1. ఆత్మానందం
1.
ఈ అత్యున్నతమైన ఆత్మ సదా మార్పు చెందే ప్రకృతి కంటే భిన్నమైనది. ఇది
జ్ఞానసారము. పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.
ఎఱుక స్థితిలోనూ మరియు ఇతర స్థితులలోనూ అహం యొక్క ప్రభావమును బుద్ది,
సాక్షిగా గమనించు చున్నది.
2.. మనస్సును అదుపులో ఉంచి బుద్ది స్వచ్ఛమై తన ఆత్మను తాను నేరుగా ఈ శరీరములోనే గుర్తించి సరిహద్దులేలేని సంసార మహాసముద్రమును దాటి, పుట్టుక, చావు లేని బ్రాహ్మిక స్థితిలో స్థిరపడుతుంది. అది తన అసలు స్థితిని తాను పొందుతుంది.
3. అజ్ఞానమనే బంధనాల నుండి విడివడి, పుట్టుక, చావులనే దుఃఖాలకు అతీతమై జీవాత్మ పరమాత్మను గుర్తిస్తుంది. అజ్ఞానము వలన, క్షయించే ఈ శరీరము నిజమని భావించి, అదే తానని భావిస్తూ, దానిని పోషిస్తూ, దానికి వివిధ అలంకారములు, సుగంధములు అలుముతూ దాని బంధనాలలో జ్ఞానేంద్రియాలకుచిక్కినట్లు అనగా పట్టుపురుగు తన చుట్టూ తానే గూడు కట్టుకొని అందులో బంది అయి, తన చావును తానే కొనితెచ్చుకొన్నట్లు జీవాత్మ చిక్కుకొన్నది.
4. ఏ వ్యక్తి అయితే అజ్ఞానమనే చీకటిలో మునిగి సరైన వస్తువును గుర్తించలేక మంచి, చెడు వ్యత్యాసమును గ్రహించలేక, తాడును పామని భ్రమించినట్లు అనేక ప్రమాదాలను ఎదుర్కొనుచున్నాడు. అందువలన ఈ విషయాన్ని గ్రహించాలి. మార్పు చెందే ఈ వస్తు విశేషములు నిజమని నమ్మి బంధనాలలో చిక్కుకొనుట జరుగుచున్నది.
5. ఆత్మ చుట్టూ వలయాలుగా ఆవరించి ఉన్న ఈ అధికమైన అజ్ఞాన ప్రభావములు ఆత్మను తెలుసుకొనుటకు దాని ప్రకాశమును గుర్తించుటకు అడ్డుగా ఉండి, ఆత్మ యొక్క ఔన్నత్యమును అనంత జ్ఞానమును గ్రహించలేక మరియు ఆత్మను మించినది వేరొకటి లేదని, అది విభజించుటకు వీలులేని శాశ్వత సత్యమని తెలుసుకొనలేకున్నారు. రాహువు సూర్యుని చుట్టివేసినప్పుడు సూర్య కిరణముల కాంతి అవ్యక్తమైనట్లు, రాహువు తొలగినపుడు సూర్య కాంతి ప్రజ్వరిల్లుతుంది కాదా! అట్లే అజ్ఞానము తొలగిన ఆత్మ వ్యక్తమవుతుంది.
6. ఆత్మ అనాత్మల భేదములు గుర్తించలేక సాధకుడు ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమును తెలుసుకొనలేక, తన శరీరమే ఆత్మ అని భావించు చున్నాడు. ఆత్మ స్వచ్ఛమైన ప్రకాశముతో ప్రజ్వరిల్లుతున్నప్పటికి అజ్ఞానము వలన గుర్తించలేకున్నాడు. అట్టి స్థితిలో రాజస గుణము యొక్క గొప్ప శక్తి ఆత్మకు అడ్డుగా ఉన్న కామ క్రోధాలను జయించవలసి ఉంటుంది.
7. వికృతి చెందిన తెలివితేటలు తన సొంత జ్ఞానమును అజ్ఞానమనే సొర చేప మ్రింగివేయగా, బుద్ధి యొక్క వివిధ చేష్టలు అనేక జన్మలు ఎత్తుటకు కారణమవుచున్నవి. వాటి వలన మంచి, చెడు జన్మలెత్తి తత్ ఫలితాలను అనుభవించవలసి వచ్చుచున్నది. ఎత్తు పల్లములనే సంసార బంధనాలలో చిక్కి, చావు, పుట్టుకలనే జన్మ పరంపరలకు లోను కావల్సి వచ్చుచున్నది. జ్ఞానేంద్రియాల అనుభూతులకు లొంగి అందులో మునిగి తేలుతూ సుఖదుఃఖాలకు లోనగుచున్నారు.
8. సూర్య కిరణముల వలన తయారైన మేఘ సముహములు సూర్యుని కప్పివేసినట్లు, ఆత్మ వలన తయారైన అహము సత్యమైన ఆత్మను కప్పివేసి తానే వ్యక్తమవుతున్నది.
9. మేఘములతో కూడిన ఆకాశం సూర్యుని కప్పివేసినట్లు, తీవ్రమైన చల్లని గాలులు విస్తరించి ఇబ్బందులు కలుగజేసినట్లు, ఆత్మ లోతైన అజ్ఞానముచే మరుగునపడి యున్నది. అందువలన భయంకరమైన అజ్ఞానము వలన ఆత్మశక్తి వ్యక్తము కాకపోవుటచే తెలివి తక్కువ వ్యక్తి అనేకములైన దుష్ఫలితములను పేదుర్కొని దుఃఖించవలసి వచ్చుచున్నది.
10. ఆవరణ, విక్షేపము వలన మనిషి బంధనాలలో చిక్కుకొని దాని ఫలితముగా తన శరీరమును ఆత్మగా భావించి చావు, పుట్టుకలనే అనేక జన్మలు ఎత్త వలసి వస్తుంది.

11. సంసారమనే వృక్షమునకు అజ్ఞానమనే విత్తనము, తాను శరీరమనే భావన వలన
మొలకెత్తి, బంధనాలనే చిగురుటాకులు, నీటి వలన పెంపొంది, శరీరమనే బోదె
ప్రాణాధార శక్తితో కూడిన కొమ్మలు, వాటి భాగాలైన మొగ్గలు, సువాసనలు వెదజల్లే
పుష్పాలు మొదలగు దుఃఖాలను అనుభవిస్తూ వాటి ఫలితాలైన పండ్లను అనుభవించుటకు ఆ
వ్యక్తి ఆత్మ పక్షివలె వాలుతుంది.
12. అనాత్మ యొక్క ఈ బంధనాలలో
అజ్ఞానము వలన స్వయంగా చిక్కుకొని, మొదలు చివరలేని సంసార బంధనాలను
అనుభవిస్తూ దుఃఖాలనే రైలు ప్రయాణములో పుట్టుక, చావుల రోగములతో
వేగుచుండవలెను.
13. ఈ రకమైన
బంధనాలను గాలి, అగ్ని, ఆయుధాలు మరియు లక్షల కొలది జన్మలు కూడ నాశనము
చేయలేవు. కేవలము ఆశ్యర్యకరమైన విజ్ఞానమనే ఖడ్గముతో మంచి, చెడులను వేరుచేసి
దైవము యొక్క దయతో నశింపజేయవలెను.
14. ఎవరైతే పట్టుదలతో, భక్తిభావముతో
సృతుల ఆధారముతో స్థిరత్వాన్ని సాధించి, స్వధర్మాన్ని పాటిస్తూ స్వచ్ఛమైన
మనస్సును పెంపొందించు కుంటాడో అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలిగిన వ్యక్తి
మాత్రమే అత్యున్నతమైన ఆత్మను తెలుసుకొనగలడు. అపుడే సంసార దుఃఖాలను కూకటి
వేళ్ళతో సహా నశింపజేయగలడు.
15. పంచకోశాలతో కప్పివేయబడిన ఈ భౌతిక
శరీరము మరియు దాని అంగములు ఆత్మ యొక్క శక్తి వలననే ఉత్పత్తి అయినవి.
ఎలానంటే చెరువులోని నీరు తుంగలతో నిండిఉన్నట్లు.
16. తుంగను
తొలగించినప్పుడు చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉండి దప్పిక తీర్చుకొనుటకు
అనువుగా నుండి ఆనందాన్ని కలిగిస్తవి. ఏవిధమైన అడ్డంకి ఉండదు. అలానే ఆత్మ
చుట్టూ ఆవరించి ఉన్న అడ్డంకులను తొలగించిన స్వచ్ఛమైన ఆత్మ వ్యక్తమగును.
17. ఎపుడైతే పంచకోశములు తొలగిపోతాయో అపుడు మనిషి యొక్క ఆత్మ
వ్యక్తమవుతుంది. స్వచ్ఛమైన అనంతమైన ఏవిధమైన అడ్డంకులు లేని బ్రహ్మానంద
స్థితి హృదయములో ఏర్పడుతుంది.
18. బంధాలను తొలగించుకోవాలంటే తెలివి
గల వ్యక్తి ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించగలగాలి. అప్పుడు మాత్రమే తన
ఆత్మను తెలుసుకోగలుగుతాడు. అపుడు పొందిన ఆత్మ జ్ఞానము వలన నిరంతర ఆనందము
లభించును.
19. అన్ని విధములైన జ్ఞానేంద్రియాలను తెలుసుకొన్నప్పుడు
వాటి అవగాహన కలిగినప్పుడు, తన అధీనములోని అంతర్గత ఆత్మవాటికి అతీతముగా
ఉండి, వాటిని నిస్తేజము చేసినపుడే ఆత్మ విముక్తి చెంది దానికి అడ్డుగా ఉన్న
పంచకోశములు ఆత్మలో లీనమై ఆత్మతో సమానమవుతాయి.
--((**))--
2. శరీరము ( శరీరా నందం )
1. మన శరీరము ఆహార సేవనము వలన ఉత్పత్తి అయినది. అది భౌతిక
పదార్థములతో కప్పబడినది. ఈ శరీరము ఆహారముతో జీవించి, ఆహారము సేవించనిచో
నశిస్తుంది. ఇది చర్మము, మాంసము, ఎముకలు మరియు వ్యర్థములతో నిండి ఎప్పటికీ
స్వచ్ఛతను పొందలేదు. ఆత్మను తెలుసుకొనలేదు.
2. ఈ శరీరము జన్మించక
ముందు లేదు. మరణించిన తరువాత కూడా లేదు. కేవలము కొద్ది కాలము మాత్రమే
జీవించి ఉంటుంది. అది ఎల్లప్పుడు మార్పుచెందుతూ అస్థిరముగా ఉంటుంది. ఇది
సామాన్యమైనది కాదు. ఎల్లప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఇంద్రియాలతో నిండిన ఒక పింగాణి జాడి వంటింది. అలాంటిది ఎలా ఆత్మ స్థితిని కలిగి ఉంటుంది. మార్పులు అన్ని శరీర భాగాలలో కన్పిస్తుంటవి.
3. ఈ శరీరము కాళ్ళు, చేతులు మొదలగు అంగములతో కూడి ఉన్నది. ఇది ఆత్మ
కాదు. ఎవరైతే ఈ శరీరములోని ఒకటిరెండు భాగాలు లేనప్పటికి అతడు జీవించి
ఉంటాడు, అతని ఇతరశరీర భాగాలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ శరీరము ఇతరుల పాలనలో
నడుచుట వలన అది ఆత్మ కాదు. ఆత్మయే అన్నింటిని పరిపాలించేది.
4. ఆత్మ
నిజమైన సత్యము కావున అవి శరీరము కంటే వేరైనది. దాని గుణాలు, దాని పనులు,
దాని స్థితులు అనేవి దాని సాక్షి స్థితికి ఉదాహరణ.
5. ఈ శరీరము
ఎములు, మాంసము మరియు వ్యర్ధములతో నిండి పూర్తిగా అపవిత్రమైనది. కాని స్వయం
స్థితమైన ఆత్మ అన్ని తానే అయి ఈ శరీరము కంటే భిన్నమైనది.
6.
మూర్ఖుడైన మనిషి తాను శరీరముగానే భావించి, చర్మము, రక్తము, మాంసము,
క్రొవ్వు, ఎముకలు మరియు కల్మషాలతో నిండి ఉన్నాడు. కాని మంచి, చెడుల భేదముల
గ్రహించిన వ్యక్తి తాను శరీరము కాదు ఆత్మనని తెలుసుకొని, కేవలము తానే
సత్యమని ఈ శరీరమునకు వేరుగా ఉన్నానని తెలుసుకొనును.
7. మూర్ఖుడైన
వ్యక్తి తాను శరీరమని తలచగా, పుస్తక జ్ఞానము కలిగిన వాడు తాను శరీరము మరియు
ఆత్మ యొక్క సంమ్మేళనమని భావించగా, యోగి తాను మంచి, చెడులకు భేదముల
--((**))--
3. మనస్సు
1. ఈ మానసికమైన పొర అనేకమైన కోరికలతో నిండి పంచ జ్ఞానేంద్రియాలకు అనుగుణంగా నడుచుకుంటూ యజ్ఞయాగాదులతో ఈ భౌతిక ప్రపంచ సృష్టికి కారణమవుతుంది.
2. మనస్సుకు భయట ఏవిధమైన అజ్ఞానము లేదు. మనస్సే అజ్ఞానమునకు కారణము. ఇది బంధనాలకు మూలము. ఎపుడైతే మనోనాశమగుతుందో, అపుడు సాధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా ఆత్మ సౌందర్యాన్ని స్థిర పర్చిన అదే విముక్తి అని చెప్పబడింది. నిర్వికల్ప సమాధి స్థితి అపుడు ఏర్పడుతుంది.
3. మనము కలలు కనేటపుడు, బాహ్య ప్రపంచముతో ఏవిధమైన సంబంధము ఉండదు. మనస్సే ఈ ప్రపంచ సృష్టికి కారణమవుతుంది. అనుభవము, అనుభవించేవాడు, అనుభవించబడేది అన్నీ ఒక్కటే. మెలుకువలో కూడా అదే స్థితి నెలకొని ఉంటుంది. అందువలన ఈ విశ్వమంతా మనస్సు యొక్క వ్యక్తీకరణమే.
4. కలలులేని నిద్రలో మనస్సు పనిచేయనందు వలన నిద్రించుచున్న వ్యక్తి ఏమి అనుభవించుట లేదు. అందువలన మనిషి యొక్క అనుభవాలు, అనుభూతులన్ని మనస్సు యొక్క సృష్టి మాత్రమే. ఏవిధమైన వస్తువు యొక్క సత్యతలేదు.
5. మేఘాలు గాలుల వలననే వస్తుంటాయి, పోతుంటాయి. అదే విధముగా మనిషికి బంధనాలు మనస్సు వలననే ఏర్పడతాయి. మరియు ఆ బంధనాలు మనస్సు వలననే వదలిపోతాయి.
6. ఈ మనస్సు మొదట మనిషిని శరీరమునకు బందీని చేసి క్రమముగా జ్ఞానేంద్రియాలు, మనస్సు యొక్క వశమై తద్వారా బందిపబడతాయి. ఎలానంటే ఒక జంతువు దొరికినపుడు వేటగాడు దానిని తాడుతో బందించినట్లు. తరువాత ఆత్మ మనస్సు ద్వారా జ్ఞానేంద్రియాలను, వస్తుసముదాయమును విషపూరితమని తెలియజేసి వాటిని బంధనాల నుండి విడుదల అవుతుంది.
7. అందువలన మనస్సే బంధనాలకు విముక్తికి కారణమవుతుంది. రాజస గుణాలకు కళంకము ఏర్పడినపుడు అవి బంధనాలకు కారణమవుతాయి. రాజస, తామస గుణాలను పవిత్ర మార్గాలకు మళ్ళించినపుడు అవి విముక్తికి దారిచూపుతాయి.
8. ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించి అజ్ఞాన కర్మలను వదలివేసిన మనస్సు విముక్తికి దారి చూపుతుంది. అందువలన తెలివైన సాధకుడు విముక్తిని సాధించిన తరువాత ఆత్మ, అనాత్మలను శక్తివంతము చేయాలి. అనగా వాటి జ్ఞానాన్ని పొందాలి.
9. ఇంద్రియ సుఖాలనే అరణ్యములో పయనించేటపుడు మనస్సను పులి చెలరేగుతుంది. అందువలన తెలివి గల వ్యక్తులు ఎవరైతే విముక్తిని కోరుచున్నారో వారు ఆ కోరికలనే అరణ్య మార్గములో ప్రవేశించరాదు.
10. మనస్సు ఎల్లప్పుడు ఇంద్రియాలకు వశమై తత్ సంబంధ వస్తు సముదాయమును, భౌతిక మరియు సూక్ష్మ ప్రపంచములో; కుల, మత, జాతులకు సంబంధించిన విశేషములను ఉత్పత్తి చేస్తుంది.

11. జీవుని మోసగించి దానికి స్వచ్ఛమైన జ్ఞానము లేనందువలన, ఆ జీవుని మనస్సు
శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ 'నేను',
'నాది' అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి
మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తూంది.
12. కేవలము మనస్సు మాత్రమే మనిషి
యొక్క బంధనాలకు, చెడువంచనలకు, మార్పులు చెందుటకు కారణమగుచున్నది. దాని
వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణ మగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల
ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి.
13. అందువలన యోగులు రహస్యాలు దాచి మనస్సును అవిద్యగా వర్ణించిరి. అందువలనే ఈ ప్రపంచము గాలిలోని మేఘాల వలె ఊగు చున్నది.
14. ఆ కారణముగానే సాధకుడు విముక్తి పొందిన తరువాత జాగ్రత్తగా తన మనస్సును
పవిత్రము చేసుకోవాలి. ఎపుడైతే మనస్సు పవిత్రమవుతుందో విముక్తి తేలిక
అవుతుంది. అరచేతిలోని అరటి పండు వలె.
15. విముక్తి కొరకు ఏకీకృతమైన
భక్తితో బంధనాలనే వేళ్ళను, జ్ఞానేంద్రియాలకు చెందిన భోగ వస్తువులను
సమూలముగా తొలగించి వేయుటకు, నిజమైన బ్రహ్మ జ్ఞానము పై నమ్మకముతో నిరంతరము
క్రమము తప్పకుండా సత్సంగములలో పాల్గొంటూ రాజసిక స్వభావ లక్షణాలను
తొలగించుకోవాలి.
16. మానసిక కవచము ఉన్నతమైన ఆత్మ కాదు. ఎందువలనంటే
దానికి మొదలు, అంతము కలదు. మార్పులకు అవకాశముకలదు. అది బాధ, నొప్పులతో
కూడిన వస్తువు. దానిని జ్ఞానముతో కూడిన వస్తు సముదాయముతో పోల్చరాదు.
--((**))--
4. బుద్ది
1. నిర్ణయ శక్తితో కూడిన బుద్ది దాని యొక్క అహం మరియు
జ్ఞానేంద్రియాలు అనగా విజ్ఞానమయ కోశము తమతమ గుణాలను వ్యక్తము చేస్తూ
సాధకునిలో మార్పు తెచ్చుటకు తోడ్పడుతుంది.
2. ఈ విజ్ఞానమయ కోశము
చిత్తము యొక్క ప్రతిస్పందన వలన ఏర్పడినది. ప్రకృతి యొక్క మార్పులు జ్ఞాన
ప్రభావము వలన ఏర్పడుతుంటాయి. అవి పూర్తిగా శరీరము వాటి అంగములకు అనుగుణముగా
రూపొందుతాయి.
3. జీవి యొక్క అహంభావము వలన మొదలు, చివరి లేని ఈ
భౌతిక ప్రపంచము యొక్క క్రియలు రూపొందుతాయి. అందుకు అహం యొక్క గత జన్మల
కోరికలను అనుసరించి మంచి, చెడుల అనుభవములు
వాటి ఫలితములతో కూడి ఉంటుంది.
4. జీవుడు వివిధ జన్మలు ఎత్తుట వలన అవి రూపొందుతాయి. ఈ విజ్ఞానమయ కోశము ఎఱుకతో కూడిన కలలు, ఇతర స్థితులు, అనుభవాలు, ఆనందాలు, దుఃఖాలు ఇవన్నీ అలానే దర్శనమవుతుంటాయి.
5. బుద్ది
ఎల్లప్పుడు శరీరమునకు చెందిన పనులు, విధులు అన్నియూ తనవి గానే పొరపాటు
పడుతుంది. విజ్ఞానమయ కోశము అతి ప్రకాశవంతమై ఆత్మకు అతి చేరువుగా ఉండి తానే
ఆత్మ అను భావముతో భ్రమలో ఉంటుంది. అందువలన అది అత్యంత మోసముతో కూడిన ఆత్మ
భావన.
6. స్వయంగా అత్యంత ప్రకాశవంతమైన ఆత్మ హృదయములో అది స్వచ్ఛమైన
విజ్ఞానము కలిగి ప్రాణములో ప్రకాశిస్తుంది. అది నిర్వికారమైనప్పటికి దాని
కారణముగానే అనుభవాలు మరియు దాని అత్యంత ప్రభావము వలన విజ్ఞానమయ కోశము
రూపొందుతుంది.
7. జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ బుద్ది యొక్క
కొన్ని పరిమితులకు లోబడి తప్పుగా తనను తాను ఈ ప్రపంచములో వేరుగా
భావిస్తుంది. మట్టి కుండ మట్టితో తయారైనప్పటికి తాను మట్టి కంటే వేరుగా
భావిస్తుంది.
8. దివ్యాత్మతో సంబంధము వలన తాము దానితో సమానముగా
భావించి, అది ప్రకృతి సిద్దముగా స్వచ్ఛమైనప్పటికి తాను ఉన్నతమైన ఆత్మవలె
ప్రకాశిస్తుంది. మార్పు చెందని అగ్ని వివిధ మార్పులు చెందుతూ ఇనుమును
అగ్నిగా ఎర్రగా ఎలా మారుస్తుందో అలానే.
9. మాయ వలన కాని ఇతర కారణముల
వలన ఉన్నతమైన ఆత్మ తననుతాను జీవాత్మగా భావిస్తుంది. ఈ భావనకు మొదలుగాని,
చివరగాని లేదు. దీనికి అంతము లేదు. అది జీవాత్మగా పిలువబడుతుంది.
--((**))--
5. విముక్తి
1. జీవుడు తనను తాను శాశ్వతమైన ఆత్మగా భావిస్తుంటాడు. అట్లైన జీవాత్మకు విముక్తి ఎలా లభిస్తుంది. ఈ విషయాన్ని వివరించవలసినదిగా పరమ గురువులను కోరుచున్నాను.
2. గురువు సమాదానము చెప్పుచున్నాడు:- నీ ప్రశ్న సక్రమముగా ఉన్నది. జ్ఞానివైన నీవు శ్రద్దగా వినవలసినది. మాయ వలన ఏర్పడిన ఊహలు నిజమని నమ్మరాదు.
3. మాయకు ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. ఆత్మ దేనికి బంధింపబడదు, ఏ పని చేయదు. దానికి ఏ ఆకారము లేదు. ఈ ప్రపంచముతో ఎట్టి సంబంధము లేదు. ఆకాశానికి నీలి రంగు ఉన్నట్లు మనం భావిస్తూ ఉంటాము. నిజానికి దానికి ఏ రంగు లేదు. మనస్సుకు మాత్రమే హద్దులున్నాయి. కాని పూర్ణాత్మకు ఎట్టి హద్దులు లేవు.
4. ఆత్మ జీవత్వమునకు సాక్షిగా ఏ విధమైన లక్షణాలు, కర్మలు అంటనట్టి తన జ్ఞానము ద్వారా అర్ధము చేసుకొనగలదు. బుద్ధి, మాయలో చిక్కుకొని నిజము కాని ఈ శరీరమును ఆత్మగా
భావించును. ఎపుడైతే మాయ తొలగిపోతుందో అపుడు తన భావన సరైనది కాదని గ్రహిస్తుంది.
5. మాయ ఉన్నంత వరకు ఈ శరీరమును ఆత్మగా భావించి, తరువాత భ్రమ తొలగిన తరువాత ఆత్మ వ్యక్తమవుతుంది. తాడును పాముగా భ్రమించి, తరువాత ఆ భ్రమ తొలగిపోయినపుడు పాము మాయమవుతుంది.

6. అవిధ్య ప్రభావము వలన దాని ఫలితములు తెలియకున్నవి. అయితే జ్ఞానము
పొందిన తరువాత అవిధ్య ఫలితములన్నియూ గ్రహించి వాటికి మొదలు లేనప్పటికి అవి
మాయతో సహ మాయమైయిపోతాయని తెలుస్తుంది. ఎలానంటే కలలు, మెలుకువ తరువాత
మాయమైనట్లు. అందువలన ఈ విశ్వము, దానికి మొదలు లేనప్పటికి అది శాశ్వతము
కాదు. అది లేనిదే అవుతుంది.
7. లేని ప్రపంచము, దానికి మొదలులేనప్పటికి, దానికి ఎప్పుడో ఒకప్పుడు అంతమున్నదని తెలుస్తుంది. అందువలన జీవత్వమును ఆత్మ అని భావించినపుడు దానికి సంబంధము బుద్ధితో జతపర్చబడినది. ఉదా: ఎర్రని పుష్పము ప్రక్కన క్రిష్టల్ ఉంచినప్పడు ఆ ఎర్ర దనము క్రిష్టల్‌లో ప్రతిబింబిస్తుంది కదా! అలానే ఆత్మ ప్రకృతిలో నిండి ఉన్నప్పటికి, బుద్ది, ప్రకృతి సదా మారుతున్నప్పటికి ఆత్మలో మార్పు ఉండదు.
--(())--
6. సరైన జ్ఞానము
1. సరైన జ్ఞానము పొందినప్పడు బుద్ది, ఆత్మ ఒక్కటే అను తప్పుడు భావము తొలగిపోతుంది. వేరు మార్గము లేదు. సృతుల ప్రకారము సరైన జ్ఞానముతో తన యొక్క జీవాత్మను తాను తెలుసుకొన్నప్పుడే తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు.
7. విశ్వము
1. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసుకొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు.
2. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించగలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు.
3. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి.
4. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది. అది ఒక
5. జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.
బ్రహ్మము
6. బుద్ది చిత్తము యొక్క ప్రతిబింబ మగుటచే అది శరీరమును వదలి ఆత్మను దర్శించును. ఆత్మయే అసలైన జ్ఞాన స్థితి. అదే అన్నింటి యొక్క సృష్టికి మూల కారణము. అది బుద్ది యొక్క అంతర్భాగములో విశ్రాంతి తీసుకుంటుంది. అసలైన స్థిరమైనది. అన్నింటిలో ప్రతిఫలించేది, దానికి లోపల, బయట అనేది ఏది లేదు. అదే ఆత్మతో సమానమైనది. అదే బ్రహ్మము. ఎవరైతే ఈ ఆత్మ స్వభావమును పూర్తిగా గ్రహిస్తారో, వారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి దూరమై బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. స్వయం ప్రకాశముతో తాను ఎవరికి భయపడడు. సాధకుడు విముక్తిని సాధించిన తరువాత, బంధనాల నుండి విముక్తుడై తన ఆత్మ స్థితి యొక్క సత్యాన్ని తెలుసుకొనగలుగుతాడు.
7. తనకు తాను బ్రహ్మముతో సమానమని గుర్తించిన తరువాత, విముక్తిని సాధించి, అన్ని సంసార బంధనాల నుండి విడుదల పొందిన జ్ఞాని బ్రహ్మాన్ని చేరగలడు. ఆ బ్రహ్మమే రెండవది ఏమిలేని అసలైన బ్రహ్మానంద స్థితి. 224. ఒక సారి బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత ఎవరు తిరిగి మార్పులతో కూడిన ప్రపంచానికి రారు. అందువలన ప్రతి ఒక్కరు పూర్తిగా తాను బ్రహ్మముతో సమానమని తెలుసుకోవాలి.
8. బ్రహ్మమే ఉన్నది. అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది.
9. అత్యున్నతమైన ఈ బ్రహ్మము ఒక్కటే నిజమైనది. వేరేది ఏది లేదు. ఆత్మ ఒక్కటే ఉన్నది. ముఖ్యముగా స్వతంత్రమైన ఏ ఇతర తత్వము, సత్యము గ్రహించిన తరువాత ఈ ఉన్నత సత్యానికి మించేది ఏది లేదు అని గ్రహిస్తుంది.
10. ఈ విశ్వమంతా అజ్ఞానము వలన వివిధ ఆకారాలలో కనిపిస్తుంది. అదంతా బ్రహ్మము మాత్రమే. దానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో ఉంటుంది. మానవ పరిమితులకు లోనుకాదు.
11. ఒక జాడి మట్టితో చేయబడినప్పటికి మట్టి కంటే వేరు కాదు. ఎక్కడైన, ఎప్పుడైన అది మట్టి కంటే వేరు కాదు. అపుడు దానిని పాత్ర అని ఎందుకు పిలవాలి. అది కేవలము భావనతో పెట్టిన పేరు మాత్రమే.
--(())--
8. మాయ
1. మాయకు లోనైన వ్యక్తి పొరపాటున బ్రహ్మమును బ్రహ్మమని భ్రమించిన అది బ్రహ్మమే అవుతుంది. వెండి ముత్యపు చిప్ప రంగునే కలిగి ఉంటుంది. అది బ్రహ్మమును విశ్వముగా భావించుట వంటిది. విశ్వమనేది కేవలము పేరు మాత్రమే.
2. ఏది ఏవిధముగా పలికినప్పటికి ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము. మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.239. పండితులైన వారు బ్రహ్మము యొక్క పూర్తి సత్యమును మరియు బ్రహ్మానికి దానిని తెలుసుకొనే వారికి, తెలుసుకొనే దానికి, తెలిసినది అనే భేదము లేదు. అది స్థిరమైనది. ఉన్నతమైన జ్ఞానానికి సారభూతమైనది.
3. దానిని విసరివేయటానికి, తీసుకొనుటకు వీలులేనిది. ఎందువలనంటే అది పదార్థము కాదు. మనస్సుకు, మాటలకు అందనిది. కొలుచుటకు వీలు లేనిది. మొదలు, చివర లేనిది. అదే మొత్తమైనది. అదే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. అది కీర్తి ప్రతిష్టలకు అందనిది.

2.
మనం చెప్పుకొనే విజ్ఞానమయకోశమనే పొర ఎప్పటికి ఆత్మ కాదు. ఎందువలనంటే అది
ఎల్లప్పుడు మారుతుంటుంది. అది పరిమితమైనది. అది గుణములతో, అజ్ఞానముతో కూడి
ఉన్నది. అది ఎల్లప్పుడు ఉండేది కాదు. అసత్యమైన విషయాలు సత్యమైన ఆత్మతో
పోల్చరాదు. 207. ఆనందమయ కోశము అసత్యమైన మార్పులతో కూడి, ఆత్మిక భావమును
ప్రతిబింబిస్తుంది. దాని ప్రభావము వలన సుఖాను భూతులను పొందుచున్నది.
సుషుప్తిలో ఆనందము, విశ్రాంతి పొంది, అది ఆనందమయ కోశముగా చెప్పబడినది. కాని
అది ఆత్మ స్థితి కాదు. ఆనందమయ కోశములో ఆనందముతో కూడి అది మనము కోరకుండానే వివిధ పనుల ఫలితముగా చేకూరుతుంది. ప్రతి జీవి అలాంటి ఆనందమును ఎట్టి ప్రయత్నము లేకుండానే పొందుట జరుగుతుంది.
3. గాఢ నిద్రలో ఆనందమయ కోశము తన యొక్క పూర్తి ఎఱుకలో ఉంటుంది. కలలో మరియు ఎఱుక స్థితిలో అది సందర్భాను సారముగా జ్ఞానేంద్రియాల ప్రభావముతో ఎఱుక స్థితిలోనూ, కలలో జ్ఞాపకాల ప్రభావముతోనూ ఉంటుంది.
4. ఈ ఆనందమయ కోశము పరమాత్మ కాదు. అది మార్పులతో కూడి ఉన్నది. ప్రకృతి అనుసరించి గతములో చేసిన మంచి పనుల ఫలితముగా అది ఏర్పడుతుంది. దానికి ఇతర కోశముల ప్రభావము కూడా జత పడుతుంది.
5. ఎపుడైతే పంచకోశముల ప్రభావము; అది కాదు, అది కాదు అనే విచారణలో తొలగిపోతుందో, చివరకు మిగిలేది ఏదైతే ఉందో దాన్ని దర్శించిన అదే అనంత జ్ఞానముతో కూడిన ఆత్మ.211. ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ, తనకు తాను పంచకోశములతో అతీతమై, స్థూల, సూక్ష్మ కారణ శరీరములను దర్శిస్తూ సాక్షిగా ఉండి నిజమైన, మార్పు లేని స్థితిలో నిరంతరానందమును పొందుతూ ఉంటుంది. జ్ఞాని అదే తన ఆత్మ అని గ్రహించును.
6. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు:- ఈ ఐదు కోశములు విచారణ ద్వారా అసత్యములని తెలుసుకొని వాటిని తొలగించుకొన్నప్పుడు, నాకేమి గోచరించటలేదు. అందువలన గురువు గారు, ఈ విశ్వములో అంతా శూన్యము ఏమి కనిపించుటలేదు మరి అపుడు మిగిలింది ఏది? జ్ఞాని తన ఆత్మను ఎలా తెలుసుకొనగలడు?
3. గాఢ నిద్రలో ఆనందమయ కోశము తన యొక్క పూర్తి ఎఱుకలో ఉంటుంది. కలలో మరియు ఎఱుక స్థితిలో అది సందర్భాను సారముగా జ్ఞానేంద్రియాల ప్రభావముతో ఎఱుక స్థితిలోనూ, కలలో జ్ఞాపకాల ప్రభావముతోనూ ఉంటుంది.
4. ఈ ఆనందమయ కోశము పరమాత్మ కాదు. అది మార్పులతో కూడి ఉన్నది. ప్రకృతి అనుసరించి గతములో చేసిన మంచి పనుల ఫలితముగా అది ఏర్పడుతుంది. దానికి ఇతర కోశముల ప్రభావము కూడా జత పడుతుంది.
5. ఎపుడైతే పంచకోశముల ప్రభావము; అది కాదు, అది కాదు అనే విచారణలో తొలగిపోతుందో, చివరకు మిగిలేది ఏదైతే ఉందో దాన్ని దర్శించిన అదే అనంత జ్ఞానముతో కూడిన ఆత్మ.211. ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ, తనకు తాను పంచకోశములతో అతీతమై, స్థూల, సూక్ష్మ కారణ శరీరములను దర్శిస్తూ సాక్షిగా ఉండి నిజమైన, మార్పు లేని స్థితిలో నిరంతరానందమును పొందుతూ ఉంటుంది. జ్ఞాని అదే తన ఆత్మ అని గ్రహించును.
6. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు:- ఈ ఐదు కోశములు విచారణ ద్వారా అసత్యములని తెలుసుకొని వాటిని తొలగించుకొన్నప్పుడు, నాకేమి గోచరించటలేదు. అందువలన గురువు గారు, ఈ విశ్వములో అంతా శూన్యము ఏమి కనిపించుటలేదు మరి అపుడు మిగిలింది ఏది? జ్ఞాని తన ఆత్మను ఎలా తెలుసుకొనగలడు?
7. విశ్వము
1. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసుకొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు.
2. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించగలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు.
3. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి.
4. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది. అది ఒక
5. జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.
బ్రహ్మము
6. బుద్ది చిత్తము యొక్క ప్రతిబింబ మగుటచే అది శరీరమును వదలి ఆత్మను దర్శించును. ఆత్మయే అసలైన జ్ఞాన స్థితి. అదే అన్నింటి యొక్క సృష్టికి మూల కారణము. అది బుద్ది యొక్క అంతర్భాగములో విశ్రాంతి తీసుకుంటుంది. అసలైన స్థిరమైనది. అన్నింటిలో ప్రతిఫలించేది, దానికి లోపల, బయట అనేది ఏది లేదు. అదే ఆత్మతో సమానమైనది. అదే బ్రహ్మము. ఎవరైతే ఈ ఆత్మ స్వభావమును పూర్తిగా గ్రహిస్తారో, వారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి దూరమై బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. స్వయం ప్రకాశముతో తాను ఎవరికి భయపడడు. సాధకుడు విముక్తిని సాధించిన తరువాత, బంధనాల నుండి విముక్తుడై తన ఆత్మ స్థితి యొక్క సత్యాన్ని తెలుసుకొనగలుగుతాడు.
7. తనకు తాను బ్రహ్మముతో సమానమని గుర్తించిన తరువాత, విముక్తిని సాధించి, అన్ని సంసార బంధనాల నుండి విడుదల పొందిన జ్ఞాని బ్రహ్మాన్ని చేరగలడు. ఆ బ్రహ్మమే రెండవది ఏమిలేని అసలైన బ్రహ్మానంద స్థితి. 224. ఒక సారి బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత ఎవరు తిరిగి మార్పులతో కూడిన ప్రపంచానికి రారు. అందువలన ప్రతి ఒక్కరు పూర్తిగా తాను బ్రహ్మముతో సమానమని తెలుసుకోవాలి.
8. బ్రహ్మమే ఉన్నది. అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది.
9. అత్యున్నతమైన ఈ బ్రహ్మము ఒక్కటే నిజమైనది. వేరేది ఏది లేదు. ఆత్మ ఒక్కటే ఉన్నది. ముఖ్యముగా స్వతంత్రమైన ఏ ఇతర తత్వము, సత్యము గ్రహించిన తరువాత ఈ ఉన్నత సత్యానికి మించేది ఏది లేదు అని గ్రహిస్తుంది.
10. ఈ విశ్వమంతా అజ్ఞానము వలన వివిధ ఆకారాలలో కనిపిస్తుంది. అదంతా బ్రహ్మము మాత్రమే. దానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో ఉంటుంది. మానవ పరిమితులకు లోనుకాదు.
11. ఒక జాడి మట్టితో చేయబడినప్పటికి మట్టి కంటే వేరు కాదు. ఎక్కడైన, ఎప్పుడైన అది మట్టి కంటే వేరు కాదు. అపుడు దానిని పాత్ర అని ఎందుకు పిలవాలి. అది కేవలము భావనతో పెట్టిన పేరు మాత్రమే.
--(())--
8. మాయ
1. మాయకు లోనైన వ్యక్తి పొరపాటున బ్రహ్మమును బ్రహ్మమని భ్రమించిన అది బ్రహ్మమే అవుతుంది. వెండి ముత్యపు చిప్ప రంగునే కలిగి ఉంటుంది. అది బ్రహ్మమును విశ్వముగా భావించుట వంటిది. విశ్వమనేది కేవలము పేరు మాత్రమే.
2. ఏది ఏవిధముగా పలికినప్పటికి ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము. మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.239. పండితులైన వారు బ్రహ్మము యొక్క పూర్తి సత్యమును మరియు బ్రహ్మానికి దానిని తెలుసుకొనే వారికి, తెలుసుకొనే దానికి, తెలిసినది అనే భేదము లేదు. అది స్థిరమైనది. ఉన్నతమైన జ్ఞానానికి సారభూతమైనది.
3. దానిని విసరివేయటానికి, తీసుకొనుటకు వీలులేనిది. ఎందువలనంటే అది పదార్థము కాదు. మనస్సుకు, మాటలకు అందనిది. కొలుచుటకు వీలు లేనిది. మొదలు, చివర లేనిది. అదే మొత్తమైనది. అదే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. అది కీర్తి ప్రతిష్టలకు అందనిది.
4. ఆ విధముగా సృతుల ప్రకారము ''తత్వమసి'' అదే నీవు అనే మాట మరల మరల
బ్రహ్మానికి వర్తింపజేస్తూంది. అదే, జీవుడు, ఈశ్వరులకు భేదము లేదిని
తెలుపుతుంది. జీవేశ్వరుల సంబంధము భాష పరముగా కాకుండా అవి ఒక్కటే
అయినప్పటికి వ్యతిరేకముగా చెప్పబడుచున్నది. ఎలా అంటే సూర్యుడు దాని
ప్రకాశము లేక వెచ్చదనము వలె. అలానే రాజు సేవకుడు. బావి సముద్రము,
మేరుపర్వతము అణువు వలె రెండు ఒక్కటే అయినప్పటికి వేరువేరుగా
పిలువబడుచున్నది.
5. పైన తెల్పిన రెండింటి మధ్య భేదమును వ్యక్తము చేయుట అనేది నిజము కాదు. ఈశ్వరుని గూర్చి చెప్పిన ఈ విషయము మహత్తుకు చెందినది. మిగిలిన జీవము అనగా వ్యక్తి ఆత్మ ఐదు పొరలతో నిర్మింపబడినది. ఇది మాయ యొక్క ఫలితమే. 244. ఈ రెండింటిని (జీవేశ్వరుడు) తొలగించినపుడు ఆ రెండు లేవు. మిగిలింది బ్రహ్మమే. రాజుకు గుర్తింపు రాజ్యము. కవచాలను తొలగించినపుడు రాజు లేడు సైనికుడు లేడు. మిగిలినది మనిషి మాత్రమే. అలానే ఈశ్వరునిలోని విజ్ఞానమును మరియు జీవునిలోని అజ్ఞానము తొలగించిన మిగిలినది బ్రహ్మమే. అదే రెండింటి యొక్క మూలము.
6. వేదములలోని పదాలైన ఇపుడు, అపుడు అనేవి బ్రహ్మములో ద్వంద్వాన్ని పలుకుచున్నవి. సాధకుడు జ్ఞానము పొంది ఆ రెండింటి భేదమును తొలగించినపుడు ఆ రెండు ఒక్కటే అని తెలుస్తుంది.
7. వేదములలోని పదాలైన ఇపుడు, అపుడు అనేవి బ్రహ్మములో ద్వంద్వాన్ని పలుకుచున్నవి. సాధకుడు జ్ఞానము పొంది ఆ రెండింటి భేదమును తొలగించినపుడు ఆ రెండు ఒక్కటే అని తెలుస్తుంది.
8. సూక్ష్మము విస్తారమైన ఈ విశ్వము కేవలము ఊహ మాత్రమే. అది నిజము కాదు. పూర్తిగా ఈ వస్తు ప్రపంచమును తొలగించినపుడు (అందుకు విచక్షణతో కూడిన జ్ఞానము పొందాలి). జీవేశ్వర భేదము తొలగి రెండు ఒక్కటే అను భావము స్థిరపడుతుంది.
9. అందువలన ఈశ్వరుడు, జీవుడు అను మాటలను సందర్భాను సారముగా వర్తింపచేయాలి. అపుడే వాటి భావమును అర్థము చేసుకొనగలము. కేవలము పూర్తిగా తిరస్కరించుట, లేక పూర్తిగా అంగీకరించుట సరికాదు. వాటి నిజమైన స్థితులను సకారణముగా విచారించి తెలుసుకోవాలి.
10. 'ఇదే ఆ దేవ దత్తుడు' అనే వాక్యములో రెండింటి ఏకత్వము చెప్పబడింది. అందులోని వేరు భావనలు తొలగింపబడినవి. ఈ వాక్యము 'అదే నీవు' అనే వాక్యానికి సరిపోతుంది. ఇందులో రెండింటి భేదము తొలగిపోయి జీవేశ్వరులు ఒక్కటే అని చెప్పబడినది. రెండింటిని గూర్చిన పూర్తి అవగాహన, చిత్ అనేది పరమాత్మకు చెందిన జ్ఞానమని తెలియబడుతుంది. ఈ విధముగా వందల కొలది గ్రంధములలో జీవ బ్రహ్మల ఏకత్వమును గూర్చి చెప్పబడినది.
11. ఆత్మ కానిదానిని తొలగించుచూ పోయిన; నేతి, నేతి దాని ప్రకారము మిగిలిన ఆత్మను తెలుసుకొన్నపుడు అది ఆత్మ అని గ్రహించి ఆలోచనలకు, ఆకాశానికి అతీతముగా ఉన్నపుడు శరీరమే తాను అను భావనను తొలగించుకొని నీవు ఆత్మ అని తెలుసుకొన గలుగుతావు.
12. మట్టి యొక్క అనేక మార్పుల తరువాత ఒక జాడిని తయారు చేసినపుడు, అది నిజానికి మట్టి మాత్రమే అని తెలుసుకొనగలము. దానికి జాడి అని పేరు పెట్టినాము. అలానే విశ్వమంతా బ్రహ్మము వలన రూపొందినది తెలుసుకొన్నపుడు అది బ్రహ్మము కాని వేరు కాదనుట సత్యము. ఎందువలనంటే బ్రహ్మము కాకుండా వేరేది ఈ విశ్వములో లేదని, అదే సత్యమని మనము గ్రహించగలము. అందువలన నీవు నిజానికి పవిత్రమైన,స్వచ్ఛమైన, ఉన్నతమైన బ్రహ్మానివి మాత్రమే వేరు కాదని గ్రహించాలి.
13. మనం కలల్లో చూసే ప్రదేశం, సమయము, వస్తువులు తెలుసుకొనేవాడు మొదలగునవన్నియూ అసత్యములే, అదే విధముగా మనము ఎఱుక స్థితిలో అనుభవించే ఈ ప్రపంచము అంతా ఆ వ్యక్తి యొక్క అజ్ఞాన ఫలితమే. ఎందువలనంటే ఈ శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహం అనునవి కూడా అసత్యములే. అందువలన నీవు పవిత్రమైన, స్వచ్ఛమైన, ఉన్నతన బ్రహ్మానివే కాని రెండవది ఏదీ కాదని గ్రహించాలి.
14. ఏదైతే తప్పుగా భావించటం జరుగుతుందో, ఒక వస్తువులో నిజమైనది ఏది అని తెలుసుకొనినపుడు, అది ఒక మూల పదార్థమని దానికి వేరుగా ఏమి కాదని అర్థమవుతుంది. మార్పులతో కూడిన కలలో ఒకటి కనిపించి మాయమవుతుందో అది మెలుకల స్థితిలో ఆ వస్తువు లేనిదే అని, అది తన ఆత్మ కంటే వేరు కాదని తెలుస్తుంది.
15. కుల, మతాలకు, కుటుంబము, వంశము అలానే పేరు, ఆకారము, ఎక్కువ, తక్కువ, మార్పు చెందే ఆకాశము, సమయము, మనం గ్రహించే వస్తు సముదాయము అయిన దంతయూ బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి బ్రహ్మమును గూర్చి నీవు నీ మనస్సులో ధ్యానించుము. 255. అత్యున్నతమైన ఆ బ్రహ్మము మాటకు అందనిది. అయితే అది స్వచ్ఛమైన దివ్య దృష్టికి పూర్తి జ్ఞానము వలన మాత్రమే తెలుసుకొన బడుతుంది. ఆది అంతము అనేది లేని సత్యము.

No comments:
Post a Comment