Saturday, 18 February 2017

తలపులు (నగణము ) పద్యాలు -1 ****

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ: 
తలపుల -తలుపుల  - పద్యాలు -1
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
చిత్రములు సేకరణ " పెంట్రిస్ట్ " అంతర్ జాలం 



కలువ కలవరము మదిని తొలచి మెళుకువ తొ
థళుకు బెళుకు తలపుల తపనల తమకముతొ
మరులు గొలుపు సుమధుర మధురిమ తలపుతొ
ఒకటిగ తనువులు కలవగ మనసుకు శుభములు  ... 1  




కరుణ దయ కనికరము నయనముల పిలుపుతొ
మనసు గెలుపు వరుసల తడి పొడి పలుకులతొ    
మగువకు మగణి పరుషముల సరసములతొ
తెగువ మరచి వగలు తలచి ఒక రొక రవుట  ....... 2



  



లతల తొడిమలు కదలిక వయసు ఉరకలుతొ 
వెతలు తొలగి నయనములు కదిలి పిలుపులతొ
సొగసుళు మురిపములు కలుసుకొను తరుణముతొ   
చిరు నగవు తలపు వలపు మెరుపు ఒకటవుట .... 3 

myka jelina - Google Search:


  4. విభవములు లొసఁగును శుభములు కలుగును నితొ

మనుగడకు మమతలకు మనసు కరుగును నితొ
నొటికి  రుచులు వయసుకు వలపులు అనుకువతొ
తగువు కనపడక  చుముకముతొ కలిసి కొనుట  


5. రుచులు అరటి పనస పలురకముల ఫలములె
తినవలె నని మనసు కలవరముతొ పలుకులె
కదళులు తినవలెనని మగువల గల గల లె
ఫల మిడుచుట కుదరక మగని పరుగు పరుగె  




6.ని వలన మిత్ర శత్రువులు కలియుట మనుగడకె
ని కొరకు ఉదయ సమయము అణువణువువణికె   
ని పనులకు వగచి మతియు మరచి అలుగుటకె
ని తనువు మరులు గొలుపుచు ఉరక పిలుపులకె



Cameron Stewart:
7. చిలక పలుకులు చిలక, తగు పత్రములు తినకె
తరచు జలము కురియుటయు, తడుపుట కొరకె    
పలు రకముల నడక లతొ, ఉడుకును  తెలపకె
చిరు నగవులతొ, మది తలపులు తెరచి అలకె   




8. మరువము కుసుమము కలియుట పరిమళమె
సహనము ఒడుపు తనము మెరియు పరిమళమె
మమత సమత మెలుకువ మగువకు పరిమళమె
అనుకువతొ సుఖము కొరకు మెలగవలయునులె


9. మమతగని చెడుగుడు వదలి మెలగ వలయుటె
గురువు గరపెడి చదువులను పఠనము చెయుటె
అభినయ కరతళము సిరుల అనుభవ మగుటె   
చిరు నగవులు అను దినమున మన కవసరమె






  10కలదు కలదు అనిన తగువు బిగువు కనుల తొ
వలదు వలదు అనిన మతి పరుగు ఉరకల తొ
కలదు కల అనిన కనబడదు కనికరము తొ   
వలదొ ఎల అనిన ఎడ తెరిపి జలము తలపె


11. జనకులు తెలిపిన ఘనమును వినయముగ వినె
అనుకరణ తలపులు కుదురుగ ననయము గనె
మమతతొ కుదురుగ ముదమున పదిల పరచునె     
జనకులు పలుకులు తనయుల వినుట విదితమె


12. చరితలు చదువుము, చదువు బలిమిని తెలుసుకొ   
సుగుణములు గనుము, గుణముల మనసు తెలుసుకొ 
తిరుగ వలదు జత పడుటకు, మదిలో మలచు కొ
మరువ వలదు జనకుల వెతలు, మనకు సుతులె


13. మనిషికి జప తపము నకు కొలువలుగ గుడిలె
ఒకరి కొకరు కలియుటకు యద పరిమళము లె
మితము పరిమితముగ నలుపు తెలుపు బ్రతుకులె
పగలు రెయి సహచరి సహనముతొ యదకథ లె  
   
  
14. మతి మతుల సతుల కధలు జదువ వలయునులె
చరితముల యిడుములు అనుభవముల కధలులె
వనిత బలిమి కలహములు తెలియని చెలిమిలె
ధనము వలన మది తలపు తరిగి పెరుగుట యె      


15. ఒడుదుడుకులు తెలిసికొను హిత మతి వలననె 
మనసున మమతను తెలుపు జనకుల  వలననె
నడతల పదిలము తెలుపు మగువల వలన నె
యతివల కెపుడు అణుకువ నటన అభినయన మె


16. మగువల మదిమెరుపు మనసు గెలిచు సహజమె
పడతుల పలుకు పలు రకముల పక పక లులె
గుణము తెలుసుకొని  సిరుల విలువ తెలపవలె
వరుడు దొరికితె వనితకు పరిణయము సబబె




17.నిజము అనృతము కలియుగ మనిషి కల పలుకె
జయము అపజయము మనుగడకు మలుపు పలుకె
పెరుగుట తిరుగుట విరుగుట వయసు ఉరకలె
వయసు పరుగులు ముసలితనము వరకు ఉరకె    




18. అహరహము సుఖము కొరకు సహనము వదలకు
వచన కళను దెలిపి రుచిగల కలలు కనుము
వయసుకు దడి మనసుకు దడ అనుకరణములె
జననము తరుణముతొ ఎదిగి కలియుట తొ ఒదుగు  


19. మగువ వలపుల మెరుపు మన మరుపు రుజువులె 
వనిత గలగల పలుకులె  రసిక రుసరుసలె
తరుణి  తనువు తపనలు మనసుకు గుసగుసలె
సహనము మనకు తెలుపు నిజాము కథలె




ADS


20. నిధుల నిలయము సుఖ సహనముల ఒడుపె
వధువు నడకలు అణువణువు వెలుగుల మయమె
ధనము తగువుల తలపులె తెలుపుట నిజము లె 
పగలు వణకు రెయి కులుకు విధి మలుపు ఒకటి



Excited to share this item from my #etsy shop: Musical souls(Radha Krishna)
21. ప్రతి సతి తన పతి గతి అతివల తొ తరగతి
ఇతి పతి మతి అనుమతి తొ తనువుల తరగతి
సతి పతి  అతివల తగువుల కుదిపె తరగతి
పరపతి తరిగి అదిపతి  కులపతి తరగతి

Buy Eternal Lovers - Radha Krishna Handmade Painting by HARIOM SINGH. Code:ART_1246_27544 - Paintings for Sale online in India.



22. మరులు గొలుపునది మది తలపు పరుగెడునది 
నయన మిది తనువు తపన మది సరిగమ లిది
నగవులిది మరులు గొనుపునిది తమ కము నిధి
ఒకపరి తదుపరి తప నిధి కల గొలుపు విధి     




23ప్రతి సతి తన పతి గతి అతివల తొ తరగతి
ఇతి పతి మతి అనుమతి తొ తనువుల తరగతి
సతి పతి  అతివల తగువుల కుదిపె తరగతి
పరపతి తరిగి అదిపతి  కులపతి తరగతి 
    



24.ధరణి ధగ ధగ భగభగ  మనిషి మనసు సెగ
తరుణి పక పక విక విక మగణి మనసు సెగ  
తహిని తనువ తహ తహ ప్రియుని మనసు సెగ
కమిని పలుకులు గజి బిజి వయసుకు పరుగు లె 




25. మనసున  ధగ ధగ భగ భగ చలి చెలి కొరకు  
వయసున కలవర బిగి బిగి చెలి చలి కొరకు 
తనువున  కల నిజ మడి ముడి బిగువుల కొరకు   
తలపున తడి పొడి తగువులులె తపన కొరకు 



kerala mural painting #Mural #Art #Painting #HandmadeArt #IndianArt


26. నరుల నగవులు నరముల కళ పలు చెరువులు 
కురుల మెరుపులు మది తలపు తెలుపు తలుపులు 
పరుల పలుకులు పదనిసలు సిరుల చినుకులు 
శిరుల కలకలము మదిలొ  మదన సరిగమలు   



--((***))--

No comments:

Post a Comment