిన నిరు త్రాగుతూ ఎవ్వరు లేని వాడిగా, మొండిగా బ్రాతుకు లాగే వారి మనసులో ముసుగు ఉంటున్నది      

సరస్సులోని  కమలం తన్మయత్వంతో వికసించింది, గూటిలోని చిలకా గోరింకలు గుసగుసలాట మొదలైనది, చిగురాకు కదలిక మొదలైంది, కానీ మానవుని మనసులో ఏమున్నదో మాత్రమూ ఎవ రూ తెలుపలేరు, పైన ఒక మాట లోన ఒక మాట నడుస్తున్నది, పెదాలతో ఒకమాట, హృదయంతో మరోమాట చెప్పేవారు కొందరుంటారు, వారు కేవలము ఆశా సౌధములో మునుగుతూ గొప్పవారిగా నటిస్తూ మనసును మునుగులోకి మార్చి బ్రతుకుతారు.       

 గంగమ్మ తల్లి కిరణవెలుగుతో నూతనోత్సాహముతో పరవళ్లు తొక్కుతూ కదలిక ప్రారంభిస్తుంది
సకలజీవకోటికి ప్రాణా ధారమవుతుంది, కానీ మానవుడు సాటి మనుష్యులకు సహాయము చేయుటకు ముందుకురారు, ముందుకు వచ్చినా మన స్ఫూర్తితో చేయరు, వారి మనసు ఒక వైపు చేతలు మరోవైపు మానవులు జీవనదాతలుగా మారక, మనసు ఒక వైపు, మమత మరోవైపు, ధనము చుట్టూ తిరుగుతూ మనసులో మునిగి ఇవిగా మాత్రమే బ్రతుకుతున్నాడు.    

జీవకోటి కనులు విప్పి ప్రకృతినిచూసి ఆనంద పారవశ్యంలో కర్తవ్య నిర్ధారణకు వేళైనది అని ముందుకు వచ్చే వారెందరో మిరే తెలపండి .
       
   "అంతరంగాల భావం మానవులు అర్ధం చేసు కోలేరు, ముఖ్యముగా ఆడవారి భావాలు ప్రత్యక్షముగా చెప్పలేరు, అవసరము వచ్చినప్పుడు మనసులోని ముసుగు తెలియపరచి వప్పించు కోవటం స్త్రీలలో ఉన్న ప్రత్యేకత, దానికి లోబడి అనుకరించుటే భర్తగా భవిషత్ మార్గం చూపే విధముగా ఇరువురి కలసి నిర్ణ ఐమ్చుకొని మనసులోని ముసుగును తొలగించు కోవటం జీవితానికి నిజమైన మార్గం.  అని ఆశ్రమానికి వచ్చిన వారితో చప్పటం ముగించారు  గురువుగారు. 

అనురాగం ఇంటర్నెట్టులో 
అవగాహన వెబ్సైడ్ లో 
అలక ... కరంటు 
ఆనందం ..... నిత్యాన్వేషణ 

ఆడదాని వయసు - మొగవాని సంపాదన 
సుఖము పొంది లేదనుట - సుఖము కోసం వెంపర్లాడటం 
ఆడదాని కోపం మొగవాడి ముద్దు తో సమానం 
మొగవాడి ప్రేమ నీటి బుడగలాంటి దనుకోవడం 


Thursday, 27 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -23/8

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

అపరాధి ?

రోడ్డు మీద ట్రాఫిక్ ఎపుడు ఆగుతుందా అని కొందరు ఎదురు చూస్తున్నారు, అప్పుడే సర్కిల్ సెంటర్లో సిగ్నల్ పడింది , నడిచేవారు నడుస్తుండగా స్కూటర్ వాళ్ళు, ఆటోలు, లారీలు బస్సులు   కారులు ఒక్కసారి వరుసగా ఆగాయి. ఒక కారు డోరును చేతి  ఉంగరాల వేళ్ళతో  టకటక కొట్టినాడు ఒక మధ్య వయస్సుగల గడ్డం ఉన్న మనిషి,. తలుపు తీయగా లోపల కూర్చొని వ్యక్తి బయటకు తోయబోయి కుదరక  రెండవ తలుపు తీసి వేగంగా కారు దిగాడు, అప్పుడే సిగ్నల్ పడింది సైకిల్లో వచ్చేవ్యక్తి కారు డోరుతగిలి ప్రక్కకు పడ్డాడు, కారునుండి దిగిన వ్యక్తి పరుగెత్తు తుంటే వెనుక నుంచి గడ్డపు మనిషి కత్తి విసరగా అక్కడి కక్కడే చనిపోయాడు, అక్కడ ఉన్న జనం తిరగబడి చంపిన వాణ్ణి గట్టిగా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు.

చనిపోయినవాడు రాజేంద్ర అని, చంపినవాడు మాధవ్ అని గుర్తించి అన్నీ  వివరాలు తెలుసుకొని చంపిన వాణ్ణి కోర్టులో హాజరు పరిచారు.ఎన్ని ప్రశ్నలు వేసినా  చంపాను, ఎందుకు చంపానో మీరే కనుక్కోండి, నేను ధర్మం తప్పులేదు, మీరు ఏశిక్ష విధించిన న్యాయబద్దగా అనుభవిస్తా, ఉరిశిక్ష వేసిన అనుభవిస్తా అని ధైర్యముగా చెప్పాడు మాధవ్ .

పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్షాలు సరిగా లేక పోవటం వల్ల, పట్టిచ్చినవారు ఎవ్వరూ సాక్షం చెప్పక పోవుటవల్ల 
జడ్జిగారు ఈ కేసును వచ్చేనెలకు వాయిదా వేస్తున్నాను అని తెలిపి, పోలీస్ వారు, పూర్తివివరాలు సేకరించి, ఇతనే చంపినట్లుగా సాక్షులను ప్రవేశ పెట్టండి, అని తెలుపుతూ నేరస్తుణ్ణి పోలీస్ కష్టడీలో ఉంచండి అని చెప్పి లేచారు జడ్జిగారు అందరూ  లేచారు, అప్పుడే గడియారం గంట కొట్టింది.
కోర్టు గోడలు దద్దరిల్లి పోతున్నాయి ఎందుకంటే ఇసుకవేస్తే రాలనంత జనం కోర్టుకు వచ్చారు, మాధవ్ నిరపరాధి అతనికి శిక్ష పడకూడదు అని అరుస్తున్నారు.

కోర్టు ప్రారంభమైనది లాయర్ కొందరి అభిప్రాయాలు ఈ కేసుకు ముఖ్య ఆధారాలు వారు స్వయముగా మీకే విన్న వించు కుంటామన్నారు మీరు అనుమతిస్తే , తెలియపరుస్తారు.  అనుమతి ఇస్తున్నాను.
రాజేంద్రగారి భార్య రజనీని పిలవటం జరిగింది.

నేను భగవద్ గీత సాక్షిగా అంతా నిజమే చెపుతాను, అబద్ధము చెప్పను అని ప్రమాణము చేసి ఈవిధముగా తెలియపరిచింది. నాభర్త వ్యసనపరుడు, ఆశపరుడు, ఇంకా కావాలి అనుకొనే దురాశపరుడు, భారతనారీమణిగా ఎంతో ఓర్పుతో ఇప్పటిదాకా నన్ను పెట్టిన కష్టాలు భరించాను, అతను చనిపోవుటకు సహకరించిన వానికి నేను నమస్కరిస్తున్నాను, నాభర్త చనిపోయినందుకు నాకు భాధ లేదు, అతను నాకు చేసిన మంచిని తలచుకొని జీవిస్తాను, స్వేశ్చయా వాయువుని పీల్చగలిగాను నాకు  న్యాయం చేయగలరని ఆసిస్తూ ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు అని రజని అందరికి నమస్కరించి బోను నుండి బయటకు వచ్చింది.

తరువాత మాధవ్ భార్య రాధను పిలిచారు.,  నేను భగవద్ గీత సాక్షిగా అంతా నిజమే చెపుతాను, అబద్ధము చెప్పను అని ప్రమాణము చేసి తన అభిప్రాయాన్ని తెలియ పరిచింది. నాభర్త అతనిని చంపుటకు కారణము నేనే చంపేసిన వానికన్నా ప్రోత్సహించిన వానికి శిక్ష పడాలి అని గట్టిగా తెలియ పరిచింది.

జడ్జిగారు అసలు ఏమి జరిగిందో పూర్తి వివరాలు తెలియపరచండి అన్నప్పుడు ప్రజల నుండి పెద్ద స్పందన వచ్చింది

మాపెళ్లి తర్వాత జరిగిన విషయం చెప్పాలి మీకు ఏమిటంటే
పార్కులో మాధవ్ ను ఒక అమ్మాయి ప్రేమించింది, నేను నిన్నేతప్ప వేరొకరిని ప్రేమించెను అని ఎంబడి పడిందట, ఆమ్మాయి పేరు " నళిని " కానీ నాభర్త మాధవ్ కు ఆమె అంటే ఇష్టం లేదు, ఎన్నో మంచి మాటలు చెప్పినా వినిపించు కోలేదు, నీవు వప్పుకోక పోతే నీముందే చచ్చిపోతా అని బెదిరించింది. అందరి ముందు ప్రతిజ్ఞలు చేసింది. ఆరోజు రాత్రే ఆమె చనిపోయినది. అని వివరించింది
లాయర్ లేచి కోర్టుకు సంభందం లేని విషయాలు తెలుపుతున్నారు అన్నాడు
జడ్జిగారు తెలియపరచండి తరువాత ఏమి జరిగింది
5 సంవత్సరాలు క్రితం ఇదే కోర్టులో నాభర్త అపరాధి అని తీర్పు ఇచ్చి జరిమానాతో పాటు 2సంవత్సరములు శిక్ష కూడావిధించారు. కేవలము ప్రేమించనందుకు, చంపారని సాక్షాలు పుట్టించారు.నాభర్త శిక్ష అనుభవించారు 
తప్పు చేసినవారికి శిక్ష పడుట తప్పు కాదు అన్నారు జడ్జిగారు.
అవునండి అవును మీరు చెప్పినది అక్షరాలా నిజం, మీకు కావలసినది సాక్షం మాత్రమే
అదే సాక్షం గా నాభర్త అప్పుడూ నిరపరాధి ఇప్పుడూ నిరపరాధి అని అరిచింది.                                 
లాయర్ లేచి ఆకేసుకు ఈకేసుకు సంబంధము ఏమిటి అని అడిగారు.
ఆ నళిని ఎవరో కాదు రాజేంద్రగారి చెల్లెలు ఆమె చని పోయిందని నన్ను మావారు లేని సమయాన నన్ను తీసుకొనివెళ్ళి  ఒక భూతల గృహములో బంధించాడు. సరిఅయిన ఆహారము ఇవ్వక తన కోరికను తీర్చమని రోజూ వేధించే వాడు, అప్పుడే రాజేంద్ర గారి భార్య అగు రజనికి చేతులెత్తి దండాలు పెట్టాలి నన్ను తన భర్తకు చిక్క నీయ కుండా నన్ను తప్పించింది.

నన్నుబందించాడని కోపంతో నాభర్త కత్తి తీసుకోని వెళ్ళటం నిజం తరువాత ఏమి జరిగిందో మీకు అందరికీతెలుసు అదే కీచకుడ్ని ఆడవాళ్లు చంపితే శిక్ష ఉండదు, మొగవాళ్ళు చంపితే శిక్ష, ఎంతవరకు నిజమో మేరె తెలపాలి, నాభార్త చెప్పినదే నేను చెపుతున్నా , సత్యం ఎదో న్యాయం ఎదో ధర్మం ఎదో తెలుసుకొని శిక్ష వేయండి. వందమంది అపరాదులను శిక్షించ వచ్చు కానీ ఒక్క నిరపరాధిని శిక్షించితే లోకం ఒప్పుకోదు అని తెలియపరిచినది రాధ.

జడ్జిగారు పోలీసులను పిలిచి మీరు చెప్పుకోవలసినది ఎమన్నా ఉన్నదా అని అడిగారు. మాకు దొరికిన సమాచారం మీకు ఉదహరించాం అని తెలియపరిచారు.

అప్పడే శిక్ష వివరించాలని జడ్జీ గారు ముందు కొచ్చారు, ఒక వ్యక్తిని నడిబజారులో సంహరించటానికి పూనుకోవటం తప్పే కారణాలు ఏమైనా మాధవ్ చేసినది తప్పే, అన్నారు.

అపుడే మాధవ్ గట్టిగా నవ్వటం మొదలు పెట్టాడు.

నీవు ఎమన్నా చెప్పాలనుకొంటే బోనులోకి వచ్చి చెప్పు అన్నారు.ధర్మాసనం కూడా తప్పుదోవ పడుతూ ఉంటే నవ్వకుండా ఉండలేక పోయాను అన్నాడు.

నేను కత్తి విసరగా చంపబడ్డాడు అని నన్ను బంధించారు. అసలు ఏమి జరిగిందో మరొక్కసారి గమనించి నాకు శిక్ష వేయండి అన్నాడు కోర్టు హాలు అంతా ఒక్కసారి నిశ్శబ్దంగా మారింది ఆమాటలకు.

అప్పుడే లాయర్ కోర్టును ఆపారాధి తప్పు దోవ పట్టిస్తున్నాడు, శిక్ష తప్పించుకోవటానికి ప్రాయత్నిస్తున్నాడు ఏవో కట్టు మాటలు చెపుతున్నాడు, మీరు గమనించి శిక్ష వేయండి అన్నాడు.

అప్పుడే జడ్జిగారు తెలియ పరిచాడు సాక్షాధారాలు బట్టి ఇతనికి శిక్ష పడాలి కానీ నామనసు అంగీకరించుట లేదు, ఈ కేసుకు సంభందించిన విషయాలన్నీ సేకరించమని ఆదేశిస్తున్నాను వెచ్చే నెలకు వాయదా వేస్తున్నాను. అని తెలియపరిచారు. 
మరొక్క విషయం తెలుపుతున్నాను,  నేను జడ్జీ పదవి ఈ రోజే రాజీనామా చేస్తున్నాను.  ఈ కేసును స్వయముగా వాదించాలను కుంటున్నాను.  నాకు అనుమతి మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని తెలిపి లేచారు. అప్పడే గంట మ్రోగింది.

కోర్టు ప్రారంభమైనది లాయర్ విశ్వనాధం గారు మాధవ్ నిరాపరాధిగా వాదించారు.
క్రొత్తగా వచ్చిన జడ్జి గారు వాద ప్రతివాదనలు బట్టి మాధవ్ నిరపరాధి అని న్యాయస్థానం నమ్మి జరిమానా విధించి  విడుదల చేయటమైనది. రాజేంద్ర చనిపోవుటం కత్తి విసరటం వల్ల చేతికి గాయం జరిగి క్రింద పడ్డాడు, అందరూ చని పోయాడని తలంచి  మాధవ్ ను పట్టుకున్నారు, అక్కడ ఉన్నవారెవరో ఒకరు రాజేంద్రకు విషం ఇంజక్షన్ చేసినట్లు తెలిసింది దానివల్ల చని పోయినట్లుగా భావించటం జరిగింది.
కాబట్టి రాజేంద్ర చావుకు కారణమైనవారిని పట్టుకోవాలని పోలీసువారిని కోరటమైనది. ఈకేసును వెచ్చేనెలకు వాయిదావేస్తున్నాను అన్నారు జడ్జిగారు.
అందరూ ఒక్కసారి చప్పట్లు కొడుతూ జడ్జీ విశ్వనాధం గారు జిందాబాద్, మాధవ్ జిందాబాద్ అనేఅరుపులు వినబడుతున్నాయి.
అప్పుడే మాధవ్ దగ్గరకు ఒక విలేఖరు వచ్చి  ఇంజక్షన్ చేసిన వారెవరో తెలపండి అన్నప్పడు, ఎవరికివారు న్యాయంగా నిలబడితే ఈ కోర్టులతో పనియేమి అంటూ నవ్వాడు ......

            

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -22/9/5

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
సేకరణ చందమామ కధ.!

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

 “ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.

 ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు.

అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు. ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు.

 వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది. దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు.

కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు. మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి.

 ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు. అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

 మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది. రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు. నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు. అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది.

 ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది. అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది. ఇదీ కథ! ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు.

 విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు. కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు. మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.